రాష్ట్రానికి జబ్బు చేసింది.. ఏ జిల్లా చూసినా జ్వరంతో మసిలిపోతోంది.. దాన్ని తగ్గించుకునే వైద్య ఖర్చులు విని వణికిపోతోంది.. ప్రభుత్వ ధర్మాసుపత్రులు ఎప్పటిలాగే చేతులెత్తేస్తున్నాయి.. ఫలితంగా డెంగ్యూ మహమ్మారికి రాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ మరణాలు, వైద్య పరిస్థితి పై ఇది వర్షాకాలానికి.. శీతాకాలానికి సంధి కాలం.. వాతావరణ మార్పులతో జ్వరాలు రావడం, వైరస్ విజృంబించడం సహజమే... కాస్త జలుబు చేసినా ఒళ్లు వెచ్చబడటం కూడా మామూలే.. కానీ ఇప్పుడు మామూలు జ్వరం వచ్చినా గుండె దడదడలాడుతోంది. రక్త పరీక్ష చేసి ఫలితం చెప్పే వరకు టెంపరేచర్ తగ్గనంటోంది.. ఈ మాసంలో ప్రతి ఏటా డెంగ్యూ, చికెన్ గున్యా, విషజ్వరాలు విజృంబించే విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు.. అయినా వ్యాధి సోకకుండా ఫలానా చర్య తీసుకున్నామని చెప్పడానికి మచ్చుకు కూడా ఒక్క కార్యక్రమం లేదంటే... ప్రజారోగ్యం పై ప్రభుత్వాధికారులకున్న చిత్త శుద్దిని అర్ధం చేసుకోవచ్చు.. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా వందలాది మంది రోగులు చనిపోతున్నారు.
డెంగీ జ్వరం... ఇప్పుడీ మాట రాష్ట్రాన్ని వణికిస్తోంది. జ్వరమొచ్చిందంటే గుండె గాబారవుతోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి సోకిన వారి సంఖ్య చూస్తే.. మామూలు జ్వారానికి కూడా ఐసీయు బెడ్ రాసే పరిస్థితి.. రాష్ట్రం మొత్తంగా చూస్తే అధికారిక లెక్కలే 800 పై చిలుకే.. ఆసుపత్రికి రాలేక.. ఆటవిక వైద్యాన్ని నమ్ముకొని, అడవి తల్లి ఒడిలో రాలిపోయే గిరిజనుల మరణాలు ఇంకా పూర్తిగా గణాంకాల్లోకి ఎక్కలేదనే అనుకోవాలి.
డెంగీ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్ గున్యా, ఇవీ ఇప్పుడు రాష్ట్రాన్ని భయపెడుతున్న ఖరీదైన రోగాలు.. అయితే వీటి ప్రాథమిక లక్షణాలన్నీ ఒకే రకంగా ఉండటంతో వ్యాధి నిర్ధారణకు వైద్యులు వెంటనే ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. మామూలు జ్వరంతో వచ్చినా ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేయించుకొమ్మంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల లిస్టు చూసే రోగికి సగం నీరసం వస్తోంది. ఆ పరీక్షల్లో ఏ ఒక్కటయినా పాజిటివ్‌గా వస్తుందేమోనన్న భయం రిపోర్టు వచ్చేవరకు పీడిస్తూనే ఉంటుంది.. గతంలో చలితో కూడిన జ్వరం వచ్చిందంటే క్లోరోక్విన్ మాత్రలతో బాటు జ్వరం గోళీలు, నాలుగు యాంటిబయాటిక్ మాత్రలు వేసుకుంటే నాలుగు రోజుల్లో ఏ జ్వరమైనా మాయవవ్వాల్సిందే.. కానీ ఇప్పుడు ఆ నాలుగు రోజులు కూడా వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే డెంగీ వ్యాధి సోకిందంటే గంటల్లో రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోయి రోగి తీవ్రంగా నీరసించి పోతాడు. వ్యాధి నిరోధక శక్తి క్షీణించి చర్మం పై దద్దుర్లు, పొక్కులు వస్తాయి. విపరీతంగా తల, నొసటి, కళ్ల నొప్పి ఉంటుంది.. ఇందులో సగం లక్షణాలు మామూలు జ్వరాలకు కూడా ఉంటాయి. అందుకే ఈ జ్వరాలను రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఈ జ్వరాలన్నీ దోమ కాటు వల్ల వచ్చేవే.. ప్రభుత్వంముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. దోమల నివారణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పడు ప్రజల పీకల మీదకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
టైఫాయిడ్, మలేరియా జ్వరాలకు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ, కొన్ని ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేసే అవకాశాలున్నాయి. కానీ డెంగీ జ్వరానికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వ్యాధి నిర్ధారణ కొరకు పెద్ద పెద్ద డయాగ్నసిస్ సెంటర్లకు రాస్తున్నాయి. ఎలీసా టెస్టులో డెంగీ జ్వరం అని నిర్ధారణ అయితే తప్ప డెంగీ వైద్యం చేయకూడదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే సీజన్ గా రోగుల వద్ద నుంచి దండిగా పిండుకుంటున్నాయి. కొందరు ప్రైవేట్ వైద్యులు ప్రమాదకరమైన జ్వరం కాదని ముందే గుర్తించినా రోగి ఆర్ధిక పరిస్థితిని బట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. లేని రోగాన్ని అంటగట్టి తగని వైద్యం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క ఊళ్లోనో.. ఏ ఒక్క జిల్లాలోనో కనిపించేది కాదు.. రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య.. ఇప్పటి వరకు నమోదైన డెంగీ జ్వరాల గణాంకాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.. డెంగీ జ్వరం భారిన పడి మరణించిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే ఈ ఏడాదే ఎక్కువగా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం వరంగల్, ఆదిలాబాద్ రెండు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 350 మంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 700 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అంటే రెండు జిల్లాల్లోనే డెంగీ లక్షాలున్న రోగులు వేయికి పైగా ఉన్నారు. ఇవి అధికారిక అంచనాలు. ఇవి కాక వెలుగులోకి రాని గిరిజన, మారుమూల గ్రామాల్లో రోగుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత తాగునీరు వంటి కారణాల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వరంగల్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ వైద్య యంత్రాంగం కదిలింది. నియోజక వర్గాల వారీగా మండల స్పెషాలాఫీసర్లతో సమావేశాలు నిర్వహించి చర్యలు ప్రారంభించారు. 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 140 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయితే కేవలం ఒకరు మాత్రమే మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, డెంగీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారగణం సమాయత్తమవుతోంది.
ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడి మరణించటం ఈ ఏడాది కొత్తేం కాదు. ఈ సీజన్ లో దోమ కాటు వల్ల జ్వరాలు విజృంభిస్తాయన్న నిజం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు. దోమల నివారణే సగం వ్యాధి రాకుండా నివారణ అన్న వాస్తవం కూడా ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలే.. అయినా ముందు జాగ్రత్త తీసుకోక పోవడంలో ఉన్న మతలబు ఏంటి.. ఈ సీజన్ లో డెంగీ, చికున్ గన్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధి గ్రస్తుల సంఖ్య ఎక్కువే అని తెలిసినా అన్ని గ్రామాలకు సరిపడా మందులు పంపిణీ చేయకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి.. ప్రభుత్వ నిర్లక్షం నీడన జరిగే తప్పిదాలకు ప్రజలు నిండు ప్రాణాలను మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఒంగోలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రలు, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పరీక్ష చేసిన 91మందిలో 11 మందికి డెంగీ లక్షణాలు కనిపించడంతో మిగతా రోగుల్లో ఆందోళన మొదలయింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షల పేరు చెప్పి వేలల్లో వసూలు చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు నెలలుగా 200 మందికి పైగా డెంగ్యూ, విష జ్వరాలతో మృత్యు వాత పడ్డారు. ప్రభుత్వాధికారులు మాత్రం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. డెంగీ వ్యాధి చికిత్సకు అవసరమైన సౌకర్యాలు జిల్లాలో లేకపోవడంతో జిల్లా వాసులు వైద్యం కోసం మహారాష్ట్రకు వెళుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 50 మందికి పైగా డెంగీ కేసులు గుర్తించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మరణించార. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయి రోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. రోగుల సంఖ్య వందల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం తక్కువ చేసి చెబుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మల్, మంచిర్యాల, బైంసా కేంద్రాలలో డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్యులు మాత్రం అసలు డెంగీ లేదని చెబుతుంటే.. ప్రైవేట్ వైద్యులు మాత్రం డెంగీ తీవ్రత ఎక్కువయిందనే పొంతనలేని సమాధానాలతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
దీనికి తోడు గ్రామీణ వైద్యులు కమిషన్లకు కక్కుర్తిపడి నమ్మిన రోగులను కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించుకుపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో గ్రామీణ వైద్యులు కుమ్మక్కై కమిషన్లకోసం కక్కుర్తి పడటంతో సాదారణ రోగులకు కూడా డెంగీ అంటగట్టి అవే మందులు అంటగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న వారి రక్త నమూనాలు సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్‌కు పంపించి పరీక్షించగా... 65 మందిలో 31 మందికి మాత్రమే డెంగీ ఉన్నట్టు వెల్లడయింది. అయినా సదరు కార్పోరేట్ ఆసుపత్రుల నిర్వాకాన్ని ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల నిండా నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజాబాబాద్, కరీంనగర్, గుంటూరు వాసులు డెంగీ భయంతో చికిత్స చేయించుకుంటున్నారు.
కరీంనగర్‌లో కూడా 57 మండలాల్లో 190 గ్రామాల్లో పారిశుధ్య లోపంతో రోగాలకు నిలయంగా మారాయి. జిల్లాలో మంథని, హుస్నాబాద్, సిరిసిల్ల,ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ మండలాల్లో విషజ్వారాల తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలో తగిన వైద్యం లభించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఖర్చు భరించలేని వారిని ఆరోగ్ర శ్రీ ఫథకం ఆదుకోలేకపోతోందని ఆవేదన చెందుతున్నారు. డెంగీ వంటి జ్వరాలు ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రాకపోవడంతో సామాన్యుడికి ఎదుయ్యే అనుకోని ఖర్చుతో సతమతమవుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ రోగుల సంఖ్య, మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఏటికేటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం... వచ్చాక చూద్దాం అన్న ధోరణిలో ఉండటం వల్ల సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వం ప్రకటనలతో పొద్దుపుచ్చకుండా ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదీ రాష్ట్రానికి కుట్టిన నిర్లక్ష్య దోమ ఫలితం.. సకాలంలో వైద్యం అందక, ప్రజల ప్రాణాలను, ఆస్థులను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి.. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
Thursday, October 27, 2011
కాసులు రాలుస్తున్న డెంగీ జ్వరం
కార్తీక మాసంలో పూజలెందుకు చేస్తారు
ఒక్కమాట... ఈ వ్యాసంలో ఉన్నవి నా అభిప్రాయాలు కావు.. ఇవి నేను కూడా వేరే దగ్గర సేకరించినవేనని గమనించగలరు
మన భారతీయ సంసృ్కతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ స్వామికి ��ఆశుతోషుడు�� అను బిరుదు కలిగింది.
��హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ! ప్రతి ఈశ్వ రాలయంలో ఆ రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందు వుల గృహాలలో ��ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం�� అనే పంచాయతన దేవతలను విశ ేషంగా ఆరాధిస్తారు.
ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.
ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ��ఈ కార్తీకమాస వ్రతము�� హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.
ఈ మాసమందు వచ్చు సోమవారములు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాస ముప్పది దినములు ఆచరించిన వార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడినది.
ఇందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.
కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారా ధనలు, పూజలు కావించి, నివేదించిన అన్నాన్ని రా త్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక నక్తవ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా ��అర్థనారీశ్వ రుడుగా�� దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ��అధ్యక్షురాలు��గా అధిరోహించియుండగా! పరమే శ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయి స్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తా డుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.
కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహ స్తుంది అని చెప్పబడినది.
ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనమందు ఉంటాడని చెప్తారు.
ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చినది. పాల సముద్రమును చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధ నలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశము నలుమూలలా గల ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమి ట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వ హిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభము లకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమే శ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహి స్తారు. అలా హరి హరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పుటకు సహస్రముఖములు కలిగిన ఆదిశేషుడు, చతు ర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత? అని సూతమహాముని చెప్పియున్నారు.
మన సంసృ్కతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవునేయి కలిపి వెలిగించిన దోషములేదని, అలా! ఒకటి మొదలు వేయి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభ ప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాం గణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.
ఈ మాసమందు సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వార్కి కాను కలు సమర్పించుటతోపాటు, సమీప వన మందు బంధువులు, స్నేహితులతోకూడి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారముతో వన భోజనములు చేస్తూ ఉండుట మంచిది. అం దువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదము తోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుంది.
అట్టి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసమందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ ��కార్తీకపురాణ�� పఠనము గావించిన ఎడల అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాకుండా, జన్మాంతరమందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్య్యమును గూర్చి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.
విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కృత్తికా నక్షత్రం:
కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.
కార్తీక దీపాలు
ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.
కార్తీక సోమవారాలు:ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.
ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.
కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.
సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన - సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.
ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.

Wednesday, October 26, 2011
తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి అసలు గుట్టు ఇదే..?
భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్.....
కాంగ్రెస్ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్ రింగ్ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.
లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్ గ్రూప్ హైదరాబాద్‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు
సీమాంధ్ర ఎంపీలు, కాంట్రాక్టర్లు తెలంగాణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో వారికున్న కాంట్రాక్టులేంటి.. తెలంగాణ వస్తే నష్టపోయేది.. సీమాంధ్ర ప్రజలా.. సీమాంధ్ర పొలిటికల్ కాంట్రాక్టర్లా ... ఇన్ని వేలకోట్ల లావాదేవీలు ఉండబట్టే రెండు ప్రాంతాల ప్రజలను ఉద్యమాల పేరుతో చెడుగుడు ఆడుతున్నారు.... ఎవరి ప్రాజెక్టులు.. ఎన్ని కోట్ల లావాదేవీలో ఒకసారి చూద్దామా...
తెలంగాణ స్వరూపాన్ని మార్చిన నిర్మాణాలు
భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న ప్రాజెక్టుల్ని ఓసారి పరిశీలిస్తే...
గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్.....
కాంగ్రెస్ పార్టీకి చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కాల్వ పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న 8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య 323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్ రింగ్ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య 699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 48.69కోట్లతో కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది.
లాంకో గ్రూప్..
హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్ పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక ఆదాయం 12వేల కోట్ల పైమాటే.
కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్
నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో చేపట్టిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాంకీ గ్రూప్
తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో 500కోట్ల రూపాయలతో బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్ గ్రూప్ హైదరాబాద్‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల నేషనల‌్ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. దీంతో పాటు ఫారూక్‌నగర్-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్ గ్రూపు అగ్రగామిగా ఉంది.
నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు
Tuesday, October 25, 2011
దీపావళి పండుగ వెనుక అసలు కథ
లోక కంఠకుడు నరకాసురుడు మరణించిన రోజును ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు. జగతి యావత్తు వెలుగులు పంచుకునేలా మతాబులు కాలుస్తారు. ఇంతకీ నరకుడు ఎవరు..? అతడి జన్మ వృత్తాంతం ఏంటి..?
నరకాసురుడు భూదేవికి, వరాహమూర్తికి కలిగిన సంతానం అన్నది పురాణ కథనం. పూర్వం, దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడి సోదరుడు... హిరణ్యాక్షుడు, భూదేవిని ఎత్తుకెళ్లి సముద్రంలో దాక్కుంటాడు. దీంతో శ్రీహరి... వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుని హతమార్చి భూదేవిని రక్షిస్తాడు. తనను కాపాడిన వరాహ రూప శ్రీహరిని భూదేవి మోహిస్తుంది. వరాహమూర్తి కారణంగా భూదేవి గర్భం ధరిస్తుంది. భూదేవి-విష్ణుమూర్తి తనయుడి వల్ల తన త్రిలోకాధిపత్యానికి ముప్పు వస్తుందని భావించిన ఇంద్రుడు.. భూదేవి ప్రసవించకుండా ఆమె గర్భాన్ని గడ్డలాగ చేశాడట. ఫలితంగా నరకాసురుడు రమారమి 27 యుగాల పాటు భూదేవి గర్భంలోనే ఉండి పోయాడట. దీంతో తనకు కానుపవ్వాలని భూదేవివిష్ణుమూర్తిని కోరిందట. తాను త్రేతాయుగాన రామావతారంలో రావణ సంహారం జరిపాక శిశువును ప్రసవించగలవని... విష్ణువు, భూదేవికి చెప్పాడట.
2: 27 యుగాల పాటు గర్భంలో ఉన్న నరకుడు... త్రేతాయుగంలో.. రావణుడు హతమైన రోజున జన్మించాడు. విష్ణువు, భూదేవిల తనయుడు రాక్షసుడిలా మారడం విశేషం. నరకుడు ఎందుకిలా లోక కంఠకుడయ్యాడు..?
: త్రేతాయుగంలో శ్రీరాముడు, రావణాసురుడిని హతమార్చాక.. భూదేవి నరకుడికి జన్మనిచ్చింది. అయితే... రాక్షసులు మేలుకొని విజృంభించే అసుర సంధ్య వేళ నరకుడు పుట్టాడు. దాంతో తన తనయుడికి రాక్షస లక్షణాలు వస్తాయని ముందే ఊహించిన భూదేవి, నరకుడిని వధించవద్దంటూ విష్ణువును కోరుతుంది. తన చేతిలో తప్ప ఎవరి చేతుల్లోనూ తనయుడికి చావు లేకుండా వరం కోరుతుంది.
: నరకుడికి జన్మనివ్వడానికి ముందే... భూదేవి... సీతను పెంచి పోషించిన జనక మహారాజును ఓ ఉపకారం కోరుతుంది. రావణ వధానంతరం, నరకాసురుని కూడా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పాలని అడుగుతుంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమారునికి నరకుడని పేరు పెట్టి, విద్యా బుద్ధులు నేర్పుతాడు. నరకునికి పదహారు సంవత్సరాల వయసు రాగానే.. భూదేవి వచ్చి అతణ్ణి గంగాతీరానికి తీసుకు వెళ్లి... అతని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. అదే తరుణంలో.. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నరకునికి శక్తి అయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకొని కామరూప దేశాన్ని ఏలుకొమ్మని చెప్పి భూదేవితో సహా అదృశ్యమవుతాడు. ఆ విధంగా నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు.
3: కామరూప దేశాధినేత అయ్యాక కొంత కాలానికే నరకుడు లోక కంఠకుడిగా మారిపోతాడు. అసుర సంధ్యా సమయాన జన్మించడం.. దుష్టుల సహవాస దోషం కారణంగా.. రాక్షస లక్షణాలను పుణికి పుచ్చుకుంటాడు. నరకుడు.. సాధు సత్పురుషులతో పాటు, దేవతలనూ వేధించడం మొదలు పెడతాడు.
భూదేవి భయపడ్డట్లుగానే, నరకుడు జనన కాల దోషం కారణంగా.. రాక్షస లక్షణాలు పొందాడు. పైగా బాణాసురుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రక వాసుదేవుడు, కాలయవనుడు లాంటి దుష్టుల సహవాస దోషంతో దేవతలకు జన్మించినప్పటికీ లోకకంఠకుడైన రాక్షసుడిగా మారాడు. అతడు దేవతలపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని వారిపై దాడి చేసి దేవతలను జయించాడు. వరుణుడి ఛత్రాన్ని లాక్కున్నాడు. మేరుపర్వతానికి పోయి దానిలోని మణి పర్వతాన్ని తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దేవేంద్రుని తల్లి అదితి కుండలాలను బలవంతంగా లాక్కు వెళ్లాడు.
: నరకుడు సాధు సత్పురుషులను కూడా అతి కిరాతకంగా హింసించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లగా... నరకుడు ఆలయ తలుపులు మూయించాడట. దీంతో కోపించిన వశిష్టుడు జన్మదాత చేతుల్లోనే మరణిస్తావని శపిస్తాడు. ముని శాపానికి భయపడ్డ నరకుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని.. దేవతలు, రాక్షసుల నుంచి మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో మరింత రెచ్చిపోయాడు. ఋషులను మరింతగా బాధించాడు. 16 వేల మంది రాజకన్యలను బంధించాడు.
: నరకుని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు, రుషులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. విష్ణ్వంశతో అవతరించిన శ్రీకృష్ణుడు.. దేవతల ప్రార్థనలతో కరిగి.. నరకుని సంహరించేందుకు కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయన ఇష్టసఖి సత్యభామ కూడా శ్రీకృష్ణునితో కలిసి యుద్ధానికి వెళుతుంది.
నరకుడిని వధించేందుకు ప్రాగ్జోతిష పురం వెళ్లిన సత్యభామా కృష్ణులకు... శత్రు దుర్భేద్యమైన దుర్గాల వలయాలు ఆశ్చర్య పరుస్తాయి. పంచ దుర్గావృతమైన ప్రాగ్జ్యోతిషపురాన్ని ఛేదించడానికి శ్రీకృష్ణుడు యోగమాయను ఉపయోగిస్తాడు.
: నరకుడి కామరూప దేశపు రాజధాని ప్రాగ్జ్యోతిష పురం అత్యంత భయంకరంగా ఉండేది. దాని భేదించడం సామాన్యులకే కాదు.. శక్తియుక్తులున్న ఇంద్రాది దేవతలకూ అసాధ్యం. జయించడానికే కాదు ముట్టడించడానికీ వీలుకాని దుర్గ పంచమంగా నిర్మితమైంది. ప్రాగ్జ్యోతిషపురం... గిరిదుర్గం, శస్త్ర దుర్గం, జలదుర్గం, వహ్నిదుర్గం, వాయుదుర్గం అనే ఐదు విభిన్నమైన కోటలతో నిర్మితమైంది. : తొలి వరుసలో కొండలతో నిండిన దుర్గం, రెండో వరుసలో బాణాలతో రూపొందించిన దుర్గం, మూడో వరుసలో వేగంగా ప్రవహించే నదీనదాలు ఉంటాయి. నాలుగో వలయంలో ఎగసి పడే అగ్నికీలలు, చివరి వరుసలో శత్రు భయంకరమైన... ప్రచండ గాలులతో నిండిన దుర్గం ఉంటుంది. వీటన్నింటినీ మించి.. ఎందరో యోధానుయోధులు.. నగరం చుట్టూ కాపలాగా ఉంటారు. ఆ పైన ఎలాంటి వారినైనా బంధించి వేసే మురాసురుడి పాశాలు ఉన్నాయి. ఇన్నింటిని దాటి ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించడం మహామహులకే సాధ్యం కాదు.
: అయితే.. శ్రీకృష్ణుడు భగవత్స్వరూపుడు. నరకుడిని వధించేందుకు వెళ్లిన వెన్నుడు.. తన గదా దండంతో గిరిదుర్గాన్ని తుత్తునియలు చేస్తాడు. అలాగే, మహామహిమాన్వితాలైన బాణాలతో శస్త్ర దుర్గాన్ని ఛేదిస్తాడు. సుదర్శన చక్రాన్ని స్మరించి, ఆ చక్రాయుధంతో మిగిలిన దుర్గాలను ఛేదిస్తాడు. మురుడి పాశాలను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తాడు. సమరోత్సాహంతో.. తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. నీటిలో నిద్రలో ఉన్న మురుడు పాంచజన్య రవానికి ఉలికిపడి లేచి, శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి వస్తాడు. అతడు విసిరిన గదను శ్రీకృష్ణుడు తుత్తునియలు చేస్తాడు. చక్రాయుధంతో.. మురుడి ఐదు తలలనూ నరికేస్తాడు. మురుడి ఏడుగురు కుమారులూ కృష్ణునితో యుద్ధానికి రాగా.. వారినీ హతమార్చుతాడు.
: నరకుడి వధచారులు, సేవకుల ద్వారా.. పంచదుర్గాలు ఛేదితమైన విషయాన్ని, మురుడు హతుడైన సంగతిని నరకుడు తెలుసుకుంటాడు. ఇక తానే యుద్ధానికి సమాయత్తమవుతాడు.
: శ్రీకృష్ణుడి శక్తిని గురించి తెలుసుకున్న నరకుడు నేరుగా తానే యుద్ధానికి వస్తాడు. గరుత్మంతుని మీదకు శక్తి అస్త్రాన్ని వేస్తాడు. అయితే.. వజ్రాయుధాన్నే లెక్కచేయని గరుడుడిని శక్తి అస్త్రం పెద్దగా బాధించదు. నరకుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. సత్యభామ... నరకుడు తన కొడుకేనన్న సంగతి గుర్తించలేకపోయింది. పైగా నరకుడు ఆమెతో కామాతురుడై, అసభ్యంగా ప్రసంగిస్తాడు. దానితో ఆమె ఆగ్రహించి, శ్రీకృష్ణుడు అనుగ్రహించిన దివ్యాస్త్రంతో నరకాసురుణ్ణి సంహరిస్తుంది.
2 : నరకుడు హతమయ్యాక, సత్యభామగా అవతరించిన భూదేవికి పూర్వస్మృతి కలుగుతుంది. తనకిచ్చిన వరం ప్రకారమే.. శ్రీహరి నరకుడిని తన చేత వధింపచేశాడని గుర్తిస్తుంది. పుత్రశోకాన్ని దిగమింగి.. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. దీంతో.. నరకుడు మరణించిన రోజు నరక చతుర్దశిగా ప్రసిద్ధమవుతుందని భగవంతుడు వరమిస్తాడు.
: నరకుని వధతో.. అతడి చెరలో ఉన్న సాధు జనులు, పదహారు వేలమంది రాజకన్యలు విముక్తులవుతారు. వారు శ్రీకృష్ణునే వరించామని చెప్పటంతో, ఆయన వారిని వివాహమాడతాడు. లోకకంఠకుడైన నరకుడి పీడ విరగడైందన్న సంతోషంతో ప్రజలు పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగిందని పురాణాలు చెబుతాయి. నరకుని పీడ విరగడ కావడంతో.. ఆనంద పరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోను, మరునాడూ పండుగ జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. నరకుని వధించాక.. అతని కుమారుడు భగదత్తుని కామరూప దేశానికి రాజును చేసి... శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ద్వారకకు తిరిగి వెళతాడు. నరకుడు అపహరించిన దేవమాత అదితి కర్ణకుండలాలను తీసుకున్న శ్రీకృష్ణుడు.. పారిజాతాన్ని తెచ్చేందుకు వెళ్లినప్పుడు, ఆమెకు అప్పజెబుతాడు.
నరకుడు పరిపాలించిన కామరూప రాజ్యపు ఆనవాళ్లు నేటికీ భారతావనిలో కనిపిస్తాయి. ప్రస్తుతం అసోం రాష్ట్రంలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. కామాఖ్య పట్టణమే నాటి ప్రాగ్జ్యోతిషపురమన్నది హిందువుల నమ్మకం.
: అసోం రాష్ట్రం.. గౌహతికి దగ్గర్లో నీలాచల పర్వతం ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో.. అద్భుతమైన ప్రకృతి రమణీయతతో నీలాచల పర్వతం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ కామాఖ్యదేవి మందిరం ఉంది. ఈ ప్రదేశాన్ని చూసే వారికి ఆ జనని నిజస్థానం చేరుకున్న అనుభూతి కలుగుతుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య... దర్శన మాత్రాన్నే పాపాలను హరించి జన్మజన్మలకు సరిపడా పుణ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.
: కామాఖ్యదేవి కొలువైన నీలాచల పర్వత శ్రేణిని చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది రోడ్డు మార్గం. మెట్ల మార్గంలో వెళ్లడానికి ఓ గంట సమయం పడుతుంది. కామాఖ్య గేట్ నుంచి మొదలయ్యే రోడ్డు మార్గంలో వెళ్లడానికి సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు కావలసినన్ని అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మార్గాల ద్వారానూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
లోకకంఠకుడైన నరకుడు మరణించడంతో.. చీకట్లు తొలిగి పోయాయని, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అయితే.. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారు..? దీపానికి, లక్ష్మీదేవికి ఏంటి సంబంధం..?
: నరకాసురుడు హతుడవడంతో... లోకాన్ని అలముకున్న తిమిరం తొలగి పోయిందని ప్రాగ్జ్యోతిష పురం ప్రజలు భావించారు. అందుకే తిమిరాన్ని తొలగించేందుకు జగతి మొత్తం వెలుగులు పరచుకునేలా... ఇంటింటా లెక్కకు మిక్కిలిగా దీపాలు వెలిగించారు. తిమిరమున్న చోట దరిద్రదేవత జేష్ఠాదేవి కొలువుంటుందని, చిన్నపాటి దివ్వెను వెలిగించినా ఆమె అదృశ్యమవుతుందని హిందువులు నమ్ముతారు. ఎక్కడ వెలుగులు ఉంటే అక్కడికి లక్ష్మీదేవి వచ్చి చేరుతుందంటూ ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
: దీపానికి లక్ష్మీదేవికి ప్రత్యక్ష సంబంధం ఉందని నమ్ముతారు. పూర్వం దూర్వాస మహర్షి... శక్తిని ప్రసన్నం చేసుకుని ఆమె కంఠాన ఉన్న హారాన్ని అనుగ్రహంగా పొందాడు. దాన్ని త్రిలోకాధిపతి దేవేంద్రునికి అందిస్తాడు. అయితే... మత్తులో మునిగి ఉన్న ఇంద్రుడు ఆ హారాన్ని ఐరావతం మీద వేస్తాడు. ఆ మత్తేభం, హారాన్ని కింద పడేసి, కాళ్లతో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు మహోగ్రుడై.. సర్వ సంపదలను కోల్పోతావని దేవేంద్రుని శపిస్తాడు. ఫలితంగా.. దేవేంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలనూ కోల్పోతాడు. తన తప్పిదానికి పశ్చాత్తాప పడ్డ దేవేంద్రుడు, దిక్కుతోచక, శ్రీహరిని శరణు వేడుతాడు. ఒక జ్యోతిని వెలిగించి దాన్నే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని శ్రీహరి సూచిస్తాడు. ఆ విధంగా దేవేంద్రుడు పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి, ఇంద్రునికి పూర్వ వైభవాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణ కథనం.
: అప్పటి నుంచి దీపాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తూ... పూజించడం ఆనవాయితీ. దీపావళి పర్వ దినాన, సిరిదేవి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే దీపాలను ఏ దిక్కు పడితే ఆ దిక్కున ఉంచి పూజిస్తే మాత్రం ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని ప్రాచీనులు విధివిధానాలను నిర్దేశించారు.
: తూర్పు, ఉత్తర ముఖంగా దీపాలను ఉంచే ఇళ్లలో, దీపాల కాంతి నలుమూలలా వ్యాపించే ఇళ్లలో లక్ష్మీదేవి కరుణ అమితంగా సిద్ధిస్తుందట. సాయంత్రం వెలిగించిన దీపం ఉదయం పూజ వరకూ వెలిగే ఇళ్లలో అష్టయిశ్వర్యాలు సమకూరుతాయట. సాయంత్రాలు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అమితమైన కరుణ సొంతమవుతుందట. పడమర, దక్షిణ దిక్కుల్లో దీపాలు ఉంచే ఇళ్లు... దరిద్రానికి చిరునామాగా మారతాయట.
