ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, January 24, 2011

ఈ రోజు మద్యాహ్నం టి.వి చూడాలనిపించి కాస్త రిమోట్‌ కు పని చెప్పా..రాజాం నుంచి రచ్చబండ లైవ్‌..అదీ సియం గారితో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం. సియం తాను ముఖ్యమంత్రినని గుర్తుకు తెచ్చుకొని హుషారుగా ప్రజా సమస్యలు తీరుస్తానని, రచ్చబండ ద్వారా రాష్ట్రాన్ని మొత్తం ఒకేసారి సుసంపన్నం చేద్దామన్నంత హుషారు కనిపించింది. అయితే ఒక్కోక్కరు అడిగే సమస్యలకు ముఖ్యమంత్రి చెప్పే సమాధానం గజాసనవాయు సామెతను గుర్తుకు తెచ్చింది. ఆ వూళ్లో ఒక విధవరాలు పించను రావట్లేదని అడిగింది వెంటనే అక్కడున్న అధికారుల సమాధానం ఏంటంటే రేషన్ కార్డులో నంబర్‌ తప్పుపడిందని..ఆ వెంటనే సియం సముదాయింపు..అమ్మా నీ కార్డులో నెంబర్ తప్పు పడిందట..ఆ నెంబర్ సరి చూసి మీకు పించన్ ఇస్తారని చెప్పాడు. ఆ మహిళ తడుముకోకుండా ఒకటే మాట అంది..రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు. అంది..అంతే కాదు గుక్క తిప్పుకోకుండా మరో మాట కూడా జత చేసింది..మిద్దెలు మేడలు ఉన్నోళ్లకు రాని తప్పుడు నెంబరు నాకే రావాల్నా సారూ. అంది.నాకు నవ్వు ఆగలేదు.. ఎందుకంటే సియం..అక్కడ కనీసం ప్రజల మెప్పుకోసమైనా అధికారులను మందలించాల్సి ఉండేది. నెంబర్ తప్పు పడింది అంటే ఎవరి నిర్లక్ష్యం? పోనీ టెక్నికల్‌ మిస్టేక్ వల్ల తప్పు పడిందే అనుకో..ఆ తప్పు సరిదిద్దడానికి ఎన్నేండ్లు పడుతుంది..అడిగేవాడు లేకుంటే ఎన్నేండ్లయినా పడుతుంది..రెండేళ్లుగా ఒక నంబర్‌ తప్పును సరిదిద్దలేని అధికారులు ఇప్పుడు అమాంతం ప్రజలకు మేలు చేస్తారనుకోవడం కాస్త అత్యాశే కావచ్చు..కానీ పాపం ఆ అమాయకురాలు నమ్మడంలో తప్పులేదు. మళ్లీ రెండు నెలల తరువాత ఆ వూరెళ్తే గానీ అధికారులతో ఆమె ఎన్ని చివాట్లు తిన్నది..ఇంతకీ ఆ నెంబర్‌ మారిందీ లేనిది చెప్పదు. బౌషా అమెకి తెలియక పోవచ్చు.. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినంత ఈజీగా కార్డులో నెంబర్ మారదని. ఈ రాష్ర్టంలో సియం దృష్టికి రాని నంబర్లు ఎన్నివేలు తప్పు పడ్డాయో. ఆ పాపనికి పించన్‌ రాక, ఆరోగ్యశ్రీ అందుకోక, కనీసం ఉపాధి లభించక, ఆఖరుకు ఆ రెండు రూపాయల బియ్యం కూడా అందుకోలేక ఎందరు బాధపడుతున్నారో.. తరువాత మరో వికలాంగురాలైన పద్మావతి సియం గారితో తాను యం.ఏ తెలుగు, యంఇడి చదువుకున్నానని తనకు వికలాంగుల పించన్‌ ఐదు వందలు సరిపోదని, కష్టపడి తల్లిదండ్రులు వికలాంగురాలినైనా చదివించారని, వాళ్లరుణం తీర్చుకోవాలంటే చిన్న ఉద్యోగం ఇప్పించమని వేడుకొంది. సాలరీ ఎంతైనా ఫర్వాలేదు కనీసం కొలువిస్తే చాలని ప్రాదేయం పడింది. వెంటనే సి.యం డిఆర్డీఏ ఆఫీస్‌ లో ఆమెకు కాంట్రాక్‌ జాబ్‌ ఇవ్వాల్సిందిగా పి.డిని ఆదేశించారు.వేతనం 6000/- నిర్ణయించారు. ఈ సీన్‌ చూస్తే లీడర్ సినిమాలో ఒక సీన్‌ గుర్తొచ్చింది. అనాథైన ఒక మైనర్‌ బాలిక తన ఆకలి తీర్చుకోవడానికి కేవలం ఒక బన్నుకోసం ఒక నడివయస్కుడి కామవాంచ తీర్చడానికి సిద్దపడుతుంది. అది గమనించిన హీరో వాణ్ని మందలించి బన్ను డబ్బు తానివ్వబోతాడు. అతని ముందుకు కొన్ని వందల చేతులు వస్తాయి..నిజానికి ఏ ఒక్కరి ఆకలి తీర్చడానికో కాదు ఈ రాష్ర్ట సియం ఉన్నది. ఇలాంటి పీజిలు చేసి వికలాంగుల సర్టిఫికెట్ తీసుకొని నెలకు ఐదొందల బిక్షంతో గడిపే వికలాంగులకు సియం 6000/- వేతనం ఉండే ఉద్యోగాలు అంతటా ఇవ్వాలి. ఊరికో స్క్రోలింగ్ రావాలి. ఇది సాధ్యమయిన రోజే రచ్చబండకు విలువుంటది. అంతేందుకు కోడి రమణమ్మ రేషన్ కార్డులో నంబర్ నెలరోజుల్లో మారితే ఈ రచ్చబండ నిజంగా ప్రజలకు న్యాయం చేసేదని నమ్మవచ్చు. సియం గారూ...పాకం ముదిరిపోయింది..ఇప్పుడు నీళ్లు పోస్తే పాకం గడ్డ కడుతుంది. పిండేస్తే రాయి మాదిరిగా తయారవుతుంది. యూ ఆర్ టూ లేట్... ఎన్నిరచ్చబండలైనా నీకు గుదిబందలే...ఆల్‌ ద బెస్ట్...

Friday, January 21, 2011

కొత్త వార్తలహో

కాంగ్రెస్ “రాజీ” నామాలు
కాంగ్రెసోళ్ల కల్లబొల్లి కబుర్లు
సోనియా గాంధీ అంటే తెలంగాణ కాంగ్రెసోళ్లు భయమెందుకు
తెలంగాణలో జగన్ సాటి కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు లేడా.
సూపర్ పవర్స్ ఉన్న వండర్ పుల్ వెపన్ అది. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల శక్తి ఆ ఒక్క ఆయుధంలోనే ఉంది. ఆ ఒక్క అస్ర్తాన్ని వదిలితే.. ఏ బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండానే తెలంగాణ వచ్చితీరుతుంది. ఏ విద్యార్ధి వంటి మీద చిన్న గాటు కూడా పడకుండా స్వరాష్ట్రం ఆవిర్భవించి తీరుతుంది. ఏ కేంద్రం, ఏ రాష్ట్రం ఆపలేని శక్తి అది. సర్వవ్యవస్థలను అది స్థంభింప చేస్తుంది. తెలంగాణ క్షణాల మీద వచ్చి తీరుతుంది. ఆయుధం పేరే రాజీనామా ! ఆ వెపన్ పేరే రిజైన్. కమిటీల కథలను, సీమాంధ్ర వలలను ఛేధించే అపూర్వ అస్ర్తం. అది ఎవరిదగ్గరుంది? ఎందుకు దాన్ని ప్రయోగిస్తలేరు.? విద్యార్ధుల చచ్చిపోతున్నా.. చూస్తూ వాళ్లు ఎందుకు ఊరుకుంటున్నరు? తెలంగాణ బిడ్డలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎందుకు రోడ్డు మీద పడి బుల్లెట్ల దెబ్బలు తినాలే? ఓట్లేసి గెలిపించినంగా ! పదవులిచ్చి సాగనంపినంగా ! వీళ్లేం చేస్తున్నరు.? ఎక్కడున్నరు ఎమ్మేల్యేలు? ఏంచేస్తున్నరు ఎంపీలు?
మీరు రాజీనామాలు చేస్తనే వస్తది. 119 మంది ఎమ్మేల్యేలు తలుచుకుంటే ఒక్క క్షణంలో తెలంగాణ వచ్చి తీరుతుంది. ఇంకా పదవులను పట్టుకుని వేలాడితే తెలంగాణ ప్రజాఆగ్రహానికి గురికాక తప్పదు… ఈ హెచ్చరిక ఓయూ క్యాంపస్ సాక్షిగా విద్యార్ధులు చేసింది. మేలు చేస్తం మాకు ఓట్లేయ్యమని బతిమిలాడిన్రు. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తమన్నరు. తెలంగాణ బిడ్డలు నమ్మిన్రు. ఓట్లేసిన్రు. పదవులోచ్చినయి. పవర్ నెత్తి కెక్కినంగా వంట్లో చీము నెత్తురు చచ్చింది. అన్నమాట మరిచిన్రు. ఓయూలో విద్యార్ధుల శవాలపైన చేసిన ప్రమాణాలు.. యావత్ తెలంగాణ పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని పదవికోసం తాకట్టు పెట్టిన్రు. రాజీనామాలు చేసిన తెలంగాణ బిడ్డల్ని మళ్లీ చరిత్ర ఎరుగని మెజార్టీతో గెలిపించుకున్నప్పుడైనా వీళ్లకు సిగ్గోస్తది తియ్యి.. అనుకున్న వాళ్లకు మళ్లి అదే చిత్రం ఎదురైంది. సంవత్సరం పాటు ఓపికగా ఉన్నా.. తెలంగాణ ప్రజలను కించపరుస్తూ.. అర్ధంపర్ధం లేని అడ్డమైన సూత్రాలను శ్రీకృష్ణ కమిటి చెప్పినా.. వీళ్లు ఇంకా దేనికోసమో ఎదురు చూస్తరంటా? రాజీనామాలు చెయ్యనికి ముహుర్తాలు చూడాలంటా?
పోయిన ఏడాది కేసియార్ దీక్షతో డిసెంబర్ లో చిదంబరం తెలంగాణ ప్రకటించగానే తెలంగాణ బిడ్డలు ఎంతో సంతోషపడ్డరు. ఇక కష్టాలు తీరిపోయిన కదా అని సంతోషపడ్డరు. అంతలోనే సీమాంధ్ర నాయకులు రాజీనామా ఆయుధాలతో పుట్టి ఒక్క రోజైన కాకముందు తెలంగాణ ను తెగనరికిన్రు. ఇది చూసి తెలంగాణ బిడ్డలు షాక్ తిన్నరు. మనోళ్లు కూడా రాజీనామాలు చేస్తే.. తెలంగాణ ఖచ్చితంగా నిలబడుతది తియి అని అనుకున్నరు. కానీ టిఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఒక బిజేపి అభ్యర్ధి తప్పితే ఎమ్మేల్యేలందరు కుర్చీలను పట్టుకుని పారిపోయిన్రు. అంతే వచ్చిన తెలంగాణ తెర్లయ్యింది. ఇంతలోనే ఆరు నెళ్లు గడిచిపోయినయి. ఉప ఎన్నికలు. తెలంగాణ కోసం త్యాగం చేసిన ఎమ్మేల్యేలను తెలంగాణ ప్రజలు నెత్తికెత్తుకున్నరు. చరిత్ర ఎరుగని మెజార్టీతో గెలిపించి తెలంగాణ గుండెల్లో ఏముందో తెలియజెప్పిన్రు.
