Saturday, July 23, 2011
ప్రాజెక్ట్ ల్లోనీటి వివరాలు
ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్ట్ లలో నీటి
నిల్వలు గరిష్ట సామర్ధ్యానికి చేరుకున్నాయి.. ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్ట్ లన్నీ కళకళలాడుతున్నాయి.
వాయిస్
కర్నాటక పరిసర ప్రాంతాలో భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నిండు కుండలా తొణికసలాడుతోంది. ఆల్మట్టికి 1.15 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో
వస్తుండటంతో ముందు జాగ్రత్తగా లక్షా 55వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో నారాయణ పూర్ ప్రాజెక్ట్ నీటితో కళకళలాడింది. నారాణపూర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం వల్ల వచ్చే
వరదనీటితో బాటు ఆల్మట్టి నుంచి వస్తున్న లక్షా యాభైఐదు వేల క్యూసెక్కులు కలిపి లక్షా ఎనబై వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్ట్ లో నీరు పూర్తి గరిష్ట స్థాయికి చేరడంతో లక్షా
తొంభై వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. నారాయణ పూర్ నుంచి వరద నీరు మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టుకు చేరింది. దీంతో 39 గేట్ల ఎత్తివేసి నీటిని బయటకు విడుదల
చేశారు. ప్రాజెక్టు యొక్క ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు ప్రస్తుత
నీటిమట్టం 820 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ లోకి 2.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 10 వేల క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు.
వివిధ ప్రాజెక్టుల్లో వస్తున్న వరద నీటి వివరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. (గ్రాఫిక్ ప్లేట్ వేసుకోవాలి)
ఆలమట్టి ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 1.15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.. అవుట్ ఫ్లో 1.55 లక్షల క్యూసెక్కుల.. ప్రస్తుత నీటి మట్టం 518.6 మీటర్లు
నారాయణపూర్ ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో లక్షా 88వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 490.1మీటర్లు
జూరాల ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు
శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 2.17 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 9 వేలు క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 820 మీటర్లు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 15.4 వేలు క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 15 వందల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 554.1మీటర్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment