బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. 11 ఏళ్ల క్రితం నకిలీ ఆయుధ డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న వ్యవహారాన్ని తెహల్కా డాట్ కాం బయట పెట్టింది. ఇన్ని సంవత్సరాల తరువాత కోర్టు బంగారు లక్ష్మణ‌్ దోశిత్వాన్ని నిర్ధారించింది. ఈ అపరాదానికి గానూ బంగారు లక్ష్మణ్‌కు శిక్ష విధించింది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కటకటా వెనక్కు వెళ్లాల్సినంత నేరం ఏం జరిగింది. అసలు బంగారు లక్ష్మణ్ చేసిన నేరమేంటి.. కేసు పూర్వా పరాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం
అది బీజేపీ దేశాన్ని పాలిస్తున్న సమయం.. కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ అధ్యక్షస్థానంలో ఉన్న బంగారు లక్ష్మణ్ ఆయుధ డీలర్ల వద్ద నుంచి భారీగా ముడుపులందుకుంటున్నాడని ఓ న్యూస్ పోర్టల్ కు సమాచారం అందింది.. ఒక్క ఆయుధ వ్యాపార లావాదేవీల్లోనే కాక ఇతర కీలక ఒప్పందాల్లోనూబంగారు లక్ష్మణ్... లక్షల్లో లాగుతున్నాడని తెలుసుకుంది. ఆధారాల్లేకుండా ఆరోపణలతో వార్తలు రాయకుండా... అసలు నిజం రాబట్టాలని స్టింగ్ ఆపరేషన్‌కి దిగింది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు. ఏకంగా ఎనిమిదిసార్లు ఆయుధ డీలర్ల అవతారంలో... విలేకరులు బంగారు లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. తాము వెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులమని నమ్మబలికారు. భారత సైన్యానికి థర్మల్ హ్యాండ్ హెల్డ్ ఇమేజర్స్ సరఫరా చేసేందుకు వీలుగా రక్షణ మంత్రిత్వ శాఖను ఒప్పించాలని కోరారు. ఎనిమిది సార్ల భేటీ తరువాత బంగారు లక్ష్మణ్‌కు నమ్మకం కలిగి డీల్‌కు ఒప్పుకున్నారు. దీనికి గానూ అక్షరాలా లక్షరూపాయలు డిమాండ్ చేశారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాత్రికేయులు .. ఆ లక్ష.. లక్ష్మణ్ చేతిలో పెట్టారు. ఈ వ్యవహారమంతా బీజేపీ ప్రధాన కార్యాలయంలోనే జరిగింది.
ముడుపులు ముట్టిన మరికాసేపట్లో దేశంలో సంచలన వార్త.. లంచం వ్యవహరం బయటపడగానే బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. 2001లో జరిగిన ఈ సంఘటనపై సిబిఐ ప్రత్యేక కోర్టు ఇన్నేళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం కింద బంగారు లక్ష్మణ్ కు శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న బంగారు లక్ష్మణ్ నిశ్చేశ్చుడయ్యాడు. చాలా సేపు సాక్షుల బోనులోనే గడిపాడు. ఆయన పీఎస్ సత్యమూర్తి అప్రూవర్ గా మారడంతో... అయనకు కోర్టు క్షమాబిక్ష పెట్టింది. 2011 మే నెలలోనే బంగారు లక్ష్మణ్ పై అవినీతి ఆరోపణలు ఖరారయ్యాయి. ఈకేసుపై ఈనెల 2న విచారించిన కోర్టు తన తీర్పును రిజర్వులో వుంచింది. బోఫోర్స్ కేసులో దెబ్బ తిన్న కాంగ్రెస్ తీర్పు వెలువడిన వెంటనే బిజెపి పై విరుచుకుపడింది. అవినీతిపై అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే బిజెపి ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎద్దేవా చేసింది. అద్దాల మేడల్లో ఉన్నవాళ్లు ఇతరుల పై రాళ్లు విసరొద్దని హితవు పలికింది.
Meeru kutra ani title lo pettaru. Kani em kutra jarigimdi, evaru chesaro rayaledu. Asalu a vishayame ettaledu. Ninna Kooda ilane I varta kutra annau, ad emito cheppaledu. Alochimchamdi... Kutra ani rayatam Anna apamdi Leda adi emito rayamdi. Tappuga tesukumte emi cheyalem anipimchimdi cheppam
ReplyDeleteకుట్ర అన్న విషయాన్ని విషదీకరించని మాట వాస్తవమే.. ఎందుకంటే ఆయుధాల కొనుగోళ్లకు లక్ష రూపాలు తీసుకోవడం అనేది వాడి వెర్రి తనం. ఇక లక్ష రూపాయల అవినీతి రుజువైనందుకు. నాలుగేళ్ల జైలు శిక్షతో బాటు మళ్లీ లక్ష జరిమానా విధించారు. ఈ రోజుల్లో ఎంపీపీ కూడా లక్ష లేనిదే పని చేయట్లేదు. బోఫోర్స్ కుంభకోణం గురించి గోల చేయగానే బంగారు బండారం తిరగతోడటం కాంగ్రెస్ కుట్రే కదా మరి. అందుకే అలా ముగిద్దామనుకున్నాను ఏమరుపాటులో మర్చిపోయాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
ReplyDelete