Wednesday, March 14, 2012
రైల్వే మంత్రి దినేశ్‌కు మమతా బెనర్జీకి ఎందుకు చెడింది..?
దినేశ్ త్రివేది... ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దినేశ్ త్రివేది అంటే రైల్వే మినిస్టర్ గానే తెలుసు. పార్లమెంట్ లో ఆయన మార్కు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టగానే మమత ఒక్కసారి కస్సుమంది. దీంతో జాతి యావత్తూ ఒక్కసారి దినేశ్ వైపు చూశారు. సొంత పార్టీ మంత్రి పై మమత బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక మతలబు ఏంటనేది భేతాళ ప్రశ్న. దినేశ్ త్రివేది దీదీకి కొరకరాని కొయ్యగా మారారన్నవార్తల్లో నిజమెంత... ఇంతకీ త్రివేది ప్రస్థానమేంటి...
ఇప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న దినేశ్ త్రివేదికి... మొదటి నుంచి భిన్నమైన వ్యక్తిగానే పేరుంది.. పశ్చిమ బెంగాల్,, బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రివేది వివిధ రకాల పదవుల్లో కొనసాగారు. 1974లో ఎంబీఏ పూర్తి చేసి చికాగోలో డిటెక్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. తరువాత ఉద్యోగానికిరాజీనామా చేసి సొంత వ్యాపారంలోకి దిగారు. దీంతో బాటు వినియోగదారుల రక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఎన్నో పిటీషన్లు వేసేవారు. సమాచార హక్కు చట్టం రూపుదాల్చడం వెనుకు దినేశ్ త్రివేది పిటీషన్లు కూడా ఊతమిచ్చాయి.
త్రివేది 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరినా తరువాత 1990లో జనతాదళ్ లో చేరారు. మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే టీఎమ్సీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1990 నుంచి2008 వరకు ఎగువ సభలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బరాక్‌పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 నుంచి వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో అన్నా హజారేకి మద్దతుగా మంత్రిపదవికి రాజీనామా చేయాలని
రైల్వే మంత్రిగా దినేశ్ త్రివేదికి తనకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. రైల్వేలను పురాతన కాలపు పద్దతుల నుంచి తప్పించి ఆధునికీకరించాలనేది ఆయన అభిప్రాయం. రైల్వేలను ఆధునికీకరించ కుంటే ప్రమాదాలు నివారించలేమని ఆయన విశ్వాసం. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రైల్వే చార్జీలు పెంచడానికి పూర్తి వ్యతిరేకమని చెబుతోంది. రైల్వేలను ఆధునికీకరించాలంటే కావలసిన నిధులను చార్జీల ధర పెంచడం ద్వారానే పొందాలని త్రివేది భావించారు. అందుకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి స్వల్పంగా రైల్వే చార్జీలు పెంచారు. త్రివేది తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ అగ్రనేతకు ఆగ్రహాన్ని తెప్పించింది. మాటమాత్రం కూడా చెప్పకుండా చార్జీలు పెంచడం పట్ల భగ్గుమంది. మంత్రి చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదా రాజీనామా చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇది హైడ్రామానా.. లేక మమత మాటను త్రివేది పెడచెవిన పెట్టారన్న అన్న కోపమా అనే చర్చ సాగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
wikilo unna samachar kakunda kothhaga em chepparu bas...enthali valliddari madya enduku chedido cheppaledu
ReplyDeleteఅయ్యో బాస్.. త్రివేది వ్యక్తిత్వం ఉన్న మనిషి..మమతకు చెప్పకుండానే యూపీఏ అజండాను అమలు చేశాడు. ఆధునికీకరణ పేరుతో చార్జీలు పెంచాడు. దీదీకి కొరకరాని కొయ్యగా మారాడు.. అందుకు చెడింది.
ReplyDeleteఎనిమిది సం||lu gaa రైల్ చార్జిలు పెంచలేదని చదివాను. ఈ రోజుల్లో ఒక్కటొ రెండో కొత్తగా వేసిన ట్రైన్స్ తప్పించి మిగతావాటిని ఏమాత్రం పట్టించుకోవటంలేదు. 2వ తరగతి ఏ.సి. లో ప్రాయాణిస్తూ కంపార్ట్మెంట్ శుబ్రం చేయటం లేదని ఎన్నో సార్లు తగవు వేసుకొన్నా ఒక్కరు పట్టించుకోవటం లేదు. కారణం రైల్వే శాఖ శుభ్రం చేసె పనిని కాంట్రక్ట్ కి ఇచ్చింది, వారికి సకాలంలో డబ్బులు చెల్లించక, శుభ్రం చేయటం మానుకొన్నారని టి టి ఇ చెప్పాడు. ఇక మామలు తరగతి కంపార్ట్మేంట్లు ఎంత అఘొరిస్తూంటాయో ఊహించవచ్చు. మంత్రిగా అతను చేసిన పని చాలా మంచి పని.
ReplyDeleteSriRam
బాగా చెప్పారు. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి. బ్రిటిషర్స్ నాటి రైల్వే వ్యవస్థలో మార్పు రావాలి. కాబట్టే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ త్రివేది నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. రైల్వే స్టేషన్‌కు వెళితే రైల్ వెళ్లే వరకు టిక్కెట్ దొరకని పరిస్థితిలో మార్పు రావాలి
Delete*ఇది హైడ్రామానా.. లేక మమత మాటను త్రివేది పెడచెవిన పెట్టారన్న*
ReplyDeleteఈ రోజుల్లో మంత్రులందరు పై వారిని కాకా పడుతూ, వేల కోట్లు తింట్టూ కాలం గడిపేవారు తయారయ్యారు. ఈ మంత్రులకు టాలేంట్ తక్కువ కుల పిచ్చి,ముఠా తత్వం ఎక్కువ. పార్టి ప్రతిష్ట దెబ్బతింట్టున్నా కూడా పట్టించుకోకుండా, పై వారిని పొగుడుతూ ఎదో విధంగా లాభం పొందాలనుకొనే వారు తప్పించి, ధైర్యం చేసి అభిప్రాయం చెప్పటం,పోరాడటం అనేది మరచిపోయారు. జాతియ పార్టిలు వెనకపడి పోవటానికి ఈ భజన పరులు పెద్దకాణం. ఇక దివేది ని ఎంతో అభినందించాలి. ఆయన లాంటి తెగింపు, ధైర్యం కలిగిన మంత్రులు ఉంటే దేశం బాగుపడుతుంది. లేకపోతే ఒకరిని మించి ఒకరు ఉచిత పథకాలు ప్రవేశపెట్టటం, దేశాన్ని దివాల తీయించటం ఎక్కువైంది. దీనివలన పని చేయటమనేదే ప్రజలు మరచిపోతున్నారు.