Wednesday, February 8, 2012
సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నే కానుకగా ఇస్తారెందుకు ?
బంగారు బెల్లం
కొండ ప్రజల కొంగు బంగారం... గిరిజన ప్రజల కులదైవం.. సమ్మక్క సారలమ్మలు.. పేరుకైతే పెద్ద జాతర... కానీ ఆ తల్లుల కరుణ పొందాలంటే ఏ వెండి బంగారాలు సమర్పించనక్కర్లేదు.. పిరెంతో పిడికెడు బెల్లం పెడితే సంతోషిస్తారు. జాతరలో ఈ బెల్లాన్నే భక్తులు బంగారంగా పిలుచుకుంటారు. అసలు సమ్మక్క సారక్క జాతరలో బంగారాన్నే ఎందుకు కానుకగా సమర్పిస్తారు..
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం.. గిరిజనుల పాలిట కొంగుబంగారం సమ్మక్క సారలమ్మలు.. అడవి పుత్రులకు అండగా నిలబడి నెత్తురోడి పోరాడి.. ఆ నెత్తుటి మడుగులో కుంకుమ భరిణలై వెలిసిన అడవి తల్లులు సమ్మక్క సారలమ్మలు. చిలకల గుట్ట పై వెలిసిన రోజు నుంచి ఈ తల్లులను గిరిజనులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా మేడారం ప్రాంతం ప్రజలు సమ్మక్కలకే మొక్కుకునే వారు. అయితే ఈ తల్లులకు బంగారాన్నే ఎందుకు సమర్పిస్తారనే విషయం పై ఒక కథ ప్రచారంలో ఉంది. గిరిజనులు చెప్పే ఆ కథ ప్రకారం... ఒకరోజు ఒకగిరిజనుడికి ఒక ఆపద వచ్చింది. ఆ ఆపద గట్టెక్కితే తల్లికి తగిన కానుకలు ఇస్తానని మొక్కుకున్నాడు. కొద్దికాలానికే ఆ గిరిజనుడి కోరిక నెరవేరింది. ఆపద గట్టెక్కింది. అయితే ఆ తల్లులకు తగిన కానుకలైతే ఇస్తానన్నాడు కానీ ఏ కానుకలు ఇవ్వాలో అతనికి అర్ధం కాలేదు. వెండి బంగారు తొడుగులు చేయించేంతటి ధనికుడు కాదు. అదే విషయాన్ని ఆ తల్లులకు మొర పెట్టుకున్నాడు. తన కోరిక తీర్చినందుకు ఆ తల్లులకు రుణపడి ఉన్నానని.. అయితే వెండి బంగారు నగలు చేయించేంతటి ధనికుణ్ని కానని.. కానుకలు ఏం చెల్లించాలో మీరే చెప్పాలని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ భక్తుడి కలలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మలు.. తమకు వెండి బంగారాలేమీ వద్దని, గిరిజనులకు ఇష్టమైన బెల్లమే బంగారమని చెప్పారు. బంగారు రంగును కలిగిఉన్న బెల్లాన్ని కానుకగా చెల్లిస్తే... తమకు అది బంగారంతో సమానం అని చెప్పారట. కలలో జరిగిన ఈ విషయాన్ని అతడు తమ కులపెద్దలకు చెప్పాడు. బెల్లమే కదా అని.. తననిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించాడు. దీంతో అప్పటినుంచి భక్తులు తమ బరువుతో బెల్లాన్ని తులాభారంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
bavundi, kani pai photo lo chooste, bangaranni plastic bag lo vesi padestunnaru. The authorities should do something. bellanni e polluting materials lekunda veste tirigi danni upayoginchavachu e manchi panikaina.
ReplyDelete