Tuesday, April 10, 2012
ఉత్తర కొరియా యుద్ధోన్మాదం... కొరియా తలకొరివి... మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది
ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని తూర్పు ఆసియా దేశాలతో బాటు అమెరికా కూడా మండిపడుతోంది. ఉత్తర కొరియా చేసే ఈ ప్రయోగం.. అంతర్జాతీయ భద్రతా మండలి ఒప్పందాలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని అభిప్రాయ పడింది. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ సంగ్ వందో జయంతి సందర్భంగా ఈ రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే ఉత్తర కొరియా ప్రయోగించే రాకెట్ నిబంధనలకు విరుద్దంగా ఉందని దాన్ని కూల్చడానికి కూడా వెనకాడేది లేదని జపాన్ గతంలోనే హెచ్చరించింది. ఉత్తర కొరియా మాత్రం తమ ప్రయోగం శాంతియుత ప్రయోజనాలకే నని చెబుతోంది
ఉత్తర కొరియా గురువారం చేయబోయే రాకెట్ ప్రయోగానికి ప్రపంచ దేశాల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొరుగు దేశాలను రెచ్చగొట్టే ప్రయోగాలుగానీ... భద్రతకు ముప్పు తెచ్చే ప్రయోగాలు చేయబోమని భద్రతా మండలికి హామీ ఇచ్చినట్టే ఇచ్చి... ఆ హామీ తుంగలో తొక్కి రాకెట్ ప్రయోగానికి సిద్ధపడుతోందని అమెరికా మండిపడుతోంది. తాజాగా రాకెట్ ప్రయోగానికి సంబంధించిన యానిమేషన్ వీడియోను కూడా ఉత్తర కొరియా విడుదల చేయడంతో.. రాకెట్ ప్రయోగం ఖరారైనట్టు తెలుది. ఈ ప్రయోగానికి ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిం సంగ్ వందో జయంతి సందర్భంగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రయోగం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని... ఎవరినీ ఇబ్బంది పెట్టబోమని చెబుతోంది.
అయితే దక్షిణ కొరియా.. ఇతర పొరుగు దేశాలు మాత్రం.. ఉత్తర కొరియా ప్రయోగా మాటున అణు ప్రయోగాలున్నాయని ఆరోపిస్తున్నాయి. భూ గర్భంలో అణు ప్రయోగాలు చేస్తుందని.. మిస్సైల్ ప్రయోగాలకు సిద్ధపడటంలో బాగంగానే ఈ రాకెట్ ప్రయోగమని చెబుతున్నాయి. ఉత్తర కొరియా చర్యల పై భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఉత్తర కొరియా గతంలో యుద్దోన్మాదాన్ని వీడతామని, ఆహార పదార్థాల తరలింపులో సాయం చేయాలని యుఎన్‌ఓను కోరింది. ఈ మాటలను నమ్మిన యుఎన్‌ఓ అమెరికాతో 240 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలను సరఫరా చేయించింది. ఆహార పదార్థాల అవసరం తీరగానే ఉత్తర కొరియా యుద్దానికి సిద్ధమవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.... అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగానే వ్యవహరిస్తామంటూ అమెరికాతో చర్చలు కొనసాగుతాయని నమ్మబలుకుతోంది.
1998లో తొలిసారి ఉప గ్రహాన్ని తీసుకెళ్లే రాకెట్‌ను పంపినప్పటికీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. 2006లో మరోసారి ఇలాంటి ప్రయోగమే చేసి చేతులు కాల్చుకుంది. 2009 ఏప్రిల్ 5న ముచ్చటగా మూడోసారి ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు యత్నించింది. మళ్లీ షరామామూలే. ఆ ప్రయోగం కూడా విఫమైంది. మూడుసార్లు చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఉత్తర కొరియా మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు దాదాపు పూర్తి చేసింది. ఈనెల 12 తేదీ ఉపగ్రహ ప్రయోగానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఈ ప్రయోగ సమయానికి ప్రపంచ దేశాల స్పందనలు.. ప్రయోగం తరువాత జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయోనని ప్రపంచ దేశాలు నిఘా నేత్రాలతో చూస్తున్నాయి.
విజువల్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment