ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, April 6, 2012

మవోయిస్టులను రూపుమాపే ప్రభుత్వ తాజా వ్యూహం

దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని రూపు మాపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అవలంబించబోతోంది. నక్సలైట్ ఉద్యమాల్లో ఎక్కువ శాతం గిరిజనులులే ఉంటున్నారనే ఉద్ధేశ్యంతో వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికను రూపొందించింది. గిరిజనులు వామ పక్ష తీవ్రవాద ఉద్యమాల వైపు మొగ్గు చూపడానికి.. వారు ఆర్ధికంగా, సామాజికంగా వెనకబడటమే కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారి అవసరాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించి.... వారిని ఉద్యమాల వైపు మళ్లకుండా చూసేందుకు.. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా వీరిని ఎంపిక చేసి... శిక్షణ ఇచ్చి... వారికి గిరిజన గ్రామాల్లో చైతన్యం తెచ్చే బాధ్యతలు అప్పజెపుతారు. నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా పథకం కోట్లాది రూపాయల వ్యయంతో పీఎంఆర్‌ఎఫ్ గిరిజనుల వెనకబాటుతనం రూపుమాపే చర్యలు గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వం బహిరంగంగా ఒప్పుకోకున్నా.. తాము తీసుకునే చాలా నిర్ణయాల పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో నక్సలైట్ల ప్రభావం ఉంటోందని తెలస్తోంది. ఒక్కోసారి స్థానిక ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు . దీంతో దేశ వ్యాప్తంగా నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనికోసం రకరకాల ప్రయోగాలు చేసింది.. ఛత్తీస్‌ఘడ్ లో సల్వాజుడుం ప్రయోగం చూసి కాస్త ఫలించిందనుకొన్నారు. అదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజన బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల గిరిజనులకు ఉపాధి కలగడంతో బాటు.. గిరిజనులను గిరజనులు చంపుకోరని ప్రభుత్వం భావించింది... అయినా నక్సలైట్ ఉద్యమాల్లో గిరిజనులు పాల్గొంటూనే ఉన్నారు. మరోవైపు ఈ పన్నాగం వల్ల గిరిజనులను గిరజనుల చేతనే చంపిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంది.. అందుకే దీనికి భిన్నంగా... గిరిజనులను గిరిజనులే చైతన్యం చేసి... వారి అవసరాలను గుర్తించి నక్సలిజం వైపు మళ్లకుండా నిరోదించే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం ప్రధాన మంత్రి గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా నక్సలైట్ ప్రాభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు... యువకులను ఎంపిక చేసి వారికి నెలకు లక్ష రూపాలయల ఫెలోషిప్ ఇస్తారు. ఎంపికైన వారికి శిక్షణనిచ్చి... నక్సల్స్ ప్రభావం ఉన్న గ్రామాల్లో చైతన్యం తెచ్చే విధులు అప్పగిస్తారు. వీరు కలెక్టర్ల ఆధీనంలో పనిచేస్తూ... గిరిజన గ్రామ పరిస్థితులు, వారి సామాజిక, ఆర్ధిక పరిస్థితులను, అక్కడ చేపట్టాల్సిన పథకాలు, చర్యలు గురించి వివరాలు సేకరించడమే కాకుండా.. వారి సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించేందుకు కృషిచేస్తారు. ఈ నివేదికను ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్ కు అందిస్తారు. అయితే ఈ పీఎంఆర్ఎఫ్ ల నియామకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తారు. ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు, మాస్టర్ డిగ్రీ కలిగి ఉండి... 21 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. వీరికి హిందీ, ఇంగ్లీష్‌తో బాటు ఆయా ప్రాంతాల భాషలో పట్టుండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, బృంద చర్చ, ప్రణాళికా నివేదిక తయారీ వంటి పరీక్షలు నిర్వహించాక.. వీటన్నిటిలో ప్రతిభ కనబరిచిన వారిలో ర్యాంకును బట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం నియమించిన ప్రాంతాల్లోనే పనిచేయాలి. వీరికి నెలకు లక్ష రూపాయల ఫెలోషిప్ ఇస్తూ రెండు సంవత్సరాలకు ఒప్పంద నియామకం చేస్తారు . తరువాత వీరి సర్వీసులు నచ్చితే పొడిగిస్తారు. దేశంలో మొదటిసారి తొలిసారి హైదరబాద్‌లోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్‌లో గ్రామీణాభివృద్ధి విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమానికి తొలి వేదిక కాబోతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెగ్ సింగ్ అహ్లూవాలియా, కేంద్ర గిరిజనాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు. పీఎంఆర్ఎఫ్ కోసం మొత్తం 850 మంది దరఖాస్తు చేసుకుంటే.. పలు దఫాల పరీక్షల అనంతరం 150 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్ధులకు ఈ కార్యక్రమంలో నియామక పత్రాలను అందిస్తారు. పీఎంఆర్ఎఫ్ కు ఎంపికైన అభ్యర్ధులకు టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ శిక్షణ ఇస్తుంది. వీరు దేశవ్యాప్తంగా ఉన్న 60 వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వం రూపొందిచిన కార్యక్రమాలు అమలు చేస్తారు. మొత్తం 9 రాష్ట్రాల్లో 60 జిల్లాల్లో నియమిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. బీహార్ లో 7 జిల్లాల్లో, ఛత్తీస్‌ఘడ్ లో 10 జిల్లాల్లో, జార్ఖండ్‌లో 14 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 8 జిల్లాల్లో, మహారాష్ట్రలో రెండు జిల్లాల్లో, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో జిల్లాలో వీరిని నియమిస్తారు. వీరు ప్రభుత్వ విధుల్లో భాగంగా సంక్షేమ పథకాలు గిరిజనులకు, వెనకబడిని వారికి అందేలా చూసి.. వారికి విద్యావైద్యంతో బాటు మౌళిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలి. నక్సలైట్ ఉద్యమాల వైపు వెళ్లకుండా చైతన్యం తీసుకురావాలి. తొలుత ఈ తొమ్మిది రాష్ట్రాల్లో విజయవంతం విజయవంతమైతే ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తారు.

No comments:

Post a Comment