: దివ్వెలు వెలుగులనే కాదు.. సిరిసంపదలనూ పంచి పెంచుతాయి. అందుకే... దీపాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.
దీపావళి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి
శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు చేయరాదు
దీపాలను ఎప్పుడేగాని నోటితో ఊపి ఆర్పరాదు
శుక్రవారం పూట అన్నాన్ని దానం చేయవద్దు
అక్క చెల్లెళ్ల మనసు కష్టపెట్టవద్దు
సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో నిద్ర పోరాదు
ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచి వెళ్లదు
ఇల్లాలిని సంతోషంగా ఉంచాలి
అబద్ధాలు ఆడరాదు
ఆవులను పూజించాలి
ముంగిళ్లు ముగ్గులతో కళకళ లాడాలి
గడపలకు పసుపు పూయాలి
ఇట్లాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
అంతేకాదు.. పువ్వుల్లో, పాలల్లో, ధాన్యపు రాశుల్లోనూ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది.

Monday, October 17, 2011
బలస్వామ్యం
వాడెందుకు పుట్టాడో... ఎలా పుట్టాడో
ఎవరికి పుట్టాడో... ఎక్కడ పుట్టాడో
వాడికే కాదు.. ఎవరికీ తెలియదు..
కానీ..
ప్రతి కులంలోనూ వాడుంటాడు..
ప్రతి మతంలోనూ వాడుంటాడు...
ప్రతి పార్టీ వాడిదేేే...
ప్రతి సెక్షన్ వాడి కోసమే...
.........................
జీవిత సారాన్ని ఎంత జీర్ణించుకున్నాడు
సమాజ గ్రంధాన్ని ఎంతగా చదివాడు వాడు
ఇప్పుడు వాడికి అందరూ మిత్రులే..
ఇప్పుడు వాడిలో అన్నీ ఉన్నాయి..
ధైర్యం కూడా...
అందుకే తెగించాడు.. తెగదెంచాడు..
తిరుగులేని నాయకుడయ్యాడు..
తనపై సమాజానికి లేని జాలి
ఈ సమాజం పై తనకెందుకు
అందుకే ఇది వాడి స్వామ్యం...
వాడి వలన, వాడి చేత వాడి కొరకు
ఇది వాడిగా మొనదేరిన వాడిస్వామ్యం..
ఇది బలమున్నోడి స్వామ్యం..
బలస్వామ్యం.. బలవంత స్వామ్యం.
బరువైన బాల్యం
ఇదేమి జ్ఞాపకం...
వర్షరుతువు జీవితాన్ని ఎంత వాటేసింది
నన్నూ... నా జ్ఞాపకాలను
చినుకు చిగురింపజేసే తలపులెన్నో..
అయ్యో...
నేను కోల్పోయిన బాల్యం..
ఎంత మధురం.. ఎంత దుర్భరం..
బాల్యమంతా పరపీడన పరాయణత్వం
ఒక్కో చినుకూ భూమిని తాకి
మట్టి గంధాన్ని, మకరందాన్ని..
తేనె పరిమళాన్ని వెదజల్లే నీటి ఆవిరులు..
గుప్పున గుబాళించే బాల్య స్మృతులు..
ఆ గుబాళింపులో బాల్యం బావురుమంది.
దారంట తొంగిచూసే మొలకలు
చిరిగిన చొక్కా.. చినిగిన పుస్తకం
అరకలు, బాయి గిరకలు
ఆరుద్ర పురుగులు, ఆవకాయ పచ్చళ్లు
కొత్త తరగతులు, కొత్త మాస్టార్లు
ఒకే ఒక్క చినుకు టైం మిషనైంది
కాల గర్భంలో నిదురించిన
రెండున్న దశాబ్దాలకు మోసుకెళ్లింది..
ఆహా ఈ వర్షరుతువు నా బాల్యాన్ని
దాని బరువును ఎంతగా పెనవేసుకుంది
ప్రతి బాల్యం ఓ మధుర జ్ఞాపకం కాదు..
మధుర జ్ఞాపకాలన్నీ బాల్యాలే..
****************************
చితి మంటల్లో మత మిణుగురులు
చితి మంటల్లోంచి చిమ్ముకొచ్చే మిణుగురులు
ఆహా ఎక్కడివిరా ఆ నవీన విజ్ఞాన కాంతులు
ఆహా ఎక్కడిదిరా ఈ విశ్వాస త్యాగాల చరిత్ర
ఇక్కడ కళేబరాలు తిరిగి లేస్తాయి..
హైటెక్ యుగంలో భూ కేంద్ర సిద్ధాంతం
భవిష్యత్తు జాతకం చెప్పించుకునే ఆరాటం
ఇక్కడ సజీవ శవాలున్నాయి.
మనుషుల్ని పీక్కుతినే మతాసురులున్నారు
రోజొక గ్రంధాన్ని లిఖిస్తారు..
ఇక్కడ ఆకలికి అలమటించే మొక్కలున్నాయి
ఆకురాల్చని బ్రహ్మజముడుంది..
పచ్చదనం వెనుక కూడా కృారత్వం ఉంది.
పరాధీన ప్రేతాత్మలు
ఇక్కడ ఎన్ని మెదడు లేని దేహాలు
అబ్బా.. అన్నీ పరాధీన ప్రేతాత్మలే
ఒక్కడి మాటే వేదమంత్రం...
వశీకరణ కంటే బలమైనది
ఇది ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం
ఇది పశుపక్ష్యాదులు సిగ్గుపడే మూర్ఖత్వం
అమ్మను కూడా బలిచ్చే అత్యాశ పరులు
ఆడబిడ్డను కూడా ఆవిరి చేసే అజ్ఞానులు
కొమ్మను కూడా నరుక్కునే కౄరత్వం
ఒక్కడే సృష్టించాడా ఈ జాతిని..
ఒకేలా సృష్టించాడా ఈ నీతిని..
నిజంగా మెదడున్నా లేని దేహాలే..
పరాధీన ప్రేతాత్మలే
Friday, October 14, 2011
నెలరోజుల 'సమ్మె'ట
తెలంగాణ మొత్తాన్ని దిగ్భందం చేస్తే తప్ప తెలంగాణ రాదనే ఉద్దేశ్యంతో తల పెట్టిన సకల జనుల సమ్మె నేటికి నెలరోజులు కావస్తుంది. తెలంగాణలో సాగుతున్న సకల జనుల సమ్మె నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్నే ఇబ్బంది పెట్టింది. తాజాగా అది దేశ రాజదాన్నే చీకటి మయం చేసే స్థాయికి ఎదిగింది. సమ్మె ఇలానే కొనసాగితే దేశ ఆర్ధిక పునాదులే కదులుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ సకల జనుల సమ్మెలో ఏం దాగుంది.. ఈ సమ్మె యావత్ దేశాన్ని కుదిపేయడం వెనుకున్న మూలాలేంటి.. ముప్పై రోజుల సకల జనుల సమ్మె పై ప్రత్యేక కథనం.
తెలంగాణ ఉద్యమం ఎంత తారా స్థాయికి చేరినా ప్రభుత్వం దిగిరావడం లేదనే ఉద్దేశ్యంతో... తెలంగాణ వాదులంతా ఏకమై సకల జనుల సమ్మెకు పిలుపు నిచ్చారు. ఉద్యోగ, కార్మిక, ఉపాద్యాయ సంఘాలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేసి తమ సత్తా ఏంటో ఢిల్లీకి చాటాలనుకున్నారు. గత నెల 13న ప్రారంభమైన సమ్మెలో ఎన్నో ఆటుపోట్లు... వదంతులు.. ప్రభుత్వ వ్యూహాలు.. ధిక్కారాలు.. అనధికారికంగా అణిచివేత ఉత్తర్వులు.. విభజించి పాలించే సూత్రాలు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు.. అరెస్టులు.. కేసులు.. ఆఖరుకు వదంతులు.. ఇవన్నీ గత నెలరోజులుగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్న తాజా వార్తలు.. కళ్లారా చూస్తున్న కష్టాలు.. అనుభవిస్తున్న నష్టాలు. ఒక లక్ష్యం కోసం.. ఒక ఆశయం కోసం.. దశాబ్దాలుగా చేస్తున్న నిరీక్షణలో అంతిమ పోరుకు సిద్ధమైన తెలంగాణ ప్రజల సహనానికి నిలువెత్తు నిదర్శనం.. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని ఒక సత్యాగ్రహ సంగ్రామం..
ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతం విముక్తి కోసం చేసే దశాబ్దాల పోరాటం అంతిమ దశకు చేరిందా అంటే అవునని... కాదని... సమాధానం చెప్పలేని దుస్థితి.. రాజ్యం తగలబడిపోతుంటే పిడేలు వాయించుకునే నీరోలను అనుసరిస్తున్న పొలిటికల్ హీరోలున్న రోజులివి.. నీకిస్తే నాకేంటనే రాజకీయ పద్దులు లెక్కగట్టే కాలమిది.. ఈ తరుణంలో తెలంగాణ అనే సున్నిత సమస్యను కఠినంగా ఎదుర్కొవాలనే దురాలోచన... దూరాలోచన... ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టేదనే మాట గత నెలరోజుల సమ్మె చెప్పకనే చెబుతుంది.
సకల జనుల సమ్మె హఠాత్తుగా రాత్రికి రాత్రే వచ్చి పడింది కాదు.. అలాగని ఏ ఒక్క రాజకీయ పార్టీయో నిర్ణయం తీసుకొని అమలు చేసింది కూడా కాదు.. తెలంగాణ పై తేల్చకుంటే సకలం స్థంబింప జేస్తామని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా కాకున్న ఎవరికి వారైతే ప్రకటించారు. రూపాలు వేరైనా ఒకే రకంగా నినాదించారు.. సకల జనుల సమ్మెను మామూలు సమ్మెగా ఎదుర్కొడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దింపాలని ప్రయత్నించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ఒకరంగంలో ఉన్న వారిని మరోరంగంలోకి మార్చి ఉపయోగించుకోవలనే ప్రయత్నం కూడా చేసింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరుకు సకల జనుల సమ్మె ముందు రాజ్యం తలవంచక తప్పలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. తరిగిపోతున్న బొగ్గు నిల్వలు, ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్న, మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, పాఠశాలలను మరిచిపోయిన విద్యార్ధులు, రోడ్డెక్కని ఆర్టీసి బస్సు.. కదలని కరెంటు బిల్లు... ఒక్కటని కాదు.. అన్ని రంగాలపై సకల జనుల సమ్మెప్రభావం స్పష్టంగా కనిపించింది... ఆఖరుకు మద్యం డిపోల్లో కూడా సిబ్బంది బందు ప్రకటించడంతో మద్యం రేట్లు కూడా చుక్కలను వెక్కిరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మద్యాన్ని, బస్సులను ఉద్యమకారులు అడ్డుకోవడంతో... తెలంగాణలో సమ్మెకు వ్యతిరేకంగా ఏపని చేయాలన్నా ఇతర ప్రాంతాల వారు జంకుతున్నారు.
సకల జనుల సమ్మె ప్రభావం వల్ల సింగరెణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి.. ఇటు రాష్ట్రంతో బాటు అటు దేశంలోనూ విద్యుత్పత్తి నిలిచిపోయింది. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో కేటాయించిన కరెంటునే కేంద్రం వెనక్కు లాక్కుంది. ఆర్టీసి బస్సు చక్రాలు డిపోల్లోనే నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. డ్ర్రైవర్లు, కండక్టర్లతో సహా ఆర్టీసి సిబ్బంది మొత్తం సమ్మెకు దిగడంతో రోడ్డు పై ఆర్టీసి బస్సు అనేది కనిపించక వారాలు దాటింది. బొగ్గు పెళ్లను పెకిలించింది లేదు. . ఇతర ఉద్యోగులను ప్రలోబపెట్టి పనులు చేయించుకునే ప్రభుత్వ వ్యూహాన్ని సమ్మెలో ఉన్న ఉద్యోగులు సంఘటితంగా తిప్పి కొట్టగలిగారు. సెట్విన్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా సమ్మెకు మద్దతిచ్చి రెండు రోజుల సమ్మె చేశాయి. రైల్ రోకోలకు భయపడ్డ ప్రభుత్వం ఏకంగా రైళ్లనే నిలిపేసింది. సచివాలయంలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోతున్నాయి. పెన్షన్లు, రిజిస్ట్రేషన్లు, ఉపాధి వేతనాలు అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వందల కోట్ల నష్టంతో బాటు ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది.. తెలంగాణ వచ్చేవరకు విద్యా సంవత్సరాన్ని వదులు కోవడానికి కూడా విద్యార్ధులు వెనకాడటం లేదు.. ఉద్యోగులు, కార్మికులు ఉపాద్యాయులు జీతం రాకున్నా ఓపిక పడుతున్నారు. కాబట్టి సకల జనుల సమ్మె సామాన్యుడి పై కంటే ప్రభుత్వం పైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నెల రోజుల సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సమస్యను తేల్చే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

Wednesday, October 12, 2011
తెలంగాణ రహస్యం ఇదా...?
అరణ్యంలో తిరిగే ఆరుద్ర పురుగులన్నీ ఒక్కటై రేపటి పొద్దు పొడుపుకు పురుడు పోస్తనంటున్నయి. చిమ్మ చీకటిలో ఎగిరే మిణుగురులన్నీ కొమ్మ కొమ్మన చేరి చీకటిని తరమేస్తమంటున్నయి. ఇక్కడి నేలకు పోరాటాల పురిటి వాసన పోలేదు. ఇక్కడి మట్టి కణాలతో ఏ వీరుడి రక్తకణాలో పెనవేసుకొని నిత్యం కణకణ మండుతుంటయి. లోకం కోసం తనలో తాను రగిలే సూర్యుడిలా మండే ధీరుల శ్వాసలు పిల్లగాలులై ప్రసరిస్తాయిక్కడ. ఈ నేలను ఓపికతో తవ్వుకుంటూ పోతే ఊరికో దదీచి ఎముక దొరుకుతుంది. పొద్దు పొడుపును పొత్తి కడుపులో దాచుకుని పురిటి నొప్పులు పడుతున్న తల్లులు గంభీరంగా ఊపిరి బిగబడతారిక్కడ.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లు నిండుతుంటే... కొత్త చేతులు మొలుస్తాయిక్కడ.. గన్నేరు.. మందారం.. మోదుగుపూలు ఒక్కటై వీరమాలల్లుతాయి... ఎన్ని తరాలు అంతరించినా త్యాగంలోనే తరించే జాతి మాది.. ఇది తెలంగాణ.. రుద్రావేశంతో పెఠీల్మని ఎద తంత్రులు తెంచుకున్న కోటి రతనాల వీణ..
Tuesday, October 11, 2011
సకలం బందులో పాఠశాలలు ?
సకల జనుల సమ్మె వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారని... విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో తెలంగాణ వాదుల మాత్రం తెలంగాణ వస్తుందనుకుంటే విద్యాసంవత్సరం కోల్పోవడానికి కూడా సిద్ధమేనంటున్నారు... లక్షలాధిరూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకు డొనేషన్ల రూపంలో చెల్లించేవారు విద్యా సంస్థల యాజమాన్యాన్ని , ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు. సకల జనుల సమ్మె... తెలంగాణ మొత్తం స్థంభిచి పోవాలనే లక్ష్యంతో.. సకల జనుల సమ్మెను తలపెట్టారు.. కానీ ప్రభుత్వ సంస్థలు తప్ప ప్రైవేట్ సంస్థలేవీ ఈ సమ్మెలో పాల్గొనడం లేదని.. అన్ని రకాల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతుంటే విద్యార్ధులను ఈ సమ్మెలోకి లాగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇటు తెలంగాణ వాదులకు అటు విద్యార్ధుల తల్లి దండ్రులకు మద్య తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తోంది.
అవును.. గత రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో యన్ ఆర్ ఐ విద్యాసంస్థ ముందు.. పాఠశాల తెరవాలని.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని విద్యార్ధుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. కావాలంటే ఉద్యమాల్లోకి మేమొస్తాం.. మా పిల్లల్ని ఉద్యమాల్లోకి లాగకండని పేరెంట్స్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ స్కూల్ య ాజమాన్యం మాత్రం రెండు రోజుల గడువు కోరింది.
కూకట్ పల్లి అంటే సహజంగా ఆంధ్రా సెటిలర్స్ ఉండే ప్రాంతం కనుక వారిలా మాట్లాడారని తెలంగాణ వాదుల విమర్శ. తెలంగాణలో ఎక్కడా లేనిది కూకట్ పల్లిలోనే ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమో.. లేక అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండి పిల్లల విద్య పట్ల అధికంగా శ్రద్ధ చూపడమో ఒక కారణం కావచ్చు.. కానీ అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు. పిల్లల చదువుల జోలికి పోకూడదని.. సమ్మె వల్ల విద్యార్ధులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలేవైనా పాఠశాల బంద్ చేస్తే విద్యార్ధులు ఇంటి వద్ద ఉండి టీవీ రిమోట్ తో ఆడుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. మిగతా వ్యాపారాలన్నీ జోరుగా సాగుతుంటే విద్యాసంస్థల బంద్ దేనికని వారి ప్రశ్న. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్ షాపులు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుకోని వారు విద్యాసంస్థలను తెలంగాణ వచ్చేవరకు తెరవొద్దంటూ అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదివించే తాము బందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మంగళవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు విశాలాంధ్ర మహాసభ సభ్చుడు నలమోతు చక్రవర్తి పరుషంగా మాట్లాడటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.
తెలంగాణ సాధన కోసం తాము ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదులు ఊరూరా... వాడ వాడనా చాటుతున్నారు. విద్యార్ధులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దసరా సెలవులు మగిసీ ముగియడంతోనే పాఠశాలలు తెరవాలంటూ విశాలాంధ్ర మహాసభ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపడంతో ... తెలంగాణ వాదుల కోపం తారా స్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు ప్రెస్ క్లబ్ వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. పలుమార్లు తెలంగాణ వాదులు లోపలికి దూసుకురావాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ పై దురుసుగా వ్యవహరించిన నలమోతు చక్రవర్తి, ఆయన కారు డ్రైవర్ పై చర్యతీసుకోవాలంటూ రిపోర్టర్లు నిర్వాహకుల్ని అడ్డగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విలేకరులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
రాజకీయ పార్టీలు విద్యార్ధులను ఉద్యమాల కోసం వాడుకోవడం తగదని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు విద్యార్ధులతో సంబంధం లేకుండానే ఉద్యమాన్ని కొనసాగించ వచ్చన్నారు. విద్యార్ధులను చదువులకు దూరంగా ఉంచడం ద్వారా లక్ష్యం నెరవేరదన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సంస్థలన్నిటినీ నిలిపి వేస్తామని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాఠశాలలు మూసివేయక తప్పని పరిస్థితి. అలాగని ప్రైవేటు పాఠశాలలకు అనుమతి నిస్తే రేపు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు వెనకబడితే నష్టం ప్రభుత్వోపాధ్యాయులకు, వారిని నమ్ముకున్న విద్యార్ధులకు అందుకే అనివార్యంగా ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందులో పాల్గొనాల్సివస్తోంది. పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందనుకున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మేథావులంటున్నారు.

మారన్ కథ జైలుకేనా...?
2జి స్పెక్ట్రమ్ కేసులో దయానిధి మారన్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇటు కళానిధి మారన్ ఇంట్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. ఎయిర్ సెల్, మ్యాక్సిన్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి మారన్ సోదరుల పై ఈ సోదాలునిర్వహించారు. మరోవైపు హైదారబాద్ లో అపోలో గ్రూప్ డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. దీంతో 2జి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంతకీ 2జి కుంభకోణం అంటే ఏంటి.. 2జి స్పెక్ట్రం కేసులో ఎవరెవరి పై ఆరోపణలొచ్చాయి. అసలేంటీ 2జి కథ.. ఒకసారి అవలోకిద్దాం..
దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం డొంక కదులుతూనే ఉంది. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులంతా ఒక్కొక్కరే చెరసాల చెంతకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రాజా, కనిమొళిలు జైలు భోగాలు అనుభవిస్తుంటే ఆ జాబితాలోకి మారన్ సోదరులు కూడా చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. మారన్ సోదరులను ఇప్పటి వరకు అరెస్టు చేయనప్పటికీ ఇరువురు సోదరుల పై సిబిఐ కేసులు నమోదు చేసింది.
రాజా, కనిమొళితోనే ఈ కథ కంచికి చేరిందనుకున్నారంతా.. ఆ మధ్య మారన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆ వార్తలను సిబిఐ ఖండించడం వెనుక అంతరార్ధం ిఇప్పుడు భోదపడుతోంది. దయానిధి మారన్ కమ్యునికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ సెల్, మాక్సిన్ సంస్థల లైసెన్స్ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించారనే అపవాదు మూట గట్టుకున్నారు. టెలికామ్ అధికారుల నుంచి ఏకగ్రీవ సిఫారసులు ఉన్నప్పటికీ, మారన్ ఎయిర్‌సెల్ ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు సీబీఐ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఎయిర్‌సెట్ పట్ల ఒత్తిడి తెచ్చే వైఖరిని మారన్ అనుసరించినట్లు కూడా నివేదికలో పేర్కొంది. కంపెనీలో కొంత వాటాను మాక్సిస్ సంస్థకు విక్రయిం చాల్సిందిగా ఎయిర్‌సెల్ చీఫ్‌పై మారన్ ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా తమ విచారణలో తేలినట్టు సీబీఐ తన నివేదికలో తెలిపింది. దయానిధి మారన్ వ్యూహాల వల్లనే ఆయన సోదరుడు కళానిధికి చెందిన సన్ టీవీ రూ.750 కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు సీబీఐ వర్గాలు గతంలోనే వెల్లడించాయి. ఎయిర్‌సెల్‌లో తన వాటాను కళానిధికి విక్రయించాల్సిందిగా దయానిధి తనపై ఒత్తిడి తీసుకువచ్చి నట్లు ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు శివశంకరన్ గతంలోనే ఆరోపించారు.
ఈ కుంభకోణంలో చిదంబరం పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపద్యంలో 2జి కేసు పై మరింత ఆసక్తి నెలకొంది. వివిధ కారణాల వల్ల కాస్త జాప్యం జరిగినా తిరిగి తెర పైకి వచ్చింది. తాజాగా మారన్ సోదరుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మారన్ సోదరుల పై అరెస్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ అపోలో డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయాల పై సిబిఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఉచ్చు ఇంకా ఎందరు ప్రముఖుల మెడుకు చుట్టుకోనుందోనన్న ఆసక్తి నెలకొంది.
Saturday, October 8, 2011
Saturday, October 1, 2011
బతుకమ్మ పేదోళ్లదా...? పెద్దోళ్లదా..? నిజాలేంటి..?
బతుకమ్మ పండుగకు మూలాలెక్కడ.. బతుకమ్మకు జీవం పోసిందెవరు... ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా.. బతుకమ్మకు పూలకు సంబంధం ఏమిటి.. బతుకమ్మ కథల్లో నిజమెంత.. స్పెషల్ స్టోరీ..
బతుకమ్మ.. వెల్లివిరిసిన పూల సంబరం. నడిచొచ్చిచ్చే పూవనం.. మంచు తడికి మురిసిపోయే పూల కొమ్మలు పడుచుల కొనగోటిని తాకే తరుణం.. తడిగాలుల్లో తేనె పరిమళం పరుచుకునే పూలరుతువు.. మత్తడి దునికే నీళ్లతో చిత్తడిగా మారిన నేల పొత్తిళ్లను పొదివి పట్టుకునే పూరెమ్మల గారాబం.. వర్షరుతువుకు.. శీతాకాలానికి నడుమ ఆహ్లాదబరిత పరిమళాలు వెదజల్లే సుమస్మమ్మోహనం.. ఈ రుతువులోనే ఎన్నో ప్రకృతి కార్యాలకు పునాదులు పడతాయి. ఈ రుతువే ఎన్నో వాతావరణ మార్పులకు బీజం వేస్తుంది.. ఈ వాతావరణమే ఎన్నో ఉత్పరివర్తనాలకు పునాది వేస్తుంది.. చంటిపిల్లను చంకనెత్తుకున్న చందంగా పూలుగుత్తులను ఎత్తుకున్న తంగేడు మొక్కలు.. అడవి పడుచు శిగలో తురుముకున్న కొండ మల్లెల్లా... కొండకోనల్లో వయ్యారంగా నడుస్తున్న కోయ పడుచుల్లా... గాలికి ఊగుతున్న గునుగు పూలు.. ఎంత వర్ణించాలన్నా ఈ రుతువులో కనిపించే ప్రకృతి అందం మాటలకు చాలదు. ఈ సుమతాడన స్పర్శతో మగువ మునివేళ్లు కొత్త అనుభూతితో పొంగిపోతాయి.
మనుషులకు కులాలు మతాలు, కట్టుబాట్లు ఉంటాయి.. నింగి, నేల, ఆకాశం అగ్ని, వాయువు పంచభూతాలకు ఏ కట్టుబాట్లు తారతమ్యాలు లేవు. అలా అని చాటి చెప్పేందుకే బతుకమ్మ పండుగలో పదం పదం.. పాదం పాదం కలిపి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఈ పండుగను తెలంగాణ జాతి మొత్తం జాతీయ పండుగలా జరుపుకుంటున్నా.. ఒకప్పుడు ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమనే వాదనలు కూడా ఉన్నాయి. . బతుకమ్మ పుట్టుకకు కారణమైన పురాణగాథలు చాలానే ఉన్నా.. అసలు కారణం మాత్రం ఒక్కటేనని పరిశోధకులు అభిప్రాయం.. విజ్ఞానం అంతగా అభివృద్ది చెందని రోజుల్లో ప్రసూతి మరణాలు అధికంగా జరిగేవి.. వివిధ రకాల కారణాల వల్ల పిల్లలు పురుటిలోనే చనిపోయేవారు.. పుట్టిన పిల్లలు వరసగా చనిపోతుంటే.. తర్వాత పుట్టిన సంతానం తమది కాదన్నట్టు.. పెంటకుప్ప పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. అలా పెంటకుప్ప పై శిశువును వదిలితే ఆ తమది కాదని దుష్టశక్తులు వదిలేస్తాయని పూర్వికుల నమ్మకం. పెంటకుప్ప పై చాటలో పెట్టిన శిశువులు కొందరు కాకతాళీయంగా బతికారు.. అటువంటి వాళ్లకు పెంటయ్య, పెంటమ్మ అనే పేర్లు కూడా పెట్టారు. కాస్త సంపన్న వర్గమైతే మరీ పెట్టకుప్పమీద పెట్టకుండా కాసిన్ని పూలు, ఆకులు ఒక్కచోట చేర్చి దాన్నే చెత్త కుప్పగా భావించి శిశువును పూలదిబ్బ పై పడుకోబెట్టేవారు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు అదృష్టవశాత్తూ బతికినందువల్ల.. ఆ పూల దిబ్బనే బతుకమ్మ అన్నారు.. అంతేకాదు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు ఏడుస్తుంటే మహిళలంతా చుట్టూ చేరి ఊయల పాటలు పాడేవారు.. తమ శిశువును కాపాడినందు వల్ల ఆ పూలదిబ్బకు మహిహలున్నాయని.. ఆ పూలకుప్పే తమ ఇలవేల్పని భావించి గౌరమ్మను చేర్చి పూజించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది..
ఇంతకీ బతుకమ్మ పేదల పండుగా.. పెద్దోళ్ల పండుగా.. అనే వాదన ఎదురయినపుడు దీన్ని పేదల పండుగ అనే ఎక్కువ మంది వాదిస్తారు. ఎందుకంటే ఈ పండుగ పుట్టుకలోనే పేదతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బతుకమ్మ కోసం బొడ్డెమ్మను పుట్టమన్నుతో చేస్తారు. బతుకమ్మను అడవిపూలతో పేరుస్తారు.. కాబట్టి ఏ ఖర్చూ ఉండదు.. అంతేకాకుండా.. గౌరమ్మను పూజిచేందుకు ఏ మంత్ర తంత్రాలూ వాడరు.. కేవలం పాటలతోనే ఆదిశక్తిని స్తుతిస్తారు. ముగ్గులు, పూలు, పాటలే ఈ బతుకమ్మ ఖర్చులు.. బతుకమ్మకు పెట్టే ప్రసాదం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొన్నది.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఉన్న నానబెట్టిన బియ్యం, పాలు, అటుకులు, బెల్లం ఇవే ప్రసాదాలు.. సంపన్న వర్గం చేసుకునే వేడుకలకు చక్కర పొంగలి, నూనెతో చేసే పిండి వంటలు, దేవుడి కళ్యాణం, ఆ కళ్యాణానికి మంత్రాలు, వంటి రకరకాల తంతులుంటాయి.. బతుకమ్మ వేడుకల్లో ఇవేవీ ఉండవు. అందుకే బతుకమ్మ పేదల పండుగ అని చాలా మంది వాదిస్తారు.
బతుకమ్మ పండుగకున్న విశిష్టత మరోటి ఉంది.. వర్షరుతువులో కురిసిన వానలన్నీ చెరువుల్లో చేరుతాయి. ఆ నీటిలో రకరకాల మలినాలు చేరి కలుషితంగా తయారవుతాయి. ఈ కలుషిత నీటిని తంగేడు పూలు శుద్ధి చేస్తాయి. తరువాత కలరా వంటి వ్యాధులు వ్యాపించకుండా గునుగు పూలు అరికడతాయి. పూర్వకాలంలో సంపన్న వర్గాలకు ఇళ్లలో బావులుండేవి.. వాటిలో పంచాయితీ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు. కానీ పేద ప్రజలకు బావుల్లో నీటికి ప్రవేశం లేదు. అందుకే వారు మంచినీటికోెసం కుంటలు, చెరువులను ఆశ్రయించాల్సి వచ్చింది. తాము మంచినీటి కోసం వాడే చెరువులు కాబట్టి వారే వాటిని శుద్ధి చేసుకునేవారు. వాడవాడంతా కలిసి తంగేడు గునుగు పూలతో బాటు గౌరమ్మగా పేర్చిన పసుపును కుంటలు చెరువుల్లో కలపడం ద్వారా నీరు శుద్ది అవుతుంది..
కాలక్రమంలో పూలకుప్పగా పూజలందుకున్న బతుకమ్మ కాస్త అనేక రూపాలు మార్చుకొని ఇప్పుడు తెలంగాణ జాతి యావత్తూ జరుపుకునే సంబరంగా మారింది. పుక్కిటి పురాణాలను పక్కన బెట్టి బతుకమ్మ పండుగలో ఉన్న ఔచిత్యాన్ని చూడాలి.. పదిమందిని ఒక్కటి చేసే పూలజాతరను ప్రోత్సహించాలి.. ఆడపడుచులకు అనధికార కౌన్సిలింగ్ కేంద్రాలుగా మారిన బతుకమ్మలను పేర్చే ఇళ్లు సంసారాలను చక్కబరుస్తున్నాయి.. వాదాలు వివాదాలు మాని బతుకమ్మ సంస్కృతిని దేశం మొత్తం ఆచరించే విధంగా తీర్చిదిద్దాలి..
Subscribe to:
Posts (Atom)