
ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
రామా అన్న రెండక్షరాలు సకల పాపాలను హరించి మోక్షాన్నిస్తయి. అందుకే ఆ రాముడికి గ్రామగ్రామానా గుడి కట్టించి ఇష్టదైవంగా కొలుస్తున్నరు. అగస్త్యమహాముని తెలిపిన 14 రామాలయ దివ్యక్షేత్రాలలో మొదటిది అయోధ్య అయితే... అంతే ఘనకీర్తి గల భద్రాచలం రెండవది. తెలంగాణ ఆలయాల్లో ఈ రోజు భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించి వద్దాం..
బ్యాంగ్ (కోదండరాముడు కొలువైన భద్రగిరి)( రామదాసు చిత్రంలో చిరుచిరు నగవుల గోదావరి కోరస్ మ్యూజిక్‌తో బ్యాంగ్(ఆఖరున ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువైనాడు..తో ఎండింగ్)
యాంకర్ 1
భద్రాచలం...తెలంగాణ గడ్డ గర్విచదగ్గ పుణ్యక్షేత్రం. ఆమాట కొస్తే యావత్ ప్రపంచ రామభక్తుల మన్నన పొందిన రామాలయం ఇది. ఈ ఆలయం ఇంతటి ఘనకీర్తి మూటగట్టుకోవడం వెనక చాలా చరిత్ర ఉంది. శ్రీరాముడు తన భక్తులను కరుణించేందుకు వైకుంఠం నుంచి నేరుగా దిగి వచ్చి ఇక్కడి కొలువుతీరిండని స్థలపురాణం. దానికీ ఓ కథ ఉంది. ఆ రసరమ్య రామకథ ఒక్కసారి చూద్దాం.
వాయిస్ 1
ఇది రామపాద ధూళితో పునీతమైన క్షేత్రం. సీతారాములు నడయాడిన దివ్యధామం. పితృవాక్యపరిపాలకుడై రాముడు వనవాసియై జీవిస్తున్న తరుణంలో గోదావరి తీరాన పర్ణశాల నిర్మించుకొని ఉన్నరు. దండకారణ్యంలో విహరిస్తున్న సీతారాములను సూర్యతాపం బాధించింది. నీలికలువల్లాంటి రామ పాదాలు ఎర్రతామరలయ్యాయి. సీతమ్మ చెక్కిళ్లు కంది పెదవులను పోలిన పగడాలయ్యాయి. ఆ ఎర్రటెండలో సీతారాములు ఒక శిల పై ఆశీనులయ్యారు. ఆ శిల జానకీరాములకు పాలకడలిలో ఆదిశేశుడు అందించి సౌఖ్యాన్ని అందించింది. ఆ శిల చల్లని హాయినివ్యడమే కాకుండా మృదువుగా హంసతూలికా తల్పమంత సుఖాన్నివ్వడంతో రాముడు ఉప్పొంగిపోయిండు. సీతమ్మ కూడా ఆ శిలను మనసారా దీవించింది. ఆ శిలకు ఏదైనా వరం ఇవ్వమని అడిగింది. ఇష్ట సఖి మీదా, ఆ శిల మీదా మమకారంతో రాముడు ఆ శిలకు వరమిచ్చిండు. “ఓ శిలారాజమా ! వచ్చే జన్మలో నీవు మేరుపర్వత రాజు పుత్రుడవై జన్మిస్తవు. భద్రుడనే పేరుతో వర్దిల్లుదువు.నిత్యం నా నామ స్మరణతో పరమ నాకు భక్తుడువయితవు. అప్పడు నీ శిరసు పై కొలువై ఉండి కలియుగమున సకల జనులను ఉద్దరించ గలను’’ అని వరమిచ్చిండు. అంటే త్రేతాయుగంలోనే ఈ భద్రాచల పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి పునాదులు పడ్డయన్న మాట.
