ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, November 18, 2009

యగంతం వట్టిమాట

యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న మాట డిసెంబర్‌21, 2012. ఈ తేదీ నుంచి ప్రపంచం అంతమై తిరిగి కొత్త సృష్టికి పునాదులు పడతాయని కథనాలు వినిపిస్తున్నాయి. దీనకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కారణాలు చెబుతున్నారు. ఇందులో ఏ ఒక్కటి జరిగినా వినాశనం తప్పదని చెబుతున్నారు... అయితే వీరు చెప్పే కథలన్నీ కట్టుకథలా...కల్పనలా.. ఇవన్నీ నిజమయితే వీటికి శాస్ర్తీయమైన ఆధారాలేమైనా ఉన్నాయా... వీటి గుట్టు విప్పే స్పెషల్‌ స్టోరీ
ప్రళయం..యుగాంతం..డూమ్స్‌డే... రెండవ రాకడ. పదాలేవైనా కావచ్చు.. సాహిత్యం ఏదైనా కావచ్చు..అన్నిటి సారం ఒకటే. రానున్న రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని భాష్యం చెబుతున్నాయి.అయితే ఈ మత గ్రందాలల్లో యుగాంతం ఎప్పుడు జరుగుతుందో స్పష్టమైన తేదీలను ప్రకటించడంలో స్పష్టత లేదు. ఆయా కాలమాన ప్రకారాలను బట్టి వారి కేలండర్ లెక్కల ప్రకారం సృష్టి అంతానికి లెక్కలేసి మారీ చెప్పారు. ఆ కాలండర్‌ లెక్కలు మనవారికి అర్దం కాకపోవడమే పుకార్లు రేపే వారికి కలిసి వచ్చింది.
అసలు యుగాంతం వస్తుందని ఎవరు చెప్పారు.ఒకవేళ ప్రళయం ముంచుకొచ్చినా అది ఏ రూపంలో వస్తుంది.. ఒక్కో శాస్ర్తం ఒక్కోరకంగా చెబుతోందట. అసలు శాస్ర్తం చెబుతుంది అనే కంటే మనవాళ్లు చెబుతున్న కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.మాయన్‌ కాలండర్‌..ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న మాట... ఈ కాలండరే యుగాంతాన్ని సూచించిందని చెబుతున్నారు.ఎందుకంటే అన్ని కాలండర్‌ల కంటే కూడా ఈ కాలండర్‌ 99శాతం భవిష్యత్తుని వాస్తవానికి దగ్గరగా చెప్పిన కాలండర్‌. 2012 డిసెంబర్‌ 21తో ఈ కాలండర్‌ ముగుస్తుంది.అంటే అక్కడి నుంచి ఇక ప్రపంచంలో జీవ రాశికి భూమిపై మనుగడలేదని అభినవ నోస్ర్టడామస్‌లు భాష్యం చెబుతున్నారు. ఈ కాలండర్‌ ప్రకారం 2012లో ఖగోళ అద్బుతాలు జరుగుతాయని, ఇవి భూమిపై జీవరాశి మనుగడకు ముప్పుతెస్తాయని వాదిస్తున్నారు. అంతే కాదు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు.
ఇది వాస్తవమేనా....అది తెలుసుకునే ముందు అసలు మాయన్‌ కాలండర్‌ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెక్సికో యుకటన్‌ ద్వీపకల్పంలో అతి ప్రాచీన నాగరికత మాయన్‌ .వీరి శాస్ర్తపరిజ్ఞానం ప్రకారం అనాటి గ్రహగతులను అనుసరించి క్యాలండర్‌ తయారు చేశారు. ఈ క్యాలండర్‌ ప్రకారం ఒక్కో సంవత్సరంలో జరిగే సంఘటనలను చిత్రీకరించారు. ఇవి కేవలం ఖగోళ లెక్కలకు సంబంధించినవి మాత్రమే. ఈ కాలండర్‌లో ఇతర విషయాలు అనేకం పొందు పరిచినా అవి బయటి ప్రపంచానికి సంబంధం లేనివి. కొన్ని కేవలం వారి నాగరికతకు మాత్రమే సంబందించినవి. కొన్ని వారి సంప్రదాయాలకు అలవాట్లకు సంబంధిచిన వివరాలున్నాయి. వాస్తవానికి ఈ కాలండర్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేసే పూర్తి స్థాయి పరిజ్ఞానం ఎవరికీ అందుబాటులో లేదు. మన కాలండర్‌లలో గ్రహణాలు, కాలాలు, రుతువులను లెక్కగట్టినట్టే వారు కూడా కొన్ని వేల సంవత్సరాలకు సరిపోను క్యాలండర్ తయారుచేసి పెట్టుకున్నార.ఇవి చిత్రరూపంలో తయారు చేసి పెట్టుకున్నరు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మన పంచాంగం లాంటిదే.. అయితే మన పంచాంగంలో అన్నీ అనుకున్నట్టు జరగనట్టే ఈ మాయన్‌ క్యాలండర్‌లో కూడా అన్ని అంశాలూ వాస్తవాలు కావంటున్నారు దీని గురించి అధ్యయనం చేసిన వాళ్లు.
అసలు వచ్చిన చిక్కల్లా మాయన్‌ కాలండర్‌ 2012తో పూర్తి కావడమే ఇన్ని అపోహలకు దారి తీసింది. మాయన్‌లు చాలా తెలివైన వారని, ఒక యుగానికి సరిపోనూ క్యాలండర్‌ను రూపొందించుకున్నారని వీరు చెబుతున్నారు. అయితే 2012తో ఈ కాలండర్‌ పూర్తికావడమే ఇన్ని పుకార్లకు ఊతమిచ్చింది. ఈ కాలండర్‌ ప్రకారం 2012లో భూమి పై అద్బుతాలు జరుగుతాయని, అంతరిక్షంలో మార్పులు సంభవిస్తాయని వివరించారు. ఇవి మానవ మనుగడకు ప్రమాదకరమని తెలిపారు. ఈ విషయం చెప్పుకునే ముందు మనం మరో విషయం తప్పక గుర్తుంచుకుంటే అసలు విషయం తేట తెల్లం అవుతుంది. వీరి క్యాలండర్‌లో ఒక్క 2012లోనే కాదు క్యాలండర్‌లో చాలా సంవత్సరాలలో ఈ డిజాస్టర్‌ల ప్రస్తావన ఉంది. కానీ కేవలం 2012తో ఈ కాలండర్‌ ముగుస్తుండటంతో అక్కడి నుంచి క్యాలండర్ అక్కర్లేదని మాయన్‌లు భావించారని సూత్రీకరిస్తున్నారు మన వాళ్లు కొందరు.
కానీ మాయన్‌ కాలండర్‌ని బాగా అధ్యయనం చేసినవారు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అంతేకాదు అబద్దపు ప్రచారాలతో మాయన్‌ నాగరికతనే తప్పుబట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండి పడుతున్నారు. మాయన్‌ లెక్క ప్రకారం 2012కి ఒక శకం పూర్తవుతుంది. దాని తర్వాత మరో శకం మొదలవుతుంది. ఒకవేళ మాయన్‌ నాగరికత కొనసాగి ఉంటే ఆ తర్వాత శకానికి సరిపోను క్యాలండర్ రూపొందించే వారని తెలిపారు. అంతేగానీ ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా కాలండర్‌ పూర్తవగానే ప్రళయం వస్తుందని ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమంటున్నారు శాస్ర్తవేత్తలు.
నిజంగా మాయన్‌ క్యాలండర్ భూ ప్రళయం వస్తుందని చెప్పలేదా... హమ్మయ్య ఇప్పటి వరకూ హడలి చచ్చాం అనుకుంటున్నారా..అవును మాలాగ విప్పి చెప్పేవాళ్లుంటే మీరిలాగే రిలాక్సవుతారని తెలీదా ఏంటి. అందుకే మాయన్‌ కాలండర్ ఒకటే కాదు ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకు పోవడానికి మరో కారణం కూడా ఉందట.సూర్యుడు..ఈ భూమిపై సకల జీవ జాతుల మనుగడకు కారణభూతం... అటువంటి సూర్యుడే ప్రళయకాల రుద్రుడై కబళిచ బోతున్నాడట. సూర్యగోళంలో పేలుళ్లు సంభవించి వాటి ప్రభావం భూమి పై నున్న జీవరాశి పై పడుతుందని వీరి వాదన. సూర్యుని ఉపరితలం పై ఉన్న సన్‌స్పాట్ల నుంచి విడుదలయిన మాగ్నటిక్‌ వేవ్స్‌ భూగోళం పై ఉన్న సమస్త జీవరాశిని ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా, భూ ధృవాలను కూడా తిమ్మిని బమ్మిని చేస్తుందని వీరు వాదిస్తున్నారు. అంటే ఉత్తర ధృవం దన ధృవంగానూ, దక్షణ ధృవం ఉత్తర ధృవంగానూ మారతాయట. అంటే అప్పటినుంచీ మనం సూర్యుడు పడమర ఉదయిస్తాడని చదువు కోవాన్నమాట. అసలు చదువుకోడానికి మనం బతికి ఉంటేగా అని భయపెడుతున్నారు వీళ్లు.నిజంగా సూర్యుడు మనకు అపకారం చేయబోతున్నాడా..ఈ విషయం తెసుకునే ముందు అసలు సూర్యుడంటే ఏంటో తెలుసుకుందాం...సూర్యగోళం భూమికంటే ఎన్నోరెట్లు పెద్దది. ఇది హైడ్రోజన్‌ ఇంధనంగా భగభగా మండుతుంది. ఈ అత్యోష్ణంలో హైడ్రోజన్‌ అయానులు సంలీనం చెంది హీలియం అయానులుగా మారుతాయి. అణు విచ్చిత్తిలో వెలువడిన శక్తే అణువిలీనంలో కూడా ఏర్పడుతుంది. అంటే ఒకరకంగా చెప్పాలంటే సూర్యడిలో నిరంతరంగా లక్షలాది అణుబాంబులు పేలుతున్నాయన్నమాట. మన అణుబాంబులు పేలినపుడు వెలువడే రెడియేషన్‌ అక్కడ కూడా విడుదలవుతుంది. అయితే అది మనదాకా రాదు.ఈ సూర్యుడి ద్రవ్యరాశి అంటే బరువు సౌరకుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల మొత్తం బరువు కన్నా కేవలం పది శాతం మాత్రమే తక్కువ ఉంటుందని శాస్ర్తవేత్తలు లెక్కగట్టారు.సూర్యుడి ఉపరితలంలో ఉన్న సన్‌స్పాట్‌ల నుంచి నిరంతరం మాగ్నటిక్‌ వేవ్స్‌ రిలీజ్‌ అవుతూనే ఉంటాయి. వీటి సంఖ్య ఒక్కోసారి తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల మనకు వచ్చే ముప్పు ఏమీలేదు. అలా ముప్పు జరిగేది ఉంటే 11 ఏళ్లకొకసారి ఈ భూమి భ పటలం అయ్యేది. సో సూర్యుడి వల్ల కూడా మనకు అపాయం లేదు.సూర్యని వల్ల కూడా భయం లేదని అప్పుడే సంబర పడిపోకండి. అన్నిటికన్నా అత్యంత భయంకరమైన, ఎవరూ కాపాడలేని ముప్పొకటి పొంచి ఉందట. దాని వల్లనే గతంలో ఈ భూమి పై చాలా జీవరాశులు నశించిపోయాయట. ఆ కథలన్నీ కంచికి పోయాయికానీ..మనల్ని మాత్రం కాశీకి చేర్చే కథొక్కటి సిద్దం చేశారు. దీనికీ మన పురాణాలకూ, బైబిల్‌, ఖురాన్‌లు కూడా ఇదే చెబుతున్నాయని లింకు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ భూమి పుట్టిన దగ్గర్నుంచి దీనికో గండం ఉంది. ఈ అనంత విశ్వంలో అనేక గ్రహశకలాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇవి వాటి కక్ష్యలో అవే తిరుతుంటాయి.కానీ ఇవి భూమికి దగ్గరగా వచ్చినపుకు మాత్రం అవి తమ దిశ మార్చుకుంటున్నాయి. కక్ష్యా వేగంలో మార్పులు చేసుకుంటున్నాయి. ఇలా కక్ష్య దాటి భూమిపైకి వచ్చి భూమిని ఢీకొన్న గ్రహశకలాలకు లెక్కలేదు. అయితే కొన్ని భూ వాతావరణంలోకి రాగానే భూమిని తాకకుండానే పేలిపోతాయి. వాటినే మనందరం చుక్కతెగిందంటూ పిలుచుకుంటా. మరికొన్ని మాత్రం భూమికి మరీ దగ్గరగా వచ్చిపేలిపోతే ఇంకొన్ని సముద్ర గర్బంలోకి దూసుకుపోతాయి. ఇవి ఆకాశంలోనే పేలిపోవడమా లేక భూమిని చేరడమా అనేది వాటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
ఈ గ్రహశకలాలు చిన్నవయితే ఆకాశంలో పేలుతాయి. కాస్త పెద్దవయితే భూమికి దగ్గర్లో పేలిపోతాయి. మరీ పెద్దవయితే భూమిని తాకుతాయి. అధృష్టవశాత్తూ ఇప్పటి వరకూ అత్యధికం సముద్రంలో కూలినవే అధికం. కాబట్టి ఏ ప్రమాదమూ రాలేదు. మరి గ్రహశకలాల మాట అటుంచి మన భూమిని ఏకంగా ఒక కొత్త గ్రహమే ఢీకొంటే... ఆలోచన వచ్చిందే మొదలు కొత్త గ్రహం గురించి పుంకానుపుంకానుగా పుకార్లు పుట్టించారు. అ గ్రహం పై కూడా కాసేపు విహరించండి మరి.సౌరకుటుంబంలో ఇప్పటి వరకూ మనకు నవగ్రహాల గురించే తెలుసు. కానీ తాజాగా పదవ గ్రహం వెలుగులోకి వచ్చింది. దాని పేరే నిబ్రో. దీన్నే ఎక్స్‌ గ్రహం అని కూడా పిలుచుకుంటున్నారు. దీన్ని మొట్ట మొదట సుమేరియన్‌లు గుర్తించి నట్టు చెబుతున్నారు. ఈ గ్రహం 3600 సంవత్సరాలకొకసారి గురు, శుక్రగ్రహాల మధ్య గుండా ప్రయాణిస్తుందని సుమేరియన్‌లు తెలిపారు. ఈ సారి ఈ గ్రహం శుక్ర గ్రహం ఇవతల నుంచి అంటే భూమికి శుక్రగ్రహానికీ మధ్యనుంచి ప్రయాణించబోతోందని, అది భూ ప్రభావానికి భూమి వైపు ఆకర్షించబది భూమిని ఢీకొనే ప్రమాదముందని ప్రచారం చేస్తున్నారు. ఇది సరిగ్గా సముద్రం మధ్య ఢీకొని సముద్రాలు ఉప్పొంగి భూగోళం పై ఉన్న నాలుగోవంతు భూమి మొత్తాన్ని ముంచేస్తుందని చెబుతున్నారు. ఒక వేళ నేలను ఢీకొంటే భూగొళం పేలిపోయి ముక్కలు చెక్కలు విడిపోతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతోబాటు అపోసిస్‌ అనే గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టబోతోందని చెబుతున్నారు. దీన్ని మత గ్రంధాలకు కూడా లింకు పెట్టి మరీ భయపెడుతున్నారు. పాపులను తుడిచిపెట్టేందుకు యేసు భూమిపై పెద్ద బండ వేస్తాడన్న బైబిల్‌ వాక్యంలోని మాటలకు ఇదే అర్దం మని చెబుతున్నారు. ఖురాన్‌లో కూడా ఇదే అర్దాన్ని స్పురింపజేసే డూమ్స్‌ డే కూడా ఇదేనని చెబుతున్నారు. అంతేకాదు బ్రహ్మంగారు చెప్పిన నిప్పుల వర్షం కూడా ఇదేనట. ఇవన్నీ విన్నాక కూడా ఎంత తెలివి కల వాడైనా నమ్మితీరాల్సిందే.
వాస్తవానికి సౌరకుటుంబంలో దశమగ్రహమనే ప్రస్తావనే లేదు. ఈ విషయాన్ని నాసా శాస్ర్తవేత్తలే చెబుతున్నారు. నిబ్రో అనేది కానీ, ప్లానెట్‌ ఎక్స్‌ అనేదైనా కేవలం అభూత కల్పనని నిపుణులు తేల్చేశారు. దాదాపు పది సంవత్సరాల వరకు భూమివైపు వచ్చే గ్రహ శకలాలు, వాటి పరిణామం, ఉధృతి,వేగం అన్నీ అధ్యయనం చేసి ఉంచుకున్నారు. దాదాపు నాలుగొందల కోట్ల ఏళ్ల వరకూ భూమికి హానిచేసే గ్రహశకలాలేవీ ఇప్పటి వరకు ఆచూకీ లేవు.2012లో భూమిని ఢీకొనే గ్రహం ఏదైనా ఉంటే ఇప్పటికే భూమికి అత్యంత సమీపంలోకి వచ్చి ఉండాలి.కానీ ఏ గ్రహం కానీ గ్రహ శకలం కానీ ఇప్పట్లో భూమి వైపు వచ్చేవి లేవు. ఒకవేళ పెద్ద పరిమాణముండే గ్రహశకలాలేవైనా ఉన్నా వాటిని తప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ తమ వద్ద ఉన్నాయని నాసా శాస్ర్తవేత్తుల భరోసా ఇస్తున్నారు.
అప్పుడే ఊపిరి గట్టిగా పీల్చుకోకండి. ఎందుకంటే బయటగ్రహాలనుంచి భయం లేకున్నా మానవ తప్పిదాలే మరో మూడేళ్లలో మనల్ని మట్టుబెడతాయట. భూమి తనకు తానే కుంగిపోయి కొత్త తొడుగు తొడుక్కుంటుందట. అదెలాగంటారా. ఇదిగో ఇలాగే...
భూగోళం అనేక పోరలతో నిర్మితమై ఉంది. ఈ పోరల్లో అప్పుడప్పుడూ సర్దుబాట్లు జరుగుతుంటాయి. అందులో బాగంగానే భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. భూ కేంద్రంలో సలాసలా ఉడకిపోయే లావాద్రవం ఉప్పొంగుతుంటుంది.ఇది అగ్ని పర్వతాల రూపంలో బద్దలయి భూ ఉపరితలం పై ప్రవహిస్తుంది. అయితే కొన్ని సార్లు ఇవి ఉగ్రరూపం దాల్చి చాలా ప్రాంతాలను తమ నిప్పుశిఖలతో ముంచేస్తుంటాయి. అమెరికాలోని ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం ఇదే విధంగా బద్దలు కాబోతుందని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మనుషులు చేస్తున్న కాలుష్యం మూలంగా భూ వాతావరణం కూడా వేడెక్కబోతోంది. వీటికి తోడు ఓజోన్‌ పొర దెబ్బతిని సూర్యకిరణాలు, అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకి జీవజాలం పై ప్రభావాన్ని చూపుతాయట. ఈ వేడికి మంచు పర్వతాలు కరిగి సముద్రంలో కలిసి భూమిని ముంచెత్తుతాయని చెబుతున్నారు. అంతే కాదు మన శాస్ర్తవేత్తలు చేస్తున్న బిగ్‌బాంగ్‌ ప్రయోగంలో పుట్టుకొచ్చే బ్లాక్‌హోల్స్‌ కూడా భూమిని మింగేసే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు సోకాల్ట్‌ భవిష్యదార్శినికులు. ఇందులో వాస్తవమెంత ఉన్నా అది అంత తొందరగా 2012 కల్లా భూమి బద్దలయ్యేంత ప్రమాదమయితే లేదని శాస్ర్తవేత్తలు భరోసా ఇస్తున్నారు.ఇదండీ భూ ప్రళయం 2012 అసలు కథ. ధనార్జనే ధ్యేయంగా కొన్ని సంస్థలు చేస్తున్న ఆర్బాటమే అసలు ప్రళయం. భూమికి వచ్చే ప్రళయం మాట ఎలా ఉన్నా ఈ పేరుతో తీసిన సినిమా కాసుల ప్రళయం సృష్టిస్తుంది.

