ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, January 9, 2012

మానని గాయమిది .. ఇంకెన్నాళ్లీ రాజకీయ వ్యభిచారం


ఒళ్లంతా రక్తమోడుతున్నా లెక్క చేయలేదు.. ముళ్ల కంచె శరీరాన్ని తూట్లు తూట్ల చేస్తున్న పట్టిచ్చుకోలేదు... ఒకటే లక్ష్యం.. ఒకటే ఆశయం.. ఆ ఆశయ సాధనలో ముళ్లన్నీ పూలే అని భరించారు.. సరిగ్గా ఏడాది క్రిత జేఏసీ పిలుపు మేరకు వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారి గాయాలు ఇంకా మానలేదు.. కానీ గాయాలు పెట్టే నొప్పికన్నా తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని నేతలు చేస్తున్న రాజకీయాలే బాధిస్తున్నాయంటున్నారు ముట్టడిలో గాయాల పాలైనవారు.
మానని గాయం
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సాక్షిగా జరిగిన రక్తతర్పణానికి యేడాదైంది పూర్తియింది. ప్రభుత్వం ,సీమాంద్రుల తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ పొలిటికల్ జెఎసి తెలంగాణ ప్రాంతాల్లో 2011 జనవరి 10న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కలెక్టరేట్ల ముట్టడికి వరంగల్ జిల్లా విద్యార్ధులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో తెలంగాణవాదులు ఏకశిలాపార్కు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం దిశగా బయల్దేరారు. కలెక్టరేట్ కార్యాలయానికి సమీపలో వున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్దనే ఇనుప గ్రిల్స్ వేసి వందలాది పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. కాని అప్పటికే తెలంగాణ వాదులు వారిని ఛేదించుకుని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే కలెక్టర్ బంగ్లా ,కార్యాలయం ఎదుట ముళ్లకంచె వేసి కేంద్ర బలగాలను మోహరించారు. ముళ్లకంచెను దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో... కేయూ జెఎసి నేత పాలడుగు అనిల్ కుమార్ ముళ్లకంచె లో పడి ఒళ్లంతా చిక్కుకున్నాయి. ఎంత లాగినా రాకపోవడంతో ప్రక్కనే వున్న మెకానిక్ షాపు నుంచి కటింగ్ ప్లెయర్ సహాయంతో ఆ ముళ్లకంచెను కట్ చేసినా శరీరంలో నే చాలా వరకు చిక్కుకుపోయాయి.రక్తం రోడ్డు పై ధారలు పడుతుండగా అక్కడే వున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం విన‍య్ భాస్కర్ ,మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావులు చేతుల మీదనే అతన్నిదగ్గర్లో వున్న ఆస్పత్రికి తీసుకెళ్ళారు. గంట పాటు వైద్య చికిత్సలు జరిపి ముళ్ల కంచెను శరీరం నుంచి తొలగించారు.
శరీరాన్ని తూట్లు పడి రక్తం ధారాపాతంగా కారుతున్నా లెక్కచేయలేదు.. గాయపడ్డ అనిల్ కుమార్ ను స్థానిక నేతలతో బాటు.. మరికొందరు తెలంగాణవాదులు స్థానిక రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు.కొన్ని గంటల పాటు ఆపరేషన్ చేసి 650కుట్లు వేసారు.దీంతో 15 రోజుల పాటు ఆస్పత్రిలో నే చికిత్స పొందాడు. చికిత్సకు లక్షా 90వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న అనిల్ ను పరామర్శించేందు స్థానిక తెలంగాణవాదులు , జెఎసి నాయకులు ,టీఆర్ఎస్ నాయకులతో పాటు ,కేటీఆర్ ,ఈటెల రాజెందర్ కూడా వచ్చారు. నాలుగైదు రోజులు పరామర్శలు పూర్తయ్యాక అనిల్ కుమార్ ను అందరూ మరిచిపోయారు.. అనిల్ సోదరుడు మనోహర్ కూడా తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారి పై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో మనోహర్ చేయి విరిగింది. పోలీసులు అరెస్టు చేసి 15 రోజులు రిమాండ్ కు పంపారు. దీంతో కుటుంబం వీధిన పడింది. చేతికొచ్చిన ఇద్దరు కొడుకులూ అసహాయంగా మారడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఇంత జరిగినా ఏ నాయకుడూ ఎలా ఉన్నావని పలకరించిన పాపాన పోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఇచ్చే ప్రేరణ తరువాత ఇబ్బందులు ఎదురైతే ఉండవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండి కూడా బసవరాజు సారయ్య ఏరోజూ తమను పరామర్శించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ కుటుంబం అంతా తెలంగాణ ఉద్యమానికి బలిపశువుల్లాగా మారామని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు అనిల్ కుమార్.,