స్పాట్-“ ఇదిగిదిగో నారాముడు ఈడనే...’ సాంగ్‌తో స్పాట్
యాంకర్ 2
సీతారాముల వరాన్ని పొందిన ఆ శిలారాజము మరు జన్మలో భద్రుడిగా జన్మించి రాముణ్ని శిరసు పై ధరించే వరం పొందింది. అందుకే సీతారాముణ్ని రామభద్రుడని కూడా పిలుస్తరు. ఈ వరం పొందడానికి భద్రడు చేసిన కృషి అంతా యింతా కాదు. ఆ కోదండరాముని మనసు దోచుకోవడమంటే మాటలా..
వాయిస్
మేరు పర్వతరాజ దంపతులకు పుత్రసంతానం లేక ఎన్నో పూజలు చేసి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు. అయినా ఒక్క దేవుడు కూడా వరమియ్యక పోవడంతో మేరుపర్వతరాజు బ్రహ్మకోసం ఘోర తపసు చేసిండు.( బ్యాంక్ గ్రౌండ్‌లో ఓం మ్యూజిక్ రావాలి.) విధాత ప్రత్యక్షమయి మేరురాజుకు వరమిచ్చిండు. పుట్టబోయే బిడ్డ రామ భక్తుడై లోకోద్దారకుడవుతాడని తెలిపిండు. తరువాత కొంత కాలానికి దంపతులు... బ్రహ్మ వరప్రభావంతో సకల కళామూర్తియైన పండంటి బిడ్డకు జన్మనిచ్చిండ్రు. పువ్వుపుట్టగానే పరిమళించిందన్న చందంగా భద్రుడు నిత్యం రామనామాంకితుడై, రామభక్తి తో ఎదగసాగిండు.రాజకుమారుడైనా ఇహలోక సౌఖ్యాలపై మమకారం లేదు. సుందరాంగులకేసి కన్నేసి చూడడు.. మణిభూషణాలు అలంకరించడు. దీంతో మేరుదంపతులు విచారవదనాలతో బాధపడుతుండగా నారదమహర్షి భద్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించిండు. లోకాలను శిరసుపై మోసిన విష్టుమూర్తిని తన శిరసున నిలుపుకునే అదృష్టం భద్రుని దని తెలిపిండు. అంతటితో ఆ దంపతులు కాస్త కుదుటపడ్డరు.
స్పాట్
భద్రుడు రామనామస్మరణతో, భక్తి ప్రవృత్తులతో ఉండగా ఒక శుభోదయాన నారద మహర్షి భద్రునికి తారక మంత్రం ఉపదేశించిండు.(బ్యాక్ గ్రౌండ్‌లో శ్రీరామరామేతు రామనామ మనోరమే..మంత్రం ) ఆ మంత్రజపంతో భద్రుడు..భద్రాచల ప్రాంతానికి చేరుకొన్నడు. రామదర్శనం కోసం ఘోర తపస్సు చేసిండు. ( రామదాసు సినిమాలో భద్రుడు తపస్సు చేసే బ్యాగ్రౌండ్ మ్యూజిక్)భద్రుని తపస్సుకు మెచ్చిన ఆ విష్టుమూర్తి ప్రత్యక్షమయిండు. తనకు త్రేతాయుగంలో రాముడి రూపంలో దర్శనమీయమని కోరిండు. అంతటితో వామపార్శ్వమున జానకీ ఆసీనురాలై ఉండగా..శంకచక్రములు అటుఇటుగా చతుర్భాహువులతో లక్ష్మణ సమేతుడై దర్శనమిచ్చాడు.
స్పాట్( స్మాల్...వామాంకస్థిత జానకీ పరిసలతో కోదండ దండం కరే..సాంగ్ తో)
వాయిస్
త్రేతాయుగంలో రాముడు భద్రునికి ఇచ్చిన వరప్రభావంతో..భద్రుని శిరసు పై కొలువై ఉన్నడు. అదే నేటి భద్రగిరిగా రూపుదాల్చింది. అశేష భక్తుల పూజలందుకుంటుంది.