సెజ్

ఆశలు ఆకాశంలో... విధులు ముఖద్వారంలో
సెజ్‌లపై స్పెషల్‌ స్టోరీ
-గుర్రం సీతారాములు
రీసెర్చ్‌ ఫెలో EFLU
ఈ మధ్య వెస్ట్‌ బెంగాల్ నుంచి సమంతా అగర్వాల్ అనే రీసెర్చ్‌ స్టూడెంట్ తన ప్రాజెక్ట్ లో భాగంగా పోలేపల్లి సెజ్‌ ప్రాంతాన్ని చూడాలనీ, ఆ విషయాన్ని HBT గీత గారు ఫొన్‌ చేసి నన్ను కూడా వెళ్లమంటే వెళ్లాను. అక్కడికి వెళ్లకముందు అది చిన్న పల్లెటూరని భావించాను. అక్కడికి వెళ్లాక విశాలమైన హైవేను చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న ఊరికి ఇన్ని హంగులు ఏమిటా... అనిపించింది. కొంచెం ముందుకు వెళ్లగా నాకు ఏ బెంగుళూర్‌, బొంబాయి, ఢిల్లీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లకు వెళ్లినట్టు అనిపించింది. ఎక్కడెక్కడి మల్టీనేషనల్‌ కంపెనీలు ఆ వూరిమీద గద్దల్లా పడ్డారేమో అనిపించింది. మల్టీప్లెక్స్‌ బిల్డింగ్‌లు, వాటి చుట్టూ పటిష్టమైన ఇనుపకంచె, విద్యుత్‌ లైన్‌లు చూస్తే ప్రభుత్వానికి ఆ ఊరిమీద మమకారం కంటే ఇండస్ట్రియల్‌ పార్క్‌ మీద ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్ధమవుతూనే ఉంది.
కొంచెం ఊళ్లోకి వెళ్ళాక ఊరి నిజ స్వరూపం కనబడింది. ఏ ఒక్క ఇల్లూ సఖంగా ఉన్నట్టు అనిపించలేదు. ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లే. ఇంటింటా విషాదం తాండవం చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పని చేసిన వ్యక్తులు చేసేందుకు చేతినిండా పనిలేక గుంపులు గుంపులుగా రచ్చబండ దగ్గర దిగాలుగా కూర్చున్న దృశ్యం నన్ను కదిలించింది. ఊళ్లో ఎక్కువ మంది తగిన ఉపాధి లేక ఇళ్లకు తాలాలు వేసి వలస పోయిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
పోలేపల్లి, దాని సమీపంలోని గుండ్లగండ్ల తండ, ముదిరెడ్డిపల్లి, మాచారం, కిష్టారం, ఈ విషాదం బారిన పడ్డ గ్రామాలు, ఉపాధి లేదనే నిస్సహాయత, వలసల మానసిక వ్యాకులతతో అసహజ మరణాలు చెప్పనలవికానివి. ప్రక్కనే ఉన్న ఓ తండాలో అరవై సంవత్సరాలు దాటిన ముసలవాళ్లు, చిన్న పిల్లలు మాత్రమే మిగిలారు. బాధాకరమైన విషయమేమిటంటే ఎవరైనా చస్తే పీనుగను బొంద పెట్టడానికి కూడా నేల లేకుండా చేసిన వైనం ఆ తండాలో నాకు కనిపించింది. ఏ వ్యక్తిని కదిలించినా కళ్లలో నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఉపాధి, పక్కా గృహం అనేది ఒట్టి మాటే అని నాలుగు ఏళ్ల తర్వాత తెలిసింది. నేను మందలించిన ప్రతి ఇంట్లో మనాదితో అసహజ మరణాలు సంభవించాని, అసహజ మరణాలకు నిలయమైన ఆంధ్రదేశంలో అక్కడ జరిగిన మరణాలు కేవలం ఇంతకాలం తాము నమ్ముకున్న భూమి కళ్లముందే కబ్జా దారులకు ఆటస్థలంగా మారిన వైనం, అదే భూమిలో, ఊడ్చేవాడుగా, తూచ్చేవాడుగా, సెక్యురిటీ గార్డుగా మారడమే విషాదం. ఉపాధి అంటే ఇదేననే సత్యం తెలుసుకొనేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. తమ భూములకోసం ధర్నా చేస్తున్న తమ తోటి వాళ్లను తామే తమ యజమానులకు మానవ కవచాలుగా మారడం ఎంత విషాదం. ఈ విషాదంలో అత్యధికంగా నష్టపోయిన వాళ్లు దళిత బహుజనులు, దాదాపు మూడు వందలకు పైగా ఎసైన్డ్‌ భూమి, మిగతాది పట్టాభూమి, ఇచ్చిన పరిహారంలో ఎసైన్డ్‌ భూమికి అతి తక్కువగా ఇచ్చి పట్టా భూములకు మాత్రం నలభై వేల వరకు ఇచ్చినట్టు తెలిసింది.
ఇక్కడ మేథావులు అంటున్నట్లుగా తొండలు గుడ్లు పెట్టే భూమికి లక్షనుంచి మూడు లక్షలు ఇవ్వడం అనేది వట్టిమాట. ఉన్న భూమితో ఏం బ్రతికి బట్టకడుతున్నా. మట్టి పిసుక్కొని చస్తున్నది వాస్తవమే అయినప్పటికీ చస్తే బొందపెట్టడానికి నాలుగు గజాల నేలకూడా లేకుండా గుంజుకున్న వైనం ఎలా విస్మరిస్తాం. కొంతమందన్నట్టు సెజ్‌వల్ల బాగా భూములకు విలువలు పెరిగి లాభపడ్డది అగ్రవర్ణాల వాళ్ళు. నోటిఫైడ్ ఏరియాలో భూమిపోగా, మిగిలిన భూమికి ఇరవై నుంచి నలభై లక్షల దాకా రేటు పలుకుతోంది. వందలమంది దళిత, బహుజను, గిరిజనులు మాత్రం ఎలా అర్దం చేసుకోవాలి. అక్కడ పెరిగిన రియల్‌ ఎస్టేట్ మూలంగా అగ్రవర్ణాల వాళ్లు బాగా భూములు అమ్మడం కొనడం జరుగుతుంది. ఆక్రమంలో కొంతమంది లాభపడితే పడవచ్చు కానీ దళితుల భూమికి పదివేలు ఇచ్చి తమ పక్కనే ఉన్న నోటిఫైడ్‌ ఏరియాలో లేని భూమి లక్షల్లో అమ్ముకుంటూ ఉంటే ఆ సమూహాలు అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఎలా వెలకట్టగలం చెప్పండి. ఇక్కడ ఎవరి అభివృద్దికి ఎవరు సమిధలు కావాలి. ఆ ఊళ్లో ఉన్న దళితురాలు ఉషాని సత్తెమ్మ తన వద్ద ఉన్న భూమిని గుంజుకొని తన కొడుకుకి పాయికానా కడిగే ఉద్యోగం ఇచ్చిన్రని కన్నీళ్ల పర్యంతమయింది. సెజ్‌ మూలంగా భూముల రేట్లు కోట్లలో పెరిగిన మాట వాస్తవమే కానీ , ఆకోట్లు ఎవరివి... మాల, మాదిగ, బైండ్ల, గౌండ్ల, వాళ్లవి కావే...! అని కొండపల్లి రత్తమ్మ వాపోయింది. అక్షమ్మ, రంగమ్మ, గంగపూరి బాలస్వామి గౌడ్‌, రవిగౌడ్ పానుగంటి అంజమ్మ ఒక్కరేమి కదిలిస్తే హృదయం ద్రవించుకుపోయే వెతలే...
ఇలా బడుగు బలహీన వర్గాల భూముల్ని అక్రమంగా లాక్కొని దేశానికి వెన్నముక అయిన రైతు నడ్డి విరుస్తున్నారు. కోట్లది రూపాయల సబ్సడీలు, అప్పనంగా వేలాది ఎకరాల ప్రోత్సాహకాలు అందిస్తున్న పాలక వర్గం రైతులకు ఎందుకు ప్రోత్సహకాలు ఇవ్వడం లేదు... ఎక్కడో చదివినట్టు గుర్తు. వ్యవస్థ సంఘర్షణలకు కేంద్రీకృతమైన భూమి సమస్య. ఆ భూమి లక్షలాదిమందిని అసమసమాజంగా మార్చిన కథ అది.
ఈజిప్ట్‌ సూయజ్‌ కాలువ త్రవ్వకాలలో లక్షలాది మంది నిర్వాసితులైనారు. వాళ్లంతా తమ భూములను తమకు ఇప్పించండని ప్రభుత్వం కోర్టులో కేసు వేశారు. విచారణ సందర్చంగా జడ్జ్‌ను ఉద్దేశించి ఓ అమాయక రైతు ఇలా వ్యాఖ్య చేశాడట. "అయ్యా! నాకు ప్రభుత్వం అనే దాయదు ఒకడు ఉన్నాడని, వాడు ఏనాటికైనా నా భూమి మీదకు వాటా కోసం వస్తాడని మా అయ్య నాకెప్పుడూ సెప్పలేదే"అన్నాడట అమాయకంగా..
ఇవాళ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో తమ వద్ద గుంజుకున్న భూమికోసం, ప్రభుత్వాల మీద, తమ ప్రాంత ఆధిపత్యం కోసం, దాని నుండి విముక్తి కోసం పోరాటాలు చేస్తున్నారు.
ఏ దేశమైనా అక్కడ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను బట్టి ఆ దేశ సామాజిక అభివృద్దిని కొలమానంగా గుర్తించవచ్చు. ఇది విశ్వవ్యాప్తమైంది. అలా ఇస్తున్న ప్రోత్సాహకాలు ఆ రైతులకు స్వావలంభన కలిగించాలి. ఆ క్రమంలో పెట్టుబడి దారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎంత తగ్గిస్తేం రైతు పెట్టుబడి దారులకు తారుమారు చేశారు. పాలక వర్గం పెట్టుబడిదారుల పక్షం కనుకనే నేడు దేశవ్యాప్తంగా సెజ్‌లు ప్రయాణం మెదలుపెట్టాయి.
ఈ భూ బాగోతాలు నేడు విశ్వవ్యాప్తం అయినవి మడగాస్కర్‌ అధ్యక్షడు మార్క్ రావలోమన 1.3మిలియన్‌ హెక్టార్‌ల భూమిని ఉత్తర కొరియా కార్ల కంపెనీ అయిన దేవ్యకు కేటాయించింది. మన దేశంలో బొంబాయి, నోయిడాకు చెందిన వరుణ్‌ ఇంటర్నేషనల్‌ మడగాస్కర్ దేశంలో భూములను కొనడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అక్కడ ఒక లక్షా డెబ్బైవేల తొమ్మిది వందల హెక్టార్‌లలో పంటలు పండించడం ఈ ఒప్పందంలో భాగం.
మన రాష్ట్రంలో ఇలాంటి నమూనాలకు బీజం వేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈపాపంలో భాగం ఆనాడు ఆ ప్రభుత్వాన్ని సమర్దించిన అన్ని పాలక పక్షాలకూ ఉంది. దీన్ని పసిగట్టేలోపే... ఈ విస్తరణా కాంక్ష మరింతగా పెరిగింది. లోతుగా పరిశీలిస్తే దిగ్బ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అవి... మిడిల్‌ ఈస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలు పాకిస్తాన్లో ఉన్న భూ ఆక్రమణకు దారులు వెతుకుతున్నాయి. సౌదీ అరేబియా కూడా దాదాపు 1.6 మిలియన్‌ హెక్టార్‌ల భూమిని ఇండోనేషియాలో కొన్నది. ఆకలితో అలమటించే ఇథియోపియా 2.7 లక్షల హెక్టార్‌ల భూమిని విదేశీ కంపెనీలకు దారాధత్తం చేసింది.
ఆయిల్‌ వ్యాపారంలో గుత్త పెట్టుబడి దారులుగా ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ మరియు భారత్‌, చైనా, దక్షణ కొరియాలలో ఉన్న భూములకు చౌకగా కొనాలని దాదాపు ఎనిమిది వేల మల్టీ నేషనల్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. దీన్ని బట్టి భూ ఆక్రమణ తీవ్రత ఎంత ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాకుండా అనేక కంపెనీలు, ఆఫ్రికాలో 3లక్షల ఎనభై వేల ఎకరాలను మరియు లాటిన్‌ అమెరికాలో, మయన్మార్‌, కెనడాలలో భూములను కొనడానికి అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి.
ఇక మున్ముందు పిన్స్‌రీ ఎస్టేట్‌ అవతారం ఎత్తబోతున్నాయి. అంతే కాకుండా karuturi global industrial Ltd. అనే కంపెనీ ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫాలసీ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద లాండ్‌ బ్యంక్‌ ఉన్న కంపెనీ అని అంటున్నాయి. ఆ కంపెనీకి ఉన్న భూమి దాదాపు మూడువేల చదరపు కిలో మీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్‌ మరే అని సగర్వంగా ఆ కంపెనీ చెప్పుకుంటుందట. బెంగుళూర్‌లో వేళ్లకు ఉన్న గుళాభీ తోటల పెంపకం వ్యాపారం ప్రపంచ ప్రసిద్ది చెందినది. నయావలస వాదం మళ్లీ ఈ విధంగా వికృత రూపం దాల్చిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.
పెట్టుబడి దారుని స్వభావం గురించి మార్క్స్‌ చెప్పిన ఒక విషయం యధాతదంగా చెప్పలేకపోయినా నాకు గుర్తున్న మేరకు ఇక్కడ అన్వయిస్తాను.
పెట్టుబడి దారుడు తనకు 20శాతం లాభం వస్తుందంటే తన విస్తరణను ఊరి సరిహద్దు దాటతాడని, 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, తాను మరణిస్తే 100శాతం లాభం వస్తుందని తెలిస్తే చనిపోవడానికి క్షణం కూడా ఆగడని ఆ స్థితిని కూడా బెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో వివరించాడు. దీన్ని ఇక్కడ కంపెనీల విస్తరణా కాంక్షకు సరిగా అన్వయించవచ్చు.
బాధాకరమైన విషయమేమిటంటే " ఇండస్ట్రియల్స్ ఆధునిక దేవాలయాలు" అని ప్రవచించిన పండిత నెహ్రూ వారసులు నేడు ఊళ్లను స్మశానాలుగా మారుస్తున్నారు. లార్సన్‌ టర్బో, యూనీలీవర్, మైక్రోసాఫ్ట్‌, అనేక టెక్స్‌టైల్, జూట్ మిల్లులు, అరబిందో ఫార్మాలు నేడు ఆధునిక దేవాలయాలు అయితే కావచ్చు కానీ ఆ దేవాలయాల మెట్ల దగ్గర బిక్షం ఎత్తుకుంటున్న సంఖ్య కూడా కోట్లలో ఉందనే విషయాన్ని విస్మరించవద్దు. కళింగనగర్, సింగూర్‌ , నెల్లూరు, ఘజియాబాద్‌, గోపాలపూర్‌, పోలేపల్లి, హైద్రాబాద్‌, పరిసర ప్రాంతాలు, నెల్లూరు, వైజాగ్‌. ఒరిస్సా, ఒక్కటేమిటి నేడు దేశమంతా భూమి కొంగలు తొక్కిన నారుమడిలాగా మారిపోబోతోంది. ఈ వైనాన్ని పసిగట్టకుంటే మన కాళ్ల కింద ఉన్న బారెడు నేల కూడా గుంజుకొని చస్తే పూడ్చడానికి గజం నేలకోసం వెతుకులాడే స్థితి సమీపంలో ఉంది.

Wednesday, October 7, 2009

నేటి తరం రచయత

రైటర్‌ టుడే
--జనార్దన్

ఇక్కడ అంపశయ్య పడకలు సిద్దం
ముళ్లపూలే ముద్దబంతులు
గ్రీష్మతాపమే హేమంతం
చిరునవ్వుల మాటున హిపోక్రసీ
మనసారా నవ్వలేని మోమాటం
నవ్వునాలుగు విధాలా చాటే
చాటుమాటల్లో దాగిన భవితవ్యం
అభిప్రాయాలూ ఆశయాలూ ఆవేశాలూ
మూటగట్టి ముంగిట్లో వదిలేయి
యాంత్రిక కవళికలను అతికించుకో
మనసును సీసాలో బిరడాతో మూసేయి
కీబోర్డుతో రాయాలి కీలుబొమ్మగా మారాలి
నీ క్రియోటివిటీ తలపులు బోడులు కావాలి
రాసిందే రాయి మళ్ళీ మళ్లీ రాయి
అఖరు వాడు రాసిందే కలికి తురాయి
నువ్వు నువ్వుకాదు నీది నవ్వుకాదు
భాషతెలిసిన భాండాగారానివి
బదులివ్వలేని బండరాయివి
నిజాన్ని నిర్దాక్షిణ్యంగా నీడలో నెట్టి
నీరెండలో నీటికోసం వెతికే ఆశావాదివి
నువ్వు నేటితరం హైటెక్‌ శ్రీనాథుడివి
బతుకుదెరువుకు బతిమాలుకుంటున్న పోతనవి
కార్పోరేట్‌ విషం నింపుకున్న పూతన బాధితునివి

Friday, September 25, 2009

కులాల వివరాలు జనాభా లెక్కల్లో

కులాల జనాభా అంశం తాజాగా తెరపైకి వచ్చింది.జనాభా సేకరణలో కులాల వివరాలు ఉండితీరాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో 1931లో బ్రిటీష్‌ వారు సేకరించిన వివరాలను బట్టి కేటాయింపులు జరుగుతున్నాయి. బిసిలకు సంబందించి సంక్షేమనిధులు కేటాయించాల్సి వచ్చినప్పుడల్లా ఇదే వివాదం వెంటాడుతోంది. 1931లో బ్రిటీష్‌వారు జనాభా లెక్కల్లో కులాలను చేర్చడం ఒక కుట్రగా మన జాతీయ నాయకులు అభివర్ణించారు. మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం కాబట్టి కులమతలకతీత మైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటామని నాటి నాయకులు కలలు కన్నారు. కానీ నేడు కులాల ప్రభావం సమాజంలో తీవ్రంగాఉంది.వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లకు నిధులు కేటాయించ వలసి వచ్చినపుడల్లా సమాజంలో బిసిల శాతమెంత అనే సందేమం తలెత్తుతూనే ఉంది. అయినా వీరికి సంక్షేమ నిదులు కేటాయించాల్సి వచ్చినా, రిజర్వేషన్‌లు కేటాయించాలన్నా 1931లెక్కల ప్రాతిపదికనే కేటాయిస్తూనే వస్తున్నారు. దీనిలో ఉన్న ఔచిత్యమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కులాల వారీగా వివరాలు సేకరించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిఎంకే అభ్యర్దనను సుప్పీంకోర్టు తీర్పుచెప్పింది. దీని వల్ల సామాజిక విద్వేషాలు పెరుగుతాయని అభిప్రాయపడిది. మండల కమీషన్‌ తమ సూచనలు చేసే ముందు కులాల వారీ జనాభౠ సేకరణ జరపాలని వరుసగా ముగ్గురు హోం మంత్రులను కోరింది. అయితే 1951 నుంచి కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించ కూడదన్న నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్ణయానికి కేంద్రప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉంది. జనాభా లెక్కలు సరిగా లెకపోవడం వల్ల ప్రతి సామాజిక వర్గం తమ జనాభా లెక్కలు ఎక్కువ చేసి చెప్పుకుని రాజకీయంగా, ప్రభుత్వ పథకాల్లో వాటాలు అధికంగా పొందుతున్నారనే వాదన ఒక వైపుఉంటే, ఎప్పుడో వేసిన లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని తమకు సరియైన ప్రాతినిధ్యం కల్పించడం లేదనే వాదన కూడా ఉంది. అయితే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే కులవిద్వేషలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది, కావున సమాజంలో ఆర్దిక అసమానతలు రూపుమాపాలంటే , భిన్న సామాజిక వర్గాలలో ఆర్దిక స్థితిగతులను సర్వే చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. దీని ద్వారా ఆర్దిక అసమానతలు రూపుమాపవచ్చని, కేవలం కులాల వెనకబాటు కాకుండా ఆర్దిక వెనకబాటు నుండి రక్షించాలన్న వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రతీసారీ ప్రభుత్వానికి ఇదో కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ది చెందిన కొన్ని బి.సి కులాలను ఓసిల్లో కలపాలనే నిర్ణయానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే కొన్ని కులాలను బి.సి జాబితాల్లో కలపాలనే నిర్ణయానికి కూడా సరియైన లెక్కలు లేవు. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఎంతమంది సామాజిక ఆర్దికంగా బలపడ్డారు అనే అంశాలకు సంబందించిన సమాచారం ప్రభుత్వం వద్దలేనేలేదు. దేనికైనా బ్రిటీష్‌ వాళ్ల లెక్కలపై ఆధారపడాల్సిందే. దీని వల్ల అనేకరకాలయిన న్యాయపరమైన చిక్కుల వివాదాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ 2011లో జనాభా లెక్కలు సేకరించాల్సిన తరుణం ఆసన్నమయింది. ఇప్పుడయినా ఈ సమస్యను అదిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2011లో సేకరించబోయే జనాభా లెక్కల్లో కులం వివరాలు ఉండేలా చూడాలంటే కేంద్రన్యాయ శాఖా మంత్రి వీరప్పమెయిలీ ప్రధానికి లేఖ రాయడంతో ఈ చర్చ ఇప్పడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Friday, September 18, 2009

