ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, November 26, 2011

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది


ఆ తల్లి గుండె విలవిల్లాడింది... కన్నపేగు కదిలిపోయింది... వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు ముప్పై ఏళ్ల తరువాత శవమై తిరిగొచ్చాడు.... నిలువెల్లా కంపించిపోయిన ఆ తల్లి గుండె చెరువయింది.. కొడుకు రాకకై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ తల్లి రోదనకు అంతులేదు.. పోలీస్ ఎన్‌కౌంటర్ లో మరణించిన కిషన్ జీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిని చూసి కంట తడి పెట్టని వారు లేరు..
సరిగ్గా ముప్పై సంవత్సరాల కితం వెళ్లొస్తానమ్మా అన్న కొడుకు.. కన్నతల్లి చేయి విడిచి అడవి తల్లి ఒడిలోకి చేరాడు. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు లోకోద్దారకుడుగా మారుతానని వెళ్లాడు. ఆ తల్లికి ఇవేవీ తెలియవు.. కానీ ఏ రోజు కన్నదిరినా దిన పత్రిక చూసేది.. ఏ అపశకునం కనిపించినా కన్న పేగు కదిలేది. కంటిచెమ్మ తడిమేది.. దినదినం పీడకలతో.. నిద్రలో ఉలిక్కి పడ్డ రాత్రులెన్నో.. కన్న కొడుకు ఎక్కడ దూరమై పోతాడో అని ఆవేదన చెందిన రోజులెన్నో.. కొడుకు గుర్తొచ్చి కంచం పై నుంచి లేచిన రోజులెన్నో.. ఏదో ఒకరోజు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి భయపడుతూనే ఉంది.. కానీ ఆ రోజు రాకూడదనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది.. కానీ.. ఆ బిడ్డ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు చిందించక తప్పలేదు.. ముప్పై ఏళ్లతరువాత.. గుర్తుపట్టలేని గురుతులతో ఊరుఒడిని చేరుకున్న కిషన్‌జీని చూసి ఊరు ఊరంతా అమ్మయింది.. ఆ అమ్మ కళ్లు సముద్రాలయ్యాయి...
(వెనకొచ్చే ఆవుల్లారా పాట)మొదటి చరణం.. కళ్లల్లో కదిలే కొడుకు కనబడక పోయే... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి ఆవేదనను తీర్చేదెవరు.. ఈ కంటిచెమ్మను తుడిచేదెవరు.. పొగిలి పొగిలి ఏడ్చే ఈ తల్లి ఆవేదనను ఎవరు తీర్చగలరు. కన్నకొడుకు జాతి మరువని అమరుడయ్యాడని గర్వించాలో.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లలో ఒదిగిపోతున్నాడని బాధపడాలో తెలియని అమాయకత్వం... ఆఖరి గడియల్లో.. తన కన్న పేగు కానరాని లోకాలకు తరిలిపోతుందన్న ఆవేదనను ఎవరు తీర్చగలరు.. ఆదుకుంటాడనుకున్న కొడుకు అమరుడయ్యాడని తెలిసిన క్షణం ఆ తల్లి గుండెలో మోగిన పిరంగులెన్ని. ఆ పెద్దగుండె ఎంత కలత చెందిందో..


(వెనకొచ్చే ఆవుల్లారా పాట)రెండవ చరణం..తండ్రి పొయిన కాణ్నుంచి... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి శోకం తీరనిది.. ఈ గుండె గాయం మాననిది.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆశ అడియాసే అయింది. కొడుకు గుండెను బుల్లెట్ చీల్చిందన్న వార్త తెలసినప్పటినుంచీ ఈ తల్లి గుండె వేయి వక్కలయింది.. పెద్దగుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. అఖరి పలుకులు ఎండమావులే అయ్యాయి.
bang- కడుపుకోత

8 comments:

  1. ayya..mari ee poraatam lo chanipoyina police vallu oka talli kanna koduku le kadaa,,valla ki maatram vella tho eminaa paata pagalu unnaayaa ??pi valla aadesaanni paatinchatame gaa vaallu chesindi..police vallu chanipoinappudu valla tallula gundelu aaginaayi..valla bhaaryala pustelu tegaayi..

    ReplyDelete
  2. :-)))))))))))) avunu kadhaa! thalli kadupu kota
    chimmina vecchani rudhiram kanna chikkanidi.

