ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, September 5, 2011

గాలి కేసులు ఇవే...!


అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ అరెస్టు చేసిన గాలి సోదరుల పై 8 రకాల కేసులు నమోదు చేసింది.. నేరపూరితంగా కుట్ర చేయడం, మోసం చేయడం, అటవీ సొమ్మును ధ్వంసం చేయడం వంటి పలు కేసుల్లో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి పై ఓబుళా పురం అక్రమాలకు సంబంధించన ఆరోపణల నేపద్యంలో సిిబిఐ మొత్తం 8 రకాల కేసులు నమోదు చేశారు.
ఐపిసి సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్ర కేసు చేసినట్టగా కేసు నమోదు చేశారు.. దీంతో బాటు మోసం చేసినందుకు ఐపిసి 420... చోరీ సొమ్మును స్వీకరించినందుకు ఐపిసి 411 కింద, ప్రభుత్వాస్తులను ధ్వసం చేసినందుకు గానీ ఐపీసి 427.. ఇతరులకు చెందిన ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించిన నేరానికి ఐపిసి 448 లు నమోదు చేశారు.. వీటితో బాటు.. అటవీ చట్టం ప్రకారం నిషిద్ద ప్రాంతంలో ప్రవేశించి అటవీ సంపదను ధ్వంసం చేసినందుకు గానూ సెక్షన్ 26 కూడా నమోదు చేశారు.. అక్రమాలకు సహకరించిన అధికారుల పై అవినీతి నిరోదక చట్టం 13బై1 కూడా చేర్చింది.. వీటితో బాటు మినరల్స్, మైనింగ్ చట్టాలకు సంబధించిన కేసులను కూడా అన్వయిస్తారు.
ఈ కేసులను 2009లోనే నమోదు చేసినా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంతో.. అప్పటికి తాత్కాలికంగా తెరపడింది. తాజాగా లోకాయుక్త నివేదికను అనుసరించి సిబిఐ స్టేను వెకేట్ చేయించి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది..

2 comments:

  1. తమని ఏ చట్టాలూ ఏమీ చేయలేవన్న భ్రమ లోంచి గాలి గాళ్ళు బయటకి వచ్చి ఉంటారేమో ఈ దెబ్బతో.

    ReplyDelete
  2. కాదు.. కాదు.. ఇది వాళ్లెపుడో ఊహించిందే.. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయల అక్రమాలకు తెగబడుతున్న ఈ కొడుకులు.. ఆ మాత్రం ఊహించలేరా.. జైలులో సాధారణ ఖైదీలానే ట్రీట్ చేస్తున్నామంటున్నా... మన అధికారల గురించి తెలియందేమీ లేదు. వైట్ కాలరంటే ఒంగొంగి సలాం చేస్తారు.. సో... అక్కడ కూడా గాలి బోగాలు అనుభవిస్తాడు.. తరువాత బెయిల్ మీద బయటకు వస్తే.. కేసు పూర్తయ్యే సరికి గాలికి వయసు అయిపోతుంది.

    ReplyDelete