ఇప్పుడు ఏడాది కాలంగా ఎదురు చూసిన శ్రీకృష్ణ కమిటి తెలంగాణ బిడ్డలన్ని ఎడ్డోళ్లను చేసింది. చిన్న పోరన్ని అడిగినా.. కమిటీ అంత అడ్డదిడ్డంగా చెప్పకపోయేటోడు. తెలంగాణ మీద మళ్లా నాటాకాలు షురువైనయి. తెలంగాణ బిడ్డల గుండెలు బరువెక్కినయి. ఇప్పుడేం చెయ్యాలే? నాలుగున్నర కోట్ల మంది ఆత్మహత్యలు చేసుకోవాల్నా? 119 మంది ఎమ్మేల్యేలు, 17 మంది ఎంపీలు రాజీనామాలు చేయాల్నా? ఏం ? ఏమైతుంది? రాజీనామాలు చేస్తే మళ్లి పదవులు దక్కవనా? ఎందుకు భయం? ఉప ఎన్నికల్లో వచ్చిన రిజెల్ట్ చూసి కూడా ఎందుకు బెదురు? సింపుల్ గా 136 మంది చిన్న రాజీనామా అస్ర్తం వదిలితే..కేంద్రం పల్లకిలో తెలంగాణను మోసుకొచ్చి ఇవ్వదా? రాజీనామాలు చేసిన వాళ్లు చరిత్రలో మిగిలి పోరా? వారిని తెలంగాణ బిడ్డలు గుండెల్లో దాచుకోరా? ఎందుకు ఈ వినాశనం. ? తెలంగాణ బిడ్డలు ఎందుకు ఉసురు తీసుకోవాలే? వాళ్లదేమైనా కానీ కోరికనా? తెలంగాణ ఏమైనా రాక్షస రాజ్యంలో నడుస్తున్నదా? స్వరాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల మంది ముక్త కంఠంతోని కోరుకుంటున్నా కూడా ఎందుకు తెలంగాణ ఇచ్చేటందుకు ఇన్ని తిరకాసులు?
మా పాలన మే పరిపాలించుకుంటమంటే ఎవరి ఎందుకు నొప్పి? స్వరాష్ట్రం కావాలంటే ఏదో దేశద్రోహ నేరం చేసినట్లు బిల్డప్ ఇస్తరు? ఎందుకిన్ని బలగాలు? ఎందుకింత మంది పోలీసులు? రాజ్యాంగ సంక్షోభం. ఇదే అత్యుత్తమ పరిష్కారం. రాజీనామాలే రామబాణాలు. త్యాగాలే తెలంగాణకు తోరణాలు. ఈ సంక్షోభంతోనే తెలంగాణ గడ్డపై కొత్త చిగుర్లు తొడగాలి. ఇక ప్రజా పోరాటం ముగియాలి. తెలంగాణ బిడ్డల చావులు ఆగాలి. నేతలే సంతకాలతో సమరానికి ముగింపు నివ్వాలి! ఇదే నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల ఆకాంక్ష. పార్టీ లేదు. జెండా లేదు. ప్రతి తెలంగాణ బిడ్డ రాజీనామా చేయాలి. తెలంగాణ సాధించి తెలంగాణ బిడ్డలకు కానుకగా ఇవ్వాలి. అప్పుడే చరిత్రలో నిలిచిపోతరు. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటరు. ఇక ఆలస్యం వద్దు. క్షణానికో బిడ్డ కండ్లు మూస్తున్నడు. నిమిషానికో గుండె ఆగిపోతున్నది. కదలండి..ఒక్క సంతకంతో తెలంగాణ నుదిటి రాతను మార్చండి. లేదంటే అని సంబర పడకండి..పదవులున్నయి కదా అని పై పైకీ పోకండి.. ముందున్నది ముసళ్ల పండుగ.. పదవి అనే ఆయుధంతో ఆడుకుంటే ఓటు అనే అస్ర్తంతో తెలంగాణ ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తరు.
కాంగ్రెసోళ్ల కపట నాటకం...
ఒక్క రాజీనామా ప్లీజ్‌!
ఒక్క రాజీనామా ప్లీజ్‌. ఒక్కటంటే ఒక్కటే. కొత్తగా ఏమీ అడగట్లేరు. ఆనాడు మీడియా ముందు చేసిన ప్రతిజ్ఞలే జనం మళ్లా అడుగుతున్నరు. ఉళ్లకు పోతే జనం నిలదీయకముందే.. ఏమైందని నిగ్గదీయకముందే రాజీనామా చేయండి. ఒక్క రాజీనామా ప్లీజ్‌! నిన్న గాక మొన్న మన తెలంగాణ ప్రజాప్రతినిధులు పేల్చిన డైలాగులు. తెలంగాణ ఏమాత్రం అటు ఇటైనా.. రాజీనామాలు విసిరి మొఖాన కొడతం అని మీడియా ముందు తొడలు గొట్టి.. జబ్బలు చరిచి.. మీసం మెలేసి.. తియ్యగ పుల్లగ మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు ఏ కన్నంల దాచుకున్నరో అంతుపట్టడం లేదు. గూగుల్ సెర్చ్లో వెతికినా దొరకనంత రహస్య ప్రాంతానికి వెళ్లిపోయిన్రు. ఒకరు సీనియర్ పార్టీ అంటరు. మరొకరు అధికారం మా చేతుల్నే ఉన్నదంటరు. అమ్మగారి ముందు మాత్రం చేతులు పిసుక్కుంటరు. ప్రణబ్ ముఖర్జీ గారు కనపడితే కాళ్ళు పట్టుకుంటరు. బొటబొటా బకీటెడు కన్నీళ్ళు పెట్టుకుంటరు. ఢిల్లీకి పోతున్నం అంటరు. అంతలోనే డీలా పడతరు. పేరు గొప్ప ఊరు దిబ్బ. మంత్రులమంటరు. ఎంపీలమంటరు, ఎమ్మేల్యేలమంటరు. ఏం చెయ్యలేక ఎల్లెలుక పడతరు. అవతలోడు అన్నీ సదురకపోతున్న సప్పుడు చెయ్యరు. జనం ఎంత మొత్తుకున్నా వీళ్ళ చెవులల్ల ఉన్న మజ్జు తొలగదు. వీళ్ళకు అవతలోల్లతోటే కాదు, వీళ్ళల్ల వీళ్ళకే పడది. మైకు నాకు కావాలంటే నాక్కావాలని కలబడతరు. తెలంగాణ ఏమైనా ఫర్వాలేదు. మీడియాలో కనపడితే చాలు ఫుల్జోష్. పోరగాళ్ళు చస్తున్నా దావతులు చేసుకుంటూ ఫుల్ ఖుష్. కుర్చీల మీద ఫెవికాల్ పోసుకొని కూసుంటరు. రాజీనామాలు అనే సరికి ఉడాయిస్తరు. ఆఖరికి శవాల మీద ప్రమాణాలు చేసినా సిగ్గులేకుండా ఒట్టు తీసి గట్టుమీద పెడతరు. పదవులు దొరకితే ఇగ తెలంగాణ ఏమైన పర్వాలేదు. తప్పిపోయిన వారిలో మరికొందరు . ఖాళీ అయిన దుకాణపోళ్లున్నరు. వీళ్ళదైతే మరి చెప్పతరం కాని చరిత్ర. బదిరులందరూ వీళ్ళ ముందు బలాదూర్. వీరికి కొన్ని ప్రత్యేకతలున్నయి. వీరు అధినేతకు పాదదాసులు. బాంచెన్ గులాపోడిని అనుకుంట పొర్లు దండాలు పెడుతరు. వీళ్ళ దుకాణంల నలుగలేక కొద్దిమద్దయితే బైటపడ్డరు. ఇంకా కొందరు అండ్లనే ఉండి పగటి కలలు కంటున్నరు. అధినేతై రెండు కండ్లైతే.. వీళ్లవి రెండు ముఖాలు. జనం ఎన్నిసార్ల నిలదీసినా పట్టించుకోరు. తెలంగాణ బిడ్డలారా.. ఇసంటోళ్లు మీ ఊళ్లకు వస్తే జెర నిలదీయండి. ఆనాటి మాటలు ఏమైనయని కడిగిపారేయండి.

నల్లగొండ గుండె పై ఫ్లోరోసిస్ బండ
ఫ్లోరోసిస్ నీరు.. కన్నీరు
ఎ.జనార్ధన్

ఇక్కడ మనకు దీనంగా కనిపిస్తున్న ఈ అభాగ్యులను ఏ వైరస్ సోకలేదు.. జన్మతః వికలాంగులు అసలే కారు.. పోలియో వంటి మహమ్మారి వీరి జోలికే రాలేదు.. మరే మయింది..మాయా మంత్రమా.. మెలితిరిగిన అవయవాలతో... పీడకలలో మాత్రమే కనిపించే వింత రూపం వీరికి ఎలా వచ్చింది.. మన చేరువలోనే గుండె చెరువయ్యే కన్నీటి గాథ ఇది.. మంచినీరు తాగడమే నేరమైన దుస్థితి..ఇప్పుడు మనం చూసిన ఈ హృదయ విదారక దృశ్యాలు నల్లగొండ జిల్లాలో చాలా ఊర్లలో కనిపిస్తాయి.. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే..జీవధార ప్రవహించే ఈ నేలలో వీళ్లంతా జీవశ్చవాలుగా ఎందుకు మారుతున్నారు.. మూడు తరాలుగా ముప్పుతిప్పలు పడుతూ నిత్యం మరణశయ్యపై దీనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
ఇక్కడ కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతాయి.. కమ్మనైన నీరు కాలువల గుండా పారుతుంటుంది..ఆధునిక దేవాలయానికి ఆనవాలయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిందీ ఇక్కడే… ఈ నీరు రాష్ర్టంలో ఎందరికో దాహార్తిని తీర్చింది.. పంట పొలాలను పొత్తిళ్లల్లో హత్తుకుంది. లక్షలాధి ఎకరాలను పచ్చగా చిగురింపజేసే మహత్తున్న జలాశయమిది..కానీ తాను పుట్టిన నేల నెర్రలు బాసి గుండె పగిలిపోతున్నా నీటిమాటున కన్నీటిని దాచుకుంది. అయిన వారి కడగళ్లను తీర్చలేక పోయింది. ఈ నీరు తమ నోరు తడపాలని ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డా కోరుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలయినా ఆ గలగలలు కలలు గానే మిగిపొయినాయి.
జీవం నిలపాల్సిన జీవజలాలే, కఠిన జలాలై కసాయిగా ప్రాణాలను తోడేస్తున్నాయి.. నేలమీద పడ్డ గడియ నుంచి నేలలో కలిసే వరకు నరకయాతన.. గాజు పెంకులయిన ఎముకలు..తోలు తిత్తి లాంటి శరీరం. ఆదమరిచినా, అదుపు తప్పినా ఇక అస్థిపంజరం పై ఆశలు వదులుకోవలసిందే.. ఎవరు చేసిన పాపం ఇది. తమ నేలకు శాపంగా మారింది. పండు వెన్నెల కురిపించే నవ్వులు మసకబారిపోతున్నాయి..రాహువు మింగిన చంద్రుడిలా చీకటి మాటున చిట్లిపోతుంది. తాము తాగే తల్లిపాలే విషమని వీరికి తెలియదు.. తమ చనుబాలలో విషపు టణువులున్నాయన్న సంగతి ఆ తల్లులకు కూడా తెలియదు..కారణం.. ఇక్కడి మట్టిలో.. మట్టిమనుషుల్లో అణువణువునా ఫ్లొరిన్ అణువులు నిండిపోయినాయి.. వీరినందరినీ చుట్టు ముట్టిన ఆ విషవ్యాధి “ఆస్టియో పోరోసిస్” . తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఈ ఎముకల వ్యాధి బారిన పడుతారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన లీటర్ కు ఒక మిల్లీగ్రాం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. కానీ ఇక్కడ ప్రజలు తాగే నీటిలో లీటర్ కు 15 మిల్లీ గ్రాముల ఫ్లోరిన్ ఉంటుందంటే వీరు తాగేది మంచి నీరా లేక విషరసాయనమా అనే అనుమానం కలుగుతుంది.

మనం మరిచిన తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
మొగలాయీలను మూడు చెరువుల నీళ్లు తాగించిన మొనగాడు

అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. ముంజ కత్తి పట్టాల్సిన చేతితో తల్వార్ దూసిండు.. మొగలాయి
సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేబట్టిన యోధుడు. ఆయనే తెలంగాణ చరిత్ర గర్వించే వీరుడు సర్వాయి పాపన్న.
బడుగులకు రాజ్యాధికారమని ఎలుగెత్తి తరతరాలుగా అర్రులు చాస్తున్న ఈ తరానికి సర్వాయి పాపన్నే ఆదర్శం.
సర్వాయి పాపన్న పుట్టింది ఖిలాషాపూర్ లో..ఈ గ్రామం హైదరాబాద్కు ఈశాన్యంగా 50 మైళ్ళ దూరంలో వరంగల్ మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నది. ఈ ఊర్లో పాపన్న విగ్రహం ఉంచి పాపన్న తమ ఊరి వాడని సగర్వంగా చెప్పుకుంటరు గ్రామస్థులు. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. తక్కువ చూపు చూస్తున్న కులవృత్తిని అంగీకరించలేదు. కులవృత్తి స్వీకరించమన్న తల్లి కోరికను కాదన్నడు. కొంత ధనాన్ని చేత బట్టుకొని రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు శభదం చేసిండు.
మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. ఒక్కప్రాణాలే కాదు..తమ పిల్లా జెల్లా..గొడ్డూగోదా ఏదీ తమది కాదు. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపడు కత్తి దూసిండు. తన తోటి వారిని బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపు యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి జేజేలు పలుకుతూ చిన్నాపెద్దా ఆయన పోరాటానికి బాసటగా నిలిచిండ్రు.
సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది.ఈ ప్రయత్నంతో గౌడు కులస్థులతో బాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిండ్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిండ్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్న పై చేసిన దాడిలో ఘోరంగా విఫలమయింది రుస్తుంఖాన్ సైన్యం.. 1707లో ఔరగంజేబు మరిణానంతరం బహద్దూర్ష్ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. సరిగ్గా ఇదే సమయంలో మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు.
వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో షాపూర్ హైదరాబా ద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఏటవాలు కొండపై నిర్మించిన భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధి కారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రక టించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నడు.బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించా డు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిండ్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నరు యూసఫ్ ఖాన్ను ఆదేశించిండు.
1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధమైనడు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మేనెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు.పాపన్న తుపాకి కా ల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నా బాద్ గ్రామంలో ఒక కల్లు మండువ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు.
అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు.కల్లు దుకాణంలో కూర్చొని ఒక గ్లాసు తాటి కల్లు ఇవ్వమని అడిగాడు.పాపన్న కల్లు తాగుతుండగా నిజాం సైన్యం అతడిని బం ధించి వారిని గవర్నర్ ముందు నిలబెట్టిడ్రు.తరువాత అతని తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండేన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీశారు.స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరునిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసిన గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ్మ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి
జర్నలిస్ట్ టుడే
--అయితగాని జనార్దన్
ఇక్కడ అంపశయ్య పడకలు సిద్దం
ముళ్లపూలే ముద్దబంతులు
గ్రీష్మతాపమే హేమంతం
చిరునవ్వుల మాటున హిపోక్రసీ
మనసారా నవ్వలేని మోమాటం
నవ్వునాలుగు విధాలా చాటే
చాటుమాటల్లో దాగిన భవితవ్యం
అభిప్రాయాలూ ఆశయాలూ ఆవేశాలూ
మూటగట్టి ముంగిట్లో వదిలేయి
యాంత్రిక కవళికలను అతికించుకో
మనసును సీసాలో బిరడాతో మూసేయి
కీబోర్డుతో రాయాలి కీలుబొమ్మగా మారాలి
నీ క్రియోటివిటీ తలపులు బోడులు కావాలి
రాసిందే రాయి మళ్ళీ మళ్లీ రాయి
అఖరు వాడు రాసిందే కలికి తురాయి
నువ్వు నువ్వుకాదు నీది నవ్వుకాదు
భాషతెలిసిన భాండాగారానివి
బదులివ్వలేని బండరాయివి
నిజాన్ని నిర్దాక్షిణ్యంగా నీడలో నెట్టి
నీరెండలో నీటికోసం వెతికే ఆశావాదివి
నువ్వు నేటితరం హైటెక్ శ్రీనాథుడివి
బతుకుదెరువుకు బతిమాలుకుంటున్న పోతనవి
కార్పోరేట్ విషం నింపుకున్న పూతన బాధితునివి
కుటిల పన్నాగాలునేర్చుకుంటున్న రాజకీయ గురువ్వి.
నీది నిత్య దరిద్రం..నిరంతర గౌరవం..
పేరుకు రబ్బర్ బుల్లెట్లు... దిగేవి నిజమై తూటాలు
ఓయూ విద్యార్ధుల పై ప్రభుత్వ దాష్టీకం.
తుపాకితో కాల్చినా.. అవి కాల్పులు కావు.! శరీరంలోకి దూసుకుపోయినా అవి బుల్లెట్లు కావు ! మరి రబ్బర్‌ బుల్లెట్లు అనుకుంటున్నరా? అదీ కాదు ! మరేంటిదది? విధ్యార్ధులను కూల్చిన వాటి పేరు ఏం పేరు? పెల్లెట్‌. ఈ మాట అన్నది ఎవరో కాదు. పోలీస్‌ బాస్‌ అరవిందరావు. ఓయూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కొత్త రకం తుపాకులు, కొత్త రకం పెల్లెట్లు వాడుతున్నరట! తెలంగాణ బిడ్డల శరీరాలను చిధ్రం చేస్తూ..బుల్లెట్లకు రబ్బర్‌ బుల్లెట్లకు మధ్య వచ్చిన ఈ కొత్త పెల్లెట్ల గురించి తెలిస్తే గుండె మండుతది. స్వాతంత్ర్య భారతంలో స్వేచ్ఛ పావురం ఇనుపబూట్ల కింద నలిగిపోతున్నది. తెలంగాణ ఎమర్జెన్సీ రోజల్ని తలపిస్తున్నది. మీడియా స్వేచ్ఛకు అంతం పలుకుతూ అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నయి. ఓయూ క్యాంపస్‌ రణక్షేత్రమైంది. నిరసన ర్యాలీలు చేసిన పాపానికి విద్యార్ధుల కడుపుల్లో బుల్లెట్లు దించుతున్నరు. అడిగితే అవి పెల్లెట్లని, అవి కాల్పులు కావని కొత్త కథలు చెప్తున్నరు. నిజా నిజాలు వెలికి తీసి ప్రజా రక్షణ చేయాల్సీన ఖాకీలు.. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరు. న్యాయం కోసం గొంతెత్తిన తెలంగాణ బిడ్డలను అన్యాయంగా అంతమెందించేందుకు కొత్త పథకాలు రచిస్తున్నరు. ఓయూ క్యాంపస్‌ను అష్ట దిగ్ర్భందనం చేసిన పోలీసు మూకలు విద్యార్ధుల నిరసనపై తుపాకులు ఎక్కుపెట్టినయి. కెమెరా కన్ను చూస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ముందుస్తు ప్రణాళిక ప్రకారం క్యాంపస్‌ నుంచి మీడియాను తరిమేసిన్రు. విద్యార్ధులపై విచ్చల విడిగా చెలరేగిన్రు. విద్యార్ధుల ఆక్రందనలతో ఓయూ మారుమోగింది. వందలాది మంది విద్యార్ధులు క్షతగాత్రులైన్రు. అయినా ఈ వార్తలెక్కడ బయటికి రాకుండా ప్రభుత్వం మీడియా గొంతు నొక్కింది. కాల్పులపై మీడియా ప్రశ్నిస్తే.. రబ్బర్‌ బుల్లెట్‌లతో పదిహేను రౌండ్ల కాల్పులు జరిగినయని కమీషనర్‌ కవరింగ్‌ ఇచ్చుకున్నరు. కానీ ఓయూలో జరిగిందేమీటి? తెలంగాణ బిడ్డలపై ప్రభుత్వం చేస్తున్న భయంకరమైన కుట్రలేమిటి?..
రవికుమార్‌. లా విద్యార్ధి. బుల్లట్‌ దెబ్బ తిన్న తెలంగాణ బిడ్డ. బుల్లెట్‌ దెబ్బతో క్షతగాత్రుడై.. మృత్యువుతో పోరాడుతున్న తెలంగాణ బిడ్డ. రవికుమార్‌ కడుపులోంచి బయట పడ్డ బుల్లెట్‌ భయంకరమైన కుట్రకు సజీవసాక్ష్యమైంది. రబ్బర్‌ బుల్లెట్లతో కాల్పులు జరిపినమని చెప్పని కమీషనర్‌ ఏకే ఖాన్‌..రవికుమార్‌ కడుపులోంచి బయట పడ్డ నిజమైన బుల్లెట్‌ కు ఏమని సమాదానం చెప్తురు? అంతేకాదు.. రబ్బరు బుల్లెట్ల స్థానంలో ఎక్స్‌పయిర్డ్‌ రబ్బరు బుల్లెట్లలోయాసిడ్‌ నుంపి మరీ ప్రయోగిస్తున్నరని ఆరోపణలు వెల్లువెత్తినయి. విద్యార్ధుల ప్రాణాలను తీసేందుకు కుట్రలు చేసిన పాలకులు ఎవ్వరు? 250 కి పైగా రౌండ్ల కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతుండగా కమీషనర్‌ మాత్రం కేవలం పదిహేను రౌండ్లేనని ఎందుకు బుకాయిస్తున్నడు?ఇంకా డిజిపి అరవిందరావైతే.. ఇక ఓయూ కాల్పులే జరగలేదంటున్నరు. కేవలం బాష్పవాయువు ప్రయోగం మాత్రమే జరిగిందంట. మరి రవికుమార్‌ కడుపులో దిగిన బుల్లెట్‌ సంగతేందని నిలదీస్తే.. అది బుల్లెట్‌ కాదని పెల్లెట్‌ అని కొత్త తుపాకుల కథ చెబుతున్నరు. ఇదీ పోలీసు శాఖ వరస. పెల్లెట్లతోని ప్రాణాపాయం ఉండాదా అంటే.. శరీరంలో అవి రెండించు వరకే దూసుకుపోతయట. సరే లక్కు బాగుండి అది కాల్లోనే తొడలోనో చొరబడింది. అదే తలకాయకు తాకితే పరిస్థితేంది? అది ప్రాణాపాయం కాదా? అసలు కాల్పులే జరపలేదని ముందు ఎందుకు చెప్పినట్టు. జరపకపోతే రవికుమార్‌ కడుపులోకి ఒరిజినల్‌ బుల్లెట్‌ ఎలా దిగబడింది? వందలాది రబ్బర్‌ బుల్లెట్ల శకలాలు ఓయూలో ఎందుకు పడి ఉన్నయి? ఇదేనా న్యాయం? తెలంగాణ బిడ్డలు ఈ దేశ పౌరులు కాదా? న్యాయం అడిగిన పాపానికి కాల్పులు జరుపుతరా?
వెలుగు రేఖల కోసం పోరాడుతున్న తెలంగాణ బిడ్డలపై చీకట్లో కుట్రలు పన్నుతున్నరు. గొంతుల్ని చీలిస్తూ.. బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నరు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఈ దుర్మార్గాన్ని ప్రతీక్షణం గమనిస్తున్నరు. విద్యార్ధులను పాశవికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తే.. వారి వెనుక ఉన్న నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు చూస్తూ ఊరు కోరు. అణిచివేసేందుకు తెలంగాణ ఉద్యమం చలిమంట కాదు. వరిగడ్డి మంట అంతకన్నా కాదు. బుల్లెట్‌ అంటే అందరికి తెలుసు మరి పెల్లెట్‌ అంటే ఎంటో ఎంతమందికి తెలుసా? రబ్బర్‌ బుల్లెట్‌ గాయం చేస్తుందే తప్ప ప్రాణాలు తీయదు. కానీ ఎలా ? తెలంగాణ బిడ్డల ఉసురు పోసుకోవాలంటే అది సరిపోదు కదా ! మరేం చేయాలి? రబ్బరు బుల్లెట్ల స్థానంలో నిజమైన బుల్లెట్లు వాడాలి. విద్యార్ధులు చచ్చిపోయోలా కాలం చెల్లిన రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించాలి. ఇదే కుట్రను సీమాంధ్ర పాలకులు అక్షరాల ఓయూ క్షేత్రంపై అమలు చేసిన్రు.
తల్లడిల్లుతున్న తెలంగాణ రైతన్న
తండ్లాటలాడుతున్న వలస కూలీలు
ఎరువుల కొరతతో తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్రు. అధికారులకు ముందుచూపు లేక పోవడంతో.. రబీలోనూ రైతులు ఎరువుల భారాన్ని మోయకతప్పేటట్లు లేదు. ఓ వైపు కొరత, మరోవైపు ఎరువుల ధరలు పెరుగుతయన్న సమాచారం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నయ్.
ప్రభుత్వ పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం.. తెలంగాణ రైతుల ఉసురు తీస్తున్నయ్. సీమాంధ్ర పాలకుల వివక్ష మూలంగా తెలంగాణ ప్రాంత రైతాంగం ఎరువుల కొరతతో తల్లడిల్లుతోంది. పోయినసారి అధిక వర్షాల కారణంగా పంట నష్టపోగా.. ఈసారి నీళ్లున్నా ఎరువుల కొరత వేధిస్తున్నది. అటు ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉండడంతో.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా రైతన్నల పరిస్థితి తయారైంది... పోయినసారి వరంగల్‌ జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురిసినయ్. దాంతో మూడు లక్షల ఎకరాలు అదనంగా సాగయినయ్. అయితే.. జిల్లాకు అవసరమున్నంత ఎరువులను ప్రభుత్వం ఇవ్వలేదు. యూరియా 43 వేల 233 టన్నులు కావాల్సి ఉంటే.. 33వేల 565 టన్నులు.. కాంప్లెక్స్ ఎరువులు 28 వేల 758 టన్నులకు గాను 18వేల 936 టన్నులు మాత్రమే ఇచ్చిన్రు. దీంతో రైతులు ఎరువులను భ్లాక్ మార్కెట్లో కొన్నరు. దీని వల్ల జిల్లా రైతాంగంపై అదనంగా 20 కోట్ల భారం పడింది. ఖరీఫ్‌ సీజన్‌లోలాగే.. రబీలోనూ ఎరువుల కొరత ఉంటుందేమోనని రైతులు దిగులు పడుతున్రు. మరోవైపు ఎరువుల ధరలు పెరిగే అవకాశాలున్నయన్న సమాచారంపై రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్రు. తెలంగాణ వస్తేనే తమ సమస్యలు దూరమవుతయని చెపుతున్రు.
కరెంట్ కష్టాలు కూడా తోడు:-
ఓవైపు నాసిరకం విత్తనాలు, అకాల వర్షాలు అన్నదాత జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటే , మరో వైపు కరెంటు కష్టాలు రైతుల కంటిమీద కునుకు లేకుండ చేస్తున్నయ్‌. వారంరోజులుగా వస్తున్న లో వోల్టేజి కరెంటుతో కరీంనగర్‌ జిల్లాలో 50 మోర్లకు పైగా కాలిపొయినయి. దీంతో ఆగ్రహించిన రైతులు కరెంటు అధికారులను నిర్భందించించిన్రు.ఆరుగాలం శ్రమించే రైతన్నకు అన్నీ కష్టాలే ఎదురౌతున్నయి. విత్తనాలేసిన దగ్గరి నుంచి పంట అమ్మేంత వరకు అడుగడుగునా దగాపడతనే ఉన్నడు. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ లో.. కరెంటు అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతలకు శాపంగా మారింది. వారంరోజులుగా లో వోల్టేజి, కరెంట్‌ ఫ్లక్చువేషన్స్‌... రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. నీరు పెట్టకపోతే..పంట దక్కదు. తప్పదని నీళ్ల కోసం స్వీచ్ఛాన్‌ చేసుడు ఆలస్యం .. భగ్గుమని మోటర్లు కాలిపోతున్నయి.. పోత్గల్ మండలంలో వారంరోజులుగా ఇదే దుస్థితి. లోవోల్టేజీ కారణంగా .. ఇప్పటివరకు 50 మోటార్లకు పైగా కాలిపొయినయి. ఇక రెండు రోజుల నుంచి అసలు కరెంటే రావట్లేదు. దీంతో సాగు నీరు సంగతి పక్కన పెడితే..తాగునీరుకు కూడా ఇబ్బంది ఎదురవుతున్నయి. పంటలు పాడైపోతున్నయి.. కరెంటు ఇవ్వండి మహా ప్రభో అని మొరపెట్టుకున్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో విసిగిపోయిన రైతులు, గ్రామస్థులు.. సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన్రు. అధికారులను నిలదీసిన్రు. వారు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో.. మండిపడ్డ జనం.. ఏఈ తో సహా నలుగురి విద్యుత్‌ అధికారులను సబ్‌స్టేషన్లోనే నిర్భందించిన్రు... కాలిపొయిన మోటార్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసిన్రు.విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. పురుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నరు. కరెంటు సరిగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటమని హామీ ఇవ్వడంతో.. రైతులు శాంతించిన్రు. విద్యుత్‌ అధికారులను విడిచిపెట్టిన్రు.
మన సాంస్కృతిక వారసత్వ ఆనవాలు
సాలార్జంగ్ మ్యూజియానికి అరవై ఏండ్లు
రేపోమాపో పోయేవాడివి మామిడి పిక్కలు నాటుతున్నావేందుకు తాత..అని అడిగితే, రేపటి తరాలకోసమన్నడట ఓమానవతామూర్తి. అట్లాగే ఇవాల్టీ చరిత్రను రేపటి తరాలకు తెలియజేయడానికి ఎవరో ఒకరో నడుంకట్టాల్సిందే. అట్లా ఆనాటి చరిత్రను కండ్లముందుంచుతున్నదే సాలార్జంగ్‌ మ్యూజియమ్‌. ప్రపంచంలోనే అరుదైన వాటిలో ఒకటిగా ఉన్న మన సాలార్జంగ్‌ మ్యూజియం అరవైవసంతాలు పూర్తి చేసుకున్న సందర్చంగా పొలిటికల్ వార్ స్పెషల్ స్టోరీ..
చారిత్రక నగరం సిగలో నిగనిగలాడుతున్న వికసిత పుష్పం ఈ మ్యూజియం. ఏ మ్యూజియమైన ప్రభుత్వం ప్రారంభిస్తది. దాని ఆలన పాలన కూడా పాలకులే చూస్తరు. చూడాలి కూడా. కానీ, సాలార్జంగ్‌ మ్యూజియంకున్న చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఒక వ్యక్తి తనకున్న అభిరుచి మేరకు నిర్మించిన మ్యూజియంమంటే నమ్మలేకపోవచ్చు. కానీ
తెలంగాణ గుండెకాయగా ఉన్న మన హైదరాబాద్‌ నగరంలో ఉన్న అనేక కట్టడాలు..నిజాం కాలంనాటివే. సీమాంధ్ర పాలనలో అవి నిర్లక్ష్యానికి గురైనై. కానీ, నిజాం ప్రభువులు పరిపాలించే కాలంలో కంటికిరెప్పలా కాపాడబడినయి. వాటిలో భాగమే ఈ సాలార్జంగ్‌ మ్యూజియం. సాలార్జంగ్‌ అనే వ్యక్తి చేసిన కృషి ఫలితమే ఈ అరుదైన కళాఖండాల వేదిక. సాలార్జంగ్‌ అసలు పేరు మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌. ఇతని కళాతృష్ణకు నిలువెత్తు నిదర్శనమే సాలార్జంగ్‌ మ్యూజియం. ఇతడు మూడో సాలార్జంగ్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ యూసుఫ్‌ అలీఖాన్‌ ఏడవ నిజాం దగ్గర ప్రధానిగా పని చేసిండు. కళ, విజ్ఞానం వంటి విషయాలే కాకుండా చరిత్ర పట్ల ఎనలేని గౌరవాభిమానాలు కలిగిన కలవాడు సాలార్జంగ్‌. ఒక వైపు ప్రధానిగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూనే వివిధ దేశాల సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేసిండు. దాంతో చారిత్రక వస్తువుల పట్ల ఎనలేని మక్కువను పెంచుకున్నడు. ఇదే సమయంలో నిజాంతో ఒక విషయంలో అభిప్రాయబేధాలు తలెత్తడంతో తన ప్రధాని పదవిని వదిలేసి తన చివరి శ్వాస వరకు.. ఇక తన కళాతృష్ణకే అంకితమైండు.
33 దేశాల నుండి సేకరించిన అరుదైన వస్తువులు, పెయింటింగ్‌లు, గ్రంధాలు.. జాగ్రత్తగా కాపాడి నెలకొల్పిందే సాలర్జంగ్‌ మ్యూజియం. మొదట చిన్న భవనంలో ప్రారంభించినప్పటికి, సాలార్జంగ్‌ పేరును చిరస్మరణీయం చేయడం కోసం డిసెంబర్‌ 16, 1951న అప్పటి భారత ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇట్లా సాలర్జంగ్‌ మ్యూజియం లక్షలాదిమంది ప్రజలకు ప్రపంచ చరిత్రను ఒక్కరోజులో.. ఒకే చోట అందిస్తున్నది. ఒకే వ్యక్తి సేకరించిన వస్తువులు అధికంగా కలిగిన మ్యూజియం ప్రపంచంలోనే సాలర్జంగ్‌ మ్యూజియం ఒక్కటే... అరవైవసంతాలు పూర్తిచేసుకొన్న సాలార్జంగ్‌ మ్యూజియం చరిత్ర వింటే ఎవరైనా సలామ్‌ అనాల్సిందే..
మన ఇంట్ల మన నాయిన కాలందో, మన తాత కాలందో ఏదో ఒక పాత వస్తువు చాలా కాలం తర్వాత కనిపిస్తే ఎంతో మురిసిపోతం. ఆనందంతో పొంగిపోతం. అందుకే పాత సందుగను తెరిచి చూస్తే దాన్నిండా మస్తు జ్ఞాపకాలు, మనల ఒక్కసారిగా ఆ వస్తువుల కాలానికి తోలుకపోతయి. అలాంటిది కొన్ని శతాబ్దాలకు చెందిన ప్రముఖులకు చెందిన వస్తువులు అయితే ఇంకేముంది. మనం అలా మనల్ని మనం మరిచిపోతం.
మధుర జ్ఞాపకాల ఖజాన సాలార్జంగ్‌ మ్యూజియమ్‌. గత చరిత్రను కండ్లకట్టినట్టుగా చూపిస్తది. అంతేకాదు మన జ్ఞానానికి అందని అనేక అనుభూతులను మనలోకి చొప్పిస్తది. తరాల చరిత్రను, సంస్కృతిని మనకందించడానికి ఒక సజీవ సాక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్నది ఈ మ్యూజియమ్‌. ప్రపంచంలో ఉన్న ప్రముఖ మ్యూజియమ్‌ల సరసన నిలబడుతూ... ఘనమైన చరిత్రతో సాగిపోతున్నది సాలార్జంగ్‌ మ్యూజియమ్‌. ఒకటో, రెండో కాదు... అనేక ప్రత్యేకతలతో రికార్డులు నెలకొల్పిన మ్యూజియమ్‌ చూడడానికి రెండుకండ్లు సరిపోవు. పురాతన ప్రముఖ వస్తుసముదాయంతో మొదలై గ్యాలరీలుగా, కళామందిరాలుగా, పుస్తకబాండాగారంగా, శిల్పకళావేదికగా, రకరకాల పెయింటింగ్‌లతో సకలకళల నిలయంగా వర్థిల్లుతున్నది సాలార్జంగ్‌ మ్యూజియమ్‌. దేశంలో ఉన్న మ్యూజియాల జాబితాలో చెరగని స్థానాన్ని కైవసం చేసుకొని నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతున్నది. అరవయేండ్ల కింద ప్రారంభమైనప్పటికి ఏమాత్రం చెక్కుచెదరకుండా కళాకృతుల ఒడిగా శోభిల్లుతున్నది. హైదరాబాద్‌ను సందర్శించే పర్యాటకులకు, సందర్శకులకు మరీ ముఖ్యంగా చూడాల్సిన చారిత్రక కేంద్రంగా నిలుస్తున్నది.
సాలార్జంగ్‌ మ్యూజియంను ఒక్కసారి చూస్తేచాలు...జీవితాంతం మరిచిపోలేరు. అలాంటి మధురానుభవాలను మిగులుస్తది. అంతగా ఆశ్చర్యపరుస్తయి ఇక్కడి కళాకృతులు, వివిధ దేశాల సాంస్కృతిక చిహ్నాలు, మైమరపింపజేసే పెయింటింగ్‌లు, అరుదైన వస్తుసముదాయం చూపరులను కట్టిపడేస్తుంది. శతాబ్దాల చరిత్రకు మౌనభాష్యాన్ని చెబుతుంటయి.
సాలార్జంగ్‌ మ్యూజియంలోని వస్తువులు ప్రాచీన సంస్కృతులను ప్రతిబింబిస్తయి. క్రీ.పూ.2వ శతాబ్దం నుండి క్రీ.శ 20వ శతాబ్దం వరకు అనేక సంస్కృతుల ఔన్నత్యాన్ని చాటిచెబుతయి. గ్రీకు, రోమన్‌, జైన,బౌద్ద సంస్కృతులే కాకుండా హిందూ,క్రిస్టియన్‌, ఇస్లామిక్‌ల సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో కళాఖండాలు ఇక్కడ కొలువై ఉన్నయి. ఒక్క మనదేశానికి చెందిన పురాతన వస్తువులే కాకుండా ...మధ్యప్రాచ్య, దూరప్రాచ్య, యూరోపియన్‌ వంటి ప్రపంచ కళలకు ప్రాతినిధ్యం వహించే వస్తుసముదాయం ఈ ఒక్కచోట మాత్రమే దర్శనమిస్తది. అట్లా పురాతన వస్తువులను భద్రపరచడంలో సాలార్జంగ్‌ మ్యూజియం నిర్వహాకులు ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్న కృషి వెలలేనిది. నిజాం నవాబులు వాడిన వంట పాత్రలు మొదలుకొని యుద్దంలో ఉపయోగించిన కత్తులు, డాలు, కవచాలు, బాణాలు, ఈటెలు గొడ్డన్లు, తుపాకులు దేన్ని చూసిన ఆనాటి రాజసం ఉట్టిపడుతుంది...
కళకు లేదు అంతం. కళకాదు ఏ ఒక్కరి సొంతం. అలాంటి కళలకు ఒక ఆయువుపట్టు మన సాలార్జంగ్‌ మ్యూజియం. అందాలన్నీ రాశి పోసినట్టు అలరిస్తది. వినోదం మాత్రమే కాదు, మ్యూజియంలోని ప్రతీ కళాఖండం అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తది. అందుకే నిత్యం వివిధ రాష్ర్టాల, దేశాల పర్యాటకులతో కిటకిటలాడుతుంటది...
ఇక సాలార్జంగ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ కళా మందిరాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టెక్స్‌ టైల్‌, శిల్పకళా,రాతి కాంస్య ప్రతిమలు, పెయింటింగ్‌లు, కొయ్యబొమ్మలు, పచ్చల ప్రతిమలు, లోహసామాగ్రి, రాతప్రతులు, ఆయుధాలు వంటి వాటికి వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేసిన్రు. ఎప్పుడూ చూడని పర్షియా, సిరియా ఈజిప్టు దేశాలకు చెందిన కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టిన్రు...అట్లా వివిధ రకాల కళాఖండాలు ఒక్కదగ్గరే ఉన్న అతికొద్ది మ్యూజియాలలో మన సాలార్జంగ్‌ మ్యూజియం ఒకటి. పింగాణి, కాంస్య, ఎనామిల్‌, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌,చెక్కసామాగ్రి సంబంధిత దూర ప్రాచ్య కళాసంపద మ్యూజియం నిండా పరుచుకొని ఉంది. ఇక యూరోపియన్‌ కళాఖండాలైతే కళ్ళు మిరుమిట్లు గొలిపే తైలవర్ణ చిత్రాలు, అందమైన ఆకర్షణీయమైన గాజు వస్తువులు, ఆనాటి రాచరికం ఉట్టిపడే ఫర్నిచర్‌, దంతపు ప్రతిమలు, ఎనామిల్‌ వస్తువులు గడియారాలు..ఇలా ఒకటేమిటి మ్యూజియం నిండా అద్భుతమైన వస్తు సంపద మనల్ని మనం మైమరిచేలా చేస్తుంది...
సాలార్జంగ్‌ చరిత్ర, గొప్పదనం తెలిసి ప్రముఖ సంస్థలు ఈ మ్యూజియానికి సంస్థాగత సభ్యత్వాన్ని కూడా ఇచ్చినయి. అంతేకాదు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఇక్కడున్న గ్రంథాలయం వంటి సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ గా ప్రకటించిన్రు. అలా అరుదైన మ్యూజియాలలో ఒకటిగా నిలిచింది మన సాలార్జంగ్‌ మ్యూజియం...
మ్యూజియంలో ఉన్న వస్తవుల్లో దేనికదే ప్రత్యేకమైంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే వివిధ అంశాలకు సంబంధించిన కళాకృతులతో మ్యూజియం నిర్వాహకులు ఒక మొబైల్‌ ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహిస్తున్నరు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా ప్రదర్శనలు చేపడుతున్నరు. స్కూళ్ళకు వెళ్ళి పిల్లల్లో విజ్ఞాన వికాసానికి తోడ్పడుతున్నది. విద్యాపరమైన కార్యకలాపాల్లో భాగంగా ఎంపిక చేసిన విషయాలపై విభిన్న భాషల్లో వీరు పుస్తకాలను కూడా ప్రచురించి పంపిణీ చేస్తున్నరు. అలా సాలార్జంగ్‌ మ్యూజియంలో పెద్దగ్రంథాలయాన్ని కూడా నడుపుతున్నరు. ఇందులో 60,000 వేల పుస్తకాలు, రాతప్రతులు, సంచికలు ఉన్నయి. ఇట్లా విజ్ఞానానికి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తుంటే సాలార్జంగ్‌ కుటుంబానికి పుస్తకాల పట్ల ఉన్న మక్కువకు ఈ పుస్తకాలే మౌనసాక్ష్యాలు...
సాలార్జంగ్‌ మ్యూజియం లో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకృతులు కూడా కొలువుదీరినయి. ఇక్కడున్న మూడు బ్లాకుల్లో కలిపి 38 గ్యాలరీలున్నయి. ఇవన్నీ కళలలకు నిలయాలుగా వర్థిల్లుతున్నయి. ఈ గ్యాలరీల్లో 13,654 కళాకృతులను ప్రదర్శనకు పెట్టిన్రు. ఈ కళాకృతులు భారతీయాత్మను అర్థం చేయిస్తయి...భిన్న సంస్కృతులను కండ్లముందుంచే కళల కాణాచి మన సాలార్జంగ్‌ మ్యూజియం...
అనేక అరుదైన విషయాల్ని సరిగా విభజించి అలంకరించకుంటే...అదంతగా ఆకర్షించదు. అందుకే సాలర్జంగ్‌ మ్యూజియం నిర్వాహకులు..మన రాష్ర్టంతో పాటు, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒరిస్సా, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌, మహారాష్ర్ట, పంజాబ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ వంటి ప్రాంతాలకు చెందిన కళాకృతులను గ్యాలరీలుగా ఏర్పాటు చేసిన్రు నిర్వహకులు. రాజుల కాలంనాటి కాంస్యప్రతిమలు, దక్షిణ భారత సూక్ష్మ కళలు..పెయింటింగ్స్‌ కోసం ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఈ మ్యూజియంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణలు. అలాగే చెక్కతో చేసిన నిర్మల్‌ బొమ్మలు, రాతి శిల్పాలు వివిధ కాలాలకు చెందిన శిల్పరీతులను ఇవి కండ్లముందుంచుతయి. అట్లనే భారతీయ సంస్కృతికి నిదర్శనమైన వైవిధ్యమైన వస్ర్తాలను సేకరించి..అందంగా అలకరించిన్రు. వీటిలో బంధనీ వస్ర్తాలు, పటోలా చీరలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటయి. అలాగే సాలార్జంగ్‌ మ్యూజియంలో మరో స్పెషాలిటీ దంతంతో చేసిన కళాకృతులు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దంతశిల్పాలు సందర్శకులను అలరిస్తున్నయి. పూర్వకాలంలో రాజులు ఉపయోగించిన ఆయుధాలను కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టిన్రు. కత్తులు, ఖడ్గాలు, గొడ్డళ్ళు, బాణాలు, మందుగుండు సామాగ్రి నిలువ ఉంచే పరికరాలు ఆనాటి యుద్ధపటిమను ఎలుగెత్తుతున్నయి.
సాలార్జంగ్‌ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా కనిపించేవి రెబకా విగ్రహం, మ్యూజికల్‌ క్లాక్‌, డబుల్‌ స్టాచ్యూలు. ఈ మూడింటిని చూడకుండా వస్తే మీరు సాలార్జంగ్‌ మ్యూజియంను సగం మాత్రమే చూసినట్టవుతుందంటే అతిశయోక్తికాదు. మొత్తం మ్యూజియంలో ఉన్న కళాఖండాలు ఒక ఎత్తైతే..ఈ మూడు మరో ఎత్తుగా నిలుస్తున్నయి...
ఏ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించినా..అక్కడ తప్పకుండ చూడవల్సినవి కొన్ని ప్రత్యేకంగా ఉంటయి. అట్లాగే ఈ సాలార్జంగ్‌ మ్యూజియంలో కూడా మిస్‌ అవకుండా చూడాల్సనవి ముచ్చటగా మూడున్నయి. సాలార్జంగ్‌ మ్యూజియంలోకి వచ్చినోళ్ళు వచ్చినట్టు అక్కడే ఆగిపోతరు అదే రెబకా విగ్రహం. చూడగానే మనల్ని ఆకర్షించే రెబకా విగ్రహం అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే. పాలరాతి శోభతో చూపరులను కట్టిపడేసే ఈ విగ్రహం సాలార్జంగ్‌ మ్యూజియం కీర్తిని మరింతగా పెంచుతున్నది. పాలరాతి శిల్పాలు దేశంలో అక్కడక్కడ ఉన్నప్పటికీ ఈ రెబకా విగ్రహం మాత్రం వాటన్నింటికంటే విశిష్టమైంది. ఒక యువతి నిలబడ్డట్టుగా ఉన్న ఈ విగ్రహం తన ముఖం మీద ముసుగును కప్పుకుంది. ఆ ముసుగులోనుండి ఆ యువతి ముఖం కనిపించేలా చెక్కిన తీరు అద్భుతం. ఆ ముసుగే ఈ విగ్రహానికున్న ప్రత్యేక ఆకర్షణ. ఇక మరో ఆకర్షణగా ఉన్న డబుల్‌ స్టాచ్యూను చూస్తే దాన్ని తీర్చిదిద్దిన శిల్పికి ఎవరైనా సలామ్‌ అనాల్సిందే ! ఒకవైపు చూస్తే పురుషుడు, అతని వీపు వైపు చూస్తే స్ర్తీ ఉండడం ముచ్చటగొలుపుతుంది. పురుషుని ప్రతీ అడుగువెనుక ఒక స్ర్తీమూర్తి ఉంటుందనడానికి ఈ విగ్రహమే ఒక నిలువెత్తు సాక్ష్యంలా రూపొందించాడు శిల్పి. ముందువైపు పురుషునిలా కనిపించినప్పటికి ఆ వెనుక ఉన్న రూపం.. అద్ధంలో స్ర్తీగా కనిపించడం ఆశ్చర్యపరుస్తది. ఇక మ్యాజిక్‌ క్లాక్‌ గంటకోసారి ఓ మనిషి బొమ్మ వచ్చి గంటకొట్టడం అబ్బురపరుస్తది...
ఇక సాలార్జంగ్‌ మ్యూజియంలో ఉన్న చిత్రకళ గురించి ఎంతచెప్పినా తక్కువే. భారతీయ చిత్రకళను ఓ వెలుగు వెలిగించిన ఆనాటి రవివర్మ నుండి ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం తమ కుంచెల్ని ధారపోస్తున్న నవయువ చిత్రకారుల పెయింటిగ్స్‌ వరకు ఇక్కడి గ్యాలరీల్లో ఉన్నయి. తరాలు గడిచిన చెక్కుచెదరని పెయింటింగ్‌లు చరిత్రతో పాట లలిత కళల ఔన్నత్యాన్ని అర్థం చేయిస్తున్నవి..
భారతీయ కళలల్లో చిత్రకళకు ఉన్న స్థానం ప్రముఖమైంది. ఇవాళ పెయింటింగ్స్‌ జరుగుతున్న మార్కెట్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నది. అలాంటి చిత్రకళకు మన సాలార్జంగ్‌ మ్యూజియంలో కూడా కీలకస్థానమే ఇచ్చారు నిర్వాహకులు. ఆనాటి మొఘల్‌ కాలంనాటి చరిత్రను తెలిపే పెయింటింగ్స్‌ను సాలార్జంగ్‌ సేకరించి భద్రపరిచిండు..వీటిలో సూక్ష్మ పెయింటింగ్‌లు చూడముచ్చటగొలుపుతయి. వీటిలో ఎక్కువగా రాజస్థాన్‌ కు చెందిన పెయింటిగ్స్‌ ఉన్నయి. ఇలా వివిధ రాష్ర్టాలకు చెందిన 85మంది ప్రముఖ చిత్రకారుల చిత్రాలు సాలార్జంగ్‌ మ్యూజియంలో సాదరంగా స్వాగతం పలుకుతున్నయి. భారతీయ పురాణగాథల నుంచి ఇతివృత్తాలను స్వీకరించి...వేసిన తైలవర్ణ చిత్రాలు సజీవంగా కనిపిస్తయి. రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌, నందలాల్‌బోస్‌, చుగ్తాయ్‌, వి.ఎస్‌.మరోజీ వంటి బెంగాల్‌ చిత్రకారులు మొదలుకొని ఎంఫ్‌ హుస్సేన్‌,కెకె హెబ్బార్‌, ఎన్‌.ఎస్‌.బెందు, పణిక్కర్‌, కె.ఎస్‌ కులకర్ణి, పీటి రెడ్డి, దినకర్‌ కౌశిక్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత గాంచిన చిత్రకారుల పెయింటింగ్స్‌ ఉట్టిపడుతుంటయి. ఈ చిత్రాకారుల చిత్రాలతో పాటు...కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న బీదర్‌ పట్టణానికి చెందిన బీద్రీ కళాఖండాలు కూడా సాలార్జంగ్ అందాలను మరింతగా పెంచుతున్నయి...
రసిక పుంగవుడు సిపి రామాంజనేయులు
ధర్నాల్లో అరెస్టుల్లో కూడా ఆయన చేయి అమ్మాయిల మీదే
పేరులో రాముడు..చేష్టల్లో నికృష్టుడు.
అతను ఉస్మానియా యూనివర్సిటీలో దమనకాండకు సూత్రధారి...ప్రత్యక్ష పాత్రధారి. పై అధికారుల అండ ఉందని విర్రవీగిండు...అమ్మాయిలని కూడా చూడకుండా వేధించిండు...ఇక ఇప్పుడు పాపం పండింది. అయ్యగారు అడ్డంగా బుక్కయ్యిండు. తెలంగాణ బిడ్డల ఉసురు తగిలి అతగాడి దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నయి. అతడే సీపీ రామాంజనేయులు... మూడుసింహల ముసుగులో అరచకాలకు పాల్పడుతున్న విజయవాడ పోలీస్‌ కమీషనర్‌ చీకటి భాగోతాలపై పొలిటికల్ వార్ స్పెషల్ ఫోకస్
సీపీ రామాంజనేయులు…. పేరు దేవుళ్ళదే, పనులు మాత్రం రాక్షసులవి. ఖాకీ బట్టలేసుకున్న ఈ ఐపీఎస్‌ అధికారి దుర్మార్గాలకు పట్టాపగ్గల్లేవు. బూటకపు ఎన్‌కౌంటర్ల నుండి మొదలుకొని ల్యాండ్‌ మాఫియా దందాల వరకు... అయ్యగారిది అన్నిట్లోనూ అందెవేసిన చెయ్యే. తాజాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మీడియాకు దొరికిపోయిండు. ఈ ఖాకీ మృగం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించింది. అమ్మాయిలనే విచక్షణ కూడా చూడకుండా వేధించిండు. ఈ అరాచక ఆఫీసర్‌గారి పాపం పండింది. తెలంగాణ వదిలి వెళ్ళేదాకా ఉద్యమాన్ని నడిపిన్రు ఇక్కడి మట్టిబిడ్డలు. ఫలితంగా ఈ కామాంధుడు విజయవాడకు ట్రాన్స్‌ ఫర్‌ అయ్యిండు. పుట్టుకతో వచ్చిన బుద్ది అంత సులువుగా పోదు కదా...అక్కడ కూడా మళ్ళీ తన నీచపు బుద్దితో అనేకమంది ఆడవాళ్ళతో దుర్మార్గంగా ప్రవర్తించిండు. పోలీస్‌ స్టేషన్‌కు పోతే న్యాయం జరుగుతదనుకున్న అబలల పాలిట ఈ కామాంధుడు నరరూప రాక్షసుడైండు...కర్నూలు, ఖమ్మం, హైదరాబాద్‌ వంటి ఏ జిల్లాల్లో పనిచేసిన రౌడీపోలీస్‌లా వ్యవహరించిండు...
కమీషనర్‌ ఆఫ్ పోలీస్‌ అనే మాటకు మాయని మచ్చను తెచ్చిన ఘనత ఈ సీపీ రామాంజనేయులుది. హైదరాబాద్‌లో ఉన్న కీచక ఆఫీసర్‌గారు రెచ్చిపోయి ఎంతటి దుర్మార్గాన్ని కొనసాగించిండో తెలిస్తే కళ్లు తిరుగుతయి... మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు సైతం తెగించిన్రు ఉస్మానియా విద్యార్థులు. తమ చదువులను సైతం పక్కన పెట్టి, పుట్టిన గడ్డ విముక్తి కోసం కొట్లాడిన్రు. అప్పుడు విద్యార్థుల నెత్తురు కండ్ల చూసిండు. చదువుకునే విద్యార్థులనే సోయిని కూడా మరిచి అహంకారపూరితంగా కానిస్టేబుల్లను ఉసిగొల్పిండు. దీంతో ఒక్కో కానిస్టేబుల్‌ రాక్షసంగా ప్రవర్తించిండు. ఈ అరాచక అధికారి అండతో ఓయూను యుద్ధభూమిగా మార్చేసిన్రు. ఆడపిల్లల హస్టల్ల మీద పశువుల్లా పడ్డరు. అట్లా వాతలు తేలేలా దొరికినోళ్ళను దొరికనట్టు కొట్టించుడు ఈ తోకలేని ఆంజనేయులు. ఆఖరికి ఈ ఆకృత్యాలను రిపోర్టు చేయడానికి పోయిన తెలంగాణ జర్నలిస్టులను కూడా చితకబాదిండు. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగిండు. ఈ నరరూప రాక్షసుని ఆకృత్యాల మీద తెలంగాణ బిడ్డలు హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేసిండు...ఫలితంగా హైకోర్టు చివాట్లు పెట్టి విధుల నుండి తప్పంచింది. కానీ సీమాంధ్ర సర్కారుతో పాటు ఆంజనేయులు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండడంతో ఈ పాపలపుట్టకు ప్రమోషన్‌ ఇచ్చి విజయవాడకు పంపింది...
తెలంగాణకు పట్టిన పీడ పోయిందనుకున్నరు తెలంగాణ బిడ్డలు. కానీ ఈ ఖాకీ కామందుడు విజయవాడలో అడుగుపెట్టినంక ఏం వెలుగబెడుతున్నడో తెలుస్తే ఎవరైనా చీదరించకపోరు... ఈ కీచకుడు చేసిన దుర్మార్గాలు అన్నీఇన్నీ కావు. పోలీసు స్టేషన్‌ సాక్షిగా కాపాడమని, న్యాయం చేయమని వచ్చే బాధితులను తన కామ కోరికలు తీర్చమని వేధించడం షురూ చేసిండు. కమీషనర్‌ అనే విషయమే మరిచి మృగంలా ప్రవర్తించిండు. వారి సెల్‌ నెంబర్‌ తీసుకొని వేధించడం. వందల సంఖ్యలో బయటికి చెప్పుకోలేని మెసేజ్‌ లు పంపడం. అసభ్యకరంగా మాట్లాడడం ఇతనికి నిత్యకృత్యం. భార్య ఉండగా పరాయి ఆడవాళ్ళను ఏకకాలంలో అనేకమందిని వేధిస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నడు..అట్లా ఆంజనేయులు ఆకృత్యాలకు విజయవాడ అడ్డాగా మారింది.
నిజం నిప్పులాంటిది. అది ఎంతోకాలం దాగదు. ఆడిందే ఆటగా, పాడిందే పాటగా నడుస్తదనుకున్న సీపీ రామాంజనేయులు దుర్మార్గాలు బైటికి పొక్కినయి. తాను నడిపిన రాసలీలలన్ని ఒక్కోక్కటిగా వెలుగుజూసినయ్‌. తమకు జరిగిన అన్యాయాన్ని, గోడును వెళ్ళబోసుకుందామని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఆడవాళ్ళను అంతూపొంతులేకుండా వేధించడమే తనకున్న సహజమైన అలవాటు..కానీ ఈ దుర్మార్గాలను భరించి భరించి బాధితులు గొంతువిప్పిన్రు. తాను పంపిన మెసేజ్‌లు బయటపెట్టిన్రు. అయ్యగారు జరిపిన కామక్రీడల ఫోటోలు, రహస్యంగా తీసిన వీడియోలు మీడియా ముందుపెట్టి నిలదీసిన్రు...అయినా కూడా తప్పు ఒప్పుకోవడం లేదు ఈ సిగ్గుమాలిన సీపీగారు. లోకం కోడై కూస్తున్న ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతున్నడని మీరనుకోవచ్చు...అందుకు కారణం లేకపోలేదు...తెలంగాణ బిడ్డల ఉసురుపోసుకున్నా ప్రమోషన్‌ ఇప్పించిన పెద్దగద్దలే నా వెనుక ఉన్నయంటున్నడు..గవర్నర్‌ది, డీజీపిది నా కులమే. వాళ్ళు తన వెనుక ఉన్నంత సేపు ఎవరూ ఏం చేయలేరని, ధీమాగా పూర్తి అహంకారపూరితంగా అంటున్నడు...పైగా నిలదీసిన ప్రజాప్రతినిధుల అంతుచూస్తనని దబాయిస్తున్నడు...
తెలంగాణ ఉద్యమాన్ని , తెలంగాణ బిడ్డలను అణచాలనుకుంటే ఎవ్వనికైనా ఇదే గతి పడతది. ఉన్నతస్థాయి పోలీసు అధికారిగా ఉండి ప్రజలను పీడించే ఇలాంటి కీచకున్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నరు.
ఖేల్ ఖతం..టిడిపి దుకాణం బంద్
ఇక తెలంగాణ తెలుగు దేశం పార్టీ
టిడిపి దుకాణం ఖాళీ అయినట్టేనా? రెండు కండ్ల చంద్రబాబు వైఖరి తెలంగాణలో ఎవ్వరికీ నచ్చట్లేదా? ఇందులో ఏమాత్రం డవుట్ లేదు. పార్టీ మీద, పార్టీ అధినేత మీద విరక్తిపుట్టి ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం కల్లం లేచింది. అందుకే చంద్రబాబు మైండ్ బ్లాకై.. కొత్త పల్లవి అందుకున్నరు. తెలంగాణ టిడిపి శాఖ పేరుతో మళ్లా ఓ డ్రామాకు తెరలేపిన్రు.
తెలంగాణపై చంద్రబాబు వైఖరేంటి? ఈ మాట చెడ్డీ తొడిగే పోరగాణ్ని అడిగినా తడుముకోకుండా చెప్తడు. రాత్రికి రాత్రే రాజీనామాల డ్రామాకు తెరలేపి.. సీమాంధ్ర నేతలో చీకట్ల చేతులు కలిపి.. రెండు కండ్లూ .. రెండు నాలుకలూ.. ఇద్దరు కొడుకులంటూ జనాల్ని ఆనాడు ఎంత కన్ఫ్యూజ్ చేయాల్నో అంత చేసిండు. దానికి ఫలితం ఏడాదిలోపే అనుభవించిండు. ఉప ఎన్నికల దగ్గర్నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా తెలుగుదేశం అంటే తెలంగాణ జనం అగ్గిమీద గుగ్గిలమవుతున్నరు. ఒక్కమాటలో చెప్పాలంటే పదిజిల్లాల్లో టిడిపి దుకాణం ఆల్మోస్ట్ ఖాళీ. తెలంగాణకు వ్యతిరేకమని ఏ పార్టీ చెప్పినా టిడిపికి పట్టిన గతే పడుతుందని జనం ఇచ్చిన తీర్పును బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని చెప్పేదాకా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేదనేది తెలంగాణ రాజకీయ విశ్లేషకుల అంచనా..
ఈ పరిస్థితుల్లో ఏం చేయాల్నో తెలియక చంద్రబాబు మళ్లా కొత్త రాగమందుకున్నరు. తెలంగాణ టిడిపి శాఖ పేరుతో ఇంకో డ్రామాకు తెరలేనిన్రు. అయితే తెలంగాణపై ఒకే స్టాండ్‌ మీద ఉండకుండా ప్రత్యేక కమిటీలు, వేర్వేరు శాఖలు ఎన్నిపెట్టినా జనం నమ్మే పరిస్థితిలో లేరని తెలంగాణ వాదులంటున్నరు. ఒకవేళ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినా సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు దానికి అనుకూలంగా వ్యవహరిస్తరా అనేది సమాధానం లేని ప్రశ్న. కొత్త శాఖ ఏర్పాటు చేసినా మళ్లా రిమోట్‌ మాత్రం చంద్రబాబు చేతిలోనే ఉంటుందనే కొట్టేయలేని లాజిక్‌.
తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే మహానాడులో బాబు కనీసం వారికి సంతాపం తెలపలేదు. ఇలాంటి వ్యక్తి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటరా అన్నది ఇప్పుడున్న ప్రశ్న. తెలంగాణ ఆత్మబలిదానాలపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని టిడిపికి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన్రు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉండి తాను ద్రోహిగా మిగలదలుచుకోలేదన్నరు.
ఎన్ని ఎత్తులు... జిత్తులు ఎన్ని వేసినా... తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మాత్రం పుట్టగతులు లేవని తెలంగాణవాదులు విమర్శిస్తున్నరు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణపై చంద్రబాబు ఆడుతున్న నాటకాలేవీ ఫలితాలివ్వకపోగా అసలుకే ఎసరు రావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నరు.
నల్లగొండకు నీటి కష్టాలు
మంచినీళ్లను మాయం చేస్తున్న అధికారులు

గాలి నీరు లాంటి సహజ వనరులు సమైక్య రాష్ట్రంలో బందీ అయినయ్. తెలంగాణకు ఓ పక్క గోదావరి…ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటయి . కానీ నీళ్లు లేక గొంతులెండుతయి…. పొలాలు నెర్రెలిస్తయ్… ఇక్కడి నీళ్లు ఎక్కడికో తరలిస్తరు. గొంతెండుతుందని ఎంత మొత్తుకున్నా చెవిటి పాలకులకు వినపడదు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి మంచానపడ్డ న్లల్లగొండ జిల్లా గ్రామాలకు కృష్ణా నీళ్లు ఇచ్చినట్టే ఇచ్చి ఆపేసిన్రు.
తెలంగాణ పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా ..… ఫ్లోరైడ్ బారిన పడి లక్షలాది మంది అంగవైకల్యంతో అరిగోస పడుతున్న జిల్లా అది... తలాపునే క్రిష్ణమ్మ పారుతున్నా గుక్కెడు నీళ్ళు లేక అష్ట కష్టాలు పడుతున్న గ్రామాలెన్నో. ఆ గ్రామాలకు కృష్ణా జలాలు ఇచ్చినట్టే ఇచ్చి దారి మళ్లించిన్రు. మళ్లీ అదే గరళం
జల సాధన సమితి , మరెన్నో ప్రజాసంఘాలు ఎన్నో ఏళ్లు పోరాటం చేస్తే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాల పంపిణీ కొన్నాళ్ల క్రితం మొదలైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎఎమ్మాఆర్ ఎత్తి పోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ గ్రామాలకు క్రిష్ణా జలాల్ని పంపిణి చేస్తున్నరు.. జంట నగరాలకు కూడా ఇక్కడి నుంచే తాగు నీటిని సరఫరా చేస్తున్నరు.. కానీ ప్రస్తుతం పెరిగిన బకాయిల పేరిట హెచ్ఎం డబ్యూఎస్ దేవరకొండ మండలానికి క్రిష్ణా జలాల్ని నిలుపుదల చేసింది..అంతే కాక మునుగోడు, మర్రిగూడెం మండలాలకు నీటి సరఫరా సగానికి సగం తగ్గించింది. దీంతో మళ్లీ ఫ్లోరైడ్ కలిసిన గరళాన్నే తాగాల్సివస్తుందని ఈ గ్రామాల వాసులు వాపోతున్నరు...చింతపల్లి మండలం నసర్లపల్లి ప్లాంట్ నుంచి దేవరకొండ, మునుగోడు , నియోజిక వర్గాల్లోని 105 ఫ్లోరైడ్ గ్రామాలకు క్రిష్ణా జలాల్ని పంపిణీ చేస్తున్నరు.. హెచ్ ఎండబ్యూఎస్ ( హైద్రాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ) ద్వారా సరఫరా చేస్తున్న ఈ నీళ్ళ వినియోగానికి ముందుగా కుదూర్చుకున్నట్లుగా కిలో లీటర్ కు ఆరు రుపాయల చొప్పున హెచ్ఎండబ్యూఎస్ కు జిల్లా పరిషత్ చెల్లిస్తూ వస్తుంది..అయితె ఇక్కడే చిన్న మెలిక పెట్టి ప్రభుత్వం కుట్ర పూరితంగా తాగే నీళ్ళకు లెక్క గట్టి నోట్ల మట్టి కోట్టింది.. 2001 జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో లెక్క కట్టారు..ఆలెక్క ప్రకారం దేవరకొండ జనాభా 27130 మంది ఉండగా ప్రస్తుతం 57417కు జనాభా పెరిగింది..ఈ జనాభా లెక్కల ప్రకారం దేవరకొండకు రోజుకు 5850 కిలో లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉండగా పెరిగిన జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం రోజుకు 66 శాతం నీటి వినియోగం పెరిగి ఈ లెక్కన కీలో లీటర్ కు 35 రుపాయలు చెల్లించాల్సిందిగా హైద్రబాద్ మెట్రో వాటర్ సప్లయ్ వారు నల్లగొండ ఆర్ డబ్యూయస్ అధికారులకు అదేశాలిచ్చారు.. గత కొంత కాలంగా జిల్లా ఆర్ డబ్యూయస్ అధికారులు పూర్తి స్దాయిలో బకాయిలు చెల్లింకపోవడంతో 18 శాతం వడ్డీ కలిపి 8 కోట్ల 82 లక్షల రుపాయలను చెల్లించాలని హెచ్ ఎండబ్యూయస్ అధికారులు జిల్లా ఆర్ డబ్యూయస్ అధికారులకు నోటీసిలిచ్చారు..దీంతో బకాయిలు చెల్లించని కారణంతో హెచ్ఎండబ్యూయస్ అధికారులు ఇప్పటికే దేవరకొండ మండాలానికి పూర్తి స్దాయిలో క్రిష్ణా జలాల్ని నిలుపుదల చేశారు.. ఇది ఇలా ఉంటె జిల్లా ఆర్ డబ్యూయస్ అధికారులు మాత్రం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కిలోలీటర్ నీళ్ళకు ఆరు రుపాయలు మాత్రమే చెల్లిస్తమని చెబుతున్నరు.. .ప్రభుత్వం చేతకాని తనం పుణ్యమా అని ఇప్పిటికే దేవరకొండ మండల ప్రజలు తాగడానికి నీళ్ళు లేక తీవ్ర ఇక్కట్లు పడుతుంటె ఇదే సాకుతో మరిన్ని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగర్ జలాల్ని నిలిపి వేయాలనే కుట్ర హెచ్ ఎం డబ్యూయస్ చేస్తుంది..
