ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, January 31, 2012

విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది


అంబేడ్కర్ విగ్రహం కూలింది.. తల తెగి కాలువలో పడ్డది... రాజ్యాంగ స్ఫూర్తి ప్రధాత మురికి కాలువలో మునకేశాడు.. అంబేడ్కర్ కేవలం దళితుల సొత్తేనన్నట్టు దళితులంతా గుండెలు బాదుకున్నారు. ఆ ఘోషలో మిగతా జనం పడే బాధ కనిపించలేదు. భారతదేశానికంతటికీ పూజ్యనీయుడైన అంబేడ్కర్ ఏ కులానికీ మతానికీ, ప్రాంతానికీ చెందిన వాడు కాదని ఇప్పటి వరకు చదువుకున్నాము.. అలా పక్షపాత రహిత వ్యక్తి, మేథావి, కాబట్టే ఆయనకు దేశ న్యాయవ్యవస్థనే నిర్ధేశించే బృహత్తర బాధ్యత అప్పజెప్పారు. ఆయన కూడా దళితులు తన జాతి వారు అని కాకుండా... దేశంలో ఒక వర్గం వారు ఎలా అణిచివేతకు గురవుతున్నారో స్వతహాగా తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఏ చట్టాలు చేస్తే.. అణచబడే వారు ఎదుగుతారో అధ్యయనం చేసి.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రచన చేశారు. సో.. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన అంబేడ్కర్ అభినందనీయుడే.. కానీ ఆ రాజ్యాంగాన్ని అక్షరం దిద్దకుండా చేసిన చట్టాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభ కూడా దళితులకు పూజ్యనీయమైనదే.. ఆ మాట కొస్తే అంబేడ్కర్ ఆ పదవిలో లేకున్నా న్యాయం జరగదని మాత్రం ఊహించలేం.. సరే ఇది పక్కన పెడితే.. ఇన్నాళ్లకు అంబేడ్కర్ విగ్రహం పై తాగుబోతులకు ఎందుకు కోపం వచ్చింది. దీనికి చాలా కారణాలుండొచ్చు.. దాని వెనక విపరీతమైన కుట్రలూ దాగి ఉండొచ్చు. కారణాలు చెబితే.. చదువరులలో ఒక వర్గానికి కోపం రావచ్చు. కానీ కారణాలు పక్కన బెట్టి కుట్రల గురించి నాకు తెలిసింది.. నాలుగు ముక్కలు పంచుకుంటాను.
అంబేడ్కర్ దళితులను ఎవరూ కించపరచరాదని చట్టం తెచ్చింది. ఆ పునాదులతోనే ఎస్సీ, ఎస్టీ ‍యాక్ట్ రూపుదిద్దుకుంది. ఆ యాక్ట్ నేడు ఎవరెవరికి ఉపయోగపడుతుందో ఇప్పడు పెద్దగా చెప్పాల్సిన అవరసం లేదు. బ్లాక్ మెయిల్ చేసే వారికి ఇది బంగారు బాతుగా మారిందని అనడంలో అతిశయోక్తి లేదు. గల్లీ లీడర్, పోలీస్ దగ్గర్నుంచి డీఎస్పీ స్థాయి వ్యక్తుల వరకు ఈ చట్టాన్ని ఎలా చట్టుబండలు చేసి దండుకుంటున్నారో తెలియంది కాదు. పాపం నిజంగా అణిచివేయబడే వారికి ఈ చట్టం అందని ద్రాక్షే. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష పేరుతో తిడుతున్నా.. వారికి ఈ చట్టం వర్తించదు. సరే ఈ విషయాలను పక్కన బెట్టి ఇప్పుడు విగ్రహాల పై ఆగ్రహం దగ్గరకు వస్తాను. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాన్ని కుక్కలు చింపిన విస్తరిలా.. రాష్ట్రంలో పరిపాలనా క్రమశిక్షణను డాంబర్ రోడ్డు పై వేసిన సీసం గోళీల్లా తయారు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పుట్టకొక్కుల కంటే ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఈ విగ్రహాలకు డబ్బులెవరిచ్చి పెట్టిస్తున్నారో.. తెలియంది కాదు... సాక్షి వీక్షకులకు ఇది కంఠోపాఠం. డబ్బున్న వాడు వందల విగ్రహాలు పెట్టిస్తాడు. పెట్టవద్దు అనడానికి అవకాశమే లేదు. అధికారంలో ఉన్న మాయావతే దీనికి నిదర్శనం. అధికారంలో లేకున్నా విగ్రహాలతో పునాదులు గట్టిగా వేసుకోవడం జగన్ కే సాధ్యం. సో ప్రత్యర్ధులు ఈ విగ్రహాలు వెలవకుండా సర్వశక్తులు ఒడ్డారు. వీటిని నియంత్రించడానికి ప్రత్యేక చట్టమంటూ లేక పోవడం తెలిసి నాలిక్కరుచుకున్నారు. కానీ ఏదో ఒక చట్టం కావాలి. దానికి సందర్భం కావాలి. ఆ చట్టమే కాలికి తగిలిందిప్పుడు. యస్... అంబేడ్కర్ విగ్రహాలను ఎవరు.. ఎందుకు కూల్చారో అన్న విషయం పక్కన పెట్టినా.. ఆ తరువాత వ్యూహాత్మకంగా మోహన రంగా, ఎన్జీ రంగాల విగ్రహాలు రంగులు వెలిశాయి. వాళ్ల పేర్లు మళ్లీ వార్తల కెక్కాయి. తరువాత ఎన్జీఆర్ విగ్రహాలు కూడా కంపించాయి. ఇప్పుడు ఎవరి వంతు..? దివంగత మహానేత.. ప్రియతమ నాయకుడు.. అని నిత్యం జగన్ జపం చేసే వైయస్ విగ్రహాల వంతనేది ఎవరిని అడిగినా చెబుతారు. ఎవర్నీ తప్పు బట్టడానికి వీలుండదు. ఈ తప్పులను విచారించాలన్నా.. విగ్రహాలను నియంత్రించాలన్నా.. ఈ గొడవలను అడ్డు కట్ట వేయాలనే సాకుతో చట్టం తీసుకువచ్చే అవకాశం ప్రభుత్వానికి దొరుకుతుంది. దీంతో 2014 వరకు విగ్రహాల ప్రతిష్టాపనను నియంత్రించవచ్చు. అంటే అంబేడ్కర్ విగ్రహాలను కూల్చేస్తే... దళితులకు ఆగ్రహం వస్తుంది... రంగాల విగ్రహాలను కూల్చేస్తే రెండు వర్గాల మధ్య పోరు ముదురుతుంది... అదే సందర్భంలో వైయస్సార్ విగ్రహాల జోలికి వెళ్లొచ్చు. ఇదే వ్యూహం.. సో.. తుఫాను వెలిసినట్టు కనిపించినా.. మళ్లీ త్వరలో వైయస్ విగ్రహం పై చేయి వేసి పైచేయి సాధించాలని ప్రత్యర్ధులు బలంగా పావులు కదిపినా ఆశ్చర్యం లేదు. సో విగ్రహాల్లారా.. నిగ్రహం పాటించండి...

Monday, January 30, 2012

ఎస్పీ బాలసుభ్రమణ్యానికి ఇదేం బుద్ది


తెలుగు భాష గురించి సుద్దులు చెప్పే బాల సుబ్రమణ్యం గురించి నేను చాలా ఊహించుకున్నాను. తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నామని.. పరభాషకు బానిసలైపోతున్నామని తెగ మదన పడిపోయే మన ఎస్పీ బాలసుబ్రమణ్యం అలియాస్ ఎస్పీబీ డొల్లతన బయట పడింది. ఆ మధ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో రాధకృష్ణ అనే సోకాల్డ్ జర్నలిస్టు చేసే ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాంలో ఆయన మనసు విప్పాడు. అయితే ఆయన పర్సనల్ విషయాల గురించి.. మనకెందుకులేగానీ... ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో సెటైర్లు ఉన్నాయి. కానీ తెలుగు భాషను ఉద్దరిస్తానని జబ్బలు చరుచుకునే ఈ అపర గాన గాంధర్వుడు ఇంటర్వ్యూ మొత్తం టింగ్లీష్ లో సాగింది. ఇట్స్ హేపెన్ అంతే.. ఇట్స్ హెపెన్ అంటూ... తెలుగు మాట్లాడే ఇంగ్లీష్ వాడిలా బిల్డప్ ఇచ్చాడు .. ఆ దెబ్బకు నేను షాక్ కు గురయ్యాను. ఇంగ్లీష్ భాషకు బానిసయ్యామని, యాంకర్లంతా ఇంగ్లీష్ లేనిదే యాంకరింగ్ చేయలేకపోతున్నారని.. వ్యగ్యాస్త్రాలు విసిరే ఎస్పీబీ గారికి ఇదేం బాగాలేదనిపించింది. ఆయన చక్కని తెలుగులోనే మాట్లాడాలని నేను అత్యాశ పడటం లేదు. ఇతరులు మాట్లాడే భాషను హేళన చేసి తాను మాత్రం తగుదునమ్మా అంటూ ఆంగ్లాంధ్రంలో మాట్లాడం ఎలా చెల్లిందని ఆవగింజంత ఆందోళన.

Sunday, January 29, 2012

రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ తో జతకట్టనున్న కేసీఆర్ ?


