ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, November 18, 2010

ఫ్లోరోసిస్ భూతం


ఎ.జనార్ధన్
ఫ్లోరోసిస్ నీరు.. కన్నీరు
ఇక్కడ మనకు దీనంగా కనిపిస్తున్న ఈ అభాగ్యులను ఏ వైరస్ సోకలేదు.. జన్మతః వికలాంగులు అసలే కారు.. పోలియో వంటి మహమ్మారి వీరి జోలికే రాలేదు.. మరే మయింది..మాయా మంత్రమా.. మెలితిరిగిన అవయవాలతో... పీడకలలో మాత్రమే కనిపించే వింత రూపం వీరికి ఎలా వచ్చింది.. మన చేరువలోనే గుండె చెరువయ్యే కన్నీటి గాథ ఇది.. మంచినీరు తాగడమే నేరమైన దుస్థితి..
స్పాట్
ఇప్పుడు మనం చూసిన ఈ హృదయ విదారక దృశ్యాలు నల్లగొండ జిల్లాలో చాలా ఊర్లలో కనిపిస్తాయి.. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే..జీవధార ప్రవహించే ఈ నేలలో వీళ్లంతా జీవశ్చవాలుగా ఎందుకు మారుతున్నారు.. మూడు తరాలుగా ముప్పుతిప్పలు పడుతూ నిత్యం మరణశయ్యపై దీనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
స్పాట్
ఇక్కడ కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతాయి.. కమ్మనైన నీరు కాలువల గుండా పారుతుంటుంది..ఆధునిక దేవాలయానికి ఆనవాలయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిందీ ఇక్కడే… ఈ నీరు రాష్ర్టంలో ఎందరికో దాహార్తిని తీర్చింది.. పంట పొలాలను పొత్తిళ్లల్లో హత్తుకుంది. లక్షలాధి ఎకరాలను పచ్చగా చిగురింపజేసే మహత్తున్న జలాశయమిది..కానీ తాను పుట్టిన నేల నెర్రలు బాసి గుండె పగిలిపోతున్నా నీటిమాటున కన్నీటిని దాచుకుంది. అయిన వారి కడగళ్లను తీర్చలేక పోయింది. ఈ నీరు తమ నోరు తడపాలని ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డా కోరుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలయినా ఆ గలగలలు కలలు గానే మిగిపొయినాయి.
స్పాట్
జీవం నిలపాల్సిన జీవజలాలే, కఠిన జలాలై కసాయిగా ప్రాణాలను తోడేస్తున్నాయి.. నేలమీద పడ్డ గడియ నుంచి నేలలో కలిసే వరకు నరకయాతన.. గాజు పెంకులయిన ఎముకలు..తోలు తిత్తి లాంటి శరీరం. ఆదమరిచినా, అదుపు తప్పినా ఇక అస్థిపంజరం పై ఆశలు వదులుకోవలసిందే.. ఎవరు చేసిన పాపం ఇది. తమ నేలకు శాపంగా మారింది. పండు వెన్నెల కురిపించే నవ్వులు మసకబారిపోతున్నాయి..రాహువు మింగిన చంద్రుడిలా చీకటి మాటున చిట్లిపోతుంది. తాము తాగే తల్లిపాలే విషమని వీరికి తెలియదు.. తమ చనుబాలలో విషపు టణువులున్నాయన్న సంగతి ఆ తల్లులకు కూడా తెలియదు..కారణం.. ఇక్కడి మట్టిలో.. మట్టిమనుషుల్లో అణువణువునా ఫ్లొరిన్ అణువులు నిండిపోయినాయి.. వీరినందరినీ చుట్టు ముట్టిన ఆ విషవ్యాధి “ఆస్టియో పోరోసిస్” . తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఈ ఎముకల వ్యాధి బారిన పడుతారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన లీటర్ కు ఒక మిల్లీగ్రాం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. కానీ ఇక్కడ ప్రజలు తాగే నీటిలో లీటర్ కు 15 మిల్లీ గ్రాముల ఫ్లోరిన్ ఉంటుందంటే వీరు తాగేది మంచి నీరా లేక విషరసాయనమా అనే అనుమానం కలుగుతుంది.

Wednesday, September 8, 2010

ఖర్జూర పండ్ల గురించి తెలుసుకోంఢి



ఎ. జనార్ధన్
ఖర్జూరం కథ
ఖర్జూరం…ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం తన్నుకొస్తది. . పంచదార కన్నా మధురంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారుండరంటు నమ్మండి! ఇక చిన్న పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖర్జూరాన్ని చూస్తే చెరుకు గడకే ఈర్శ్య పుడుతుందట. అంత మధురంగా ఉంటది ఈ పండు. అందుకే రోజంతా ఉపవాసం ఉన్నా నాలుగు ఖర్జూరాలు నోట్లో వేసుకుంటే చాలు ఎక్కడ లేని శక్తి వస్తది. ఎందుకంటే ఈ పండుకున్న పవర్ అల్లాంటిది. ఈ మధురాతి మధురమైన పండులో ఎన్నో కాలరీల శక్తి , మినరల్స్ ఈ పండుకు అంత పవర్ తెచ్చిపెట్టినయి. రంజాన్ మాసంలో అయితే సరే సరి. ముస్లిం సోదరులకు ఆ నెలరోజులు ఇదే అమృతం.
స్పాట్
ఖర్జూరానికి అంత తియ్యదనం ఎక్కడిది. తేనెలూరే తియ్యదనం సొంతం చేసుకున్న ఖర్జూరం కథేంటో కాస్త చూద్దాం..
స్పాట్
ఖర్జూర పండు తినని వాళ్లు ఉండరేమో కానీ..ఖర్జూర చెట్టు చూడని వాళ్లు మాత్రం చాలామందే..ఎందుకంటే ఖర్జూరాలు ఇక్కడ పండవు. ఖర్జూర చెట్లు ఎలా కాపు కాస్తయో చూడాలంటే సప్త సముద్రాలు దాటి వెళ్లాల్సిందే..ఇంత కండ గల పండు నీరు లేని ప్రాంతంలో పండుతుందంటే మీరు నమ్మగలరా..అవును ఈ ఖర్జూర పండ్లు అరేబియా ఇసుక ఎడారుల్లో విరివిగా పండుతయి. అక్కడి నుంచి అన్ని దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతయి. ఇప్పడంటే ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నయి గానీ ఒకప్పుడు ఖర్జూర పండు తినాలనే కోరిక కోరికగానే మిగిలిపోయేది. ఎప్పటివో ఎండు ద్రాక్ష పండ్లు ఉంటే పూజా పునస్కారాలలో వాడగా మిగిలినవి దేవుడి దయ వల్ల వాటి రుచిచూసే అదృష్టం లభించేది. కానీ ఇప్పడు ఖర్జూరాన్ని పిలిస్తే పలుకుతది. ఎందుకంటే ఖర్జూర పండ్లు అరబ్ కంట్రీస్ నుంచి విరివిగా దిగుమతి అవుతున్నయి. రంజాన్ మాసంలో ఇవి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటయి.
స్పాట్
ఇక్కడ ఠీవిగా నిలుచొని ఉందే ఇదే ఖర్జూర చెట్టు. ప్రాంతాన్ని, రకాలన్ని బట్టి ఇవి రకరకాల ఎత్తుల్లో ఉంటయి. 15 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతయి. ఇవి ఒక్కో రుతువులో ఒక్కో అందాన్ని అద్దుకుంటయి. నిండు పచ్చదనాన్ని నింపుకొని అందాలన్నీ ఒంపుకున్న ఈ ఖర్జూర చెట్టు ఎప్పుడూ హరిత వర్ణంతో నిగనిగలాడుతుంటది. గల్ఫ్ వీధుల్లో అందాలను ఆరబోస్తూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తవి. పచ్చని పూతతో నిండు ముత్తయిదవలా నిలుచొని పర్యాటకులకు కనువిందు చేస్తది. పూత రాలి లేలేత పిందెలు వేసుకొని బాలింతలా బంగారు వన్నెలు నింపుకుంటది. కాసిన్ని రోజులకే ఈ కాయలు కండ నింపుకొని పసిడి వన్నెలోకి మారుతయి. ఎడారి దేశంలో పండే ఈ పండ్లు కాస్త పండు దశకు చేరగానే సంధ్యవేళ సూర్యుడిలా ఎర్రగా ఉంటయి. పచ్చిగా ఉండగానే తుంచి నోట్లో వేసుకోవాలన్నంతగా మురిపిస్తయి. పొరపాటున నోట్లో వేసుకుంటే మాత్రం సాయంత్రం వరకు తమ వగరు దనంతో సరసాలాడుతుంటయి. బాగా పండాక ముదురు ఎరుపులో ఉంటయి. కండగలిగి కాస్తముడతలు పడ్డ ఆ ఖర్జూరాలు పక్వానికి వచ్చాక పరువాలు నింపుకున్న పడుచు పిల్ల మాదిరిగి ఊరిస్తయంటే నమ్మండి.
స్పాట్
ఖర్జూరంలో కార్బో హైడ్రేట్లు, షుగర్, ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, వాటర్, విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటయి. ఖర్జూరాన్ని, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సూడాన్, లిబియా, అల్జీరియా, వంటి దేశాలలో విరివిగా పండిస్తరు.
ఈ ఖర్చూర చెట్టుకు తాటి చెట్టుకున్నంత కథ ఉంది. ఈ చెట్టును మల్టి పర్పస్ తా ఉపయోగించుకునే వారు. దీని ఆకులతో, కొమ్మలతో ఇళ్లు కప్పుకునే వారట. అంతేకాదు బుట్టలు. అలంకరణ వస్తువులు తయారు చేయడానికి ఈ ఖర్జూరం చెట్ల విడిబాగాలను ఉపయోగించుకునేవారు. ఖర్జూర పండ్లతో జూస్లు, సిరప్ లు, తేనె, చాక్ లెట్లు, బిస్కెట్లు, తయారు చేస్తున్నరు. వైద్యరంగంలో కూడా దీని మేలు మరువలేనిది..రోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యమని డాక్టర్లు సలహా ఇస్తున్నరు. ఇంకెందుకాలస్యం మీరు కూడా ఖర్జూరాలకు నాలుగు పైసలు ఖర్చుపెట్టండి.

Tuesday, August 17, 2010

సర్దార్ సర్వాయి పాపన్న




ఎ. జనార్ధన్
మనం మరిచిన తెలంగాణ వీరుడు
సర్దార్ సర్వాయి పాపన్నజయంతి నేడు
అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. ముంజ కత్తి పట్టాల్సిన చేతితో తల్వార్ దూసిండు.. మొగలాయి సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేబట్టిన యోధుడు. ఆయనే తెలంగాణ చరిత్ర గర్వించే వీరుడు సర్వాయి పాపన్న.
బడుగులకు రాజ్యాధికారమని ఎలుగెత్తి తరతరాలుగా అర్రులు చాస్తున్న ఈ తరానికి సర్వాయి పాపన్నే ఆదర్శం.
సర్వాయి పాపన్న పుట్టింది ఖిలాషాపూర్ లో..ఈ గ్రామం హైదరాబాద్కు ఈశాన్యంగా 50 మైళ్ళ దూరంలో వరంగల్ మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నది. ఈ ఊర్లో పాపన్న విగ్రహం ఉంచి పాపన్న తమ ఊరి వాడని సగర్వంగా చెప్పుకుంటరు గ్రామస్థులు. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. తక్కువ చూపు చూస్తున్న కులవృత్తిని అంగీకరించలేదు. కులవృత్తి స్వీకరించమన్న తల్లి కోరికను కాదన్నడు. కొంత ధనాన్ని చేత బట్టుకొని రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు శభదం చేసిండు.
మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. ఒక్కప్రాణాలే కాదు..తమ పిల్లా జెల్లా..గొడ్డూగోదా ఏదీ తమది కాదు. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపడు కత్తి దూసిండు. తన తోటి వారిని బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపు యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి జేజేలు పలుకుతూ చిన్నాపెద్దా ఆయన పోరాటానికి బాసటగా నిలిచిండ్రు.
సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది.ఈ ప్రయత్నంతో గౌడు కులస్థులతో బాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిండ్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిండ్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్న పై చేసిన దాడిలో ఘోరంగా విఫలమయింది రుస్తుంఖాన్ సైన్యం.. 1707లో ఔరగంజేబు మరిణానంతరం బహద్దూర్ష్ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. సరిగ్గా ఇదే సమయంలో మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు.
వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో షాపూర్ హైదరాబా ద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఏటవాలు కొండపై నిర్మించిన భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధి కారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రక టించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నడు.బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించా డు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిండ్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నరు యూసఫ్ ఖాన్ను ఆదేశించిండు.
1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధమైనడు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మేనెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు.పాపన్న తుపాకి కా ల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నా బాద్ గ్రామంలో ఒక కల్లు మండువ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు.
అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు.కల్లు దుకాణంలో కూర్చొని ఒక గ్లాసు తాటి కల్లు ఇవ్వమని అడిగాడు.పాపన్న కల్లు తాగుతుండగా నిజాం సైన్యం అతడిని బం ధించి వారిని గవర్నర్ ముందు నిలబెట్టిడ్రు.తరువాత అతని తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండేన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీశారు.స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరునిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసిన గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ్మ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి.

Monday, August 2, 2010

హిందీ గాయకుడూ కిషోర్ కుమార్



ఎ. జనార్ధన్ august
...కిషోర్ కుమార్ స్టోరీ...4th birth day
కలకాలం ప్రజల మదిలో నిలిచిపోయే పాటలు పాడిన గాన గంధర్వలో చెప్పుకోదగ్గ గాయకుడు కిషోర్ క ఉమార్. ఆయన పాడిన పాటలన్నీ వాడిపోని వసంతాలే..కోట్లాదిమంది గుండెల్లో గూడు కట్టుకున్న కిషోర్ పాట అజరామరం. ఆ గొంతునుంచి జాలువారిన అమృతధారను ఆస్వాదించేందుకు ఎగిసిపడే హృదయాలు నాడే కాదు.. నేడూ ఉన్నాయి.. ఉత్సాహం ఉరకలేసి.. మనసు గంతులేసే పాటలను ఎన్నోపాడారాయన. తొలినాళ్ళలో మెత్త మెత్తగా పాడిన సోలోలు ఇప్పటికీ విన్నకొద్దీ వినాలనిపిస్తాయి. ఆషాబోస్లేతో కలిసి పాడిన చిలిపిచిలిపి డ్యుయెట్లు గుర్తుకొస్తేనే మనసు అదోలోకంలోకి తేలిపోతుంది. దేవానంద్ మొదలుకొని అనిల్ కపూర్ దాకా ఎందరో హీరోలకు తన గాత్రంతో ఎక్కడాలేని ఫేం తెచ్చిపెట్టారు కిషోర్... రాజేష్ ఖన్నా, అమితాబ్ ల శకంలో కిషోర్ సినీ వినీలాకాశంలో శిఖరాగ్రాలను చూశారు. కిషోర్ కెరీర్ లో ఇదొక ఉజ్జ్వల దశ. ఆ కాలంలో ఆ ఇద్దరు హీరోలకూ ఆయన పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్లుగా చరిత్ర సృష్టించాయి.
సాంగ్
సినీ ప్రపంచం మరవలేని మధరగాయకుడు కిషోర్ కుమార్ ఆగష్టు 4, 1929లో జన్మించారు. భారతీయ హిందీ సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్న కిషోర్ నేపథ్యగాయకుడిగా, హాస్యనటుడిగా, దర్శకునిగా, నిర్మాత మరియు సంగీత దర్శకుడి రాణిచిండు.. అందుకే కిషోర్ కుమార్ ను సినీ మేథావులు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించింది. అశోక్ కుమార్, అనూప్ కుమార్ మరియు కిషోర్ కుమార్ లు అన్నాదమ్ములు. 1946లో ముంబైలో అడుగుపెట్టిన కిషోర్ నిజానికి మొదట గాయకుడు అవ్వాలని అనుకున్నారు. చిన్నప్పటినుంచీ కిషోర్ కు సైగల్ అంటే వీరాభిమానం. ఎప్పుడూ ఆయన పాటలనే పాడుతుండేవారు. కిషోర్ ముంబైకు చేరుకునేనాటికే ఆయన అన్న అషోక్, హీరోగా ఓ స్ధానంలో ఉన్నారు. తన మనసులోని కోరికను అన్నతో చెప్పారు కిషోర్. తమ్ముడి కోరిక విన్న అశోక్ కుమార్, "నువ్వు సైగల్ ను అనుకరిస్తూ పాడి గొప్ప పాటగాడివి అనుకుంటున్నావు.. మైక్ ముందు పాడటమంటే మాటలు కాదు.. నీకంటు ఓ స్టైల్ ఉండాలి. అందుకు చాలా సమయం కావాలి.. ఈ లోగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండు.." అని సలహా ఇచ్చారు. అలా కిషోర్ నటుడిగా అరంగేట్రం చేశారు.
కిషోర్ నటించిన తొలి చిత్రం " షికారీ". 1946లో వచ్చింది.
స్పాట్ ( మూవీ క్లిప్పింగ్)
ఈ సినిమాలో కిషోర్ అన్న అశోక్ హీరో అయితే, సంగీతాన్నించింది ప్రకాష్. ఒక దశలో కిషోర్ గొంతు విన్న ప్రకాష్, ఆ తర్వాత రెండేళ్లకు తన సంగీతదర్శకత్వంలో వచ్చిన జిద్దీ సినిమాలో కిషోర్ కు తొలి అవకాశమిచ్చారు. మర్నే కే దువా ఏ క్యోం మాంగ్.. ఇదే కిషోర్ తొలి సినిమా పాట.
సాంగ్ (మర్నే కే దువా ఏ క్యోం ) దొరికితేనే
కిషోర్ కుమార్ చేత తొలిపాట పాడించిన ప్రకాష్ ఇతనో మంచి సింగర్ అవుతాడని ఆనాడే ఊహించి చెప్పిండట. సైగల్ అంటే వల్లమాలిన అభిమానం ఉన్న కిషోర్, ఎలాగైనా సరే సైగల్ ని కలుసుకోవాలని కలలుకన్నాడు. తన అన్న అశోక్ సాయంతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, కిషోర్ ముంబైలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే సైగల్ చనిపోవడంతో ఆయన కోరిక మరెన్నటికీ తీరకుండాపోయింది. సైగల్ కు, కిషోర్ కుమార్ కు ఓ పోలిక ఉంది. ఇద్దరూ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోకుండానే గానకళలో ఆరితేరారు. అయితే, సైగల్ ప్రభావం నుంచి కిషోర్ ను బయటపడేసింది మాత్రం ఎస్.డీ.బర్మన్. ఆయన సంగీత దర్శకత్వంలో కిషోర్ అసలు సిసలు గాయకుడిగా రాటుదేలారు. కిషోర్ తనకంటూ కొత్త శైలి వెతుక్కున్నాక, వెనక్కు తిరిగి చూసుకోలేదు. ప్రతీ పాటలో ఆయన గంభీర స్వర ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆయన హమ్మింగ్ ఓ స్పెషల్ ఎఫెక్ట్.కిషోర్ తన చిన్నతనంలో ఆయన రెండో అన్న అనూప్ తెచ్చిన విదేశీ రికార్డుల్లో యోడలింగ్ ను మొదటిసారిగా విన్నారు. ఆ తర్వాత అదే కిషోర్ కుమార్ బ్రాండ్ గా మారింది.ఎయిటీస్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సాగర్ సినిమాలో కూడా కిషోర్ గాత్రం అమృతాన్నే ఒలికించింది. నాలుగు దశాబ్దాలపాటు గళమెత్తిన కిషోర్ చిత్రసీమలో నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే ఆణిముత్యాలెన్నింటినో మనకు అందించారు. ఆయన గొంతులో పలకని రాగం లేదు. నవరస గాయకునిగా కిషోర్ కీర్తిశిఖరాలను అందుకున్నారు.
(స్పాట్ )
ఇంత అద్భుతమైన గాయకుడు కిషోర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం నటుడిగా. పేరు తెచ్చుకుంది కామెడీ హీరోగా. నిలిచి వెలిగింది ప్లేబ్యాక్ సింగర్ గా. ఈ దశలవారీ ప్రస్ధానం వెనుక ఎన్నో మలుపులున్నాయ్.. మెరుపులున్నాయ్
స్పాట్ (క్లిప్పింగ్)
కిషోర్ హీరోగా నటించిన ఆందోళన్, నౌకరీ,ముసాఫిర్ వంటి సినిమాల్లో తనకు తాను కొన్ని పాటలు పాడుకున్నరు. కిషోర్ కుమార్ ను కొంత కాలం ఫ్లాప్ లు వెంటాడాయి. కొన్ని ఫ్లాపుల తర్వాత కిషోర్ న్యూ ఢిల్లీ, చల్తీకా నామ్ గాడీ, ఆషా,హాఫ్ టికెట్ వంటి కామెడీ సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. చల్తీకా నామ్ గాడీలో అన్నదమ్ములు అశోక్, అనూప్, కిషోర్ ముగ్గురూ కలిసే నటించారు. ఇందులో కిషోర్ సరసన మధుబాల నటించింది.
(క్లిప్లింగ్)
ఓ సిటీ గర్ల్, ఓ కార్ మెకానిక్ ల మధ్య నడిచే ప్రేమకధే ఈ సినిమా. ఒక సింగర్ గా కిషోర్ లో ఉన్న టాలెంట్ ను, రేంజ్ ను మొదటిసారి గుర్తించింది ఎస్.డీ.బర్మనే. ఆయన సంగీత దర్శకత్వంలో టాక్సీ డ్రైవర్, ఫంతూష్, మునీంజీ, నౌదోగేరా, పేయింగ్ గెస్ట్, గైడ్, జ్యువెల్ తీఫ్, ప్రేమ్ పూజారి వంటి సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఇవన్నీ దేవానంద్ సినిమాలు కావడం కూడా ఓ విశేషం. ఈ కాంబినేషన్ వెనుక దేవ్, కిషోర్ ల దోస్తీ ప్రభావం కూడా ఉందనే చెప్పాలి.
(సాంగ్)
సచిన్ దేవ్ బర్మన్ తర్వాత ఆయన కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్, శ్రీరామచంద్ర, శంకర్ జైకిషన్, బప్పీలహరి.. ఇలా అందరి మ్యూజిక్ డైరక్షన్ లో కిషోర్ వందలాది పాటలు పాడిండు. ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో కిషోర్ సాధించిన తొలి హిట్ పడోసాన్. ఈ సినిమాలో కిషోర్ నటిస్తూనే పాటలు పాడారు. ఆర్డీ బర్మన్ తో కలిసి ఆయన ఖుష్బూ, పతంగ్, అమర్ ప్రేమ్, బుడ్డా మిల్గయా, అనామికా, ఆప్కీ కసమ్,, హీరాపన్నా వంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. సంజయ్ దత్ చొలి చిత్రం రాఖీలో కూడా కిషోర్ చేత ఆర్డీబర్మన్ పాటలు పాడించారు. వీరిద్దరిదీ ఓ స్పెషల్ కాంబినేషన్. 1969లో శక్తీ సామంతా తీసిన "ఆరాధన" కిషోర్ కుమార్ ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమాలో రాజేష్ ఖన్నాకు, కిషోర్ పాడిన పాటలు ఆసేతు హిమాచలాన్ని ఊపేశాయి. మేరీ సప్నోంకీ రాణీ అనే పాట యూత్ ను మైమరపించింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఆదే పాట.. అంతగా ఆ పాట ఆకట్టుకోవడానికి కిషోర్ గొంతులో పలికిన యవ్వనావేశమే కారణం.
(మేరీ సప్నోంకా రాణి సాంగ్)
అయితే, ఇదే సినిమాలో ఒంటరిగా దొరికిన అమ్మాయితే అబ్బాయి పెట్టే గుసగుసల తరహాలో పాడిన రూప్ తేరా మస్తానా.. ప్యార్ మేరా దీవానా.. పాట కిషోర్ కుమార్ కు తొలి ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
(రూప్ తేరా మస్తానా..సాంగ్)
కళ్యాణ్ జీ ఆనంద్ జీ మ్యూజిక్ డైరక్షన్ లో డాన్, కోరా కాగజ్, జానీ మేరా నామ్.. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు కూడా అదే రేంజ్ హిట్ కొట్టాయి. కొత్తతరం సంగీత దర్శకులతో కూడా కిషోర్ పనిచేశాడు. వారు స్వరపర్చిన ఎన్నో గీతాలకు ప్రాణం పోశారు కిషోర్. వారిలో చెప్పుకోదగ్గ మ్యూజిక్ డైరక్టర్ రాజేష్ రోషన్. ఆయన సంగీతదర్శకత్వంలో వచ్చిన చల్తే చల్తే, జూలీ, దో ఔర్ దో పాంచ్ .. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. సంప్రదాయ సినీ సంగీతానికి డిస్కోను జోడించి బప్పీలహరి డైరక్షన్ లో కూడా కిషోర్ మెరుపులు మెరిపించారు. నమక్ హలాల్, షరాబీ వంటి సినిమాల్లోని పాటలు వింటే చాలు,, కిషోర్ బప్పీలహరి కాంబినేషన్ ఇచ్చిన కిక్ ఎలాంటిదో రుచి చూడొచ్చు.
(సాంగ్ బప్పిల హరి మ్యూజిక్ సాంగ్)
కళాకారులు సున్నిత హృదయులు, వారికి బయటి ప్రపంచానికి మధ్య సయోధ్య అంత సులభంగా కుదరదంటారు. ఇది కిషోర్ విషయంలో అక్షర సత్యమైంది. అందుకే ప్రపంచం అతన్ని ఎక్సెంట్రిక్ అంది. . కళాకారులందరిలాగే కిషోర్ చాలా సెన్సిటివ్. సున్నిత మనస్కుడు అవ్వడం వల్ల ఆయన చలా ఇబ్బందులు పడ్డారు. చాలా విషయాల్లో విపరీతంగా వ్యవహరించేవారని కిషోర్ గురించి చెప్పేవారు. ఆయన ఒక్కొక్క కీర్తిశిఖరం అధిరోహిస్తూ పోతున్నకొద్దీ ఆయనపై వింతవింత కధనాలు అంతకంతకూ ప్రచారంలోకి వచ్చాయి.ఆయన తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్లతో ముచ్చటించే వాడని, ఒక్కో చెట్టును ఒక్కో పేరుతొ పలకరించేవాడని చెబుతారు. ఆయన్ కుక్కల పెంపకం గురించైతే ఎన్నెన్నో కధలున్నాయి.ఏకంగా ఇంటి గేట్ మీద " బీవేర్ ఆఫ్ కిషోర్" అని రాసుకొని కుక్కలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు... నో మనీ, నో వర్క్.. అనే సూత్రానికి కట్టుబడిన కిషోర్, కొన్ని సినిమాలకు డబ్బులిస్తామన్నా వద్దంటూ పనిచేశారు. కిషోర్ వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మొత్తం నలుగురిని పెళ్ళాడిన కిషోర్, ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేవారు. మొదటిభార్య రుమా, కిషోర్ ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చేసుకున్న మధుబాల ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళింది. ముచ్చటగా మూడోసారి పెళ్ళిచేసుకుంటే ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. చివరిగా నాలుగోసారి బూరెబుగ్గల హీరోయిన్ లీనా చందావర్కర్ ను పెళ్ళిచేసుకున్నారు. అయితే, అప్పటికే ఆమె వితంతువు. పైగా ఆమె వయస్సు కిషోర్ కొడుకు అమిత్ కన్నా రెండేళ్ళే ఎక్కువ..
(క్లిప్పింగ్)
కిషోర్ మహా మొండి ఘటం.ఒకసారి కమిటైతే కాదనిపించడం ఎవరితరమూ అయ్యేది కాదు. మహామహులను కిషోర్ ఢీకొన్నారు. కొన్నాళ్ళు ఇబ్బంది పడినా, చివరకు తనమాటే నెగ్గించుకునేవాడు. అవి ఎమర్జెన్సీ రోజులు. ముంబైలో కాంగ్రెస్ ర్యాలీలో పాడమని సంజయ్ గాంధీ కిషోర్ ను అడిగారట. అయితే, దానికి కిషోర్ ససేమీరా అన్నాడట. ఫలితంగా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది. ఆలిండియా, దూరదర్శన్ లలో కిషోర్ పాట కనిపించరాదు.. వినిపించరాదంటూ హుకుం జారీ అయింది. అయినా కిషోర్ తన పట్టు విడవలేదు. చివరికి పరిశ్రమపెద్దలు జోక్యం చేసుకొని ఈ నిషేధం తొలగిపోయేలా చేశారు. ముఖేష్, మహ్మద్ రఫీల వంటి ఉద్ధండుల మధ్య కిషోర్ తన ఉనికిని బలంగానే చాటుకున్నారు. డిఫరెంట్ గొంతుతో ధాటిగా పాడే కిషోర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
సాంగ్
కిషోర్ అభిమానులమని గర్వంగా చెప్పుకునేవారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నారు. అంతకన్నా ఓ సింగర్ కు కావాల్సింది ఏముంది.? మన తెలుగు మిస్సమ్మను హిందీలో "మిస్ మేరీ"గా తీశారు. నాగేశ్వరరావు పాత్రను అందులో కిషోర్ వేశారు. ఆయనకు జోడీగా మన జమునే నటించడం విశేషం. నటుడిగా కిషోర్ నటించిన సినిమాలు ఎంత బాగున్నా, అవన్నీ మసాలా సినిమాలే. వాటిల్లో కూడా ఆయన కామెడీ చేసి నవ్వించారు. కానీ, దర్శకుడిగా మారి కిషోర్ తీసిన సినిమాలన్నీ కూడా చాలా సీరియస్. సత్యజిత్ర ప్రభావంతో వాస్తవికతను చూపించేందుకు కిషోర్ ప్రయత్నించారు. కిషోర్ తీసిన "దూర్ గగన్ కీ ఛావో మే " అందుకు ఓ ఉదాహరణ. తను తీసిన సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం, కధ, మాటలు, అన్నీ పుచ్చుకునేవారు. బహుముఖంగా తన ప్రజ్ఞాపాటవాలని ప్రదర్శించిన కిషోర్ ను గాయకునిగానే ప్రపంచం ఆదరించిందీ, గుర్తించిందీ. కిషోర్ మాత్రం ఈ గుర్తింపుతో నిమిత్తం లేకుండా తన మనసుకు నచ్చినట్టు జీవించారు. ఆడింది ఆట.. పాడింది పాటలాగా గడిపి ఇరవై ఏళ్ల క్రితం ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. ఆయన పాటకు పరవశించిపోయే అభిమానుల గుండెల్లో మాత్రం కిషోర్ ఎన్నటికీ చిరంజీవే.

Saturday, July 31, 2010

బోనాలు పుట్టు పూర్వోత్తరాలు

తెలంగాణ పండగలు, జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు అద్దం పడతయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు . ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళతరు. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపద పాటలుకూడా అమ్మను కొలిచి భక్తి పారవశ్యంలో ముంచేలా ఉంటయి.
బోనాలు పుట్టు పూర్వోత్తరాలు
అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరియైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్నయమ్మకు కోపం వస్తే కూడా మనని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతయి. అంటురోగాలు ప్రబలుతయి. 1869 సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నపరచడానికి ఉత్సవాలు , జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికిందరాబాదులోనే కాక మరికొన్ని తెలంగాణా ప్రాంతాలలో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటరు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తరు భక్తులు. ఉగాది తర్వాత చాలా రొజులకు వచ్చే మొదటిపండగ ఇదే.
భోనం గురించి
బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టికుంఢ లేదా ఇత్తడి గుండిగలో వుంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతరు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తరు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు,నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తరు. ఈ ఊరేగింపులో సంప్రదాయిక నృత్యాలు చేస్తరు. ప్రతీ సమూహం వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచెసిన తొట్టేలను(ఊయల) కూడా అమ్మవారికి సమర్పిస్తరు. అమ్మకు బోనాలు, తొట్టెలు సమర్పిస్తే అమ్మ శాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తదని భక్తుల నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ఉంది.
బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మయొక్క శక్తి , అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆ మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.
అదే కాక మరో నమ్మకం కూడా ఉంది. ఆషాడ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి భక్తితో భోనం వడ్డిస్తరు. తెలంగాణా ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తరు.
అమ్మవారి సోదరుడైన పోతురాజుది ఈ సంబరాలలో ముఖ్య పాత్ర. బలిష్టుడైన వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని , వేపాకు మండలు కట్టుకుని , నుదుల పెద్ద కుంకుమ బొట్టుతో , కాలికి గజ్జెలతో కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు వీరంగం ఆడుతూ ఉంటడు. అమ్మవారికి సమర్పించే ఫలహారపు బళ్ళను అతనే ముందుండి నడిపిస్తడు.
జంటనగరాల జాతర

ఈ పండగ హైదరాబాదు, సికిందరాబాదులో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుగుతుంటది. బోనాల పండగ ఆషాడ మాసంలోని ఆదివారం రోజే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు గోల్కొండ కోటలోని జగదంబ ఆలయంలో మొదలవుతుంది. నిజాం నవాబుల కాలం నుండి ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది. రెండో ఆదివారం సికిందరాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ మందిరంలో జరుగుతది. అప్పుడు సికిందరబాదు వాసులందరూ ఈ పండగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొంటరు. మూడవ ఆదివారం హైదరాబాదులోని అన్ని ప్రాంతాలలో ఈ పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతీ వీధి తోరణాలతో కళకళ లాడిపోతుంటది. చివరి ఆదివారం గన్ ఫౌండ్రిలో ఈ పండగ జరుపుకుంటారు. దీనితో బోనాల పండగకు తెర పడుతది. ఏ పండగైనా ప్రజలంతా ఒకేరోజు జరుపుకుంటరు. కాని బోనాల పండగను మాత్రం వారానికో ప్రాంతంలో నెలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటరు.

జాతర జరిగే విధానం
అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మా, పోలేరమ్మ, మారెమ్మ, యెల్లమ్మ .. అమ్మే కదా యే పేరుతో పిలిచినా పలుకుతది , తమని ఆదుకుంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.. ఆదివారం బోనాలు సమర్పిస్తరు. ఇంతటితో పండగ అయిపోలేదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటది. రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచిచెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండపై నిలబడి, పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తది. వేలాదిమంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతరు.

బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం ప్రతీ ప్రాంతం నుండి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది . హైదరాబాదులోని పాతబస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళ్తారు. ఒక్కటొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహలం సృష్టిస్తయి. ఈ రెండు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ప్రముఖమైనవి. విన్నవారందరిని చిందులేయించే పాటలు ఎన్నో . డప్పుల దరువుతో సాగిపోయే అమ్మ బయలెల్లినాదే... ఆటపాటలతో సాగిపోయిన ఈ ఘటాలన్నింటిని నయాపుల్ లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పంటలను , పిల్లలను చల్లగా ఆ అమ్మ చల్లగా చూసుకుంటుంది అని నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు భక్తులు..

