ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, December 31, 2011

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

డిసెంబర్ 31 ఆహా... పొద్దున్నే బండి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్‌కు వస్తుంటే.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రోడ్ల పై అక్కడక్కడా పగిలిన సీసాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. ఏ కసాయి వాడో వదిలిన కరుకు పెదవి ముద్రలను భరిస్తూ రోడ్డు పై కార్పోరేషన్ చెత్త లారీ కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడక్కడా కొత్త సంవత్సరం వచ్చిందని పొట్ట చింపుకున్న టపాసులు భారతదేశ పేదవాడి వస్త్రాల్లా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.. టీవీలన్నీ మారు మోగిపోతున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయని. నేను కూడా ఓ వార్త రాయల్సివచ్చింది. అదీ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయని రాశాను. దానికోసం ప్రియా ఓ ప్రియా చిత్రం నుంచి "కమ్మనికలలకు ఆహ్వానం.. హ్యాపీ న్యూఇయర్" అనే పాట కూడా తగిలించాను. ఇంతకీ కొత్త సంవత్సరం ఎంత ఘనం.. ఎంత వేడి వేడుకగా జరిగిందని వచ్చిన ఫీడ్ చూశాను. కేఫ్ టౌన్ నుంచి ఇండియా క్యాపిటల్ వరకు.. హైదరాబాద్ నుంచి కుశాయిగూడ వరకు సేమ్ హడావుడి. సేమ్ కల్చర్.. అర్ధనగ్నంగా నర్తించడం.. ఒంట్లో కొవ్వుపూసలను తరగలు తరగలుగా.. తరంగాలుగా కదిలించడం.. డిజిటల్ గిటారు నాదాలకు.. ప్యాడ్ ప్లేయర్ చేసే రొదలకు అనువుగా కాలు కదపడం.. మధ్యలో కాస్త ఓర చూపులు.. నడుమొంపుల నాట్యాలు.. పయోదర పీయూష మర్ధనాలు.. మధ్య మధ్యలో మద్యంలాంటి దాన్ని చుంబిస్తూ... ప్రియురాలిని మళ్లీ కొత్తగా హత్తుకుంటూ.. కొత్త ప్రేయసిలాంటి వ్యక్తికోసం వెతుక్కుంటూ.. రాత్రంతా వేడుకగా సాగింది.. కొత్త సంవత్సరం.. కానీ నాకెందుకో.. రోజూలాగే పొద్దు పొడిచిందనిపించింది.. భౌషా సూరీడికి కొత్త సంవత్సరం అని తెలిస్తే కొత్త కిరణాలు రాల్చేవాడేమో.. అర్ధనగ్నంగా ఉదయించేవాడేమో.. ఉదయం పూట పల్లెలో కోడి కూస్తూనే హ్యాపీ న్యూఇయర్ అని కూసేదేమో.. ఈ కుర్రకారు కారులో షికారు చేస్తూ అర్ధరాత్రి కారుకూతలు కూస్తూ.. హ్యాపీన్యూ ఇయర్ అంటే.. ఎవరికి హ్యాపీ.. ఎంతమందికి తెలుసు ఈ న్యూఇయర్ జిలుగులు నింపుతుందో.. వెలుగులు నింపుతుందో.. చీకట్లోకి దింపుతుందో.. కానీ ఒకటి తెలిసింది.. కొత్త సంవత్సరమంటే.. బహిరంగ అర్ధనగ్న నృత్యాలకు అధికార హోదా.. కండీషన్డ్ మద్యప్రియులకు ఆ రోజు ఫ్లెక్సిబిలిటీ.. కాస్త తిట్ల నుంచి వెసులుబాటు.. కానీ అదే మద్యం కొత్త సంవత్సరం రోజే విజయవాడ మైలవరంలో 14 మందికి పైగా పొట్టనపెట్టుకుంది.. అదే మద్యం హైదరాబాద్‌లో బైక్ పై వెళుతున్న నలుగురిని పొట్టన పెట్టుకుంది.1998లోనే కొత్త సంవత్సరం సందర్భంగా ఫుల్ బాటిల్ లాగిచ్చిన నాకు కొత్తగా జ్ఞానోదయం అయిందేమీ లేకున్నా.. ఎందుకో కొత్త సంవత్సరం అంటే ఇదేనా అనిపించింది. నా ఆరోతరగతిలో.. మీనా.. అట్ట బొమ్మను, రోజాపూల అట్ట బొమ్మను కత్తిరించి కవర్లోపెట్టి..దానివెనకాల హ్యాపీ న్యూయర్ అని అమ్మాయిలకు ఇచ్చే ప్రయత్నం చేయడం గుర్తుంది. వాళ్లు అదేదో లవ్ లెటర్ గా ఫీలయి.. మొహం ముందే చింపేయటం కూడా గుర్తుంది. దాన్ని ఇవ్వడానికి ఎంత కష్టపడేవాళ్లమో కూడా గుర్తుంది. కొత్త సంవత్సరమంటే తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు సాన్పు జల్లి అమ్మ ముగ్గేస్తుంటే. రంగులతో హ్యపీ న్యూఇయర్ అని రంగులు దిద్ది.. ఊళ్లో అందరికంటే మన డిజైనే బాగుందని పొగుడుకోవడం గుర్తుంది. కొత్త సంవత్సరమంటే ఎక్జామ్స్ దగ్గరికొస్తున్నాయని మాస్టార్లు మందలించిన విషయం కూడా గుర్తే..

కానీ కొత్త సంవత్సరమంటే ఇంత అర్ధ నగ్నంగా.. ఓ దశ తరువాత పూర్తి నగ్నంగా.. మత్తుగా గమ్మత్తుగా ఉంటుందని అప్పుడు తెలియదు.. అసలు కొత్త సంవత్సరమంటే అదేనేమో.. ఎందుకంటే ఈ హైటెక్ వాళ్లు చేసేవన్నీ కొత్తగా ఏం లేవు.. కొత్తగా ఏమీ అనిపించవు.. ఎప్పుడూ చేసేవే.. రోజూ పబ్బుల్లో చేస్తున్నవే.. కాకుంటే ఇప్పుడు పిల్లల ముందే అధికారికంగా.. చేస్తున్నారు. తాగుతున్నారు. దమ్ము పీలుస్తున్నారు.. మత్తులో ఇంకేదేదో చేస్తున్నారు.. ఇవన్నీ రోడ్డు పై నుంచి నలుగురు పిల్లలు మాత్రం నిద్రగాచి చూస్తున్నారు. ఆ సంతోషాన్ని పంచుకోడానికి కాదు.. వాళ్లు వెళ్లిపోతే.. పడిపోయిన సీసాలను.. చెత్త కాయితాలను, ప్లాస్టిక్ బ్యాగులను ఏరుకుందామని.. ఆ ఒక్కరోజైనా కడుపు నింపుకుందామని.. కొత్త సంవత్సరం కదా.. వాళ్లు కూడా అర్ధ నగ్నంగానే ఉన్నారు.. ఫ్యాషన్ కోసం మాత్రం కాదు..

Wednesday, December 28, 2011

తుఫాన్‌లకు పేరెందుకు పెడతారో తెలుసా?

వికృత విలయాలకు అందమైన పేర్లు పెడుతుంటారు.. ఎందుకో తెలియదు గానీ... ఊర్లకు ఊర్లను ముంచెత్తిన తుపాన్ పేరు లైలా అన్నారు.. ప్రోఖ్రాన్ అణు పరీక్షలకు బుద్ద స్మైలింగ్ అన్నారు. ఇటువంటివి చరిత్రలో ఎన్నో.. ఎన్నెన్నో.. ఇప్పుడు కూడా చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాన్ కు థేన్ అని పేరు పెట్టారు. అసలు ఇంతకీ తుఫాన్ లకు పేరెందుకు పెడతారు. ఈ తుపాన్ లకు పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయిందో చెబుతాను వినండి

సముద్ర తీర ప్రాంతాలకు తుఫానుల ముప్పు కొత్తేమి కాదు.. సముద్రంలో అప్పుడప్పుడు వాతావరణంలో తేడాల వల్ల ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి.. సముద్ర గర్భంలోనే సుడులు తిరుగుతూ కదలడాన్ని తుఫాన్ అంటారు. ఇక- అడపాదడపా తుపాన్లు మనల్ని వెంటాడుతూనే వున్నా..తరచుగా వస్తున్న ఈ ఉత్పాతాలను గుర్తించి, రికార్డు చేయడానికి వీలుగా వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. హిందూ మహాసముద్ర ఉత్తర ప్రాంతం తుపానులకు బలవుతుండటంతో ఈ ప్రాంతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ మొదలు పెట్టింది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండి ఏడు దేశాలకు వాతావరణ హెచ్చరికలను పంపుతూ వుంటుంది. తుఫాను గుప్పిట చిక్కే బంగ్లా దేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు వీటికి పేర్లు పెడతాయి. ఈ దేశాలు పంపే పేర్లను ఆయా సభ్య దేశాల ముందు అక్షరాలను బట్టి ఒక జాబితాలా తయారు చేస్తారు. ఇప్పటి వరకూ తుఫాన్లకు 64 పేర్లు సిద్ధం చేయగా వాటిలో 22 పేర్లను వాడారు. అవి ఐలా, ఫైయాన్, లైలా, ఫెట్ లాంటి పేర్లన్నీ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాలు సూచించినవే. ఇవే కాక నర్గీస్, బందు.. అనే పేర్లను శ్రీలంక సూచించింది. 2006లో వచ్చిన తుఫానుకు ఓగ్ని అని పేరు పెట్టారు. 2008లో వచ్చిన తుఫానుకు ఖైముక్ అని నామకరణం చేశారు. అదే ఏడాది నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది.. దానికి నిశా అని పేరు పెట్టారు. ఇక 2010 మే 21న ఆంధ్ర కోస్తా తీరాన్ని కల్లోలపరచిన తుఫాను పేరు లైలా.. ఈ పేరు పెట్టమని పాకిస్థాన్ మన వాతావరణ శాఖను కోరింది. అరేబియా సముద్రానికీ తుఫాను బెడద వుంది. కాకపోతే బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ.. అక్కడ 2007లో వచ్చిన తుఫానుకు గోను అని పేరు పెట్టారు.. అమెరికాలో తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో వుంది. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా తుఫాను బీభత్సం ఆదేశాన్ని ఇప్పటికీ వణికిస్తూనే వుంది.

Saturday, December 24, 2011

పీవీ నరసింహారావు జీవితంలో మరోకోణం



భారతదేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి.. ఆ మాటకొస్తే మొట్టమొదటి దక్షణ భారతదేశ పౌరుడు కూడా ఆయనే.. ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి గాడిన పెట్టిన ఘనత ఆయన సొంత.. అపర చాణిక్యుడిగా.. రాజకీయభీష్ముడిగా పేరొందిన పీవీ నరసింహరావు వర్ధంతి .. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలిగిన మేథావికి దక్కాల్సిన గౌరవం దక్కిందా... అంతిమ గడియల్లో అవమానాలతో ప్రస్థానాన్ని ముగించాల్సి రావడం వెనుక కారణాలేంటి.. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తున్నప్రత్యేక కథనం
ఏ వ్యక్తయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాడో... ఆ వ్యక్తినే అవినీతి ఆరోపణలు వెంటాడాయి.. ఎవరైతే వివాదాల జోలికి వెళ్లకూడదని అనుకున్నారో ఆయన్నే జీవితాంతం వివాదాలు ముంచెత్తాయి... పీవీ నరసింహారావుకు ఇటు ముఖ్యమంత్రి పదవి, అటు ప్రధాని పదవి ముళ్లకిరీటంలా మారాయి... అపర చాణక్యుడిగా పేరొందిన పీవీకి ఇన్ని కష్టాలు ఎందుకెదురయ్యాయి. తెలుసుకునే ముందు అసలు పీవీ ప్రస్తానం ఎక్కణ్ణుంచి... ఎలా మొదలయిందో తెలుసుకుందాం..
పీవీ నరసింహారావు.. ప్రతి తెలుగు వ్యక్తి ఎప్పటికీ గుర్తుంచుకొనే రాజకీయ నాయకుడి పేరిది... ఇటు రాష్ట్ర రాజకీయల నుంచి అటు జాతీయ రాజకీయాల వరకు ఆకళింపు చేసుకొని అందరి మన్ననలు పొందిన బహుబాషా కోవిదుడు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు., భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివీ.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతనికే సాధ్యమయింది.
కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. అందులో ఉద్దండులకు కొదవలేదు. అయినా పీవీ నరసింహరావునే ఈ పదవి ఎలా వరించింది. ఈయన మాత్రమే అప్పట్లో అర్హుడని అధిష్టానం భావించడం వెనుక కారణాలేంటి..
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడప్పుడే చల్లారుతోంది. తెలంగాణ ప్రజలను బుజ్జగించాలంటే తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి. అప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న కర్తవ్యం. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని పీవీ వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి..
మఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి మొదలయింది. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది.
ముఖ్యమంత్రి పదవి ఆయనకు నిప్పుల కుంపటిలా మారింది.. పీఠం నుంచి దిగక తప్పని పరిస్థితి.. అన్నీ తానై నడిపిస్తున్న అధిష్టానం గీసిన గీత దాటలేక పదవిని వదులుకున్న విధేయతే.. ఆయన్ను ప్రధానిగా చేసింది.
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తరువాత పీవీ దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నంత పని చేశారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. రాజీవ్ గాంధీ హత్య తరువాత ప్రత్యేక గ్రూపు లేని పీవీ ప్రధాని పదవికి ఆమోదయోగ్యుడుగా కనపించాడు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందని మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి. అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించడానికి అక్రమాలకు పాల్పడ్డారని, జెఎంఎం సభ్యులకు ముడుపుల చెల్లించారనే ఆరోపణలు చుట్టు ముట్టాయి. అన్నిటికన్నా బాబ్రీ మసీదు వివాదం ఆయన్ను జీవితాంతం వెంటాడింది. బాబ్రీ కూల్చివేతను అడ్డుకోలేక పోయారనేది ఆయన పై ఉన్న అతి పెద్ద అపవాదు.
జీవితాంతం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అని కలవరించి నిజాయితీ కోసం పలవరించిన నాయకుణ్ణి నిర్ధోషిగా నిలబెట్టారు. నమ్ముకున్న పార్టీ కూడా చిన్నచూపు చూసింది.. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులేంటి.... పీవీని వెంటాడిన వివాదాల్లో పీవీ పాత్ర ఎంత.. ఈ విషయాలు.. ఆయనతో సుదీర్ఘంగా పనిచేసిన ప్రధాని సలహాదారు పీవీఆర్కే ప్రసాద్, కేంద్ర న్యాయశాఖా మాజీ కార్యదర్శి సీవీరావు గారు.. హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ తో ఓసందర్భంలో తమ మనసులో మాట పంచుకున్నారు. అసలేం జరిగిందో.. వాస్తవాలేంటో చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన అపర చాణుక్యుడికి, ఇటు రాష్ట్రంలోనూ.. అటు జాతీయపార్టీలోనూ చెప్పుకోదగ్గ గౌరవం లభించలేదనే మెజారిటీ ప్రజల అభిప్రాయం..

Saturday, December 17, 2011

Friday, December 16, 2011

ఎక్సైజ్ అధికారుల అసలు బాగోతం ఇదేనని చాలా మందికి తెలియదు..



రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అవినీతి పై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్రమ ధనంతో బాటు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టజెపుతున్నారో స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే కర్నూలు, గుంటూరు జిల్లాలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో వీటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీంతో ఎక్సైజ్ మాఫియా ఎంతగా అల్లుకుపోయిందో అర్ధమవుతోంది..
రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా... ఎన్ని ఇబ్బందులు వచ్చినా మద్యం విక్రయాలు మాత్రం తగ్గవు. రాష్ట్రం మొత్తం బందులు నిర్వహించినా ఆల్కహాల్ ఆగిపోదు.. మందుబాబులు ఒకరోజు అన్నంలేకుండానైనా ఉండగలరేమో గానీ.. ఆల్కహాల్ గొంతుదిగనిదే నిద్రపట్టదు. ఈ బలహీనతను ఆసరా చేసుకొని రాష్ట్రంలో మద్యం దుకాణ దారులు రెచ్చిపోతున్నారు. సిండికేట్ అయి ఎమ్మర్పీ రేట్లను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిని షాపు ముందే బెదిరించి పంపుతున్నారు. ఎక్కువ మాట్లాడితే దుమ్ము దులిపి వదిలేస్తున్నారు. రాష్ట్రలో మద్యం మాఫియా అంతగా వేళ్లూనుకొని పోయింది.
ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కు వ ధరకు అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం.. ఎందుకంటే సిండికేట్లు ఎవరి స్థాయిని బట్టి వారికి నెలనెలా ముడుపులు కట్టి మరీ ఠంచనుగా అప్పజెపుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. సిండికేట్లు ఎవరెవరికి ముట్టజెప్పుతున్నారో కూడా గుట్టు రట్టయింది.
ఏసీబీ దాడుల్లో కొందరు సిండికేట్ల నుంచి అభించిన అకౌంట్ల వివరాల ప్రకారం... నెలనెలా అందించే ముడుపుల జాబితా ఈ విధంగా ఉంది. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వింగ్‌కు రెండువేలు, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ వింగ్‌కు రెండువేలు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 4 వేల రూపాయలు ముడుతున్నాయి. సబ్ డివిజనల్ స్క్వాడ్ ఎక్సైజ్ కు 3 వేల రూపాయలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు నాలుగు వేల రూాపాయలు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు 10 వేల రూపాయలు ఇస్తే ఎక్సైజ్ డీసీకిమాత్రం 15వందల రూపాలు ముడుతున్నాయి. వీరితో బాటు లా అండ్ ఆర్డర్ ఎస్సై‌కు 5వేలు, సీఐకు 4వేలు, డీెఎస్పీకు 2వేల ఐదొందలు, నైటు బీట్ కానిస్టేబుళ్లకు 900, కొన్ని రకాల మీడియా ప్రతినిధులకు ఒక్కొక్కరికీ రెండు వేలు, ఎక్సైజ్ సీఐకు 12 వేలు, ఎక్సైజ్ ఎస్సైకు 8 వేలు, ఎక్సైజ్ పీఎస్‌లో మెన్‌‌కు 10వేలరూపాయలు.. వీరు కాక కొన్ని సంఘాలు.. ఇన్ని రకాల వ్యక్తులకు ముడుపుల రూపంలో ముల్లెలు అందుతున్నాయి. మొత్తంగా ఒక్కో బ్రాందీ షాపు నుంచి నెలకు 80 వేల రూపాయలు లంచాల రూపంలో అందుతున్నాయి. అందుకే ఎమ్మార్పీ రేట్లకు రెక్కలొచ్చి మద్యం రేట్లు చుక్కలనంటుతున్నాయి.
ఏసీబీ అధికారుల దాడుల్లో లభించిన ఈ లంచావతారాల లిస్టు చూసి అధికారులకు దిమ్మతిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులుదాడులు చేస్తే.. పోలీసు శాఖలో, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులెవరు మిగిలుండే అవకాశం లేదని వ్యాపారులే అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రహస్యం.. మాట

www.youtube.com/watch%3Fv%3DWJuCurxh26o

Saturday, December 3, 2011

వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు

\
వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు
ఇప్పటివరకు వెన్నపాలు తాగి విన్నపాలు వినే కన్నయ్యనే చూశాం…కానీ వెన్నాభిషేకం చేసి విన్నవించుకుంటే చాలు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిని నేటి తెలంగాణ ఆలయాల్లో చూద్దాం…
హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్ లో భక్తుల విశ్వాసాన్ని చొరగొన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత వుంది.హైందవ మతంలో ఆంజనేయున్ని సింధూరంతో అలంకరించి, గంగాజలంతో అభిషేకిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామి వారి ప్రతిమకు సింధూరంతో పాటు వెన్నను కూడా అలంకరిస్తారు. స్వామివారికి వెన్నను అలంకరిస్తే చాలు ఆయన మనస్సు వెన్నలా కరిగి తమ కష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.
దిల్ షుక్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం 26 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులచే పూజలందుకొని కోరిన కోర్కెలు తీర్చే …రామబంటు కొలువై ఉన్న కోవెల ఇది.. ఈ ఆంజనేయ స్వామి ఎన్నో మహిమలు చూపించాడని భక్తులు చెప్పుకుంటారు.. ఈ స్వామి వారి మహిమలు ఖండాంతరాలు వ్యాపించాయి.అందుకే ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడుతుంటుంది. నిత్యం దీపధూప నైవేధ్యాలతో వేద మంత్రోచ్చారణలతో అసలైన ఆధ్యాత్మిక వాతారణం వెల్లివిరుస్తుంది.
ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరడంతో ఆలయప్రాంగణంలోనే శివాలయాన్నీ, రాధాక్రిష్ణుడి ఆలయాన్ని నిర్మించారు.ఆంజనేయ స్వామి దుష్టశక్తుల నుండి రక్షిస్తాడు. కానీ గ్రహపీడల నుంచి రక్షణ పొందేందుకు ఇక్కడ స్వామి వారి సన్నిధి లొనే నవగ్రహాలు ప్రతిష్టించారు.. భక్తులు ఈ నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నవ ధాన్యలు, నువ్వుల నూనె, పాలు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించి పూజిస్తారు..
ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలో అడుగు పెట్టకముందే మనకో అద్భుతం కనిపిస్తుంది.ఆలయ ముఖద్వారం ముందు భక్తులకు నేనున్నానని అభయమిచ్చే 36 అడుగుల ఎత్తు భారీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తది. ఈ విగ్రహంలో శిల్పి అద్భుత నైపుణ్యం కనిపిస్తది.. పూర్వార్ధమున ఆంజనేయస్వామిగా పశ్చిమార్ధమున పరమేశ్వరునిగా దర్శనమిస్తడు..
ఇక్కడ గంభీరంగా ప్రసన్నవదనంతొ అభయమిస్తున్న ఈ స్వామిని చూసిన వారికి త్రేతాయుగంలో సుందర కాండను సృష్టించిన వాయు పుత్రుడే ఇక్కడ శిలారూపంలో వెలిశాడనిపిస్తది. ఈ భారీ విగ్రహన్ని మలిచిన శిల్పుల చేతుల్లో ఏ విశ్వకర్మదాగి ఉన్నడో..అందుకే ఈ నిలువెత్తు విగ్రహం ఆ ఆజానుబావుడి అంశతో అలరారినట్టు వుంటది. స్వామి ప్రసన్నవదనంతో సజీవంగా ఉన్నాడా అనే భ్రమ కలిగిస్తది. ఇది స్వామి మహిమా లేక శిల్పచాతుర్యమా.. అని ఇక్కడికొచ్చిన భక్తులు చర్చించుకుంటరు. ముఖ ద్వారం గుండా ఆలయంలోకి నాలుగు అడుగులేసి వెనుదిరిగిన చూస్తే అదే విగ్రహానికి మరో వైపు పరమేశ్వరుడిగా దర్శన మిస్తడు. ఇది చూసే భక్తులు ఇంతకుముందు మనం చూసింది ఆంజనేయుణ్ణా , లేక పరమేశ్వరుడినా అనే సందిగ్థంలో పడుతరు.
ఈ ఆలయంలో ప్రతి అనువు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించేలా ఉంటుంది. రామ నామం శివనామం ఆంజనేయస్మరణ తప్ప ఇక్కడి వచ్చిన వారికి మరొద్యాసే ఉండదు.. మరో ఊసే ఎత్తరు.స్వామి వారిని దర్శిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం స్వామికి పూజ చేసి మంత్రించిన రక్షాబంఢన్ ని కట్టుకుంటే ఏ దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల నమ్మకం.. అందుకే ఎంత బిజీగా ఉన్నా... ఆ కాసేపు స్వామి దర్శనం కోసం కేటాయిస్తారు. చల్లగా చూడమని వేడుకుంటారు.
ఇంతకీ ఈ ఆలయంలో ఆంజనేయునడికి అలంకారంగా వెన్ననే ఎందుకు పెడుతారు. దేశంలో ఏ ఆంజనేయుడికి చేయని విధంగా దిల్ షుక్ నగర్ లోని హనుమంతునికి వెన్న అలంకారం ఎందుకు చేస్తరంటే దీనికి ఒక కారణం వుంది.ఆ కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లోకంలో ఓ కొత్త సంప్రదాయం కనిపిస్తుందంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒక చరిత్రదాగి ఉంటది. లేదా ఊహాజనిత విశ్వాసం గానీ, మరచిపోయిన మన సంస్కృతి ఆనవాళ్ళు గానీ దాగి ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి వెన్నాలంకారానికి ఒక కారణం ఉంది. గతంలో ఒక భక్తుడు మంగళవారం మంగళప్రదమని భావించి వెన్నతో అలంకరించాడట.. అప్పుడు ఆ భక్తుడు కోరుకున్న కోరికలు నెరవేరాయి…. ఈ విషయం ఆనోట ఈ నోట ఆలయానికి వచ్చే భక్తులందరికీ తెలిసింది. అప్పటి నుండి నెలలో మొదటి మంగళవారం రోజున స్వామి వారికి వెన్నాలంకారం చేస్తూ వచ్చారు. అయితే ముందుగా స్వామి వారికి తమ మనసులో కోరికను విన్నవించుకుంటారు..తమను కష్టాలనుంచి గట్టెక్కిస్తే వెన్నాలంకారం చేయిస్తామని మొక్కుకుంటారు. అలా వేడుకున్న భక్తుల కోరికలు తీరడం తో స్వామి వారికి వెన్న అలంకారం చేసే భక్తుల సంఖ్య పెరిగింది. నెలలో మొదటి మంగళవారం రోజున ఈ వెన్నఅలంకారం చేసేవారు.. భక్తుల రద్దీ పెరగడంతో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ అసౌకర్యాన్ని గుర్తించి ప్రతి మంగళవారం స్వామి వారికి వెన్న అలంకారం చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో ఒక్క నెలలోనే ఎక్కువ మంది భక్తులు వెన్నాలంకారం చేసి మొక్కు తీర్చుకుంటున్నారు. అయినా రోజు రోజుకీ వెన్నాలంకారం చేసే భక్తుల సంఖ్య పెరగడంతో ముందుగానే తమ పేర్లను నమోదు చేయించుకుంటారు. వరుస క్రమంలో స్వామివారికి వెన్నాలంకారము చేసుకుని తమ మొక్కుని తీర్చుకుంటారు. ఈ మొక్కును తీర్చు కోడానికి నెలల తరభడి వేచిచూడాల్సి వస్తుంది. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి వెన్నాలంకారం చేయడం తమ జన్మ జన్మల పూర్వ ఫలంగా భావిస్తారు.
ఇంత మహిమ గల ఈ ఆలయం ఇన్ని లక్షల మంది భక్తుల విశ్వాసాన్ని పొందిన ఈ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి వేడుకలు అంటే మాటలా.. ముక్కోటి దేవతలు ముంగిళ్ళలోకి వచ్చి వాలినట్టు... ఆ రోజున వాడ వాడ అంతా స్వామి నామ స్మరణతో సందడి చేస్తారు.
ఈ ఆలయంలో.. ప్రతి మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నా ... దర్శించుకోక పోయినా హనుమాన్ జయంతి రోజున మాత్రం దర్శించుకోవాల్సిందే … హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు.. సహస్ర కలశాభిషేకము చేస్తారు.. 108 మంది భక్తులకు ఒక్కొక్కరికీ ఒక్కో కలశాన్ని ఇచ్చి స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రదక్షిణానంతరం ఆ జలంతో స్వామివారిని అభిషేకించిన వారికి ఉండే దృష్టి దోషాలు తొలుగుతాయని భక్తులు చెప్తారు.
ఈ ఆలయ నిర్మాణంలోనే ఒక విశిష్టత దాగివుంది. అలాగే విగ్రహ స్థాపనలో కూడా ఓ విశేషం ఉంది. అందుకే ఈ ఆలయానికి ఇంతటి ఘన కీర్తి వచ్చింది. ఇంతకీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలేంటి…

భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే.. ఏడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి. ఆ ఆరు తలుపుల తరువాత ఏడో తలుపు తెరిస్తే గానీ అలివేలు మంగమ్మ తలపుల్లో ఉన్న ఆ ఏడుకొండల వాడి దర్శనం కలగదు.. అయితే ఆధ్యాత్మికతకు 7అంకెలకు అభినాభావ సంబంధం ఉండటం వల్లనే శ్రీ రంగంలో కూడా 7 ప్రాకారాలు నిర్మించిన్రు. అలాగే ఇక్కడ ఈ ప్రసన్నాంజనేయ స్వామిని చేరుకోవడానికి 7 మార్గాలున్నాయి. ఇది యాదృచ్ఛికమో.. కాకతాళియంగానో లేదా దైవ మహిమ వల్ల కలిగిందో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుకి, శ్రీ రంగ నాధుడికి వచ్చిన ఖ్యాతి ఈ ప్రసన్నాంజనేయునికి వచ్చింది.
ఈ స్వామి వారికి మరో విశేషం వుంది. హనుమంతుడు చిన్నప్పుడు ఉదయించే సూర్యుణ్ని చూసి... ఎర్రని పండుగా భావించి తినడానికి వెళ్తాడు. దీన్ని గమనించిన ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధంతో శిక్షిస్తడు. ఆ దెబ్బకి ఆంజనేయుడి హనువు అనే దంతం విరగడం వలన హనుమంతునిగా కీర్తింపబడ్డాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని గుర్తించిన దేవతలు హనుమంతుణ్ణి, వాయు దేవుణ్ణి తృప్తి పరిచి వరాలిస్తరు. అలా మొదలైన సూర్య హనుమంతుల బంధం ఈ ఆలయంలో అనుకోకుండానే గుర్తుకు తెస్థాయి. ఈ ప్రసన్నాంజనేయ స్వామి హృదయంలో కొలువైన సీతారామచంద్రులను సూర్యోదయపు తొలికిరణాలు తాకి స్వర్ణశోభితం చేస్తాయి. హనుమంతుని గుండెల్లో... ఆ ఆదిత్యుడు కొలువై ఉన్నాడని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తాయి. అరస వల్లిలో సూర్యభగవానుని పాదాల చెంతనే కనిపించే ఈ సూర్యకిరణాలు.. ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి గుండె గుడిపై ప్రకాశిస్తాయి. ఇది ఈ ఆలయానికున్న ఓ మహత్తర శక్తిగా భక్తులు చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో ప్రతి పర్వదినాన్నీ... అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి సకల దేవతల దర్శనం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసన్నాంజనేయ స్వామితో పాటూ శివుణ్ణీ.. రాధాక్రిష్ణులను, నాగదేవతను, నవగ్రహాలను దర్శించుకుంటారు..
ఈ ఆలయంలో ప్రతి పర్వదినం నేత్ర పర్వమే.. ప్రతి పండుగ కన్నుల పండుగే ఆలయానికి చిన్నా పెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు స్వామిని దర్శిస్తారు. ఆలయంలో శివునికి కార్తీక మాసంలో పూజలు జరుపుతారు. మహన్యాస పూర్వక రుద్రాభి షేకాలు, లక్షభిల్వార్చనలతో పూజిస్తారు. తొలి పొద్దువేళలో , మలి సంధ్య వేళలో కార్తీక దీపాలతో అలంకరిస్తారు. స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకోని కనిపిస్తడని కార్తీక పూరాణం చెబుతుంది. ఆ నమ్మకంతోనే భక్తులు శివార్చరనలు చేస్తారు.
ధనుర్మాసంలో ఇక్కడి రాధాక్రిష్ణ ఆలయంలో.. గోదా దేవికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు.. ఈ గోపాలుడికి ఆబాల గోపాలంగా వేడుకలు చేస్తారు..శ్రీ క్రిష్ణా అష్టోత్తర నామాలను గొదా శ్రీక్రిష్ణ కళ్యాణోత్సవమును అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారికి కళ్యాణ గడియలు సమీపిస్తాయని ప్రతీతి..
ఈ ఆలయంలో ఎన్ని అలంకారాలు జరిగినా వెన్నాలంకారానికున్న ప్రాముఖ్యతే ఈ ఆలయానికి ఇంత పేరు తెచ్చిపెట్టింది. స్వామి వారికి వెన్నాలంకారం చేసిన తరువాత స్వామి వారి సన్నిదిలొ ఒక శ్లోకం చెప్పిస్తారు. ఈ శ్లొకానికి అర్ధమేమంటే నేను ఎక్కడికి వెళ్ళినా సధా నావెంటే వుంటూ నన్ను రక్షించమని అర్ధం..
ఇదీ దిల్‌సుఖ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి చరిత్ర

Saturday, November 26, 2011

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది


ఆ తల్లి గుండె విలవిల్లాడింది... కన్నపేగు కదిలిపోయింది... వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు ముప్పై ఏళ్ల తరువాత శవమై తిరిగొచ్చాడు.... నిలువెల్లా కంపించిపోయిన ఆ తల్లి గుండె చెరువయింది.. కొడుకు రాకకై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ తల్లి రోదనకు అంతులేదు.. పోలీస్ ఎన్‌కౌంటర్ లో మరణించిన కిషన్ జీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిని చూసి కంట తడి పెట్టని వారు లేరు..
సరిగ్గా ముప్పై సంవత్సరాల కితం వెళ్లొస్తానమ్మా అన్న కొడుకు.. కన్నతల్లి చేయి విడిచి అడవి తల్లి ఒడిలోకి చేరాడు. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు లోకోద్దారకుడుగా మారుతానని వెళ్లాడు. ఆ తల్లికి ఇవేవీ తెలియవు.. కానీ ఏ రోజు కన్నదిరినా దిన పత్రిక చూసేది.. ఏ అపశకునం కనిపించినా కన్న పేగు కదిలేది. కంటిచెమ్మ తడిమేది.. దినదినం పీడకలతో.. నిద్రలో ఉలిక్కి పడ్డ రాత్రులెన్నో.. కన్న కొడుకు ఎక్కడ దూరమై పోతాడో అని ఆవేదన చెందిన రోజులెన్నో.. కొడుకు గుర్తొచ్చి కంచం పై నుంచి లేచిన రోజులెన్నో.. ఏదో ఒకరోజు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి భయపడుతూనే ఉంది.. కానీ ఆ రోజు రాకూడదనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది.. కానీ.. ఆ బిడ్డ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు చిందించక తప్పలేదు.. ముప్పై ఏళ్లతరువాత.. గుర్తుపట్టలేని గురుతులతో ఊరుఒడిని చేరుకున్న కిషన్‌జీని చూసి ఊరు ఊరంతా అమ్మయింది.. ఆ అమ్మ కళ్లు సముద్రాలయ్యాయి...
(వెనకొచ్చే ఆవుల్లారా పాట)మొదటి చరణం.. కళ్లల్లో కదిలే కొడుకు కనబడక పోయే... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి ఆవేదనను తీర్చేదెవరు.. ఈ కంటిచెమ్మను తుడిచేదెవరు.. పొగిలి పొగిలి ఏడ్చే ఈ తల్లి ఆవేదనను ఎవరు తీర్చగలరు. కన్నకొడుకు జాతి మరువని అమరుడయ్యాడని గర్వించాలో.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లలో ఒదిగిపోతున్నాడని బాధపడాలో తెలియని అమాయకత్వం... ఆఖరి గడియల్లో.. తన కన్న పేగు కానరాని లోకాలకు తరిలిపోతుందన్న ఆవేదనను ఎవరు తీర్చగలరు.. ఆదుకుంటాడనుకున్న కొడుకు అమరుడయ్యాడని తెలిసిన క్షణం ఆ తల్లి గుండెలో మోగిన పిరంగులెన్ని. ఆ పెద్దగుండె ఎంత కలత చెందిందో..


(వెనకొచ్చే ఆవుల్లారా పాట)రెండవ చరణం..తండ్రి పొయిన కాణ్నుంచి... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి శోకం తీరనిది.. ఈ గుండె గాయం మాననిది.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆశ అడియాసే అయింది. కొడుకు గుండెను బుల్లెట్ చీల్చిందన్న వార్త తెలసినప్పటినుంచీ ఈ తల్లి గుండె వేయి వక్కలయింది.. పెద్దగుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. అఖరి పలుకులు ఎండమావులే అయ్యాయి.
bang- కడుపుకోత

Friday, November 25, 2011

Thursday, November 24, 2011

నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..

.... ఓన్లీ న్యూస్... విశ్లేషణ కాదు...





కిషన్‌ జీ మృతి
బెంగాల్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌
జంగల్‌మహల్‌లో లభించిన మృతదేహం
కిషన్‌జీదేనని అనుమానం
మావోయిస్ట్‌ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌ జీ మృతి చెందారు... పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు... భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారని బెంగాల్‌ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. జంగల్‌మహల్‌లో ఓ మృతదేహం దొరికిందని, అది కిషన్‌జీ దేనని ఆ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి... అయితే కిషన్‌‌ జీ మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా ధ్రువీకరించడం లేదు... హోంశాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక బెంగాల్‌లో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌ ఇది... కిషన్‌ జీ కోసం బెంగాల్‌ భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కుషుబోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి... నిన్నటికి నిన్న కిషన్‌జీ త్రుటిలో ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారనే వార్తలు వచ్చాయి
బెంగాల్‌లోని సంయుక్త దళాలు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో కిషన్‌జీ మృతి చెందారు. దాదాపు అరగంటసేపు ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో కిషన్‌జీతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు... కిషన్‌జీదిగా భావిస్తున్న మృతదేహం పక్కనే ఏకే 47 గన్ లభ్యమైనట్టు సమాచారం
కిషన్‌జీతో పాటు, ఆయన సహచరి సుచిత్ర మహతో కోసం భద్రతా బలగాలు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి.. జంగిల్‌ మహల్‌లో మూడు రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కిషన్‌జీ, సుచిత్ర కుష్‌బని అడవుల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్ని అణువణువు గాలించాయి. అయిదుగురు మావోయిస్టులను అరెస్ట్్ చేశాయి.. అయినప్పటికీ అగ్రనేత సమాచారం అందలేదు... ఆ తర్వాత జార్ఖండ్‌, బెంగాల్‌ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్‌తో కిషన్‌జీ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుచిత్ర కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి.
రెండేళ్ల క్రితం కూడా కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆయన తప్పించుకున్నారని తెలిసింది.

Friday, November 18, 2011

వీరికి... ఆ (సెక్స్) కొన్ని క్షణాలు .. నరకం...



అక్కడ ద్వారాలు బార్లా తెరిచే వుంటాయి. మూసిన తలుపులు మచ్చుకైనా కనిపించవు. తమ శరీరాల్ని ఛిద్రం చేసే మానవహింసాకాండని నగుమోములతో స్వాగతాలు పలికే అమ్మలుంటారక్కడ. అమ్మచాటు బిడ్డలూ ఉంటారక్కడ . కానీ తల్లి కొంగు చాటున కాదు, తెరచాటునే వారిస్థానం. తాను ఉండాల్సిన అమ్మ ఒడిలో మాత్రం ఓ మానవ మృగం, తెరచాటున పసిమనసులను భయం, అవమానం తెరలు తెరలుగా కమ్మేస్తుంది. తెరవెనుక అమ్మనీలినీడలు పసిమనసులను కలచివేస్తుంటాయి. చీకటి నీడల దృశ్యాలు చిన్నారుల మనసులను ఛిద్రం చేస్తుంటాయి. అమ్మ తనువు వుండై ఒకరికి పండవుతుంటే...ఆ అమ్మే తను శవమై మరొకరికి వశమౌతూ రక్తపు ముద్దగా మారుతున్న వేళ ప్రపంచం పచ్చి మోసంగా సమాజం ఒఠ్ఠి దగాలా కొద్ది కొద్దిగా అర్థమవుతుంది ఆ పసిమొగ్గలకు..
ఆ సామాజిక వికృత ప్రక్రియకు బలయ్యే వారే అంగడి బొమ్మలు. ఈ పసివారి అమ్మలు. ఎదిగే వయసుతో, ఎదిగీ ఎదగని మనసులతో ఏమౌతామో తెలియని అయోమయంతో చేయనితప్పుుకి శిక్షని అనుభవిస్తున్నారు వారి బిడ్డలు. కులం పేరుతో కొందరు, సాంప్రదాయం పేరుతో మరికొందరు. మోసపోయి కొందరు, సమాజమే వెలివేసి మరికొందరు. కుటుంబమే హింసించి ఇంకొందరు. ఆడపిల్లగా పుట్టినందుకే అమ్ముడుపోయి మరికొందరు. ఇలా కారణాలేవైనా అందరూ ఒకే చోటికి చేరుకుంటారు. అందరూ తమ శరీరాలకు తామే వెలకట్టుకుంటారు. తమ జీవితాలకు తామే ముగింపురాసుకుంటారు. అది దుబాయ్‌ అయినా, ముంబాయి అయినా దేశరాజధాని ఢిల్లీ అయినా నగరమేదైనా నరకమొక్కటే. నాలుగు చిల్లర డబ్బులు శవంపై చల్లినట్టు ఆమె శరీరంపై చల్లి ఆమె సర్వహక్కులూ లూఠీ చేస్తాడు మగవాడు. ఒకసారి ఆ చీకట్లోకి ప్రవేశిస్తే ఇక బయటపడే ప్రశ్నే ఉండదు. వారి జీవితాలు ఆ చీకట్లో తెల్లారిపోవాల్సిందే. చీకట్లో వారి దేహాలు ఛిద్రమవ్వాల్సిందే.
శరీరం తూట్లుగా మారేలోపే నాలుగు రూపాయిలు మిగుల్చుకోవాలి. పాతికేళ‌్ళు పైబడితే ధర తగ్గుతుంది. పసి మొగ్గల శరీరాలకు పైకం ఎక్కువొస్తుంది. అప్పుడే ఆ తల్లుల కోసం వచ్చే విటుల చూపులు పరిసరాలను పరికిస్తాయి. ఏ పసిబిడ్డైనా ఫరవాలేదు. ఆడపిల్లయితే చాలనుకుంటాయి ఆ మానవ మృగాలు. మదపుటేనుగులబారిన పడకుండా తలుపురెక్కలకు తమ శరీరాలను వేళ్ళాడదీసి విటుల దృష్టిని మళ్ళిస్తూ పసిబిడ్డలను కాపాడుకొనే తల్లులు కొన్నిసార్లు వారి ప్రాణాలనే ఫణంగా పెడతారు.
బైట్ : తలి్ల బైట్. ఈమె పైన రాసినకొన్ని విషయాలు చెపుతుంది.
వాయిస్ : మూడు పదులు దాటాయంటే వారి బతుకు దుర్భరం. పుట్టిన బిడ్డల పోషణ భారంగా తయారవుతుంది. ఓ పక్క అనారోగ్యం కుంగదీస్తుంది. అప్పటికే సమాజం అసహ్యపు చూపులు, చేష్టలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం అందని ద్రాక్షగా మారుతుంది. పసిబిడ్డల పొట్టనింపుకోవడమే గగనంగా తయారవుతుంది. ఛీత్కారానికి చిరునామాగా మారిని సమాజం వెలివేస్తుంది. వీరికి పొలాల్లోనో, ఫ్యాక్టరీల్లోనో కూలిపనిసైతం దొరకదు. వీరి జీవితాలు అస్పశ్యంగా తయారవుతాయి.
చెక్కిళ్ళపై ముద్దాడి గుండెలకు హత్తుకోవాల్సిన అమ్మ ఎంతకీ రాదు. ఏడ్చి ఏడ్చి ఏ మూలో అర్ధాకలితో పడుకుంటే అర్ధరాత్రి దాటాక అమ్మ రాకాసి చెరవీడినట్టు...కారుమబ్బులను చీల్చుకొని జాబిల్లి వచ్చినట్టు అమ్మ వస్తుంది. కానీ శరీరంలోని సత్తువంతా లాగేసి, శరీరాన్ని, మనసునీ సిగరేట్‌ ముక్కంత హీనంగా పీల్చి పడేసిన మరో రాకాసి పంజా అమ్మను తిరిగితిరిగి ఆవహిస్తుంది . ఒకటారెండా...రోజుకి ఆరు రాకాసి ఆకారాలు అమ్మను మాంసపు ముద్దలుగా మంచానికి వేళ్ళాడదీస్తుంటాయి. ఎందుకమ్మా ఈ నరకమని ప్రశ్నించలేని చిన్నారుల ప్రశ్నార్థకపు చూపులకు అమ్మకంటికొసల్లోని కన్నీరే సమాధానం చెపుతుంది.