నా ఫోటో ఇది కూడా

నా ఫోటో ఇది కూడా

నా ఫోటోలు

Monday, September 14, 2009

రాజాలా బతికిన రోజాకు గడ్డు కాలం

చంద్రబాబు నాయుడికి టాటా చెప్పిన రోజాకు కాంగ్రెస్ లో వెల్ కం చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయారు. ఆమె నిర్ణయం తీసుకున్న సమయం సరిగ్గాలేదు. ఒక నెల ముందు అయితే వైఎస్ ఆమెకు ఆహ్వానం పలకమని తన మనుషులను పురమాయించి ఉండేవారు.తెలుగుదేశం తరఫున గత ఎన్నికల్లో చక్కగా గళం విప్పిన రోజా ఇప్పుడు ఆ పార్టీని వీడిపోవడం చంద్రబాబు నాయుడికి బాధాకరమే.రోజాకు తెలుగుదేశంలో ఆదరణ పోవడానికి ప్రధాన కారణం నన్నపనేని రాజకుమారి అని తెలుస్తోంది. రెడ్డి కులస్ధురాలైన రోజా కాంగ్రెస్ కోవర్టులా తెలుగుదేశంలో వ్యవహరిస్తోం<దని ప్రచారం ఉధృతం కావడంతో ఉక్కిరి బిక్కిరై రోజా టిడిపికి గుడ్ బై చెప్పవలసి వచ్చిందని తెలుస్తోంది. చాలా గట్టి అభ్యర్ధి అయిన గల్లా అరుణకుమారి మీద తనను నిలబెట్టడం కుట్రలో భాగమేనని రోజా ఆలస్యంగా తెలుసుకుంది. ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం కొత్త్తే అయిన రోజాకు ఎన్నికల సమయంలో ఈ విషయం తెలిసినట్టు లేదు. తెలుగుదేశం గుడ్ విల్, తన గ్లామర్ కలిసి తనను సులభంగా గట్టెక్కిస్తాయని ఆమె భావించారు. గల్లా అరుణ కుమారిపై రోజా గెలవలేదన్న విషయం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు. బరిలోకి దిగిన రోజా గ్లామర్ ను, కొంత సంపదను కోల్పోయింది.ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న సామెతను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని, మహిళారాజ్యం నాయకురాలు శోభారాణి నిజం చేసి చూపారు. రోజాది ఐరన్ లెగ్ అని ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం రోజాకు బాధ కలిగించి ఉండవచ్చు. ఆనాడు ఆమె తెలుగుదేశం లో చేరిన వెంటనే చంద్రబాబు నాయుడు అలిపిరి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే వైఎస్ మరణించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి గంగాభవాని, రాజకుమారి, శోభారాణి కారకులని రోజా భావిస్తున్నట్టు సమాచారం. మంచి భవిష్యత్తు ఉన్న యువ రాజకీయ నాయకురాలి ఆశలను ఇలా సీనియర్లు భగ్నం చేయడం తప్పే.ఈ దెబ్బతో రాజకీయాల మీద ఆసక్తి కోల్పోయిన రోజా సినిమాల మీద టీవీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

Monday, September 7, 2009

రాజకీయ వ్యభిచారం

రాజకీయాల్లో విలువలు ఏనాడో మట్టి కొట్టుకు పోయాయి. ఇప్పుడు ఏ మనిషి మనవాడో ఎవరు ఎప్పుడు పగవాడవుతాడో చెప్పడం అసాధ్యం అయిపొయింది. ఎంతో ఆర్భాటంగా పార్టీ పెట్టిన వెండితెర మెగాస్టార్ చిరంజీవి, పార్టీ నుంచి సరిగ్గా ఎన్నికల ముందు ఎంతో మంది విడిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం మీద బాగా చెప్పగలరు. ఎంత త్వరగా పార్టీ లోకి వచ్చారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిన నాయకుల చిట్టా తీస్తే చిరంజీవి కూడా ఇంకా బాగా చెప్పగలరు. ఫిరాయింపుల్ని చిరంజీవి ప్రోత్సహించక పోయినా కోవర్టులుగా కొంత మంది నాయకులని చంద్రబాబు పంపించిన మాట వాస్తవం అయ్యే విషయాన్నీ మనం కొట్టిపారేయలేము. అలాగే టీ.డీ.పీ కి ఒక కవచం లాగ కొమ్ము కాసిన నాయకురాలు రోజా ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవిని చెడామడా తిట్టి అధినేత మెప్పు పొంది ఎన్నో సార్లు మీడియా సాక్షిగా సామాన్య ప్రజానీకంయొక్క ఛీత్కారాలకు గురైన మాజీ నటి రోజా, చంద్రబాబు మన్ననలు పొంది, చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోసం ఎం.ఎల్.ఏ టికెట్ పొందింది. ఈమె కోసం సాక్షాత్తూ సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ని కూడా పక్కనెట్టాడు చంద్రబాబు. అయినా అధికార పార్టీ విజయం తో సీట్లు కోల్పోయిన చాలా మందిలో రోజా ఉంది. ఆమె పెట్టిన శాపనార్దాల వల్లనేమి, లేదా తన చరిష్మా వల్లనేమి పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో చిరు గెలుపొందారు. అలాగే రోజా కి, ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి కి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరు మర్చిపోరు. అంతగా టీ.డీ.పీ ని వెనకేసుకొచ్చిన రోజా అసలు కాంగ్రెస్ లోకి దూకనున్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చెప్పటం దాన్ని రోజా ఖండించడం జరిగిపోయాయి. అయినా ఈ విషయం జనం దృష్టి నుండి వెళ్ళకముందే మళ్ళీ ఈ రోజు రోజా ముఖ్యమంత్రిని కలవడం ఆ తరువాత ఆమె మాటలు వింటుంటే ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ లో చేరనున్నదనే తెలుస్తోంది. తన సోదరులు తో పాటు, మాజీ టీ.టీ.డీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ల తోడుగా రోజా ముఖ్యమంత్రిని మీడియా సాక్షిగా కలిసింది. అయితే ఆమె చెప్పేదేమిటంటే చిత్తూరు జిల్లాకి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన తరుణంలో కృతఙ్ఞతలు తెలియచేయడానికి కలవడం జరిగిందని చెప్పినా ఆ తరువాత మీడియా ముందు ఆమె మాట మార్చింది. టీ.డీ.పీ ని తన బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమించానని అయితే సొంత పార్టీ తనకు తగిన రీతిలో గౌరవం ఇవ్వలేదని అలాగే సొంత పార్టీ వ్యక్తులే తనను ఓడించారని దీనితో తాను మనస్తాపం చెందానని తెలిపింది రోజా. అలాగే తాను ఎన్నికలవేళ ముఖ్యమంత్రిని ఎంతగా విమర్శించినా ఆయన తనను ఎంతో ఆదారంగా కలిసి మాట్లాడారని ఆయన (వై.ఎస్.ఆర్) సొంత మనుషులను బాగా చూసుకుంటారని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మిన వాళ్ళను వదలరని కూడా కితాబిచ్చింది. దీన్ని బట్టి ఆమె త్వరలో పార్టీ మారబోతోందని రూఢీ అయిపొయింది. అంతటితో ఆగక టీ.ఢీ.పీ లో తన సామాజికవర్గం వారికి తగిన ప్రాతినిధ్యం, గౌరవం లేవని కులరాజకీయాల తోనే తనను సొంత పార్టీ మనుషులే చంద్రగిరిలో ఓడించారని ఆరోపిస్తోంది. అయితే ఒక్క విషయం ఏమిటంటే ఒకటే కులం అయిన నన్నపనేని రాజకుమారి ని పక్కన పెట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని రోజాకు రెడ్డి సామాజిక వర్గానికి (రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి) కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన తప్పు తెలుసుకుని ఉంటారు. పక్కిల్లు తగలబెట్టేటప్పుడు మన ఇల్లు కూడా అంటుకునే అవకాశం ఉందని చిరంజీవికి కుల రాజకీయాలు ఆపాదించినప్పుడు ఏమీ మాట్లాడని, ఆమెను ఖండించని చంద్రబాబు ఇప్పుడు అవే వ్యాఖ్యలతో తనపైనే దాడి చేసినప్పుడు తప్పకుండా తెలుసుకుని ఉంటారు.రోజా లాంటి వ్యక్తులు రాజకీయాలకే మాయని మచ్చ. ఆమెని చేర్చుకునే పార్టీ ఏదైనా ఏదో ఒక రోజు తప్పకుండ చింతించవలసి వస్తుంది. రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని చంద్రబాబు ఎమన్నా చేసారో లేదో తెలీదుకాని, రోజాకు మాత్రం ఎప్పుడూ మంచి స్థానం ఇచ్చారు అదీ 2004 ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా కూడా ఇంతకంటే ఏమి చేస్తారు ఎవరైనా? కనుక ఇప్పుడు రోజా ఆపదిస్తున్న కుల రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు అన్ని కూడా ఒక పాముని పెంచి పోషించిన చందం అని టీ.డీ.పీ నాయకులు అనుకోక తప్పదు. ఇప్పుడు కూడా పార్టీ మారడం వెనుక స్వార్ధం తప్పించి వేరొక కారణం లేదని గ్రహించలేని అమాయకులు కాదు జనం. తన వివాదాస్పద వైఖరితో తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి కట్టుకుంటున్న రోజాని చూసి జాలి పడడంకూడా వృధా !! ఇటువంటి రాజకీయ వ్యభిచారం ప్రజలకు దూరం చేస్తుంది తప్పించి మెప్పు తెచ్చే అవకాశం లేదు. మరి ఈ విషయం రోజా ఎప్పుడు గ్రహిస్తుందో?

Sunday, September 6, 2009

తమ్మినేనికిదేం పోయేకాలం?

తమ్మిమ్మినేని వీరభద్రంలో ఉన్నా పైశాచిక లక్షణం మరోసారి బయటపడింది. మనది కాకుంటే మసి కావాలనే మనస్తత్వం ఆయనదని అతనే రుజువు చేసుకున్నాడు. వై ఎస్ అకాలమరణం సెంధదని కార్యకర్తలంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈయన మాత్రం పండగ చేసుకుంటున్నాడు. మమ్మల్ని డీ కొంటె మాంసం ముద్దలే అని వైఎస్ నుద్దేశించి అనడం ఆయన విగ్నతః కే వదిలేద్దాము.

రాష్ట్ర రాజకీయాలు రాజశేకరుడికేందుకు

జగన్ మెహర్బానీ కోసం అందరు తాపత్రయ పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి హీరో రాజశేకర్ చేరాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్ వుంటేనే బాగుంటుందని బాకా వుడుతున్నాడు. కొంప దీసి చిరంజీవి ముఖ్యమంత్రి అయి పోతాడని బయం పట్టుకుందేమో. ఇతగాడు ఒక అడుగు ముందుకేసి వై ఎస్ పై సినిమా తీసేందుకు సిద్దమయ్యాడు కార్యకర్తలంతా చూసిన సినిమా హిట్ అవుతుందని ఫీలింగ్ కాబోలు. గోద్దోడు గొడ్డు కేడుస్తుంటే మాల పుల్లయ్య చియ్య కేడ్చాడట. అలాగుంది ఇతగాడి నిర్వాకం. అయ్యా యాంగ్రీ స్టార్ కొంపదీసి నోరు జారితే ఈసారి శాల్తి గల్లంతే. ఎవడైతే నాకేంటి అనుకుంటావా ఇక నీ ఇష్టం.

Saturday, September 5, 2009

మంత్రి వర్గ ప్రమాణం పై మల్లగుల్లాలు

వై యస్ మరణం తరువాత రాష్ట్ర మంత్రి వర్గం రద్దయింది. దీంతోఉన్నామంత్రులు మల్లి ప్రమాణ స్వీకారం చేయాలా వద్ద అన్నా విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.

రోజాకిదేం రోగం

బెల్టు షాపులతో మద్యాంధ్ర ప్రదేశ్ చేసి,మగువల తాళి బొట్లు తెగిపడేలా చేస్తున్నారంటూతెగనాడింది తెలుగు నారి హోదాలో రోజా.
ఉన్నట్టుండి రోజా ‘చేతికి’ చిక్కితెలుగు తమ్ముళ్ల సైకిల్ దారిలో ముల్లై పంచర్లు చెయ్యడానికీ సిద్ద పడుతోంది.ఎవడెక్కువ తిడితే వాడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, రాజకీయాల్లో ఎవరెక్కువతమను తిడితే వారిని తమ సిగలో తురుముకోవడం ప్రత్యర్ధి పార్టీల బాధ్యతగా ప్రవర్తిసున్నారు.కానీ రోజా ఉన్నట్టుండి తనకున్న సహజ రాజకీయ వాసనతో అధికారంలో ఉన్నచేయిలో పడి ఎప్పుడూ తిట్లతో ఆకర్షించడం మాని తానేఆకర్షణకులోనై మై మరచి అడ్డంగా పొగడ్డమే ప్రజలకు వింతగొలుపుతోంది.కానీ ఆలోచిస్తే బెల్టు తీయమన్న రోజా బెస్ట్ అన్నందుకు అభినందించి తీరాలి.ఆ బెల్టు షాపులు లేక పొతే ఈ రోజు ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు జరిగేవి.కరువులో కడుపు రగిలే వాడు కడుపారా తాగడానికి,వాన దేవుడిని చైనా నుండి తిరిగి రప్పించిన మన దేవునికిమంది మద్యం తాగడం ప్రీతికరం ఆ మొక్కుబడిని ప్రజలు తేలిగ్గా చెల్లించడానికి,అసెంబ్లీలో జరిగే ఆటలతో ఆనందించడానికి,స్వైన్ ఫ్లూ వణుకును తగ్గించుకోడానికి,చికన్ గున్యా కీళ్ళ నొప్పుల నివారణకు,డెంగీ దోమకు మత్తెక్కించడానికి,ఇలా అడుగడుగునా ఉపయోగపడుతున్న బెల్టు, ఇప్పుడు ఖచ్చితంగా బెస్టే.మరి ఆ బెల్టును ప్రసాదించిన దేవుడి చేతిలోకి రోజా చేరి,ఇంతకు మునుపు పూజకు పనికి రాని పూవుఅన్న వారి నోళ్ళు మూతపడేలా చేస్తుంటే, ముచ్చటేస్తోంది.

నా స్తైలింతే

ఊరందరిది ఒక దారైతే వులిపి కట్టేది మరో దారి. కొత్తగా రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తేనే పది మందిలో ప్రత్యేకత వుంటుంది. వారికే సమాజంలో విలువ వుంటుంది. అలా చేయగలిగిన వారే జీవితంలోసక్సెస్స్ సాధించగలరు.

పోయినోల్లందరు మంచోళ్ళు

నిన్న మొన్నటి దాక రాజశేఖర్ రెడ్డి ని తిట్టినోళ్ళంతా ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులూ కూడా వై ఎస్ ను ప్రశంసిస్తున్నారు. కారణం. పోయినోల్లందరు మంచోళ్ళు. వాళ్ళు చేసిన పనులన్నీ గొప్పవి.

నా అభిప్రాయం ఇది.


ఈ సృష్టి లో అనేక నక్షత్రాలు, గ్రహాలు వున్నాయి. అవి ఎప్పుడు దారి తప్పుతాయో తెలీదు. అవి ఎప్పుడు భూమి మీదకు వస్తాయో తెలీదు. మనం బ్రతికున్నంత కాలం ఈ భూమిని కాపాడుకుందాం .



For the peaceful atmospher. and pull the air into bladder. so happy. with salty oxygen.

Always your concentration on erodication of curruption not on Human beings. they are always with us in the part of society.

BEST Example For Dare

He is the Star in my Heart. thats all.

channel upcoming

It's a NEWS channel upcoming. it is more peculor than other news channels. letus see and enjoy.
Add Image

story