Monday, September 7, 2009
రాజకీయ వ్యభిచారం
రాజకీయాల్లో విలువలు ఏనాడో మట్టి కొట్టుకు పోయాయి. ఇప్పుడు ఏ మనిషి మనవాడో ఎవరు ఎప్పుడు పగవాడవుతాడో చెప్పడం అసాధ్యం అయిపొయింది. ఎంతో ఆర్భాటంగా పార్టీ పెట్టిన వెండితెర మెగాస్టార్ చిరంజీవి, పార్టీ నుంచి సరిగ్గా ఎన్నికల ముందు ఎంతో మంది విడిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం మీద బాగా చెప్పగలరు. ఎంత త్వరగా పార్టీ లోకి వచ్చారో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిన నాయకుల చిట్టా తీస్తే చిరంజీవి కూడా ఇంకా బాగా చెప్పగలరు. ఫిరాయింపుల్ని చిరంజీవి ప్రోత్సహించక పోయినా కోవర్టులుగా కొంత మంది నాయకులని చంద్రబాబు పంపించిన మాట వాస్తవం అయ్యే విషయాన్నీ మనం కొట్టిపారేయలేము. అలాగే టీ.డీ.పీ కి ఒక కవచం లాగ కొమ్ము కాసిన నాయకురాలు రోజా ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవిని చెడామడా తిట్టి అధినేత మెప్పు పొంది ఎన్నో సార్లు మీడియా సాక్షిగా సామాన్య ప్రజానీకంయొక్క ఛీత్కారాలకు గురైన మాజీ నటి రోజా, చంద్రబాబు మన్ననలు పొంది, చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోసం ఎం.ఎల్.ఏ టికెట్ పొందింది. ఈమె కోసం సాక్షాత్తూ సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ని కూడా పక్కనెట్టాడు చంద్రబాబు. అయినా అధికార పార్టీ విజయం తో సీట్లు కోల్పోయిన చాలా మందిలో రోజా ఉంది. ఆమె పెట్టిన శాపనార్దాల వల్లనేమి, లేదా తన చరిష్మా వల్లనేమి పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో చిరు గెలుపొందారు. అలాగే రోజా కి, ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి కి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరు మర్చిపోరు. అంతగా టీ.డీ.పీ ని వెనకేసుకొచ్చిన రోజా అసలు కాంగ్రెస్ లోకి దూకనున్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి చెప్పటం దాన్ని రోజా ఖండించడం జరిగిపోయాయి. అయినా ఈ విషయం జనం దృష్టి నుండి వెళ్ళకముందే మళ్ళీ ఈ రోజు రోజా ముఖ్యమంత్రిని కలవడం ఆ తరువాత ఆమె మాటలు వింటుంటే ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ లో చేరనున్నదనే తెలుస్తోంది. తన సోదరులు తో పాటు, మాజీ టీ.టీ.డీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ల తోడుగా రోజా ముఖ్యమంత్రిని మీడియా సాక్షిగా కలిసింది. అయితే ఆమె చెప్పేదేమిటంటే చిత్తూరు జిల్లాకి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన తరుణంలో కృతఙ్ఞతలు తెలియచేయడానికి కలవడం జరిగిందని చెప్పినా ఆ తరువాత మీడియా ముందు ఆమె మాట మార్చింది. టీ.డీ.పీ ని తన బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమించానని అయితే సొంత పార్టీ తనకు తగిన రీతిలో గౌరవం ఇవ్వలేదని అలాగే సొంత పార్టీ వ్యక్తులే తనను ఓడించారని దీనితో తాను మనస్తాపం చెందానని తెలిపింది రోజా. అలాగే తాను ఎన్నికలవేళ ముఖ్యమంత్రిని ఎంతగా విమర్శించినా ఆయన తనను ఎంతో ఆదారంగా కలిసి మాట్లాడారని ఆయన (వై.ఎస్.ఆర్) సొంత మనుషులను బాగా చూసుకుంటారని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మిన వాళ్ళను వదలరని కూడా కితాబిచ్చింది. దీన్ని బట్టి ఆమె త్వరలో పార్టీ మారబోతోందని రూఢీ అయిపొయింది. అంతటితో ఆగక టీ.ఢీ.పీ లో తన సామాజికవర్గం వారికి తగిన ప్రాతినిధ్యం, గౌరవం లేవని కులరాజకీయాల తోనే తనను సొంత పార్టీ మనుషులే చంద్రగిరిలో ఓడించారని ఆరోపిస్తోంది. అయితే ఒక్క విషయం ఏమిటంటే ఒకటే కులం అయిన నన్నపనేని రాజకుమారి ని పక్కన పెట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని రోజాకు రెడ్డి సామాజిక వర్గానికి (రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి) కట్టబెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన తప్పు తెలుసుకుని ఉంటారు. పక్కిల్లు తగలబెట్టేటప్పుడు మన ఇల్లు కూడా అంటుకునే అవకాశం ఉందని చిరంజీవికి కుల రాజకీయాలు ఆపాదించినప్పుడు ఏమీ మాట్లాడని, ఆమెను ఖండించని చంద్రబాబు ఇప్పుడు అవే వ్యాఖ్యలతో తనపైనే దాడి చేసినప్పుడు తప్పకుండా తెలుసుకుని ఉంటారు.రోజా లాంటి వ్యక్తులు రాజకీయాలకే మాయని మచ్చ. ఆమెని చేర్చుకునే పార్టీ ఏదైనా ఏదో ఒక రోజు తప్పకుండ చింతించవలసి వస్తుంది. రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని చంద్రబాబు ఎమన్నా చేసారో లేదో తెలీదుకాని, రోజాకు మాత్రం ఎప్పుడూ మంచి స్థానం ఇచ్చారు అదీ 2004 ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా కూడా ఇంతకంటే ఏమి చేస్తారు ఎవరైనా? కనుక ఇప్పుడు రోజా ఆపదిస్తున్న కుల రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు అన్ని కూడా ఒక పాముని పెంచి పోషించిన చందం అని టీ.డీ.పీ నాయకులు అనుకోక తప్పదు. ఇప్పుడు కూడా పార్టీ మారడం వెనుక స్వార్ధం తప్పించి వేరొక కారణం లేదని గ్రహించలేని అమాయకులు కాదు జనం. తన వివాదాస్పద వైఖరితో తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి కట్టుకుంటున్న రోజాని చూసి జాలి పడడంకూడా వృధా !! ఇటువంటి రాజకీయ వ్యభిచారం ప్రజలకు దూరం చేస్తుంది తప్పించి మెప్పు తెచ్చే అవకాశం లేదు. మరి ఈ విషయం రోజా ఎప్పుడు గ్రహిస్తుందో?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment