ఎ. జనార్దన్
యాంకర్
పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా వనరులను పెరగడం లేదని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.. ముఖ్యంగా మహిళల విషయంలో ఆకాశంలో సగం అని సగర్వంగా చెప్పుకుంటున్నా అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష గానే మిగిపోతున్నాయి. పట్టణ ప్రాంత మహిళలలో కొంత చైతన్యం వచ్చినా గ్రామీణ ప్రాంత మహిళలు ఇంకా అన్ని రంగాల్లో వెనబడే ఉన్నారు. యువత నిర్వీర్యమై అవకాశాలకోసం అర్రులు చాస్తోంది.. పెరుగుతున్న జనాభాతో బాటు దురవస్థలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా హెచ్ఎంటివీ.. స్పెషల్ స్పోరీ..
బ్యాంగ్ ( ఆకాశంలో... సగం)
వాయిస్ 1
ప్రపంచ జనాభా పెరుగుతోంది... మానవ జనాభా విస్పోటనం జరుగుతోంది.. ఇది కంటికి కనిపించని ఒక ప్రమాదం .. జనాభా విస్పోటనం.. మాల్థస్ సిద్ధాంతం ప్రకారం జనాభా రెట్టింపు సంఖ్యలో పెరుగుతుంటే వనరులు మాత్రం అంకగణిత శ్రేణిలో పెరుగుతున్నాయన్నారు.. అంటే పెరుగుతున్న జనాభా అనుగుణంగా వనరులు పెరగక పోవడం వల్ల రోజురోజుకూ సామాజిక, ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి. దీంతో దోపిడి.. అణిచివేత.. ఆధిపత్య దోరణులు రోజురోజుకూ పెచ్చుమీరిపోయి మనిషి నిత్యం అభద్రతా భావంతో బతుకుతున్నాడు.. ఈ పరిస్థితి మారాలంటే జనాభాను అరికట్టడంలో ప్రజల్లో మరింత చైతన్యం రావాలి.. వి టు అవర్స్ టు అనే పద్దతి కేవలం విద్యాధికులకే పరిమితమవుతోంది.. దారిద్యరేఖకు దిగువన ఉన్నవారు జనాభాను పెంచడంలో ముందుంటున్నారు. వారి పేదరికం పోవాలంటే సంపాదించేవారి సంఖ్య పెరగాలని వారూహిస్తున్నారు.. కానీ వారిని సన్మార్గంలో పెట్టలేక ఇంకా ఇబ్బందుల పాలయి సమాజానికి భారమవుతున్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్పందించాలి. మానవ వనురులను సద్వినియోగ పరుచుకోవాలని, జనగణన పై శాస్త్రీయ అధ్యయనం జరిపి యువతకు తగిన ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలంటున్నారు ఆర్ధిక నిపుణులు..
బైట్ - రేవతి, సామాజిక ఆర్ధిక నిపుణురాలు
వాయిస్ - 2
ప్రతి పదేండ్లకో సారి జనగణన చేసి జనాభా ఎంత పెరిగిందో తెలుసుకుంటారు.. పెరిగిన జనాభాలో యువకులెంతమంది, పిల్లలెంతమంది, వృద్దులెంతమందో లెక్కలు చెప్తారు. వారిలో తిరిగి పురుషులెంతమందో, స్త్రీలెంత మందో కూడా లెక్కగడతారు.. 1989 నుంచి జరుగుతున్న ఈ తంతు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. ఎన్నిసార్లు జనాభా లెక్కలు సేకరించినా అందులో మహిళల సంఖ్య సగం ఉందనేది మాత్రం ఎవ్వరూ కదనలేని అంశం.. మరి పెరుగుతున్న మహిళా జనాభాకు అనుగుణంగా పురుషులతో సమానంగా హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సామాజిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, వారు ఆకాశంలో సంగమని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే నాయకులు.. రాజ్యాధికారలో సగం ఇవ్వమంటే మాత్రం మీనమేషాలు లెక్కిస్తారు. ఇప్పటికే ప్రతిభ కలిగి వివిధ రంగాల్లో నిలదొక్కుంటున్న మహిళలకు నిత్యం వేధింపులతో నెట్టుకొస్తున్నారు.. మహిళా హక్కుల చట్టాలు పుస్తకాల్లో భద్రంగా ఉన్నా స్త్రీల భద్రత కరువయింది. ప్రభుత్వాలు స్త్రీల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో భౄణ హత్యల విషయంలో కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే రోజురోజుకూ భౄణ హత్యలు పెరుగుతున్నాయి.
బైట్ - సంజయ, సామాజిక ఉద్యమ కారిణి
వాయిస్ 3
వైద్యరంగంలో వచ్చిన పురోగతి వల్ల మాతృ, శిశు మరణాలు తగ్గాయంటున్నారు వైద్యులు. పట్టణ ప్రాంతంలో గర్భిణులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఇంకా అవగాహన పెరగాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.. గర్భిణీల్లో వచ్చే.. రక్తహీనత, పోషకాహార లోపం, బి.పి, వంటి ఇబ్బందులను ఆర్ధికంగా వెనబడిన కుటుంబాలు ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంత గర్భిణిల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు వైద్యులు.. నామ మాత్ర సహాయం ఇచ్చి చేతులు దులుపుకోకుండా గర్భిణిల విషయంలో పూర్తి సహాయ సహకారాలందిస్తే ప్రతి గర్భిణి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని అభిప్రాయ పడుతున్నారు.
బైట్ - మధుమిత, గైనకాలజిస్టు
బైట్ - కె. ఆనంద్, జిల్లా వైద్యాధికారి, అనంతపురం
వాయిస్ 4
జనాభా పెరుగుదలను అదుపులో పెట్టాల్సిన భాద్యత ప్రభుత్వాలతో బాటు.. పౌరుల పైనా ఉంది.. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం.. లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వాలంటరీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికివారు జనాభా నియంత్రణకు పూనుకుంటే జనాభా సమస్య ఒక సమస్యే కాదు..
ఎండ్ విత్ బ్యాంగ్
No comments:
Post a Comment