టీఆర్ఎస్ పార్టీ అధినేత ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాడు... ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక ఏ పార్టీతోనన్నా పొత్తుకు సై అంటుందా.. ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి మెదడుకు పదును పెడుతోంది. గతంలో 2004 ఎన్నికల్లో వైయస్సార్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ తో జత కట్టాడు. తరువాత తెలంగాణ ఇవ్వలేదని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి పాత మిత్రుడు చంద్రబాబును కలిశాడు. చంద్రబాబుతో ఆఖరు నిముషం వరకు పొత్తు ఖరారు కాలేదు. తరువాత ఎలాగోలా పొత్తు కుదిరినా తరువాత సవాలక్ష కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ సారి మాత్రం టీఆర్ఎస్ తో పొత్తుకు కలిసి రావడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలంటే తమ కోరికలు చంపుకొని దాసోహం అనాల్సిందే.. ఆఖరు వరకు టెన్షన్.. టెన్షన్. పొత్తు కుదురుతుందో లేదో తెలియదు. ఈ లోపు వివిధ నియోజక వర్గాల్లో పాగా వేయాలని ఆశపడ్డ అభ్యర్ధులంతా తమ పార్టీకి ఆ స్థానం కేటాయిస్తారో లేదో అనే అనుమానం వెంటాడుతుంది. తరువాత భాగస్వామ్య పార్టీ తన అభ్యర్ధులను ఖరారు చేసుకోవడంలో అయోమయంలో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కేసీఆర్ వైఖరితో విసిగి వేసారాయి. ఇక కేసీఆర్ పొత్తు పెట్టుకోడానికి పార్టీలేవీ మిగల్లేదు. అందుకే కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీతో కేసీఆర్ జత కట్టొచ్చనే ఊహాగానాలు జోగుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఆలోచన ఉండబట్టే మహబూబా బాద్ లో రాళ్లతో కొట్టిచ్చిన కేసీఆర్... జగన్ తెలంగాణలో దీక్షచేస్తే నామమాత్రపు వ్యతిరేకతతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లించిన చంద్రబాబును మాత్రం నాన్ స్టాప్ గా ఆడిపోసుకొని.. తమ న్యూస్ ఛానల్, తమ పేపర్ లలో అడ్డ దిడ్డంగా తిట్టి.. తెలంగాణలో రైతు పోరు బాటను రచ్చరచ్చ చేశారు. కాన్వాయి మీదకు రాళ్లూ రప్పలు విసిరారు. కానీ పార్లమెంట్ లో తెలంగాణకు వ్యతిరేకంగా ఫ్లకార్డు పట్టుకొని ఊరేగిన జగన్ ను మాత్రం మహబూబాబాద్ నాటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ముందే అనుకున్న ప్రకారమో... చేసుకున్న ఒప్పందం ప్రకారమో జగన్ తెలంగాణలో స్వేచ్ఛగా తిరగగలిగాడు. ఈ చనువు చూసుకొనే చంద్రబాబు హ్యాపీగా తెలంగాణ వచ్చి కేసీఆర్ దళం పై సూటిగా విమర్శలు గుప్పించగలిగాడు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో జగన్ ను టార్గెట్ చేయాలంటే తెలంగాణలో కేసీఆర్ ను కార్నర్ చేయాలనేది బాబు వ్యూహం. కేసీఆర్ కూడా తమ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉన్నాడు. తొలి విడత ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి తెలుగుదేశంలాంటి పార్టీల డిపాజిట్లు గల్లంతయినా... రెండోసారి బాన్సువాడం వంటి ప్రాంతాల్లో కేసీఆర్ ఖంగు తినాల్ి వచ్చింది. అందుకే మళ్లీ పొత్తు రాజకీయాలకు తెరలేపబోతున్నాడు. కాంగ్రెస్ కు ధీటుగా ఎదుగుతూ... బాబును టార్గెట్ చేసిన జగన్ కు జ్ఞానోదయం కలిగిందని కేసీఆర్ భావించాడని చాలమంది అభిప్రాయం . అందుకే రానున్న ఎన్నికల్లో జగన్ తో పొత్తుకుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ముదస్తుగా చేసుకున్న ఒప్పంద ప్రకారమే నడుస్తుందని ప్రజాసంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అదే జరిగి ... జగన్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది... ఇక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా మర్చిపోవలసిందే.. ఎందుకైనా మంచిది. కేసీఆర్ తన క్రెడిబిలిటీ నిలుపుకోవాలంటే.. జగన్ తో జత కట్టకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tuesday, January 17, 2012

స్త్రీలకు అన్యాయం చేసిన దేవుడు... స్త్రీలకు భావప్రాప్తి లేకుండా చేసిన సృష్టి కర్త.. దానికి మార్గం ఇదిగో...

ఈ కథనం అశ్లీల సాహిత్యం కాదు.. కేవలం విజ్ఞానాన్ని అందించడానికి రాసిన సైన్స్ ఆర్టికిల్... ఉద్రేకం కోసమో... మరేదైనా ఆశించి చదివేవారు మీ సమయాన్ని వృదా చేసుకోవద్దు. మంచి విషయం తెలుసుకోవాలనుకున్న అన్ని వయసుల వారికీ ఈ ఆర్టికిల్ నాలెడ్జ్ నిస్తుంది. ఇది అప్ డేటెడ్ సైన్స్ ఆర్టికిల్.. అవుట్ డేటెడ్ కాదని గుర్తించ గలరు. ఇక ప్రారంభించండి.

ఈ ప్రకృతికి మూలం సెక్స్ అన్న విషయం భూమి పై పుట్టిన ప్రతి మనిషికి తెలిసు. కానీ సెక్స్ పునరుత్పత్తికేనా...? అవును ఒక్క మానవుడిలో తప్ప మిగతా జీవులన్నీ సెక్స్ ను పునరుత్పత్తికి మాత్రమే వాడుకుంటాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే సెక్స్‌ సుఖానికి బానిసయ్యాడు. ఆ కోరిక కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఎన్నో రుచులను ఆస్వాదించాలని ఆశపడతాడు. తాను కోరుకున్న దాన్ని దక్కించుకునేదుకు రాజ్యాలను, కోల్పోయిన వారున్నారు. ఇళ్లూ వాకిళ్లు గుల్ల చేసుకున్న వారున్నారు. జీవితాన్ని భారంగా మలుచుకున్న వారున్నారు. పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. దీనికి మగా, ఆడా అన్న భేదం లేదు. అందరూ ఒక్కటే.. అన్ని సుఖాల్లో కెల్లా అత్యంత విలువైనదీ, ప్రమాదకరమైనదీ సెక్స్.
అయితే ఈ సెక్స్ జీవితం అందరికీ సమానంగా ఉండదు. స్త్రీ, పురుషుల్లో వేరు వేరుగా ఉంటుంది. ప్రకృతి తీర్చి దిద్దిన ఆకారాలు మానవ పునరుత్పత్తికి తగినట్టు ఉన్నా... ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన భావావేశాలుంటాయి. దీనికి కారణాలు వారికున్న లైంగికేచ్ఛ, వారు పెరిగిన వాతావరణం, వారిలో ఉత్పన్న మయ్యే హర్మోన్లు, ఇలా రకరకాల కారణాలు వ్యక్తి పై ప్రభావం చూపుతాయి. హైపో సెక్సువాలిటీ.. హైపర్ సెక్సువాలిటీ అని వాడుకలో ఉన్న మనుషుల భావావేశాల తారతమ్య స్థితిని తెలుపుతాయి. అయితే మొత్తం సెక్స్ నాలెడ్జ్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ అవుతుంది. కానీ స్త్రీ, పురుషులిరువురి మధ్యలో ఉన్న భేదం ప్రస్తావిస్తాను. ఎందుకంటే లైంగిక కార్యంలో పురుషుడు అంతిమంగా వీర్య స్కలనం తరువాత తృప్తి పొందుతాడు. అది శీఘ్రస్కలనమైనా, దీర్ఘ స్కలనమైనా.. పురుషుడు భావ ప్రాప్తి పొందుతాడు. అంటే సెక్స్ అయిపోయిందనిపిస్తాడు. తన కోరిక తీరుతుంది.. మరి మగువలకు ఆ అదృష్టం లేదా... భేదమే కొంపలు ముంచుతోంది.. పురుషుడు బలహీనుడైనా.. శీఘ్రస్కలన సమస్యలున్నా... లేక ఇతర కారణాల వల్లనైనా.. మగువ మగడితో నానా ఇబ్బందులు పడుతుంది. వద్దంటే ఊరుకోడు... అలా అని పూర్తి స్థాయి సుఖాన్నిస్తాడా అంటే అదీ లేదు. అందుకని అర్ధాకలితో రోజులెల్లదీసుకోవలసిందే.. ఎన్ని కోట్ల రూపాయాల సంపద ఉన్నా.. ఆ కొరత తీర్చలేనిది.. ఒక వేళ డబ్బుంది కదా అని గీత దాటినా.. గీత ఆవల సుఖం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. పై పెచ్చు కొత్త సమస్యలు వేధించే అవకాశాలున్నాయి. తేడా వస్తే బ్లాక్ మెయిలింగ్‌లు, స్పై కెమెరాలు, నానా బాధలు పడాల్సి వస్తుంది. ఈ బాధలు స్త్రీలకు మనుషులు పెట్టలేదు. దేవుడే పెట్టాడు. మనిషికి వీర్య స్కలనం తరువాత కోరిక చల్లార్చినట్టు స్త్రీకి కూడా ఆ రకమైన ఏర్పాటు ఉంటే.. అది జరిగే వరకు పురుషుడు ఆమె కోరిక తీర్చేందుకైనా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఫోర్ ప్లే లాగా ఆఫ్టర్ ప్లే చేసైనా సుఖ పెట్టేవాడు. కానీ అటువంటి ఏర్పాట్లు లేకపోవడం... భావప్రాప్తికి కొలమానాలు లేకపోవడం వల్ల 95 శాతం మంది స్త్రీలు సంపూర్ణ లైంగిక తృప్తిని, భావప్రాప్తిని పొందలేక పోతున్నారని అధ్యయనాల్లో వెల్లడయింది. అసలు మగువలకు భావ ప్రాప్తి అంటే ఏమిటి ? ఈ విషయం పై సెక్సాలజిస్టులు రకరకాల ప్రయోగాలు చేశారు. ఒక మహిళను యంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో పడుకోబెట్టి.. రతి క్రియలు నిర్వహించారు. ఆ సందర్భంలో మెదడులో వచ్చే రకరకాల మార్పులను అధ్యయనం చేశారు. భావ ప్రాప్తి పొందక ముందు మెదడులో తాత్కాలిక మార్పులు జరిగి ఆగిపోయాయి. తరువాత దశలో పూర్తిగా భావప్రాప్తి కలిగే వరకు రకరకాల పద్దతుల్లో ప్రేరేపించారు. ఈ సారి కంప్యూటర్లలో రికార్డయిన వివరాలు ఆశ్చర్యాన్ని గొలిపాయి. మెదడు మొత్తం ఉత్తేజితమయింది. మెదడుకు ఎక్కువ రక్త సరఫరా జరిగి అన్ని రకాల కేంద్రాలు శక్తిని పుంజుకున్నాయి. దీని వల్ల మెదడుకు అదనపు శక్తి వచ్చినట్లయింది. ఆరోగ్యవంతమైన, సంతృప్తి కరమైన రతి తరువాత స్త్రీ చాలా చలాకీగా ఉండటానికి కారణం కనుక్కొన్నారు శాస్త్రవేత్తలు. తరువాత స్త్రీకి భావ ప్రాప్తి కలిగించాలంటే శరీరంలో ఏ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేరేపించాలన్న విషయం పై కూడా రకరకాల పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో స్కానింగ్ ద్వారా లైంగిక వాంచకు ప్రేరేపించ బడిన యువతి మర్మాంగాలను స్కానింగ్ చేస్తూ పరిశీలించారు. అప్పుడు క్లిటోరిస్ ప్రాంతంలో ఎక్కువ రక్తం ప్రవహించడం ప్రారంభమయ్యాక స్త్రీలో లైంగిక వాంచ తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. ఆ క్షణంలో జరిపే రతి వల్ల స్త్రీ సుఖాన్ని పొందుతుంది. అదేవిధంగా ఈ సంతృప్తికి కేంద్రాన్ని జీ స్పాట్ గా పేరుపెట్టారు. అయితే ఈ జీ స్పాట్ ఫలానా ప్రాంతానికి పరిమితం కాదని శాస్త్రవేత్తల వాదన. మరికొందరు మాత్రం అసలు జీ స్పాట్ అనే భావనే అశాస్త్రీయమని వాదిస్తున్నారు. ఏదేమైనా భగవంతుడు పురుష పక్షపాతేనా.. సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారీ... ఏ మగువతోనైనా తృప్తిపడగల అదృష్టాన్ని మగవాళ్లకిస్తే... స్త్రీకి మాత్రం తనకు సరిజోడయిన మగవాడితో మాత్రమే... సుఖపడే శాపాన్నిచ్చాడు. సరిజోడు దొరకని మహి జీవితాంతం అసంతృప్తితో గడపాల్సిందే.. ఆఖరుగా ఒక్క విషయం దేవుణ్ణి అర్ధం చేసుకోవచ్చు... మహిళ అబల.. విలాసవస్తువుగా కోరిక తీర్చే వస్తువుగా పురుషుడు భావిస్తాడు. ఒక మగవాడు సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీర్య స్కలనం అనంతరం అతణ్ణి వెనువెంటనే మరో స్త్రీ తనతో సెక్స్ లో పాల్గొనమని కోరినా, బలవంత పెట్టినా, ఆఖరకు రేప్ చేసినా సాధ్యం కానిపని.. శరీరం కూడా సహకరించదు. అంటే ఒక మగవాడు ఒకసారి ఒక్క స్త్రీ కంటె ఎక్కువ మందితో సెక్సులో పాల్గొనడం దుస్సాధ్యమే కాదు అసాధ్యం. కానీ కాస్త అనుభవం ఉన్న ఒక స్త్రీని ఇద్దరు నుంచి ముగ్గురు మగవాళ్లు అపహరించి వరుసగా సెక్సులో పాల్గొన్నా... పెద్ద ప్రమాదం ఉండబోదు... మానసికంగా ఇబ్బంది పడటం తప్ప.. శారీరకంగా మరీ ప్రమాదమయిన సందర్భాలు లేవు. అలా ఉంటే వేశ్యా వృత్తి ఇంత విజయవంతంగా సాగేది కాదు. నిజంగా ఒక పురుషుడికి వీర్య స్కలనం కాగానే స్త్రీ కూడా పూర్తిగా అచేతనమయి ఉండి వెంటనే సెక్సుకు సిద్ధమయ్యే సామర్ధ్యం లేకుంటే... ఇప్పటి వరకు ఎంత మంది బలయిపోయేవారో... ఏదైనా సృష్టి కర్త సృష్టిలోఏదో రహస్యం ఉంది. అందుకే మహిళలకు ఆ రకమైన శారీరక విన్యాసాలను ఏర్పాటు చేశాడు. ఇప్పడు వస్తున్న రకరకాల టాయ్ ద్వారా.. స్త్రీలు కూడా....... సరే తప్పదు మరి.

Monday, January 16, 2012

అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా ? మిర్దాద్, బైబిల్ ఒక్కటేనా.. స్వార్ధం కోసం దేవుణ్ణే మోసం చేశారా


