ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, September 25, 2009

కులాల వివరాలు జనాభా లెక్కల్లో

కులాల జనాభా అంశం తాజాగా తెరపైకి వచ్చింది.జనాభా సేకరణలో కులాల వివరాలు ఉండితీరాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో 1931లో బ్రిటీష్‌ వారు సేకరించిన వివరాలను బట్టి కేటాయింపులు జరుగుతున్నాయి. బిసిలకు సంబందించి సంక్షేమనిధులు కేటాయించాల్సి వచ్చినప్పుడల్లా ఇదే వివాదం వెంటాడుతోంది. 1931లో బ్రిటీష్‌వారు జనాభా లెక్కల్లో కులాలను చేర్చడం ఒక కుట్రగా మన జాతీయ నాయకులు అభివర్ణించారు. మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం కాబట్టి కులమతలకతీత మైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటామని నాటి నాయకులు కలలు కన్నారు. కానీ నేడు కులాల ప్రభావం సమాజంలో తీవ్రంగాఉంది.వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లకు నిధులు కేటాయించ వలసి వచ్చినపుడల్లా సమాజంలో బిసిల శాతమెంత అనే సందేమం తలెత్తుతూనే ఉంది. అయినా వీరికి సంక్షేమ నిదులు కేటాయించాల్సి వచ్చినా, రిజర్వేషన్‌లు కేటాయించాలన్నా 1931లెక్కల ప్రాతిపదికనే కేటాయిస్తూనే వస్తున్నారు. దీనిలో ఉన్న ఔచిత్యమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కులాల వారీగా వివరాలు సేకరించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిఎంకే అభ్యర్దనను సుప్పీంకోర్టు తీర్పుచెప్పింది. దీని వల్ల సామాజిక విద్వేషాలు పెరుగుతాయని అభిప్రాయపడిది. మండల కమీషన్‌ తమ సూచనలు చేసే ముందు కులాల వారీ జనాభౠ సేకరణ జరపాలని వరుసగా ముగ్గురు హోం మంత్రులను కోరింది. అయితే 1951 నుంచి కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించ కూడదన్న నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్ణయానికి కేంద్రప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉంది. జనాభా లెక్కలు సరిగా లెకపోవడం వల్ల ప్రతి సామాజిక వర్గం తమ జనాభా లెక్కలు ఎక్కువ చేసి చెప్పుకుని రాజకీయంగా, ప్రభుత్వ పథకాల్లో వాటాలు అధికంగా పొందుతున్నారనే వాదన ఒక వైపుఉంటే, ఎప్పుడో వేసిన లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని తమకు సరియైన ప్రాతినిధ్యం కల్పించడం లేదనే వాదన కూడా ఉంది. అయితే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే కులవిద్వేషలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది, కావున సమాజంలో ఆర్దిక అసమానతలు రూపుమాపాలంటే , భిన్న సామాజిక వర్గాలలో ఆర్దిక స్థితిగతులను సర్వే చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. దీని ద్వారా ఆర్దిక అసమానతలు రూపుమాపవచ్చని, కేవలం కులాల వెనకబాటు కాకుండా ఆర్దిక వెనకబాటు నుండి రక్షించాలన్న వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రతీసారీ ప్రభుత్వానికి ఇదో కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ది చెందిన కొన్ని బి.సి కులాలను ఓసిల్లో కలపాలనే నిర్ణయానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే కొన్ని కులాలను బి.సి జాబితాల్లో కలపాలనే నిర్ణయానికి కూడా సరియైన లెక్కలు లేవు. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఎంతమంది సామాజిక ఆర్దికంగా బలపడ్డారు అనే అంశాలకు సంబందించిన సమాచారం ప్రభుత్వం వద్దలేనేలేదు. దేనికైనా బ్రిటీష్‌ వాళ్ల లెక్కలపై ఆధారపడాల్సిందే. దీని వల్ల అనేకరకాలయిన న్యాయపరమైన చిక్కుల వివాదాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ 2011లో జనాభా లెక్కలు సేకరించాల్సిన తరుణం ఆసన్నమయింది. ఇప్పుడయినా ఈ సమస్యను అదిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2011లో సేకరించబోయే జనాభా లెక్కల్లో కులం వివరాలు ఉండేలా చూడాలంటే కేంద్రన్యాయ శాఖా మంత్రి వీరప్పమెయిలీ ప్రధానికి లేఖ రాయడంతో ఈ చర్చ ఇప్పడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

No comments:

Post a Comment