ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, January 31, 2012

విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది


అంబేడ్కర్ విగ్రహం కూలింది.. తల తెగి కాలువలో పడ్డది... రాజ్యాంగ స్ఫూర్తి ప్రధాత మురికి కాలువలో మునకేశాడు.. అంబేడ్కర్ కేవలం దళితుల సొత్తేనన్నట్టు దళితులంతా గుండెలు బాదుకున్నారు. ఆ ఘోషలో మిగతా జనం పడే బాధ కనిపించలేదు. భారతదేశానికంతటికీ పూజ్యనీయుడైన అంబేడ్కర్ ఏ కులానికీ మతానికీ, ప్రాంతానికీ చెందిన వాడు కాదని ఇప్పటి వరకు చదువుకున్నాము.. అలా పక్షపాత రహిత వ్యక్తి, మేథావి, కాబట్టే ఆయనకు దేశ న్యాయవ్యవస్థనే నిర్ధేశించే బృహత్తర బాధ్యత అప్పజెప్పారు. ఆయన కూడా దళితులు తన జాతి వారు అని కాకుండా... దేశంలో ఒక వర్గం వారు ఎలా అణిచివేతకు గురవుతున్నారో స్వతహాగా తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఏ చట్టాలు చేస్తే.. అణచబడే వారు ఎదుగుతారో అధ్యయనం చేసి.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రచన చేశారు. సో.. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన అంబేడ్కర్ అభినందనీయుడే.. కానీ ఆ రాజ్యాంగాన్ని అక్షరం దిద్దకుండా చేసిన చట్టాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభ కూడా దళితులకు పూజ్యనీయమైనదే.. ఆ మాట కొస్తే అంబేడ్కర్ ఆ పదవిలో లేకున్నా న్యాయం జరగదని మాత్రం ఊహించలేం.. సరే ఇది పక్కన పెడితే.. ఇన్నాళ్లకు అంబేడ్కర్ విగ్రహం పై తాగుబోతులకు ఎందుకు కోపం వచ్చింది. దీనికి చాలా కారణాలుండొచ్చు.. దాని వెనక విపరీతమైన కుట్రలూ దాగి ఉండొచ్చు. కారణాలు చెబితే.. చదువరులలో ఒక వర్గానికి కోపం రావచ్చు. కానీ కారణాలు పక్కన బెట్టి కుట్రల గురించి నాకు తెలిసింది.. నాలుగు ముక్కలు పంచుకుంటాను.
అంబేడ్కర్ దళితులను ఎవరూ కించపరచరాదని చట్టం తెచ్చింది. ఆ పునాదులతోనే ఎస్సీ, ఎస్టీ ‍యాక్ట్ రూపుదిద్దుకుంది. ఆ యాక్ట్ నేడు ఎవరెవరికి ఉపయోగపడుతుందో ఇప్పడు పెద్దగా చెప్పాల్సిన అవరసం లేదు. బ్లాక్ మెయిల్ చేసే వారికి ఇది బంగారు బాతుగా మారిందని అనడంలో అతిశయోక్తి లేదు. గల్లీ లీడర్, పోలీస్ దగ్గర్నుంచి డీఎస్పీ స్థాయి వ్యక్తుల వరకు ఈ చట్టాన్ని ఎలా చట్టుబండలు చేసి దండుకుంటున్నారో తెలియంది కాదు. పాపం నిజంగా అణిచివేయబడే వారికి ఈ చట్టం అందని ద్రాక్షే. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష పేరుతో తిడుతున్నా.. వారికి ఈ చట్టం వర్తించదు. సరే ఈ విషయాలను పక్కన బెట్టి ఇప్పుడు విగ్రహాల పై ఆగ్రహం దగ్గరకు వస్తాను. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాన్ని కుక్కలు చింపిన విస్తరిలా.. రాష్ట్రంలో పరిపాలనా క్రమశిక్షణను డాంబర్ రోడ్డు పై వేసిన సీసం గోళీల్లా తయారు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పుట్టకొక్కుల కంటే ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఈ విగ్రహాలకు డబ్బులెవరిచ్చి పెట్టిస్తున్నారో.. తెలియంది కాదు... సాక్షి వీక్షకులకు ఇది కంఠోపాఠం. డబ్బున్న వాడు వందల విగ్రహాలు పెట్టిస్తాడు. పెట్టవద్దు అనడానికి అవకాశమే లేదు. అధికారంలో ఉన్న మాయావతే దీనికి నిదర్శనం. అధికారంలో లేకున్నా విగ్రహాలతో పునాదులు గట్టిగా వేసుకోవడం జగన్ కే సాధ్యం. సో ప్రత్యర్ధులు ఈ విగ్రహాలు వెలవకుండా సర్వశక్తులు ఒడ్డారు. వీటిని నియంత్రించడానికి ప్రత్యేక చట్టమంటూ లేక పోవడం తెలిసి నాలిక్కరుచుకున్నారు. కానీ ఏదో ఒక చట్టం కావాలి. దానికి సందర్భం కావాలి. ఆ చట్టమే కాలికి తగిలిందిప్పుడు. యస్... అంబేడ్కర్ విగ్రహాలను ఎవరు.. ఎందుకు కూల్చారో అన్న విషయం పక్కన పెట్టినా.. ఆ తరువాత వ్యూహాత్మకంగా మోహన రంగా, ఎన్జీ రంగాల విగ్రహాలు రంగులు వెలిశాయి. వాళ్ల పేర్లు మళ్లీ వార్తల కెక్కాయి. తరువాత ఎన్జీఆర్ విగ్రహాలు కూడా కంపించాయి. ఇప్పుడు ఎవరి వంతు..? దివంగత మహానేత.. ప్రియతమ నాయకుడు.. అని నిత్యం జగన్ జపం చేసే వైయస్ విగ్రహాల వంతనేది ఎవరిని అడిగినా చెబుతారు. ఎవర్నీ తప్పు బట్టడానికి వీలుండదు. ఈ తప్పులను విచారించాలన్నా.. విగ్రహాలను నియంత్రించాలన్నా.. ఈ గొడవలను అడ్డు కట్ట వేయాలనే సాకుతో చట్టం తీసుకువచ్చే అవకాశం ప్రభుత్వానికి దొరుకుతుంది. దీంతో 2014 వరకు విగ్రహాల ప్రతిష్టాపనను నియంత్రించవచ్చు. అంటే అంబేడ్కర్ విగ్రహాలను కూల్చేస్తే... దళితులకు ఆగ్రహం వస్తుంది... రంగాల విగ్రహాలను కూల్చేస్తే రెండు వర్గాల మధ్య పోరు ముదురుతుంది... అదే సందర్భంలో వైయస్సార్ విగ్రహాల జోలికి వెళ్లొచ్చు. ఇదే వ్యూహం.. సో.. తుఫాను వెలిసినట్టు కనిపించినా.. మళ్లీ త్వరలో వైయస్ విగ్రహం పై చేయి వేసి పైచేయి సాధించాలని ప్రత్యర్ధులు బలంగా పావులు కదిపినా ఆశ్చర్యం లేదు. సో విగ్రహాల్లారా.. నిగ్రహం పాటించండి...

2 comments:

  1. Statues of politicians are okay, but why tankbund statues were demolished?

    ReplyDelete
  2. There seems to be some problem with your blog. I see the following warning:

    "The blog that you are about to view may contain content only suitable for adults. In general, Google does not review nor do we endorse the content of this or any blog. For more information about our content policies, please visit the Blogger Terms of Service."

    ReplyDelete