ఏసుక్రీస్తు జీవితం పై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. క్రీస్తు జననమే ఒక వివాదం.. జననం మాట ఎలా ఉన్నా... బోధనల విషయంలో మాత్రం పెద్ద వివాదమే ఉంది. వాస్తవానికి క్రీస్తు బోధించిన విషయాలేవీ ప్రస్తుతం మనకు లభించే బైబిల్ లో లేవు అనేది చాలా మంది క్రైస్తవులు అభిప్రాయం. తమ స్వప్రయోజనాల కోసమో... వర్తమాన విషయాలను చొప్పించడం కోసమో... లేక మత విస్తరణ కోసమో రకరకాల విషయాలను అందులో చొప్పించారు. దీంతో బైబిల్ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ఆ మత గురువుల్లో ఒక వర్గం వాదిస్తోంది. దీనికి సంబంధించిన కుట్రలను భగ్నం చేసేందుకు లియోనార్డ్ డావెన్సీ తన రహస్య పెయింటింగ్ లతో కృషి చేశాడు. కానీ అన్ని కోడ్ లను ఛేదించడం అందరికీ సాధ్యం కాలేదు. ఇప్పటికే డావిన్సీ గీసిన మోనాలిసీ బొమ్మలో ఏముందో తెలుసుకోవాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోలేక పోయారు. దీని గురించి వచ్చిన చిత్రమే డావెన్సీ కోడ్.. అయితే బైబిల్ లో విషయాలు కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే.. కానీ వాటిని దైహిక జీవితానకి అనుబంధంగా మార్చారు. అయితే క్రీస్తు చిన్నపుడే ఇండియా వచ్చి బౌద్ధాన్ని అభ్యసించి తిరిగి స్వదేశానకి వెళ్లాడనీ.. అందుకే అక్కడ తన భౌద్దమతం కాకుండా తన క్రైస్తవం పేరుతో ప్రచారం చేశాడని చెప్పుకుంటారు. అయితే వాస్తవానికి బౌద్ధమతానికి క్రైస్తవం పూర్తి విరుద్ధంగా ఉంటుంది.. కాబట్టి బౌద్ధమే క్రైస్తవమని చెప్పడానికి వీల్లేదు. అలా అని తోసి పుచ్చడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే .. దు:ఖానికి కారణం కోరికలు అనే సూత్రాన్నే.. క్రైస్తవం బోధించినప్పటికీ... జీవితాన్ని కోరుకున్న రీతిలో బ్రతకమని చెబతోంది. మాంస భక్షణ గురించి ప్రత్యేకించి క్రైస్తవులకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. క్రీస్తు శిలువ మీద నుంచి దించిన తరువాత సమాధి చేయబడ్డాడిని.. మూడవ రోజు ఆయన సమాధి నుంచి లేచాడని క్రైస్తవులు చెబుతారు. సమాధి నుంచి లేచాక ఎన్నో మహిమలు ప్రదర్శించాడని.. వాటిని ఎంతో మంది చూశారని చెబుతారు. కానీ చరిత్రకారుల చెప్పే విషయం వేరుగా ఉంది. శిలువ వేసిన ఏసు కొద్ది కాలమే శిలువ పై ఉంచడం వల్ల యేసును తిరిగి గుహలో దాచినా అతడు కేవలం స్పృహ కోల్పోయాడు తప్ప చనిపోలేదని... యేసు అనుచరులు అక్కడున్న సమాధి గుహలో నుంచి యేసు దేహాన్ని తీసుకెళ్లి వైద్యమందించి తిరిగి బతికించారని చెప్పుకుంటారు. అయితే ఈ విషయం తెలిసి రాజు ఎక్కడ శిక్షిస్తాడో అని రాజభటులు, తమ నిర్లక్ష్యం బయటపడుతుందని.. వారు కూడా అబద్దం ఆడవలసిన పరిస్థితి. దీంతో యేసు మూడవ రోజున సమాధి నుంచి లేచాడనే విష‍యమే బలంగా నమ్మకంలో ఉంది. అయితే ఒరిజినల్ బైబిల్ లో యేసు ఎలా సమాధి నుంచి బయట పడింది. భారత దేశం చేరి తన బోధనలు ఎలా ప్రచారం చేసిందీ ఉన్నదనీ.. వీటికి మూలాలు ఎక్కడో కూడా వివరించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలిస్తే కష్టమని బైబిల్‌లో చాలా మార్పులు చేసి తమ ప్రతిష్ట పెంచుకునే పనిలో పడ్డారు కొందరు స్వార్ధ పరులు.
ఈ విషయం మనకు మిర్దాద్ అనే పుస్తకం చదివితే స్పష్టంగా తెలుస్తుంది. మిర్దాద్ అనేపుస్తకంలో ఏముంది... అసలు మిర్దాద్ పుస్తకానికి బైబిల్ కు సంబంధం ఏంటి..? అవును.. నేను ఈ మధ్య నెట్‌లో రకరకాల వీడియోలు చూస్తూ ఓషో రజనీష్ వీడియో చూశాను. ఈ వీడియో ఇదే బ్లాగులో కూడా పోస్టు చేశాను. http://www.youtube.com/watch?v=rVP3Jsp8CE8 ఓషో చెప్పిన రకరకాల విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే అన్నిటికన్నా ఏసుగురించి చేసి వ్యాఖ్యలు కొంత ఆలోచింప చేశాయి. ఇది ఎంత వరకు కరెక్టో కాదో తెలియదుగానీ.. ఒక విషయం మాత్రం నన్ను మరింత శోధించేలా చేసింది. ఓషో తన ఇంటర్వ్యూలో... తనకు అత్యంత ఇష్టమైన పుస్తకం "మిర్దాద్" అని చెప్పాడు. ఆ పుస్తకంలో సాహిత్యం ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పాడు. ఆ పుస్తకం చదవడం మొదలు పెడితే ఆపలేక పోయానని.. ఆ సాహిత్యం ముందు అన్ని పుస్తకాలూ దిగదుడుపేనని వ్యాక్యానించాడు. ఒక పెద్ద వివాదాస్పద యోగి అలా మాట్లాడటం వెనుక అర్ధమేంటి. అయితే ఆ పుస్తకం రాసిన రచయిత కంటే సాహిత్యం గొప్పదని అభివర్ణించాడు. అంత గొప్ప సాహిత్యం రాసిన రచయితను పెద్దగా మెచ్చుకోలేదు. అక్కడే నాకు అనుమానం వచ్చింది. అంతే ఇంటర్నెట్‌లో వెదికి మిర్దాద్ పుస్తకం పీడీఎఫ్ ఫైల్ దొరకబుచ్చుకున్నాను. అయితే ఇది అచ్చ ఇంగ్లీష్ కాబట్టి.. మనది ప్రభుత్వ పాఠశాల ఆంగ్లం కాబట్టి.. అందులో ప్రకృతి వర్ణనలు కాస్తంత ఇబ్బంది పెట్టాయి. మంచు పర్వత శ్రేణుల వర‌్ణనలు, ఆర్క్ వర‌్ణన కాస్త తికమక పెట్టింది. అయినా కష్టమైన కష్టపడి చదివి రెండు చాప్టర్లు పూర్తి చేశాను. ఆపకుండా అలాగే చదవడానికి నాకు ఓషోకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు. ఈ పుస్తకం తెలుగు అనువాదం లేదా అని అనిపించింది. ఒకవేళ మనమే ఆ మహత్కార్యానికి పూనుకుంటే ఎలా అన్న ఆలోచన కూడా వచ్చింది. వారం రోజుల తరువాత మిర్దాద్ నా మెదడు నుంచి తప్పుకొని కాస్త విరామం ఇచ్చింది. అయితే నాకు పాత పుస్తకాలు కొనడం హాబి. ఒకరోజు ఆబిడ్స్‌లో పాత పుస్తకాల షాపులో నాలుగైదు పుస్తకాలు సెలక్ట్ చేసుకొన బయటకు వెళ్లేముందు మిర్దాద్ తెలుగులో కనిపించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. బేరమాడకుండా కొనేశాను. ఓషోలాగా మొత్తం చదువకున్నా ఐదారు చాప్టర్లు వరుసగా చదివేశాను. తరువాత మొత్తం పూర్తి చేశాను. అయితే ట్విస్ట్ ఒకటుంది. ఈ పుస్తకంలో మిర్దాద్ అనే వ్యక్తి నథింగ్ బట్ జీసస్.. భారత దేశంలో మంచు పర్వతాలలో నిర్వహించ బడుతున్న మతసంస్థ "ఆర్క్". దాన్ని పూర్వం ఎప్పుడో ప్రారంభిస్తారు. అయితే అందులో ఎప్పుడూ 8 మందే ఉండాలి. ఒకరు చనిపోయినా దేవుడు మరొకరిని పంపుతారు. వారెలా ఉన్నా దేవుడి ఆదేశం ప్రకారం వచ్చారని భావించి వారిని చేర్చుకోవాలి. అలా జరుగుతున్న క్రమంలో ఆఖరు మత గురువైన షమాయిమ్ కు ఒక సమస్య ఎదురవుతుంది. ఆర్క్ లోఒకరు చనిపోగానే అతని స్థానంలోకి ఒక అనాకారి తనను చేర్చుకొమ్మని వస్తాడు. అతడు నగ్నంగా.. చిరిగిన వస్త్రాలతో, చేతులకు, మొహానికి, కాళ్లకు గాయాలతో ఉంటాడు. అతణ్ని స్వీకరించడానికి మతగురువు ఇష్టపడడు. కానీ అతడితో వాదించలేక సేవకుడిగా స్వీకరిస్తాడు. అతడే మిర్దాద్. ప్రతి విషయంలోనూ మిర్దాద్‌కు గురువుకు వాదం జరిగేది మిర్దాద్ గెలిచేవాడు. అయితే మిర్దాద్ క్రమేపీ మౌనం దాల్చి ఏడేళ్ల తరువాత నోరు విప్పాడు. అప్పణ్ణుంచి మిర్దాద్ అన్నీ దైవ వాక్యాలే పలికాడు. మిర్దాద్ ఎవరో మిగతా వారికి తెలిసిపోయింది. మిర్దాద్ ను నీవు నౌకలో దొంగతనంగా వచ్చిన వాడివి కదూ.. అని పలుసార్లు ప్రశ్నించారు. దానికి మిర్దాద్ కాదు అని చెప్పక పోగా.. అవునని నమ్మడానికి బలంచేకూర్చాడు. నీవే నౌకలో దొంగతనంగా వచ్చావనడానికి రుజువులేంటని ప్రశ్నించగా.. జ్ఞానులకు సర్వం తెలుస్తుదని తెలిపాడు. సాక్ష్యం కావాలంటే నింగీ, నేలా, జలం, వాయువు, అగ్ని పంచ భూతాలను ప్రశ్నించాలని. అప్పుడే నిజమైన సాక్ష్యం దొరుకుతుందని.. వాటన్నిటినీ కోర్టులోకి తీసుకురావడం సాధ్యం కాదని... వాటిని తీసుకురాగలిగిన వాడికి సాక్ష్యం అక్కర్లేదని చెబుతాడు. సరే మిర్దాద్ ఏది చెప్పినా.. ఒక్క విషయం మాత్రం సత్యం.. నావలో దొంగతనంగా వచ్చిన వాడు అంటే.. జీసస్.. అందులో నో డౌట్.. ఈ విషయం అనోన్ లైఫ్ ఆఫ్ జీసస్ అని నికోలస్ నోటోవిచ్ రాసిన పరిశోధనా గ్రంధంలో ఉంది.
ఇదంతా ఆశ్చర్యం కాదు.. కానీ ఒకే ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించే విషయం.. ఏ జీసస్ నైతే దూషించినట్టుగా మాట్లాడిన ఓషో.. ఒకరకంగా యేసి సన్ ఆఫ్ బిచ్ అని కామెంట్ చేసి... అతని బోధనలనే ప్రచురించిన మిర్దాద్ గ్రంధాన్ని చదవమని ప్రచారం చేయడం వెనుక మర్మం ఏంటో తెలియలేదు.. మిర్దాద్ అంటే ఎవరోకాదు ఏసుక్రీస్తు.. అయినపుడు మిర్దాద్ లో విషయాలకు బైబిల్ బోధనలకు సారూప్యం ఉన్నపుడు.. ఒరిజినల్ బైబిల్ మిర్దాదా.. ప్రస్తుతం క్రైస్తవులు ఆకర్షణీయమైన బైండింగుల్లో చూపుతున్న పవిత్రగంధమా.. ఈ గ్రంధానికి ఎన్నో అనుబంధాలు చేర్చబడ్డాయి. మిమ్మల్ని కూడా మిర్దాద్ చదవమని చెప్పడానికి నేనిది రాయలేదు. కానీ ఒక యోగిలాంటి వ్యక్తి చెప్పిన మాటల్లో మర్మమేంటో పంచుకుందామని రాస్తున్నాను.

Sunday, January 15, 2012

ఎలా ఉండే సంక్రాంతి... ఎలా మారింది.. సంక్రాంతిని కమ్మేసిందెవరు ?


