ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, April 25, 2012

భారత్‌ పరువు తీసిన గణాంక సంస్థలు- అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది

మన్మోహన్ సర్కారు అసమర్ధ సర్కారని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. రాజకీయాలు మన్మోహన్ సింగ్ ను బలహీనుడిగా తయారు చేశాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రభ తగ్గింది. ఆర్ధికసంస్కరణల జోలికి పోకుండా ప్రజాకర్షక బడ్జెట్‌లతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఏజన్సీలు ఎద్దేవా చేశాయి. దీంతో ఆర్ధిక వృద్ధి కుంటుబడటమే కాకుండా దేశం పూర్తిగా వెనకబడుతోందని అభిప్రాయపడ్డాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే రేటింగ్ మరింత తగ్గిస్తామని ఏజన్సీలు హెచ్చరించాయి. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇంతగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం వెనుక మర్మం ఏంటి అనే విషయం పై ప్రత్యేక కథనం. దేశ ఆర్ధిక పరిస్థితి.. దానికి కారణా పై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు విశ్లేషణతో కూడిన హెచ్చరికలు చేశాయి. భారత ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోడానికి ఎంతో కాలం లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు బల్లగుద్ది చెప్పాయి. దీనికి కారణం మన్మోహన్ సర్కారేనని తేల్చాయి. ఆర్ధికాభివృద్ధి క్షీణించడానికి ప్రభుత్వ ఉదారవాద విధానాలు ఎలా దోహద పడ్డాయో విశ్లేషిస్తూ.. ఏజన్సీలు ప్రభుత్వ పనితీరును ఉతికారేశాయి. భారత ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నది మన్మోహన్ సర్కారేనని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ మూడీస్ కుండ బద్దలు కొట్టింది. ఈ కారణాల వల్లనే ఉత్తర ప్రదేశ్ లో ఘోరంగా విఫలమైందని విశ్లేషించింది. 1990 దశకంలో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు ఆర్ధిక సంస్కరణలకు పెద్ద పీఠ వేయడంతో జీడీపీ 8 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపింది. కానీ ప్రస్తుతం...అదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండి కూడా గాడి తప్పుతున్న ఆర్ధిక వ్యవస్థను దారిలో పెట్టలేక పోతున్నారని విమర్శించింది. 2012 అర్ధ సంవత్సరానికి గానూ జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోయినా ఆశ్యర్యం లేదని తెలిపాయి. దీనికి కారణం ప్రభుత్వ అసమర్ధత తప్ప మరోటి కాదని సంస్థలు విశ్లేషించాయి. కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపించగల నాయకుడే లేడని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎన్ని గంటలు కష్టపడ్డా ఫలితం శూన్యమైందని.. దీనికి కారణం మన్మోహన్ ప్రభుత్వ విధానాలేనన్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ ఎస్ అండ్ పీ కూడా మూడీస్ రేటింగ్ ఏజన్సీతో గొంతుకలిపింది. తాము రేటింగ్ తగ్గించడానికి కారణం ప్రభుత్వ విధానాలే అని తేల్చిచెప్పింది. ఇంకా మరో అడుగు ముందుకేసి 2012-13 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5.3శాతం నమోదు కావచ్చని బాంబు పేల్చింది. ఆర్ధిక సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వల్లనే తాము రేటింగ్ తగ్గించామని చెప్పుకొచ్చింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు అధిక ద్రవ్యలోటు, భారీ రుణ భారాలు గొడ్డలి పెట్టుగా మారాయని ఎస్ అండ్ పీ సంస్థ విశ్లేషించింది. రానున్న సాధారణ ఎన్నికల వరకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేనందున సంస్కరణలు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేకపోవచ్చని తెలిపారయి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేటింగ్ సంస్థలు కొన్ని సూచనలు చేశాయి. సబ్సిడీలను తగ్గించుకోవాలని, సేవా పన్ను అమలు చేయాలని సూచించింది. బ్యాంకింగ్, భీమా రంగాల్లో విదేశీ భాగస్వామ్యాన్ని పెంచగలిగితే ఫలితాలు మెరుగవుతాయని అభిప్రాయపడింది. మరోవైపు ఉదారవాద విధానాలు విడనాడకుంటే రానున్న రోజుల్లో రేటింగ్‌మరింత తగ్గిస్తామని హెచ్చరించాయి. ఏజన్సీలు రేటింగ్ తగ్గించడం పై ఇటు ప్రభుత్వం, అటు ప్రతి పక్షాలు స్పందించాయి. భారత రుణ రేటింగ్‌ను ప్రతికూలంగా మార్చడం సరైన సమయంలో వచ్చిన హెచ్చరికగా భావించాలని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీజీపీ మాత్రం దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవడానికి కారణం పాలనా పగ్గాలు, నిర్ణయాధికారం మన్మోహన్ సింగ్ చేతిలో లేకపోవడమే కారణమని విమర్శించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మదుపర్ల విశ్వాసాన్ని కోల్పోయి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాయి.

2 comments:

  1. అంతర్జాతీయ కుట్ర కాదు, మదుపర్ల నష్ట నివారణ చర్యలు
    మొదటగా
    ౧౨ శాతం service tax.
    ఇది మదుపర్ల డబ్బుకు చిల్లు.

    ఎందుకు అంటారా
    Service tax on Share transaction
    Service tax on the company services increased so the companies should decrease their profit in order to balance their good will which intern leads to further decrease of share holder profit.

    అయినా ఇది జనాకర్షక Budget ఎలా అయ్యింది? ఒక్క Moodies వాడిని చెప్పమనండి.

    ReplyDelete
  2. చాలా మంచి వివరణ ఇచ్చారు సార్.. ధన్యవాదాలు.. ఇది కూడా కుట్రేనేమో అని నా అభిప్రాయం..

    ReplyDelete