ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, February 7, 2012

మాల్దీవుల మాటున..? ఏంజరుగుతోంది



సముద్రంలో చిన్న బిందువుగా ఉన్న మాల్దీవులు ఇప్పుడు వివాస్పద రాజకీయానికి కేంద్ర బిందువుగా మారాయి. దశాబ్దాలుగా పాలిస్తున్న అధ్యక్షుడు నషీద్ ప్రజాభీష్టం మేరకు రాజీనామా చేశాడు. ఉపాధ్యక్షుడు వాహిద్ హసన్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు. ఇంతకీ మహా సముద్రంలో కన్నీటి బిందువు పరిమాణంలో ఉండే మాల్డీవులకొచ్చిన కష్టం ఏంటి. ప్రజలు అధ్యక్షుడి పై తిరగుబాటు చేసేంత కష్టం ఏమొచ్చింది.
మాల్దీవులు.. ఈ పేరు ప్రకృతి అందాలకు మారు పేరు.. ఒక్కసారి మాల్డీవుల్లో అడుగు పెడితే మళ్లీ తిరిగి రావాలనిపించదు.. క్రిస్టల్ క్లియర్ గా కనిపించే సముద్రపునీరు.. నీటి జాడల్లో నిర్మించిన రెస్టారెంట్లు... తేమ తెమ్మెరలు కలిగిన పిల్లగాలి... ఎటు చూసినా నీలాకాశం... నింగిలోని చుక్కలు... జడలు విప్పుకొని ఊగే కొబ్బరి చెట్లు... సముద్ర తీరంలో చక్కిలిగింతలు పెట్టే ఇసుక తిన్నెలు.. ఎంత చూసినా తనితీరని అందం మాల్దీవులది.. కానీ ఈ మాల్డీవుల మాటున ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగిసి పడింది. ఈ చిన్న పగడపు రాజ్యంలో ప్రజలు రాజుకు ఎదురు తిరగారు. ఇక మిమ్మల్ని భరించలేం దిగిపోవాల్సిందేనని రోడ్డుకెక్కారు. విధిలేని పరిస్థితుల్లో అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ సుందర దీవులకు అతి ప్రాచీన చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం శ్రీలంక యువరాజు సముద్రంలో కొత్త పెళ్లి కూతురితో సహా విహారానికి వెళ్లి సముద్రంలో చిక్కుకొని మాల్దీవులకు చేరుకున్నాడు. అక్కడి వారితో తన రాజ్యం ఏర్పరచుకొన్నాడు. మాల్దీవులకు మొదటి సుల్తాన్ అతడే అని చెప్పుకుంటారు. ఈ దీవి భారతదేశానికి దగ్గరగా ఉంది. ఇటు అరేబియా, హిందూ మహా సముద్రాలకు సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇరు ప్రాంతాల నావికుల ప్రభావం ఈ దీవి పై ఉంది. అంతే కాదు ఈ దీవి చిన్నగా ఉండటం చేత తరుచూ సముద్రపు దొంగలు పడి దోచుకుంటారు. ఒక్కోసారి మొత్తం ప్రాంతాన్నే ఆక్రమించి ప్రజలను భయకంపితులను చేస్తారు. 16 శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ దీవిని ఆక్రమించి 15 సంవత్సరాలు పాలించారు. తరువాత స్వతంత్ర మహ్మదీయ రాజ్యంగా అవతరించింది. 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాత 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. నవంబరు 11,1968 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది.
చాలా కాలం మల్డీవుల్లో ప్రశాంతంగానే గడిచింది.. ఇక్కడ పర్యాటకం, మత్యపరిశ్రమ, కుటీర పరిశ్రమతోనే జీవనం గడుపుతారు. మొత్తం జనాభా మూడున్నర లక్షలు మాత్రమే.. అయినా ఈ దీవులను పాలించే అధ్యక్షుడు ఒకరు కావాలి. అందుకే మొదటిసారి..మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ను 1978లో మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్ర నుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి. తరనంతర పరిణామలలో మహ్మద్ అన్నా నషీద్ దీనికి అధ్యక్షుడు గా పీఠమెక్కారు. ఇతని వ్యవహారి శైలి నచ్చని ప్రజలు మళ్లీ తిరుగబాటు చేయడంతో తన పదవికి రాజీనామా చేశాడు.
ఇంత చేసీ ఈ దీవి ఎంతకాలం మనుగడ సాగిస్తుదో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. డిసెంబరు 26, 2004లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఈ దీవి ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ దేశ ప్రభుత్వం ఆందోలన చెందుతుంది. సముద్ర మట్టానికి కేవలం రెండున్నర మీటర్ల ఎత్తులో ఉండే ఈ దీవిలో ఎన్నో వింతలు విశేషాలు, ప్రకృతి సోయగాలు.. వీటన్నిటినీ సముద్రగర్భంలో ముంచాలంటే ఈ దీవి ప్రజల మనసు మనసులో ఉండదు. కానీ అది శతాబ్దాల తరువాత మాట అనుకున్నారు. తరచుగా వచ్చే సునామీలు. ఏదో ఒకరోజు మాల్దీవులను ముచేస్తాయన్న భయం మాత్రం వారిని నిత్యం వేదిస్తూ ఉంది.

4 comments:

  1. mee topic ki mee titles ki sambandam undaTam leadu.. kevalam Title viewers ni aakarshinchadaanike annattundi..

    ReplyDelete
  2. Due to global warming, Maldives will go underwater in next 75-100 years. The average height above the sea level for this country is only a few inches.

    ReplyDelete
  3. Hi Mr Janardhan, Your blogging spirit is excellent. Please visit my blog www.poolabala.blogspot.com Also visit my website www.eazyforeignlanguages.com
    post your comments if possible. thank you.

    ReplyDelete