సంక్రాంతి పండుగంటే కల్లలెరుగని పల్లె సంబరం.. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు.. పెట్రోల్ మురికి లేని పచ్చని పైరగాలిని ఆస్వాదించే శుభతరుణం. పాడి పంటలంటే ఏంటో కళ్లారా చూసే శలవు దినాలు.. సంక్రాంతి తమ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని రైతులు, తమ సౌభాగ్యాన్ని కాపాడాలని మగువలు భావిస్తారు. చిన్న పిల్లలు పతంగులతో పోటీ పడుతున్నారు. సంప్రదాయ పద్దతులకు జీవం పోస్తూ హరిదాసులు... బసవన్నలతో గంగిరెడ్ల వాళ్లు చేసే సందడి.. ఇవన్నీ మూడు రోజులు మురిపించి చలిదుప్పటి తెరలో కనుమరుగయిపోతాయంటే కాస్త బాధగానూ.. గడిపిన మూడు రోజులూ సంతోషంగానూ ఉంటుంది...
సంక్రాంతి అంటే పల్లె లోగిళ్లన్నీ ముచ్చటైన ముగ్గులతో..... మగువల ముచ్చట్లతో మురిసిపోతాయి. పండు వెన్నెల ముంగిట్లో పిండార బోసినట్లు పట్టపగలే వచ్చి వాలిందేమో అనిపించే ముగ్గులు మౌనంగా సడి చేస్తాయి. రంగు రంగుల పరికీణలతో రంగవల్లులు తీర్చి దిద్దే అతివల మునివేళ్లను తాకిన పిండి బొమ్మలు, మంచుతడిలో మురిసి పోతాయి. బొబ్బెమ్మల చల్లటి స్పర్శకు గరికపూస చెరుకు గడలా నిటారుగా నిల్చుంటుంది.. రంగురంగుల రంగవల్లుల నడుమ కొలువుదీరిన బొబ్బెమ్మలు, వాటి చుట్టూ అడుగులో అడుగులు కలుపుతూ.. కోలలు ఆడుతూ .. వయ్యారంగా కదిలే ముద్దుగుమ్మలు.. తెలిమంచు కురిసే వేళ చూడ చక్కగా కనువిందు చేసే ఈ పరవశానికి తోడు.. సన్నాయి వాయిద్యంతో బసవన్న గజ్జల చప్పుడు లయ కలుపుతూ.. తల ఊపుతూ డోలు డప్పుకు తాళం వేస్తుంటే.. పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు.
వాకిట్లో రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నట్టు దూది పింజల్లా మబ్బుల్లోకి దూసుకెళుతున్న పతంగులు రంగ వల్లుల్లా ఆకాశం నిండా పురచుకోవాలని చూస్తాయి. దూరం నుంచి చూసే వారికి ఏ దారం లేని .. ఆదారం లేని కొత్త పక్షులు నింగి దారుల్లో చెక్కర్లు కొడుతున్నట్టు కనిపిస్తాయీ పతంగులు.. ఎవరి పతంగి ఎంత ఎత్తుకు ఎగురుతుందో వారే గొప్ప.. పతంగులను గాలిలోకి ఎగరవేయడం కూడా ఓ కళే మరి.
చలిగాలికి తోడు.. నులివచ్చని సూరీడి కిరణాలు బంగారు రంగులో... రంగవల్లులకు కొత్త అందం తెచ్చిపెడుతుంటే.. పైరగాలి మోసుకొచ్చే ముద్దబంతి పూల పరిమళాలు మంచుతడికి మత్తుగా ఊగుతున్న కొమ్మలకు కొత్త రాగాలను నేర్పుతాయి. మంచుదుప్పటిని తొలగిస్తున్న సూరీడికి ఆహ్వానం పలుకుతూ నేతితో చేసిన పిండివంటల ఘుమఘుమలు ముక్కు పుటాలను గుభాళిస్తాయి. సకినాలు, చెక్కర పొంగలి, అరిసెలు.. కొత్త రుచులను చూపిస్తాయి. ఏ ఇల్లు చూసినా పూల లోగిళ్లతో.. ముగ్గుల ముంగిళ్లతో.. కమ్మటి వాసనలతో... పండుగంటే ఇదీ అనిపిస్తుంది.
మన భారత దేశ చరిత్రలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగకూ ఓ అర్దం పరమార్ధం ఉన్నట్టుగానే.. సంక్రాంతికీ ఓ విశిష్టత ఉంది. సూర్యుడి మాసానికో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో మకర రాశిలోకి సంక్రమించడాన్ని మకరసంక్రమణం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతికి ఇంతటి విశిష్టత ఎందుకంటే.. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. వివిధ రకాల పుణ్యకార్యాలకు ఇదే మంచి మాసం.. తొలిపంట గాదెలను పలకరించేది కూడా ఇదే రుతువు. అందుకే ఈ పండుగంటే.. రైతులకు.. వారిని నమ్ముకున్న వ్యాపారులకు.. పట్టణాల్లోంచి పల్లెలకు పిలిచే పురవాసులకు సంతోషం..

Tuesday, January 10, 2012

త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు



నిరుత్సాహాన్ని మిగిల్చిన టెట్ - నిప్పులు కక్కుతున్న అభ్యర్ధులు
అర్హతకు కులానికీ లింకేంటి ?
సైన్స్ బోధకులకు గణితంలో అగ్ని పరీక్ష
150 నిముషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు..?
కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు
త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఉంది రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి.. రాష్ట్రంలో ఏ రిక్రూట్‌మెంట్ కూడా వివాదాలు లేకుండా జరగలేదు. ఈ వివాదాలు కూడా ప్రభుత్వానికి పనికొస్తున్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలను వివాదాల్లోకి లాగడం.. లేదా వివాదం చేయడం రివాజుగా మారింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వెలువడగానే అభ్యర్ధులంతా గంపెడాశెతో అప్లై చేసేవారు. ఫైరవీ దారులు కొన్ని, లంచావతారులు కొన్ని పంచుకోగా ఎంగిలి చేయి విసిరినట్టు విసిరితో ఏ నలుగురికో ప్రభుత్వ ఉద్యోగాలు రాలేవి. కానీ జంబ్లింగ్ పేపర్, ఓఎమ్మార్ షీట్ పుణ్యమా అని ఇంటర్వ్యూ లేని ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడితే అవలీలగా పట్టుబడుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఏటా భర్తీ చేయడం ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం లేదు. అందుకే గ్రూప్ 1 ఉద్యోగాల వివాదాల జాతర ఇప్పటికీ తెగలేదు... కాదు కాదు తెంచలేదు.. కోర్టునుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి అభ్యర్ధులకు అక్కణ్నుంచి రాజకీయ నాయకుల మధ్యకు ఇలా తిరుగుతూనే ఉంది. గత గ్రూప్ 1 వివాదమే ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తానికి ఏపీపీఎస్సీ నియామకాలంటేనే లేట్ ప్రాసెస్ అన్న ముద్ర స్థిరంగా పడింది. ఇవికాక ప్రభుత్వ ఉద్యోగాలంటే పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు మాత్రమే అడపాదడపా భర్తీ అవుతున్నాయి. తాజా ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వివాదాల్లోకి రాబోతున్నాయి. రాబోతున్నాయి అనేకంటే అదే ఊబిలో ఉన్నాయనడమే కరెక్ట్. ఎందుకంటే గత నియామకాలే ఎన్నో బాలారిష్టాల నడుమ పూర్తయ్యాయి. బీఈడీ విద్యార్ధులు ఎస్‌జీటీకి అర్హులు కారని ఒకసారి.. అర్హులేనని ఒకసారి.. ఇలా రకరకాల ఒత్తిళ్ల నడుమ రిక్రూట్‌మెంట్ పూర్తయిందనిపించారు. ఈసారి డీఎస్సీకి టెట్‌లో ఉత్తీర్ణులయిన వారే అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో దీన్ని ఇటు మేథావి వర్గాలు.. అటు అభ్యర్ధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకత అలా ఉండగానే టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం.. దీనికోసమే ఎదురుచూసే అభ్యర్ధులు ధరఖాస్తు చేయడం.. తొలివిడత పరీక్ష పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరీక్ష చాలా తేలికగా ఉండటం.. మొదటి పరీక్ష కావడంతో నిపుణులు కూడా తేలిక రకం ప్రశ్నా పత్రాన్ని తయారు చేశారు. కాబట్టి టెట్-2011 ఉత్తీర్ణతా శాతం బాగానే ఉంది. దీంతో టెట్ వల్ల పెద్ద ప్రమాదం లేదనే నిర్ణయానికి వచ్చారు చాలా మంది. తొలివిడత టెట్ పరీక్షను మరిచిన అభ్యర్ధులు కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచారు. టెట్-2012 కు మిగిలిన బీఈడీ, డీఈడీ అభ్యర్ధులంతా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్లోకూడా స్పష్టత లేదు. తొలుత ఒకే అప్లికేషన్ పై పేపర్-1, పేపర్ -2 రాయొచ్చని ప్రకటించారు. తరువాత బీఈడీ అభ్యర్ధులు పేపర్ 2 మాత్రమే అర్హులని చల్లగా చెప్పారు.
ఈ రెండ విడత టెట్‌కు దాదాపు డీఎస్సీ పరీక్ష కోసం చేసినంత హడావుడి చేశారు అభ్యర్ధులు. ఎందుకంటే ప్రభుత్వం కూడా జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నానని ఉత్తుత్తి ప్రకటనలు గుప్పిచ్చింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్ధులంతా డీఎస్సీ స్థాయిలో ప్రిపేరయ్యారు. ఈ సారి శిక్షణా సంస్థలు కూడా టెట్ కు డీఎస్సీ స్థాయిలో ప్రచారం కల్పించాయి. హడావుడి మధ్య టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. అనుకున్నదే అయింది. టెట్ పరీక్ష టైట్ చేయడానికే అన్న అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు.. ఎలిజిబిలిటీ కాకుండా చేసే టెస్ట్ అన్న విషయం దాదాపు రెండోసారి పరీక్ష అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే టెట్ పరీక్ష ప్రశ్నా పత్రం తయారులోనే ఫిల్టరింగ్ చేయడానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. కన్ఫ్యూజ్ చేసి కంట్లో కారం కొట్టే ప్రశ్నా పత్రం తయారయింది.
ఉపాధ్యాయ శిక్షణలో ప్రశ్నా పత్రం తయారీ గురించి శిక్షణ ఇస్తారు. అందులో విద్యార్ధుల జ్ఞానాన్ని, నైపుణ్యాలను పరీక్షిచాలంటే ప్రశ్నా పత్రం ఎలా తయారు చేయాలో.. తయారీకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాన్ని క్షణ్ణంగా వివరించడమే కాకుండా.. నమూనా ప్రశ్నా పత్రాలను తయారు చేయిస్తారు. కానీ ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి అవసరమైన అర్హతా పరీక్షా పత్రాన్ని తయారు చేయడంలో మాత్రం ఆ నియమాలను తుంగలో తొక్కారు. సహజంగా అభ్యర్ధుల విశ్లేషణా కౌశలాలను పరీక్షిండానికి కొన్ని సిలబస్ కు సంబంధించిన అంశాన్ని సృశిస్తూనే స్వేచ్ఛా ప్రశ్నలను సంధిస్తారు. ఇవి అభ్యర్ధులను తికమక పెడతాయి. ఇటువంటివి అన్ని పోటీ పరీక్షల్లో ఉంటాయి. కానీ.. తాజాగా నిర్వహించిన టెట్ పరీక్షలో అన్ని ప్రశ్నలూ తికమక పెట్టే విధంగా ఉండటంతో అభ్యర్ధులు తికమక పడటమే కాదు... పరీక్ష పూర్తికాక ముందే భవిష్యత్తు పై అయోమయంలో పడ్డారు. టెట్ పరీక్షకు హాజరయిన ఒక్కరంటే ఒక్కరు కూడా పరీక్షా పత్రం రూపొందించి విధానం పై సంతృప్తి వ్యక్తం చేయలేదు. అత్యంత కఠినమైన ప్రశ్నా పత్రాన్ని రూపొందించి అభ్యర్ధుల పైకి సంధించారు. వాస్తవానికి ఈ తరహా ప్రశ్నాపత్రం ముందెన్నడూ చూడలేదంటున్నారు తలపండిన మేథావులు. ఎందుకంటే విశ్లేషణాత్మక ప్రశ్నలు, విచక్షణకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కవగా ఉండటంతో... ఇదే కరెక్ట్ సమాధానం అని చెప్పడానికి ఏ ఇద్దరు అభ్యర్ధుల మధ్య పొంతన కుదరడం లేదు. ఈనాడు పత్రిక విడుదల చేసిన కీ లో బండ తప్పులున్నాయన్నారు. అవి నిపుణుల చేత తయారు చేయించారని ఆ పత్రిక చెప్పింది. కానీ నిపుణులే పప్పులో కాలేస్తే.. మామూలు అభ్యర్ధులు నిప్పుల్లోనే కాళ్లేస్తున్నారు. టెట్-2011 రాసిన అభ్యర్ధులకు ఒక న్యాయం, టెట్-2012 అభ్యర్ధులకు మరో న్యాయమా అని అభ్యర్ధులు నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై ఉద్యమించేందుకు అభ్యర్దులు సన్నద్దమవుతున్నారు. నెలల తరబడి టెట్ కోసం ప్రిపేర్ అయితే ఇష్టం వచ్చిన ప్రశ్నలిచ్చి డీఎస్సీకి అర్హులు కాదని పక్కన పడేస్తే సహించేది లేదంటున్నారు. సైన్స్ అభ్యర్ధుల పాలిట గణితం గుదిబండగా తయారయింది. ఎందుకంటే 150 ప్రశ్నలకు గానూ 2.30 గంటల సమయాన్ని కేటాయించారు. అంటే 150 ప్రశ్నలకు 150 నిముషాలన్న మాట.. సైకాలజీ, తెలుగు, మెథడాలజీ వంటి వాటికి కాస్త ఈజీ, మీడియం, హార్డ్ ను బట్టి టైం అడ్జెస్ట్ చేసుకోవచ్చేమోగానీ. ఒక్క నిముషంలో ఒక్కో సమస్యను కాలిక్యులేటర్ లేకుండా నోటి లెక్కలతో పూర్తి చేయడం బయాలజీ చదువుకున్న విద్యార్ధులకు సాధ్యమయ్యే పనేనా.. ? అది కూడా అత్యతం క్లిష్టమైన పర్సంటేజీ, ఘాతాంకాల వంటి ప్రశ్నలతో బాటు, భిన్నాలను ముప్పై సెకండ్లలో పూర్తి చేయమనడం వెనుక ఏ మర్మం దాగి ఉంది.. సైన్స్ విద్యార్ధులు, గణిత ప్రశ్నను అర్ధం చేసుకొనేలా చదవడానికే ముప్పై సెకన్ల పైనే పడుతుంది. దాన్ని తిరిగి అర్ధం చేసుకొని రఫ్ పేపర్ పై పెట్టి బాగాహారం, గుణకారం, కసాగు, వంటి ప్రక్రియల్లో ఏది అవసరమో అది పూర్తి చేసి ఫలితాన్ని రాబట్టడానికి మరోరెండు నిముషాలు తప్పకుండా అవసరం అవుతుంది. ఈ తికమక ప్రశ్నా పత్రం వల్ల చాలా మంది అభ్యర్ధులు గణితం ప్రశ్నలను చదవకుండానే గాలిలో దీపం పెట్టినట్టు సమాధానాలు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు. పరీక్షరాసిన మెజారిటీ అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
ఇంతకీ టెట్ శాస్త్రీయమేనా.. ?
ఈ ప్రశ్న ఎప్పటి నుంచో అభ్యర్ధులను వేధిస్తున్న ప్రశ్న.. ఎందుకంటే బయోసైన్స్ అధ్యయనం చేసే విద్యార్ధులకు 10 తరగతి తరువాత గణితం అవసరమే లేదు. బీఈడీ వరకు గణితం జోలికే పోరు. అంటే అప్పుడే బీఈడీ అయిపోయిన విద్యార్ధులు గణితాన్ని అంటే క్షేత్రగణితాన్ని, ఘాతాంకాలను, సమీకరణాలను మరిచిపోయి ఏడేళ్లు అయిపోతుంది. ఇక పీజీలు, పీహెచ్‌డీలు చేస్తూనో లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారైతే దాదాపు ఐదో ఎక్కానికే తడుముకోవాల్సిన పరిస్థితి. వీళ్లు చచ్చీచెడీ కోచింగ్ సెంటర్లలో గణితంలాంటిదాన్ని నేర్చుకున్నా వచ్చే ఫలితం కూడా లేదు. వీళ్ల అదృష్టం కొద్దీ డీఎస్సీలో ఉద్యోగం వస్తే బయాలజీ టీచర్ గానే వెళ్లాలి. తప్ప గణితం బోధించే చాన్సే లేదు. గణితం బోధించే చాన్సు లేని అభ్యర్ధులను గణితంలో నైపుణ్యాలను పరీక్షించాలను కోవడం వెనుక ఉద్ధేశ్యం ఏమిటని మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సూత్రం, గణితం అభ్యర్ధులకు, సోషల్ స్టడీస్ అభ్యర్ధులకు వర్తిస్తుంది. వారికి పరిచయం లేని, బోధనకు అవసరం లేని సబ్జెక్ట్ లో కఠిన ప్రశ్నలతో పరీక్షించాలను కోవడం వెనుక అసలు ఉద్ధేశ్యం ఫిల్టర్ చేయడం తప్ప మరోటి కాదన్న విషయం తేట తెల్లమవుతోంది. టీచర్ ఉద్యోగం చేయాలంటే ముందు బీఈడీ , డీఈడీ ఎంట్రన్స్ ఎదుర్కోవాలి... తరువాత శిక్షణా కాలాన్ని పూర్తి చేయాలి. ఆ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. తరువాత టెట్ రాయాలి.. దీంట్లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. తరువాత డీఎస్సీ రాయాలి. దీంట్లో కూడా ర్యాంక్ సాధిస్తే అప్పుడు పంతులు ఉద్యోగం. డిగ్రీ అర్హతతో రాసే ఐఏఎస్ పరీక్షకు కూడా ఇన్ని కండీషన్లు లేవు. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కూడా ఇన్ని స్థాయిలుండవు. అందుకే టెట్ పరీక్ష అవసరమా లేదా అన్నది జాతీయ స్థాయి అంశమైనా.. పరీక్ష నిర్వహించే విధానం మాత్రం సరియైనది కాదు, శాస్త్రీయ మైనది అసలే కాదనే వాదన బలంగా ఉంది.
అర్హత పరీక్షలో కూడా రిజర్వేషనా..?
మామూలుగా ఒక సబ్జెక్ట్ లో పాసవ్వాలంటే 35 శాతం మార్కులు రావాలంటారు. అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా పాస్ మార్కులు ఒకటే.. అంటే సబ్జెక్ట్‌లో పాస్ కావడానికి కులంతో సంబంధం లేదు. ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లను బట్టి పోటీ స్థాయిని బట్టి మార్కులు అవసరం ఉంటాయి. కానీ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత సాధించడానికి రిజర్వేషన్లు అవసరం లేదు. కానీ టెట్ లో ఉత్తీర్ణత సాధించడానికి కూడా రిజర్వేషన్లకు లింక్ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 150 కు గానూ 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఇక ఓసీ లయితే 90 మార్కులు అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఇదెక్కడి చోద్యం.. అర్హత సాధించడానికి మార్కుల్లో భేదాలెందుకు ? ఉద్యోగ పరీక్షలో ఈ తంతు ఎలాగూ ఉంటుంది. ఇదే గనుక పూర్తి స్థాయిలో అమలయితే.. పేపర్ ఇలాగే క్లిష్టంగా ఉంటే.. డీఎస్సీకి మెజారిటీగా హాజరయ్యే అభ్యర్ధులు ఎస్సీ ఎస్టీలు వారి తరువాత బీసీలే అవుతారు. మెజారిటీ ఓసీ అభ్యర్ధులు ఆదిలోనే ఆగిపోతారు. దీన్ని ఆయా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇన్ని గండాలు దాటుకొని డీఎస్సీ పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తారా.. ఈ చిక్కుముడులను అభ్యర్ధులు కోర్టులో సవాలు చేసి స్టేలు తెచ్చుకుంటే నష్ట పోయేది ఎవరు. ఆ స్టే ఎత్తేసి నియామకాలు మొదలు పెట్టేసరికి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పరిస్థితి ఏంటి..? దురదృష్టవశాత్తో... అదృష్టవశాత్తో నోటిఫికేషన్ విడుదల చేసిన వేసిన ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఈ నియామకాల పట్ల శ్రద్ధ చూపుతుందనుకోవడం కలే.. టామ్ అండ్ జెర్రీలాంటి ఈ నియామకాల ఉచ్చులో నిరుద్యోగ అభ్యర్ధులు తమ విలువైన సమయాన్ని, మేథస్సును, డబ్బులను వృధా చేసుకొని ఆవేశాలకు లోనై ఉద్యమాలకు సిద్ధమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ పరిస్థితి రాక ముందే.. ప్రభుత్వాలు రాక ముందే ప్రభుత్వ విధానాలు మారాలి. పారదర్శకంగా నియామకాలు జరగాలి.