    ReplyDelete
  3. మావోయిస్టులు ఎంత మంది ని పొట్టన పెట్టుకుంటున్నారు? వాళ్ళకి తల్లులుండరా? వాళ్ళకి గుండెకోత వుండదా?

    ReplyDelete
  4. నేను అక్కడ ఓ కన్న తల్లి కడుపుకోత గురించి మాత్రమే రాశాను. రాజ్యం చేసిన కసాయి తనం కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.. కేవలం ఓ అమ్మ ఆవేదన రాశాను. అతను నక్సలైట్ అయినందుకు చంపేశారా.. పోలీసులు చంపేశారా.. అన్నది అప్రస్తుతం.. అయితే ఒక కాజ్ కోసం పోరాడుతున్న వ్యక్తని రాజ్యం అడ్డుతొలిగించుకున్న మాట మాత్రం వాస్తవం... అయితే పోలీసులను అంతమొందిస్తున్న మావోయిస్టులు కరెక్టని నేను చెప్పను కానీ.. రానున్న ముప్పును తప్పించుకోడానికి, తమ ఉనికి చాటుకోడానికి మావోయిస్టులకు ఆ పనులు తప్పని సరి అవుతోంది. ఎదురుగా వాళ్ల తమ్ముడో అన్నో పోలీసు వేశంలో ఉన్నా వారి ప్రమేయం లేకుండానే గన్ను పేలుతుంది. అయితే.. పులి బోనులోకి విసిరేసే వాడే నిజమైన హంతకుడు. మావోయిస్టులకు ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. పోలీసులను వర్గ శత్రువులుగా భావస్తారని తెలిసి కూడా వారి పైకి అమాయక చిరుద్యోగులను ఉసిగొల్పడం ప్రభుత్వం చేసే హత్యే.. పులి రక్తం తాగుతుంది. అది బోనులో ఉంది. ఆ బోనులోకి దేన్ని విసిరినా.. శత్రువనుకున్నా.. ఆకలిగొన్నా.. రక్తం తాగుతుంది. అది దాని నైజం బ్రదర్స్.. వ్యాసానికి స్పందించిన అందరికీ ధన్యవాదాలు..

    ReplyDelete
  5. రాజ్యం వున్నది పులి నుండి మిగిలిన జీవులని రక్షించడానికి బ్రదర్.... చీకట్లో బతికే వారు వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసమే తప్ప.. జనాల్ని వుద్దరించ డానికి కాదు.. వుద్యమాలు ఎప్పుడొ దారి తప్పాయి... రాజకీయ నాయకుల కను సన్నులలోనే నడుస్తున్నాయి....

    ReplyDelete
    Replies
    1. rajyam... nayeem perutho.. patolla govardhan nu, sambasivunni.. avasaram anukunte ninnu, nannu kooda champuthundhi.. rajyame pedda puli.

      Delete
  6. ayya janardhan gaaru... police vaadu eppudaina chanipothe intha range lo news lo eppudaina chinna line lo aina cheppukunnara... kaani ade oka mavoist pothe mathram racha racha chestharu... sir ee dukanam close cheyyandi... mana desham lo chala samasyalu unnai.. vaati gurinchi alochinchandi.. chattam evvarikee chuttam kaadu.. orders unte CM ni arrest chese rights kuda police vallaku untai.. oka vela ade police department manakenduku ani okka 1 hrs calm ga unte thamari paristhithi ento okka saari alochinchandi... samasyalu leni prantham chupinchandi... samasya parishkaraniki margam eduru daadi.. raktha pathalu kaavu Mr Janardhan. Inko saari prabhuthvam paina police paina velethi chupe mundu aa arhatha manaku unda anedi okka saari prashnichukondi... adi konchem better...

    ReplyDelete
  7. rajyam maoist lanu enduku champuthundho telusa..? maoist la gurichi matlade gaddar nu Emi anadhu enduku..? longi poyina sambasivunni champindevaru.. thelusa ? vimalakka, amar ela bayata thiruguthunnaro thelusa..? kishan ji Emanna sampadinchada.. rajyam mines nu kollagottakunda addukuntunnadani lepesharu.. naaku samajam meedha poorthi sthayi avagahana vundhi. nuvvu adhyayanam cheyi. tharvatha comment cheste baguntudi. thanku u for responding.

    ReplyDelete