Monday, January 30, 2012
ఎస్పీ బాలసుభ్రమణ్యానికి ఇదేం బుద్ది
తెలుగు భాష గురించి సుద్దులు చెప్పే బాల సుబ్రమణ్యం గురించి నేను చాలా ఊహించుకున్నాను. తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నామని.. పరభాషకు బానిసలైపోతున్నామని తెగ మదన పడిపోయే మన ఎస్పీ బాలసుబ్రమణ్యం అలియాస్ ఎస్పీబీ డొల్లతన బయట పడింది. ఆ మధ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో రాధకృష్ణ అనే సోకాల్డ్ జర్నలిస్టు చేసే ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాంలో ఆయన మనసు విప్పాడు. అయితే ఆయన పర్సనల్ విషయాల గురించి.. మనకెందుకులేగానీ... ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో సెటైర్లు ఉన్నాయి. కానీ తెలుగు భాషను ఉద్దరిస్తానని జబ్బలు చరుచుకునే ఈ అపర గాన గాంధర్వుడు ఇంటర్వ్యూ మొత్తం టింగ్లీష్ లో సాగింది. ఇట్స్ హేపెన్ అంతే.. ఇట్స్ హెపెన్ అంటూ... తెలుగు మాట్లాడే ఇంగ్లీష్ వాడిలా బిల్డప్ ఇచ్చాడు .. ఆ దెబ్బకు నేను షాక్ కు గురయ్యాను. ఇంగ్లీష్ భాషకు బానిసయ్యామని, యాంకర్లంతా ఇంగ్లీష్ లేనిదే యాంకరింగ్ చేయలేకపోతున్నారని.. వ్యగ్యాస్త్రాలు విసిరే ఎస్పీబీ గారికి ఇదేం బాగాలేదనిపించింది. ఆయన చక్కని తెలుగులోనే మాట్లాడాలని నేను అత్యాశ పడటం లేదు. ఇతరులు మాట్లాడే భాషను హేళన చేసి తాను మాత్రం తగుదునమ్మా అంటూ ఆంగ్లాంధ్రంలో మాట్లాడం ఎలా చెల్లిందని ఆవగింజంత ఆందోళన.
Subscribe to:
Post Comments (Atom)
బాలు మీద మీరు పరిశీలన వాస్తవమే.
ReplyDeleteమీ వ్యాసాలు చూశాను, బాగా రాశారు. ఆలోచింపచేసేవిగా వున్నాయి.
మీ బ్లాగ్ ఓపన్ చేసినపుడు ఓ హెచ్చరిక లాంటిది వచ్చింది, మీరే పెట్టుకున్నారా, లేదా గూగుల్ పెట్టిందా?
ఇంగ్లీషు విషయమేమో కానీ బాలు హిందీ వింటే మాత్రం డోకు వస్తుంది. సల్మాన్ ఖాన్ ఎట్లా భరించాడో ఆ ఖూనీ!
ReplyDeleteబాలు గారి ముఖాముఖి కాబట్టి నేను కూడా శ్రద్ధగా విన్నాను.గాయకుడుగా అందరికి అభిమానపాత్రుడే .కాని మంచి తెలుగులో మాట్లాడాలని అందరికీ హితబోధ చేసే ఆయన సగం ఆంగ్ల పదాలని ,వాక్యాలని కూడా వాడుతూ మాట లాడడం శోచనీయమే.అందులోనూ లక్షలమంది వినే టీ .వీ.మాధ్యమంలో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. మీతో ఏకీభవిస్తున్నాను.
ReplyDelete