Monday, July 19, 2010

చంద్రయానం నా మొదటి స్టోరీ

Sunday, July 18, 2010

సుక్ష్మ ప్రపంచం 3

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
నాలెడ్జ్ ఈజ్ పవర్... సైన్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ మీకందించే దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్కు స్వాగతం.
బ్యాంగ్
ఆకాశం చీలి రెండుగా విడిపోతున్నట్టు కనిపించే మెరుపులు.మిన్ను విరిగి మీద పడ్డట్టు పెళపెళమంటూ ఉరుములు, ఒక్క చిన్న బాంబ్ రాతిఫలకలను పేల్యేయడం వెనక రహస్యాలు తెలసుకునే ముందు గతవారం చూసిన సూక్ష్మరహస్యాలను ఒక్కసారి చూద్దాం.
రీ కాప్
స్పీడ్ యుగం..ఇప్పుడు మనకు ప్రతిదీ ఫాస్ట్ గా కావాలి..బైక్ నడిపినా స్పీడే..మాట మాట్లాడినా స్పీడే..ఆఖరుకు అన్నంతినడం కూడా స్పీడే. ఈ స్పీడ్ మనం ప్రకృతిని చూసి నేర్చుకున్నదే. ప్రమాదమని తెలిసినా మనకుస్పీడంటే అంత థ్రిల్లెందుకు. స్పీడ్ లో ఉన్న సీక్రెట్ మీకోసం.
స్పాట్
మన చుట్టూ పరిసరాలలో కొన్ని చర్యలు మనల్సి అబ్బురపరిచేంత వేగంతో జరుగుతయి. వాటిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అసలెందుకిలా జరుగుతుందని పరిశీలించాలన్నా సాధ్యం కానంత స్పీడ్గా జరుగుతుంటయి. వాటిలో ఏం జరుగుతుందో పరిశీలించాలంటే చర్యావేగం తగ్గించాలి.అప్పుడు దాన్ని నిశితంగా పరిశీలించ వచ్చు. కానీ చర్య వేగాన్ని తగ్గిస్తే ఖశ్చితత్వం దెబ్బతింటది. అప్పుడు వాస్తవానికి, పరిశీలనకు పొంతన లేని పరిశీలన వస్తుంది.
స్పాట్
వేగంగా జరిగే పనులను రికార్డ్ చేసి ఏం జరుగుతుందో గమనించే టెక్నాలజి ఇప్పటి వరకు లేక పోవడంతో పరిశోధకులు సైతం చేతులెత్తేసి ఊహాగానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. రుజువులకు సైద్దాంతిక పరమైన వివరణలు ఇవ్వవలసి వచ్చింది. కానీ ఇప్పడా పరిస్థితి మారింది. ఒక్క నానో సెకన్లో కూడా ఏం జరుగుతుందో రికార్డ చేయగల టెక్నాలజి అందుబాటులోకి వచ్చింది.
స్పాట్
ఒక్క సెకన్ లో కొన్ని కోట్ల కదలికలు జరుగుతాయి. ఇటువంటి వాటి ధర్మాలు మొత్తం వీటి కదలికల్లోనే ఆధారపడతయి.వీటి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే, అడ్వాన్స్ డ్, హైస్పీడ్ అండ్ వెరీ స్లో షట్టర్ కెమేరా కళ్లతో చూస్తే గానీ అసలు రహస్యం తెలీలేదు.
స్పాట్
కనురెప్ప కొట్టేంత స్పల్పకాలంలో ఏం జరుగుతుందో స్పష్టంగా రికార్డ్ చేసే టెక్నాలజి మన ముంగిలిలోకి వచ్చింది. అందుకే అతి సూక్ష్మ చర్యలను కూడా అధ్యయనం చేయడం సాధ్యమయింది.
స్పాట్
కాయ కొట్టడం, బుడగలు, పేస్ట్
రెప్పపాటు వేగం..అంటే 50 మిల్లీ సెకన్ లు, ఈ కాలంలో కూడా జరిగే పనిని కూడా పరిశీలించగల టెక్నాలజి ఇప్పడు అరచేతిలోకి వచ్చింది. కానీ మానవ మేథస్సు 150 మిల్లీ సెకన్లో కొన్ని వేల ప్రతిచర్యలు జరుపుతది. వాటన్నిటినీ మానవ నేత్రంతో గుర్తించడం కష్టం. బెలూన్ కింద పడి ఎగిరితే కనీసం అది ముడతలు పడుతుందని కూడా ఆలోచించం. (బెలూన్)
స్పాట్
ఇది .. అదృష్య చర్యలకు నిలయమైన ప్రపంచం. ఇక్కడ అన్నీ వేగంగా జరిగిపోతయి. రెప్పపాటులో జరిగే వాటిని అసలు పట్టిచ్చుకోం.. ఇక్కడకు వచ్చే వారంతా స్పీడ్ ను థ్రిల్ చేసేవారే..
(ఫ్లైట్, జైంట్ వీట్, బాంబ్ బ్లాస్ట్, వాటర్)
ఈ సృష్టిలో స్పీడ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. అంతెందుకు కొన్న పనులు స్పీడ్గా చేస్తే తప్పకావు. అంతెందుకు శిలీంద్రాలు తమ స్పోర్స్ ను కూడా వేగంగా విడుదల చేస్తయి. లేకుంటా అవి వ్యాపించడం చాలా కష్టం. అవి ఉన్న చోటు నుంచి అత్యంత వేగంగా విసిరితేనే దూర ప్రాంతాలకు వ్యాపించబడుతయి. కానీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్రతి కదలికా మనకు తెలిసి ఉండాలి. అందుకే దీన్ని రికార్డ చేయగలిగితే ప్రతి సూక్ష్మ అంశాన్ని పరిశీలించగలం.
యాంకర్.
ఇప్పడొచ్చిన కొత్త టెక్నాలజి కెమెరాలతో అదృష్య ప్రపంచాన్ని సదృశ్యం చేయగలుగుతున్నాం. మన కంటికి కొంత పరిమితి ఉంది. అంతకు మించి వేగంగా జరిగే చర్యలను కనుపాప స్పష్టంగా గుర్తించలేదు. అందుకే ఇంతకాలం ఆకాశంలో వెలుగులు చిమ్మే మెరుపుల వెనక ఏంజరుగుతుందో తెలుకోలేకపోయాం. కానీ అడ్వాన్స్ డ్ క్యామ్ లు ఈ పనిని చాలా సులువుగా చేసిచూపాయి. ఆ వండర్ థండర్ సీక్రెట్...
(ఉరుము పడే సౌండ్)
ఆకాశాన్ని అతలాకుతలం చేసే ఉరుములు, మెరుపులు, రెప్పపాటులో ఆకాశాన్ని ఆవరించే తెల్లని చారికలు. భయాన్ని, ఆనందాన్ని ఒకేసారి కలుగ జేసే ఆకాశముగ్గులు.అమెరికాలో ఏటా కొన్ని వందల పిడుగులు భవనాలను తాకి విధ్వంసాన్ని సృష్టిస్తయి. మరి వీటివెనక ఉన్న సీక్రెట్ ఏంటో హైడిఫినేషన్ కెమేరాలలో బంధించేందుకు బయలు దేరారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (శాస్ర్తవేత్తలు కారులో వెళ్లే సీన్)
మెరుపు…ఆకాశంలో ఓ అద్భుతం..రెండు విరుద్ద ఆవేశాల మధ్య ఏర్పడే విద్యుద్ఘాతం. వెలుతురుతో చూడ్డానికి అందంగా ఉన్నా, ఆ వెంటనే కర్ణకఠోరంగా వినిపించే ఉరుము శబ్దమే భయపెడుతది.
స్పాట్ ( ఉరుములు మెరుపులు స్పాట్ ఆంబియన్స్)
ఈ స్లో మోషన్ కెమెరాలతో ఈ మెరుపు వెనక రహస్యం ఛేదించడం సులభసాధ్యమయింది. ఈ స్పెషల్ కెమెరాలు, అసలు వేగం కంటే 300రెట్లు స్లోమోషన్ కాప్చర్ చేయగలవు.
స్పాట్
మొదట్లో మెరుపంటే కేవలం ఒక కాంతి లాగానే భావించారు. కానీ స్లో మోషన్లో గమనిస్తే మెరుపు మర్మాన్ని పసిగట్టారు.
స్పాట్
ఇది భూమి నుంచి ఆకాశానికి విస్తరిస్తున్న స్పార్క్. ఈ స్పార్క్ కు మిలియన్ ఓల్టేజీల శక్తి కలదు. దీని మధ్య బాగంలో సూర్యకేంద్రంలో విడుదలయ్యేంత శక్తి విడుదలవుతది.
స్పాట్
ఇప్పటి వరకూ మెరుపంటే రెండు మేఘాల మధ్య జరిగే విద్యుదావేశ చర్యగా భావించారు శాస్ర్తవేత్తలు. అతి తక్కువ పీడనంలో మేఘం భూమితో జరిపే విద్యుత్ చర్యను పిడుగుగా భావించేవారు. అంటే పిడుగు ఆకాశం నుంచి భూమి పై ఉన్న ఎత్తేన ప్రదేశాల పై అంటే భవనాలు, టవర్లు, చెట్ల పై పడుతుందని శాస్ర్తవేత్తలు భావించేవారు. కానీ భూమి నుండి పిడుగు ఆకాశానికి దూసుకెళుతుందన్న సత్యాన్ని రుజువు చేసింది అడ్వాన్స్డ్ టెక్నాలజి. మెరుపు వేగాన్ని విశ్లేషించాలంటే మాటలా..అందుకే.. మేఘం నుంచి కిందికి వచ్చే మెరుపుకంటే భూమి నుంచి ఆకాశానికి ఎగసే మెరుపుకే ఎక్కువ శక్తి ఉంటది అనే సత్యం ఈ స్లోమోషన్ టెక్నాలజి ద్వారా రుజువయింది.
స్పాట్
ఒక్కోసారి ఈ మెరుపు కొన్ని సెకన్ల పాటు నిలకడగా ఆకాశానికి నిచ్చన వేసినట్టుండి శాఖోపశాఖలుగా విస్తరిస్తది. ఆ శాఖలు మరిన్న ఉపశాఖలుగా చీలి ఆకాశాన్ని ఆవృతం చేసినా ..మెయిన్ స్ట్రిప్ మాత్రం కొన్ని సెకండ్ల పాటు బ్లింక్ మోడ్ లో అలాగే ఉండి వెలుతురు పంచుతది.
స్పాట్
ఒక్క మెరుపులో బిలియన్ వాట్ల విద్యుత్చ్ఛక్తి విడుదలవుతది. ఇది భూమి పై పడ్డ చోట ఏది ఉన్నా మాడి మసయిపోవాల్సిందే. పిడుగు ప్రభావాన్ని బట్టి పెద్ద భవనాలయితే పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతింటయి. పెద్ద పెద్ద భవనాలు, కంపెనీలు ఈ పిడుగు బారి నుండి రక్షించుకునేందుకు లైటనింగ్ కండక్టర్లు వాడుతరు.
బ్రేక్ యాంకర్
ఆకాశంలో మెరుపులే కాదు. తారాజువ్వలు తళుక్కుమన్నా పెద్దవాళ్లు కూడా పసిపిల్లలై పోతరు. ఆ మతాబుల మాటున ఉన్న మతలబు ఏంటో మనకు తెలీదు. ఈ టపాకాయల్లో ఉన్న మిల్లీగ్రాం కెమికలే అంత ప్రభావం చూపితే..డిటోనేటర్లు పేలినపుడు ఎలా ఉంటుంది. మందుపాతరల మాటున రహస్యం ఏంటి..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
యాంకర్
గ్రానైట్ క్వారీలలు, ఐరన్ ఓర్ క్వారీలలు, సింగరేణి ఓపెన్ కాస్టులు నిత్యం బాంబుల మోతతో హోరెత్తి పోతయి. పిడికెడి కెమికల్ పర్వతాలను కూడా పిండిపిండి చేయగలవు. వీటికి అంతటి శక్తి ఎక్కడిది. బాంబ్ బ్లాస్టింగ్ ల వెనక ఉన్న మైక్రోస్కొపిక్ సీక్రెట్ మీకోసం.
వాయిస్
ఆకాశంలో విరబూసి మాయమవుతున్న ఈ తారా జువ్వలను చూడండి ఎంత అందంగా ఉన్నయో. మనకు ఇంత ఆనందాన్ని పంచే ఈ మతాబుల వెనక ఉన్న మతలబు చిటికెడు కెమికల్. ఈ చిచ్చుబుడ్డిని చిచ్చుపిడుగును చేసేది కూడా కాసింత కెమికలే. ఈ చిటికెడు కెమికల్ ఇంత వేగంగా పేలితే మరి భారీ డంప్ లో ఉన్న కెమికల్ ఎలా పేలిపోతుంది..ఒక్కసారి చూద్దాం..
స్పాట్( బ్లాస్టింగ్)
ఇక్కడ వీళ్లు చేసే హడావుడి చూస్తున్నారుగా..వీరు ఈ క్వారీలో ఉన్న మట్టిని తొలగించేందుకు డిటోనేటర్లను అమర్చి, పేల్చేందుకు సిద్ధం చేస్తున్నరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్ లో 20 వేల టన్నుల వెయిట్ ఉండే రాతిఫలకలున్నయి. ఈ రాతిని చీల్చి మైన్ ను వెలికితీసేందుకే ఈప్రయత్నం. దీన్ని పేల్చేందుకు 20 ప్రత్యేక రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్ధాలు నింపుతరు. ఒక హోల్ నుంచి ఇంకో హోల్ కు పవర్ పాస్ కావడానికి 20 మిల్లీ సెకన్ల సమయం మాత్రమే పడుతది. అంటే ఆఫ్ సెకన్లోనే అన్నిటికి పవర్ పాసై ఒకేసారి పేలుతయన్నమాట. నిజానికి ఒక్కసారి పేలినట్టు అనిపించినా.. ఇవ్నీ వేరువేరుగా పేలుతాయన్న సూక్ష్మ రహస్యం నిశితంగా పరిశీలిస్తే మాత్రమే తెలుస్తది.
స్పాట్
ఇక్కడ అమర్చిన 20 డిటోనేటర్లలో ఒక డిటోనేటర్ పేలిన తర్వాత దాని షాక్ పక్కనున్న రాక్ పై పడి ఆ రాక్ లూజ్ అవుతది. అంటే రెండవ బ్లాస్ట్ కు లూజ్ సాయిల్ ఉంటది. ఇలా ప్రతి బ్లాస్టింగ్ దానికంటే ముందు బ్లాస్టింగ్ వల్ల లూజ్ అయిన సాయిల్ ను ఈజీగా పేల్చే అవకాశం ఉంటది.
స్పాట్
ఒక్క పేలుడుతో 20వేల టన్నుల రాళ్లు సెకన్లో కప్పకూలిపోయింది.
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్)
ఇప్పుడీ పేలుడు ఎలా జరిగిందో చూద్దాం..
స్పాట్ (బ్లాస్టింగ్ స్లోమోషన్ సీన్స్ తో)
ఇలా రాక్ వాల్ పై కనిపించే ఫ్లాష్లు, డిటోనేషన్ కేబుల్లో ఎలక్ట్రికల్ రియాక్షన్ స్పార్క్. ఇది మన స్లో మోషన్లో చూస్తేనే స్పార్క్లు ఇంత స్పీడ్ గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం చర్య పూర్తి కావాడానికి పట్టేకాలం కేవలం 25మిల్లీ సెకన్లు మాత్రమే.
స్పాట్
చూశారా ..ఈ బ్లాస్టింగ్ ముందు ఎటువైపు నుంచి ప్రారంభమయిందో..ప్రతి మిల్లీ సెకన్ను రికార్డు చేసి చూస్తే గానీ అసలు విషయం అర్ధం కాదు. మన మామూలు కంటితో చూస్తే అన్నీ ఒకేసారి పేలినట్టనిపిస్తది.
స్పాట్
భూ అంతర్భాగంలో ఉన్న షాక్ వేవ్స్ ఒక చోటు నుంచి మరో చోటుకు రెప్పపాటు కాలంలో పయనించి, టన్నుల కొద్దీ రాక్ సాయిల్ ని కుప్పపోస్తది.
బ్రేక్ యాంకర్
చూశారుగా ఒక్క బటన్ ప్రెస్సింగ్ తో నిలువెత్తు రాతిగోడ క్షణాల్లో కూలిపోయింది. ఈ బాంబులకు ఇంత పవర్ ఎక్కడిది. బ్లాస్టింగ్ వేవ్స్ ఎలా మూవ్ అయితాయో తెలుసుకునేందుకు శాస్ర్తవేత్తులు పెద్ద ప్రయోగమే చేసిండ్రు. ఈ ప్రయోగ విశేషాలు చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్
కాసింత కెమికల్ క్షణాల్లో పెద్దపెద్ద పర్వతాలను సైతం పెకిలించగలదు. వేయి మంది ఒక రోజంతా చేయగల పని ఒక్క బాంబ్ క్షణంలో చేయగలదంటే నమ్మరా..మొదట పరిశోధకులు కూడా నమ్మలేదు ప్రయోగం చేసి రుజువు చేసుకునేదాకా..ఇదిగో ఇలా.
స్పాట్
ఒక చిన్న ట్రిగ్గర్ బలమైన బ్లాస్టింగ్ సృష్టిస్తది. రెప్పపాటు కాలంలో అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మిన్ను విరిగి మీద పడ్డంత శబ్దంతో పేలుతుంది.ఈ ప్రేలుడు జరిగేటప్పుడు అసలేం జరుగుతదో తెలసుకునే అవకాశం ఉండదు. అందుకే ఈ బ్లాస్టింగ్ ను సూపర్ స్పీడ్ కెమెరా కళ్లతో బంధించి ప్రతి మిల్లీ సెకన్ను స్టడీ చేస్తే బ్లాస్టింగ్ లో దాగిన సీక్రెట్ బ్లాస్ట్ అయింది.బ్లాస్టింగ్ ఎలా జరుగుతది..దాని వేవ్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతయి అనే విషయాలు స్పష్టంగా తెలిసింది.
స్పాట్
ఈ బ్లాస్టింగ్ ప్రయోగం చేయడానికి శాస్ర్తవేత్తల బృందం బయలుదేరింది.
స్పాట్
ముందుగా భారీ విస్పోటనానికి సరిపడా గన్ పౌడర్ ను ఒకస్టీల్ డబ్బాలో నింపారు. ఆ స్టీల్ టిన్ కు ఎలక్ట్రికల్ ఇగ్నిషన్ ఫీజు అమర్చిండ్రు. తర్వాత ఈ ఎలక్ర్టికల్ కేబుల్ను సుమారు అర కిలోమీటర్ దూరం వరకు లాగిండ్రు. ఆ ప్రాంతం నుంచి టీం మొత్తం దూరంగా వెళ్లిపోయారు.
స్పాట్( టీం దూరంగా వెళ్లే షాట్)
బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ లు మాత్రం అక్కడే ఉన్నరు. వీరు షాక్ ప్రూఫ్ వెహికిల్లో కూర్చొని బాంబ్ని బ్లాస్ట్ చేస్తరు.
స్పాట్( కౌంట్ డౌన్ చేస్తూ బాంబ్ పేల్చే సీన్)
చూశారుగా ఒక్క సెకన్ లోపే బటన్ ప్రెస్ చేయడం బాంబ్ బ్లాస్ట్ కావడం జరిగింది. అసలేం జరిగిందో పరిశీలించే లోపే గన్ పౌడర్ పేలి గాలిలో కలిసిపోయింది. ఈ మొత్తం పనిని కెమెరాలో బంధించి నిశితంగా పరిశీలిస్తే బాంబ్ ఎలా పేలిందో తెలుస్తది. ఇప్పుడు ఈ విజువల్ ను 100 రెట్లు స్లోమోషన్లో చూద్దాం..
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్ వాడుకోవాలి)(4,3,,2,1 కౌంట్ డౌన్ కూడా)
ఇదిగో ఇక్కడ బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ బటన్ ప్రెస్ చేయగానే కేబుల్ వైర్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ సప్లై అవుతది. బటన్ నొక్కిన సెకన్లో 1000వంతు టైంలో బాంబ్ కు అమర్చిన ఇగ్నిషన్ యాక్టివేట్ కావడం, బాంబ్ పేలడం జరుగుతుంది.
స్పాట్ ( మళ్లీ బాంబ్ పేలేసీన్లు)
సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఘన పదార్ధంగా ఉన్న గన్ పౌడర్ వాయుపదార్దంగా అనంత వాయువుల్లో కలిస్తది.
స్పాట్( బాంబ్ పేలే సీన్ )
ఇప్పుడు స్పష్టంగా పరిశీలిస్తే..బాంబ్ షాక్ వేవ్స్ ఎలా విస్తరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తది. చూడండి ..బ్లాస్టింగ్ ని ఆవరించి ఒక ఆవిరిలాంటి పొర పైపైకి వెళ్తున్నది. వాస్తవానికి అది ఆవిరి పొర కాదు. బ్లాస్టింగ్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఫోర్స్ బుల్ గా ఒకే సారి నెట్టేయడం వల్ల...పెద్దశబ్దంతో బాటు..షాక్ వేవ్స్ వస్తయి. ఒక్క క్షణంలో బాంబ్ చుట్టూ ఉన్న 300మీటర్ల పరిధి విస్తీర్ణం భస్మీ పటలం అవుతుంది.
స్పాట్
ఎండ్ యాంకర్
ఓకే ఫ్రెండ్స్. ఇవీ ఇవారం సైన్స్ విశేషాలు. మరిన్ని మంచి విషయాలతో ఇదేవారం ఇదే సమయానికి మీ ముందుంటా. అంటిల్ దెన్ బైబై

(బాంబ్ బ్లాస్టింగ్ షాట్స్)
గతవారం రివ్యూ ( దీన్ని న్యూస్ ఎక్స్ ప్రెస్ లాగా స్పీడ్ గా చదవాలి)
పెద్ద పెద్ద మంచు పర్వతాలనుంచి సడన్గా మంచు చరియలు విరిగిపడటానికి గల కారణం ఏంటో శాస్ర్తవేత్తలకు చాలా కాలంవరకు అర్ధం కాలేదు. దీనికోసం శాస్తవేత్తల బృందం చేసిన పరిశీలనలో మంచు లోతుల్లో దాగిన రహస్యం తెలిసింది. చిన్న చిన్న ఐస్ ఫ్లేక్స్ కలిసి పర్వతాన్ని ఆవరించి ఒకే మంచు గడ్డలా తయారవుతది. దీనికి కారణం ఐస్ ముక్కల మధ్య హైడ్రోజన్ లాటిస్ బందాలుంటయి. కొంత కాలం తర్వాత ఈ లాటిస్ బందాలు సడలిపోయి అణువుల మధ్య దూరం పెరగ్గానే కొత్తగా ఏర్పడ్డ మంచు లేయర్ మొత్తం పర్వతం నుంచి విడిపోయి ఒకేసారి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భీభత్సం సృష్టిస్తయి.
స్పాట్
మనల్ని తరచు బాధ పెట్టే జలుబు మన చుట్టూ ఉన్న గాలిలో నిత్యం తిరుగాడే వైరస్ క్రిముల వల్ల వస్తది. ఒక్కసారి చేసే స్నీజింగ్ సెకన్ కాలంలో 40మీటర్లు వ్యాపించి కొన్ని కోట్ల వైరస్లను వాతావరణంలోకి విస్తరింపజేస్తది.
స్పాట్
రానున్న రెండేళ్లో సన్ స్పాట్ ల నుంచి రేడియోధార్మిక కిరణాలు, మాగ్నటిక్ వేవ్స్ భారీగా విడుదల కాబోతున్నయి.ఇవి భూమి పై ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ర్టానిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయబోతోంది. వీటినుండి రక్షణ పొందేందుకు శాస్ర్తవేత్తల బృందం ఒక టెక్నిక్ ను కనిపెట్టింది. ఈ మాగ్నటిక్ వేవ్స్ రిలీజయ్యేటప్పడు అన్ని వ్యవస్థలను నిలుపుచేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకున్నరు. అయితే ఆ వేవ్స్ రిలీజ్ అయ్యేసమయాన్ని గుర్తించేందుకు ఒక మిషన్ను కేవలం బెలూన్ సాయంతో పైకి పంపించి సూర్యడి పై నిఘా వేశారు.
స్పాట్

సుక్ష్మ రహస్యం 2

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
సృష్టిలోని సూక్ష్మ రహస్యాలను ఒడిసిపట్టి మీ ముంగిలిలో ఉంచే దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్కు స్వాగతం.
యాంకర్ 1
మంచు పర్వతాలు పెకిలించే పరమాణు రహస్యం, జలుబు వెనక దాగిన జీవరహస్యం. సూర్యప్రళయాన్ని ఎదుర్కొనే సూక్ష్మ రహస్యం..ఇవన్నీ తెలుసుకునే ముందు గతవారం చూసిన సూక్ష్మ ప్రపంచాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకుందాం.
వాయిస్
స్పైడర్..మన ఇళ్లలో బూజుతో చిరాకు కలిగించే ఆర్ధోపొడా కీటకం. కానీ దానిలో దాగిన గర్భ రహస్యాన్ని ఛేదించారు శాస్ర్తవేత్తలు. సాలీడు గర్బంలో స్పికెట్స్ స్రవించే లిక్విడ్ ప్రోటీన్ పొరలు పొరలుగా కలిసి ఒకే దారంగా వస్తది. పొరలు పొరలుగా ఉన్న దారానికి బలమెక్కువ.
స్పాట్
సాలీడు తాను అల్లే గూడులో కూడా ఇంజనీరింగ్ ప్లాన్ అమలు చేస్తది. టెంపర్ కలిగిన దారంతో అల్లిన గూడుకి ఎలాస్టిక్ నేచర్ రావడానికి కారణం గూడు అల్లేటప్పుడే జంక్షన్ల వద్ద కొన్న కుచ్చులను వదులతది. ఇదే సీక్రెట్తో హంబుల్ బ్రిడ్జి నిర్మిచారు. ఈ దారంలో ఉన్న అమరికలను అధ్యయనం చేసి నానోకార్భన్ థ్రెడ్ ను తయారు చేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసిండ్రు. ఈ దారం మానవ వెంట్రుక కంటే 5 రెట్లు సన్నగా ఉండి ఇనుము కంటే పదిరెట్లు ఎక్కువ బలం ఉంటది. సాలీడు దారంలో దాగిన మైక్రోస్కోపిక్ సీక్రెట్ అది.
స్పాట్
మన నిత్యం కొన్ని కోట్ల రకాల మైక్రోమ్ లతో సహవాసం చేస్తున్నం. ఇవి అక్కడా ఇక్కడా అని కాకుండా నఖశిఖ పర్యంతం అన్ని చోట్లా తిష్టవేసుకొని ఉంటయి. నడిచే పాదాలకిందా, నీటి కుళాయి పైనా, నూడిల్స్ లో కలుపుకునే వెనిగర్లో కూడా వేలాది మైక్రోమ్ లు చేరి మన శరీరంలో ప్రవేశిస్తయి. అవి ఒకరి ద్వారా ఒకరిలోకి ప్రవేశిస్తయి.
స్పాట్
యాంకర్ 2
ఒక్క సూక్ష్మ నిర్మాణం పెద్ద పెద్ద నిర్మాణాలను ఎలా శాసిస్తాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తది. ఒక్క పరమాణువులో కదలిక మంచు పర్వతాన్నే కూలదోసి, మంచు తుఫాన్ ను సృష్టిస్తుందంటే నిజంగా వండర్...ఆ వండర్ సీక్రెట్ మీ కోసం..
స్పాట్
వాయిస్
పెద్ద మంచు శిఖరాలు ఉన్నట్టుండి ఎందుకు విరిగి పడతయో చాలా కాలం వరకు శాస్ర్తవేత్తలకు కూడా అంతుబట్టలేదు. ఇందులో దాగిన మంచు రహస్యమేంటో తెలియలేదు. ఈ మంచు కొండ చరియలు విరిగిపడటం వలన ఊహించని ప్రమాదాలు ఎదరయ్యేవి. స్కీయింగ్ చేసేవారికి , షెల్టర్ తీసుకునే వారికి అనుకోని విపత్తులు ఎదురయ్యేవి. ఈ విపత్తు వలన ఒక్కోసారి వందలాది ప్రాణాలు గాలిలో కలుస్తయి. అందుకే ఈ మంచులోతుల్లో దాగిన మర్మాన్ని వెలికితీసేందుకు బెల్ట్ బిగిచారు పరిశోధకులు.
స్పాట్
మంచు చరియల్లో దాగిన రహస్యాన్ని ఛేదించే ముందు మంచు యోక్క మర్మాన్ని అధ్యయనం చేశారు పరిశోధకులు.
ఇవి సన్నని మంచు ఫలకలు..వజ్రపు బిళ్లల్లా ఉన్న ఈ ఐస్ ఫ్లేక్స్ ఒకదానికొకటి కలిసినపుడు ఇదిగో ఇలా షట్కోణాకారంలో పూల వంటి బంధాలతో అన్ని ఫలకలు కలుస్తయి.
వీటి మధ్య ఏర్పడే బలమైన లాటిస్ బందాలు మంచు ఫలకాలను పట్టి ఉంచుతయి.
స్పాట్
ఒక్కసారి స్నో ఫ్లేక్స్ దగ్గరయినపుడు అన్నీ బలమైన బంధాలు ఏర్పరచుకొని ఒకే గడ్డలా మారిపోతయి.
స్పాట్
ఇదుగో మంచు కణాల మధ్య బంధాలను ఒక్కసారి పరిశీలిస్తే అసలు నిజం కనిపిస్తది. స్నో క్రిస్టల్స్ నిర్ణీత ఉష్ణోగ్రతలో బంధించ బడుతయి. వీటి మధ్య ఉన్న లాటిస్ బంధాలే వీటిని పట్టి ఉంచడానికి కారణం.
స్పాట్
మంచు స్పటికల మధ్య ఏర్పడిన బలమైన బంధాలు ఏర్పడటం వల్ల పర్వతాన్ని ఆవరించిన మంచు మొత్తం ఒకే గడ్డలా మారి పర్వతాన్ని ఆవరించి ఉంటది.ఉపరితలంలో మనకు తెల్లని ముగ్గులా కనిపిస్తున్న మంచు కుప్పలు కొద్దిగా చెదిరినా సర్దుకుంటయి. దానిపై వాహనాలు నడిచినా పెద్ద ప్రమాదం లేదు. ఎండ తన ప్రతాపం చూపించినా కరిగిపోయిన మంచు కరిగిపోగా మిగిలిన మంచు పొరలు క్షేమంగా ఉంటయి.
స్పాట్
ఇంత బలంగా పాతుకు పోయిన మంచు పర్వతాను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నరు. ఈ సడెన్ ఐస్ సైక్లోన్ కు కారణం ఏమిటి..ఈ మంచు తుఫాన్ ఆశామాషీ తుఫాన్ కాదు..ఒక్క కుదుపుకు 30వేల టన్నుల మంచు విరిగిపడతది. ఇది కేవలం 10 సెకన్ల వ్యవధిలో 200 కిలోమీటర్ల దూరం దూసుకొని పోగలదు. దీని మార్గమధ్యంలో ఏం ఉన్నా దానికి తలొంచాల్సిందే..
స్పాట్
నిర్మలంగా, ప్రశాంతంగా యోగిలా ఉండాల్సిన మంచు పర్వతానికి ఈ ఉగ్రరూపం ఇచ్చేదెవరు...
మంచు అంతరాలలో దాగి ఉన్న ఓ మైక్రోస్కోపిక్ సీక్రెట్..
ఈ మొత్తం మంచు పర్వతాన్నే అతలాకుతలం చేస్తుంది. ఇంతకీ ఏమిటా సీక్రెట్ అనే విషయాన్ని తేల్చేశారు శాస్ర్తవేత్తలు.
స్నోఫ్లేక్స్ కలిసిపోయేటపుడు హైడ్రోజన్ బంధాలతోని ఒకదానికొకటి కలిసిపోయి లాటిస్ బంధాలు ఏర్పడుతయి. ఈ బంధాలు మంచు ముక్కలను మంచు పర్వతాలుగా ఏర్పస్తయి. వీటి జీవిత కాలం కొంతకాలం వరకే ఉంటుంది. ఆ నిర్ణీత కాలం తరువాత ఈ లాటిస్ బంధం బలహీనమయి కణాలమధ్య దూరం పెరుగుతది. వాటి మధ్య గాలి చొరబడి కణాల మధ్య దూరాన్ని మరింత పెంచుతది. వీటికి ఉష్ణోగ్రత తోడైతే ఇది మరింత వేగంగా జరుగుతుంది. అదే ఒకే మంచు దుప్పటిలా ఉన్న ఈ పర్వతపు మూలాలను కదిలిస్తది.ఈ మార్పు క్షణ కాలంలో అన్ని అన్ని అణువులకు చేరతది. పర్వతం అణువణువునా వ్యాపించి మంచు పర్వతంలో పైబాగాన ఉన్న ఒక లేయర్ మొత్తం పర్వతం నుంచి వేరవుతది. మంచు చరియల్లో ఏర్పడిన ఈ పగుళ్ల మధ్య ఘర్షణలేక పోవడం వల్ల పై లేయర్ పై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పెరుగుతది. అంతే.. వేల కిలో మీటర్ల ఎత్తులో ఉన్న మంచు చరియలు రాకెట్ వేగంతో కిందికి దూసుకొస్తయి. ఈ మంచు తుఫాన్ దారిలో ఏది ఉన్నా దానికి తలొంచాల్సిందే..
స్పాట్
వేల మీటర్ల ఎత్తున సగర్వంగా నిలుచొని అందం ఒయ్యారాలు పోతున్న మంచు పర్వతం ప్రాణం ఒక్క చిన్న మంచు ముక్కలో ఉంది. ఆ మంచు ముక్కే కొంప ముంచుతుంది. హైడ్రోజన్ లాటిస్ బంధాల విలువేంటో అప్పడు గానీ శాస్ర్తవేత్తలకు తెలిసిరాలేదు.
స్పాట్
ఫస్ట్ బ్రేక్ యాంకర్
హచ్..జలుబు.. ఇది పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.అది అటాక్ అయిన దగ్గర నుంచి వదిలిపోయే దాకా మనిషిన ఇబ్బంది పెడతది.జలుబంటే అలర్జీ వల్లనో వాటర్ చేంజ్ వల్లో అనుకుంటం. నిజానికి జలుబుకు ఇవి కూడా కారణాలైనప్పటికీ ..ఇవే కారణాలు కావు. మరి మనిషికి జలుబు ఎలా ఎలాక్ అవుతుంది. జలుబు వెనక దాగిన జీవరహస్యమేంటి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
యాంకర్ 2
జలుబు.. ఇది ప్రతి ఒక్కరిలో ఒచ్చే కామన్ ఇన్ఫెక్షన్..కానీ ఒక్కసారి చేసే స్నీజింగ్ లో శరీరంలో ప్రతి కండరం పనిచేస్తది. ఒక్క తుమ్ముకోసం మన శరీరం ఇంత పని చేస్తదని మనం కనీసం ఆలోచించం..ఎప్పుడైనా కాస్త మెడనరం పట్టినప్పుడో..లేదా శరీరంలో ఎక్కడైనా నరం పట్టినప్పుడో ఒక్క తుమ్ము వస్తే నరకం అంచులు కనిపిస్తయి. శరీరం మొత్తాన్ని లోబరుచుకునే ఈ జలుబుకింత జోరెక్కడిదో మీరే చూడండి..
స్పాట్
మనం హాయిగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి. బిజీ బిజీగా మన పని మనం చేసుకుపోతున్నా..మనకు తెలియకుండా అసంకల్పితంగా చేసే పని శ్వాస. ఈ శ్వాస మనకు రకరకాల కష్టాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే స్వచ్ఛంగా ఉందనుకున్న గాలిలో ఎన్ని మైక్రో ఆర్గాన్స్ విహరిస్తున్నాయో తెలిస్తే ..మనకు ఊపిరి పీల్చడానికి కూడా భయమేస్తది.
స్పాట్
మన నిత్యజీవితంలో పక్కవారెవరైనా పొగ త్రాగి వదిలితే హాలు ఆ చివర నుంచి ఈ చివరకు తెలిసిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఉచ్వాస వాయువు క్షణక్షణానికి హాల్ మొత్తం నిండిపోతుందన్నమాట.అటువంటి వందలాది మంది ప్రయాణించే బస్సు, రైళ్లలో, సినిమా థియేటర్లలో..మన చుట్టూ ఎందరి ఎంగిలి వాయువులుంటాయి.. తలచుకుంటేనే అదోరకంగా ఉంటుంది. కానీ గాలికి రంగు, వాసన ఉండవు కాబట్టి ఏ అరమరికలు లేకుండా, అబ్బే అనుకోకుండా హాయిగా, స్వేచ్ఛగా శ్వాసిస్తూ బతుకుతున్నాం..
స్పాట్
మన నాసికా రంద్రాలకు కూడా స్పర్శ తెలియనంత నిదానంగా శ్వాసిస్తం మనం. అలా వదిలిన వాయువులే హాల్ నిండిపోతే మన కండరాల శక్తి మొత్తం ఉపయోగించి విడుదల చేసే వాయువుల్లో అంటే..బలంగా తుమ్మే తుమ్ములో ఉన్న వైరస్ సహిత వాయువు ఎంత దూరం విసరబడుతుందో తెలుసా..ఒక్కసారి బలంగా తుమ్మితే దాని ప్రభావం కొద్ది క్షణాలలో 40 మీటర్లు విస్తరిస్తది. ఈ వాయువుల్లో జలుబును కలుగజేసే ఇన్ఫ్లోయేంజా వైరస్లు కొన్ని కోటానుకోట్లు ఉంటయి. ఇవి మన కంటికి కనిపించవు. మనం పీల్చే గాలిలో ఇవి ఉంటయని మనం కనీసం ఊహించే అవకాశం కూడా ఉండదు. మన ఎంత బిజీగా మన పనిలో మునిగి పోతమే ఈ వైరస్లు కూడా అంతే బిజీగా మనలోకి చొచ్చుకోని వస్తయి. మనం చేసే ప్రతి పనిలోనూ ఇవి మేమున్నామంటూ ఆవరిస్తయి. ఇవేవి విక్స్ మూత తీసే వరకు మనకు తెలీదు. మన ముక్కు మన చేతికి పని చెప్తే గానీ అప్పడు నీరు పడలేదనో, ఎలర్జీ అనో సరిపెట్టుకుంటం.
స్పాట్
ఈ మైక్రో ఆర్గానిజం అప్పటికప్పుడు తమ ప్రతాపం చూపకపోయినా..గాలిలో నుంచి మన చుట్టూ ఉన్న వస్తువుల పై తిష్టవేసి ఏదైనా ఆతిధేయి దొరికేవరకు అలాగే నిరీక్షిస్తయి. ఈ మైక్రోమ్ల మీద చేయి వేసినపుడో, లేదా మన శరీర బాగం ఇవి ఉన్న చోట తాకినా ఇవి మన చుట్టాలవుతయి.మనలో బాగమై మన ఇంటిలో వారికీ అంటుకుంటయి.
స్పాట్
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా జలుబు నమోదయింది. ఇంత చేసి జలుబును ఓ కామన్ కాఫ్గా ట్రీట్ చేసి లైట్ తీసుకుంటున్నరు. ఇది పెద్ద ప్రమాదకారి కాకపోవడం వల్ల ఇబ్బంది లేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది పెద్ద పెద్ద వ్యాదులు కలగ జేసే మైక్రోమ్లకు వాహకంగా కూడా పనిచేస్తది.
స్పాట్
సెకండ్ యాంకర్ బ్రేక్
సూర్య ప్రళయం.. సన్స్ స్పాట్స్ నుంచి రిలీజ్ అయ్యే మాగ్నటిక్ వేవ్స్.. భూమి పై ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రినిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తది. ఈ భూ అయస్కాంత క్షేత్రం పై కూడా తన ప్రభావం చూపబోతోందని నాసా వెల్లడించింది. ఈ విపత్తు నుంచి సునాయాసంగా మానవాళిని రక్షించే ఓ స్మాల్ సీక్రెట్ సైన్టిస్టుల చేతికి చిక్కింది. ఈ సీక్రెట్ మీ కోసం .. చిన్న బ్రేక్ తర్వాత.
యాంకర్ 3
ఇప్పడు అందరి నోటా వినిపిస్తున్న మాట సూర్యప్రళయం..అవును రానున్న రెండేళ్లలో మనకు సూర్యుడితో ముప్పు వాటిల్లనుందా..ఇదే ప్రశ్న ప్రపంచ మేథావులను సైతం ఆలోచింప జేస్తుంది. ఈ విషయం తెలుసుకునే ముందు అసలు సూర్యుడిలో ఏం జరుగుతుందో దానికీ భూమికి సంబంధం ఏంటో తెలుసుకుందాం..
స్పాట్
ఈ సృష్టి మొత్తాన్ని నడిపే అతీతశక్తి ఏదో ఉంది. మన భూగోళాన్ని కూడా నిత్యం జాగ్రత్తగా కాపాడే అదృష్యశక్తి కూడా ఏదో ఉంది. అది కంటికి కనిపించని రహస్యం. ఆ రహస్యమే ఈ భూమి పై ఉన్న సకల జీవరాశులను నడిపిస్తోంది.
స్పాట్
సూర్యుడు..జీవకోటికి ప్రాణాధారమైన శక్తి ఉత్పాదకారకుడు. సూర్యుడిని దూరం నుంచి చూస్తే..అందంగా అద్భుతంగా కనిపిస్తడు. ఉదయం, సంధ్యలో సూర్యుడిని చూస్తే కాస్త మనశ్శాంతిని పొందేవారు కూడా లేకపోలేదు. కానీ సూర్యుడు మనకు కనిపిస్తున్నంత ప్రశాంతంగా ఉన్నాడా..ఒక్కసారి సూర్యుడి ఉపరితలం పైకి తొంగిచూద్దాం..
స్పాట్
ఇప్పడు మనం చూస్తున్న ఈ భీభత్స దృశ్యం సూర్యుడి ఉపరితలానిదే..సూర్యుడి ఉపరితలం పై నిత్యం కోటాను కోట్ల సౌరతుఫాన్లు విజృంభించి సూర్యుణ్ని అతలాకుతలం చేస్తయి. ఈ సోలార్ సైక్లోన్లు భూగోళం పై కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి.. ఈ సౌర తుఫాన్ల ప్రభావం వల్ల భూమి మీద ఎలక్ర్టానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతయి. ఈ సోలార్ సైక్లోన్లు చిన్నా చితక వైతే వాటితో పెద్ద ప్రమాదంలేదు. శృతి మించితేనే అన్నిటికీ ఇబ్బంది.
స్పాట్
సూర్యుడిలో కొన్ని మిలియన్ల సన్ స్పాట్స్ ఉన్నయి. వీటి నుంచి నిత్యం అత్యంత ప్రభావవంతమైన అయస్కాంత వికిరణాలు విశ్వంలోకి వెదజల్లబడుతున్నయి. రాబోయే రెండేళ్లలో వీటి తాకిడి మరింత పెరగబోతోంది. ఎందుకంటే సూర్యుడికి ఒక వైపు ఎక్కువగా సన్స్పాట్లు ఉన్నయి. మరోవైపు చాలా తక్కువ స్పాట్లు ఉన్నయి. భూమి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది.అదే సందర్భంలో సూర్యుడు కూడా వేగంగా తిరుగుతున్నడు. సూర్యుడు భూమికి మధ్య ఈ మెగా సన్స్పాట్లు ఉండేటల్లు అభిముఖంగా రావడం చాలా ఏండ్లకు గానీ జరగదు. భూమికి ఈ సన్ స్పాట్లు అభిముకంగా వచ్చినపుడు ఈ సోలార్ డిజాస్టర్లు తప్పని సరి. ప్రతిసారి వీటి ప్రభావం భూమి పై పెరుగుతూ వస్తోంది. ఈ సారి అంటే 2013లో మన భూగోళం వైపు ఈ సన్స్పాట్లు రాబోతున్నయని, వీటి ప్రభావం కమ్యునికేషన్ వ్యవస్థపై తీవ్రంగా ఉండబోతోందని నాసా ఇప్పటికే తేల్చి చెప్పింది.
స్పాట్
ఈ సోలార్ మాగ్నటిక్ సైక్లోన్ వల్ల భూమి పై ఉన్న ఎలక్ర్టికల్, ఎలాక్ట్రానిక్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను కూడా డామేజీ చేసే శక్తి ఈ సోలార్ సైక్లోన్కుంది.
యాంకర్
మానవాళి ముందుగా మేల్కోక పోతే ఈ సన్ డిజాస్టర్ వల్ల విపరీత పరిణామాలు ఎదురయి, పరిస్తితి మన చేయిదాటిపోయే అవకాశం ఉంది. భూ ధృవాలనే మార్చేయగల శక్తి ఈ సౌర తుఫాన్ కు ఉంది. భూ గమనాన్ని మార్చేసి రుతువులను, కాలాన్ని తిప్పిరాయగల శక్తి ఈ సోలార్ మాగ్నటిక్ వేవ్స్కుంది. ఈ సోలార్ డిజాస్టర్ను శాస్ర్తవేత్తులు ఎదుర్కొంటారా..అయితే ఎలా..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
బ్రేక్
యాంకర్
సన్ స్పాట్స్ రిలీజ్ చేసే మాగ్నటిక్ వేవ్స్ వల్ల ఈ భూగోళానికి, సమస్త మానవాళికి ముప్పు వస్తదని శాస్ర్తవేత్తలు విశ్లేషిస్తున్నరు. మరి ఈ విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోలేమా..నిజంగా సూర్యుడి వల్ల అంతటి ప్రమాదం రానున్నదా అంటే శాస్ర్తవేత్తల వద్దకూడా స్పష్టమైన సమాధానం లేదు..కానీ అటువంటిదే జరిగితే మానవాళిని కాపాడేందుకు ప్రపంచ శాస్ర్తవేత్తలు ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నరు. అంత శక్తివంత మైన సూర్యుడి తాపం నుంచి ఎలా రక్షిస్తారో..ఒక్కసారి చూద్దాం.
స్పాట్
సూర్యుడు అత్యంత శక్తి వంతమైన నక్షత్రం. సమస్త మానవాళికి అదే జీవనాధారం. సూర్యుడిలో నిత్యం కొన్ని మిలియన్ టన్నుల హీలియం వాయువు మండి మనకు ఈ వేడిని పంచుతయి. ఈ నక్షత్రంలో నిత్యం కోట్లకొద్దీ ఆటంబాంబులు పేలినంత శక్తి విడుదలవుతది. న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రక్రియ ద్వారా శక్తి విడుదలవుతది. ఆ ఫిజన్ ప్రాజెస్లో హైలీ ఫ్రీక్వెన్సీ ఉండే రేడియేషన్ రిలీజ్ అవుతది. ఈ రేడియేషన్ వేవ్స్ సన్స్ స్పాట్స్ ద్వారా విశ్వంలోకి వెదజల్ల బడతయి. దీని ప్రభావం సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల పై పడుతది. భూగోళాన్ని మాత్రం ఓజోన్ పొర కొంత మేర ఈ రేడియేషన్ వికిరణాల నుంచి కాపాడుతుంది. తర్వాత ఈ నవగ్రహ కూటమికి కేంద్రమైన సూర్యుడి మచ్చల నుంచి నిత్యం అయస్కాంత క్షేత్రాలు విడుదలవుతయి. ఈ ప్రక్రియ నిత్యం జరిగేదే అయినా సూర్యుడికి ఉన్న పెద్ద మచ్చల ద్వారా ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పడు రానున్న రెండేళ్లలో భూమి వాటికి అభిముఖంగారాబోతుంది. అందుకే ఈ ఆందోళన. కానీ శాస్ర్తవేత్తలు మాత్రం అంతగా భయపడే పనిలేదని ఓదారుస్తున్నరు. ఈ మాగ్నటిక్ వేవ్స్ను మాకొదిలేసి గుండె పై చేయివేసుకొని నిబ్బరంగా నిద్ర పొమ్మని ఆభయం ఇస్తున్నరు.
స్పాట్
సూర్య ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఉపాయం ఒక్కటే. తేనెటీగలు దాడి చేసేటపుడు నీళ్లలో మునిగి తప్పించుకోవడంలాటిదన్నమాట. సూర్యడి నుంచిమాగ్నటిక్ వేవ్స్ రిలీజ్ అయ్యే సమయాన్ని గుర్తిస్తే విపత్తును సగం ఎదుర్కొన్నట్టే. ఈ వేవ్స్ రిలీజ్ అయ్యే సమయాన్ని గుర్తించి టెక్నికల్ అండ్ కమ్యునికేషన్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను స్తంభింప చేయాలి. నిస్తేజమై ఉన్న వ్యవస్థలను ఈ రేడియేషన్ ఏమీ చేయదు. కాకుంటే బ్రేకింగ్ న్యూస్ కాస్తలేట్ గా చేరతయి. అనధికార కోత కాకుండా కొన్ని రోజులు అధికార కోతను భరించాల్సి వస్తది. అంతే ఆ రేడియేషన్ వేవ్స్ దాటిపోయాక మళ్లీ పన్నెండు సంవత్సరాల తరువాత ఇదే టెక్నిక్ని మరిత డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి మరింత రేడియేషన్ పెరగొచ్చని ఖగోళ శాస్ర్తవేత్తల అంచనా.
యాంకర్
ఓకే..మాగ్నటిక్ వేవ్స్ వచ్చేటపుడు కమ్యునికేషన్ సిస్టంను స్థంబింప చేయడం వరకు టెక్నిక్ బాగానే ఉంది. కానీ అది గుర్తిండం ఎలా. సూర్యుడ మామూలు గ్రహం కాదు నిత్యం చూస్తూ కూర్చోడానికి. భగభగా మండుతున్న నక్షత్రం. ప్రత్యేకంగా ఇదే పని కోసం ఎవరో ఒకరు నిఘా పెట్టికూర్చోవాలి. ఇంతకీ ఎవరా ఒక్కరు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కూర్చున్న ఖగోళ మేథావుల గ్రూపు సూర్యుడి నుంచి భూమిని రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నరు.
…..
ఈ పరికరం సూర్యుడి పై డేగ కన్నేసేందుకు రూపొందించినది. 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న సూర్యడి మచ్చలపై ఇదినిఘా నేత్రం. మొట్టమొదటిగా ఇది సైన్స్ చరిత్రలోనే కొత్త అధ్యాయం. అయితే ఇది మన కంటికి కనిపించని సూక్ష్మ రహస్యాలను అధ్యయనం చేయగల శక్తి గలది.
..
ఈ బెలూన్ స్పెషల్ ఎయిర్తో నిపుతరు. ఈ వాయువు హైడ్రోజన్ కన్నా తేలికయినది. ఈ మొత్తం నిర్మాణం తయారు చేసేందుకు సుమారు 85మిలియన్ డాలర్ల ఖర్చయింది. కరెక్ట్ యాంగిల్లోకి రాగానే బెలూన్కు కట్టిన మిషన్తో సహా వాతావరణంలోకి వదుల్తరు. ఈ బెలూన్ వ్యాసార్ధం ఎంత పెద్దదంటే భూమి పై పరిస్తే ఆరు ఎకరాలకు సరిపడా ఉంటది. ఇది నిముషానికి 1000 అడుగుల వేగంతో పైకి ఎగురుతది. ఈ బెలూను -90డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఇదే వేగంతో ఎగురుతది.
స్పాట్
ఈ మిషన్లో ఉన్నటెక్నాలజి ఎంత అడ్వాన్సుడంటే 700 మీటర్ల వ్యాసార్ధం ఉన్న వైడ్ షాట్లో ఉన్న పిన్ పాయింట్ ను కూడా పెద్దగా, స్పష్టంగా చూపించి విశ్లేషించగల శక్తి కలది.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నల్లని మచ్చలే సన్ స్పాట్స్. వీటిపై మిషన్ నిఘానేత్రం వేసి ప్రతిక్షణాన్ని గుర్చించి ఉంచుతది.సన్ స్పాట్స్ నుంచి రిలీజయ్యే ప్రతి రేడియేషన్, మాగ్నటికట్ వేవ్స్ ను గుర్తించి ఎప్పటికప్పడు భూమి పై శాస్ర్తవేత్తలకు పంపుతది. ఆ ఒక్కటి చాలుజ సూర్యుడి ఉపద్రవం నుంచి భూమిని రక్షించడానికి..

ఎండ్ యాంకర్
ఇవీ..ఈ వారం ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ మైక్రోస్కోపిక్ సీక్రెట్స్.మరిన్ని సూక్ష్మరహస్యాలతో మళ్లీ నెక్ట్స్ సాటర్ డే ఇదే సమయానికి మీటవుదా..అంటిల్ దెన్ బై..బై

సుక్ష్మ ప్రపంచం 1

ప్రకృతిలో దాగిన సూక్ష్మ రహస్యాలను ఒడిసి పట్టుకొని శాస్ర్తవేత్తలు చేసే అద్భుతాలను మీ కళ్లముందుంచే ది సైన్స్ ప్రోగ్రాంకు స్వాగతం..ఆశ్చర్యచకితులను చేసే నేచర్ సీక్రెట్లతో సూక్ష్మప్రపంచం మరిన్ని విశేషాలతో మీముందుకొచ్చింది. ఈ వారం కొత్త రహస్యాలను తెలసుకునే ముందు లాస్ట్ వీక్ మైక్రోస్కోపిక్ సీక్రెట్లు ఒక్కసారి రివ్యూ చేసుకుందాం..
బ్యాంగ్

ఈ హరిత గ్రహం పై మానవుడు ఎంతో పురోగతి సాధించాడు. తాను సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నయని, వాటిని సాధించి తీరాలని శతాబ్దాల తరబడి శ్రమిస్తున్నడు. కానీ…తాను కొత్తగా సాధించానని అనుకున్నవన్నీ ప్రకృతిలో అప్పటికే అభివృద్ది చెందని జీవులని పిలిచే సూక్ష్మజీవులు, కీటకాలు, మొక్కలు, జంతువులు, ఒకటేమిటి ప్రకృతిలో అణువణువూ పరిజ్ఞానమే..ఇప్పడు కొత్తవాటిని కనుగొనడంతో బాటు నేచర్ సీక్రెట్లను కూడా అన్వేషించే పనిలో పడ్డడు మానవుడు.
స్పాట్..
చంద్రగ్రహం పై వచ్చిన దుమ్మూ దూళి సమస్యను ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచిస్తున్న మానవుడికి తామరాకు దారి చూపింది..అంతర్నిర్మాణం అధ్యయనం చేయడానికి నానోటెక్నాలజీ ఉపయోగించుకొని సూక్ష్మ రహస్యాలను అన్వేషించడం మొదలు పెట్టిండు మానవుడు. అందులోనే తల వెంట్రుక పై కూడా పేరు రాసే స్ధాయికి చేరుకొండు. నిలువు తలం పై నడిచే బల్లిని చూసి దాని సీక్రెట్ తెలుకున్నడు. తలానికి పాదానికి మధ్య శూన్య ప్రదేశం ఉంటే గ్రిప్ లభిస్తదన్న సీక్రెట్తో సక్కర్లను తయారు చేసిండు. ..
ఇంకా..ఇంకా..ప్రకృతిలో మానవుడి అన్వేషణ కొనసాగుతనే ఉంది.
ఇంట్రో యాంకర్
హంబుల్ బ్రిడ్జ్. ఇంత పెద్ద మానవ నిర్మిత హాంగింగ్ బ్రిడ్జ్. ఎంతో మంది ఇంజనీర్లు, వేలాది మంది శ్రామికులు రేయింబవళ్లు కష్టపడితే ఈబ్రిడ్జి 1981లో పూర్తయింది.ఈ హ్యంగింగ్ బ్రిడ్జ్ ఆలోచన కూడా ప్రకృతి ప్రసాదించిందే..అవును ..ఇలా చూడండి ఈ బ్రిడ్జ్ అంచులో ఉన్న సాలీడుని… ఎంత హుందాగా గూడు కట్టుకొందో…
యాంకర్ 1
స్పైడర్ చాలా తెలివైన కీటకం. ఇక్కడ చూడండి ఓ సాలెపురుగు తన గూడును ఎంత అందంగా, వేగంగా అల్లుకుంటుందో. ముందు నిలువు దారాలను ఆధారాలకు అంటిస్తది. తరువాత ఈ నిలువు దారాలకు బేస్ వేసుకుంటూ అంచులకు వెళ్తది. మళ్లీ అంచుల నుంచి గుండ్రటి వలలాగా అల్లుకుంటూ సెంటర్కు చేరుకుంటది. యస్…సాలీడు ఆయధం తయారయింది. ఇప్పడు ఆ వలలో చిక్కే ఆహారం కోసం ఎదురు చూస్తది.
స్పాట్
యాంకర్ 2
బావుంది..ఈ హాంగింగ్ బ్రిడ్జ్ కట్టడం వెనుక వందలాది మంది ఇంజనీర్ల నైపుణ్యం, వేలాది మంది కార్మికుల శ్రమ ఉంది. చాలా కట్టడాలు స్కిల్డ్ వర్కర్లు నెలల తరబడి కట్టినా నిలువునా ఫెయిలయిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఈ సాలెపురుగు ఇంత అందంగా, ఇంత త్వరగా, ఎలా కట్టగలుగుతుంది. దీనికి కావలసిన మెటీరియల్ ఎక్కడిది. ఆ దారానికి అంత బలమెక్కడిది..ఈ మైక్రోస్కోపిక్ సీక్రెట్స్ మీ కోసం..
వాయిస్
సాలీడు..మనం నిత్యం మన ఇళ్లలో చూసి విసుక్కునే ఒక ఆర్ధోపాడ్ జీవి. ఇది పెట్టే బూజు చూసి పదే పదే విసుక్కునే మనం ఆ బూజు రహస్యం తెలుసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆ బూజే నేడు శాస్ర్తపరిశోధనకు బురుజుగా మారింది. సాలీడులో దాగున్న రహస్యం ఇప్పడు రకరకాల సాంకేతిక పరికరాల తయారీకి పనికొస్తంది. ఇంతకీ ఎంటా సీక్రెట్ అనుకుంటున్నారా…అదే… సాలీడు స్రవించే సిల్క్థ్రెడ్.
స్పాట్
శాస్ర్తవేత్తలు ఒక సాలీడును సేకరించారు…(5 సెకన్స్) . స్పైడర్ గ్రంధుల నుంచి వచ్చే సిల్క్లాంటి దారాన్ని లాగి చూశారు. వండర్ ఎంత సేపటికి ఆగడం లేదు. ఒక సిల్క్ ఫాక్టరీలా దారం అవిచ్చినంగా రావడం శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా 750 మీటర్ల దారం తెగకుండా వచ్చింది. ఇంత పోడవు దారం నాన్స్టాప్ గా రావడం ఒక వింతయితే..ఆ దారం చాలా బలంగా ఉండటం మరో వింత. ఎక్కడిదీ దారం..సాలీడు గర్భంలో దాగిన నర్మ గర్భ రహస్యం ఏమిటి. పరిశోధనలు మొదలు పెట్టారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఒక్కసారి సాలీడు అంతరాంగాల్లోకి తొంగి చూద్దాం…ఇక్కడే ప్రకృతి దాచిన నేచర్ నెట్ పురుడు పోసుకునేది. దీన్ని మానవనేత్రంతో చూసి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. గతంలో ప్రయత్నించి వదిలేశారు కూడా.. కానీ ఇప్పుడు అందుబాలటులోకి వచ్చిన నానో టెక్నాలజి తో ఇది 200రెట్లు సాధ్యమయింది. సాలీడు ఉదర అంతరబాగాన్ని 12000ల రెట్లు మాగ్నిపికేషన్ చేసి చూస్తేగానీ అసలు రహస్యం బోధపడలేదు.. సాలీడు అంతరాంగాల్లో విహరించినంత పెద్దదిగా చేసి పరిశోధించారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దబొడిపెల్లాంటి బాగాలను స్టినరేట్స్ అంటరు. ప్రతి స్టినరేట్ పై డజన్లకొద్దీ స్రావక కేశాలుంటయి. ఈ స్రావక కేశాలను స్పికెట్స్ అని పిలుస్తరు. సాలీడు స్రవించే సిల్క్ దారపు రహస్య ద్వారాలు ఇవే..తాను దారం రిలీజ్ చేసేటపుడు అంతఃస్రావీ గంధులు ఎంజైమ్ లను విడుదల చేస్తయి. ఈ ఎంజైమ్ ప్రభావంతో స్పికెట్స్ లిక్విడ్ ప్రోటీన్లను ఫోర్స్తో స్రవిస్తయి. ఇలా ఒకేసారి అనేక స్పికెట్లు దారాలను స్రవిస్తయి. ఇవన్నీ పొరలు పొరలు ఒక కలిసి ఒకే కట్టలాగా తయారయితయి. బయటకు వచ్చేటపుడు ఒకే దారం లాగా కనిపిస్తది. ఈ దారానికి ఇంత పట్టు ఉండటం వెనక ఉన్న గుట్టు ఇదేనని కనిపెట్టారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఒక్కో స్పైడర్కు 7రకాల దాదాలను ప్రొడక్ట్ చేసే కెపాసిటీ ఉంటది. ఆధారాలను పట్టిఉంచేందుకు ఒకరకం దారాన్ని ఉపయోగిస్తే..వెబ్ ను క్రియేట్ చేసేందుకు మరోరకం దారం ఉపయోగ పడతది. వెబ్ లో చిక్కిన కీటకాన్ని బంధించేందుకు జిడ్డు మాదిరిగా ఉండే మరో రకపు థ్రెడ్ను కూడా రిలీజ్ చేసే శక్తి ఈ సాలీడుకు ఉంటది. చూసీ చూడనట్టు చూసి వదిలేసే మనకు మాత్రం సాలీడు ఒకేరకమైన దారం స్రవిస్తదని అనుకుంటం. ప్రతి దారం కూడా మనం నమ్మలేనంత గట్టిగా ఉంటది. ఈ దారం ఇంత గట్టిగా ఉండటం వెనుక ఓ సీక్రెట్ ఉన్నది. అంతరాంగాల్లోంచి వెలువడే కంటే ముందే ఈ దారానికి సల్ఫైడ్ పూత పూయబడతది. ఆ సల్ఫైడ్ పూతే ఈ దారానికి మరింత పదును తెచ్చిపెడతది. కంటికి కూడా సరిగా కనిపించనంత సన్నగా ఉన్నా దీని బలానికి కారణం పొరలు పొరలుగా ఉండటం, సల్ఫైడ్ పూత ఉండటం మరో అడిషనల్ స్ట్రెంత్. అందుకే ఈ దారాన్ని వైద్యంలో కొన్ని రకాల ఆపరేషన్లలో కుట్లకోసం కూడా ఈ దారాన్ని ఉపయోగిస్తరంటే ఈ దారం ఎంత గట్టిదో తెలుస్తంది.
స్పాట్
బ్రేక్ యాంకర్
సాలీడు స్రవించే దారానికి ఎలాస్టిక్ పవర్ లేదు. అంటే దీనికి సాగే శక్తి తేదన్న మాట. గట్టిగా గుంజితే తెగుతదే తప్ప సాగదు. కానీ సాలీడు కూర్చిన ఆ వలలో ఏదైనా కీటకం చిక్కినా ఆ వల సాగుతుందే కానీ పూర్తిగా తెగదు. సాగే శక్తి లేని దారంతో నిర్మించిన ఈ వల ఎలా సాగుతోంది. కేవలం సాలీడు నేర్పిన ప్రకృతి పాఠంతో మనిషి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం ఎలా సాధ్యమయింది…తెలుసుకునేముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
యాంకర్ 3
వెల్కం బ్యాక్ టు ది సైన్స్ ఎపిసోడ్..ఒకే..సాలీడు దారం స్రవించడమే ఓ పెద్ద వండరనుకుంటే అది దారంతో చేసే విన్యాసాలు మరీ వండర్. ఇప్పడు ఇప్పడుడే నానో టెక్నాలజీతో సాధ్యమవుతుందనుకుంటున్న మైక్రోవీవింగ్ ని సాలీడు జాతి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చేసి చూపింది..ఇప్పటికీ చూపుతుంది..చూడండి..
స్పాట్
ఇది చినుకులతో ముద్దయిన సాలీడు గూడు. ఈ గూడులో కొన్ని చోట్లనే నీటి బిందువులు ఆగి ఉన్నయి. మొదట ఇది సర్ఫెస్ టెన్షన్ వల్లనే అని భావించారు సైంటిస్టులు..ఆ భావనే చాలా కాలం దీని లోగుట్టు విప్పకుండా ఆపేసింది. కానీ ఓ శాస్ర్తవేత్త రొటీన్ కు భిన్నంగా సెర్చ్ చేశాడు. అంతే సాలీడ్ సీక్రెటే లీడ్ అయింది. గొప్ప అద్భుతం..స్పైడర్ వెబ్లో గూడుకట్టుకున్న రహస్యం గుట్టు రట్టయింది. సాలీడు తాను గూడు అల్లేటప్పుడే జంక్షన్లల్లో దారపు కుచ్చులను వదులుతది. ఇవే షాక్ అబ్జర్వర్స్గా పనిచేస్తయి. ఈ లూజ్ థ్రెడ్ జంక్షన్లే గూడుకు సాగే గుణాన్ని తెచ్చిపెడతయి.
స్పాట్
మెదడు కూడా పూర్తిగా డెవలప్ కాని ఆర్థోపొడా కీటకానికి ఇంత గొప్ప టెక్నికల్ ట్రైనింగ్ ఎవరిచ్చారు…నేచర్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న సీక్రెట్…ఈ సీక్రెట్ ఉపయోగించుకొనే ఇప్పడు మనం చూస్తున్న హంబుల్ బ్రిడ్జి నిర్మిచిండ్రు. .అదే స్ర్పింగ్ యాక్షన్, అదే స్ర్టెంథనింగ్, అదే అల్లిక, అవును.. ఆ మైక్రోస్కోపిక్ సీక్రెట్ తోనే ఈ మాక్రోస్ర్టక్చర్ బిల్డప్ చేయగలిగిండ్రు.
యాంకర్ 4
అది గోటితో చీల్చగల పుచ్చకాయ… ఇది రాతిని కూడా చీల్చగల పిస్టల్… దీనితో పుచ్చకాయను పేల్చితే నిండు కుండలా పేలిపోతది.
విజువల్
చూశారుగా ఒక్క చిన్న బుల్లెట్ పుచ్చకాయను చిన్న చిన్న తుంపలుగా పేల్చేసింది. యుద్దాల్లో పాల్గొనే సైనికులకు, శత్రువుల దాడినుండి రక్షించేందుకు బుల్లెట్ల నుంచి రక్షణ పొందేందుకు కావలసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి..ఈ జాకెట్ ను దేనితో తయారు చేశారో తెలిస్తే… దీనికి స్పూర్తి ఎవరో తెలిస్తే అవాక్కవడం మీవంతవుతది.
వాయిస్
ఇప్పటి వరకు మనం చూసిన సాలీడు స్రవించే సిల్క్ దారంలో మరో సీక్రెట్ ఉంది.. ఓ ఫిజికల్ ఫార్ములా ఉంది. గడ్డి పోచలన్నీ ఏకమైతే గజాన్ని కూడా బంధించవచ్చనే ఆ ఫార్ములా..అంటే పొరలు పొరలుగా ఉన్న దారానికే బలమెక్కువనేదే ఈ సూత్రం. సాలీడు దేహంలో కూడా ఒక్కో స్పికెట్ ఒక్కో మైక్రోథ్రెడ్ ను స్రవింస్తది. ఇవన్నీ ఏకమై ఒకే దారంగా బయటకు వస్తది. ఆ దారాన్ని మైక్రోస్కోప్కింద పెట్టి చూస్తే కానీ అసలు విషయం తెలీదు. ఇదే ఫార్ములాతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసిండ్రు.
స్పాట్
ఈ బుల్లెట్ చూడండి ..ఎంత వేగంగా దూసుకుపోతోందో..అంత స్పీడ్ తో వచ్చే బుల్లెట్ తగిలితే ఈ జాకెట్ తునాతునకలై పోవాలి..కానీ కేవలం నాలుగు సెంటీమీటర్ల రంధ్రం చేసి ఆగిపోయింది. ఈ జాకెట్కు అంత శక్తి ఎక్కడిది..ఈ జాకెట్లో ఉన్న ఫైబర్ దారాలు..ఏ లోహంతో తయారు చేసిండ్రు..ఒక్కసారి చూద్దాం…
స్పాట్
ఇదిగో..ఇక్కడ పొగలాగా కనిపించేది కార్భన్ దారాల కట్ట. అతి సూక్ష్మమైన కార్భన్ ఫైబర్ దారాలను ఏకం చేసి ఒక సన్నని దారంగా తయారు చేస్తరు. ఈ దారం మావనుల వెంట్రుక కన్నా 5 రెట్లు సన్నగా ఉండి…ఇనుము కంటే 10రెట్లు ఎక్కువ బలం కలిగి ఉంటది.
స్పాట్
ప్రతి దారం వేలకొద్దీ సన్నని దారాలను కలిగి ఉంటది. ప్రతి సన్నని దారంలో మిలియన్ కార్భన్ ట్యూబ్లతో ఏర్పాటై ఉంటది. ఈ కార్భన్ ట్యూబ్ లు కేవలం ఒక పరమాణువు వ్యాసార్ధంలో ఉంటయి. అంటే కార్భన్ పరమాణువుల మధ్య బలమైన బంధాలతో ఏర్పడే ఒక ఆర్గానిక్ ట్యూబ్ అన్నమాట. అందుకే ఇది మనం నమ్మశక్యం కానంత బలాన్ని సొంతం చేసుకుంది.
స్పాట్
ఈ మానవ నిర్మిత ఫైబర్ ను మామూలు కార్బన్ ఫైబర్ తో అంటే ఎరామిడ్ ఫైబర్ తో కంపేర్ చేసి చూశారు. ఒక ప్రత్యేకమైన మిషన్లో ఈ రెండు థ్రెట్ల బలాన్ని పరిక్షించిండ్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఎరామిడ్ ఫైబర్ కార్బన్ ఫైబర్ కంటే కార్భన్ నానో ట్యూబ్ ఫైబర్ నాలుగు రెట్లు బలమైనదని రుజువయింది. ఇంత బలమైన దారాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేస్తరు. అంటే ఒక పొర నానో కార్బన్ ట్యూబులతో తయారు చేసిన జాకెట్ పది ఐరన్ షీల్డ్ లతో సమానం. అంటే ఒక జాకెట్ ధరిస్తే పది ఇనుప కవచాలు ధరించినంత రక్షణ నిస్తది ఐతే అది ఒరిజినల్ ది అయి ఉండాలి. ఈ నానో కార్బన్ టెక్నాలజి సాంకేతిక రంగంలో పెను మార్పులు తెచ్చింది.
యాంకర్ 5
మన బిజీ జీవితంలో నిత్యం సూక్ష్మశాస్ర్తవేత్తలతో సహవాసం చేస్తం..ఈ బుల్లి శాస్ర్తవేత్తలు వేరెవరో కాదు మైక్రో ఆర్గానిజమ్స్. అసలు ఇవి లేని చోటే లేదు. కానీ ఒక్క క్షణం కూడా వాటి గురించి ఆలోచించం..మన బయట లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మనతో ఎలా ఆడుకుంటున్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తది… చూస్తే మీకే తెలుస్తది..వీటి సయ్యాట.
స్పాట్(స్మాల్)
వాయిస్
మన నిత్య జీవితంలో సూక్ష్మక్రిములతోనే సహజీవనం చేస్తడు. తాను ఎంత శుబ్రంగా మెయింటెయిన్ చేస్తుంటమని అనుకుంటం..కానీ అదంటా ట్రాష్ చూడండి, నడిచే ప్రతి అడుగు కిందా ఎన్నో క్రిములు..ఈ రూం చూడండి ఎంత శుభ్రంగా ఉందో..అయినా ఇక్కడ ఒక రొమాంటిక్ జంట చేసే డిన్నర్ లో ఎన్ని రకాల క్రిములు ఎన్ని విధాలుగా వ్యక్తులను ఎటాక్ చేస్తయో చూద్దాం..
స్పాట్
ఇక్కడ ఈ జంట చేసుకునే విందుకు ఎన్నిరకాల సూక్ష్మ క్రిములు కంపెనీ ఇస్తున్నాయో చూడండి. .. మొదట తాజా కూరలు క్లీన్ చేద్దామనుకున్న ఇతని ప్రయత్నంలో అదే నీటి నుంచి మరిన్ని క్రిములు ఆ కూరలకు అంటించుకుంటడు. చూడండి..ఈ వాటర్ ట్యాప్ అంచున ఎన్ని క్రిములు స్విమ్ చేస్తున్నయో..ఇవన్నీ పారదర్శకంగా ఉంటయి. ఒక్క చుక్క నీటిలో వందల మిలియన్ల బ్యాక్టీరియాలు హాయిగా విహరిస్తున్నయి. వీటి వల్ల పెద్ద నష్టం ఏమీ లేకున్నా..ఒక్కోసారి వీటిని ఎటాక్ చేసే బ్యాక్టీరియా వల్ల పెద్ద ప్రమాదమే వస్తుంది.
స్పాట్
తాజా కూరలతో చేసే ఈ వెజిటబుల్ సలాడ్ లో కూడా ఎన్ని రకాల క్రిములున్నయో చూడండి..ఫ్రెష్ లీఫ్ సలాడ్ లో వెనిగర్ ను మిక్స్ చేసినపుడు వెనిగర్ లో ఉన్న మిలియన్ల కొద్దీ మైక్రోమ్ లు ఆహారంలో కలిసిపోయి విందుకు సిద్దమయితయి. ఇవి 1 మిల్లీ మీటర్ పొడవుండి సన్నని దారపు పోచల వలే ఉంటయి. ఇవి మామూలు కంటికి కనిపించవు. పూర్తిగా పారదర్శకంగా ఉండటం వల్ల కనీసం వీటిని గుర్తించడం కూడా సాధ్యం కాదు. అంతే సలాడ్తో బాటు అవి కూడా మనకు నాన్ వెజ్ ఫుడ్ గా మారిపోతయి.
స్పాట్
ఇపపడు చీజ్ ముక్కలను చూద్దాం..ఫ్రెష్గా ఉన్న ఈ నేతిగడ్డలో మనకు కనిపించని, ఒళ్లు గగుర్పొడిచే జీవులు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తది. మిలియన్ లకొద్దీ క్రిములు మన ఆహారం పై ముందే తిష్ట వేసి రోజుల తరబడి ఆ ఆహారాన్ని తినుకుంటూ జీవిస్తయి. మన చుట్టూ ఉన్నా దుబ్బా దూళిలో కొన్ని కోట్ల జీవులు ఆహారం పైకి వచ్చి చేరతయి. కొంత కాలం ఇవి ఆహారం పై ఇలాగే ఉంటే ఆ ఆహార స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తయి. ఆ ఫుడ్ ఫ్లేవర్ని పూర్తిగా మార్చేస్తయి.
అంతే కాదు ఒక్కరిలోకి సంక్రమించాయంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతయి. ఒక్క ముద్దు చాలు మైక్రోమ్లు మైగ్రేట్ కావడానికి..
వచ్చేవారం…
మంచు చరియాలు విరిగిపడటం వెనక ఉన్న సూక్ష్మమర్మం ఏమిటి..
సూర్యకిరణాల్లో ఉన్న సూక్ష్మ రహస్యం..

