
ప్రవహించే ఉత్తేజాలకు పురుడు పోసే ఉస్మానియా శిఖరంలో పుట్టిన ఉద్యమ ధృవతార జార్టిరెడ్డి... అణగారిన అట్టడువర్గాల ప్రతినిధి అంబేడ్కర్.. యాదృచ్ఛికంగా ఈ రోజే ( 14 ఏప్రియల్) జార్జిరెడ్డి వర్ధంతి, అంబేడ్కర్ జయంతి ఒకే రోజు రావడం వల్ల ఉద్యమ స్ఫూర్తి రగిలించే రోజుగా మిగిలింది.. వాస్తవానికి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంబేడ్కర్ అవసరం ఇక లేదేమో అనిపిస్తుంది. అంటే దళిత బహుజనులు బాగుపడ్డారని... వెలివేత నుంచి.. అంటరాని తనం నుంచి బయట పడ్డారని కాదు... అంబేడ్కర్ లా ఆలోచించే చైతన్యం ఇప్పుడు ప్రతి దళితుడిలో వచ్చింది.. వెనకబడిన తరగతులు కూడా ఒక్కటవ్వాలని అప్పుడప్పుడు ఉద్యమ పిడికిళ్లు బిగిస్తున్నారు. కానీ ఎటొచ్చీ.. ఇప్పుడు ఉద్యమ ప్రస్థానంలో పిడికిలెత్తి బిగించి అన్యాయాన్ని.. రాజ్య దురహంకారాన్ని ప్రశ్నించగలిగే విద్యార్ధి మేథావులు కాస్త కరువయ్యారని కష్టంగానైనా చెప్పక తప్పని పరిస్థితి. క్యాంపస్ రిక్రూట్ మెంట్లు... కార్పోరేట్ కల్చర్ అభివృద్ధి చెందాక.. సమాజం గురించి.. దాని మనుగడ గురించి... ఆలోచించే తీరికా ఓపికా విద్యార్ధుల్లో తగ్గిందనే చెప్పాలి. ఆధునిక సమాజం నేర్పిన రకరకాల వ్యసనాల వల్ల కావచ్చు.. బ్రతుకుదెరువుకు బాండెడ్ లేబర్ గా మరిన వైనం కావచ్చు.. సలాం కొట్టే వాడికి వంగి సలాం కొట్టే వాడు పుడుతున్నాడు.. అందుకే ఇప్పుడొక జార్జిరెడ్డి కావాలి... ఉద్యమ కెరటాలను ఉప్పెనలా గుప్పించే ఉస్మానియాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.. కానీ దాన్ని ఒక్కతాటి పైకి తెచ్చి సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబెట్టే నికార్సయిన నాయకుల కరువయ్యారు. నలభై ఏళ్లయినా మర్చిపోని నాయకుడు జార్జిరెడ్డి.. కానీ తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్తానంలో ఉస్మానియా గుండెకాయగా నిలిచింది.. కానీ తొలిదశలో ఉన్న నాయకులు ఇప్పుడెలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక తప్పదు.. ఒక్క తెలంగాణ గురించే కాదు.. అవినీతి..నిర్లక్ష్యం... జవాబుదారీతనం లేని సమాజాన్ని మార్చేందుకు ఒక ఉద్యమ భావాలున్న మేథావి కావాలి.. జార్జిరెడ్డి చదువుకోకుండా... రాజకీయాల్లో తిరిగి నలుగుర్ని బాది విద్యార్ధి నాయకుడిగా చెలామణి అయిన వాడు కాదు.. నికార్సయిన మేథావి.. గోల్డ్ మెడలిస్టు.. ఇటు చరిత్రను సైన్సును, తత్వశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి.. వీటితో బాటు ప్రపంచ విప్లవ సాహిత్యాన్ని, గమనాన్ని మొత్తం విప్పి చెప్పగల మేథావి.. కానీ తన మేథావి తనాన్ని సమాజానికి కొంతైనా ఉపయోగించాలని తపన పడ్డ వ్యక్తి.. అయితే దురదృష్ట వశాత్తూ ఆయన హత్యగావింప బడిన తీరే తలుచుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇప్పుడు మేథావులు, లేరని కాదు.. కానీ వారి ఇంటెలెక్చువాలిటీ వారి అభివృద్ధికో లేక వారి కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది. సమాజం గురించి ఆలోచించేవారు అరుదయ్యారు.. ఆలోచించినా వారు మొదటి దశలోనే సమాజ తీరు.. వ్యక్తుల స్వార్ధ కుటిల తత్వాలను చూసి ఛీ అని వెనుతిరుగుతున్నారు. కానీ సమాజం పుట్టినప్పణ్ణుంచి ఇలాగే ఉందనే వాస్తవాన్ని గుర్తెరగలేకున్నారు. ఇప్పటి ఆధునిక వాతావరణమే కాదు.. నాటి పరిస్థితులు కూడా ఇంతే స్వార్ధపూరితంగా ఉన్నాయి. కానీ వాటిని కూడా ఛేదించి అర్ధం చేసుకొని జీవితాలను త్యాగం చేసిన విప్లవవీరులున్న జాతి మనది.. అందుకు ఇప్పుడు నిస్తేజంతో మునిగిపోయిన మన సమాజానికి ఒక జార్జిరెడ్డి కావాలి... విధ్యార్ధిలోకాన్ని ఆలోచింప జేసే ప్రవహించే ఉత్తేజం కావాలి.. చేగువేరా నుంచి జార్జిరెడ్డి స్ఫూర్తి పొందినట్టు... జార్జినుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
miru rasindi nijam kani ye maarpu ledu...agrakula durahankaaram perigipothune undidalithulu entha chaitanyamaina koddee...asamaanathalu peruguthunnai..ambedkar aalochanalu aashayaalu unnai kabatte desham lo dalithulu ee matramaina brathakagaluguthunnaru..miru rasina vishayaaniki "ambedkar kante" ani vaadavalasina avasaram ledu anpisthundi janardhan..
ReplyDeleteసరే మేడం ఒప్పుకుంటా.. నేను చెప్పింది ప్రస్తుత పరిస్థితుల గురించి.. ప్రస్తుతం సమాజంలో చాలా మంది అంబేడ్కర్‌లు ఉన్నారు. చట్టపరంగా దళితులకు రావాల్సిన నిధులు, హక్కులను రాబట్టగలుగుతున్నారు. కొంతైనా భయం ఉంది. దళితులు జోలికి పోవడానికి కాస్త జంకుతున్నారు. కానీ సమాజంలో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం,జవాబుదారీలేని తనం, వహ్.. ఒకటేమిటి.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చచ్చాక.. సీఎంలు పదవి దక్కిచ్చుకునేందుకు పాకులాడుతుంటే.. రాష్ట్రంలో పాలన కరువైంది.. అధికారులు డబ్బులు తీసుకొని కూడా పనిచేయకుండా తిప్పించుకుంటున్నారు. అందుకే ఒక జార్జిరెడ్డి కావాలన్నాను. దళితులు కూడా సమాజంలో భాగమే కదా.. వాళ్లలోంచే ఒక జార్జిరెడ్డి రావొచ్చు. పోరాడే పటిమ దళితులకు వారసత్వం..
ReplyDelete