ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, September 14, 2009

రాజాలా బతికిన రోజాకు గడ్డు కాలం

చంద్రబాబు నాయుడికి టాటా చెప్పిన రోజాకు కాంగ్రెస్ లో వెల్ కం చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోయారు. ఆమె నిర్ణయం తీసుకున్న సమయం సరిగ్గాలేదు. ఒక నెల ముందు అయితే వైఎస్ ఆమెకు ఆహ్వానం పలకమని తన మనుషులను పురమాయించి ఉండేవారు.తెలుగుదేశం తరఫున గత ఎన్నికల్లో చక్కగా గళం విప్పిన రోజా ఇప్పుడు ఆ పార్టీని వీడిపోవడం చంద్రబాబు నాయుడికి బాధాకరమే.రోజాకు తెలుగుదేశంలో ఆదరణ పోవడానికి ప్రధాన కారణం నన్నపనేని రాజకుమారి అని తెలుస్తోంది. రెడ్డి కులస్ధురాలైన రోజా కాంగ్రెస్ కోవర్టులా తెలుగుదేశంలో వ్యవహరిస్తోం<దని ప్రచారం ఉధృతం కావడంతో ఉక్కిరి బిక్కిరై రోజా టిడిపికి గుడ్ బై చెప్పవలసి వచ్చిందని తెలుస్తోంది. చాలా గట్టి అభ్యర్ధి అయిన గల్లా అరుణకుమారి మీద తనను నిలబెట్టడం కుట్రలో భాగమేనని రోజా ఆలస్యంగా తెలుసుకుంది. ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం కొత్త్తే అయిన రోజాకు ఎన్నికల సమయంలో ఈ విషయం తెలిసినట్టు లేదు. తెలుగుదేశం గుడ్ విల్, తన గ్లామర్ కలిసి తనను సులభంగా గట్టెక్కిస్తాయని ఆమె భావించారు. గల్లా అరుణ కుమారిపై రోజా గెలవలేదన్న విషయం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు. బరిలోకి దిగిన రోజా గ్లామర్ ను, కొంత సంపదను కోల్పోయింది.ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న సామెతను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని, మహిళారాజ్యం నాయకురాలు శోభారాణి నిజం చేసి చూపారు. రోజాది ఐరన్ లెగ్ అని ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం రోజాకు బాధ కలిగించి ఉండవచ్చు. ఆనాడు ఆమె తెలుగుదేశం లో చేరిన వెంటనే చంద్రబాబు నాయుడు అలిపిరి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే వైఎస్ మరణించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి గంగాభవాని, రాజకుమారి, శోభారాణి కారకులని రోజా భావిస్తున్నట్టు సమాచారం. మంచి భవిష్యత్తు ఉన్న యువ రాజకీయ నాయకురాలి ఆశలను ఇలా సీనియర్లు భగ్నం చేయడం తప్పే.ఈ దెబ్బతో రాజకీయాల మీద ఆసక్తి కోల్పోయిన రోజా సినిమాల మీద టీవీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment