ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, January 29, 2012

రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ తో జతకట్టనున్న కేసీఆర్ ?


టీఆర్ఎస్ పార్టీ అధినేత ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాడు... ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక ఏ పార్టీతోనన్నా పొత్తుకు సై అంటుందా.. ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి మెదడుకు పదును పెడుతోంది. గతంలో 2004 ఎన్నికల్లో వైయస్సార్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ తో జత కట్టాడు. తరువాత తెలంగాణ ఇవ్వలేదని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి పాత మిత్రుడు చంద్రబాబును కలిశాడు. చంద్రబాబుతో ఆఖరు నిముషం వరకు పొత్తు ఖరారు కాలేదు. తరువాత ఎలాగోలా పొత్తు కుదిరినా తరువాత సవాలక్ష కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ సారి మాత్రం టీఆర్ఎస్ తో పొత్తుకు కలిసి రావడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలంటే తమ కోరికలు చంపుకొని దాసోహం అనాల్సిందే.. ఆఖరు వరకు టెన్షన్.. టెన్షన్. పొత్తు కుదురుతుందో లేదో తెలియదు. ఈ లోపు వివిధ నియోజక వర్గాల్లో పాగా వేయాలని ఆశపడ్డ అభ్యర్ధులంతా తమ పార్టీకి ఆ స్థానం కేటాయిస్తారో లేదో అనే అనుమానం వెంటాడుతుంది. తరువాత భాగస్వామ్య పార్టీ తన అభ్యర్ధులను ఖరారు చేసుకోవడంలో అయోమయంలో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కేసీఆర్ వైఖరితో విసిగి వేసారాయి. ఇక కేసీఆర్ పొత్తు పెట్టుకోడానికి పార్టీలేవీ మిగల్లేదు. అందుకే కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీతో కేసీఆర్ జత కట్టొచ్చనే ఊహాగానాలు జోగుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఆలోచన ఉండబట్టే మహబూబా బాద్ లో రాళ్లతో కొట్టిచ్చిన కేసీఆర్... జగన్ తెలంగాణలో దీక్షచేస్తే నామమాత్రపు వ్యతిరేకతతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లించిన చంద్రబాబును మాత్రం నాన్ స్టాప్ గా ఆడిపోసుకొని.. తమ న్యూస్ ఛానల్, తమ పేపర్ లలో అడ్డ దిడ్డంగా తిట్టి.. తెలంగాణలో రైతు పోరు బాటను రచ్చరచ్చ చేశారు. కాన్వాయి మీదకు రాళ్లూ రప్పలు విసిరారు. కానీ పార్లమెంట్ లో తెలంగాణకు వ్యతిరేకంగా ఫ్లకార్డు పట్టుకొని ఊరేగిన జగన్ ను మాత్రం మహబూబాబాద్ నాటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ముందే అనుకున్న ప్రకారమో... చేసుకున్న ఒప్పందం ప్రకారమో జగన్ తెలంగాణలో స్వేచ్ఛగా తిరగగలిగాడు. ఈ చనువు చూసుకొనే చంద్రబాబు హ్యాపీగా తెలంగాణ వచ్చి కేసీఆర్ దళం పై సూటిగా విమర్శలు గుప్పించగలిగాడు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో జగన్ ను టార్గెట్ చేయాలంటే తెలంగాణలో కేసీఆర్ ను కార్నర్ చేయాలనేది బాబు వ్యూహం. కేసీఆర్ కూడా తమ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉన్నాడు. తొలి విడత ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి తెలుగుదేశంలాంటి పార్టీల డిపాజిట్లు గల్లంతయినా... రెండోసారి బాన్సువాడం వంటి ప్రాంతాల్లో కేసీఆర్ ఖంగు తినాల్ి వచ్చింది. అందుకే మళ్లీ పొత్తు రాజకీయాలకు తెరలేపబోతున్నాడు. కాంగ్రెస్ కు ధీటుగా ఎదుగుతూ... బాబును టార్గెట్ చేసిన జగన్ కు జ్ఞానోదయం కలిగిందని కేసీఆర్ భావించాడని చాలమంది అభిప్రాయం . అందుకే రానున్న ఎన్నికల్లో జగన్ తో పొత్తుకుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ముదస్తుగా చేసుకున్న ఒప్పంద ప్రకారమే నడుస్తుందని ప్రజాసంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అదే జరిగి ... జగన్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది... ఇక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా మర్చిపోవలసిందే.. ఎందుకైనా మంచిది. కేసీఆర్ తన క్రెడిబిలిటీ నిలుపుకోవాలంటే.. జగన్ తో జత కట్టకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

5 comments:

  1. see ayitagaani janardhan..
    writing a political scoope is an art. there should be some basic information. logic. series of events. acts. with out them it makes a story to the level of abn stories.
    coming to ur 'story'..allience with jagan.... how many disrict units YSR party have now in telangana? how many members are there in T area for YSRCP? at least count how many candidates it have in T area ready to contest in elections?
    Count them and think why KCR go for allience with..!! even a fool wont do it. here it is KCR..the mastro of politics, who makes center shake only with 10 MLAS. Who carries Telangana slogan for 11 years in ups and downs.
    You may remember after 2009 elections when TRS minimised to 10 MLAs party..in the first pressmeet after elections what he said? Just said..."".......And the fight continues"".Any one dares to say it? thats the will power.

    ReplyDelete
  2. Janardhan garu,
    Things were different in 2004 and 2008,at that time
    TRS/KCR was not capable to defeat integrated Andhra leaders
    CBN and YSR respectively,KCR thought that he had to have political alliance to defeat a strong Telangana enemy.
    Now the situation is different who is strong in Telangana?TDP may not get a single seat and congress may get less than 10 seats in and around Hyderabad,Jagan candidates will not get deposit in Telangana we dont know his fate in till 2014,now there is no need for TRS to look alliance as if you are talking alliance is a mandatory ,when u are weak u may need alliance ,in Telangana TRS is unstoppable as far as Telangana statehood issue is concerned,if at all TRS goes with alliance it may go with BJP because BJP also is fighting for TG with full integrity and TRS needs BJP support in national level and with BJP support TRS can miniseries the damage in Hyderabad surroundings TRS can sweep in the districts.
    Stopinig Jagan in Mahabubabad was different one student/youth died to protest Jagan's tour to Warangal,later TRS changed its stance to not stop any SeemaAndhra leaders any way all have become dry in Telangana.
    Coming to the elections are concerned elections are elections it will be tough any time but people now dont want to take any chances with Congress,TDP and there is NO Jagan party in TG leave alone in considering his candidates .
    Since you are from Khammam you may have little influence of Andhra culture thats why you could analysis like this,people trend in Telangana is completely different than in Andhara,in Telangana people dont give importance to personal image or caste feelings,you can take example of Chiranjeevi party in the last elections he could get only two seats in Telangana and 16 seats in Andhra whereas his movies collections were huge hit in the TG,because TG people saw his movies based on his merit not based in his caste like Andhra ppl did even many people in TG dont know Chiranjeevi caste how many ppl in Andhra dont knnow Chiranjeevi caste?
    with similar reasons Jagan may have some following in Andhra but he is big big zero in Telangana,in TG CPI is better than Jagan,
    And most importantly in 2004 Congress promised for Telangana statehood and in 2008 TDP/CBN promised for Telangana statehood with public announcement apart from the strengths and strategies these were the prime reasons,now other than BJP,CPI,Newdemecrocy Jagan will promise for Telangana statehood?it is not like that pick one stone randemely or a stone is available yes that some times works but in this Telangana statehood issue it does not work,there are two things should be there to win in the TG,1)100 percent support for separate Telangana statehood and should work for it(with mere a statement wont do anything),
    2)The party should win the hearts of people in in solving the people problems(it should be typical political party capable to rule our Telangana) ,
    Jagan's party does not have any one of them,so when ordinary Telangana person is ignoring Jagan party why a stalwart like KCR consider his party at all leave alone considering alliance of Jagan party,
    if you want to share with on above mentioned views plz welcome,
    kanaparthi.srinivarao@gmail.com

    ReplyDelete
  3. savaalreddy, Kanaparthi Srinivas గార్లకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మీరన్నట్టు కేసీఆర్ పొలిటికల్ మేస్ట్రో అందుకే నేను పై వ్యాసం రాశాను. పొత్తుకు దారి తీయబోయే పరిస్థితులు.. ఉద్యమవేడిని ఎలా పెంచబోయేది. కొండా సురేఖకు పోటీగా ఎవరిని నిలబెట్టబోయేది.. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోరో.. వంటి విషయాలు భవిష్యత్తులో మీకే తెలుస్తాయి. అయితే నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాత్రం పై వ్యాసం రాయలేదు. నాది ఖమ్మం అయినా తెలంగాణ న్యూస్ ఛానల్లో( ముందు రాజ్ న్యూస్, తరువాత టీ న్యూస్)కు ప్రోగ్రామింగ్ ఇన్ చార్జిగా పనిచేసి.. తెలంగాణ దు:ఖాన్ని కళ్ళకుకట్టినట్టు ప్రోగ్రాంలు తయారు చేసి ప్లేచేశాను. మాటా ముచ్చట లాంటి ట్రెండ్ సెట్టర్ ప్రోగ్రాం డిజైన్ చేశాను. లిటిల్ సింగర్స్, ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ ప్రోగ్రాంలతో. ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లకు సవాలు విసిరాను. కాబట్టి మీరెవరో.. మీది ఏ జిల్లానో నాకు తెలియదు. మీ ప్రొఫైల్లో కూడా ఏమీ లేదు. థింగ్స్ వర్ డిఫరెంట్ అని మొదలు పెట్టిన మీ వ్యాక్యంలోనే నా వ్యాస సారాంశం ఉందని చెబుతూ శలవు.

    ReplyDelete
  4. @అయితగాని జనార్ధన్:

    "నాది ఖమ్మం అయినా": అన్నా, నాకీ మాట అర్ధం కాలే. ఖమ్మం తెలంగాణా కాదని మీరు అంటే మాత్రం అది తప్పు.

    కెసిఆర్ రాజకీయ మేధావి, సిద్ధహస్తుడు లాంటి బిరుదులకు అర్హుడు కాడు. పొత్తు రాజకీయాలతో లక్ష్యాన్ని సాధించుకోవచ్చనే ఆయన "వ్యూహం" బెడిసి కొట్టింది. 2009 లో తప్పనిసరి పరిస్తితులలో రాజకీయబాట (political route aka backroom deals) వదిలి ఉద్యమబాట పట్టిన తరువాతనే తెరాస ప్రజలలోకి చొచ్చుకుపోయింది. ఈ విషయం ఇంకా ఆయనకు పూర్తిగా సమాజ్ కాలేదు.

    ReplyDelete
  5. "మాటా ముచ్చట లాంటి ట్రెండ్ సెట్టర్ ప్రోగ్రాం డిజైన్ చేశాను"

    ఈ కార్యక్రమం నిజంగా ఒక ఆణిముత్యం. గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోయే ప్రోగ్రాం ప్రవేశ పెట్టిన మీకు తెలంగాణా రుణ పడి ఉంటుంది.

    ReplyDelete