సకల జనుల సమ్మెతో ప్రజలకు సకల కష్టాలెదురవుతున్నాయి.. సమ్మె సక్సెస్ మాట ఎలా ఉన్నా. సమాన్యుడికి మాత్రం సమ్మె.. సమ్మెట దెబ్బలా మారింది. ఎన్నాళ్లకు ముగుస్తుందో తెలియని సమ్మెతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.. బందుల పై ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ - ఇబ్బందులు
తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు, ఉపాద్యాయులు, కార్మికులు చేస్తున్న సకల జనుల సమ్మె ఎప్పుడు మగుస్తుందో తెలియదు.. అసలు ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితి.. ఎందుకంటే కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చేవరకు సమ్మె విరమించే సమస్యే లేదంటున్నారు ఉద్యోగులు.. కానీ సమ్మె వల్ల మామూలు ప్రజలు అష్ట కష్టాలెదుర్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల మాత్రం సమ్మె ప్రభావమే లేదంటున్నారు. 80 శాతం పాలన సుజావుగా సాగుతోందని బుకాయిస్తున్నారు.
ఈ మాట హైదరాబాద్‌లో కష్టాలు పడుతున్న మామూలు జనాన్ని అడిగితే అసలేం జరుగుతుందో చెబుతారు.. సమ్మె ప్రభావం సామాన్యు జీవితం పై ఎంత ప్రభావం చూపుతుందో తెలుస్తుంది. ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో.. సెట్విన్ బస్లుల దోపిడికి అంతులేకుండా పోయింది.. కోటి నుంచి అమీర్‌పేటకు 30 రూపాయల పై చిలుకు వసూలు చేస్తున్నారు. ఆటోవాళ్లు అడిగినంత ఇవ్వకుంటే మారు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. మరో వైపు ఆ మాత్రం కూడా అవకాశం లేకుడా 24, 25 తేదీల్లో ఆటోలు కూడా బంద్ బాట పట్టాయి. సెట్విన్ బస్సులు కూడా బందులో పాల్గొనాలనే డిమాండ్ కూడా మొదలయింది. కాస్తో కూస్తో రైళ్లు ఆదుకుంటున్నాయంటే రైల్ రోకో కూడా ప్రకటించారు. ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో బస్సుల నడిపిస్తుంటే వారికి ఎక్కణ్ణుంచి ఎక్కడికి ఛార్జీలు ఎంత తీసుకోవాలో తెలియక.. ఎక్కడికైనా పది రూపాయలే వసూలు చేస్తున్నారు. ఇక కూరగాయలు, చికెన్ మటన్ ల ధర చుక్కల్లో ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల తాము కూడా రేట్లు పెంచక తప్పట్లేదంటున్నారు.
సింగరేణిలో బొగ్గు పెల్ల కదలక పోవడంతో బొగ్గు నిల్వలు అడుగంటాయి.. రెండు రోజులకు మించి బొగ్గు లేదని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే అంటున్నారు. సింగరేణి సమ్మె ప్రభావం విద్యుదుత్పత్తి పై పడటంతో గ్రామాలన్నీ అంధకారం అయ్యాయి. పోనీ పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేద్దామంటే కరెంటోళ్ల సమ్మ అంటూ విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగారు. దీంతో పట్టణాల్లో కూడా కోత మొదలయింది. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు గంటల ప్రకటిత కోత విధిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు గంటలను నాలుగు గంటలకు పెంచే అవకాశం ఉంది. మరో వైపు స్కూళ్లు కూడా మూతపడ్డాయి. సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు కూడా అవుట్ పేషంట్లను పట్టిచ్చుకోవడం మానేశారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఆసుపత్రుల డాక్టర్లు విధులను బహిష్కరించారు. సమ్మెలో పాల్గొంటున్న విద్యార్ధి, ఉద్యోగుల పై జరుపుతున్న దాడులకు నిరసనగా తాము దీక్ష చేపట్టినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
సామాన్య ప్రజలు మాత్రం సమ్మె నిర్వహణ తీరు మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు. అయితే సమ్మ ప్రభావానికి ఎన్ని సర్వీసులు బందైనా మద్యం షాపుల మాత్రం జోరుగా సాగుతుండటం కొస మెరుపు.
బ్యాంగ్
ఫర్వాలేదు లెండి. ఇంకా కొద్దిరోజులయితే మీకు ఈ బాధలు తప్పుతాయి. అనగా అలవాటు అవుతాయి.
ReplyDeleteసమ్మ ప్రభావానికి ఎన్ని సర్వీసులు బందైనా మద్యం షాపుల మాత్రం జోరుగా సాగుతుండటం కొస మెరుపు.
ReplyDeletelol
Now you understand why the "udyamam" of December 10-22 was a foolish idea.
ReplyDeleteఉద్యమాలు తప్పని, సమ్మె కరెక్ట్ కాదని నా అభిప్రాయం అసలే కాదు. ముఖ్యంగా ప్రజలకు దీర్ఘకాలికంగా ఇబ్బంది కలగకుండా.. సమ్మె చేయోచ్చు. అదే విధంగా వ్యహాత్మక వత్తిడి తేవాలి గానీ.. అసలు ఎప్పుడు ముగుస్తుందో.. ఆ సమ్మె వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో తెలియని ప్రయాస.. ఇటు నాయకులకు, అటు ప్రజలకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది.. తెలియాల్సిన వాళ్లకు తెలిసే విధంగా వత్తిడి చేస్తే చాలు.. అష్టదిక్కులను దిగ్భందించి.. సింగరేణి, రైల్వే సత్తా చాటితే చాలు.
ReplyDeleteజనార్థాన్ గారూ, పోస్టు బాగుంది.
ReplyDeleteమీ పంచ్ లైన్ చూసాక ఓ మాటనేసి వెళ్ళిపోదామని
అన్నాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..................................... :-)
థాంక్యూ............ ఆల్ ఆఫ్ యు...
ReplyDeleteప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉద్యమం ఎలా చేయాలో చెప్పండి జనార్థన్ గారు...!
ReplyDeleteసీమాంధ్రుల బస్సు సర్వీసులను నిలిపేయాలి.. ఉద్యమం వికేంద్రీకృతం కావాలి. తెలంగాణలో సాగుతున్న లగడపాటి, రాయపాటి, కావూరి, టి.జి వెంకటేష్ ల కోటాను కోట్ల రూపాయల బిజినెస్ లకు తాళాలు వేయాలి. ఉద్యమం ఓయూ క్యాంపస్ నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లనుపట్టాలి. అవసరమనుకుంటే రైళ్ల దిగ్బందనం చేయాలి. ఇతర రాష్ట్రాల బస్సులను నిలపేయాలి. బిల్లులు కట్టకుండా ఆగాలి. కానీ మన ఆటోలు, మన స్కూళ్లు ఆపేస్తే మన పిల్లలకే ఇబ్బంది. వాళ్ల బారు బిజినెస్ లు, థియేటర్ల బిజినెస్‌లు, ఆర్టీసీ బందుతో లగ్జరీ బస్సుల సర్వీసులు ఇంకా బాగా నడుస్తున్నాయి.
ReplyDelete