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మేథావులు, అధ్యాపకులు , అతని స్నేహితులు కోరుతున్నారు. పాలడుగుల అనిల్ కుమార్ తో పాటు అతని కుటుంబం ఉద్యమంలో దాడికి గురికావడం బాధాకరమని , అనిల్ కుటుంబాన్ని ఆదుకుని ,అతనికి ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం తెలంగాణ అనుకూల పార్టీలతో పాటు ,తెలంగాణవాదులకూ ,స్థానిక ప్రజాప్రతినిధులకు వుందని అన్నారు. అనిల్ కుమార్ ముళ్లె కంచె దాడికి గురై నేటికి యేడాది గడుస్తున్న స్పందించే నాధులు లేకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనతో పాటు అతని కుటుంబం తెలంగాణ ఉద్యమంలో అన్యానికి గురైనా తెలంగాణ సాధన కోసమనేనని బాధితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమఒళ్లంతా హూనమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలనే ఆకాంక్ష ముందు ఇవేవీ బాధ పెట్టవంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌కోసం పోరాడే యువకులను అడ్డం పెట్టుకొని నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని వారు కోరుకుంటున్నారు. తమ త్యాగాలను రాజకీయంగా కాక తెలంగాణ సాధనకు స్పూర్తిగా తీసుకోవలని బాధితులు కోరుుతున్నారు.

5 comments:

  1. Brother ..Rajakeeya nakaulaku valla ki upayoga pade valle kavali Debbalu tagilina vallu karu ..just prajalani vallu pedda vallu kavatam kosam vadu kontaru ante ...e okka raja keya nayakudiki aina debba tagilindha ? vallu manalini vadu kontaru ante ...

    ReplyDelete
  2. "అనిల్ ను పరామర్శించేందు స్థానిక తెలంగాణవాదులు , జెఎసి నాయకులు ,టీఆర్ఎస్ నాయకులతో పాటు ,కేటీఆర్ ,ఈటెల రాజెందర్ రెడ్డి కూడా వచ్చారు."

    Rajendar's name is wrongly mentioned. He is a BC, not Reddy.

    ReplyDelete
  3. గొట్టిముక్కలన్నకు ధన్యవాదాలు.. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీసీ అన్న విషయం నాకు తెలుసు.. ఈ విషయం పై ఈటెలను హెచ్చరించేవాణ్ని.. అన్నా.. తెలంగాణలో బీసీ నాయకులను ఎదగనీయడం లేదు. మొన్న సాంబశివుణ్ని చంపేశారు.. చెరుకు సుధాకర్ గౌడ్ ను ఇరికించారు.. చురుకైన బీసీ నాయకులను పొట్టన బెట్టుకోవడంలో అందరూ చేతులు కలుపుతున్నారని. ఆయన అట్లుంటదా తమ్మి అనే వాడు.. అయితే ఇక్కడ ఫ్లోలో రాసుకుంటూ పోయినపుడు జరిగిన పొరపాటు. దాన్ని ఐటం టెలీకాస్ట్ చేసేటపుడు గుర్తించాను. కానీ అప్పటికే బ్లాగులో పోస్టు చేశాను. గుర్తించినందుకు ధన్యవాదాలు. సవరించాను.
    ఆలపాటి సాయికృష్ణ.. నిచ్చెన ఎక్కేవాడు.. చెక్క పై జాలి చూపిస్తే ఎక్కలేదు.. మనమంతా చెక్కల్లా.. చెక్కాల్లా.. ఐనవాడికి కాని వాడికీ వత్తాసు పలికితే మన గతి అంతే.. నిన్నను మరిచి పోయి.. నేటిని మాత్రమే గుర్తుపెట్టుకుంటే. జగన్.. బాబు.. కాంగీ నాయకుల్లాంటి వారు మనల్ని మింగుతనే ఉంటరు.

    ReplyDelete
  4. @అయితగాని జనార్ధన్:

    ఈటెల పేరు పక్కల తోక చూసి పరేషాన్ అయిన. గమ్మత్తెందంటే కోదండరాం ఒదిలేసుకున్న తోకను ఆంధ్రోల్లు మాత్రం మస్తు గుర్తు చేసుకుంటరు. మీ బ్లాగు చదివి వాల్లు ఈటెలకు లేని తోక పెడ్తరేమో జర రంది పడ్డ.

    తెలంగాణాల సామాజిక న్యాయం జరగాల్నంటే తెలంగాణా వచ్చినంక కూడ కొట్లాడాలే. నిన్నటినే కాదు, రేపటిని కూడ మర్చిపోవద్దు.

    ReplyDelete
  5. ముళ్ళకంచె ఎక్కేటపుడు అక్కరకులేని పరామర్శ ఆ తరువాత కావాల్సి వచ్చిందా? గాయాలకు MLAలు వచ్చి మలాం పూసి గాలివిసిరి సేవలు చేయాలని ఆశించడం అత్యాశే. అలా చేయలేదని ఆక్రోశించడం త్యాగమెలా అవుతుంది?

    ReplyDelete