ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, February 4, 2012

అతడే ఓ సైన్యం - ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన సుభ్రమణ్యస్వామి




ఆయన ఓ సైన్యం... ఓ యాంటీ కరెప్టన్ మూవ్‌మెంట్... సమాజాన్ని అల్లుకుపోయిన అవినీతి ఉక్కు చెదలును దులిపే అగ్ని కీల.. ప్రభుత్వ వ్యవహారాల్లో దాగిన అక్రమాలనుని వేరు చేసి వేలెత్తి చూపిన హంసధ్వని.. యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు మళ్లించుకొని ప్రభుత్వానికి ముచ్చెటమటలు పట్టించిన వన్ అండో ఓన్లీ వన్ మ్యాన్.. ఒకే ఒక్కడు.. డాక్డర్ సుభ్రమహణ‌్య స్వామి..
అవును.. ఆయన పార్టీ మారడు.. పంథా మార్చడు.. ఒకే నినాదం.. పట్టిన పట్టు విడువని పట్టు వదలని విక్రమార్కుడు.. తన దృష్టికి వస్తే మంత్రయినా... ప్రధాన మంత్రయినా... నిజాన్ని నిగ్గుతేల్చేదాకా వదిలిపెట్టడు.. తన ఆశయ సాధనకు... ఆయన ఏ ఉద్యమాన్నీ చేయడు.. ఏ ర్యాలీలు తీయడు.. కానీ దేశాన్ని తొలుస్తున్న అవినీతి వేరు పురుగును ప్రపంచం ముందు ఆవిష్కరించాడు. అప్పడు ఆయనకు తెలియకుండానే.. ఆయన అడక్కుండానే అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సైన్యం అయ్యారు. దేశాన్నే ఊపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం తీగలాడి.. అవినీతి డొంక కదిలించిన డాక్టర్ సుభ్రమణ్య స్వామి పై ప్రత్యేక కథనం
డాక్టర్ సుభ్రమణ్యస్వామి.. ఇప్పుడు ఈ పేరు చెబితే అవినీతి పరుల గుండె లిప్త కాలం పాటు చిన్న వణుకు పుట్టడం ఖాయం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తొలి అడుగు నుంచి నేటి వరకు అదే ప్రస్థానం.. ప్రతి అడుగులోనూ ఎన్నో మలుపులు... ధైర్యం వీడింది లేదు. .అత్మ విశ్వాసం సడలింది లేదు... ఆయనకు వీరు వారు అనే తేడా లేదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు... ప్రపంచం ముందు నిల్చోబెడతాడు.. న్యాయం జరిగే వరకు కడదాకా పోరాడుతాడు. అందుకే సుభ్రమణ్య స్వామి పోరాట పటిమకు మారుపేరుగా నిలిచాడు..
అవినీతి పై అలుపెరగని పోరాటమంటే గత దశాబ్ద కాలం నుంచీ అర్ధం మారింది. అక్రమాలను ఎదిరించాలంటే ఒక సైన్యం కావాలి. యువత సాయం కావాలి. నినాదాలు, ర్యాలీలు, సత్యాగ్రహాలు, మీడియా కవరేజి, ఇంకా.. ఇంకా.. కావాలి.. నాలుగు రోజుల హడావుడి తరువాత.. అవినీతిని అంతమొందిస్తామని ప్రగల్భాలు పలికినవారే అదే ఊబిలో చిక్కుకొని విలవిల్లాడి వెనకడుగు వేయడం చూస్తున్నాం.. కానీ సుబ్రమణ్యానికి ఇవేవి తెలియవు. తనకు తానే సైన్యం.. తన దృష్టికి అవినీతి జరిగిందనే విషయం వస్తే దాన్ని ఆపరేషన్ చేసి తీరాల్సిందే. గతంలో అవినీతి పై ఎన్నో సార్లు సుబ్రమణ్యం పోరాడిన సందార్భాలు అనేకం.. అన్నిటికంటే 2జీ స్పెక్ట్రం కుంభకోణం సుబ్రమణ్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపింది. మొక్కవోని ధైర్యానికి, పట్టువదలని పట్టదలకు రాజకీయలోకం బిత్తరపోయింది. సుబ్రమణ్యస్వామి ఇలా కావడానికి వెనుక ఆయన నడిచొచ్చిన దారే కారణం. ఇంతకీ సుబ్రమణ‌్య స్వామి నేపధ్యం ఏంటి.. ఎవరీ సుబ్రమణ్యస్వామి..
జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో సాగిన రాజకీయేతర సర్వోదయ ఉద్యమంలో పాలుపంచుకున్న అనుభవం ఉంది. 1990 నుంచి జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుడా ప్రణాళికా సంఘం కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆర్ధిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీలోనే కొనసాగుతున్నారు. సామాజిక రుగ్మతల పై పోరాడుతూనే పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసేవారు. కొన్ని వ్యాపాలు వివాదాలు కూడా రేపాయి. అవినీతి కుంభకోణాల పై ప్రధానంగా దృష్టి సారించిన సుబ్రమణ్యస్వామికి బాగా ఖ్యాతి తెచ్చింది మాత్రం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమే.
2జీ లైసెన్సుల మంజూరులో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికి తీయడానికి 2008 నవంబర్ నుంచి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి కేంద్ర మంత్రి రాజాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన తొలి లేఖ 2008 నవంబర్ 29న రాశారు. వరుసగా ఐదు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో స్వామి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఈ కేసు వివరాలను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగి, అక్రమాల డొంకను బయటకు లాగింది. 2జీ స్పెక్ట్రమ్ తిరిగి వేలాన్ని వేసే విషయంలో కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ ప్రమేయం లేకుండా చూడమని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2జీ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ములో 18 వేల కోట్లు సోనియా గాంధీ సోదరీమణులు ఇద్దరికి చేరాయని స్వామి ఆరోపించారు. సోనియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించవలసిందిగా గత ఏడాది ఏప్రిల్ 15న ప్రధానికి స్వామి 206 పేజీల లేఖ రాశారు. 1972 నుంచే సోనియాకు అనేక అవినీతి కార్యకలాపాలతో ప్రమేయం ఉందని ఆ లేఖలో ఆరోపించారు. హోం మంత్రి చిదంబరంను ప్రాసిక్యూట్ చేయమని కోరుతూ కోర్టుకు అనేక పత్రాలను అందజేశారు.
ఒకసామాన్య పౌరుడిగా మత్రమే తాను ఇలా స్పందించానని... ప్రభుత్వాన్ని కదిలించే యంత్రాంగమేదీ తన చేతుల్లో లేదని స్వామి వ్యాఖ్యానించడం వెనుక ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరితే 3 నెలల్లోగా ప్రభుత్వం స్పందించాలని కోర్టు వ్యాఖ్యానించడం సామాన్య పౌరుడికి స్వామి సాధించి పెట్టిన విజయమే.

3 comments: