భార్యంటే కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యోషు మాతా అని వర్ణిస్తారు. ఏడడుగులు వేసిన రోజు నుంచి జీవితాంతం తోడు నీడగా నడిచిన భార్య తోడు బాసి పోతే ఆ శోకం తీరనిది. .. తన సహచరి రేపటి నుంచి కనిపించదన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుమిలి కుమిలి ఏడ్చే క్షణాలవి. కానీ ఈ విషాద క్షణాల్లో కదలని కట్టెలాగా పడి ఉన్న భార్యతో శృంగారాన్ని అనుమతించాలని ఈజిప్ట్ సర్కారు కొత్త చట్టం తెస్తోంది. ఈ చట్టం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సర్కారు ఇదేమీ పట్టించుకోకుండా కొత్త వివాదానికి తెరలేపింది.
ఈజిప్ట్ అంటేనే వింత ఆచారాలకు నిలయం.. పురాతన కాలం నుంచీ ఈజిప్టియన్ల ఆచారాలు, సంప్రదాయాలు ప్రపంచానికి భిన్నంగానూ, వింతగానూ ఉంటాయి. ఒక్కోసారి అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు ఆనవాలంగా కన్పిస్తే మరోసారి ఆటవిక జాతులు కూడా తలదించుకొనే అసభ్య ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. తాజాగా ఈజిప్ట్ సర్కారు రూపొందించిన చట్టం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది.
జీవితాంతం కష్టాల్లో... కన్నీళ్లలో తోడూ నీడగా నిలిచిన సహచరి అంతిమ సంస్కారానికి... ఈజిప్ట్ సర్కారు కొత్త సంప్రదాయం జత చేస్తోంది ... భార్య కాలం చెల్లాక కూడా ఆరు గంటల వరకు ఆమెను సంభోగ వస్తువుగా వాడుకునే హక్కును భర్తకు కల్పించేందుకు కొత్త చట్టం తెస్తోంది. వినడానికే కష్టంగా ఉన్నా ఇది వాస్తవం. భార్య చనిపోతే పుట్టెడు దు:ఖంతో ఉన్న భర్త శృంగారపుటాలోచనలు ఎలా చేస్తాడనే ఇంగితం లేకుండా ఈ ఆచారానికి తెరలేపుతోంది. పైగా ఈ చట్టానికి ఫేర్‌వెల్ ఇంటర్‌కోర్సు డ్రాఫ్ట్ లా అని పేరు పెట్టింది.
చనిపోయిన భర్తతో శృంగారంలో పాల్గొనే భార్యకు హక్కు ఉందంటూ మెరాకో మత పెద్ద జామ్ జామీ గతంలో వ్యాఖ్యానించారు. ఇది దుస్సాద్యమే అయినా అప్పట్లో దుమారం లేచింది. మొరాకో మతపెద్ద మాటలను ప్రామాణికంగా తీసుకొని ఈజిప్ట్ రాజకీయ నాయకులు శవసంపర్క చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ చట్టం పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాసమస్యలన్నీ గాలికి వదిలి అనైతిక చట్టాల పై దృష్టి సారించడం చూస్తే... ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పై ఉన్న విశ్వసనీయత ఏపాటిదని స్థానిక ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
change your blog settings.when ever open u's blog : this is adult blog: message from bloger.
ReplyDeleteha ha ha..ilaanti burra takkuva chattaalu muslim countries lo common sir.No need to surprise about their fatwas. you might have heard a lot in India.
ReplyDeleteరమేశ్ బాబు అలా ఎందుకొస్తుందో అర్ధం కావడం లేదు. దీనికి సెట్టింగ్స్ మారిస్తే బాగవుతుందనుకుంటే అలానే మార్చి చూస్తాను.
ReplyDelete