ఎవడి కిరీతకానికో చేదుజ్ఞాపకంగా ఈ లోకంలోకొచ్చిన ఈ పిల్లలను ఈ రొంపిలోకి దించడానికి ఏ తల్లి హృదయం అంగీకరించదు. తనలాంటి అవమానకరమైన జీవితం. తన బిడ్డలకు రాకూడదనుకుంటుంది. ఊరికి దూరంగా, తమ గాలైనా సోకని చోట భద్రంగా ఉంచాలనుకుంటుంది. నాలుగక్షరం ముక్కలొస్తే ఈ నరకానికి తన బిడ్డలను దూరంగా ఉంచొచ్చనుకుంటుంది. కానీ వీరి పేరు చెబితే పిల్లలకు స్కూల్ అడ్మిషన్ సైతం దొరకనిపరిస్థితి. ఇక వీరి బిడ్డలకు చదువుకునే అవకాశాలు మృగ్యమవుతాయి. తమ పిల్లలను చదివించుకోవాలనే ఆశ వున్నా నాగరికం ముసుగులో బతుకుతున్న అనాగరిక మనుషుల మధ్య పిల్లల హక్కులు హరించివేయబడతాయి. అనుక్షణం అవమానాలతో, హేళనలతో పిల్లల బ్రతుకు నరకప్రాయం అవుతుంది. పిల్లలు బడికి దూరంగా నిరక్షరాస్యులుగా ఇంటివద్దే ఉండిపోతారు. అంతేకాదు దారుణ దృశ్యాలను దిగమింగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏం చెయ్యాలో అర్థమవ్వక మానసికంగా కృంగిపోతారు.
తండ్రి పేరైనా తెలియకుండా ఈ భూమిపైకొచ్చిన ఈ పసిడిడ్డలకు జీవితం దినదినగండంగా మారుతుంది. ఈ రొంపిలోంచి వారి పిల్లలను కాపాడుకోవడం వీరి తల్లులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ముద్దులొలికే చిన్నారులు ఎదిగేకొద్దీ ఈ సమాజంపై ఏహ్యాభావాన్ని పెంచుకుంటారు. తల్లి పరిస్థితికి కారణాలను వెతుక్కుంటారు. తమకి నాన్నెందుకు లేడో అర్ధం చేసుకునే లోపు రోగాలతో రొప్పులతో కన్నతల్లి కూడా కనుమరుగవుతుంది. ఇక ఈ చిన్నారులకు నా అన్నవాళ‌్ళే కరువవుతారు. చీకటిసామ్రాజ్యానికి మహారాణులైన ఆ తల్లుల బిడ్డలు చివరకు చిల్లిగవ్వకు కొరగాని వారిగా మిగిలిపోతారు.

ఆర్థికపరిస్థితి, పూటగడవని పరిస్ధితిలో ఈ రొంపిలోకి దిగామని చెపుతున్న ఈ అంగడి బొమ్మలు ....తమ బిడ్డలకూ ఈ దుస్ధితి తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఈ వృత్తిలోంచి బయటకు రమ్మనే హక్కు ఎవ్వరికీ లేదంటారు ఆ తల్లులు. ఆదుకొని , ఆదరించి...పునరావాసం కల్పించి, మంచి జీవితీన్ని మాకందించలేని ప్రభుత్వాలు మా వృత్తినెందుకు వదులుకొమ్మంటారని తల్లు ప్రశ్నిస్తున్నారు. స్త్రీల శరీరాలు వ్యాపారాలైన చోట ఈ దారుణకృత్యానికి బలైన ...బలవుతున్న వీరు కాస్త కరుకుగానే కనిపిస్తారు. మొరటుగానే మాట్లాడుతారు. కానీ దానికి కారణం వారి గుండెలకు కాలం చేసిన గాయం. ...
ఏ ఆపన్న హస్తమో వారి బిడ్డలను కనికరించి కాపాడితే వారికి ఈ సభ్యసమాజంనుంచి సవాలక్ష సవాళ‌్ళు ఎదురవుతాయి, ఎవడో తెలియని నాన్న కోసం సవాలక్ష ప్రశ్నలు. అమ్మకు సైతం తెలియని సమాధానం ఈ చిన్నితల్లికెలా తెలుస్తుంది. కన్నీరింకిన చిన్నారుల కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఈసడించుకున్న వారు ఈటెల్లా పొడిచేస్తుంటారు. తనకు ఏమీ కాని నాన్నపేరుతో గుర్తింపడటమే వారు అవమానంగా భివిస్తారీపసివారు. నన్ను నన్నుగా గుర్తించేందుకు నాకు నాన్నే ఉండాల్సిన పనిలేదంటారు.
ఇంగ్లీషులో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న ఈ అమ్మాయి తల్లి ఓ జోగిని. సాంప్రదాయం పేరుతో ఇక్కడ లైంగిక హింస జరుగుతుంది. ఈమెకు తండ్రిఎవరో తెలియదు. ఇదే ప్రశ్నని తల్లినడిగితే తను చెప్పలేదు. బజార్లో మహారాజులా తిరుగుతున్న నాన్న అనేవాడిని తను గుర్తించే అవకాశం లేదు. అందుకే అవమానాల్ని దిగమింగి సమాజాన్ని చదవడం నేర్చుకుంది. తన కసినంతా చదువుపై కేంద్రీకరించింది, ఎనిమిది వరకు అర కొరగా ఇంగ్లీషు ముక్క రాకుండా చదివిన ఈ మె నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు ఇంటర్‌లో 79శాతం మార్కులతో పాసయ్యింది. ఛీదరించుకునే చేతులు చిన్న సాయాన్ని అందించగలిగితే వారు ఆకాశానికి నిచ్చెనెలేస్తారని నిరూపించింది.
తనువు పుండై చివరికి శవంగా మారుతున్న అమ్మ జీవితం ఈ బిడ్డలకు చాలా విషయాలు నేర్పించింది. అవమానాలతో అగౌరవంగా బ్రతకడం ఎంతటి నరకమో అనుభవించారు వీరంతా. చీకటికి కృంగి పోకుండా రేపటి వేకువకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఓ పక్క సమాజంతో మరో పక్క చదువుతో యుద్ధం చేస్తున్నారు. గెలుపు ఇప్పటికిప్పుడే వీరికి సొంతమవ్వకపోవచ్చు . కాని రేపటి విజయం కోసం ఈ రోజు పరాభవాన్ని ఎదుర్కొంటూనే పోరాడుతామని చెబుతున్నారు. వీరి ఆత్మస్థైర్యం ముందు అన్నీ దిగదుడుపే.
అమ్మని అంగడి సరుకుగా మార్చిన సమాజాన్ని ఒకే ప్రశ్నవేస్తారీ చిన్నారులు. తమ జీవితాలకు పుచీనివ్వని నాన్నెవరని అడగొద్దని ఇంట్లో , బళ్ళో, బజారులో ఎక్కడైనా జన్మనిచ్చిన అమ్మపేరుని మరవద్దని కోరుతున్నారు.................
ఇటువంటి కుటుంబాల్లోని ఎదిగే పిల్లలపై మానసిక వత్తిడి అధికంగా ఉందంటున్నారు డాక్టర్లు. పురుషుల ప్రవర్తనతో వారిపైన వారికే అసహ్యం కలిగి పిల్లలు మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అంతే కాదు. బలవంతంగానో, మోసపూరితంగానో ఈ వృత్తిలోకి దిగిన వారు ఒక సారి వారి శరీరంపై జరిగే హింసతో హడలిపోయి ఆత్మహత్యలకు సైతం వెనకాడరంటున్నారు. అంతే కాదు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లులకు పిల్లలు పుడితే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది.
మహిళలే కాదు రాష్ట్రంలో ఈ రాక్షసమానవహింసకు బలవుతున్న వారిలో పదినుంచి 18 ఏళ్ళ మధ్య వారు 25శాతం మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు. మిస్సింగ్‌ కేసులుగా మిగిలిపోతున్న బాలికల ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమ్మాయిలే ఆక్రమిస్తున్నారంటే బాలికలు మాయమవడం వెనుక మర్మమేమిటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంబాయ్ లోని రెడ్ లైట్ ఏరియాలో వున్న వారిలో 45 శాతం మంది కర్నాటక నుంచి వచ్చిన వారేనని ఓ సర్వేలో తేలింది. ధాకాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 20 శాతం మంది వీధి బాలలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వీళ్ళల్లో 20 ఏళ్ళు నిండకుండానే వివిధ కారణాలతో వీరు చనిపోతున్నారు.
చట్టంలోని లొసుగుల ఆసరాతో మగవాడు అతి తేలికగా తప్పు నుంచి తప్పించుకుంటాడు. మరి అదే అపరాధంతో జైలుకి వెళ్ళిన స్త్రీకి విముక్తి కలిగేదెలా? కేవలం పెనాల్టీతో తప్పుని కప్పిపెట్టుకొని పెద్దమనిషిగా కోర్టు నుంచి బయటపడ్డ మగవాడిని అత్యంత సహజంగా అంగీకరంచే సమాజం స్త్రీలను మాత్రం దోషిగా నిలబెడుతోంది. బాలికల పట్ల, స్త్రీల పట్ల అసమాన భావం, వివక్ష వెరసి వారి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ రొంపిలోకి దిగకుండా చూసేవిధంగా ప్రభుత్వ విధానాలు లేవు. ఈ వృత్తిలో వున్న వారిని అందులోంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి. ఈ నరకకూపంలోంచి పసిబిడ్డలను కాపాడేందుకు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది. పసివారి జన్మహక్కైన జీవించే హక్కే కాదు, గౌరవంతో జీవించే హక్కు వారికి కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతకావాలని కోరుకుందాం.

Saturday, November 12, 2011

ఎందుకో ఈ పాటంటే నాకిష్టం.. నేను క్రిష్టియన్ ని కాదు..

ఏసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను అనే పాట నాకు చాలా ఇష్టం.. ఇది రాగా డాట్ కాం లో ఉంది. నా బ్లాగ్ ఓపెన్ చేయగానే పాట డీ ఫాల్ట్ గా స్టార్ట్ అవుతుంటే.. తొలగించాను..

Wednesday, November 9, 2011

వెంకట్ రెడ్డి చేసింది ఏ దీక్ష? ఆమరణ దీక్షా? అలకదీక్షా?



రాష్ట్రంలో తెలంగాణ నినాదం మొదలయినప్పటి నుంచి దీక్షా కాలం మొదలయింది. 2011 సంవత్సరానికి నిరాహార దీక్షల సంవత్సరం అనుకుంటే సరిపోతుందేమో.. ఈ ఏడాది కాలంలో ఎవరెన్ని దీక్షలు చేశారో లెక్కబెట్టడం కాస్త కష్టమే.. ఒక్క అన్నా హజారే దీక్షను మించి ఏ ఒక్కదీక్ష కూడా ఫలప్రదం కాలేదంటే నమ్మండి . అయినా అది జాతీయ వార్త. నేను ఆ వాతలు పెట్టుకోదలుచుకోలేదు. కానీ మన రాష్ట్రం విషయంలోకి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మందే దీక్షా దక్షలు బయలుదేరారు. నాల్రోజులు దీక్ష చేసి లేవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని పార్టీలు దీక్షలు చేస్తున్నాయి. ఆఖరుకు కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా నిరాహార దీక్ష చేశాడు. ఇక ఎటొచ్చీ ఈ మద్య ఆమరణనిరాహార దీక్ష చేసిన వెంకటరెడ్డి దీక్షే మరీ చర్చనీయాంశంగా మారింది..
ఈ దీక్ష విధానం చూసిన వాళ్లు ఈ దీక్షలో నిబద్దత ఎంత అని ప్రశ్నిస్తున్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయమైతే.. నేను బ్లాగులో రాసేవాణ్నే కాదు. కానీ ఇది పదిమంది పదిరకాలుగా అనుకుంటున్న మాటలను ఒడిసి పట్టి మీకు అందిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే. ఆమరణదీక్షకు దిగిన వారు లక్ష్యం సాధించడమా లేక మరణించడమా.. ఇదే వాళ్ల ఆశయం. అంటే ఆశయ సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడం అన్నమాట. ఈ విషయంలో పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమనే చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్యం నెరవేరే వరకు ముద్ద ముట్టలేదు. కానీ ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో అడిగి అరెస్టు చేయించుకునే నాయకులకు కూడా కొదవలేదని జనం బహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే వెంకటరెడ్డి అలా అరెస్టయ్యాడని మాత్రం చెప్పలేను గానీ... ఆ దీక్షకు ఆమరణ దీక్ష అని పేరు పెట్టడమే బాగాలేదు. గతంలో తెలంగాణ అన్న విద్యార్ధులను.. గతమంటే ఎన్నో సంవత్సరాలు కాదు. కేవలం నెలల క్రితమే మీటింగుల్లో లాఠీలు విరిగిన వరకు కొట్టిచ్చిన కోమటి రెడ్డికి అమాంతంగా తెలంగాణ పై, తెలంగాణ బిడ్డల పై ప్రేమ పుట్టుకు రావడం అసహజమే.. కానీ పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చినా ఇప్పటికే పోరాడుతున్న పార్టీలను కాదని.. తనే సొంతంగా నల్లగొండలో దీక్ష చేయడం వెనుక మతలబు ఏంటి.. ఇంత చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చీమకుట్టనట్టు వ్యవహరించకపోవడం వెనుక అసలు రాజకీయం ఏమిటి.? కోమట రెడ్డి ఏ రాజకీయాల కోసం దీక్ష చేశాడో.. కిరణ్ కుమర్ రెడ్డి దాన్ని నిర్వీర్వం చేసేందుకు ఆయన జోలికి కూడా పోలేదు. కానీ పాపం ఆరోగ్య కారణాల రీత్యా.. అరెస్టులు.. ఫ్లూయిడ్‌లు.. దీక్ష విరమణలు.. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే రెడ్డిగారు.. బస్సుయాత్ర చేసి ప్రాబల్యం సంతరించుకోబోతున్నారు. దీనికోసం హడావిడిగా ఆడియో సి.డిలు కూడా సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటి వరకు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ కోమటరెడ్డి ఇక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయబోయిన ముద్దుబిడ్డ సానుభూతితో ప్రజల్లో బాగా ప్రచారం.. ఇటు టీఆర్ఎస్ నేతల హడావుడి అంతా ఇంతా కాదు.. కోమటరెడ్డి దీక్షకూర్చున్న మరుసటి రోజునుంచే మద్దతులు మొదలయ్యాయి. కానీ ఢిల్లీలో దీక్షకోసం కూర్చున్న కొండాలక్ష్మణ్ బాపూజీ న్యూస్ కవర్ కాదు... టీఆర్ఎస్ మద్దతు తెలుపదు. ఎందుకంటే బాపూజీ ఎమ్మెల్యే కాదు. ఆయనకు మద్దతిచ్చినా ఇవ్వకున్నా పార్టీకి వచ్చే లాభం కానీ నష్టం కానీ లేదు. పైగా సీమాంధ్రతో కుమ్మక్కయ్యాడనే అపవాదొకటి.. దీక్ష ద్వారా తెలంగాణ ప్రజలకేమోగానీ వెంకటరెడ్డికి మాత్రం పుష్కలంగా లాభం చేకూరిందనే చెప్పాలి. ఇటో కారో.. కమలమో సిద్ధంగా ఉన్నాయి. అదీ ఇదీ కాకుంటే జగన్ ఎలాగూ గురిపెట్టుకున్నాడు.. తెలంగాణ వాదాన్ని ఎంతమంది క్యాష్ చేసుకుంటారో.. కవులు, కళాకారులు, మేథావులు, మీడియా వీళ్లగురించి గంటలు గంటలు బుర్రలు బద్దలు కొట్టికొని విశ్లేషించండి.. పాటలు పాడండి.. వ్యాసాలు రాయండి.. ఈ చరిత్ర ..(ఇంకావుంది..to be contd)

Thursday, November 3, 2011

ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?



ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?
ఇప్పుడు తెలంగాణలో... ఉద్యమానికి ఊపిరి పోస్తున్న సాహిత్యానికి మూలాలు ఎక్కడివి...? పుట్లకు పుట్లుగా పుట్టుకొస్తున్న కవిత్వాలకు మూలవస్తువేది..? ఇప్పుడు సీమాంధ్ర పై కురిపిస్తున్న తిట్ల వర‌‌్షానికి పదప్రయోగాలన్నీ ఎక్కడ జరిగాయ..ి. ? ఇప్పుడు సాహిత్యలోకంలో వాడిగా వేడిగా జరుగుతున్న లోపాయికారి చర్చ ఇదే.. నిజానికి తెలంగాణ ఉద్యమం పుట్టకు ముందే ఈ సాహిత్యం ఉంది.. కానీ ఇప్పుడు దాని రూపం మార్చుకుంది.. వాక్యాంతాలు మారాయి.. అదే అవేదన... అదే కష్టం.. అవే కన్నీళ్లు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు.. కానీ అవి దిశ మార్చుకున్నాయి.. అయితే ఇవి వీటి దిశమార్చుకునే అవసరం ఎందుకొచ్చింది.. ఎటునుంచి ఎటుమారాయి.. రూపం మార్చుకున్నా.. ఈ సాహిత్య లక్ష్యం ఒక్కటేనా.. ఈ విషయం తెలుసుకోవాలంటే... సింధూ నాగరికతను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు... ఏ దక్కను నాగరికతనో తవ్వుకుంటూ పోవాల్సిన పని లేదు.. గత దశాబ్ద కాలంగా ఉదృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని,, దానికి తోడుగా ఉండి శ్వాసనందిస్తున్న సాహిత్యాన్ని పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది.. అవును మరి సమాజంలో ధనికుణ్ని- పేదవాడు, పెట్టుబడి దారుణ్ని- శ్రామికుడు, అగ్రవర్ణాల వారిని - నిమ్న వర్ణాల వారు... ఎదిరించి జయం సాధించినట్టు నిత్యం కలలు కంటూనే ఉంటారు. వీరి మధ్య వర్గపోరు తరాలుగా నడుస్తూనే ఉంది... అయితే ఇప్పటి వరకు వీరు సాధించామనుకున్న విజయాలు కాలక్రమంలో వచ్చాయా లేక పోరాటాల ద్వారా వచ్చాయా అన్న విషయంలో... మేథావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు.. కానీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న వివిధ రకాల రచనలతో భావవ్యాప్తి గురించే నేను నాలుగు ముక్కలు అభిప్రాయంగా పంచుకోవాలనుకుంటున్నాను.. నేను తెలంగాణ టీవీ ఛానల్( టి.న్యూస్)లో ప్రోగ్రామిగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవంతో చూసిన పరిశీలించిన కొన్ని విషయాలు.. వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలను పంచుకున్నాకనే ఈ నాలుగు మాటలు రాయగలుగుతున్నాను.
వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న సాహిత్యానికి మూలాలన్నీ దళిత సాహిత్యంలోనే ఉన్నాయని మెజారిటీ మేథావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. తరతరాలుగా అణచబడి.. వేసుకోడానికి చెప్పులు కూడా లేని దుస్థితి ఒకపక్క... ఉన్నా వేసుకోవడానికి స్వేచ్ఛలేని పరిస్థితి మరోపక్క... ఐణా చెప్పులు కుట్టే వృత్తినే నమ్ముకొని కాలం గడిపారు.. సహజంగానే ఆవేదనతోనే.. ఆక్రందనతోనో.. తన జాతిని అణిచిన వారిని, దానికి మూల కారణాలైన క్రమాన్ని ఆ వర్గాల నుంచి వచ్చిన రచయితలు తమ రచనల్లో దుమ్ములేపి దునుమాడారు.. అసలు ఉండో లేడో తెలియని మనువును... మునుం పెట్టి తిట్టారు.. దాన్ని వారసత్వంగా అనుభవిస్తున్న వారిని.. మనువుకు వారసులుగా కీర్తింప బడుతున్న ద్విజులను తమ సాహిత్యంలో శిలాశాసనాలు చెక్కారు.. ఎందుకంటే తమ వెనకబాటు తనానికి.. రెండు జన్మల ప్రముఖులు, వారిని పెంచి పోషించిన అగ్రవర్ణాల వారేనని వీరి గట్టి అభిప్రాయం.. ఇప్పటికీ వారి అభివృద్ధిని అడ్డుకునేది వారేనని బ్రాహ్మణులను తిట్టిపోసే వారు లేకపోలేదు.. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఇక అగ్రవర్ణాలను ఆడిపోసుకోవడం తగ్గి అగ్రవర్ణాల స్థానంలో సీమాంధ్రులు చేరారు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు... అయితే ఈ సారి కమ్యునిస్టు ఉద్యమ సాహిత్యం, దళిత సాహిత్యం కలిసి తెలంగాణ ఉద్యమ సాహిత్యంగా పురుడు పోసుకున్నాయి.. తెలంగాణ ధూంధాలలో పాడే పాటలన్నీ ఒకప్పుడు నిషిద్ధ కమ్యునిస్టు పార్టీలు పాడుకున్న పాటల బాణీలే.. సాహిత్యం కూడా తొంబై శాతం అదే.. ఉద్యమ రూపం ఏదైనా లక్ష్యం మాత్రం అదే.. రాజ్యాధికారం. విముక్తి కోసం పోరాటం.. అది ఏ రకమైన విముక్తి... విముక్తి తర్వాత ఎవరెవరికి ఏం ఒరుగుతుందనేది చరిత్రలో విముక్తి పొందిన వారినడిగితే చెప్తారు కానీ.. ఇప్పుడు వస్తున్న సమకాలీన రచనలల్లో అత్యధికం.. బి.సి, ఎస్సీల నుంచే వస్తున్నాయనేది ప్రధాన వాదన.. ఇటు అగ్రవర్ణాల వారు, కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వారు వీటి జోలికి పోవడం లేదట.. ఇప్పటి వరకు తెలంగాణ పాటలు రాసిన వారిని గమనిద్దాం. ఈ పేర్లు కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకోగలరు. తెలంగాణ జాతీయ గీతంగా పాడుకుంటున్న * జయజయహే తెలంగాణ జననీ పాట రాసిన అందెశ్రీ దగ్గర్నుంచి, పల్లెపాటగాడు గోరటి వెంకన్న, జంగ్ సైరన్ జయరాజ్, ప్రజాయుద్ధనౌక గద్దర్, మిట్టపల్లి సురేందర్, కోదారి శ్రీను, రసమయి బాలకిషన్, నేర్నాల కిషోర్, వెంకన్న, నాగన్న, రవీంధర్, అమర్...లు నాకు సడెన్ గా గుర్తొచ్చిన కవిగాయకులు మాత్రమే.. ఇక గాయకుల విషయానికి వస్తే.. ముందు చెప్పిన వారు కాక, విమలక్క, సంధ్యక్క, స్వర్ణ, విజయక్క, రమాదేవి, పద్మావతి, గంగ, ప్రగతి, మధుప్రియ, సోమన్న, సాయిచంద్, పైలం సంతోష్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పేజీ చాలదు. రెగ్యులర్‌గా నాతో టచ్ లో ఉండే వాళ్ల పేర్లే గుర్తుకొచ్చిన వరకు ప్రస్తావించాను. వీళ్లు కాక గద్య రచయితలు, కవితలకే పరిమిత మైన వారు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిలో 95శాతానికి పైగా దళితులు, బీసీలే కావడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. వారికిది చారిత్రక వారసత్వంగానే వచ్చింది.. గతకాలపు సాహిత్యమే. పురాతన జానపద బాణీలే.. కాకుంటే వాటి దశ-దిశ మార్చుకున్నాయి. అయితే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కూడా మెజారిటీ సంఖ్య వీరిదే నన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా ప్రస్తావించాలి. తెలంగాణ బాషగా పరిగణించ బడుతున్న నేటి బాషను పొదివి పట్టుకొని దాచుకున్నది కూడా దళితులు, బీసీలేనన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ బాష ఎక్కువగా కట్టెపొయ్యిని, కారం ముద్దను నమ్ముకున్న కడజాతి కడవల్లోనే తొణకుండా పదిలంగా ఉంది. వాళ్లు మాత్రమే తిరిగి బాషకు జీవం పోయగలిగారు. ఇప్పుడు తెలంగాణ బాషగా చెపుతున్న బాషలో చాలా బాష సంకరంగా మారిందే. హలాంతాలు మార్చినంతమాత్రాన మూలబాషను ముందుకు తేలేం.. నలిమెల భాస్కర్ కష్టపడి తెలంగాణ పదకోశాన్ని రూపొందించనైతే రూపొందించాడు కానీ వాటన్నిటీ ఇప్పుడు వాడుక బాషగా వ్యవహారికగా బాషగా మాట్లాడాలంటే మళ్లీ ప్రాక్టీస్ చేయక తప్పదేమో.. మరీ కొన్ని జిల్లాలకైతే ఇంకా ఇబ్బంది. ఖమ్మంలో మెజారిటీ ప్రాంతం, నల్లగొండలో చాలా ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో అచ్చమైన తెలంగాణ బాష దొరకడం కరువే.. అయితే ఈ బాషను ఈ మాత్రమైనా నిలుపుకుంటూ వస్తుంది.. బహుజన కవిగాయక రచయితలేననేది మెజారిటీ సంఖ్యలో అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దొరల రాజ్యం వస్తుందని మంద కృష్ణ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో తెలియదు కానీ.. తెలంగాణ సాహిత్యంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజనులే దొరలు.. ఇంతమంది కలం వీరులుండగా వచ్చిన దొరస్వామ్యం నిలబడుతుందా.. అనేది గుర్తుంచుకోవాలి.. అఖరుగా ఒక్కమాట.. అణిచి వేతను ఎదిరించే సాహిత్యమేదైనా దాని రూపాలన్నీ సారూప్యాలే.. భావసారూప్యం గల మేథావులు అర్ధం చేసుకోండి.. అపార్దం చేసుకున్న వారు నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పండి.

Thursday, October 27, 2011

కాసులు రాలుస్తున్న డెంగీ జ్వరం

రాష్ట్రానికి జబ్బు చేసింది.. ఏ జిల్లా చూసినా జ్వరంతో మసిలిపోతోంది.. దాన్ని తగ్గించుకునే వైద్య ఖర్చులు విని వణికిపోతోంది.. ప్రభుత్వ ధర్మాసుపత్రులు ఎప్పటిలాగే చేతులెత్తేస్తున్నాయి.. ఫలితంగా డెంగ్యూ మహమ్మారికి రాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ మరణాలు, వైద్య పరిస్థితి పై ఇది వర్షాకాలానికి.. శీతాకాలానికి సంధి కాలం.. వాతావరణ మార్పులతో జ్వరాలు రావడం, వైరస్ విజృంబించడం సహజమే... కాస్త జలుబు చేసినా ఒళ్లు వెచ్చబడటం కూడా మామూలే.. కానీ ఇప్పుడు మామూలు జ్వరం వచ్చినా గుండె దడదడలాడుతోంది. రక్త పరీక్ష చేసి ఫలితం చెప్పే వరకు టెంపరేచర్ తగ్గనంటోంది.. ఈ మాసంలో ప్రతి ఏటా డెంగ్యూ, చికెన్ గున్యా, విషజ్వరాలు విజృంబించే విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు.. అయినా వ్యాధి సోకకుండా ఫలానా చర్య తీసుకున్నామని చెప్పడానికి మచ్చుకు కూడా ఒక్క కార్యక్రమం లేదంటే... ప్రజారోగ్యం పై ప్రభుత్వాధికారులకున్న చిత్త శుద్దిని అర్ధం చేసుకోవచ్చు.. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా వందలాది మంది రోగులు చనిపోతున్నారు.

డెంగీ జ్వరం... ఇప్పుడీ మాట రాష్ట్రాన్ని వణికిస్తోంది. జ్వరమొచ్చిందంటే గుండె గాబారవుతోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి సోకిన వారి సంఖ్య చూస్తే.. మామూలు జ్వారానికి కూడా ఐసీయు బెడ్ రాసే పరిస్థితి.. రాష్ట్రం మొత్తంగా చూస్తే అధికారిక లెక్కలే 800 పై చిలుకే.. ఆసుపత్రికి రాలేక.. ఆటవిక వైద్యాన్ని నమ్ముకొని, అడవి తల్లి ఒడిలో రాలిపోయే గిరిజనుల మరణాలు ఇంకా పూర్తిగా గణాంకాల్లోకి ఎక్కలేదనే అనుకోవాలి.
డెంగీ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్ గున్యా, ఇవీ ఇప్పుడు రాష్ట్రాన్ని భయపెడుతున్న ఖరీదైన రోగాలు.. అయితే వీటి ప్రాథమిక లక్షణాలన్నీ ఒకే రకంగా ఉండటంతో వ్యాధి నిర్ధారణకు వైద్యులు వెంటనే ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. మామూలు జ్వరంతో వచ్చినా ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేయించుకొమ్మంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల లిస్టు చూసే రోగికి సగం నీరసం వస్తోంది. ఆ పరీక్షల్లో ఏ ఒక్కటయినా పాజిటివ్‌గా వస్తుందేమోనన్న భయం రిపోర్టు వచ్చేవరకు పీడిస్తూనే ఉంటుంది.. గతంలో చలితో కూడిన జ్వరం వచ్చిందంటే క్లోరోక్విన్ మాత్రలతో బాటు జ్వరం గోళీలు, నాలుగు యాంటిబయాటిక్ మాత్రలు వేసుకుంటే నాలుగు రోజుల్లో ఏ జ్వరమైనా మాయవవ్వాల్సిందే.. కానీ ఇప్పుడు ఆ నాలుగు రోజులు కూడా వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే డెంగీ వ్యాధి సోకిందంటే గంటల్లో రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోయి రోగి తీవ్రంగా నీరసించి పోతాడు. వ్యాధి నిరోధక శక్తి క్షీణించి చర్మం పై దద్దుర్లు, పొక్కులు వస్తాయి. విపరీతంగా తల, నొసటి, కళ్ల నొప్పి ఉంటుంది.. ఇందులో సగం లక్షణాలు మామూలు జ్వరాలకు కూడా ఉంటాయి. అందుకే ఈ జ్వరాలను రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఈ జ్వరాలన్నీ దోమ కాటు వల్ల వచ్చేవే.. ప్రభుత్వంముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. దోమల నివారణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పడు ప్రజల పీకల మీదకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
టైఫాయిడ్, మలేరియా జ్వరాలకు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ, కొన్ని ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేసే అవకాశాలున్నాయి. కానీ డెంగీ జ్వరానికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వ్యాధి నిర్ధారణ కొరకు పెద్ద పెద్ద డయాగ్నసిస్ సెంటర్లకు రాస్తున్నాయి. ఎలీసా టెస్టులో డెంగీ జ్వరం అని నిర్ధారణ అయితే తప్ప డెంగీ వైద్యం చేయకూడదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే సీజన్ గా రోగుల వద్ద నుంచి దండిగా పిండుకుంటున్నాయి. కొందరు ప్రైవేట్ వైద్యులు ప్రమాదకరమైన జ్వరం కాదని ముందే గుర్తించినా రోగి ఆర్ధిక పరిస్థితిని బట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. లేని రోగాన్ని అంటగట్టి తగని వైద్యం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క ఊళ్లోనో.. ఏ ఒక్క జిల్లాలోనో కనిపించేది కాదు.. రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య.. ఇప్పటి వరకు నమోదైన డెంగీ జ్వరాల గణాంకాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.. డెంగీ జ్వరం భారిన పడి మరణించిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే ఈ ఏడాదే ఎక్కువగా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం వరంగల్, ఆదిలాబాద్ రెండు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 350 మంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 700 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అంటే రెండు జిల్లాల్లోనే డెంగీ లక్షాలున్న రోగులు వేయికి పైగా ఉన్నారు. ఇవి అధికారిక అంచనాలు. ఇవి కాక వెలుగులోకి రాని గిరిజన, మారుమూల గ్రామాల్లో రోగుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత తాగునీరు వంటి కారణాల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వరంగల్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ వైద్య యంత్రాంగం కదిలింది. నియోజక వర్గాల వారీగా మండల స్పెషాలాఫీసర్లతో సమావేశాలు నిర్వహించి చర్యలు ప్రారంభించారు. 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 140 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయితే కేవలం ఒకరు మాత్రమే మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, డెంగీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారగణం సమాయత్తమవుతోంది.
ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడి మరణించటం ఈ ఏడాది కొత్తేం కాదు. ఈ సీజన్ లో దోమ కాటు వల్ల జ్వరాలు విజృంభిస్తాయన్న నిజం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు. దోమల నివారణే సగం వ్యాధి రాకుండా నివారణ అన్న వాస్తవం కూడా ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలే.. అయినా ముందు జాగ్రత్త తీసుకోక పోవడంలో ఉన్న మతలబు ఏంటి.. ఈ సీజన్ లో డెంగీ, చికున్ గన్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధి గ్రస్తుల సంఖ్య ఎక్కువే అని తెలిసినా అన్ని గ్రామాలకు సరిపడా మందులు పంపిణీ చేయకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి.. ప్రభుత్వ నిర్లక్షం నీడన జరిగే తప్పిదాలకు ప్రజలు నిండు ప్రాణాలను మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఒంగోలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రలు, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పరీక్ష చేసిన 91మందిలో 11 మందికి డెంగీ లక్షణాలు కనిపించడంతో మిగతా రోగుల్లో ఆందోళన మొదలయింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షల పేరు చెప్పి వేలల్లో వసూలు చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు నెలలుగా 200 మందికి పైగా డెంగ్యూ, విష జ్వరాలతో మృత్యు వాత పడ్డారు. ప్రభుత్వాధికారులు మాత్రం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. డెంగీ వ్యాధి చికిత్సకు అవసరమైన సౌకర్యాలు జిల్లాలో లేకపోవడంతో జిల్లా వాసులు వైద్యం కోసం మహారాష్ట్రకు వెళుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 50 మందికి పైగా డెంగీ కేసులు గుర్తించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మరణించార. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయి రోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. రోగుల సంఖ్య వందల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం తక్కువ చేసి చెబుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మల్, మంచిర్యాల, బైంసా కేంద్రాలలో డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్యులు మాత్రం అసలు డెంగీ లేదని చెబుతుంటే.. ప్రైవేట్ వైద్యులు మాత్రం డెంగీ తీవ్రత ఎక్కువయిందనే పొంతనలేని సమాధానాలతో ప్రజలు అయోమయంలో పడ్డారు.

దీనికి తోడు గ్రామీణ వైద్యులు కమిషన్లకు కక్కుర్తిపడి నమ్మిన రోగులను కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించుకుపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో గ్రామీణ వైద్యులు కుమ్మక్కై కమిషన్లకోసం కక్కుర్తి పడటంతో సాదారణ రోగులకు కూడా డెంగీ అంటగట్టి అవే మందులు అంటగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న వారి రక్త నమూనాలు సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్‌కు పంపించి పరీక్షించగా... 65 మందిలో 31 మందికి మాత్రమే డెంగీ ఉన్నట్టు వెల్లడయింది. అయినా సదరు కార్పోరేట్ ఆసుపత్రుల నిర్వాకాన్ని ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల నిండా నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజాబాబాద్, కరీంనగర్, గుంటూరు వాసులు డెంగీ భయంతో చికిత్స చేయించుకుంటున్నారు.
కరీంనగర్‌లో కూడా 57 మండలాల్లో 190 గ్రామాల్లో పారిశుధ్య లోపంతో రోగాలకు నిలయంగా మారాయి. జిల్లాలో మంథని, హుస్నాబాద్, సిరిసిల్ల,ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ మండలాల్లో విషజ్వారాల తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలో తగిన వైద్యం లభించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఖర్చు భరించలేని వారిని ఆరోగ్ర శ్రీ ఫథకం ఆదుకోలేకపోతోందని ఆవేదన చెందుతున్నారు. డెంగీ వంటి జ్వరాలు ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రాకపోవడంతో సామాన్యుడికి ఎదుయ్యే అనుకోని ఖర్చుతో సతమతమవుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ రోగుల సంఖ్య, మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఏటికేటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం... వచ్చాక చూద్దాం అన్న ధోరణిలో ఉండటం వల్ల సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వం ప్రకటనలతో పొద్దుపుచ్చకుండా ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదీ రాష్ట్రానికి కుట్టిన నిర్లక్ష్య దోమ ఫలితం.. సకాలంలో వైద్యం అందక, ప్రజల ప్రాణాలను, ఆస్థులను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి.. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.

కార్తీక మాసంలో పూజలెందుకు చేస్తారు

ఒక్కమాట... ఈ వ్యాసంలో ఉన్నవి నా అభిప్రాయాలు కావు.. ఇవి నేను కూడా వేరే దగ్గర సేకరించినవేనని గమనించగలరు
మన భారతీయ సంసృ్కతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ స్వామికి ��ఆశుతోషుడు�� అను బిరుదు కలిగింది.
��హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ! ప్రతి ఈశ్వ రాలయంలో ఆ రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందు వుల గృహాలలో ��ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం�� అనే పంచాయతన దేవతలను విశ ేషంగా ఆరాధిస్తారు.
ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.
ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ��ఈ కార్తీకమాస వ్రతము�� హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.
ఈ మాసమందు వచ్చు సోమవారములు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాస ముప్పది దినములు ఆచరించిన వార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడినది.
ఇందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.
కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారా ధనలు, పూజలు కావించి, నివేదించిన అన్నాన్ని రా త్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక నక్తవ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా ��అర్థనారీశ్వ రుడుగా�� దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ��అధ్యక్షురాలు��గా అధిరోహించియుండగా! పరమే శ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయి స్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తా డుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.
కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహ స్తుంది అని చెప్పబడినది.
ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనమందు ఉంటాడని చెప్తారు.
ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చినది. పాల సముద్రమును చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధ నలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశము నలుమూలలా గల ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమి ట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వ హిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభము లకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమే శ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహి స్తారు. అలా హరి హరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పుటకు సహస్రముఖములు కలిగిన ఆదిశేషుడు, చతు ర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత? అని సూతమహాముని చెప్పియున్నారు.
మన సంసృ్కతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవునేయి కలిపి వెలిగించిన దోషములేదని, అలా! ఒకటి మొదలు వేయి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభ ప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాం గణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.
ఈ మాసమందు సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వార్కి కాను కలు సమర్పించుటతోపాటు, సమీప వన మందు బంధువులు, స్నేహితులతోకూడి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారముతో వన భోజనములు చేస్తూ ఉండుట మంచిది. అం దువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదము తోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుంది.
అట్టి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసమందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ ��కార్తీకపురాణ�� పఠనము గావించిన ఎడల అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాకుండా, జన్మాంతరమందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్య్యమును గూర్చి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.
విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కృత్తికా నక్షత్రం:
కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.
కార్తీక దీపాలు
ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.
కార్తీక సోమవారాలు:ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.
ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.
కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.
సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన - సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.
ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.

Wednesday, October 26, 2011

తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి అసలు గుట్టు ఇదే..?




భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....
కాంగ్రెస్‌ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.

లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు
సీమాంధ్ర ఎంపీలు, కాంట్రాక్టర్లు తెలంగాణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో వారికున్న కాంట్రాక్టులేంటి.. తెలంగాణ వస్తే నష్టపోయేది.. సీమాంధ్ర ప్రజలా.. సీమాంధ్ర పొలిటికల్ కాంట్రాక్టర్లా ... ఇన్ని వేలకోట్ల లావాదేవీలు ఉండబట్టే రెండు ప్రాంతాల ప్రజలను ఉద్యమాల పేరుతో చెడుగుడు ఆడుతున్నారు.... ఎవరి ప్రాజెక్టులు.. ఎన్ని కోట్ల లావాదేవీలో ఒకసారి చూద్దామా...
తెలంగాణ స్వరూపాన్ని మార్చిన నిర్మాణాలు
భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....
కాంగ్రెస్‌ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.
లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు

Tuesday, October 25, 2011

దీపావళి పండుగ వెనుక అసలు కథ

లోక కంఠకుడు నరకాసురుడు మరణించిన రోజును ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు. జగతి యావత్తు వెలుగులు పంచుకునేలా మతాబులు కాలుస్తారు. ఇంతకీ నరకుడు ఎవరు..? అతడి జన్మ వృత్తాంతం ఏంటి..?

నరకాసురుడు భూదేవికి, వరాహమూర్తికి కలిగిన సంతానం అన్నది పురాణ కథనం. పూర్వం, దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడి సోదరుడు... హిరణ్యాక్షుడు, భూదేవిని ఎత్తుకెళ్లి సముద్రంలో దాక్కుంటాడు. దీంతో శ్రీహరి... వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుని హతమార్చి భూదేవిని రక్షిస్తాడు. తనను కాపాడిన వరాహ రూప శ్రీహరిని భూదేవి మోహిస్తుంది. వరాహమూర్తి కారణంగా భూదేవి గర్భం ధరిస్తుంది. భూదేవి-విష్ణుమూర్తి తనయుడి వల్ల తన త్రిలోకాధిపత్యానికి ముప్పు వస్తుందని భావించిన ఇంద్రుడు.. భూదేవి ప్రసవించకుండా ఆమె గర్భాన్ని గడ్డలాగ చేశాడట. ఫలితంగా నరకాసురుడు రమారమి 27 యుగాల పాటు భూదేవి గర్భంలోనే ఉండి పోయాడట. దీంతో తనకు కానుపవ్వాలని భూదేవివిష్ణుమూర్తిని కోరిందట. తాను త్రేతాయుగాన రామావతారంలో రావణ సంహారం జరిపాక శిశువును ప్రసవించగలవని... విష్ణువు, భూదేవికి చెప్పాడట.
2: 27 యుగాల పాటు గర్భంలో ఉన్న నరకుడు... త్రేతాయుగంలో.. రావణుడు హతమైన రోజున జన్మించాడు. విష్ణువు, భూదేవిల తనయుడు రాక్షసుడిలా మారడం విశేషం. నరకుడు ఎందుకిలా లోక కంఠకుడయ్యాడు..?
: త్రేతాయుగంలో శ్రీరాముడు, రావణాసురుడిని హతమార్చాక.. భూదేవి నరకుడికి జన్మనిచ్చింది. అయితే... రాక్షసులు మేలుకొని విజృంభించే అసుర సంధ్య వేళ నరకుడు పుట్టాడు. దాంతో తన తనయుడికి రాక్షస లక్షణాలు వస్తాయని ముందే ఊహించిన భూదేవి, నరకుడిని వధించవద్దంటూ విష్ణువును కోరుతుంది. తన చేతిలో తప్ప ఎవరి చేతుల్లోనూ తనయుడికి చావు లేకుండా వరం కోరుతుంది.
: నరకుడికి జన్మనివ్వడానికి ముందే... భూదేవి... సీతను పెంచి పోషించిన జనక మహారాజును ఓ ఉపకారం కోరుతుంది. రావణ వధానంతరం, నరకాసురుని కూడా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పాలని అడుగుతుంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమారునికి నరకుడని పేరు పెట్టి, విద్యా బుద్ధులు నేర్పుతాడు. నరకునికి పదహారు సంవత్సరాల వయసు రాగానే.. భూదేవి వచ్చి అతణ్ణి గంగాతీరానికి తీసుకు వెళ్లి... అతని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. అదే తరుణంలో.. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నరకునికి శక్తి అయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకొని కామరూప దేశాన్ని ఏలుకొమ్మని చెప్పి భూదేవితో సహా అదృశ్యమవుతాడు. ఆ విధంగా నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు.
3: కామరూప దేశాధినేత అయ్యాక కొంత కాలానికే నరకుడు లోక కంఠకుడిగా మారిపోతాడు. అసుర సంధ్యా సమయాన జన్మించడం.. దుష్టుల సహవాస దోషం కారణంగా.. రాక్షస లక్షణాలను పుణికి పుచ్చుకుంటాడు. నరకుడు.. సాధు సత్పురుషులతో పాటు, దేవతలనూ వేధించడం మొదలు పెడతాడు.
భూదేవి భయపడ్డట్లుగానే, నరకుడు జనన కాల దోషం కారణంగా.. రాక్షస లక్షణాలు పొందాడు. పైగా బాణాసురుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రక వాసుదేవుడు, కాలయవనుడు లాంటి దుష్టుల సహవాస దోషంతో దేవతలకు జన్మించినప్పటికీ లోకకంఠకుడైన రాక్షసుడిగా మారాడు. అతడు దేవతలపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని వారిపై దాడి చేసి దేవతలను జయించాడు. వరుణుడి ఛత్రాన్ని లాక్కున్నాడు. మేరుపర్వతానికి పోయి దానిలోని మణి పర్వతాన్ని తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దేవేంద్రుని తల్లి అదితి కుండలాలను బలవంతంగా లాక్కు వెళ్లాడు.
: నరకుడు సాధు సత్పురుషులను కూడా అతి కిరాతకంగా హింసించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లగా... నరకుడు ఆలయ తలుపులు మూయించాడట. దీంతో కోపించిన వశిష్టుడు జన్మదాత చేతుల్లోనే మరణిస్తావని శపిస్తాడు. ముని శాపానికి భయపడ్డ నరకుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని.. దేవతలు, రాక్షసుల నుంచి మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో మరింత రెచ్చిపోయాడు. ఋషులను మరింతగా బాధించాడు. 16 వేల మంది రాజకన్యలను బంధించాడు.
: నరకుని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు, రుషులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. విష్ణ్వంశతో అవతరించిన శ్రీకృష్ణుడు.. దేవతల ప్రార్థనలతో కరిగి.. నరకుని సంహరించేందుకు కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయన ఇష్టసఖి సత్యభామ కూడా శ్రీకృష్ణునితో కలిసి యుద్ధానికి వెళుతుంది.

నరకుడిని వధించేందుకు ప్రాగ్జోతిష పురం వెళ్లిన సత్యభామా కృష్ణులకు... శత్రు దుర్భేద్యమైన దుర్గాల వలయాలు ఆశ్చర్య పరుస్తాయి. పంచ దుర్గావృతమైన ప్రాగ్జ్యోతిషపురాన్ని ఛేదించడానికి శ్రీకృష్ణుడు యోగమాయను ఉపయోగిస్తాడు.

: నరకుడి కామరూప దేశపు రాజధాని ప్రాగ్జ్యోతిష పురం అత్యంత భయంకరంగా ఉండేది. దాని భేదించడం సామాన్యులకే కాదు.. శక్తియుక్తులున్న ఇంద్రాది దేవతలకూ అసాధ్యం. జయించడానికే కాదు ముట్టడించడానికీ వీలుకాని దుర్గ పంచమంగా నిర్మితమైంది. ప్రాగ్జ్యోతిషపురం... గిరిదుర్గం, శస్త్ర దుర్గం, జలదుర్గం, వహ్నిదుర్గం, వాయుదుర్గం అనే ఐదు విభిన్నమైన కోటలతో నిర్మితమైంది. :‌ తొలి వరుసలో కొండలతో నిండిన దుర్గం, రెండో వరుసలో బాణాలతో రూపొందించిన దుర్గం, మూడో వరుసలో వేగంగా ప్రవహించే నదీనదాలు ఉంటాయి. నాలుగో వలయంలో ఎగసి పడే అగ్నికీలలు, చివరి వరుసలో శత్రు భయంకరమైన... ప్రచండ గాలులతో నిండిన దుర్గం ఉంటుంది. వీటన్నింటినీ మించి.. ఎందరో యోధానుయోధులు.. నగరం చుట్టూ కాపలాగా ఉంటారు. ఆ పైన ఎలాంటి వారినైనా బంధించి వేసే మురాసురుడి పాశాలు ఉన్నాయి. ఇన్నింటిని దాటి ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించడం మహామహులకే సాధ్యం కాదు.
: అయితే.. శ్రీకృష్ణుడు భగవత్స్వరూపుడు. నరకుడిని వధించేందుకు వెళ్లిన వెన్నుడు.. తన గదా దండంతో గిరిదుర్గాన్ని తుత్తునియలు చేస్తాడు. అలాగే, మహామహిమాన్వితాలైన బాణాలతో శస్త్ర దుర్గాన్ని ఛేదిస్తాడు. సుదర్శన చక్రాన్ని స్మరించి, ఆ చక్రాయుధంతో మిగిలిన దుర్గాలను ఛేదిస్తాడు. మురుడి పాశాలను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తాడు. సమరోత్సాహంతో.. తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. నీటిలో నిద్రలో ఉన్న మురుడు పాంచజన్య రవానికి ఉలికిపడి లేచి, శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి వస్తాడు. అతడు విసిరిన గదను శ్రీకృష్ణుడు తుత్తునియలు చేస్తాడు. చక్రాయుధంతో.. మురుడి ఐదు తలలనూ నరికేస్తాడు. మురుడి ఏడుగురు కుమారులూ కృష్ణునితో యుద్ధానికి రాగా.. వారినీ హతమార్చుతాడు.
: నరకుడి వధచారులు, సేవకుల ద్వారా.. పంచదుర్గాలు ఛేదితమైన విషయాన్ని, మురుడు హతుడైన సంగతిని నరకుడు తెలుసుకుంటాడు. ఇక తానే యుద్ధానికి సమాయత్తమవుతాడు.
: శ్రీకృష్ణుడి శక్తిని గురించి తెలుసుకున్న నరకుడు నేరుగా తానే యుద్ధానికి వస్తాడు. గరుత్మంతుని మీదకు శక్తి అస్త్రాన్ని వేస్తాడు. అయితే.. వజ్రాయుధాన్నే లెక్కచేయని గరుడుడిని శక్తి అస్త్రం పెద్దగా బాధించదు. నరకుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. సత్యభామ... నరకుడు తన కొడుకేనన్న సంగతి గుర్తించలేకపోయింది. పైగా నరకుడు ఆమెతో కామాతురుడై, అసభ్యంగా ప్రసంగిస్తాడు. దానితో ఆమె ఆగ్రహించి, శ్రీకృష్ణుడు అనుగ్రహించిన దివ్యాస్త్రంతో నరకాసురుణ్ణి సంహరిస్తుంది.
2 : నరకుడు హతమయ్యాక, సత్యభామగా అవతరించిన భూదేవికి పూర్వస్మృతి కలుగుతుంది. తనకిచ్చిన వరం ప్రకారమే.. శ్రీహరి నరకుడిని తన చేత వధింపచేశాడని గుర్తిస్తుంది. పుత్రశోకాన్ని దిగమింగి.. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. దీంతో.. నరకుడు మరణించిన రోజు నరక చతుర్దశిగా ప్రసిద్ధమవుతుందని భగవంతుడు వరమిస్తాడు.
: నరకుని వధతో.. అతడి చెరలో ఉన్న సాధు జనులు, పదహారు వేలమంది రాజకన్యలు విముక్తులవుతారు. వారు శ్రీకృష్ణునే వరించామని చెప్పటంతో, ఆయన వారిని వివాహమాడతాడు. లోకకంఠకుడైన నరకుడి పీడ విరగడైందన్న సంతోషంతో ప్రజలు పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగిందని పురాణాలు చెబుతాయి. నరకుని పీడ విరగడ కావడంతో.. ఆనంద పరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోను, మరునాడూ పండుగ జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. నరకుని వధించాక.. అతని కుమారుడు భగదత్తుని కామరూప దేశానికి రాజును చేసి... శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ద్వారకకు తిరిగి వెళతాడు. నరకుడు అపహరించిన దేవమాత అదితి కర్ణకుండలాలను తీసుకున్న శ్రీకృష్ణుడు.. పారిజాతాన్ని తెచ్చేందుకు వెళ్లినప్పుడు, ఆమెకు అప్పజెబుతాడు.
నరకుడు పరిపాలించిన కామరూప రాజ్యపు ఆనవాళ్లు నేటికీ భారతావనిలో కనిపిస్తాయి. ప్రస్తుతం అసోం రాష్ట్రంలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. కామాఖ్య పట్టణమే నాటి ప్రాగ్జ్యోతిషపురమన్నది హిందువుల నమ్మకం.
: అసోం రాష్ట్రం.. గౌహతికి దగ్గర్లో నీలాచల పర్వతం ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో.. అద్భుతమైన ప్రకృతి రమణీయతతో నీలాచల పర్వతం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ కామాఖ్యదేవి మందిరం ఉంది. ఈ ప్రదేశాన్ని చూసే వారికి ఆ జనని నిజస్థానం చేరుకున్న అనుభూతి కలుగుతుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య... దర్శన మాత్రాన్నే పాపాలను హరించి జన్మజన్మలకు సరిపడా పుణ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.
: కామాఖ్యదేవి కొలువైన నీలాచల పర్వత శ్రేణిని చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది రోడ్డు మార్గం. మెట్ల మార్గంలో వెళ్లడానికి ఓ గంట సమయం పడుతుంది. కామాఖ్య గేట్‌ నుంచి మొదలయ్యే రోడ్డు మార్గంలో వెళ్లడానికి సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు కావలసినన్ని అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మార్గాల ద్వారానూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
లోకకంఠకుడైన నరకుడు మరణించడంతో.. చీకట్లు తొలిగి పోయాయని, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అయితే.. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారు..? దీపానికి, లక్ష్మీదేవికి ఏంటి సంబంధం..?
: నరకాసురుడు హతుడవడంతో... లోకాన్ని అలముకున్న తిమిరం తొలగి పోయిందని ప్రాగ్జ్యోతిష పురం ప్రజలు భావించారు. అందుకే తిమిరాన్ని తొలగించేందుకు జగతి మొత్తం వెలుగులు పరచుకునేలా... ఇంటింటా లెక్కకు మిక్కిలిగా దీపాలు వెలిగించారు. తిమిరమున్న చోట దరిద్రదేవత జేష్ఠాదేవి కొలువుంటుందని, చిన్నపాటి దివ్వెను వెలిగించినా ఆమె అదృశ్యమవుతుందని హిందువులు నమ్ముతారు. ఎక్కడ వెలుగులు ఉంటే అక్కడికి లక్ష్మీదేవి వచ్చి చేరుతుందంటూ ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
: దీపానికి లక్ష్మీదేవికి ప్రత్యక్ష సంబంధం ఉందని నమ్ముతారు. పూర్వం దూర్వాస మహర్షి... శక్తిని ప్రసన్నం చేసుకుని ఆమె కంఠాన ఉన్న హారాన్ని అనుగ్రహంగా పొందాడు. దాన్ని త్రిలోకాధిపతి దేవేంద్రునికి అందిస్తాడు. అయితే... మత్తులో మునిగి ఉన్న ఇంద్రుడు ఆ హారాన్ని ఐరావతం మీద వేస్తాడు. ఆ మత్తేభం, హారాన్ని కింద పడేసి, కాళ్లతో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు మహోగ్రుడై.. సర్వ సంపదలను కోల్పోతావని దేవేంద్రుని శపిస్తాడు. ఫలితంగా.. దేవేంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలనూ కోల్పోతాడు. తన తప్పిదానికి పశ్చాత్తాప పడ్డ దేవేంద్రుడు, దిక్కుతోచక, శ్రీహరిని శరణు వేడుతాడు. ఒక జ్యోతిని వెలిగించి దాన్నే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని శ్రీహరి సూచిస్తాడు. ఆ విధంగా దేవేంద్రుడు పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి, ఇంద్రునికి పూర్వ వైభవాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణ కథనం.
: అప్పటి నుంచి దీపాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తూ... పూజించడం ఆనవాయితీ. దీపావళి పర్వ దినాన, సిరిదేవి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే దీపాలను ఏ దిక్కు పడితే ఆ దిక్కున ఉంచి పూజిస్తే మాత్రం ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని ప్రాచీనులు విధివిధానాలను నిర్దేశించారు.
: తూర్పు, ఉత్తర ముఖంగా దీపాలను ఉంచే ఇళ్లలో, దీపాల కాంతి నలుమూలలా వ్యాపించే ఇళ్లలో లక్ష్మీదేవి కరుణ అమితంగా సిద్ధిస్తుందట. సాయంత్రం వెలిగించిన దీపం ఉదయం పూజ వరకూ వెలిగే ఇళ్లలో అష్టయిశ్వర్యాలు సమకూరుతాయట. సాయంత్రాలు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అమితమైన కరుణ సొంతమవుతుందట. పడమర, దక్షిణ దిక్కుల్లో దీపాలు ఉంచే ఇళ్లు... దరిద్రానికి చిరునామాగా మారతాయట.
: దివ్వెలు వెలుగులనే కాదు.. సిరిసంపదలనూ పంచి పెంచుతాయి. అందుకే... దీపాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.
దీపావళి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి
శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు చేయరాదు
దీపాలను ఎప్పుడేగాని నోటితో ఊపి ఆర్పరాదు
శుక్రవారం పూట అన్నాన్ని దానం చేయవద్దు
అక్క చెల్లెళ్ల మనసు కష్టపెట్టవద్దు
సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో నిద్ర పోరాదు
ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచి వెళ్లదు
ఇల్లాలిని సంతోషంగా ఉంచాలి
అబద్ధాలు ఆడరాదు
ఆవులను పూజించాలి
ముంగిళ్లు ముగ్గులతో కళకళ లాడాలి
గడపలకు పసుపు పూయాలి
ఇట్లాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
అంతేకాదు.. పువ్వుల్లో, పాలల్లో, ధాన్యపు రాశుల్లోనూ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది.

Monday, October 17, 2011

బలస్వామ్యం



వాడెందుకు పుట్టాడో... ఎలా పుట్టాడో
ఎవరికి పుట్టాడో... ఎక్కడ పుట్టాడో
వాడికే కాదు.. ఎవరికీ తెలియదు..
కానీ..
ప్రతి కులంలోనూ వాడుంటాడు..
ప్రతి మతంలోనూ వాడుంటాడు...
ప్రతి పార్టీ వాడిదేేే...
ప్రతి సెక్షన్ వాడి కోసమే...
.........................
జీవిత సారాన్ని ఎంత జీర్ణించుకున్నాడు
సమాజ గ్రంధాన్ని ఎంతగా చదివాడు వాడు
ఇప్పుడు వాడికి అందరూ మిత్రులే..
ఇప్పుడు వాడిలో అన్నీ ఉన్నాయి..
ధైర్యం కూడా...
అందుకే తెగించాడు.. తెగదెంచాడు..
తిరుగులేని నాయకుడయ్యాడు..
తనపై సమాజానికి లేని జాలి
ఈ సమాజం పై తనకెందుకు
అందుకే ఇది వాడి స్వామ్యం...
వాడి వలన, వాడి చేత వాడి కొరకు
ఇది వాడిగా మొనదేరిన వాడిస్వామ్యం..
ఇది బలమున్నోడి స్వామ్యం..
బలస్వామ్యం.. బలవంత స్వామ్యం.

బరువైన బాల్యం



ఇదేమి జ్ఞాపకం...
వర్షరుతువు జీవితాన్ని ఎంత వాటేసింది
నన్నూ... నా జ్ఞాపకాలను
చినుకు చిగురింపజేసే తలపులెన్నో..
అయ్యో...
నేను కోల్పోయిన బాల్యం..
ఎంత మధురం.. ఎంత దుర్భరం..
బాల్యమంతా పరపీడన పరా‍యణత్వం
ఒక్కో చినుకూ భూమిని తాకి
మట్టి గంధాన్ని, మకరందాన్ని..
తేనె పరిమళాన్ని వెదజల్లే నీటి ఆవిరులు..
గుప్పున గుబాళించే బాల్య స్మృతులు..
ఆ గుబాళింపులో బాల్యం బావురుమంది.
దారంట తొంగిచూసే మొలకలు
చిరిగిన చొక్కా.. చినిగిన పుస్తకం
అరకలు, బాయి గిరకలు
ఆరుద్ర పురుగులు, ఆవకాయ పచ్చళ్లు
కొత్త తరగతులు, కొత్త మాస్టార్లు
ఒకే ఒక్క చినుకు టైం మిషనైంది
కాల గర్భంలో నిదురించిన
రెండున్న దశాబ్దాలకు మోసుకెళ్లింది..
ఆహా ఈ వర్షరుతువు నా బాల్యాన్ని
దాని బరువును ఎంతగా పెనవేసుకుంది
ప్రతి బాల్యం ఓ మధుర జ్ఞాపకం కాదు..
మధుర జ్ఞాపకాలన్నీ బాల్యాలే..
****************************

చితి మంటల్లో మత మిణుగురులు



చితి మంటల్లోంచి చిమ్ముకొచ్చే మిణుగురులు
ఆహా ఎక్కడివిరా ఆ నవీన విజ్ఞాన కాంతులు
ఆహా ఎక్కడిదిరా ఈ విశ్వాస త్యాగాల చరిత్ర
ఇక్కడ కళేబరాలు తిరిగి లేస్తాయి..
హైటెక్ యుగంలో భూ కేంద్ర సిద్ధాంతం
భవిష్యత్తు జాతకం చెప్పించుకునే ఆరాటం
ఇక్కడ సజీవ శవాలున్నాయి.
మనుషుల్ని పీక్కుతినే మతాసురులున్నారు
రోజొక గ్రంధాన్ని లిఖిస్తారు..
ఇక్కడ ఆకలికి అలమటించే మొక్కలున్నాయి
ఆకురాల్చని బ్రహ్మజముడుంది..
పచ్చదనం వెనుక కూడా కృారత్వం ఉంది.

పరాధీన ప్రేతాత్మలు




ఇక్కడ ఎన్ని మెదడు లేని దేహాలు
అబ్బా.. అన్నీ పరాధీన ప్రేతాత్మలే
ఒక్కడి మాటే వేదమంత్రం...
వశీకరణ కంటే బలమైనది
ఇది ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం
ఇది పశుపక్ష్యాదులు సిగ్గుపడే మూర్ఖత్వం
అమ్మను కూడా బలిచ్చే అత్యాశ పరులు
ఆడబిడ్డను కూడా ఆవిరి చేసే అజ్ఞానులు
కొమ్మను కూడా నరుక్కునే కౄరత్వం
ఒక్కడే సృష్టించాడా ఈ జాతిని..
ఒకేలా సృష్టించాడా ఈ నీతిని..
నిజంగా మెదడున్నా లేని దేహాలే..
పరాధీన ప్రేతాత్మలే

Friday, October 14, 2011

నెలరోజుల 'సమ్మె'ట

తెలంగాణ మొత్తాన్ని దిగ్భందం చేస్తే తప్ప తెలంగాణ రాదనే ఉద్దేశ్యంతో తల పెట్టిన సకల జనుల సమ్మె నేటికి నెలరోజులు కావస్తుంది. తెలంగాణలో సాగుతున్న సకల జనుల సమ్మె నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్నే ఇబ్బంది పెట్టింది. తాజాగా అది దేశ రాజదాన్నే చీకటి మయం చేసే స్థాయికి ఎదిగింది. సమ్మె ఇలానే కొనసాగితే దేశ ఆర్ధిక పునాదులే కదులుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ సకల జనుల సమ్మెలో ఏం దాగుంది.. ఈ సమ్మె యావత్ దేశాన్ని కుదిపేయడం వెనుకున్న మూలాలేంటి.. ముప్పై రోజుల సకల జనుల సమ్మె పై ప్రత్యేక కథనం.


తెలంగాణ ఉద్యమం ఎంత తారా స్థాయికి చేరినా ప్రభుత్వం దిగిరావడం లేదనే ఉద్దేశ్యంతో... తెలంగాణ వాదులంతా ఏకమై సకల జనుల సమ్మెకు పిలుపు నిచ్చారు. ఉద్యోగ, కార్మిక, ఉపాద్యాయ సంఘాలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేసి తమ సత్తా ఏంటో ఢిల్లీకి చాటాలనుకున్నారు. గత నెల 13న ప్రారంభమైన సమ్మెలో ఎన్నో ఆటుపోట్లు... వదంతులు.. ప్రభుత్వ వ్యూహాలు.. ధిక్కారాలు.. అనధికారికంగా అణిచివేత ఉత్తర్వులు.. విభజించి పాలించే సూత్రాలు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు.. అరెస్టులు.. కేసులు.. ఆఖరుకు వదంతులు.. ఇవన్నీ గత నెలరోజులుగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్న తాజా వార్తలు.. కళ్లారా చూస్తున్న కష్టాలు.. అనుభవిస్తున్న నష్టాలు. ఒక లక్ష్యం కోసం.. ఒక ఆశయం కోసం.. దశాబ్దాలుగా చేస్తున్న నిరీక్షణలో అంతిమ పోరుకు సిద్ధమైన తెలంగాణ ప్రజల సహనానికి నిలువెత్తు నిదర్శనం.. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని ఒక సత్యాగ్రహ సంగ్రామం..

ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతం విముక్తి కోసం చేసే దశాబ్దాల పోరాటం అంతిమ దశకు చేరిందా అంటే అవునని... కాదని... సమాధానం చెప్పలేని దుస్థితి.. రాజ్యం తగలబడిపోతుంటే పిడేలు వాయించుకునే నీరోలను అనుసరిస్తున్న పొలిటికల్ హీరోలున్న రోజులివి.. నీకిస్తే నాకేంటనే రాజకీయ పద్దులు లెక్కగట్టే కాలమిది.. ఈ తరుణంలో తెలంగాణ అనే సున్నిత సమస్యను కఠినంగా ఎదుర్కొవాలనే దురాలోచన... దూరాలోచన... ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టేదనే మాట గత నెలరోజుల సమ్మె చెప్పకనే చెబుతుంది.

సకల జనుల సమ్మె హఠాత్తుగా రాత్రికి రాత్రే వచ్చి పడింది కాదు.. అలాగని ఏ ఒక్క రాజకీయ పార్టీయో నిర్ణయం తీసుకొని అమలు చేసింది కూడా కాదు.. తెలంగాణ పై తేల్చకుంటే సకలం స్థంబింప జేస్తామని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా కాకున్న ఎవరికి వారైతే ప్రకటించారు. రూపాలు వేరైనా ఒకే రకంగా నినాదించారు.. సకల జనుల సమ్మెను మామూలు సమ్మెగా ఎదుర్కొడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దింపాలని ప్రయత్నించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ఒకరంగంలో ఉన్న వారిని మరోరంగంలోకి మార్చి ఉపయోగించుకోవలనే ప్రయత్నం కూడా చేసింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరుకు సకల జనుల సమ్మె ముందు రాజ్యం తలవంచక తప్పలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. తరిగిపోతున్న బొగ్గు నిల్వలు, ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్న, మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, పాఠశాలలను మరిచిపోయిన విద్యార్ధులు, రోడ్డెక్కని ఆర్టీసి బస్సు.. కదలని కరెంటు బిల్లు... ఒక్కటని కాదు.. అన్ని రంగాలపై సకల జనుల సమ్మెప్రభావం స్పష్టంగా కనిపించింది... ఆఖరుకు మద్యం డిపోల్లో కూడా సిబ్బంది బందు ప్రకటించడంతో మద్యం రేట్లు కూడా చుక్కలను వెక్కిరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మద్యాన్ని, బస్సులను ఉద్యమకారులు అడ్డుకోవడంతో... తెలంగాణలో సమ్మెకు వ్యతిరేకంగా ఏపని చేయాలన్నా ఇతర ప్రాంతాల వారు జంకుతున్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం వల్ల సింగరెణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి.. ఇటు రాష్ట్రంతో బాటు అటు దేశంలోనూ విద్యుత్పత్తి నిలిచిపోయింది. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో కేటాయించిన కరెంటునే కేంద్రం వెనక్కు లాక్కుంది. ఆర్టీసి బస్సు చక్రాలు డిపోల్లోనే నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. డ్ర్రైవర్లు, కండక్టర్లతో సహా ఆర్టీసి సిబ్బంది మొత్తం సమ్మెకు దిగడంతో రోడ్డు పై ఆర్టీసి బస్సు అనేది కనిపించక వారాలు దాటింది. బొగ్గు పెళ్లను పెకిలించింది లేదు. . ఇతర ఉద్యోగులను ప్రలోబపెట్టి పనులు చేయించుకునే ప్రభుత్వ వ్యూహాన్ని సమ్మెలో ఉన్న ఉద్యోగులు సంఘటితంగా తిప్పి కొట్టగలిగారు. సెట్విన్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా సమ్మెకు మద్దతిచ్చి రెండు రోజుల సమ్మె చేశాయి. రైల్ రోకోలకు భయపడ్డ ప్రభుత్వం ఏకంగా రైళ్లనే నిలిపేసింది. సచివాలయంలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోతున్నాయి. పెన్షన్లు, రిజిస్ట్రేషన్లు, ఉపాధి వేతనాలు అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వందల కోట్ల నష్టంతో బాటు ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది.. తెలంగాణ వచ్చేవరకు విద్యా సంవత్సరాన్ని వదులు కోవడానికి కూడా విద్యార్ధులు వెనకాడటం లేదు.. ఉద్యోగులు, కార్మికులు ఉపాద్యాయులు జీతం రాకున్నా ఓపిక పడుతున్నారు. కాబట్టి సకల జనుల సమ్మె సామాన్యుడి పై కంటే ప్రభుత్వం పైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నెల రోజుల సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సమస్యను తేల్చే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.