Monday, January 9, 2012

మానని గాయమిది .. ఇంకెన్నాళ్లీ రాజకీయ వ్యభిచారం


ఒళ్లంతా రక్తమోడుతున్నా లెక్క చేయలేదు.. ముళ్ల కంచె శరీరాన్ని తూట్లు తూట్ల చేస్తున్న పట్టిచ్చుకోలేదు... ఒకటే లక్ష్యం.. ఒకటే ఆశయం.. ఆ ఆశయ సాధనలో ముళ్లన్నీ పూలే అని భరించారు.. సరిగ్గా ఏడాది క్రిత జేఏసీ పిలుపు మేరకు వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారి గాయాలు ఇంకా మానలేదు.. కానీ గాయాలు పెట్టే నొప్పికన్నా తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని నేతలు చేస్తున్న రాజకీయాలే బాధిస్తున్నాయంటున్నారు ముట్టడిలో గాయాల పాలైనవారు.
మానని గాయం
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సాక్షిగా జరిగిన రక్తతర్పణానికి యేడాదైంది పూర్తియింది. ప్రభుత్వం ,సీమాంద్రుల తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ పొలిటికల్ జెఎసి తెలంగాణ ప్రాంతాల్లో 2011 జనవరి 10న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కలెక్టరేట్ల ముట్టడికి వరంగల్ జిల్లా విద్యార్ధులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో తెలంగాణవాదులు ఏకశిలాపార్కు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం దిశగా బయల్దేరారు. కలెక్టరేట్ కార్యాలయానికి సమీపలో వున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్దనే ఇనుప గ్రిల్స్ వేసి వందలాది పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. కాని అప్పటికే తెలంగాణ వాదులు వారిని ఛేదించుకుని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే కలెక్టర్ బంగ్లా ,కార్యాలయం ఎదుట ముళ్లకంచె వేసి కేంద్ర బలగాలను మోహరించారు. ముళ్లకంచెను దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో... కేయూ జెఎసి నేత పాలడుగు అనిల్ కుమార్ ముళ్లకంచె లో పడి ఒళ్లంతా చిక్కుకున్నాయి. ఎంత లాగినా రాకపోవడంతో ప్రక్కనే వున్న మెకానిక్ షాపు నుంచి కటింగ్ ప్లెయర్ సహాయంతో ఆ ముళ్లకంచెను కట్ చేసినా శరీరంలో నే చాలా వరకు చిక్కుకుపోయాయి.రక్తం రోడ్డు పై ధారలు పడుతుండగా అక్కడే వున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం విన‍య్ భాస్కర్ ,మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావులు చేతుల మీదనే అతన్నిదగ్గర్లో వున్న ఆస్పత్రికి తీసుకెళ్ళారు. గంట పాటు వైద్య చికిత్సలు జరిపి ముళ్ల కంచెను శరీరం నుంచి తొలగించారు.
శరీరాన్ని తూట్లు పడి రక్తం ధారాపాతంగా కారుతున్నా లెక్కచేయలేదు.. గాయపడ్డ అనిల్ కుమార్ ను స్థానిక నేతలతో బాటు.. మరికొందరు తెలంగాణవాదులు స్థానిక రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు.కొన్ని గంటల పాటు ఆపరేషన్ చేసి 650కుట్లు వేసారు.దీంతో 15 రోజుల పాటు ఆస్పత్రిలో నే చికిత్స పొందాడు. చికిత్సకు లక్షా 90వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న అనిల్ ను పరామర్శించేందు స్థానిక తెలంగాణవాదులు , జెఎసి నాయకులు ,టీఆర్ఎస్ నాయకులతో పాటు ,కేటీఆర్ ,ఈటెల రాజెందర్ కూడా వచ్చారు. నాలుగైదు రోజులు పరామర్శలు పూర్తయ్యాక అనిల్ కుమార్ ను అందరూ మరిచిపోయారు.. అనిల్ సోదరుడు మనోహర్ కూడా తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారి పై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో మనోహర్ చేయి విరిగింది. పోలీసులు అరెస్టు చేసి 15 రోజులు రిమాండ్ కు పంపారు. దీంతో కుటుంబం వీధిన పడింది. చేతికొచ్చిన ఇద్దరు కొడుకులూ అసహాయంగా మారడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఇంత జరిగినా ఏ నాయకుడూ ఎలా ఉన్నావని పలకరించిన పాపాన పోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఇచ్చే ప్రేరణ తరువాత ఇబ్బందులు ఎదురైతే ఉండవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండి కూడా బసవరాజు సారయ్య ఏరోజూ తమను పరామర్శించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ కుటుంబం అంతా తెలంగాణ ఉద్యమానికి బలిపశువుల్లాగా మారామని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు అనిల్ కుమార్.,

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మేథావులు, అధ్యాపకులు , అతని స్నేహితులు కోరుతున్నారు. పాలడుగుల అనిల్ కుమార్ తో పాటు అతని కుటుంబం ఉద్యమంలో దాడికి గురికావడం బాధాకరమని , అనిల్ కుటుంబాన్ని ఆదుకుని ,అతనికి ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం తెలంగాణ అనుకూల పార్టీలతో పాటు ,తెలంగాణవాదులకూ ,స్థానిక ప్రజాప్రతినిధులకు వుందని అన్నారు. అనిల్ కుమార్ ముళ్లె కంచె దాడికి గురై నేటికి యేడాది గడుస్తున్న స్పందించే నాధులు లేకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనతో పాటు అతని కుటుంబం తెలంగాణ ఉద్యమంలో అన్యానికి గురైనా తెలంగాణ సాధన కోసమనేనని బాధితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమఒళ్లంతా హూనమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలనే ఆకాంక్ష ముందు ఇవేవీ బాధ పెట్టవంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌కోసం పోరాడే యువకులను అడ్డం పెట్టుకొని నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని వారు కోరుకుంటున్నారు. తమ త్యాగాలను రాజకీయంగా కాక తెలంగాణ సాధనకు స్పూర్తిగా తీసుకోవలని బాధితులు కోరుుతున్నారు.

Monday, January 2, 2012

కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?


కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?
"మాస్ లోనే మార్కెటింగ్"
నిన్న మా పాప "డాడీ నాకు కొలవరి ధీ" పాట సెల్‌ఫోన్ లో తీసుకురమ్మని అడిగింది. వాస్తవానికి నాకు ఎందుకో ఆ పాటంటే మొదటిసారే నెగెటివ్ ఫీలింగ్ కలిగింది. దానికి కారణం ఆ పాట నచ్చక కాదు. ఆ తరహా బట్లర్ ఇంగ్లీష్ పాటలు గతంలో చాలానే వచ్చినయి. ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో మొదటిసారి నా ఫ్రెండ్ రూంలో యూట్యూబ్ లో పాట చూశాను. ఈ పాట యూత్‌ను ఊపేస్తుంది చూడమని ఫ్రెండ్ చెప్పినపుడు (అప్పటికి ఇంత వెర్రి లేదు) ఎంతో ఎక్స్పెక్ట్ చేసి చూశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో పాట లేదు. పాతగానే ఉంది. కానీ ఇప్పడు యావత్ యూత్ ను బాషా భేదం లేకుండా ఊపేస్తుంది. అర్ధం కాలేదు. ఎందుకు ఈ పాటకు ఇన్ని పేరడీలు. ఈ పాట అంతబాగా నచ్చిందేంటి..? బాగా ఆలోచిస్తే ఒక్క విషయం భోదపడింది. అంతేకాదు బుద్దుడి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాక్కూడా హిట్ ఫార్ములా జ్ఞానోదయం అయింది. దానికి నేనిచ్చిన పేరు "మాస్ లోనే మార్కెటింగ్". అవును ఒక పాట హిట్ కావాలంటే ముందు ఆ పాట జనాల్లోకి వెళ్లాలి. అయితే జనాల్లోకి వెళ్లిన అన్ని పాటలూ హిట్ కావు. ఆ పాట హిట్ కావాలంటే సందర్భానికి అనుగుణంగా ఆకట్టుకోవాలి. సందర్భం అంటే.. ఇక్కడ మళ్లీ డౌట్.. అది సినిమాలో సన్నివేశం కావచ్చు. నిజజీవితంలో సన్నివేశం కావచ్చు. దీనిక్కూడా ఉదాహరణ చెప్పేముందు మరో విషయం ప్రస్తావించక తప్పదు. అదేంటంటే పాటను ఎవరు.. ఎలా.. ప్రసెంట్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంటే.. ఆ పాట ప్రసెంట్ చేసే వారు సందర్భానికి అణుగుణంగా.. హత్తుకుపోయేలా... ఆకట్టుకునేలా.. కావలసిన అన్ని రసాలూ పిండి.. తిరిగి ప్రేక్షకుడు లేదా వీక్షకుడు హమ్మింగ్ చేయగలిగేలా వశీకరణ చేసుకోవాలి. దీంట్లో బ్యాలన్స్ ముఖ్యం.. ఏమాత్రం అతి ఉన్న కశెం అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణ జోలికి వస్తాను. మొదట.. ఒక పాట.. ఈ మధ్య కాలంలో తెలంగాణ అమరవీరులకు సంబంధించి బాగా పాపులర్ అయిన పాట "రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.." ఇదీ పాట... వాస్తవానికి ఈ పాట ఈ మధ్య పుట్టింది. కాదు. తెలంగాణ అమరవీరుల కోసం పుట్టింది కూడా కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ నిషిద్ద కమ్యునిస్టు.. విప్లవ గ్రూపుల్లో అమరులైన వ్యక్తుల కోసం ఎప్పుడో.. పాత ట్యూన్ లో రాసిన పాట ఇది. దాంట్లో.." అందుకని వేశావా... నా కొడుకును నక్సలైట్ అని ముద్రను" అని ఉంటుంది. అంటే అది నక్సలైట్ల కోసమే రాసిన పాట అని తెలుస్తూనే ఉంది. అప్పట్లో కమ్యునిస్టు మీటింగ్ లలో మార్మోగింది కూడా.. కొన్ని క్యాసెట్లల్లో కూడా రికార్డ్ అయింది.. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు... ఎటొచ్చీ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతా చారి ఆత్మత్యాగం తరువాత.. శ్రీకాంతాచారి సంస్మరణ సభలో... సందర్భం వేడి వేడిగా.. ఉంది. అమరవీరులను తలుచుకొని దు:ఖిస్తున్న సమయంలో సాయిచంద్ గుండెలకు హత్తుకొనేలా ఈ పాట పాడిన విధానం అందర్నీ కదిలించింది. దానికి తోడు టీవీ ఛానళ్లన్నీ శ్రీకాంతా చారి తల్లి ఆ పాట వింటూ రోధించడాన్ని ప్రత్యక్షప్రసారం చేశాయి. దీంతో ఆ పాట జనాల్లోకి ఎంతగా వెళ్లాలో అంతగా వెళ్లింది. అయితే ఈ పాటే తరువాత కళాకారుల మధ్య పోటీకి దారి తీసింది. ఒక రకంగా సాయిచంద్ అనే తెలంగాణ గాయకుడికి లిఫ్ట్ ఇచ్చింది ఈ పాటే.. ఈ పాట సురేందర్ రాశాడని కూడా చాలా మందికి చాలా కాలం వరకు తెలియదు. సాయిచంద్ తరువాత ఎవరు పాడినా ఈ పాటను ప్రజలు రిసీవ్ చేసుకోలేక పోయారు. మొదట వడ్లకొండ అనిల్, తరువాత స్వర్ణ ఇలా చాలా మంది ప్రజల మెప్పు పొందాలని చూసినా సాధ్యం కాలేదు. అంతేందుకు గీత రచయిత మిట్టపల్లి సురేంధర్ ఎక్కడ ధూంధాం జరిగినా ఈ పాటే పాడుతుంటాడు. ఇది తన పాట అని చెప్పి మరీ.. అయినా సాయిచంద్‌కు వచ్చిన రెస్పాన్స్ రాకపోవడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. తరువాత పోరు తెలంగాణ చిత్రంలో ఆర్. నారాయణ మూర్తి తన సినిమాలో నిత్య సంతోషిణితో పాడించినా అంతబాగా రాలేదు. సో.. దీని ద్వారా తెలుసోచ్చిన నీతి ఏంటంటే ఒక పాట.. ఆ పాటలో ఉన్న విషయానికి తగ్గ సందర్భానికి తగ్గట్టుగా.. పాడేవాళ్లు.. సందర్భానికి తగ్గ మసాలా దట్టిచ్చి జనాల్లోకి తీసుకెళితే ఆ పాట హిట్. ఇప్పుడు కొలవెర్రి ఢీ దగ్గరికి వద్దా.. ఈ పాట రజనీ కాంత్ అల్లుడు ధనుష్ పాడిన సరదా పాట. వాస్తవానికి బట్లర్ ఇంగ్లీష్ తో ఆ మధ్య కాలంలో చాలా పాటలే వచ్చాయి. కానీ చాలా తక్కువ పాటలు ప్రజాదరణ పొందాయి. కానీ క్లాస్ డివిజన్ నుంచి వచ్చిన ధనుష్ మాస్ మసాలా కలిపి.. టింగ్లీష్ కలిపి పాడాడు. అంతే కాదు.. రిథమ్.. బీట్ కూడా పక్కా మాస్ ఉంది... ఈ పాటలో మాస్ తమను చూసుకున్నారు. తమ లైఫ్ చూసుకున్నారు. పాటలన్నీ బోర్ అయిన సందర్భంలో పబ్లిక్... పబ్లిసిటీ ఇచ్చిన పాట ఇది. దీంతో పాటు.. టీవీ ఛానళ్లు కూడా దీనికి తగ్గట్టు కావల్సిన దానికంటే ఎక్కువగానే ప్రచారం కల్పించాయి. అందుకే ఆ పాట హిట్ అయింది. కొలవరి కంటే గొప్ప పాటలు.. ఇంకా బాగా ఆకట్టుకోగల పాటలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. ఎదైనా అంతే పది మందికి నచ్చితే హిట్.. పదిమందికి చేరక ముందే కనుమరుగైతే ఫట్.. నలుగురికి నచ్చినది నా కసలే నచ్చదులే..

Sunday, January 1, 2012

ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం



రాకాసి బల్లులు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది... వెండి తెరపై రాకాసు బల్లుల రూపాలను చూసే మనం అమ్మో అనుకుంటాం.. ఇప్పుడు ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇంత బలిష్టమైన జీవులు ఈ భూమి పై నుంచి అదృశ్యం కావడానికి కారణాలేంటి. అసలు ఇవి మనుగడ సాగించి, అంతరించిన ప్రాంతాలేవి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తాజాగా లభించిన పరిశోధనల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తల పరిశోెధనల్లో తేలింది. నిజమా... భారతదేశంలోనే రాకాసు బల్లుల పాదముద్రలున్నాయా.. మన పూర్వికులు రాకాసి బల్లులతో సహవాసం చేశారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు
ఈ భూమి ఉద్భవించినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులు చెందింది. భూమి పై పొరలు గడ్డకట్టి నీటి ఆవిరి చినుకు రూపంలోకి మారిన క్షణం నుంచీ ఈ భూమి జీవజాతులకు ఆవాసంగా మారింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం. ఈ భూమి మొత్తం ఒక గడ్డగా ఉండి నీరంతా ఒక వైపు ఉండేదని అంచనా.. ఈ భూ ద్వీపం పైనే జీవ జాతులన్నీ ఉద్భవించాయని.. తరువాత ఖండ చలనం ద్వారా భూమి ఖండాలుగా విడిపోయిందని సిద్దాంతం.. ఈ భూమితో బాటే జీవ జాతులన్నీ విడిపోయాయి. అందుకే అన్ని ఖండాల్లో దాదాపు ఒకే రకమైన జీవజాతులున్నాయి.
అయితే డైనోసార్లు మాత్రం అన్ని ఖండాల్లో అంతరించిపోయాయి. అసలీ డైనోసార్లు ఎందుకు చనిపోయాయి. ఇవి చాలా బలిష్టమైన జీవులు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని బతకగలవు.. శత్రువును ఎదుర్కొవడంలో దిట్ట.. వీటికంటే బలహీన జీవులు ఉత్పాతాలకు తట్టుకొని జీవిస్తుంటే..ఇవెందుకు అంతరించాయి. ఇదే శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వారికి దొరికిన ఒకే ఒక సమాధానం... గ్రహశకలం ఒకటి భూమిన ఢీకొందని.. ఆ నిప్పు సెగల్లో ఈ డైనోసార్లు అంతమై ఉంటాయని... ఈ సమాధానం తొలుత అందరికీ నచ్చింది. మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించారు కూడా.. కానీ కొందరు శాస్త్రవేత్తలు. మాత్రం ఈ వాదనతో విభేదించారు. గ్రహశకలం ప్రభావం అన్ని జీవులపైనా ఉంటుందని.. అది డైనోసార్లనే ఎందుకు చంపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తాజాగా శాస్త్రవేత్తల్లో భారతదేశంలో జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డైనోసార్ల అంతానికి భూ శకలం ఒక్కటే కారణం కాదని తేలింది.
రాకాసి బల్లులు భారత దేశంలో కూడా సంచరించేవి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించేవి. ఇవి సంచరించే ప్రాంతంలో ఈత, పైన్ చెట్లు ఎక్కువగా ఉన్నట్టు వీటి విసర్జక పదార్ధాల విశ్లేషణలో తేలింది. దీన్ని బట్ట ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరించేవని పరిశోధకులు తేల్చారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతం బద్దలవడం రాకాసి బల్లులకు ప్రాణగండంగా మారింది. ఈ పేలుడులో విషవాయువులు, కార్భన్ డై ఆక్సైడ్, మోనాక్సైడ్ లు వెలువడ్డాయి. ఈ లావా ద్రవం మహా బలేశ్వరం నుంచి పశ్చిమం వైపుకు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం వరకు, ఇటు తూర్పు వైపున గోదావరి నది గుండా బంగాళాఖాతం వరకు ప్రవహించింది. లావా దెబ్బకు ఈ ప్రాంతమంతా బూడిదగా మారింది. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ గడ్డికూడా మొలవని పరిస్థితి. తర్వాత జరిగిన వాతావరణ మార్పుల్లో నదీ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో లావా ప్రవహించిన ప్రాంతమంతా.. సారవంతమై అడవులు పెరిగాయి.. గతంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అవి మాడి మసై పోయాయి. కొన్ని కాలపోకుండా భూగర్భంలో కలిసిపోయాయి... అవే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకాసి బొగ్గుగా.. విలువైన ఖనిజంగా మనకు లభిస్తోంది.. ఈ దారిలో కొట్టుకు పోయిన ఇంధనాలన్నీ సముద్ర గర్భానికి చేరి అక్కడ కర్భన రసాయనాలుగా రూపాంతరం చెంది కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోల్ రూపంలో అభిస్తోంది.
భారతదేశంలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. ఇక డైనోసార్ల గురించి పరిశోధన చేసే వారికి ఇండియానే కీలకకానుంది.