ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, February 8, 2012

రాజకీయాల రంగు మారుస్తున్న రమణ... ఇంతకీ ఎవరీ రమణ ?



లిక్కర్ సిండికేట్ రమణ.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను, అధికారులను కలిపి పీటముడి వేసి అవినీతి రంగు పులిమిన లిక్కర్ కింగ్. రమణ ఏసీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్ కు ఇటు రాజకీయ నాయకులు అటు అధికారులు కూడా భూజాలు తడుముకుంటున్నారు. నేరం మాది కాదంటున్నారు. ఆ మాటకొస్తే రమణే పెద్ద నేరగాడని ఎదురు దాడికి దిగుతున్నారు. అధికారులనూ, రాజకీయ నాయకులనూ ముప్పు తిప్పలు పెట్టి అవినీతి నీళ్లు తాగిస్తున్న ఒక సామాన్యడు లిక్కర్ డాన్ గా ఎలా మారాడు.. ఈ రమణ ఎవరు ?
లిక్కర్ కింగ్ రమణ.. ఈ పేరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినిపిస్తోంది.. ఇది నాలుగైదేళ్లుగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో తరుచూ వినపడే పేరే... రమణ స్వగ్రామం వరంగల్ జిల్లా, డోర్నకల్ మండలం గొల్లగూడెం . రైల్వే కానిస్టేబుల్ గా జీవితాన్న మొదలు పెట్టి, ఉద్యోగంలో పస లేదని గ్రహించి.. కిక్కిచ్చే గంజాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. రైల్వే కానిస్టేబుల్ గా కెరీర్ మొదలు పెట్టిన రమణకు... రైల్‌లో గంజాయి వ్యాపారులతో పరిచయం ఏర్పడింది. వారి వద్ద ముడుపులు పుచ్చుకొని చూసీ చూడనట్టు వదిలేశాడని ఉన్నతాధికారులు రమణను సస్పెండ్ చేశారు. తర్వాత అతను పాత పరిచయాలతో బంధువు సాయంతో గంజాయి వ్యాపారంలోకి దిగి కోట్లు గడించాడు. ఆ తర్వాత రమణ చూపు మద్యం వ్యాపారం వైపు మళ్ళింది.. తాను గంజాయి వ్యాపారం చేసేటప్పుడే ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో నేర్చుకున్నాడు. అధికారులను హోదాలకు అతీతంగా, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ విద్యతోనే మద్యం వ్యాపారంలోకి దిగి సిండికేట్ గా మారాడు. రెండు జిల్లాల్లో రమణ ఆడింది ఆట... పాడింది పాట.. ఏ వైన్ షాపు ముందయినా.. బార్ షాపు ముందయినా.. ఏ కస్టమరూ - నోరు తెరవడానికి వీల్లేదు.. ఒకవేళ నంబర్ ఉందికదాని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించారో.. ఆ నంబరు ప్రస్తుతం స్పందించుటలేదు అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే రమణ రాజకీయ నాయకులకు, అధికారులకు వీఐపీగా మారిపోయాడు. తాను సస్పెండయిన కానిస్టేబుల్ కాబట్టి, మద్యం షాపు అనుమతులు ఏవీ తన పేరుమీద ఉండవు. తనకు నమ్మిన బంట్లైన గిరిజనుల పేరుతో లైసెన్సులు తీసుకొని రసవత్తరమైన కథ నడిపించేవాడు. ఏ రాజకీయ నాయకుడి, అధికారి ఇంట్లో కార్యం జరిగా రమణ రాక కోసం చూస్తారని ప్రచారంలో ఉంది. ఎందుకంటే రమణది కాస్త పెద్ద చేయేనట. ఆయన సమర్పించుకునే నజరానాలు ఆ ఫంక్షన్‌కయ్యే ఖర్చులో సగం ఉంటాయని చెప్పుకుంటారు. తాజాగా ఏసీబీ దాడుల్లో ఖమ్మంలో దొరికిన ఆధారాలను బట్టి రమణను ప్రశ్నిస్తే తన వద్ద ఉన్న చాంతాడంత లిస్టు విప్పాడు. ఆ లిస్టులో ఉన్న కొందరు పెద్దలు ముడుపులు పుచ్చుకుంది వాస్తవమే నంటే, మరి కొందరు మాత్రం రమణా.. అతను ఎలా ఉంటాడనే సమాధానం వచ్చింది. ఇంతకీ రమణ అన్ని పేర్లు చెప్పాడా... రమణ కొన్ని పేర్లు బయటపెట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్నదానికీ డబ్బులడిగే పోలీసుల పేర్లు బయటకు రాకపోవడం ఇందుకు కారణం.. రమణ మీద అక్షరాలా 18 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. కానిస్టేబుల్ గా సస్పెండయిన ఇతను రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద అధికారులనే వలలో వేసుకోవడమే కాదు. ఏసీబీ చేతిలో పెట్టాడు.

No comments:

Post a Comment