Monday, January 2, 2012
కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?
కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?
"మాస్ లోనే మార్కెటింగ్"
నిన్న మా పాప "డాడీ నాకు కొలవరి ధీ" పాట సెల్‌ఫోన్ లో తీసుకురమ్మని అడిగింది. వాస్తవానికి నాకు ఎందుకో ఆ పాటంటే మొదటిసారే నెగెటివ్ ఫీలింగ్ కలిగింది. దానికి కారణం ఆ పాట నచ్చక కాదు. ఆ తరహా బట్లర్ ఇంగ్లీష్ పాటలు గతంలో చాలానే వచ్చినయి. ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో మొదటిసారి నా ఫ్రెండ్ రూంలో యూట్యూబ్ లో పాట చూశాను. ఈ పాట యూత్‌ను ఊపేస్తుంది చూడమని ఫ్రెండ్ చెప్పినపుడు (అప్పటికి ఇంత వెర్రి లేదు) ఎంతో ఎక్స్పెక్ట్ చేసి చూశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో పాట లేదు. పాతగానే ఉంది. కానీ ఇప్పడు యావత్ యూత్ ను బాషా భేదం లేకుండా ఊపేస్తుంది. అర్ధం కాలేదు. ఎందుకు ఈ పాటకు ఇన్ని పేరడీలు. ఈ పాట అంతబాగా నచ్చిందేంటి..? బాగా ఆలోచిస్తే ఒక్క విషయం భోదపడింది. అంతేకాదు బుద్దుడి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాక్కూడా హిట్ ఫార్ములా జ్ఞానోదయం అయింది. దానికి నేనిచ్చిన పేరు "మాస్ లోనే మార్కెటింగ్". అవును ఒక పాట హిట్ కావాలంటే ముందు ఆ పాట జనాల్లోకి వెళ్లాలి. అయితే జనాల్లోకి వెళ్లిన అన్ని పాటలూ హిట్ కావు. ఆ పాట హిట్ కావాలంటే సందర్భానికి అనుగుణంగా ఆకట్టుకోవాలి. సందర్భం అంటే.. ఇక్కడ మళ్లీ డౌట్.. అది సినిమాలో సన్నివేశం కావచ్చు. నిజజీవితంలో సన్నివేశం కావచ్చు. దీనిక్కూడా ఉదాహరణ చెప్పేముందు మరో విషయం ప్రస్తావించక తప్పదు. అదేంటంటే పాటను ఎవరు.. ఎలా.. ప్రసెంట్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంటే.. ఆ పాట ప్రసెంట్ చేసే వారు సందర్భానికి అణుగుణంగా.. హత్తుకుపోయేలా... ఆకట్టుకునేలా.. కావలసిన అన్ని రసాలూ పిండి.. తిరిగి ప్రేక్షకుడు లేదా వీక్షకుడు హమ్మింగ్ చేయగలిగేలా వశీకరణ చేసుకోవాలి. దీంట్లో బ్యాలన్స్ ముఖ్యం.. ఏమాత్రం అతి ఉన్న కశెం అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణ జోలికి వస్తాను. మొదట.. ఒక పాట.. ఈ మధ్య కాలంలో తెలంగాణ అమరవీరులకు సంబంధించి బాగా పాపులర్ అయిన పాట "రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.." ఇదీ పాట... వాస్తవానికి ఈ పాట ఈ మధ్య పుట్టింది. కాదు. తెలంగాణ అమరవీరుల కోసం పుట్టింది కూడా కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ నిషిద్ద కమ్యునిస్టు.. విప్లవ గ్రూపుల్లో అమరులైన వ్యక్తుల కోసం ఎప్పుడో.. పాత ట్యూన్ లో రాసిన పాట ఇది. దాంట్లో.." అందుకని వేశావా... నా కొడుకును నక్సలైట్ అని ముద్రను" అని ఉంటుంది. అంటే అది నక్సలైట్ల కోసమే రాసిన పాట అని తెలుస్తూనే ఉంది. అప్పట్లో కమ్యునిస్టు మీటింగ్ లలో మార్మోగింది కూడా.. కొన్ని క్యాసెట్లల్లో కూడా రికార్డ్ అయింది.. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు... ఎటొచ్చీ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతా చారి ఆత్మత్యాగం తరువాత.. శ్రీకాంతాచారి సంస్మరణ సభలో... సందర్భం వేడి వేడిగా.. ఉంది. అమరవీరులను తలుచుకొని దు:ఖిస్తున్న సమయంలో సాయిచంద్ గుండెలకు హత్తుకొనేలా ఈ పాట పాడిన విధానం అందర్నీ కదిలించింది. దానికి తోడు టీవీ ఛానళ్లన్నీ శ్రీకాంతా చారి తల్లి ఆ పాట వింటూ రోధించడాన్ని ప్రత్యక్షప్రసారం చేశాయి. దీంతో ఆ పాట జనాల్లోకి ఎంతగా వెళ్లాలో అంతగా వెళ్లింది. అయితే ఈ పాటే తరువాత కళాకారుల మధ్య పోటీకి దారి తీసింది. ఒక రకంగా సాయిచంద్ అనే తెలంగాణ గాయకుడికి లిఫ్ట్ ఇచ్చింది ఈ పాటే.. ఈ పాట సురేందర్ రాశాడని కూడా చాలా మందికి చాలా కాలం వరకు తెలియదు. సాయిచంద్ తరువాత ఎవరు పాడినా ఈ పాటను ప్రజలు రిసీవ్ చేసుకోలేక పోయారు. మొదట వడ్లకొండ అనిల్, తరువాత స్వర్ణ ఇలా చాలా మంది ప్రజల మెప్పు పొందాలని చూసినా సాధ్యం కాలేదు. అంతేందుకు గీత రచయిత మిట్టపల్లి సురేంధర్ ఎక్కడ ధూంధాం జరిగినా ఈ పాటే పాడుతుంటాడు. ఇది తన పాట అని చెప్పి మరీ.. అయినా సాయిచంద్‌కు వచ్చిన రెస్పాన్స్ రాకపోవడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. తరువాత పోరు తెలంగాణ చిత్రంలో ఆర్. నారాయణ మూర్తి తన సినిమాలో నిత్య సంతోషిణితో పాడించినా అంతబాగా రాలేదు. సో.. దీని ద్వారా తెలుసోచ్చిన నీతి ఏంటంటే ఒక పాట.. ఆ పాటలో ఉన్న విషయానికి తగ్గ సందర్భానికి తగ్గట్టుగా.. పాడేవాళ్లు.. సందర్భానికి తగ్గ మసాలా దట్టిచ్చి జనాల్లోకి తీసుకెళితే ఆ పాట హిట్. ఇప్పుడు కొలవెర్రి ఢీ దగ్గరికి వద్దా.. ఈ పాట రజనీ కాంత్ అల్లుడు ధనుష్ పాడిన సరదా పాట. వాస్తవానికి బట్లర్ ఇంగ్లీష్ తో ఆ మధ్య కాలంలో చాలా పాటలే వచ్చాయి. కానీ చాలా తక్కువ పాటలు ప్రజాదరణ పొందాయి. కానీ క్లాస్ డివిజన్ నుంచి వచ్చిన ధనుష్ మాస్ మసాలా కలిపి.. టింగ్లీష్ కలిపి పాడాడు. అంతే కాదు.. రిథమ్.. బీట్ కూడా పక్కా మాస్ ఉంది... ఈ పాటలో మాస్ తమను చూసుకున్నారు. తమ లైఫ్ చూసుకున్నారు. పాటలన్నీ బోర్ అయిన సందర్భంలో పబ్లిక్... పబ్లిసిటీ ఇచ్చిన పాట ఇది. దీంతో పాటు.. టీవీ ఛానళ్లు కూడా దీనికి తగ్గట్టు కావల్సిన దానికంటే ఎక్కువగానే ప్రచారం కల్పించాయి. అందుకే ఆ పాట హిట్ అయింది. కొలవరి కంటే గొప్ప పాటలు.. ఇంకా బాగా ఆకట్టుకోగల పాటలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. ఎదైనా అంతే పది మందికి నచ్చితే హిట్.. పదిమందికి చేరక ముందే కనుమరుగైతే ఫట్.. నలుగురికి నచ్చినది నా కసలే నచ్చదులే..
Subscribe to:
Post Comments (Atom)
"రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడా" పాట lyrics మీరు publish చేస్తే బాగుంటుంది. Thanks a lot in advance.
ReplyDelete