Saturday, April 14, 2012
నైజీరియాలో పుడితే ఎయిడ్స్ తప్పదా..?
దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విజృంబిస్తోంది. మొత్తం జనాభానే తుడిచేస్తుందా అనేంతటి భయంకర గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నైజీరియా అత్యున్నత అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా పుట్టిన శిశువుల్లో సుమారు 70 వేల మందికి హెచ్ఐవీ సోకినట్టు తేలింది. వీరితో బాటు అనేక మంది గర్భిణిలకు హెచ్ఐవీకి సంకేతంగా క్షయ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలిపారు.
ఆఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుందనేది ఎప్పటి నుంచో వింటున్న విషయమే... కానీ తాజా అధ్యయనాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నైజీరియా ఉన్నతాధికారులు వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో సుమారు 70 వేల మంది శిశువులకు పైగా హెచ్ఐవీతో జన్మించారని అధికారులు చెబుతున్నారు. దీంతో బాటు గర్బిణీల్లో చాలా మంది క్షయ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది.
అయితే క్షయ వ్యాధి హెచ్ఐవీకి సూచకంగా చెబుతారు. గర్భిణీలకు ఎక్కువ మందికి క్షయ ఉండటం హెచ్ఐవీకి సూచకంగానే భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... రానున్న పది, ఇరవై ఏళ్లలో ఆఫ్రికాలో హెచ్ఐవీ మరణాలు ఎక్కువ సంఖ‌్యలో ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. స్టేట్ యాక్షన్ కమిటీ ఆన్ ఎయిడ్స్ సంస్థ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తోంది. నైజీరియా ప్రజలను చైతన్యం చేయడంలో వివిధ రకాల సంస్థలు కలిసి పనిచేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ‌్యంగా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఇంజక్షన్లు ఇప్పించడంలో చొరవ చూపాలని చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment