Monday, January 16, 2012
అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా ? మిర్దాద్, బైబిల్ ఒక్కటేనా.. స్వార్ధం కోసం దేవుణ్ణే మోసం చేశారా
ఏసుక్రీస్తు జీవితం పై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. క్రీస్తు జననమే ఒక వివాదం.. జననం మాట ఎలా ఉన్నా... బోధనల విషయంలో మాత్రం పెద్ద వివాదమే ఉంది. వాస్తవానికి క్రీస్తు బోధించిన విషయాలేవీ ప్రస్తుతం మనకు లభించే బైబిల్ లో లేవు అనేది చాలా మంది క్రైస్తవులు అభిప్రాయం. తమ స్వప్రయోజనాల కోసమో... వర్తమాన విషయాలను చొప్పించడం కోసమో... లేక మత విస్తరణ కోసమో రకరకాల విషయాలను అందులో చొప్పించారు. దీంతో బైబిల్ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ఆ మత గురువుల్లో ఒక వర్గం వాదిస్తోంది. దీనికి సంబంధించిన కుట్రలను భగ్నం చేసేందుకు లియోనార్డ్ డావెన్సీ తన రహస్య పెయింటింగ్ లతో కృషి చేశాడు. కానీ అన్ని కోడ్ లను ఛేదించడం అందరికీ సాధ్యం కాలేదు. ఇప్పటికే డావిన్సీ గీసిన మోనాలిసీ బొమ్మలో ఏముందో తెలుసుకోవాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోలేక పోయారు. దీని గురించి వచ్చిన చిత్రమే డావెన్సీ కోడ్.. అయితే బైబిల్ లో విషయాలు కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే.. కానీ వాటిని దైహిక జీవితానకి అనుబంధంగా మార్చారు. అయితే క్రీస్తు చిన్నపుడే ఇండియా వచ్చి బౌద్ధాన్ని అభ్యసించి తిరిగి స్వదేశానకి వెళ్లాడనీ.. అందుకే అక్కడ తన భౌద్దమతం కాకుండా తన క్రైస్తవం పేరుతో ప్రచారం చేశాడని చెప్పుకుంటారు. అయితే వాస్తవానికి బౌద్ధమతానికి క్రైస్తవం పూర్తి విరుద్ధంగా ఉంటుంది.. కాబట్టి బౌద్ధమే క్రైస్తవమని చెప్పడానికి వీల్లేదు. అలా అని తోసి పుచ్చడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే .. దు:ఖానికి కారణం కోరికలు అనే సూత్రాన్నే.. క్రైస్తవం బోధించినప్పటికీ... జీవితాన్ని కోరుకున్న రీతిలో బ్రతకమని చెబతోంది. మాంస భక్షణ గురించి ప్రత్యేకించి క్రైస్తవులకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. క్రీస్తు శిలువ మీద నుంచి దించిన తరువాత సమాధి చేయబడ్డాడిని.. మూడవ రోజు ఆయన సమాధి నుంచి లేచాడని క్రైస్తవులు చెబుతారు. సమాధి నుంచి లేచాక ఎన్నో మహిమలు ప్రదర్శించాడని.. వాటిని ఎంతో మంది చూశారని చెబుతారు. కానీ చరిత్రకారుల చెప్పే విషయం వేరుగా ఉంది. శిలువ వేసిన ఏసు కొద్ది కాలమే శిలువ పై ఉంచడం వల్ల యేసును తిరిగి గుహలో దాచినా అతడు కేవలం స్పృహ కోల్పోయాడు తప్ప చనిపోలేదని... యేసు అనుచరులు అక్కడున్న సమాధి గుహలో నుంచి యేసు దేహాన్ని తీసుకెళ్లి వైద్యమందించి తిరిగి బతికించారని చెప్పుకుంటారు. అయితే ఈ విషయం తెలిసి రాజు ఎక్కడ శిక్షిస్తాడో అని రాజభటులు, తమ నిర్లక్ష్యం బయటపడుతుందని.. వారు కూడా అబద్దం ఆడవలసిన పరిస్థితి. దీంతో యేసు మూడవ రోజున సమాధి నుంచి లేచాడనే విషయమే బలంగా నమ్మకంలో ఉంది. అయితే ఒరిజినల్ బైబిల్ లో యేసు ఎలా సమాధి నుంచి బయట పడింది. భారత దేశం చేరి తన బోధనలు ఎలా ప్రచారం చేసిందీ ఉన్నదనీ.. వీటికి మూలాలు ఎక్కడో కూడా వివరించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలిస్తే కష్టమని బైబిల్‌లో చాలా మార్పులు చేసి తమ ప్రతిష్ట పెంచుకునే పనిలో పడ్డారు కొందరు స్వార్ధ పరులు.
ఈ విషయం మనకు మిర్దాద్ అనే పుస్తకం చదివితే స్పష్టంగా తెలుస్తుంది. మిర్దాద్ అనేపుస్తకంలో ఏముంది... అసలు మిర్దాద్ పుస్తకానికి బైబిల్ కు సంబంధం ఏంటి..? అవును.. నేను ఈ మధ్య నెట్‌లో రకరకాల వీడియోలు చూస్తూ ఓషో రజనీష్ వీడియో చూశాను. ఈ వీడియో ఇదే బ్లాగులో కూడా పోస్టు చేశాను. http://www.youtube.com/watch?v=rVP3Jsp8CE8 ఓషో చెప్పిన రకరకాల విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే అన్నిటికన్నా ఏసుగురించి చేసి వ్యాఖ్యలు కొంత ఆలోచింప చేశాయి. ఇది ఎంత వరకు కరెక్టో కాదో తెలియదుగానీ.. ఒక విషయం మాత్రం నన్ను మరింత శోధించేలా చేసింది. ఓషో తన ఇంటర్వ్యూలో... తనకు అత్యంత ఇష్టమైన పుస్తకం "మిర్దాద్" అని చెప్పాడు. ఆ పుస్తకంలో సాహిత్యం ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పాడు. ఆ పుస్తకం చదవడం మొదలు పెడితే ఆపలేక పోయానని.. ఆ సాహిత్యం ముందు అన్ని పుస్తకాలూ దిగదుడుపేనని వ్యాక్యానించాడు. ఒక పెద్ద వివాదాస్పద యోగి అలా మాట్లాడటం వెనుక అర్ధమేంటి. అయితే ఆ పుస్తకం రాసిన రచయిత కంటే సాహిత్యం గొప్పదని అభివర్ణించాడు. అంత గొప్ప సాహిత్యం రాసిన రచయితను పెద్దగా మెచ్చుకోలేదు. అక్కడే నాకు అనుమానం వచ్చింది. అంతే ఇంటర్నెట్‌లో వెదికి మిర్దాద్ పుస్తకం పీడీఎఫ్ ఫైల్ దొరకబుచ్చుకున్నాను. అయితే ఇది అచ్చ ఇంగ్లీష్ కాబట్టి.. మనది ప్రభుత్వ పాఠశాల ఆంగ్లం కాబట్టి.. అందులో ప్రకృతి వర్ణనలు కాస్తంత ఇబ్బంది పెట్టాయి. మంచు పర్వత శ్రేణుల వర‌్ణనలు, ఆర్క్ వర‌్ణన కాస్త తికమక పెట్టింది. అయినా కష్టమైన కష్టపడి చదివి రెండు చాప్టర్లు పూర్తి చేశాను. ఆపకుండా అలాగే చదవడానికి నాకు ఓషోకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు. ఈ పుస్తకం తెలుగు అనువాదం లేదా అని అనిపించింది. ఒకవేళ మనమే ఆ మహత్కార్యానికి పూనుకుంటే ఎలా అన్న ఆలోచన కూడా వచ్చింది. వారం రోజుల తరువాత మిర్దాద్ నా మెదడు నుంచి తప్పుకొని కాస్త విరామం ఇచ్చింది. అయితే నాకు పాత పుస్తకాలు కొనడం హాబి. ఒకరోజు ఆబిడ్స్‌లో పాత పుస్తకాల షాపులో నాలుగైదు పుస్తకాలు సెలక్ట్ చేసుకొన బయటకు వెళ్లేముందు మిర్దాద్ తెలుగులో కనిపించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. బేరమాడకుండా కొనేశాను. ఓషోలాగా మొత్తం చదువకున్నా ఐదారు చాప్టర్లు వరుసగా చదివేశాను. తరువాత మొత్తం పూర్తి చేశాను. అయితే ట్విస్ట్ ఒకటుంది. ఈ పుస్తకంలో మిర్దాద్ అనే వ్యక్తి నథింగ్ బట్ జీసస్.. భారత దేశంలో మంచు పర్వతాలలో నిర్వహించ బడుతున్న మతసంస్థ "ఆర్క్". దాన్ని పూర్వం ఎప్పుడో ప్రారంభిస్తారు. అయితే అందులో ఎప్పుడూ 8 మందే ఉండాలి. ఒకరు చనిపోయినా దేవుడు మరొకరిని పంపుతారు. వారెలా ఉన్నా దేవుడి ఆదేశం ప్రకారం వచ్చారని భావించి వారిని చేర్చుకోవాలి. అలా జరుగుతున్న క్రమంలో ఆఖరు మత గురువైన షమాయిమ్ కు ఒక సమస్య ఎదురవుతుంది. ఆర్క్ లోఒకరు చనిపోగానే అతని స్థానంలోకి ఒక అనాకారి తనను చేర్చుకొమ్మని వస్తాడు. అతడు నగ్నంగా.. చిరిగిన వస్త్రాలతో, చేతులకు, మొహానికి, కాళ్లకు గాయాలతో ఉంటాడు. అతణ్ని స్వీకరించడానికి మతగురువు ఇష్టపడడు. కానీ అతడితో వాదించలేక సేవకుడిగా స్వీకరిస్తాడు. అతడే మిర్దాద్. ప్రతి విషయంలోనూ మిర్దాద్‌కు గురువుకు వాదం జరిగేది మిర్దాద్ గెలిచేవాడు. అయితే మిర్దాద్ క్రమేపీ మౌనం దాల్చి ఏడేళ్ల తరువాత నోరు విప్పాడు. అప్పణ్ణుంచి మిర్దాద్ అన్నీ దైవ వాక్యాలే పలికాడు. మిర్దాద్ ఎవరో మిగతా వారికి తెలిసిపోయింది. మిర్దాద్ ను నీవు నౌకలో దొంగతనంగా వచ్చిన వాడివి కదూ.. అని పలుసార్లు ప్రశ్నించారు. దానికి మిర్దాద్ కాదు అని చెప్పక పోగా.. అవునని నమ్మడానికి బలంచేకూర్చాడు. నీవే నౌకలో దొంగతనంగా వచ్చావనడానికి రుజువులేంటని ప్రశ్నించగా.. జ్ఞానులకు సర్వం తెలుస్తుదని తెలిపాడు. సాక్ష్యం కావాలంటే నింగీ, నేలా, జలం, వాయువు, అగ్ని పంచ భూతాలను ప్రశ్నించాలని. అప్పుడే నిజమైన సాక్ష్యం దొరుకుతుందని.. వాటన్నిటినీ కోర్టులోకి తీసుకురావడం సాధ్యం కాదని... వాటిని తీసుకురాగలిగిన వాడికి సాక్ష్యం అక్కర్లేదని చెబుతాడు. సరే మిర్దాద్ ఏది చెప్పినా.. ఒక్క విషయం మాత్రం సత్యం.. నావలో దొంగతనంగా వచ్చిన వాడు అంటే.. జీసస్.. అందులో నో డౌట్.. ఈ విషయం అనోన్ లైఫ్ ఆఫ్ జీసస్ అని నికోలస్ నోటోవిచ్ రాసిన పరిశోధనా గ్రంధంలో ఉంది.
ఇదంతా ఆశ్చర్యం కాదు.. కానీ ఒకే ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించే విషయం.. ఏ జీసస్ నైతే దూషించినట్టుగా మాట్లాడిన ఓషో.. ఒకరకంగా యేసి సన్ ఆఫ్ బిచ్ అని కామెంట్ చేసి... అతని బోధనలనే ప్రచురించిన మిర్దాద్ గ్రంధాన్ని చదవమని ప్రచారం చేయడం వెనుక మర్మం ఏంటో తెలియలేదు.. మిర్దాద్ అంటే ఎవరోకాదు ఏసుక్రీస్తు.. అయినపుడు మిర్దాద్ లో విషయాలకు బైబిల్ బోధనలకు సారూప్యం ఉన్నపుడు.. ఒరిజినల్ బైబిల్ మిర్దాదా.. ప్రస్తుతం క్రైస్తవులు ఆకర్షణీయమైన బైండింగుల్లో చూపుతున్న పవిత్రగంధమా.. ఈ గ్రంధానికి ఎన్నో అనుబంధాలు చేర్చబడ్డాయి. మిమ్మల్ని కూడా మిర్దాద్ చదవమని చెప్పడానికి నేనిది రాయలేదు. కానీ ఒక యోగిలాంటి వ్యక్తి చెప్పిన మాటల్లో మర్మమేంటో పంచుకుందామని రాస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
meeru a telug upustakanni scan chesi ivvagalara...emdukamte a pustakam ekkuvagaa dorakadu. meeru scan chesi upload cheste migata vallu kooda chadavataaniki autumdi.
ReplyDeleteనాక్కూడా అదే ఆలోచన వచ్చింది.. కానీ 150 పేజీల వరకు ఉంది.. దాన్ని స్కాన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. వీలైతే చూస్తాను. థాంక్యూ...
Deleteనిన్ననే అనుకోకుండా ఓషో వీడియోలు యూట్యూబ్ లో చూశాను... ఆపకుండా రోజంతా చూస్తూనే ఉన్నా.. సరిగా ప్రశ్నిస్తాడు.. అర్థం అయ్యేలా, నచ్చేలా మాట్లాడతాడు..
ReplyDeleteఇక మీ టపా కు సంబంధించి, అతను జీసస్ ని విమర్శించాడా ? లేక జీసస్ పై ఉనికిలో ఉన్న వాదనలను విమర్శించాడా ?
ఇలాంటి తెలుగు పుస్తకాలను ఎక్కడ సంపాదించాలి.. ? కోఠీ కి పోవాలంటే విమానం ఎక్కాలి.. వేరే ఏదైనా దారి తెలిస్తే చెప్పండి..
intha peeeeeedha writingaaaa??? you can concise it sir or madam!!!! so that everyone can read it!!!mmmmm!!! think about it!!!
ReplyDeleteవిషయం మొత్తం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా ఈ మాత్రం వివరణ లేకుంటే అర్దం కాదు. అందులోనూ కొత్త విషయం పూర్వాపరాలన్నీ చెప్పాలి.
DeleteI got answer for you.pl. check http://keepbeleiving.blogspot.com/
ReplyDeleteఅరవింద్ జోషువా గారూ.. మీ మనసు నొచ్చుకుంటే సారీ.. కానీ నేను రాసిన వాటిల్లో క్రీస్తును దూషించినట్టు ఒక్క వాక్యం కూడా లేదు. మళ్లీ ఒకసారి చదవండి. ఓషో కూడా ఏసు గురించి ఒకలా చెప్పి.. మిర్దాద్ గా పిలవబడే ఏసు బోధనలే ఎందుకు చదవమన్నాడని ప్రశ్నించుకున్నాను. ఇక రెండవ విషయం.. ఒరిజనల్ బైబిల్ గురించిన వివాదం మీకు తెలియంది కాదు. నాకంటే మీకే బాగా తెలిసిఉండాలి. అనుబంధాలు ఎవరు ప్రచురించారో మీకే బాగా తెలిసుండాలి. నేను క్త్రైస్తవానికి వ్యతిరేకం కాదని మీరు గుర్తించలేదు. ఫాదర్ అని పిలిపించుకుంటూనే చేసే వెర్రి చేష్టలకు మాత్రమే వ్యతిరేకం. అలాగే నాకు ఎందుకో బైబిల్ అంటే ఇష్టం ఉండేది. బయటకు వెళ్లేటపుడు పుస్తకాన్ని మూసి మధ్యలో వేలు పెట్టి... తరువాత పుస్తకం తెరిచి ఆ వాక్యం చదవడం డిగ్రీలో అలవాటు ఉండేది. అలాగే భగవర్గీతను కూడా అలానే ఫాలో అయ్యేవాణ్ని. నాకు ఏ మతం మీదా అక్కసుగానీ ప్రేమగానీ లేవు. నేనేం మతచాందసవాదిని కాను. మీరిచ్చిన సుదీర్ఘ వివరణలో కొన్ని అంశాలు మాత్రమే నాకు వర్తిస్తాయి. వాటిని మాత్రమే నేను స్వీకరించి సమాధానం చెబుతున్నాను. నాకు సంబంధంలేని.. నా వ్యాసంలో లేని వాటి గురించి నేను స్పందించను. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను.
ReplyDelete