Tuesday, May 25, 2010

పదశిల్పి వేటూరి సుందరరామ్మూర్తి


ఎ.జనార్దన్
పదునైన పదాలతో పరిగెత్తించే కలం ఆగిపోయింది. స్వరాలకే వరంగా మారిన ఆ కావ్యఝరి మూగబోయింది. మూడుతరాలను సంగీత ప్రపంచంలో ఓలలాడించిన పదశిల్పి ఇకలేరు. వేటూరి మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆ మహా మనీషికి నివాళి అర్పిస్తూ రాజ్‌న్యూస్‌ అందించేస్పెషల్ స్టోరీ….
వేటూరి సుందరరామ్మూర్తి…సినీ వినీలాకాశంలో మెరిసే పాటల పాలపుంత..నవరసాలను ఒలికించే గేయామృతధారల సృష్టికర్త. ముచ్చటగా మూడు తరాలను మెప్పించిన అపర పదభగీరదుడు వేటూరి.
ఆయన పాటల్లో ప్రకృతి పల్లవిస్తది. మువ్వలు గల్లుమంటయి. కోయిల కూయంటది.. కొమ్మలు కోలాటాలాడుతయి. పైరగాలి పిల్లనగ్రోవి పలికిస్తది.పండు వెన్నెల పరదా విసుతది. గోదారి అలలు సవ్వడి చేస్తయి. ఆ పదాల అల్లిక మీగడ తరగతల వలే కమ్మగా ఉంటది. ఆ పాటలను ఎంత విన్నా …కాదు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అంత సాహితీ బాండాగారం వేటూరి.
(సిరిమల్లే నీవే పాట) (పంతులమ్మ )
(పిల్లనగోవికి నిలువెల్ల)( సప్త పది)
మేఘసందేశం నుంచి ఆకాశ దేశానా..సాంగ్
వేటూరి తాకని అంశం లేదు. ఆయన కలం కురిపించని భావం లేదు. జీవన మాధుర్యాన్ని , జీవన సాఫల్యాన్ని, జీవన గమనాన్ని ఒద్దికగా పదాల్లో పొందుపరచగల ప్రతిభా శాలి అతడు. మాటలకందని పదాలను పాటలుగా మలచిన పదబ్రహ్మ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా తక్కువే..సినీ జగత్తులో మేరు నగధీరుడు. పాటల మాంత్రికుడు… వేటూరి కలం నుంచి జాలువారిన కవిత్వం… అజరామరం. పాటల రాతలోనే కాదు…. వచన రచనలోనూ మేటి అనిపించుకోవడం… ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఆయన ప్రతి పాటా… మెరుపుగా, ఉరుముగా నినదించింది. మారుతున్న కాలంతో పాటే పాట స్టైల్‌నూ మార్చి… యువత మనసు కొల్లగొట్టడంలో ఆయన నిత్య యవ్వనుడే! పడచుదనపు లోగిలిలోకి వచ్చిన అమ్మాయి మనసు సిరిమల్లెపూవు తోడుగా చిన్నారి చిలకమ్మ సాక్షిగా రాసిన వేటూరి… ఎదురుచూపులోని మధురబాధని గుండెకు హత్తుకునేలా చెప్పిండ్రు.
(సిరిమల్లెపువ్వా, చిన్నారి చిలకమ్మ)(పదహారేళ్ల వయసు)
అచ్చతెలుగు పదారణాల ఆడపడుచు.. తన సరిజోడు తొలిచూపుల తరువాత ఆమె మదిలో మెదిలిన వలపుల తలపులను విప్పి చెప్పిన గడసరి.
(తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు)(శ్రీవారికి శుభలేక)
భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని తన పాటల్లో కళ్లకు కట్టిండు. సిరులన్నింటినీ మించిన సొమ్ము చిరునవ్వేనని సున్నితంగా చెప్పిండు.
(మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం సరస సరాగాల సుమవాణిని. శిలలకు సైతం సంగీతాన్ని వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో ఆ పదాల పరుగు గౌతమి పరవళ్లనే వెక్కించింది.
(నిన్నటి దాకా శిలనైన.)
అలా కదిపితే ఇలా ఇలా వర్షించే మధురగీతాల మేఘం వేటూరి.పదాలుకు పండు వెన్నెలలద్ది కొత్త అందాలను పులిమిన పదశిల్పి. వేలాదిగా పాటలు రాసిన సాటిలేని మేటి కవి వేటూరి. తెలుగు పాటకు ఆయనా ఓ ప్రాణం. తెలుగు అక్షరాల తోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించిన పదకారుడు ఈయన.
(కొమ్మకో సన్నాయి పాట)( రాగాలా పల్లకిలో కోకిలమ్మ)
వేటూరి జీవన సారాలన్ని ఒడిసి పట్టిన పదర్షి. జీవిత అనుభవాలను అక్షరాలుగా చెక్కి పాటల ప్రవాహలో వదిలిన వేదాంతి. స్రవంతి సినిమాలో “నవ్వుతూ వెళ్లిపో నువ్వుగా మిగిలిపో” పాట పాజిటివ్ థింకింగ్‌ ఆటిట్యూడ్స్ ని చూపిస్తే… మాతృదేవోభవ సినిమాలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటలో జీవన తాత్వికత వైరాగ్యంగ్యాన్ని నింపుతది.
(రాలిపోయే పువ్వా పాట)(మాతృదేవోభవ)
ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డును సాధించింది. తెలుగు పాటకు కీర్తిని తెచ్చింది. వేణువై వచ్చాను అనే పేరుతోనే వేటూరి తన ఆత్మకథను రాయాలని సంకల్పించడం… ఆ పాటపై ఆయనకున్న ప్రేమకు అద్దం పడుతది.
(వేణువై వచ్చాను భువనానికి పాట)( మాతృదేవోభవ)
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వేటూరి 10వేల పైగా పాటలు రాశారుపంతులమ్మ, కాంచన గంగ, చంటి, రాజేశ్వరి కల్యాణం, సుందరాకాండ సినిమాల్లో రచించిన పాటలకు నంది అవార్డులు గెల్చుకున్నారు.
(నవ్వవే నవ మల్లిక పాట)
ఇక శంకరాభరణం లోని అన్ని పాటలకు రచన చేసి శాస్త్రీయ సంగీత పాటల రచనలో మేటి అని నిరూపించుకున్నారాయన.
(ప్రాణము నీవని దగ్గరనుంచి)(శంకరా నాదశరీరాపరా)

గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. ఆమని నిశ్శబ్దంలో స్వరాలు పలికించి… రాలేటి పూల మూగ గొంతులో రాగాలను వినిపించిండు.
(ఆమనీ పాడవే… హాయిగా)(గీతాంజలి)
వేటూరి ఆగమనంతో పాటకు పలవరింతలు మొద లయ్యాయి. పాట పరవశంతో నాట్యం చెయ్యడమూ మొదలైంది. 'ఓ సీత కథలో 'నిను కన్న కథ పాటతో ప్రారంభమైన వేటూరి పాటల పల్లకీ ప్రపంచం చుట్టూ తనదైన హంసగమనంతో ఊరేగి సినీ ప్రేమికుల్ని ఆనందపరుస్తూ ఆశ్చర్యపరుస్తూ డెభ్భై అయిదవ వసంతంలోకి అడుగు పెట్టింది'సిరిసిరి మువ్వలో ఝు కారంతో పల్లవి ప్రారంభించే గుండె ధైర్యం ఎందరికుంటుంది? (ఝుమ్మంది నాదం)
'శంకరాభరణం సినిమాలో ప్రతి పాటా అక్షర సరస్వతికి కంఠాభరణం.
(శంకారా..నాద) ( దొరకునా ఇటువంటి సేవ)
సాగర సంగమం నవరస భావోద్వేగాల సంగమం. ఎన్ని తరాలైనా వాడిపోని నిత్య పరిమళ సుమధుర సుమం.
(ఓం..నమశ్శివాయ..)( (నాద వినోదం..పాటలో కైలాసాన కార్తీకాన)

స్వాతిముత్యం నేటికీ ఆణిముత్యమే. మదిని ఊయలలూపే స్వరాలు ఎన్ని ఆవరించినా స్వాతి ముత్యంపు తళుకులు ఎప్పటికీ తరగని వెన్నెల వన్నెలు.
(సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట)(అండాదండా ఉండాలని దగ్గర్నుంచి)
వేటూరి సరస్వతీ పుత్రుడు. పది పదుల కాలాలు నిలిచిపోయే పాటలు రాసిండు. బావ కవులకు, భావి కవులకు ఆదర్శంగా నిలిచిండు.
(ఆ..కనులలో కలల మాధురి)(ప్రియతమా)( ఆలాపన చిత్రం)
(పొద్దున్నె పుట్టిందిచందమామ) (శతృవు)
వేటూరిలో అన్ని కోణాలూ ఉన్నయి. ఏ ఒక్క బాణికో ఆయన పరిమితం కాలేదు. కాలాన్ని బట్టి కలం కదం తొక్కింది. భక్తిగురించి చెప్పినా దేశభక్తి గురించి చెప్పినా ఆయన స్టైలే వేరు.
(కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పాట)
ఏడు పదుల వయసులోనూ ఆయన మనసు నిత్య యవ్వనంగా ఉంటది. వయసు మనిషికే కానీ మనసు కాదంటడు. మెలోడీ సాంగ్స్‌తో బాటు మాంచి మసాలా ఉన్న పాటలు రాయడం వేటూరికి పెన్నుతో పెట్టిన విద్య. చిలిపి పాటలను చిగురింపచేయడం కూడా ఆయనకు తెలుసు. ఆకుచాటు పిందెలను పిలిచి..కొంటె పాటలకు కొత్త దారి చూపిన ఘనత కూడా ఆయనదే..
(ఆరేసుకోబోయి పారేసుకున్నాను)(ఇందువదన –చాలెంజ్)( ఆ అంటే అమలాపురం – ఆర్య )(అబ్బనీ తియ్మయనీ దెబ్బ –జగదేకవీరుడు)(చిలక కొట్టుడు కొడితే చిన్నదానా..)
వేటూరిలో ఓ ఆద్యాత్మిక కోణం ఉంది. పాటల పొదరిళ్లల్లో దేవుళ్లను కొలిచిన కవి కిరీటి.
(శ్రీరామదాసులో అదిగదిగో భద్రగిరి)(ఏడుకొండలా స్వామి)
(అన్నమ య్య సినిమాలో పాటలు)
వేటూరి కలం నుంచి జాలు వారిన పాటల హోరులో ఎన్నో గమకాలు.. వాన పాటలు -వీణపాటలు..విరహగీతాలు-విప్లవ గీతాలు..రక్తిపాటలు-ముక్తిపాటలు, భక్తి పాటలు –విరక్తి పాటలు..హాస్య గీతాలు –ఆశు కవిత్వాలు. ఒకటేమిటి ఆయన తడమని భావం లేదు. తడవని స్వరఝరి లేదు.
పాట
కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వార తన కవితా ద్వారలు తెరిచిన వేటూరి నాటి నుంచి నేటి వరకు చేసిన పద ప్రయోగాలు కోకొల్లలు. పదాలతో జిగిబిగి అల్లికలు అల్లికలు అల్లి పాల తరగల్లాంటి పాటలు అందించడం ఆయనకే చెల్లింది. సీనీ బాణీలకు ఓణీలేయించి సరిగమ స్వరాలతో సరసాలాడిచిన మేనమామ వేటూరి.
పాట
ఒక పాటను దర్శకుడు, నిర్మాత మెచ్చేలా రాయడమంటే యాగమే. అటువంటి యాగాన్ని పదిహేను నిమిషాల్లో పూర్తిచేయగల నేర్పరి వేటూరి. బొంబాయి సినిమా తీసేటపుడు సంగీత దర్శకుడు రహమాన్‌తో బాటు పాటల రచయిత కూడా ఉండాలని వేటూరిని వెంటతీసుకెళ్లారట. అక్కడ లొకేషన్‌లో రహమాన్‌ మదిలో మెదిలిన స్వరానికి పదిహేను నిమిషాల్లో పదాలల్లి ఔరా అనిపించుకున్న పదప్రబంధం వేటూరి.
(కన్నానులే కలయికలు)(బొంబాయి)
కొత్త కొత్త పదబందాలు..సరికొత్త భావ శిల్పాలు..రాగాలతో రంగరించే వినూత్న స్వరాల సవ్వడులు కోకొల్లలు.
(ఉప్పొంగెలే గోదావరి)(గోదావరి )
వేటూరికి పాటంటే ప్రాణం. అంతే కాదు పాటను పలికించే మాతృబాషంటే పంచప్రాణాలు..ఆ బాష బంగపడితే తట్టుకోలేని సరస్వతి తనయుడు. 1994 తెలుగుపాటకు రెండవసారి పురస్కారం అందుకున్నరోజు తెలుగు బాషకు ప్రాచీన గౌరవం దక్కలేదని ఉద్వేగానికి గురయిండు.
పాట.
ఎంత పెద్ద నది కూడా చిన్న ఊటపాయతోనే ప్రాణపోసుకుంటది. ఎన్ని వేల మైల్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలయితది. జర్నలిస్ట్‌ గా ప్రస్థానాన్ని మొదలు పెట్ఇన వేటూరి తన జీవిత ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను అధిగమించి మహాప్రస్థానికి మళ్లిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం ప్రార్దిద్దాం.

వరంగల్‌ భద్రకాళి అమ్మవారి దేవాలయ చరిత్ర


ఎ. జనార్దన్‌
ఇంట్రో యాంకర్‌
చల్లని చూపుల తల్లి, ఓరుగల్లు ప్రజల కల్పవల్లి భద్రకాళి అమ్మవారు. కోరిన కోర్కెలు తీర్చెందుకు కొలువైన కొండంత దేవర. భద్రకాళి అమ్మవారిని ఓరుగల్లు ప్రజలు భక్తి ప్రవృత్తులతో పూజిస్తరు. ఈ వారం తెలంగాణ ఆలయాల్లో పిలిస్తే పలికే దైవం వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయక్షేత్రాన్ని దర్శించి వద్దాం.
బ్యాంగ్‌
యాంకర్‌ 1
అమ్మలగన్న అమ్మ.. ఆది పరాశక్తి..ముగ్గరు అమ్మల మూలపుటమ్మ.. ఇలా ఏ పేరుతో కొలిచినా వరాలిచ్చే వరదాయిని వరంగల్‌ భద్రకాళి అమ్మవారు. శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాయిస్‌
ఇది వరంగల్‌ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. సుమారు ఎనిమిది వందల ఏండ్ల కిందట ఏకాశిలనగరాన్ని రాజధానిగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. నాటి ఏకాశిల నగరమే నేటి వరంగల్‌. కాకతీయ రాజులందరూ శివ భక్తులు. కాకతీయ సామ్రాజ్యంలో ఊళ్లన్నిటిలో శివాలయాలను కట్టించినరు. ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కట్టించిండు. ఈ అమ్మవారిని కూడా కాకతీయ వంశస్థుల ఆదరించిండ్రు. కాకతీయులు శివారాధకులైనప్పటికీ అందరూ దేవతలనూ సమానంగా పూజించిండ్రు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో ఆరాధించినరు.
స్పాట్
ఈ దేవాలయానికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్నది. వేంగీ చాళుక్యులపై విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి నిర్మించినట్లు చారిత్రక కథనం ఉంది. పరాయి మతస్తుల పాలనలో ఆలయ ప్రాభవం కొంచెం మసకబారినా.. తర్వాత మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. భద్రకాళీ మహిమలపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నయి. ఆ ఆలయాన్ని సందర్శించిన భక్తులు చెప్పే గాధలు కోకొల్లలు .
బైట్‌ - భక్తులు
యాంకర్‌ 2
కాకతీయల కాలంలో నిత్య ధూపదీప ఆరాధనలతో విరాజిల్లిన భద్రకాళి అమ్మవారు కాలక్రమంలో నిరాదరణకు గురయింది. ధూపదీపాలు కరువయినయి. అమ్మవారిని పట్టించుకొనే వారే కరువయినరు. అప్పుడే కొందరు భక్తులు ఆలయ పునరుద్దరణకు నడుంబింగించిండ్రు.
వాయిస్‌
ఈ ఆలయం 1313 తర్వాత తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. కాకతీయ సామాజ్ర్యం పతనమయినాక ఈ దేవాలయాన్ని పట్టించుకునేవారు కరువయినరు. ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలిగిపోయే అమ్మవారి ఆలయం పడావుపడినట్టు ఉండటం ఇక్కడి ప్రజలను మనస్థాపినికి గురిచేసింది. ఎలాగైనా అమ్మవారి ఆలయాన్ని పునరుద్దరించాలని స్థానిక ప్రజలు నడుంబింగించిండ్రు. ఆలయ పునరుద్దరణకు కృషి చేసినవారిలో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి, రామానుజా చార్యులు. అప్పట్లో నగరంలో బాగా పేరున్న వ్యాపారి మగన్ లాల్ నమేజా దగ్గరకు వెళ్లి ఆలయ పునరుద్దరణ గురించి అడగాలనుకున్నరట. కానీ అతను అందుకు ఒప్పుకుంటడో లేదో అనే అనుమానంతో అడగడానికి సంకోచించిండ్రు. అయితే అంతకు ముందు రాత్రే అమ్మవారు మగన్ లాల్ కి కలలో కన్పించి..ఆలయ పునరుద్ధరణకు కృషిచేయాలని ఆదేశించిందట. అమ్మవారి మాటలను తేలిగ్గా తీసుకుని, ఆలయ పునరుద్దరణను నిర్లక్ష్యం చేసిండు. అమ్మమాట నిర్లక్ష్యం చేసినందుకు వ్యాపారి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. మగన్‌లాల్ ముద్దుల పట్టీ.. గారాల బిడ్డకు నోట మాట పడిపోయింది. ఈ పరిణామానికి మగన్‌లాల్‌ మదనపడిపోయిండు. అదే సమయంలో ఆలయపునరుద్దరణకు నడుంబిగించిన గణేష్‌ శాస్త్రి, రామానుజాచార్యులు మగన్‌లాల్ ని కలిసి తమ సంకల్పం వివరించిండ్రు. మగన్ లాల్‌ కూడా తనకు జరిగిన వృత్తాంతాన్ని వివరించి..తన బిడ్డకు తిరిగి మాటొస్తే అమ్మవారి ఆలయ పునరుద్దరణకు తప్పక కృషిచేస్తనని తెలిపిండట. అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరిస్తే.. అమ్మాయికి మాటలొస్తయని మంగన్‌లాల్‌కి చెప్పినరట గణేష్ శాస్త్రి, రామానుజాచార్యులు. భద్రకాళీమాతకు అభిషేకించిన తీర్థాన్ని నెల రోజుల పాటు మగన్ లాల్ కూతురుకి తాగించడంతో ఆమెకు తిరిగి మాటలు వచ్చినయ్. అమ్మవారి మహిమలకు ముగ్దుడైన వ్యాపారి వెంటనే ఆలయ పనులను ప్రారంభిచిండని ఇక్కడి వారు చెప్పుకుంటరు.
స్పాట్
ఆలయ పునరుద్దరణ ప్రారంభమైనప్పటినుంచి అమ్మవారికి తిరిగి పూజలు చేయడం ప్రారంభమైంది. ధూపదీప నైవేధ్యాలతో భక్తులు ప్రతినిత్యం సేవించడం మొదలుపెట్టినరు. ప్రతీ అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, ఛైత్ర మాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతున్నరు. ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంభరిగా అలంకరిస్తారు. వైశాఖ శుధ్ద పంచమినాడు శంకర జయంతి సందర్భంగా అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం చేస్తరు.
స్పాట్
యాంకర్‌ 3
ఈ ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావాలతో తొణికసలాడుతుంటది. ప్రశాంత వాతావరణంతో ఆద్యాత్మికత ఉట్టిపడుతుంటది. అమ్మను నమ్ముకున్న వారికి కష్టాలుండవని భక్తుల నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచి భద్రకాళి అమ్మను కొలిచేందుకు ఇక్కడకొస్తరు.
వాయిస్‌
ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాకుండా పచ్చని ప్రకృతితో భక్తులకు నయనానందాన్ని కలుగిస్తున్నది. శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రెండున్నర కిలోమీటర్ల చెరువు నగర వాసుల దాహార్తిని తీర్చడంతో పాటు... సందర్శకులను ఆకర్షిస్తున్నది. చుట్టూ సహజంగా ఉన్న కొండలు దేవాలయానికి అదనపు ఆకర్షణగా నిలిచి, గాంభీర్యాన్ని తీసుకొస్తున్నయి
స్పాట్‌
ఆలయ కుడ్యాలపై అందమైన శిల్పాలు అలరిస్తయి. చరిత్రను వివరించే శాసనాలుకూడా అక్కడక్కడా కనిపిస్తయి. పక్కనే ఉన్న చెరువు వల్ల ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటది. ఎత్తైన కొండదిగుంన ఉన్న ఈ ఆలయం చూడ చక్కగా ఉంటది. ఈ ఆలయానికి ఒక వైపున పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అందంగా కొలవుదీరినయి. ఆలయ గోపురాల పై అందమైన శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటయి. భక్తులకు నీడ కోసం ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్లు వేయించిండ్రు. ఇక్కడికొచ్చిన భక్తులు శ్రీ వల్లభ గణపతిని కూడా కొలుస్తరు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ప్రత్యేక స్తలాన్ని కేటాయించిండ్రు. భక్తలు ఆలయ ధ్వజ స్తంబం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటరు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు కూడా దర్శించుకోవచ్చు.
బైట్‌ - భక్తురాలు
యాంకర్‌ 4
శ్రీ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుచుకుంటరు. అమ్మది చూడచక్కని రూపం. ఆ తల్లిని చూసి భక్తి పారవశ్యానికి లోని కాని వారుండరంటే నమ్మండి. ముల్లోకాలకు పెద్ద ముత్తైదువ ఈ భద్రకాళి అమ్మవారు.
వాయిస్‌
వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుస్తరు. అంటే ముల్లోకాలలో కెల్లా అందమైనదిగా అర్ధం. విశ్వంలోని స్త్రీ శక్తిని, ప్రకృతి శక్తినంతటిని కలిపి త్రిపుర సుందరిగా పిలుస్తరు. శ్రీ భద్రకాళీ అమ్మవారి అమ్మవారి విగ్రహాం 9 అడుగుల ఎత్తుతో 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తున్నది.అమ్మవారు ప్రేతాసినియై కొలువుతీరింది. తల్లి 8 చేతులతో.. కుడివైపు ఉన్న 4 చేతులలోయ ఖడ్గము, ఛురిక, జపమాల, ఢమరుకము.. ఎడమవైపు ఉన్న చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్న మస్తకము, పాన పాత్రలున్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖముగా ఉంది.
స్పాట్ విజువల్స్...అమ్మవారివి వాడగలరు.
నయన మనోహరంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలను చూడటానికి వరంగల్ నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల జనం కూడా వస్తున్నరు. భక్తులు సమర్పించిన రకరకాలపూలతో భద్రకాళి అమ్మవారు కళకళలాడుతూ కోరిన మొక్కులు తీర్చే తల్లిని దర్శించుకుని భక్తులు అమితానందంతో తిరిగి వెళుతున్నరు.
స్పాట్
వాయిస్...
అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు.అమ్మవారు కొలువైన పెళ్లిమంటపాన్ని రకరకాల పూలతో అలంకరించారు.శక్తిప్రదాయని శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.కాకాతీయుల కాలంలో విరజిల్లి తర్వాత ప్రాభవం కోల్పోయిన అమ్మవారి దేవాలయం మగన్ లాల్ నమేజా లనే వ్యాపారి పునరుధ్దరించిడు.అప్పటి నుంచి శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులు ఓరుగల్లు వాసులకు చల్లని దీవెనలుగా మారాయి.
బైట్..భక్తురాలు.

యాంకర్ 5
అమ్మవారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుతరు. వైశాఖ మాసంలో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తుల హాజరుయితరు. సృష్టికర్త బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను ప్రారంభించిండని ఇక్కడి భక్తులు చెప్పుకుంటరు. అంకురార్పణతో మొదలయి బ్రహ్మోత్సవ సమాప్తితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తయి.
వాయిస్‌
భద్రకాళి దేవస్థానంలో ప్రతియేటా వైశాఖ మాసంలో జరిపే బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత కలదు. పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతయి. విద్యుద్దీపాలతో అలంకరించిన ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంటది. .. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు.. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయిన భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి ప్రపత్తులతో పూజిస్తరు. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి జనం ఇక్కడకు వస్తరు.
స్పాట్
వాయిస్
శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తరు.ఉదయం శంకరభగవాత్పద సమారాధన అనంతరం చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహనం సేవ చేస్తరు. సాయంత్రం గజవాహన సేవ చేసి శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ మహోత్సవం జరుగుతది.
బైట్...ప్రవచనము...వాడగల
స్పాట్
ఉత్సవాల్లో రెండో రోజు ఉదయం వృషభవాహన సేవ, ధ్వజారోహణము జరిగుతది . యాగశాల ప్రవేశము, యాగమండప స్థూణ పూజ, ద్వారతోరణపూజలు నిర్వహిస్తరు. సాయంత్రం అమ్మవారికి జింక వాహన సేవా ఉత్సవం జరుగుతది. దీప నైవేద్యాలతో భద్ర కాళీ అమ్మవారిని కొలుస్తరు
స్పాట్........
బైట్...వినయ్ భాస్కర్...మాజీ ఎమ్మేల్యే.
ఉత్సవాల్లో మూడో రోజు మకర వాహన సేవతో అమ్మవారి ఉత్సవాలు మొదలవుతయి. సాయంత్రం చంద్రప్రభ సేవతో శ్రీ భద్రకాళీ భధ్రేశ్వరుల ఎదుర్కోలు ఘనంగా జరుగుతయి.
విజువల్స్‌ : ప్రవచనము వాడుకోగలరు
స్పాట్.....
వాయిస్
ఐదోరోజు శంకర భగవాత్పద సమారాధన తర్వాత చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహన సేవ చేస్తరు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు. కళ్యాణ మండపాన్ని రకరకాల పూలతో అలంకరిస్తరు. శక్తిప్రదాయిని అయిన అమ్మావారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.
స్పాట్
గజవాహన సేవ అనంతరం శ్రీభద్రకాళీ..భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం మొదలైతది. సాక్షత్తు పరమశివుడే కళ్యాణ ఘడియలు నిర్ణయించుకున్న శుభదినం అయిన వైశాఖ శుద్ధ పంచమి నాడు అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగుతది. వేదాంతులు చెప్పే శివకళ్యాణ వైభవ ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్దగా వింటరు.
విజువల్స్‌ : ప్రవచనాన్ని వాడుకోగలరు.
స్పాట్.....
ఈ ఆలయంలో ఆశ్వీయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత రాత్రులు, ఆశాఢ మాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని శాఖంబరి దేవిగా కొలుస్తరు. శాఖంబరి దేవి అంటే తల్లిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించి సేవిస్తరు. శాకలు అలంకరించడం వలన ఈ దేవికి శాకంభరి అనే పేరొచ్చింది. ఈ శాకంభరి దేవి నుంచే అన్న పానాదులు, సకల ఆహారాదులు ఉత్పత్త
బైట్స్: పూజారులు
ఎండ్‌ యాంకర్‌
ఇదీ వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర. మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం..అంత వరకు శలవు.

భద్రాచల రామాలయం చరిత్ర


ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
రామా అన్న రెండక్షరాలు సకల పాపాలను హరించి మోక్షాన్నిస్తయి. అందుకే ఆ రాముడికి గ్రామగ్రామానా గుడి కట్టించి ఇష్టదైవంగా కొలుస్తున్నరు. అగస్త్యమహాముని తెలిపిన 14 రామాలయ దివ్యక్షేత్రాలలో మొదటిది అయోధ్య అయితే... అంతే ఘనకీర్తి గల భద్రాచలం రెండవది. తెలంగాణ ఆలయాల్లో ఈ రోజు భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించి వద్దాం..
బ్యాంగ్‌ (కోదండరాముడు కొలువైన భద్రగిరి)( రామదాసు చిత్రంలో చిరుచిరు నగవుల గోదావరి కోరస్‌ మ్యూజిక్‌తో బ్యాంగ్‌(ఆఖరున ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువైనాడు..తో ఎండింగ్)
యాంకర్ 1
భద్రాచలం...తెలంగాణ గడ్డ గర్విచదగ్గ పుణ్యక్షేత్రం. ఆమాట కొస్తే యావత్ ప్రపంచ రామభక్తుల మన్నన పొందిన రామాలయం ఇది. ఈ ఆలయం ఇంతటి ఘనకీర్తి మూటగట్టుకోవడం వెనక చాలా చరిత్ర ఉంది. శ్రీరాముడు తన భక్తులను కరుణించేందుకు వైకుంఠం నుంచి నేరుగా దిగి వచ్చి ఇక్కడి కొలువుతీరిండని స్థలపురాణం. దానికీ ఓ కథ ఉంది. ఆ రసరమ్య రామకథ ఒక్కసారి చూద్దాం.
వాయిస్ 1
ఇది రామపాద ధూళితో పునీతమైన క్షేత్రం. సీతారాములు నడయాడిన దివ్యధామం. పితృవాక్యపరిపాలకుడై రాముడు వనవాసియై జీవిస్తున్న తరుణంలో గోదావరి తీరాన పర్ణశాల నిర్మించుకొని ఉన్నరు. దండకారణ్యంలో విహరిస్తున్న సీతారాములను సూర్యతాపం బాధించింది. నీలికలువల్లాంటి రామ పాదాలు ఎర్రతామరలయ్యాయి. సీతమ్మ చెక్కిళ్లు కంది పెదవులను పోలిన పగడాలయ్యాయి. ఆ ఎర్రటెండలో సీతారాములు ఒక శిల పై ఆశీనులయ్యారు. ఆ శిల జానకీరాములకు పాలకడలిలో ఆదిశేశుడు అందించి సౌఖ్యాన్ని అందించింది. ఆ శిల చల్లని హాయినివ్యడమే కాకుండా మృదువుగా హంసతూలికా తల్పమంత సుఖాన్నివ్వడంతో రాముడు ఉప్పొంగిపోయిండు. సీతమ్మ కూడా ఆ శిలను మనసారా దీవించింది. ఆ శిలకు ఏదైనా వరం ఇవ్వమని అడిగింది. ఇష్ట సఖి మీదా, ఆ శిల మీదా మమకారంతో రాముడు ఆ శిలకు వరమిచ్చిండు. “ఓ శిలారాజమా ! వచ్చే జన్మలో నీవు మేరుపర్వత రాజు పుత్రుడవై జన్మిస్తవు. భద్రుడనే పేరుతో వర్దిల్లుదువు.నిత్యం నా నామ స్మరణతో పరమ నాకు భక్తుడువయితవు. అప్పడు నీ శిరసు పై కొలువై ఉండి కలియుగమున సకల జనులను ఉద్దరించ గలను’’ అని వరమిచ్చిండు. అంటే త్రేతాయుగంలోనే ఈ భద్రాచల పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి పునాదులు పడ్డయన్న మాట.
స్పాట్‌-“ ఇదిగిదిగో నారాముడు ఈడనే...’ సాంగ్‌తో స్పాట్‌
యాంకర్‌ 2
సీతారాముల వరాన్ని పొందిన ఆ శిలారాజము మరు జన్మలో భద్రుడిగా జన్మించి రాముణ్ని శిరసు పై ధరించే వరం పొందింది. అందుకే సీతారాముణ్ని రామభద్రుడని కూడా పిలుస్తరు. ఈ వరం పొందడానికి భద్రడు చేసిన కృషి అంతా యింతా కాదు. ఆ కోదండరాముని మనసు దోచుకోవడమంటే మాటలా..
వాయిస్‌
మేరు పర్వతరాజ దంపతులకు పుత్రసంతానం లేక ఎన్నో పూజలు చేసి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు. అయినా ఒక్క దేవుడు కూడా వరమియ్యక పోవడంతో మేరుపర్వతరాజు బ్రహ్మకోసం ఘోర తపసు చేసిండు.( బ్యాంక్‌ గ్రౌండ్‌లో ఓం మ్యూజిక్‌ రావాలి.) విధాత ప్రత్యక్షమయి మేరురాజుకు వరమిచ్చిండు. పుట్టబోయే బిడ్డ రామ భక్తుడై లోకోద్దారకుడవుతాడని తెలిపిండు. తరువాత కొంత కాలానికి దంపతులు... బ్రహ్మ వరప్రభావంతో సకల కళామూర్తియైన పండంటి బిడ్డకు జన్మనిచ్చిండ్రు. పువ్వుపుట్టగానే పరిమళించిందన్న చందంగా భద్రుడు నిత్యం రామనామాంకితుడై, రామభక్తి తో ఎదగసాగిండు.రాజకుమారుడైనా ఇహలోక సౌఖ్యాలపై మమకారం లేదు. సుందరాంగులకేసి కన్నేసి చూడడు.. మణిభూషణాలు అలంకరించడు. దీంతో మేరుదంపతులు విచారవదనాలతో బాధపడుతుండగా నారదమహర్షి భద్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించిండు. లోకాలను శిరసుపై మోసిన విష్టుమూర్తిని తన శిరసున నిలుపుకునే అదృష్టం భద్రుని దని తెలిపిండు. అంతటితో ఆ దంపతులు కాస్త కుదుటపడ్డరు.
స్పాట్‌
భద్రుడు రామనామస్మరణతో, భక్తి ప్రవృత్తులతో ఉండగా ఒక శుభోదయాన నారద మహర్షి భద్రునికి తారక మంత్రం ఉపదేశించిండు.(బ్యాక్‌ గ్రౌండ్‌లో శ్రీరామరామేతు రామనామ మనోరమే..మంత్రం ) ఆ మంత్రజపంతో భద్రుడు..భద్రాచల ప్రాంతానికి చేరుకొన్నడు. రామదర్శనం కోసం ఘోర తపస్సు చేసిండు. ( రామదాసు సినిమాలో భద్రుడు తపస్సు చేసే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌)భద్రుని తపస్సుకు మెచ్చిన ఆ విష్టుమూర్తి ప్రత్యక్షమయిండు. తనకు త్రేతాయుగంలో రాముడి రూపంలో దర్శనమీయమని కోరిండు. అంతటితో వామపార్శ్వమున జానకీ ఆసీనురాలై ఉండగా..శంకచక్రములు అటుఇటుగా చతుర్భాహువులతో లక్ష్మణ సమేతుడై దర్శనమిచ్చాడు.
స్పాట్( స్మాల్‌...వామాంకస్థిత జానకీ పరిసలతో కోదండ దండం కరే..సాంగ్ తో)
వాయిస్‌
త్రేతాయుగంలో రాముడు భద్రునికి ఇచ్చిన వరప్రభావంతో..భద్రుని శిరసు పై కొలువై ఉన్నడు. అదే నేటి భద్రగిరిగా రూపుదాల్చింది. అశేష భక్తుల పూజలందుకుంటుంది.
యాంకర్‌ 3
ఈ భద్రాచల క్షేత్రం ఒక్క భద్రుడినే కాదు ఎందరో భక్తులను ఉద్దరించింది. త్రేతాయుగంలో రాముడికి ఎంగిలి పళ్లను తినిపించిన మమకారానికి ఈజన్మలో కూడా శబరి ఆ రామభద్రుడి సేవకు అర్హురాలైంది. పోకల దమ్మక్కగా రామశిలకు నీడనిచ్చేందుకు తహతహలాడిండి. రామాలయ నిర్మాణానికి దమ్మక్క పట్టుదలే కారణం.
వాయిస్‌
పోకల దమ్మక్క ఒక గిరిజన మహిళ. దమ్మక్కలేనిదే భద్రాచల క్షేత్రం లేదు. పరమ రామభక్తురాలైన ఆ శబరి ఈ జన్మలో దమ్మక్కగా జన్మించిందని చెప్పుకుంటరు. అవును మరి త్రేతాయుగంలో ఆ శబరి రాముణ్ని చూడాలని ఎంత మదనపడిందో ఈ కలియుగంలో దమ్మక్కకూడా రామదర్శనం కోసం అంత తాపత్రయపడింది.
స్పాట్‌
రామభక్తురాలైన పోకల దమ్మక్క భద్రిరెడ్డి గ్రామానికి చెందిన గిరిజన మహిళ. భద్రుని పై రాముడు వెలిశాక ఎందరో మునులు, మహర్షులు రాముణ్ని కొలిచిండ్రు, పూజలు చేసిండ్రు. కాల క్రమంలో ఈ రామచంద్రుని అర్చారూపం చెట్టుపుట్టలతో నిండిపోయింది. ఆ దట్టమైన దండకారణ్యంలో ఉన్నకోదండరామ దివ్యమూర్తులు పూజానైవేద్యాలు లేక చెట్టుపుట్టల మధ్య కొలువై ఉన్నరు. ఒకరోజు దమ్మక్క కలలో సీతారాములు కనిపించి...దమ్మక్కా మేం భద్రగిరి పై అర్చారూపంలో కొలువై ఉన్నాము. మమ్ములను వెలికితీసి సేవించమని తెలిపిండు. దమ్మక్క సంతోషానికి అవధులు లేవు. ఈ వార్త గూడెం గూడేనికి మొత్తానికి తెలిపింది. మరునాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముని జాడకోసం వెతికింది. అయినా రాముని జాడ కనపడలేదు. దమ్మక్క కడివేడు కన్నీళ్లతో అక్కడే కుప్పకూలింది. తానేం తప్పుచేశానని రాముణ్ని మనసులోనే నిలదీసింది. ఆ రాత్రి మళ్లీ దమ్మక్క కలలో కనిపించి ఈ రోజు తప్పకుండా కనిపిస్తనని. భద్రాచలం గుట్ట పై వెదకమని తెలిపిండు.
స్పాట్‌
తెలతెలవారుతుండగానే దమ్మక్క భద్రాద్రికి చేరుకుంది. గుట్ట పైకి ఒక కాలిబాట కనిపించింది. ఆ కాలిబాట వెంట రామచంద్రా..రామ చంద్రా..అనిపిలుకుంటూ వెళ్లింది.(ఇక్కడ రామదాసు సినిమాలో దమ్మక్క (సుజాత) రామచంద్రా అని పిలవడాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వేసుకోవచ్చు. ఇమేజెస్ తో) ఒక పుట్టలోంచి ఓహో అని శబ్దం రావడంతో అటుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా తాను కూర్చున్న బండ ఎదురుగా పుట్టలోంచి కాంతులు వెదజల్లడం చూసింది. దమ్మక్క. తనకు ఓహో అన్న శబ్దం కూడా ఆపుట్టలోంచే వినిపించడంతో.. ఆ పుట్ట దగ్గరకు పుట్టలోకి తొంగిచూసింది. సీతాసమేతుడైన రామభద్రుడు, పక్కనే లక్ష్మణుడు ఉండటంతో దమ్మక్క సంతోషంతో ఊగిపోయింది. గోదారినీళ్లతో పుట్టను అభిషేకించడంతో సీతారామలక్ష్మణ మూర్తులు వెలుపలికి వచ్చారు. వెంటనే ఆ ప్రాంతమంతా పందిళ్లు వేశారు. తోరణాలు కట్టి అలికి ముగ్గులు వేశారు. అప్పటినుంచి భద్రగిరి వెలుగులోకి వచ్చింది. పూజలైతే చేస్తున్నరు కానీ రాముడికి నీడలేక ఎండకు ఎండి, వానకు తడుస్తున్నడు. గుడికట్టిచ్చే శక్తి లేక గిరిజనులు విగ్రహమూర్తులకు అలాగే పూజలుచేస్తున్నరు.
స్సాట్‌
యాంకర్‌ 4
భద్రాచల సీతారామచంద్రడు అలా వెలుగులోకి వచ్చాక...ఆయన విగ్రహమూర్తులను ఎండావానల నుంచి రక్షించేందుకు గుడి కట్టేందుకు సంకల్పించిండు ఓ భక్తుడు...సీతాపతికి గుడి కట్టడానికి సీతమ్మోరి కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఆయనకు. ఆయనే రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న...గోపన్న చరిత్ర కూడా భద్రమహర్షి అంతటి గొప్పదే..ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం....
వాయిస్‌
కంచర్ల గోపన్న..ఈ పేరులోనే గోపబాలుడు వినిపిస్తున్నడు. కంచెర్ల గోపన్నది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. తల్లి కామాంబ, తండ్రి లింగమంత్రి.చాలా కాలం సంతాన లేమితో మదనపడ్డారు. ఎన్నో పూజలు చేశారు. వ్రతాలు చేశారు. అయినా దేవుడు తమ మోర ఆలకించలేదని బాధపడేవారు. ఆఖరుకు కొండపల్లిలో ఉన్న సంతాన గోపాలస్వామికి మొక్కుకుంటే గోపన్న జన్మించిండు. గోపాస్వామి ప్రసాదం కాబట్టి గోపన్న అనే పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నరు.
స్పాట్
గోపన్నకు చిన్నతనం నుంచే రాముడన్నా, కృష్టుడన్నాఎక్కడలేని భక్తి. గురువుల వద్ద అనేక పురాణ కథలను తెలుసుకునే వాడు. యువకుడిగా ఉన్న గోపన్న ప్రజోపయోగ కార్యక్రమాలు చేసేవాడు. అప్పట్లో బందిపోటు దొంగల బెడద ఉండేది. స్థానికుల సాయంతో బందిపోట్లను ఎదుర్కొని రైతులను కాపాడేవాడు. అప్పట్లో అబుల్ హసన్‌ కుతుబ్‌ షాహీ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి పరిపాలిస్తున్నడు. గోపన్న మేనమామలు అక్కన్న, మాదన్నలు కుతుబ్‌షాహీ కొలువులో మంత్రులుగా పనిచేస్తున్నరు. గోపన్న మంచి పనులు వీరి ద్వారా కుతుబ్‌షాహీకి తెలిసినయి. వెంటనే గోపన్నను పిలిపించి పాల్వంచ పరగణాకు తహశిల్దార్‌గా నియమించిండు. కానీ ఎప్పటి నుంచో ఈ పదవి పై కన్నేసి ఉంచిన అబ్దుల్లాకు ఈ నిర్ణయం నచ్చలేదు. ఎలాగైనా గోపన్నను ఆ పదవి నుంచి తప్పించాలనుకున్నడు. సమయం కోసం ఎదురు చూడసాగిండు.
స్పాట్
గోపన్న పదవీ బాధ్యతలు స్వీకరించగానే భద్రాచలం వెళ్లి తన ఇష్టదైవం రాముణ్ణి దర్శించుకొని వచ్చిండు. రాముడికి నిలువ నీడలేక ఎండావానలకు తడవడాన్ని గోపన్న జీర్ణించుకోలే పోయిండు. అక్కడి ప్రజల సహకారంతో రాముడికి గుడి కట్టించేందుకు సన్నాహాలు ప్రారంభించిండు. గ్రామగ్రామానా చందాలు వసూళ్లు చేసి సీతారాములకు గర్భాలయం, గోపురాలు, గోపురాల పై కలశాలు, చుట్టూ కోవెలలు, ముఖ మంటపం, అధ్యయనోత్సవ మంటపం, పవళింపు సేవలకు అద్దాలగది, వెండి శేష పాన్పు, ఎత్తేన ధ్వజ స్థంబ నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. రామయ్య కొరకు రధ, గజ, అశ్వ, హంస, సింహ, గరుడ, హనుమ, సూర్యప్రభ వంటి వాహనాలు కూడా నిర్మింపచేసిండు. గర్బాలయ శిఖరం పై శ్రీవారి చక్రం అమర్చడం మిగిలింది. శిఖరం పై చక్రమును అమర్చేందుకు ఎందరో శిల్పులు తమ ప్రయత్నం చేసిండ్రు. అయినా ఒక పట్టాన చక్రం కుదురుగా నిలవడం లేదు. శిల్పులు ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలన్నీ వ్యర్ధం అయ్యాయి. ఈ పరిస్తితికి రామదాసు కలత చెంది, రామచంద్రప్రభు నేనేమి నేరం చేశానని బాధ పడుకుంటూ నిద్రలోకి జారుకున్నడు. నిద్రలో రామచంద్రుడు కనిపించి రేపు గోదావరి నదిలో స్నాన మాచరించి తనను ప్రార్దించమని తెలిపి అంతర్ధానమయిండు. మరుసటి రోజు తెల్లవారు ఝామునే రామదాసు కలలో రాముడు చెప్పినట్టు గోదావరి స్నానం చేసి రాముణ్ని తలచుకొన్న మరుక్షణమే అలపై ఒక తెప్పపై తేలియాడుతూ గోపురచక్రం రామదాసు వద్దకు వచ్చింది. ఈ చక్రాన్ని గోపురం పై విజయవంతంగా అమర్చగలిగిండ్రు శిల్పులు. ఇప్పుడు రామాలయం పై మనం చూస్తున్న చక్రం అదే.
యాంకర్‌ 5
మంచికి పోతే చెడు ఎదురయినట్టయింది రామదాసు పరిస్థితి. రాముడికి నీడ కల్పించానన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ప్రభువు అనుమతి లేకుండా చిల్లి గవ్వ వాడినా అది నేరమే పుణ్యం కోసం వాడినా ప్రభువుల దృష్టిలో అది ఘోర అపరాదం. ఆ అపరాదానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది రామదాసు.
స్పాట్
భద్రాచలం మొత్తం రామనామ సంకీర్తనతో మారిమోగుతోంది. ప్రతి ఇల్లు రామభక్తులతో విరాజిల్లుతంది. రామాలయంలో పనులన్నీ చకచకా జరిగిపోయి, అంగరంగ వైభవంగా కళకళలాడుతుంది. రామధాసు సంతోషానికి అంవధులు లేవు. అంత సంతోషంలో ఒక విషాదం.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని అబియోగం మోపుతూ రామదాసుని బందీగా తీసుకురమ్మని తానీషా దగ్గర నుంచి భటులు ఆజ్ఞా పత్రం తెచ్చిచ్చారు. రామదాసు అరణ్యానికి వెళతున్న రామచంద్రుడి వలే చిరుమందహాసంతో భటుల వెంట గోల్కొండకు కదిలిండు. రాజదర్భారులో న్యాయమూర్తులు రామదాసుకు శిక్ష ఖరారు చేసిండ్రు. ఆరు లక్షల ద్రవ్యాన్ని కట్టాలి..లేదా కారాగార వాసం చేయాలని తీర్పు చేప్పిండ్రు. రామదాసు ఎవరిని సాయం కోసం అర్దించకుండా కారాగార వాసానికి సిద్ధపడ్డడు.
స్పాట్ ( రామరసరమ్య..సాంగ్ )
రామదాసుకు కారాగార వాసంలో వేధింపులు మొదలయ్యాయి. తన పై ఎప్పటినుంచో కక్ష్య పెంచుకున్న అబ్దుల్లా రామదాసును కారాగారంలో చిత్రహింసలు పెట్టసాగిండు. కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కరువయింది. శరీరం రోజురోజుకూ కృంగి కృశిస్తంది. అయినా రామనామం వీడలేదు. భటులు కొట్టే దెబ్బలకు తాళలేక “”నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆర్తిగా అర్తించిండు.
స్పాట్‌(ననుబ్రోవమని చెప్పవే సాంగ్)
రామదాసు కన్నీళ్లు ఎవరినీ కరిగించలేదు. ఆరు లక్షల పైకం ఎక్కడ దాచావో చెప్పమని ఒత్తిడి చేస్తున్నరు. సర్కారు పైకాన్ని ఏం చేశావని నరకయాతనలు పెడుతున్నరు. ఈ బాధలకు తట్టుకోలేని రామదాసు రాముడికి తాను పెట్టిన ఖర్చుల లెక్కలు అప్పజెప్పిండు.
స్పాట్ ( సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకమూ..సాంగ్)
యాంకర్ 6
కారాగారంలో ఎన్నో కష్టాలు పడుతున్న రామదాసు కన్నీళ్లకు సీతమ్మ కరిగిపోయింది. రామదాసును చెరనుంచి విడిపించమని సీతాపతిని వేడుకొంది. సీతమ్మ మాటలకు కరిగిన ఆ దాశరది..రామదాసు చిలుకను పంజరంలో బందించడం వల్లనే చెరసాల కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని వివరించి రామదాసును విడిపించేందుకు బయలుదేరిండు.
వాయిస్
రామదాసు కష్టాలు నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. సాక్ష్యాత్తూ ఆ రామలక్ష్మణులే రామోజీ, లక్ష్మోజి రూపంలో తానీషా కు కలలో కనిపించి ఆరులక్షల పైకాన్ని చెల్లించి రశీదు పొందిండ్రు. ఇది కలా నిజమా అన్నట్లు తోచింది తానీషా ప్రభువుకు. వెంటనే మెలకువ వచ్చిన తానీషాకు తన ఎదురుగా ఆరులక్షల పైకం ఉండటాన్ని గమనించి ఆశ్చర్యచకితుడయిండు. తనకు కలలో కనిపించింది ఆ శ్రీరామచంద్రులేనని తానీషా గ్రహించిండు. తాను ఘోర తప్పిదం చేసినట్లు గ్రహించిండు. వెంటనే రామదాసుని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించిండు. రామదాసును అధితి సత్కారాలతో మర్యాదగా సాగనంపడమే కాకుండా తానీషా తాను కూడా భద్రాచల రామదాసును దర్శించి కళ్యాణం జరిపించిండు. ప్రతి సంవత్సరం శ్రీసీతారాముల కళ్యాణానికి తానీషా తానే ముత్యాల తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రభుత్వంలో ఎరున్నా మంచి ముత్యాల తలంబ్రాలు, రోకటి పోటు లేని బియ్యం రామునికి ముత్యాలు తలంబ్రాలుగా వాడుతరు.
స్పాట్‌ ‘(జానకి దోసిట కెంపులు ప్రోవై...రాముని దోసిట నీలపు రాసై..ఆణిముత్యములు తలంబ్రాలుగా.. ) సాంగ్‌ తో..
ఈ రామాలయాన్ని దర్శించుకోడానికి దేశం నలుమూలలనుంచి రామభక్తులు ఇక్కడికొస్తరు. భద్రాచల అందాలు ఎంత చూసినా తనితీరనివి. ఇక్కడి గోదావరి నది రామపాదాలను కడిగేందుకు తహతహలాడుతుంటది. భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి సీతారాములను దర్శించుకుంటరు. కరకట్ట పై శ్రీరామ చరిత్రకు సంబంధించిన రామాయణ గాథలు శిల్పాలుగా ఏర్పాటు చేసిండ్రు. భద్రాచలంలోప్రవేశించగానే అంతెత్తు ఆంజేయ విగ్రహం రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటది. ఒక్క సారి భద్రాచలాన్ని దర్శిస్తే వందసార్లు కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్యం కలుగుతదని స్థల పురాణంలో పేర్కొన్నరు.

ఇదీ.. భద్రాచల శ్రీ సీతా రామాలయ చరిత్ర..మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం ..అంతవరకు సెలవు.

Wednesday, May 12, 2010

సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారు గురించి


ఎ.జనార్దన్‌
అమ్మలగన్న యమ్మ... ముగ్గురమ్మలమ్మ మూలపుటమ్మ...సృష్టి లయకారుల చేత పూజలందుకుంటున్న దివ్యజనని... మహాకాళి అమ్మవారు. ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటే ఏ చీడ పీడా దరి చేరదు. ఆ అమ్మ దయ ఉంటే బిక్షగాడు కూడా లక్షాధికారి అయితడని భక్తుల నమ్మకం...ఇంత మహత్తు ఉన్న అమ్మవారు ఎక్కడో దూర దేశాన లేదు...మన సికింద్రాబాద్ లోనే ఉంది. ఉజ్జయినీ మహాకాళి అనగానే చాలా మందికి ఒక అనుమానం వస్తది. సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారుగా ఎందుకు పిలుస్తరనే సందేహం కూడా కలుగుతది. దానికీ ఓ కథ ఉంది. అప్పట్లో భద్రాచలంలో రాముడికి...రామదాసు అనే భక్తుడు గుడి కట్టించినట్టే... ఇక్కడ ఈ ఆలయం నిర్మించ డానికీ ఒక భక్తుడే కారణం. ముగ్గురు మూర్తులకు తల్లి..మహాకాళి అమ్మవారు. ఆ తల్లి...ఒక భక్తుని కోరిక మేరకు సికిందరాబాద్‌లో వెలిసింది. 1813వ సంవత్సరంలో మిలిటరీలో పనిచేసే సురిటి అప్పయ్య అనే భక్తుడు దేవికి పరమ భక్తుడు. ఆయన ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యిండ్రు.అక్కడ ఉజ్జయినీ మహాకాళిని నిత్యం సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి ఉజ్జయినిలో కలరా వ్యాపించింది. ప్రజలు పిట్టల్లా రాలి పోయిండ్రు. కాపాడే నాథుడు లేక విలవిల్లాడిండ్రు. ఆ రోజుల్లో కలరాను గత్తర గా పిలిచెటోళ్లు. గత్తర వ్యాధి సోకితే మరణం తప్ప మార్గం లేదు. ఈ కలరాకు అప్పట్లో సరైన మందు లేదు.కలరా వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులు కోవల్సిందే.. తన మిత్రులు, బందువులు తన కళ్లముందే నేలకొరగడాన్ని చూసి సురిటి అప్పయ్య చలించి పోయిండు. ఉజ్జయిని అమ్మవారి వద్దకు వెల్లి తమ వారిని కాపాడమని ప్రాదేయపడ్డడు. ప్రజలను కలరా బారినుంచి కాపాడితే అమ్మవారి విగ్రహాన్ని తమ ఊరైన సికిందరాబాద్‌లో ప్రతిష్టించుకొని నిత్యం పూజలుల చేస్తమని మొక్కుకున్నడట. అప్పయ్య ఆభ్యర్దన విన్నదో...లేక తన బిడ్డల కన్నీళ్లకు కనికరించిందో ఆ దేవత. అప్పటినుంచి ఆ వూళ్లో కలరా మటు మాయం అయింది. దేవి తన కోరిక మన్నించినందుకు సురిటి అప్పయ్య సంతోషించిండు.
తల్లికి మొక్కుకున్నట్టుగానే మహాకాళి విగ్రహాన్ని సికిందరాబాద్‌లో ప్రతిష్టించేందుకు సిద్దమయిండు. అప్పటికప్పడు రాతి విగ్రహం లేక ఉజ్జయినీ అమ్మవారిని చెక్క శిల్పంగా చెక్కించుకుండు. తాను, తన తోటివారు తిరిగి సికిందరాబాద్‌ రాగానే మొక్కిన మొక్కును చెల్లించుకునేందుకు రెడీ అయ్యిండ్రు. 1815వ సంవత్సరంలో అచ్చం తల్లి రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని సికిందరాబాద్‌ నడిబొడ్డున ప్రతిష్టించిండు.గ్రామస్థులంతా అమ్మను ప్రతిష్టించి ప్రతిరోజు భక్తితో కొలుస్తున్నరు. ఇప్పడు ఇంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు చెట్టు చేమలతో పుట్టలతో నిండి ఉండేడిది. ఆ కాలంలో చెక్క విగ్రహాంఎండావానలకు పాడవకుండా... రక్షణగా అప్పయ్య చూట్టూ గోడలు నిర్మించిండు. గ్రామస్థుల సాయంతో చిన్న గుడి నిర్మించి రోజూ పూజలు చేస్తున్నరు. అమ్మవారికి గుడి కట్టించిన ప్రాంతంలో పెద్ద బావి ఉండేది. దానికి మరమ్మత్తులు చేయించేందుకు గ్రామస్తులంతా నడుంబిగించిండ్రు.మనం చూస్తున్న ఈ దేవత మాణిక్యాలమ్మ తల్లి. మహాకాళి అమ్మవారికి గుడి కట్టడానికి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుంటె ఈ తల్లి బయటపడిందంట. తమను దయ తలిచేందుకే అమ్మ వెలిసిందని భక్తులు ఈ అమ్మవారిని కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నరు.ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి గుడికి మరమ్మత్తలు చేసే పనిలో చెట్టూ పుట్ట తొలగించి శుభ్రం చేసిండ్రు. ఇక్కడున్న పెద్ద బావిని కూడా చూట్టూ తవ్వి మంచినీళ్ల బావిగా మలిచే ప్రయత్నం చేసిండ్రు. అప్పడే ఇక్కడి తవ్వకాల్లో మాణిక్యాల దేవి విగ్రహమూర్తి బయట పడింది. భక్తులు సంతోష పడ్డరు. ఆ తల్లే తమను దయతలచి ఇక్కడకు వచ్చి ఈ రూపంలో తమను కరుణించిందని తలచిండ్రు. ఆ రాత్రి ఒక భక్తుని కలలో మాణిక్యాల దేవి తనను మహాకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్టించాలని కోరిందట. 1864వ సంవత్సరంలో ఈ తల్లితో బాటు ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కూడా రాతి విగ్రహం చేయించిండ్రు. గర్భగుడిలో మహాకాళి అమ్మవారిని... ఆ తల్లికి కుడివైపున మాణిక్యాలదేవిని ప్రతిష్టించి పూజిస్తున్నరు.ఈ దేవతలు ఒకప్పుడు అక్కడ గ్రామ దేవతలు గానే పూజలందుకునేవి. తరువాత కాల క్రమంలో అమ్మవార్ల మహిమలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియండంతో దేశం నలుమూలలనుంచి భక్తులు ఇక్కడకు వచ్చి తల్లిని దర్శించుకుంటరు. ఈ తల్లి మహిమలు ఖండాంతరాలకు వ్యాపించినయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మను సేవించి, తమ కోర్కెలు చెప్పుకుంటరు.ఆశాఢమాసం వచ్చిందంటే ఆలయమంతా సందడే సందడి. కొత్త పెళ్లి కూతుళ్లు అమ్మవారికి తమ మనసులో మాట చెప్పుకుంటరు. నమ్మి కొలిచినందుకు నచ్చిన తోడు ఇచ్చినవని మనసులోనే అమ్మకు కృతజ్ఙతలు చెప్పుకుంటరు. బోనాల జాతరకు ఇష్టపడి భోనం వండుకొని వచ్చి అమ్మకు వడ్డిస్తరు.తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి ఆడపడుచుకూ పల్లె తల్లులంటే పట్టరాని సంతోషం. మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ,ఉప్పలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ ..పేర్లేవైనా కొలిచే దైవం ఒక్కటే...అమ్మతల్లులను కొలిచే పండుగంటే ఊరంతా సంబంరం..తెల్లవారు ఝామునే లేచి తలారా స్నానం చేసు పట్టు పరికిణీలతో రంగవల్లులు తీర్చిదిద్ది.. అమ్మవారికి నిండు మనసుతో బోనం వండి..తలకెత్తుకొని నడిచెళ్తుంటరు. అల్లంత దూరాన ఉన్న మహాకాళి అమ్మవారికి భక్తితో వడ్డిచ్చి తమ మనసులో కోరికలు తెలుపుకుంటరు.ఆషాఢ మాసం వచ్చిందంటే పల్లెలన్నీ పడుచుల సంబరాలతో చిందులేస్తయి. జంటనగరాలలో బోనాల పండుగ అంటే చెప్పలేనంత ఆనందం. ఊరూవాడా ఏకమైతది. పల్లె పట్నం ఒక్కచోట చేరుతది. యువకులకు బోనాల పండగంటే కళ్ల సంబరం.. ఆ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూసే వారు ఎంతోమంది. కొర్కెలు కోరుకునే వారు కొత్త మొక్కులు మొక్కుకుంటే...కోరికలు తీరిన వారు భక్తితో తమ మొక్కులు చెల్లించుకునేది కూడా అప్పుడే... రెండొందల ఏండ్లసంది అమ్మ వారితో బాటు ఈ చెట్టు కూడా పూజలందుకుంటుంది.ఈ చెట్టులోనే అమ్మవారు కొలువై ఉందని భక్తుల నమ్మకం.అందుకే ఈ చెట్టుకు చీరలు బహుకరించి పూజలు చేస్తరు.వేప చెట్టు... తల్లికి ఇష్టమైన చెట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే...అమ్మతల్లికి ప్రతి రూపం వేపచెట్టు. అందుకే అమ్మవారున్న ప్రతి చోటా వేపవృక్షం ఉంటది. ఈ మహకాళి దేవాలయానికి పునాదులు కూడా వేపచెట్టు నీడనే పడ్డయి. అమ్మకు గుడి కట్టకముందు అమ్మవారికి వేపచెట్టే నీడగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మతో బాటు ఈ వేప చెట్టుకూడా పూజలందుకుంటున్నది. రెండొందల ఏండ్లుగా వేపచెట్టు నిండు ఆరోగ్యంతో పచ్చగా ఉండటం వెనుక అసలు రహస్యం ఈ చెట్టులో అమ్మ కొలువై ఉండటమేనని భక్తులు నమ్ముతరు.ఈ చెట్టును పసుపు కుంకుమలతో పూజించి...వారానికో కొత్త చీరతో అలంకరిస్తరు. నిండు ముత్తైదువుగ దీవించమని కోరుకుంటరు. చీడ పీడలు...మంత్ర తంత్రాల నుంచి రక్షించమని వేడుకుంటరు.అమ్మ చల్లని చూపు తమ పై పడాలని కోరుకుంటరు. ఒక్క వేప కొమ్మ వేయి రోగాలను నయం చేస్తది. వేయి రక్షల విలువ చేస్తది. అందుకే ఆ వేప కొమ్మ స్పర్శతో సకల జాడ్యాలు వదిలిపోతయి. ఈ తల్లి మాతంగేశ్వరి అమ్మవారు... మహాకాళి అమ్మవారికి పరిచారదేవత అని చెప్పుకుంటరు. బోనాల జాతరప్పుడు సోమవారం రోజున జోగిని రంగమెక్కేది ఇక్కడే..మహాకాళి అమ్మవారికి అభిముఖంగా ఉన్న ఈ మాత మాతంగేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. బోనాల పండుగప్పుడు ఆదివారం బోనాల జాతర అయ్యాక..సోమవారం రంగమెక్కడం అనే కార్యక్రమం ఉంటది. ఈ కార్యక్రమాన్ని ఒక జోగిని చేత చేయిస్తరు. గతంలో పల్లెలల్లో ఒక జోగిని కుటుంబాల కన్యలను దేవికి అంకితం చేసేవారు. ఆ కన్యతో ఖడ్గానికి వివాహం చేసి తల్లి సేవకు అంకితం చేసే వారు. ఆమె పోషణ భారం ఆ ఊరే చూసుకునేది. బోనాల జాతరప్పుడు సోమవారం మాతంగేశ్వరి ముందు పచ్చి కుండ పై నిల్చుని జోగిని పూనకం ఊగుతది. భక్తులు జోగినిని అమ్మవారు పూనిందని పారవశ్యంతో నమస్కరిస్తరు. ఆ పూనకంలో భవిష్యత్తు గురించి...దేశకాల పరిస్థితుల గురించి జోగిని చెప్తది. వర్షాలు సకాలంలో వచ్చేది..రానిది.. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి నివారణకు ఏం చేయాలనేది అమ్మ పలుకుగా చెప్తది. భోనాల జాతరప్పుడు ఉత్సవ విగ్రహాన్ని గుడి బయట ప్రతిష్టిస్తరు. ఈ అమ్మవారు ప్రతి ఒక్క ఇంటి గడపకు వెళ్తది. గుడి వరకు రాలేని భక్తులను కరుణించేందుకు ఆ మాతే వారి గడపలోకి వెళ్లి దీవెనలందిస్తది. తల్లి వాయుస్పర్శతో తమ ఇంటిలో ఉన్న పీడ పిశాచాలు వదిలి పోయి...ఇంటికి శాంతి కలుగుతదని భక్తులు విశ్వసిస్తరు. అందుకే భక్తులు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఈ పండుగలప్పుడు తప్పక హాజరవుతరు. అమ్మమీద అంత విశ్వాసం.ఇక్కడ నిత్యకళ్యాణం పచ్చతోరణం. నిత్య ధూప దీపారాధనతలో...భక్తులతో గుడి కళకళలాడుతుంటది. ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవికి పల్లకీ సేవ చేస్తరు... ఇదే రోజుల్లో భక్తలు దేవిని నిమ్మకాయలతో పూజిస్తరు.ఆలయం అణువణువు భక్తి భావంతో తొణికిసలాడుతుంటది. గుడిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి ముఖంలో శాంతి కొట్టొచ్చినట్టు కనిపిస్తది. ఆపదలో వచ్చిన వారికి తమ కష్టాలు గట్టెక్కుతయనే నమ్మకం కొట్టొచ్చినట్టుంటది.ఆలయకుడ్యాలపై అందమైన శిల్పాలు చెక్కించిండ్రు. దేవాతా మూర్తులతో బాటు అమ్మవారి వాహనమైన సింహశిల్పాలు చూడ ముచ్చటగా ఉంటయి.ఈ శిల్పాలు చెక్కడంలో కూడా మన శిల్పులు అత్యంత ప్రతిభ కనబరిచిండ్రు. ఆలయ ముఖ ద్వారం లో ఉన్న సింహం నోటిలో ఒక గుండ్రని రాయి చెక్కిండ్రు. ఇది సింహపు కోరల నుంచి చూస్తే నే కనిపిస్తది. కదిలిస్తే బంతి వలే కదులుతది కాని బయటకు తీసే మార్గం లేదు. ఈ రాయిని ఎలా ప్రతిమలోకి చేర్చారనేది ఆధునిక శిల్పులకు సైతం అంతు బట్టని విషయం.ఈ ఆలయం 1953 నుంచి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆలయ బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటున్నది. భక్తల సౌకర్యార్దం వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నది. బస్తీలో జరుగుతున్న అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంచనీయ సంఘలనలుజరుగకుండా మెటల్‌ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసిండ్రు. నిఘా కెమేరాలను ఏర్పాటు చేసి ఆలయంలో ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేస్తున్నరు. జాతరలప్పుడు మరిన్ని భద్రతా ఏర్పాట్లతో కట్టదిట్టమైన చర్యలు తీసుకొని భక్తులకు అమ్మవారి దర్శనం తేలికగా అయి క్షేమంగా ఇల్లు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటరు.