.... ఓన్లీ న్యూస్... విశ్లేషణ కాదు...
కిషన్ జీ మృతి
బెంగాల్ అడవుల్లో ఎన్‌కౌంటర్
జంగల్‌మహల్‌లో లభించిన మృతదేహం
కిషన్‌జీదేనని అనుమానం
మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మృతి చెందారు... పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు... భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారని బెంగాల్ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. జంగల్‌మహల్‌లో ఓ మృతదేహం దొరికిందని, అది కిషన్‌జీ దేనని ఆ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి... అయితే కిషన్ జీ మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా ధ్రువీకరించడం లేదు... హోంశాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక బెంగాల్‌లో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్ ఇది... కిషన్ జీ కోసం బెంగాల్ భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కుషుబోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి... నిన్నటికి నిన్న కిషన్‌జీ త్రుటిలో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారనే వార్తలు వచ్చాయి
బెంగాల్‌లోని సంయుక్త దళాలు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో కిషన్‌జీ మృతి చెందారు. దాదాపు అరగంటసేపు ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో కిషన్‌జీతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు... కిషన్‌జీదిగా భావిస్తున్న మృతదేహం పక్కనే ఏకే 47 గన్ లభ్యమైనట్టు సమాచారం
కిషన్‌జీతో పాటు, ఆయన సహచరి సుచిత్ర మహతో కోసం భద్రతా బలగాలు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి.. జంగిల్ మహల్‌లో మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కిషన్‌జీ, సుచిత్ర కుష్‌బని అడవుల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్ని అణువణువు గాలించాయి. అయిదుగురు మావోయిస్టులను అరెస్ట్్ చేశాయి.. అయినప్పటికీ అగ్రనేత సమాచారం అందలేదు... ఆ తర్వాత జార్ఖండ్, బెంగాల్ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్‌తో కిషన్‌జీ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుచిత్ర కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి.
రెండేళ్ల క్రితం కూడా కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆయన తప్పించుకున్నారని తెలిసింది.
No comments:
Post a Comment