Tuesday, May 25, 2010
వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయ చరిత్ర
ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
చల్లని చూపుల తల్లి, ఓరుగల్లు ప్రజల కల్పవల్లి భద్రకాళి అమ్మవారు. కోరిన కోర్కెలు తీర్చెందుకు కొలువైన కొండంత దేవర. భద్రకాళి అమ్మవారిని ఓరుగల్లు ప్రజలు భక్తి ప్రవృత్తులతో పూజిస్తరు. ఈ వారం తెలంగాణ ఆలయాల్లో పిలిస్తే పలికే దైవం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయక్షేత్రాన్ని దర్శించి వద్దాం.
బ్యాంగ్
యాంకర్ 1
అమ్మలగన్న అమ్మ.. ఆది పరాశక్తి..ముగ్గరు అమ్మల మూలపుటమ్మ.. ఇలా ఏ పేరుతో కొలిచినా వరాలిచ్చే వరదాయిని వరంగల్ భద్రకాళి అమ్మవారు. శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాయిస్
ఇది వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. సుమారు ఎనిమిది వందల ఏండ్ల కిందట ఏకాశిలనగరాన్ని రాజధానిగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. నాటి ఏకాశిల నగరమే నేటి వరంగల్. కాకతీయ రాజులందరూ శివ భక్తులు. కాకతీయ సామ్రాజ్యంలో ఊళ్లన్నిటిలో శివాలయాలను కట్టించినరు. ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కట్టించిండు. ఈ అమ్మవారిని కూడా కాకతీయ వంశస్థుల ఆదరించిండ్రు. కాకతీయులు శివారాధకులైనప్పటికీ అందరూ దేవతలనూ సమానంగా పూజించిండ్రు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో ఆరాధించినరు.
స్పాట్
ఈ దేవాలయానికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్నది. వేంగీ చాళుక్యులపై విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి నిర్మించినట్లు చారిత్రక కథనం ఉంది. పరాయి మతస్తుల పాలనలో ఆలయ ప్రాభవం కొంచెం మసకబారినా.. తర్వాత మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. భద్రకాళీ మహిమలపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నయి. ఆ ఆలయాన్ని సందర్శించిన భక్తులు చెప్పే గాధలు కోకొల్లలు .
బైట్ - భక్తులు
యాంకర్ 2
కాకతీయల కాలంలో నిత్య ధూపదీప ఆరాధనలతో విరాజిల్లిన భద్రకాళి అమ్మవారు కాలక్రమంలో నిరాదరణకు గురయింది. ధూపదీపాలు కరువయినయి. అమ్మవారిని పట్టించుకొనే వారే కరువయినరు. అప్పుడే కొందరు భక్తులు ఆలయ పునరుద్దరణకు నడుంబింగించిండ్రు.
వాయిస్
ఈ ఆలయం 1313 తర్వాత తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. కాకతీయ సామాజ్ర్యం పతనమయినాక ఈ దేవాలయాన్ని పట్టించుకునేవారు కరువయినరు. ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలిగిపోయే అమ్మవారి ఆలయం పడావుపడినట్టు ఉండటం ఇక్కడి ప్రజలను మనస్థాపినికి గురిచేసింది. ఎలాగైనా అమ్మవారి ఆలయాన్ని పునరుద్దరించాలని స్థానిక ప్రజలు నడుంబింగించిండ్రు. ఆలయ పునరుద్దరణకు కృషి చేసినవారిలో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి, రామానుజా చార్యులు. అప్పట్లో నగరంలో బాగా పేరున్న వ్యాపారి మగన్ లాల్ నమేజా దగ్గరకు వెళ్లి ఆలయ పునరుద్దరణ గురించి అడగాలనుకున్నరట. కానీ అతను అందుకు ఒప్పుకుంటడో లేదో అనే అనుమానంతో అడగడానికి సంకోచించిండ్రు. అయితే అంతకు ముందు రాత్రే అమ్మవారు మగన్ లాల్ కి కలలో కన్పించి..ఆలయ పునరుద్ధరణకు కృషిచేయాలని ఆదేశించిందట. అమ్మవారి మాటలను తేలిగ్గా తీసుకుని, ఆలయ పునరుద్దరణను నిర్లక్ష్యం చేసిండు. అమ్మమాట నిర్లక్ష్యం చేసినందుకు వ్యాపారి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. మగన్‌లాల్ ముద్దుల పట్టీ.. గారాల బిడ్డకు నోట మాట పడిపోయింది. ఈ పరిణామానికి మగన్‌లాల్ మదనపడిపోయిండు. అదే సమయంలో ఆలయపునరుద్దరణకు నడుంబిగించిన గణేష్ శాస్త్రి, రామానుజాచార్యులు మగన్‌లాల్ ని కలిసి తమ సంకల్పం వివరించిండ్రు. మగన్ లాల్ కూడా తనకు జరిగిన వృత్తాంతాన్ని వివరించి..తన బిడ్డకు తిరిగి మాటొస్తే అమ్మవారి ఆలయ పునరుద్దరణకు తప్పక కృషిచేస్తనని తెలిపిండట. అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరిస్తే.. అమ్మాయికి మాటలొస్తయని మంగన్‌లాల్‌కి చెప్పినరట గణేష్ శాస్త్రి, రామానుజాచార్యులు. భద్రకాళీమాతకు అభిషేకించిన తీర్థాన్ని నెల రోజుల పాటు మగన్ లాల్ కూతురుకి తాగించడంతో ఆమెకు తిరిగి మాటలు వచ్చినయ్. అమ్మవారి మహిమలకు ముగ్దుడైన వ్యాపారి వెంటనే ఆలయ పనులను ప్రారంభిచిండని ఇక్కడి వారు చెప్పుకుంటరు.
స్పాట్
ఆలయ పునరుద్దరణ ప్రారంభమైనప్పటినుంచి అమ్మవారికి తిరిగి పూజలు చేయడం ప్రారంభమైంది. ధూపదీప నైవేధ్యాలతో భక్తులు ప్రతినిత్యం సేవించడం మొదలుపెట్టినరు. ప్రతీ అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, ఛైత్ర మాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతున్నరు. ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంభరిగా అలంకరిస్తారు. వైశాఖ శుధ్ద పంచమినాడు శంకర జయంతి సందర్భంగా అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం చేస్తరు.
స్పాట్
యాంకర్ 3
ఈ ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావాలతో తొణికసలాడుతుంటది. ప్రశాంత వాతావరణంతో ఆద్యాత్మికత ఉట్టిపడుతుంటది. అమ్మను నమ్ముకున్న వారికి కష్టాలుండవని భక్తుల నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచి భద్రకాళి అమ్మను కొలిచేందుకు ఇక్కడకొస్తరు.
వాయిస్
ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాకుండా పచ్చని ప్రకృతితో భక్తులకు నయనానందాన్ని కలుగిస్తున్నది. శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రెండున్నర కిలోమీటర్ల చెరువు నగర వాసుల దాహార్తిని తీర్చడంతో పాటు... సందర్శకులను ఆకర్షిస్తున్నది. చుట్టూ సహజంగా ఉన్న కొండలు దేవాలయానికి అదనపు ఆకర్షణగా నిలిచి, గాంభీర్యాన్ని తీసుకొస్తున్నయి
స్పాట్
ఆలయ కుడ్యాలపై అందమైన శిల్పాలు అలరిస్తయి. చరిత్రను వివరించే శాసనాలుకూడా అక్కడక్కడా కనిపిస్తయి. పక్కనే ఉన్న చెరువు వల్ల ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటది. ఎత్తైన కొండదిగుంన ఉన్న ఈ ఆలయం చూడ చక్కగా ఉంటది. ఈ ఆలయానికి ఒక వైపున పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అందంగా కొలవుదీరినయి. ఆలయ గోపురాల పై అందమైన శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటయి. భక్తులకు నీడ కోసం ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్లు వేయించిండ్రు. ఇక్కడికొచ్చిన భక్తులు శ్రీ వల్లభ గణపతిని కూడా కొలుస్తరు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ప్రత్యేక స్తలాన్ని కేటాయించిండ్రు. భక్తలు ఆలయ ధ్వజ స్తంబం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటరు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు కూడా దర్శించుకోవచ్చు.
బైట్ - భక్తురాలు
యాంకర్ 4
శ్రీ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుచుకుంటరు. అమ్మది చూడచక్కని రూపం. ఆ తల్లిని చూసి భక్తి పారవశ్యానికి లోని కాని వారుండరంటే నమ్మండి. ముల్లోకాలకు పెద్ద ముత్తైదువ ఈ భద్రకాళి అమ్మవారు.
వాయిస్
వరంగల్ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుస్తరు. అంటే ముల్లోకాలలో కెల్లా అందమైనదిగా అర్ధం. విశ్వంలోని స్త్రీ శక్తిని, ప్రకృతి శక్తినంతటిని కలిపి త్రిపుర సుందరిగా పిలుస్తరు. శ్రీ భద్రకాళీ అమ్మవారి అమ్మవారి విగ్రహాం 9 అడుగుల ఎత్తుతో 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తున్నది.అమ్మవారు ప్రేతాసినియై కొలువుతీరింది. తల్లి 8 చేతులతో.. కుడివైపు ఉన్న 4 చేతులలోయ ఖడ్గము, ఛురిక, జపమాల, ఢమరుకము.. ఎడమవైపు ఉన్న చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్న మస్తకము, పాన పాత్రలున్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖముగా ఉంది.
స్పాట్ విజువల్స్...అమ్మవారివి వాడగలరు.
నయన మనోహరంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలను చూడటానికి వరంగల్ నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల జనం కూడా వస్తున్నరు. భక్తులు సమర్పించిన రకరకాలపూలతో భద్రకాళి అమ్మవారు కళకళలాడుతూ కోరిన మొక్కులు తీర్చే తల్లిని దర్శించుకుని భక్తులు అమితానందంతో తిరిగి వెళుతున్నరు.
స్పాట్
వాయిస్...
అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు.అమ్మవారు కొలువైన పెళ్లిమంటపాన్ని రకరకాల పూలతో అలంకరించారు.శక్తిప్రదాయని శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.కాకాతీయుల కాలంలో విరజిల్లి తర్వాత ప్రాభవం కోల్పోయిన అమ్మవారి దేవాలయం మగన్ లాల్ నమేజా లనే వ్యాపారి పునరుధ్దరించిడు.అప్పటి నుంచి శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులు ఓరుగల్లు వాసులకు చల్లని దీవెనలుగా మారాయి.
బైట్..భక్తురాలు.
యాంకర్ 5
అమ్మవారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుతరు. వైశాఖ మాసంలో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తుల హాజరుయితరు. సృష్టికర్త బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను ప్రారంభించిండని ఇక్కడి భక్తులు చెప్పుకుంటరు. అంకురార్పణతో మొదలయి బ్రహ్మోత్సవ సమాప్తితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తయి.
వాయిస్
భద్రకాళి దేవస్థానంలో ప్రతియేటా వైశాఖ మాసంలో జరిపే బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత కలదు. పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతయి. విద్యుద్దీపాలతో అలంకరించిన ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంటది. .. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు.. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయిన భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి ప్రపత్తులతో పూజిస్తరు. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి జనం ఇక్కడకు వస్తరు.
స్పాట్
వాయిస్
శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తరు.ఉదయం శంకరభగవాత్పద సమారాధన అనంతరం చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహనం సేవ చేస్తరు. సాయంత్రం గజవాహన సేవ చేసి శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ మహోత్సవం జరుగుతది.
బైట్...ప్రవచనము...వాడగల
స్పాట్
ఉత్సవాల్లో రెండో రోజు ఉదయం వృషభవాహన సేవ, ధ్వజారోహణము జరిగుతది . యాగశాల ప్రవేశము, యాగమండప స్థూణ పూజ, ద్వారతోరణపూజలు నిర్వహిస్తరు. సాయంత్రం అమ్మవారికి జింక వాహన సేవా ఉత్సవం జరుగుతది. దీప నైవేద్యాలతో భద్ర కాళీ అమ్మవారిని కొలుస్తరు
స్పాట్........
బైట్...వినయ్ భాస్కర్...మాజీ ఎమ్మేల్యే.
ఉత్సవాల్లో మూడో రోజు మకర వాహన సేవతో అమ్మవారి ఉత్సవాలు మొదలవుతయి. సాయంత్రం చంద్రప్రభ సేవతో శ్రీ భద్రకాళీ భధ్రేశ్వరుల ఎదుర్కోలు ఘనంగా జరుగుతయి.
విజువల్స్ : ప్రవచనము వాడుకోగలరు
స్పాట్.....
వాయిస్
ఐదోరోజు శంకర భగవాత్పద సమారాధన తర్వాత చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహన సేవ చేస్తరు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు. కళ్యాణ మండపాన్ని రకరకాల పూలతో అలంకరిస్తరు. శక్తిప్రదాయిని అయిన అమ్మావారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.
స్పాట్
గజవాహన సేవ అనంతరం శ్రీభద్రకాళీ..భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం మొదలైతది. సాక్షత్తు పరమశివుడే కళ్యాణ ఘడియలు నిర్ణయించుకున్న శుభదినం అయిన వైశాఖ శుద్ధ పంచమి నాడు అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగుతది. వేదాంతులు చెప్పే శివకళ్యాణ వైభవ ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్దగా వింటరు.
విజువల్స్ : ప్రవచనాన్ని వాడుకోగలరు.
స్పాట్.....
ఈ ఆలయంలో ఆశ్వీయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత రాత్రులు, ఆశాఢ మాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని శాఖంబరి దేవిగా కొలుస్తరు. శాఖంబరి దేవి అంటే తల్లిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించి సేవిస్తరు. శాకలు అలంకరించడం వలన ఈ దేవికి శాకంభరి అనే పేరొచ్చింది. ఈ శాకంభరి దేవి నుంచే అన్న పానాదులు, సకల ఆహారాదులు ఉత్పత్త
బైట్స్: పూజారులు
ఎండ్ యాంకర్
ఇదీ వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర. మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం..అంత వరకు శలవు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment