Sunday, April 1, 2012
బయటపడ్డ..శశికళ జయలలితల బండారం.. కార్యకర్తల కన్నెర్ర..?
బయటపడ్డ..శశికళ జయలలితల బండారం.. కార్యకర్తల కన్నెర్ర..?
ప్రాణ స్నేహితులైన జయలలిత, శశికళ మళ్లీ ఒక్కటయ్యారు. మూడు నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరించిన తన నెచ్చెలి శశికళను జయ తిరిగి అక్కున చేర్చుకున్నారు. శశికళను మళ్లీ పార్టీలోకి తీసుకుంటున్నామని అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కార్యకర్తలు మాత్రం జయశశి వ్యవహారం పై గుర్రుగా ఉన్నారు. వీరి విరహ తాపాలకు పార్టీని వాడుకోవడం పట్ల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
జయలలిత.. శశికళ.. ఈ రెండు పేర్లూ.. వారికున్న అనుబంధమేంటో తెలియంది కాదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది జయలలిత... రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. అందుకే మూడు నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరించిన శశికళను తిరిగి తన పోయెస్ గార్డెన్ లోకి పిలిపించుకుంటోంది.. శశికళ పై బహిష్కరణ ఎత్తేస్తున్నట్టు జయలలిత ప్రకటించింది... ఇంతవరకు బాగానే ఉంది.. వచ్చిన చిక్కల్లా కార్యకర్తలకే... పార్టీ ఆదేశాలను ఎలా పాటించాలో.. ఎవరిని ఎలా పరిగణించాలో దిక్కుతోచని పరిస్థితి.
జయలలిత, శశికళల గిల్లికజ్జాలు.. పార్టీ కార్యకర్తలకు ప్రాణసంకటంగా మారాయి. వీరిద్దరి నడుమ కార్యకర్తలు నలిగిపోతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ శశికళతోపాటు ఆమె బంధువులు 19 మందిని అన్నాడీఎంకే నుంచి బహిష్కరిస్తూ గత ఏడాది డిసెంబర్ 19న జయలలిత ఆదేశాలు జారీ చేసింది. దీంతో శశికళ వర్గం పై కార్యకర్తలు చిందులు తొక్కారు. అన్నా డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని కార్యకర్తలు క్షమించడానికి ససేమిరా అంటున్నారు. ఈ సందర్భంలోనే జయలలిత శశికళను తిరిగి తన గూట్లోకి తెచ్చుకోవాలని నిర్ణయించడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు.
జయలలిత తనకు అక్క అని... ఆమెకు ద్రోహం తలపెట్టనని శశికళ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు. నా బంధువులు అక్కకు ద్రోహం చేసిన విషయం పార్టీ నుంచి బయటికొచ్చాక గానీ నాకు తెలియలేన్నారు. జయ అంటే తనకు ప్రాణంమని... ఆమెకే తన జీవితం అంకితమని తెలిపారు, జీవితాంతం అక్కకు సేవ చేస్తూ తనువు చాలిస్తానని శశికళ స్టేట్‌మెంట్లు గుమ్మరించడంతో.. జయలలిత మనసు చల్లబడింది.. స్టేట్ మెంట్లతో సరిపుచ్చక ఏకంగా జయలలితకు ఓ లేఖకూడా రాసింది. శశికళ ఇచ్చిన వివరణ జయలలితకు సంతృప్తినిచ్చిందనీ.....దాంతో ఆమెను మళ్లీ పార్టీలోకి.....తన అంతరంగిక మందిరంలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.. అయితే శశికళ భర్త నటరాజన్ సహా మిగతా 19 మందిపై మాత్రం క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, ఈ స్నేహితులిద్దరూ విడిపోయి మళ్లీ కలవడం ఇదేమీ తొలిసారి కాదు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడటంతో శశిని జయ పార్టీ నుంచి తొలగించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఇద్దరూ కలిశారు.
ఇంత వరకూ బాగానే ఉంది... కానీ శశికళ మళ్లీ పార్టీలోకి వచ్చాక.. తన పై గుర్రుగా ఉన్న కార్యకర్తలకు ఏ ముప్పు తెచ్చిపెడుతుందో అని హడలిపోతున్నారు. పొట్టేళ్ల పొట్లాటకు పిల్లల కాళ్లు విరగినట్టుందని... కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment