ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, October 26, 2011

తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి అసలు గుట్టు ఇదే..?

భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....
కాంగ్రెస్‌ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.

లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు
సీమాంధ్ర ఎంపీలు, కాంట్రాక్టర్లు తెలంగాణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో వారికున్న కాంట్రాక్టులేంటి.. తెలంగాణ వస్తే నష్టపోయేది.. సీమాంధ్ర ప్రజలా.. సీమాంధ్ర పొలిటికల్ కాంట్రాక్టర్లా ... ఇన్ని వేలకోట్ల లావాదేవీలు ఉండబట్టే రెండు ప్రాంతాల ప్రజలను ఉద్యమాల పేరుతో చెడుగుడు ఆడుతున్నారు.... ఎవరి ప్రాజెక్టులు.. ఎన్ని కోట్ల లావాదేవీలో ఒకసారి చూద్దామా...
తెలంగాణ స్వరూపాన్ని మార్చిన నిర్మాణాలు
భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....
కాంగ్రెస్‌ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.
లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు

12 comments:

  1. కానీ గ్రంధి మల్లికార్జునరావు సొంత పట్టణమైన రాజాంలో సమైక్యాంధ్ర కోసం హింస జరగలేదు. ఆయన రాజకీయ నాయకుడు కాకపోవడం వల్ల హింస చెయ్యించలేకపోయి ఉంటాడు. సుబ్బరామిరెడ్డి సొంత పట్టణమైన వైజాగ్‌లో మాత్రం హింస ఎక్కువ జరిగింది.

    ReplyDelete
  2. eppudooooooooooooooo ee vedhava edupuleeeeeeeeeeeeeeeeee

    ReplyDelete
  3. You told one face of problem. Second face is Telangana politicians want all these contracts.

    ReplyDelete
  4. బాగా సమాచారం సేకరించారు కానీ కొన్ని తప్పులు లేదా gaps దొర్లాయి.

    1. GMR తెలంగాణ వ్యతిరేకి కాదని నా అభిప్రాయం. ఆంధ్ర వ్యాపారవేత్తలలో ఆయనొక్కరే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
    2. కావూరి సొంత సంస్థ పేరు Progressive Constructions. ఒకప్పుడు అర్జున్ సింగ్ సన్నిహితుడయిన కావూరి మధ్యప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులు చేసారు. అర్జున్ సింగ్, తివారీ ప్రభ్రుతులు కాంగ్రెస్ పార్టీ వదిలేసినప్పుడు కావూరి కూడా వారి బాట పట్టారు. అర్జున్ సింగ్ రాజకీయదశ వెనుతిరిగిన దరిమిలా ఆయన YSRకు చేరువయ్యారు.
    3. TSR గారి సొంత సంస్థే కాక సోదరుని మీడియా (DC) కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది.
    4. రామోజీరావు లాంటి వారి పేరు పై టపాలో లేకపోవడం ఆశ్చర్యం. వ్యాసకర్త ఎక్కువగా కాంగ్రెస్ వారి మీదే focus చేసి తెదేపా వారిని వదిలేసారేమో?

    నా ఉద్దేశ్యం విమర్శ కాదు, ఇంకా completeగా ఉంటె బాగుండేదనే కోరిక మాత్రమె.

    ReplyDelete
  5. @Praveen:

    విశాఖలో హింస జరగడానికి కారణం సుబ్బరామిరెడ్డి కాదు, నిజానికి ఆయన నెల్లూరు జిల్లా వాడు.

    విశాఖలో SASJAC (Samaikya Andhra Students JAC) ముసుగులో కిషోర్ అనే ఒక 40 ఏళ్ల అంకుల్ "విద్యార్థి"గా చలామణి అవుతూ ఉన్నాడు. వీడికి హింస అంటే అతి ప్రేమ, ముఖ్యమగా తెలంగాణ వాదులపైన (e.g. R. Narayanamurthy, Bandaru Dattatreya etc.) దాడులు చేయించడం సరదా. గత రెండేళ్లుగా మీడియా ముందు సొల్లు మాట్లాడం వీడి అలవాటు. వీడి తిక్క మాటలు చూస్తె జాన్ అంకుల్ గుర్తుకొస్తాడు, వాడే వీడేమో?

    ReplyDelete
  6. గ్లోబలైజేషన్ పేరుతో హైదరాబాద్‌లో ఖరీదైన ప్రోజెక్ట్‌లు చేపట్టకముందు సుబ్బరామిరెడ్డి విశాఖపట్నంలో కాంట్రాక్ట్‌లు చేసేవాడని విన్నాను. అందుకే అతనిది విశాఖపట్నం అనుకున్నాను.

    ReplyDelete
  7. correct the post, content is repeated.

    you collected so much of information. but you didn't clearly explain why these oppose telangana!! as mentioned, these people are also doing business in many other states and many countries too. if they can do business and gain profits in many states, why can't they do if andhra pradesh is divided??

    ReplyDelete
  8. సమైక్యవాద ఉద్యమం నడుపుతున్నది హైదరాబాద్ కోసమే. గ్లోబలైజేషన్ వల్ల ఎంత నష్టం జరిగినా ఒక్క హైదరాబాద్ నగరం మాత్రమే అభివృద్ధి చెందింది. గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళు హైదరాబాద్‌ని బంగారు బాతుని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళకి హైదరాబాద్‌ని వదులుకోవడం ఇష్టం లేదు. హైదరాబాద్ మీ అబ్బ సొత్తా అంటూ మోహన్ బాబు, టిజి వెంకటేశ్ లాంటివాళ్ళు తెలంగాణావాళ్ళని బహిరంగంగా తిట్టలేదా?

    ReplyDelete
  9. మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి.

    ReplyDelete
  10. @Praveen: TSR started his career of loot as a contractor in Nagarjuna Sagar.

    ReplyDelete
  11. కూల్.. కూల్.. ఇప్పటి వరకు ఉద్యమమే చేశారు.. ఇక రాజకీయాలను సునిశితంగా గమనించాల్సిన తప్పని పరిస్థితి.. ఎవరి కెరీర్ ఎలా స్టార్ట్ చేసినా ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే కావాలి.. అయితే వచ్చే ఆరోపణల్లో వాస్తవాలెంత? ఆరోపణలెంత అనేది కూడా రుజువు చేసుకొని.. ఒక నిశ్చితాభిప్రాయానికి రావాలి.. అంతేగానీ తొందరపడకూడదు..

    ReplyDelete
  12. Well done, keep it up my friend.
    Sambaiah Gundimeda

    ReplyDelete