ప్రభుత్వాల చేత కాని తనం , సీమంద్ర పాలకుల కుట్ర వల్ల గుక్కెడు నీటికి ఐదు రెట్ల ఎక్కువ వెల కట్టవల్సిన దుస్దుతి నల్లగొండ జిల్లా ప్రజలది. . ఇప్పిటికైనా తెలంగాణా నాయకులు స్పందించకపోతె రంగారెడ్డి జిల్లాకు కూడా ఇదే పరిస్దితి దాపరించే ప్రమాదం ఉంది.. మన నీళ్ళు మనం కొనుక్కునే దుస్దతి పట్టించిన సీమాంద్ర దోపిడిని అరికట్టెందుకు తెలంగాణా రాష్ట్ర సాధనే సరైన మార్గమని ఇక్కడి ప్రజలంటున్నరు.. క్రిష్ణమ్మ నీళ్ళను శాశ్వతంగా దూరం చేస్తున్నరు..

ఉస్మానియాలో ప్రభుత్వ అరాచకం
తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
శాంతియుత ఉద్యమం చేస్తున్న.. ఓయూ విద్యార్థులపై ఖాకీల దౌర్జన్యాన్ని నిరసిస్తూ.. యావత్ తెలంగాణ అంతటా నిరసన ధ్వనులు పెల్లుబికినయ్. టీయారెస్‌ నేతలు, తెలంగాణవాదులు, విద్యార్ధులు, మహిళల ఆందోళనలు, రస్తరోకోలతో తెలంగాణ గ్రామాలన్నీ హోరెత్తుతున్నయ్. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నరు..
మెదక్ జిల్లాలో
ఓయూలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని మెదక్ జిల్లాలో తెలంగాణ వాదులు తీవ్రంగా ఖండించిన్రు. ఓయూ నుంచి పోలీసుల బలగాలను వెనక్కిపిలిపించాలని సంగారెడ్డిలో విద్యాసంస్థల బంద్ నిర్వహించిన్రు. రామాయం పేటలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆద్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన్రు. మీడియా పై ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని సిద్దిపేటలో జర్నలిస్టులు భారీ ర్యాలీ తీసిన్రు. మెదక్ లో కాంగ్రెస్ టీడీపీ ఆఫీస్ లను ముట్టడించిన్రు. గజ్వేల్ లో తెలంగాణ వాదులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించిన్రు. జోగిపేటలో రోడ్డు మీద ఆటపాటలు పాడి నిరసన వ్యక్తం చేసిన్రు. తూప్రాన్ లో తెలంగాణ వాదులు రస్తారోకొ చేసిన్రు.
వరంగల్ జిల్లాలో
ఓయు విద్యార్థులపై లాఠీ చార్జీ కి నిరసనగా వరంగల్ లో నిరసనలు వెల్లువెత్తినయ్. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు ఆందోళన చేసిన్రు. రోడ్లపై బైటాయించి రస్తారోకో నిర్వహించిన్రు. అటు కాంగ్రెస్, టీడీపీ నేతలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కరీమాబాద్ లో తెలంగాణ వాదులు పిండప్రదానం చేసిన్రు. హిందూ సంప్రాదాయ పద్దతిలో..బ్రహ్మణులు మంత్రోచ్చరణలు చేస్తూంటే..నాయకుల పిండాలను మురికికాల్వలో కలిపిన్రు…స్పాట్..
కరీంనగర్ జిల్లాలో
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాల్నంటూ కరీంనర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు నిరసన తెలిపిన్రు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ జిల్లాలోని వేములవాడలో విద్యార్థులు, జేఏసీ నేతలు రోడ్లపై బైఠాయించిన్రు. ఇటు హుస్నాబాద్ లో జర్నలిస్టులు ర్యాలీ తీసిన్రు. ఆ తర్వాత మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసిన్రు. రాష్ట్రంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్న జర్నలిస్టులు...వెంటనే మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేసిన్రు..
మహబూబ్ నగర్ జిల్లాలో
విద్యార్థులపై పోలీసు దమనకాండను నిరసిస్తూ.. మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వాదులు సీరియస్ అయ్యిన్రు. జిల్లా అంతటా రాస్తరోకోలు చేసిన్రు. షాద్నగర్ లో రోడ్డుపై బైటాయించి జై తెలంగాణ నినాదాలు చేసిన్రు. మరోవైపు జిల్లా లో బీజేపీ నేతలు పోలీసు లాఠీచార్జీకి వ్యతిరేకంగ..మౌనప్రదర్శన చేసి నిరసన తెలిపిన్రు. అయితే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. తెలంగాణ వాదులను అరెస్టు చేసిన్రు . స్పాట్..
నల్లగొండ జిల్లాలో..
అటు నల్లగొండ జిల్లాలో..నిరసనజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నయ్. ఓయూ ఘటనకు నిరసనగా నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట, సూర్యాపేట, కోదాడ ఆలేరు, భువనగిరిలో తెలంగాణవాదులు భగ్గుమన్నరు. ఎక్కికక్కడ రాస్తరోకోలు చేపట్టిన్రు. రోడ్లపై బైఠాయించిన్రు. బలగాలతో తెలంగాణ ఉద్యమాన్ని అణచాలనుకోవడం అవివేకమన్నరు. వెంటనే ఓయూ నుంచి బలగాలను వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నరు.
ఖమ్మం జిల్లాలో
ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని ఖమ్మం జిల్లా మణుగూరులో తెలంగాణవాదులు సెల్ టవర్ ఎక్కిన్రు. ఓయూ క్యాంపస్ లో వెంటనే పోలీసులను వెనక్కి పంపాలని….మీడియాపై ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేసిన్రు. ఇటు జిల్లాలోని ఇల్లెందులోనూ నిరసనలు వెల్లువెత్తినయ్. శ్రీకృష్ట కమిటీ నివేదికతో సంబంధం లేకుండా వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని రాస్తారోకోలు, ర్యాలీలు చేసిన్రు.
ఆదిలాబాద్ జిల్లాలో
ఓయూలో విద్యార్థుల మీద పోలీసుల దాడిని ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ వాదులు తప్పుబట్టిన్రు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆద్వర్యంలో నిర్మల్ లో భారీ ర్యాలీ తీసిన్రు. మంత్రులు వెంటనే ఓయూలో నుంచి బలగాలను బయటకు పంపేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేసిన్రు.చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరసన వ్యక్తం చేసిన్రు. మంచిర్యాలలో పొలిటికల్ జేఏసీ ప్రభుత్వ, శ్రీకృష్ణ కమిటి దిష్టి బొమ్మను దేగ్దం చేసిన్రు. బెల్లంపల్లిలో తెలంగాణ వాదులు రస్తారొకో చేసిన్రు. గిమ్మ గ్రామస్థులు NH 7 మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన్రు. తెలంగాణ ద్రోహులను ఊర్లలోనికి రానివ్వమని ప్రతిజ్ఞచేసిన్రు.
నిజామాబాద్ జిల్లాలు
విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యను తీవ్ర ఖండిస్తూ..నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులు,విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేసిన్రు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలను వెంటనే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమబాట పట్టాలని డిమాండ్ చేసిన్రు.
రంగారెడ్డి జిల్లాలో
ఉస్మానియా విద్యార్ధులపై పోలీసుల దమనకాండకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలో నిరసనలు మిన్నంటినయ్. జిల్లాలోని పరిగి, తాండూర్, వికారాబాద్, జీడిమెట్లలో తెలంగాణవాదులు , టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేపట్టిన్రు. కొన్నిచోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించి ఆందోళన చేసిన్రు. సీమాంధ్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ విద్యార్ధులపై కక్ష గట్టి దాడులు చేయిస్తున్నదని మండిపడ్డరు. వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన్రు.
హైదరాబాద్ లో
ఓయూ లాఠీచార్జీకి నిరసనగా హైదరాబాద్‌ మొత్తం..నిరసనలు జోరందుకున్నయ్. జిల్లాలోని దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్ పేట, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు ధర్నా నిర్వహించిన్రు. అటు ఆర్టీసీ ఎక్స్రోడ్ లో టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి అద్వర్యంలో తెలంగాణవాదులు అందోళన చేసిన్రు. ఈసీఐఎల్ చౌరస్తా, కాప్రా లో కూడ తెలంగాణ వాదులంతా పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు చేసిన్రు. శ్రీ కృష్ణకమిటీ దిష్టి బొమ్మను తగులబెట్టిన్రు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన్రు.
మళ్లీ బో”ఫోర్స్”
ఇదో మెగా ఫార్స్
బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ముడుపులు అంది ఉంటయని బీజేపీ నేతలు ఆరోపించిన్రు. ఇటాలియన్ వ్యాపారి ఖత్రోచికి.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నరు. అయితే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆర్ఎస్ఎస్ కు ఉగ్రవాద సంస్థలతో తో ఉన్న సంబంధాలను దృష్టి మళ్ళించటానికే బీజేపీనేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నరని కాంగ్రెస్ నేతలు కొట్టి పారేసిన్రు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన్రు. బోఫోర్స్ కుంభకోణంలో సోనియా గాంధీకి వాటా ఉందని ఆ పార్టీ ఆరోపించింది. బోఫోర్స్ కుంభకోణం నిందితుడు ఇటాలియన్ వ్యాపారి ఖత్రోచితో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి గల సంబంధాలు పరిశీలిస్తే పలు అనుమానాలు వస్తున్నయని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ఆరోపించిన్రు. ఈ స్కాంల ఖత్రోచికి ముడుపులు అందిన విషయాన్ని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పటాన్ని నిర్మల గుర్తు చేసిన్రు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కాంగ్రెస్ అన్ని స్థాయిల్లోనూ దుర్వినియోగం పరిచిందని.. ఖత్రోచి దేశం నుంచి పారిపోయేందుకు వీలు కల్పించిందని ఆరోపించిన్రు.
అటు గౌహతిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యూపీఏ సర్కారు అవినీతిపై పోరాటాన్ని ఉధృతం చేయాలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన్రు. 2010 సంవత్సరాన్ని అద్వానీ.. కుంభకోణాల సంవత్సరంగా అభివర్ణించిన్రు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చిన బోఫోర్స్ కుంభకోణంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అద్వానీ అన్నరు. లోపభూయిష్టమైన పాలన, తప్పుడు ఆర్థిక విధానాలే యూపీఏ అవినీతికి ప్రధాన కారణమని బీజేపీ జాతీయ అధ్యక్షడు నితిన్ గడ్కరీ విమర్శించిన్రు.
అటు బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ ఎస్ కు ఉగ్రవాదులతో ఉన్న లింకులను దృష్టి మళ్ళించేందుకే బీజేపీ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నరని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ విమర్శించిన్రు. ఖత్రోచి, విన్ చద్దా, హిందూజాలపై చట్టం చేపట్టే చర్యలకు తమ పార్టీకి అంటగట్టటం సరికాదన్నరు.