Wednesday, October 12, 2011
తెలంగాణ రహస్యం ఇదా...?
అరణ్యంలో తిరిగే ఆరుద్ర పురుగులన్నీ ఒక్కటై రేపటి పొద్దు పొడుపుకు పురుడు పోస్తనంటున్నయి. చిమ్మ చీకటిలో ఎగిరే మిణుగురులన్నీ కొమ్మ కొమ్మన చేరి చీకటిని తరమేస్తమంటున్నయి. ఇక్కడి నేలకు పోరాటాల పురిటి వాసన పోలేదు. ఇక్కడి మట్టి కణాలతో ఏ వీరుడి రక్తకణాలో పెనవేసుకొని నిత్యం కణకణ మండుతుంటయి. లోకం కోసం తనలో తాను రగిలే సూర్యుడిలా మండే ధీరుల శ్వాసలు పిల్లగాలులై ప్రసరిస్తాయిక్కడ. ఈ నేలను ఓపికతో తవ్వుకుంటూ పోతే ఊరికో దదీచి ఎముక దొరుకుతుంది. పొద్దు పొడుపును పొత్తి కడుపులో దాచుకుని పురిటి నొప్పులు పడుతున్న తల్లులు గంభీరంగా ఊపిరి బిగబడతారిక్కడ.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లు నిండుతుంటే... కొత్త చేతులు మొలుస్తాయిక్కడ.. గన్నేరు.. మందారం.. మోదుగుపూలు ఒక్కటై వీరమాలల్లుతాయి... ఎన్ని తరాలు అంతరించినా త్యాగంలోనే తరించే జాతి మాది.. ఇది తెలంగాణ.. రుద్రావేశంతో పెఠీల్మని ఎద తంత్రులు తెంచుకున్న కోటి రతనాల వీణ..
Subscribe to:
Post Comments (Atom)
I'm a samaikyavaadi. But, this is a good post.
ReplyDeleteథాంక్యూ బ్రదర్. సాహిత్యానికి సరిహద్దులు లేవు. ఇజ్రాయిల్ కన్నీళ్ల గురించి రాయొచ్చు.. ఇంటి కథ గురించి రాయొచ్చు..
ReplyDeletesuper like....
ReplyDeleteజనార్దనా,నువ్వు రోజూ ఒక తెలంగాణలోని పేదలకు అన్నదానం చేస్తున్నందుకు,తెలంగాణ లోని అనాధలకు నీ ఇంట్లో స్థానం కల్పించినందుకు,తెలంగాణలోని వయసుపైబడిన వారిని ఆదుకొంటున్నందుకు నువ్వ్వే కోటి రతనాలతో సమానం.
ReplyDeleteనేల కఠినం కానీ మనుసులు సున్నితం. మాట పదునుగుంటది కానీ భావం తియ్యగుంటది.జేబుల రూపాయి లేకపోయినా దిల్దారి మస్తుగుంటది. తిన్నా పస్తులున్నా పాటలు, కళలు మాత్రం ఆగయి.
ReplyDeleteనా తెలంగాణ మానవ సంబంధాల మహోన్నత కావ్యం. నా తెలంగాణ జానపదుల జావళి. నా తెలంగాణ ప్రకృతి ఒడిలో నిదురించే శిల్పం. నా తెలంగాణ భరతమాత కాలి అందెల రవళి, పుడమి తల్లి నొసటి తిలకం.
ఎప్పుడూ పోరాటాలేనా కాస్త సుఖపడండి. తెలంగాణా వస్తే సుఖపడతాం అనకండి. ఆ తరువాత మరోపోరాటమంటారు. ఇక దీనికి అంతేది.
ReplyDeleteavunu nijame chala chala baagundi, nenu "Hyderabad second capital of India" vaadini, naaku mee post baga nacchindi.
ReplyDeleteRama oka sodari
@రమక్క థాంక్యూరా.. హైదారబాద్ ధేశ రెండవ రాజధాని అనుకునేంత శక్తి రావడానికి కారణం ఇక్కడున్న కల్చర్, కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా స్ట్రక్చర్,, అందుకే హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికేకాదు, యావద్దేశానికి, ఇతర దేశాలకు ఇష్టం... @ జై... గారూ మీరు కూడా తెలంగాణ గురించి బాగా చెప్పారు. ఎందుకంటే ఈ నేలలో ఇంకిన వీరుల రక్త కణాలు తిరిగి వాన నీళ్లలో కలిసి చెరుల్లో తాగునీరై మనల్ని అప్రమత్తం చేస్తాయోమోనని ఇక్కడ చెరువుల ఎండబెట్టిన్రు. @ chanukya మీరేమన్నారో నాకు అర్ధం కాలేదు.. థాంక్యూ ఫర్ కామెంట్ సర్.
ReplyDelete