యాంకర్ 3
ఈ భద్రాచల క్షేత్రం ఒక్క భద్రుడినే కాదు ఎందరో భక్తులను ఉద్దరించింది. త్రేతాయుగంలో రాముడికి ఎంగిలి పళ్లను తినిపించిన మమకారానికి ఈజన్మలో కూడా శబరి ఆ రామభద్రుడి సేవకు అర్హురాలైంది. పోకల దమ్మక్కగా రామశిలకు నీడనిచ్చేందుకు తహతహలాడిండి. రామాలయ నిర్మాణానికి దమ్మక్క పట్టుదలే కారణం.
వాయిస్
పోకల దమ్మక్క ఒక గిరిజన మహిళ. దమ్మక్కలేనిదే భద్రాచల క్షేత్రం లేదు. పరమ రామభక్తురాలైన ఆ శబరి ఈ జన్మలో దమ్మక్కగా జన్మించిందని చెప్పుకుంటరు. అవును మరి త్రేతాయుగంలో ఆ శబరి రాముణ్ని చూడాలని ఎంత మదనపడిందో ఈ కలియుగంలో దమ్మక్కకూడా రామదర్శనం కోసం అంత తాపత్రయపడింది.
స్పాట్
రామభక్తురాలైన పోకల దమ్మక్క భద్రిరెడ్డి గ్రామానికి చెందిన గిరిజన మహిళ. భద్రుని పై రాముడు వెలిశాక ఎందరో మునులు, మహర్షులు రాముణ్ని కొలిచిండ్రు, పూజలు చేసిండ్రు. కాల క్రమంలో ఈ రామచంద్రుని అర్చారూపం చెట్టుపుట్టలతో నిండిపోయింది. ఆ దట్టమైన దండకారణ్యంలో ఉన్నకోదండరామ దివ్యమూర్తులు పూజానైవేద్యాలు లేక చెట్టుపుట్టల మధ్య కొలువై ఉన్నరు. ఒకరోజు దమ్మక్క కలలో సీతారాములు కనిపించి...దమ్మక్కా మేం భద్రగిరి పై అర్చారూపంలో కొలువై ఉన్నాము. మమ్ములను వెలికితీసి సేవించమని తెలిపిండు. దమ్మక్క సంతోషానికి అవధులు లేవు. ఈ వార్త గూడెం గూడేనికి మొత్తానికి తెలిపింది. మరునాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముని జాడకోసం వెతికింది. అయినా రాముని జాడ కనపడలేదు. దమ్మక్క కడివేడు కన్నీళ్లతో అక్కడే కుప్పకూలింది. తానేం తప్పుచేశానని రాముణ్ని మనసులోనే నిలదీసింది. ఆ రాత్రి మళ్లీ దమ్మక్క కలలో కనిపించి ఈ రోజు తప్పకుండా కనిపిస్తనని. భద్రాచలం గుట్ట పై వెదకమని తెలిపిండు.
స్పాట్
తెలతెలవారుతుండగానే దమ్మక్క భద్రాద్రికి చేరుకుంది. గుట్ట పైకి ఒక కాలిబాట కనిపించింది. ఆ కాలిబాట వెంట రామచంద్రా..రామ చంద్రా..అనిపిలుకుంటూ వెళ్లింది.(ఇక్కడ రామదాసు సినిమాలో దమ్మక్క (సుజాత) రామచంద్రా అని పిలవడాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వేసుకోవచ్చు. ఇమేజెస్ తో) ఒక పుట్టలోంచి ఓహో అని శబ్దం రావడంతో అటుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా తాను కూర్చున్న బండ ఎదురుగా పుట్టలోంచి కాంతులు వెదజల్లడం చూసింది. దమ్మక్క. తనకు ఓహో అన్న శబ్దం కూడా ఆపుట్టలోంచే వినిపించడంతో.. ఆ పుట్ట దగ్గరకు పుట్టలోకి తొంగిచూసింది. సీతాసమేతుడైన రామభద్రుడు, పక్కనే లక్ష్మణుడు ఉండటంతో దమ్మక్క సంతోషంతో ఊగిపోయింది. గోదారినీళ్లతో పుట్టను అభిషేకించడంతో సీతారామలక్ష్మణ మూర్తులు వెలుపలికి వచ్చారు. వెంటనే ఆ ప్రాంతమంతా పందిళ్లు వేశారు. తోరణాలు కట్టి అలికి ముగ్గులు వేశారు. అప్పటినుంచి భద్రగిరి వెలుగులోకి వచ్చింది. పూజలైతే చేస్తున్నరు కానీ రాముడికి నీడలేక ఎండకు ఎండి, వానకు తడుస్తున్నడు. గుడికట్టిచ్చే శక్తి లేక గిరిజనులు విగ్రహమూర్తులకు అలాగే పూజలుచేస్తున్నరు.
స్సాట్
యాంకర్ 4
భద్రాచల సీతారామచంద్రడు అలా వెలుగులోకి వచ్చాక...ఆయన విగ్రహమూర్తులను ఎండావానల నుంచి రక్షించేందుకు గుడి కట్టేందుకు సంకల్పించిండు ఓ భక్తుడు...సీతాపతికి గుడి కట్టడానికి సీతమ్మోరి కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఆయనకు. ఆయనే రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న...గోపన్న చరిత్ర కూడా భద్రమహర్షి అంతటి గొప్పదే..ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం....
వాయిస్
కంచర్ల గోపన్న..ఈ పేరులోనే గోపబాలుడు వినిపిస్తున్నడు. కంచెర్ల గోపన్నది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. తల్లి కామాంబ, తండ్రి లింగమంత్రి.చాలా కాలం సంతాన లేమితో మదనపడ్డారు. ఎన్నో పూజలు చేశారు. వ్రతాలు చేశారు. అయినా దేవుడు తమ మోర ఆలకించలేదని బాధపడేవారు. ఆఖరుకు కొండపల్లిలో ఉన్న సంతాన గోపాలస్వామికి మొక్కుకుంటే గోపన్న జన్మించిండు. గోపాస్వామి ప్రసాదం కాబట్టి గోపన్న అనే పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నరు.
స్పాట్
గోపన్నకు చిన్నతనం నుంచే రాముడన్నా, కృష్టుడన్నాఎక్కడలేని భక్తి. గురువుల వద్ద అనేక పురాణ కథలను తెలుసుకునే వాడు. యువకుడిగా ఉన్న గోపన్న ప్రజోపయోగ కార్యక్రమాలు చేసేవాడు. అప్పట్లో బందిపోటు దొంగల బెడద ఉండేది. స్థానికుల సాయంతో బందిపోట్లను ఎదుర్కొని రైతులను కాపాడేవాడు. అప్పట్లో అబుల్ హసన్ కుతుబ్ షాహీ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి పరిపాలిస్తున్నడు. గోపన్న మేనమామలు అక్కన్న, మాదన్నలు కుతుబ్‌షాహీ కొలువులో మంత్రులుగా పనిచేస్తున్నరు. గోపన్న మంచి పనులు వీరి ద్వారా కుతుబ్‌షాహీకి తెలిసినయి. వెంటనే గోపన్నను పిలిపించి పాల్వంచ పరగణాకు తహశిల్దార్‌గా నియమించిండు. కానీ ఎప్పటి నుంచో ఈ పదవి పై కన్నేసి ఉంచిన అబ్దుల్లాకు ఈ నిర్ణయం నచ్చలేదు. ఎలాగైనా గోపన్నను ఆ పదవి నుంచి తప్పించాలనుకున్నడు. సమయం కోసం ఎదురు చూడసాగిండు.
స్పాట్
గోపన్న పదవీ బాధ్యతలు స్వీకరించగానే భద్రాచలం వెళ్లి తన ఇష్టదైవం రాముణ్ణి దర్శించుకొని వచ్చిండు. రాముడికి నిలువ నీడలేక ఎండావానలకు తడవడాన్ని గోపన్న జీర్ణించుకోలే పోయిండు. అక్కడి ప్రజల సహకారంతో రాముడికి గుడి కట్టించేందుకు సన్నాహాలు ప్రారంభించిండు. గ్రామగ్రామానా చందాలు వసూళ్లు చేసి సీతారాములకు గర్భాలయం, గోపురాలు, గోపురాల పై కలశాలు, చుట్టూ కోవెలలు, ముఖ మంటపం, అధ్యయనోత్సవ మంటపం, పవళింపు సేవలకు అద్దాలగది, వెండి శేష పాన్పు, ఎత్తేన ధ్వజ స్థంబ నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. రామయ్య కొరకు రధ, గజ, అశ్వ, హంస, సింహ, గరుడ, హనుమ, సూర్యప్రభ వంటి వాహనాలు కూడా నిర్మింపచేసిండు. గర్బాలయ శిఖరం పై శ్రీవారి చక్రం అమర్చడం మిగిలింది. శిఖరం పై చక్రమును అమర్చేందుకు ఎందరో శిల్పులు తమ ప్రయత్నం చేసిండ్రు. అయినా ఒక పట్టాన చక్రం కుదురుగా నిలవడం లేదు. శిల్పులు ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలన్నీ వ్యర్ధం అయ్యాయి. ఈ పరిస్తితికి రామదాసు కలత చెంది, రామచంద్రప్రభు నేనేమి నేరం చేశానని బాధ పడుకుంటూ నిద్రలోకి జారుకున్నడు. నిద్రలో రామచంద్రుడు కనిపించి రేపు గోదావరి నదిలో స్నాన మాచరించి తనను ప్రార్దించమని తెలిపి అంతర్ధానమయిండు. మరుసటి రోజు తెల్లవారు ఝామునే రామదాసు కలలో రాముడు చెప్పినట్టు గోదావరి స్నానం చేసి రాముణ్ని తలచుకొన్న మరుక్షణమే అలపై ఒక తెప్పపై తేలియాడుతూ గోపురచక్రం రామదాసు వద్దకు వచ్చింది. ఈ చక్రాన్ని గోపురం పై విజయవంతంగా అమర్చగలిగిండ్రు శిల్పులు. ఇప్పుడు రామాలయం పై మనం చూస్తున్న చక్రం అదే.
యాంకర్ 5
మంచికి పోతే చెడు ఎదురయినట్టయింది రామదాసు పరిస్థితి. రాముడికి నీడ కల్పించానన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ప్రభువు అనుమతి లేకుండా చిల్లి గవ్వ వాడినా అది నేరమే పుణ్యం కోసం వాడినా ప్రభువుల దృష్టిలో అది ఘోర అపరాదం. ఆ అపరాదానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది రామదాసు.
స్పాట్
భద్రాచలం మొత్తం రామనామ సంకీర్తనతో మారిమోగుతోంది. ప్రతి ఇల్లు రామభక్తులతో విరాజిల్లుతంది. రామాలయంలో పనులన్నీ చకచకా జరిగిపోయి, అంగరంగ వైభవంగా కళకళలాడుతుంది. రామధాసు సంతోషానికి అంవధులు లేవు. అంత సంతోషంలో ఒక విషాదం.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని అబియోగం మోపుతూ రామదాసుని బందీగా తీసుకురమ్మని తానీషా దగ్గర నుంచి భటులు ఆజ్ఞా పత్రం తెచ్చిచ్చారు. రామదాసు అరణ్యానికి వెళతున్న రామచంద్రుడి వలే చిరుమందహాసంతో భటుల వెంట గోల్కొండకు కదిలిండు. రాజదర్భారులో న్యాయమూర్తులు రామదాసుకు శిక్ష ఖరారు చేసిండ్రు. ఆరు లక్షల ద్రవ్యాన్ని కట్టాలి..లేదా కారాగార వాసం చేయాలని తీర్పు చేప్పిండ్రు. రామదాసు ఎవరిని సాయం కోసం అర్దించకుండా కారాగార వాసానికి సిద్ధపడ్డడు.
స్పాట్ ( రామరసరమ్య..సాంగ్ )
రామదాసుకు కారాగార వాసంలో వేధింపులు మొదలయ్యాయి. తన పై ఎప్పటినుంచో కక్ష్య పెంచుకున్న అబ్దుల్లా రామదాసును కారాగారంలో చిత్రహింసలు పెట్టసాగిండు. కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కరువయింది. శరీరం రోజురోజుకూ కృంగి కృశిస్తంది. అయినా రామనామం వీడలేదు. భటులు కొట్టే దెబ్బలకు తాళలేక “”నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆర్తిగా అర్తించిండు.
స్పాట్(ననుబ్రోవమని చెప్పవే సాంగ్)
రామదాసు కన్నీళ్లు ఎవరినీ కరిగించలేదు. ఆరు లక్షల పైకం ఎక్కడ దాచావో చెప్పమని ఒత్తిడి చేస్తున్నరు. సర్కారు పైకాన్ని ఏం చేశావని నరకయాతనలు పెడుతున్నరు. ఈ బాధలకు తట్టుకోలేని రామదాసు రాముడికి తాను పెట్టిన ఖర్చుల లెక్కలు అప్పజెప్పిండు.
స్పాట్ ( సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకమూ..సాంగ్)
యాంకర్ 6
కారాగారంలో ఎన్నో కష్టాలు పడుతున్న రామదాసు కన్నీళ్లకు సీతమ్మ కరిగిపోయింది. రామదాసును చెరనుంచి విడిపించమని సీతాపతిని వేడుకొంది. సీతమ్మ మాటలకు కరిగిన ఆ దాశరది..రామదాసు చిలుకను పంజరంలో బందించడం వల్లనే చెరసాల కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని వివరించి రామదాసును విడిపించేందుకు బయలుదేరిండు.
వాయిస్
రామదాసు కష్టాలు నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. సాక్ష్యాత్తూ ఆ రామలక్ష్మణులే రామోజీ, లక్ష్మోజి రూపంలో తానీషా కు కలలో కనిపించి ఆరులక్షల పైకాన్ని చెల్లించి రశీదు పొందిండ్రు. ఇది కలా నిజమా అన్నట్లు తోచింది తానీషా ప్రభువుకు. వెంటనే మెలకువ వచ్చిన తానీషాకు తన ఎదురుగా ఆరులక్షల పైకం ఉండటాన్ని గమనించి ఆశ్చర్యచకితుడయిండు. తనకు కలలో కనిపించింది ఆ శ్రీరామచంద్రులేనని తానీషా గ్రహించిండు. తాను ఘోర తప్పిదం చేసినట్లు గ్రహించిండు. వెంటనే రామదాసుని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించిండు. రామదాసును అధితి సత్కారాలతో మర్యాదగా సాగనంపడమే కాకుండా తానీషా తాను కూడా భద్రాచల రామదాసును దర్శించి కళ్యాణం జరిపించిండు. ప్రతి సంవత్సరం శ్రీసీతారాముల కళ్యాణానికి తానీషా తానే ముత్యాల తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రభుత్వంలో ఎరున్నా మంచి ముత్యాల తలంబ్రాలు, రోకటి పోటు లేని బియ్యం రామునికి ముత్యాలు తలంబ్రాలుగా వాడుతరు.
స్పాట్ ‘(జానకి దోసిట కెంపులు ప్రోవై...రాముని దోసిట నీలపు రాసై..ఆణిముత్యములు తలంబ్రాలుగా.. ) సాంగ్ తో..
ఈ రామాలయాన్ని దర్శించుకోడానికి దేశం నలుమూలలనుంచి రామభక్తులు ఇక్కడికొస్తరు. భద్రాచల అందాలు ఎంత చూసినా తనితీరనివి. ఇక్కడి గోదావరి నది రామపాదాలను కడిగేందుకు తహతహలాడుతుంటది. భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి సీతారాములను దర్శించుకుంటరు. కరకట్ట పై శ్రీరామ చరిత్రకు సంబంధించిన రామాయణ గాథలు శిల్పాలుగా ఏర్పాటు చేసిండ్రు. భద్రాచలంలోప్రవేశించగానే అంతెత్తు ఆంజేయ విగ్రహం రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటది. ఒక్క సారి భద్రాచలాన్ని దర్శిస్తే వందసార్లు కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్యం కలుగుతదని స్థల పురాణంలో పేర్కొన్నరు.
ఇదీ.. భద్రాచల శ్రీ సీతా రామాలయ చరిత్ర..మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం ..అంతవరకు సెలవు.
No comments:
Post a Comment