ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, January 1, 2012

ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం



రాకాసి బల్లులు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది... వెండి తెరపై రాకాసు బల్లుల రూపాలను చూసే మనం అమ్మో అనుకుంటాం.. ఇప్పుడు ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇంత బలిష్టమైన జీవులు ఈ భూమి పై నుంచి అదృశ్యం కావడానికి కారణాలేంటి. అసలు ఇవి మనుగడ సాగించి, అంతరించిన ప్రాంతాలేవి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తాజాగా లభించిన పరిశోధనల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తల పరిశోెధనల్లో తేలింది. నిజమా... భారతదేశంలోనే రాకాసు బల్లుల పాదముద్రలున్నాయా.. మన పూర్వికులు రాకాసి బల్లులతో సహవాసం చేశారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు
ఈ భూమి ఉద్భవించినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులు చెందింది. భూమి పై పొరలు గడ్డకట్టి నీటి ఆవిరి చినుకు రూపంలోకి మారిన క్షణం నుంచీ ఈ భూమి జీవజాతులకు ఆవాసంగా మారింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం. ఈ భూమి మొత్తం ఒక గడ్డగా ఉండి నీరంతా ఒక వైపు ఉండేదని అంచనా.. ఈ భూ ద్వీపం పైనే జీవ జాతులన్నీ ఉద్భవించాయని.. తరువాత ఖండ చలనం ద్వారా భూమి ఖండాలుగా విడిపోయిందని సిద్దాంతం.. ఈ భూమితో బాటే జీవ జాతులన్నీ విడిపోయాయి. అందుకే అన్ని ఖండాల్లో దాదాపు ఒకే రకమైన జీవజాతులున్నాయి.
అయితే డైనోసార్లు మాత్రం అన్ని ఖండాల్లో అంతరించిపోయాయి. అసలీ డైనోసార్లు ఎందుకు చనిపోయాయి. ఇవి చాలా బలిష్టమైన జీవులు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని బతకగలవు.. శత్రువును ఎదుర్కొవడంలో దిట్ట.. వీటికంటే బలహీన జీవులు ఉత్పాతాలకు తట్టుకొని జీవిస్తుంటే..ఇవెందుకు అంతరించాయి. ఇదే శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వారికి దొరికిన ఒకే ఒక సమాధానం... గ్రహశకలం ఒకటి భూమిన ఢీకొందని.. ఆ నిప్పు సెగల్లో ఈ డైనోసార్లు అంతమై ఉంటాయని... ఈ సమాధానం తొలుత అందరికీ నచ్చింది. మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించారు కూడా.. కానీ కొందరు శాస్త్రవేత్తలు. మాత్రం ఈ వాదనతో విభేదించారు. గ్రహశకలం ప్రభావం అన్ని జీవులపైనా ఉంటుందని.. అది డైనోసార్లనే ఎందుకు చంపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తాజాగా శాస్త్రవేత్తల్లో భారతదేశంలో జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డైనోసార్ల అంతానికి భూ శకలం ఒక్కటే కారణం కాదని తేలింది.
రాకాసి బల్లులు భారత దేశంలో కూడా సంచరించేవి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించేవి. ఇవి సంచరించే ప్రాంతంలో ఈత, పైన్ చెట్లు ఎక్కువగా ఉన్నట్టు వీటి విసర్జక పదార్ధాల విశ్లేషణలో తేలింది. దీన్ని బట్ట ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరించేవని పరిశోధకులు తేల్చారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతం బద్దలవడం రాకాసి బల్లులకు ప్రాణగండంగా మారింది. ఈ పేలుడులో విషవాయువులు, కార్భన్ డై ఆక్సైడ్, మోనాక్సైడ్ లు వెలువడ్డాయి. ఈ లావా ద్రవం మహా బలేశ్వరం నుంచి పశ్చిమం వైపుకు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం వరకు, ఇటు తూర్పు వైపున గోదావరి నది గుండా బంగాళాఖాతం వరకు ప్రవహించింది. లావా దెబ్బకు ఈ ప్రాంతమంతా బూడిదగా మారింది. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ గడ్డికూడా మొలవని పరిస్థితి. తర్వాత జరిగిన వాతావరణ మార్పుల్లో నదీ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో లావా ప్రవహించిన ప్రాంతమంతా.. సారవంతమై అడవులు పెరిగాయి.. గతంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అవి మాడి మసై పోయాయి. కొన్ని కాలపోకుండా భూగర్భంలో కలిసిపోయాయి... అవే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకాసి బొగ్గుగా.. విలువైన ఖనిజంగా మనకు లభిస్తోంది.. ఈ దారిలో కొట్టుకు పోయిన ఇంధనాలన్నీ సముద్ర గర్భానికి చేరి అక్కడ కర్భన రసాయనాలుగా రూపాంతరం చెంది కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోల్ రూపంలో అభిస్తోంది.
భారతదేశంలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. ఇక డైనోసార్ల గురించి పరిశోధన చేసే వారికి ఇండియానే కీలకకానుంది.

6 comments:

  1. /ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం /

    అంటే 'రాకాసి బల్లులకూ చెందిన ఈ ప్రాంతాన్ని ఆఫ్రికా నుండి వలసవచ్చిన తెలంగాణా వాళ్ళు కబ్జా చేసారన్నమాట..పైగా ఆంధ్రావాళ్ళ మీద పడి ఏడుపు ఒకటన్నమాట..

    ReplyDelete
  2. విజ్ఞానం అందించే ఆర్టికిల్ లో అజ్ఞాన వాఖ్యాలు రాయడం నీకే చెల్లింది బ్రదర్.. వాస్తవానికి అవి ఆదిలాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉన్నాయి.. రాజమండ్రి కూడా తెలంగాణ వాళ్లదేనా.. నీ తెలివంతా మంచి పనులకు ఉపయోగించు.. నీ వల్లా.. నా వల్లా తెలంగాణ.. రాదు.. ఆగదు.. పోదు..

    ReplyDelete
  3. ప్రాంతీయ పచ్చకామెర్లతో చూసే సమైక్యవాదులకి అలాగే అనిపిస్తుంది.

    ReplyDelete
  4. voka kothavisayamu telusu kunnamani aanandinchalsindi poyyi pranthala gurinchi mtldatm eemynabagunda?!!!!!!

    ReplyDelete
  5. john inka studenteeeee. athanni lite teesukondi.manchi vishayalu discuss chesukundam .subject ni gather cheddam..ok na guys...........

    ReplyDelete