ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, October 7, 2009

నేటి తరం రచయత

రైటర్‌ టుడే
--జనార్దన్

ఇక్కడ అంపశయ్య పడకలు సిద్దం
ముళ్లపూలే ముద్దబంతులు
గ్రీష్మతాపమే హేమంతం
చిరునవ్వుల మాటున హిపోక్రసీ
మనసారా నవ్వలేని మోమాటం
నవ్వునాలుగు విధాలా చాటే
చాటుమాటల్లో దాగిన భవితవ్యం
అభిప్రాయాలూ ఆశయాలూ ఆవేశాలూ
మూటగట్టి ముంగిట్లో వదిలేయి
యాంత్రిక కవళికలను అతికించుకో
మనసును సీసాలో బిరడాతో మూసేయి
కీబోర్డుతో రాయాలి కీలుబొమ్మగా మారాలి
నీ క్రియోటివిటీ తలపులు బోడులు కావాలి
రాసిందే రాయి మళ్ళీ మళ్లీ రాయి
అఖరు వాడు రాసిందే కలికి తురాయి
నువ్వు నువ్వుకాదు నీది నవ్వుకాదు
భాషతెలిసిన భాండాగారానివి
బదులివ్వలేని బండరాయివి
నిజాన్ని నిర్దాక్షిణ్యంగా నీడలో నెట్టి
నీరెండలో నీటికోసం వెతికే ఆశావాదివి
నువ్వు నేటితరం హైటెక్‌ శ్రీనాథుడివి
బతుకుదెరువుకు బతిమాలుకుంటున్న పోతనవి
కార్పోరేట్‌ విషం నింపుకున్న పూతన బాధితునివి