ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, July 29, 2011

యడ్యూరప్ప కథ.. కమీషు



కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం వదులుకోక తప్పని పరిస్థితి.. అధిష్ఠానం ఆశీస్సులతో ప్రజాబలంతో గద్దెనెక్కిన యడ్యూరప్ప పదవీ కాలం పూర్తికాకుండానే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. యడ్యూరప్ప పదవికి గండం తెచ్చిన అంశాలేంటి. సాదా సీదాగా కనిపించే యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్....యడ్యూరప్ప.. సాధారణ రైతు ఆహార్యాన్ని తలపించే ఓ అసాధారణ ప్రజానేత.. నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం అని ప్రశంసించిన అధిష్టానమే ఈరోజు అవినీతి కోర్టులో ముద్దాయిగా నిలబెట్టి పదవీత్యుచుణ్ని చేసేందుకు సిద్దమయింది. యడ్యూరప్పకు ఎందుకీ తలనొప్పి.. యడ్యూరప్ప నిజంగా అవినీతి పరుడా.. లేక అవినీతిని అనుమతించిన నాయకుడా.. ఇంతకూ ఎవరీ యడ్యూరప్ప...యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో జన్మించాడు. డిగ్రీ వరకు చదువకున్న ఆయన1965లో సాంఘీక సంక్షేమ శాఖలో క్లర్క్ గా పనిచేశారు. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యడ్యూరప్ప 1970లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శికారిపుర శాఖ కార్యదర్శిగా నియామకంతో .. ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమయింది. 1975లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలు మెట్లెక్కాడు.. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాలూకాకు భారతీయ జనతా పార్టీ అద్యక్షుడిగాను, ఆ తరువాత శిమోగా జిల్లా భాజపా అద్యక్షుడుగా పనిచేశారు.భారతీయ జనతా పార్టీ యడ్యూరప్ప కార్యదక్షతను గుర్తించి 1988 లో కర్ణాటక పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. అప్పటి నుంచి వరుసగా ఐదు సార్లు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. కర్ణాటక 10వ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా సమర్ధవంతంగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో ఓటమి పాలయినా పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్ అయ్యాడు. ధరంసింగ్ ప్రభుత్వాన్ని కూలదోసేదుకు జనతాదళ్ (ఎస్)కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందంలో మొదట కుమారస్వామి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాడు. కుమారస్వామి ప్రభుత్వంలో యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 20 మాసాల గడుపు తీరిపోయినా కుమారస్వామి యడ్యూరప్పకు అధికారం అప్పగించకపోవడంతో బిజేపి అగ్రనేతలు జోక్యం చేసుకొని 2007 నవంబర్‌లో యడ్యూరప్పకు అధికారం అప్పగించారు. ఈ ఘటన తరువాత కుమారస్వామి మనసుమార్చుకొని మద్దతు ఉపసంహరించడంతో... దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి భాజపా ప్రభుత్వం వారంరోజులకే కూలిపోయింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన తరువాత జరిగిన శాసనసభ ఎన్నికలలో బిజేపి పూర్తి మెజారిటీ సాధించింది. యడ్యూరప్పను ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టి ప్రకటించినందువల్ల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అవాంతరం జరుగలేదు. యడ్యూరప్ప స్వయంగా మళ్ళీ శికారిపుర శాసనసభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 45 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. 2008, మే 30న యడ్యూరప్ప రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.యడ్యూరప్ప కల నెరవేరింది.. కర్నాటక ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు, ప్రజా బలం పుష్కలంగా ఉంది.. కానీ యడ్యూరప్ప ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్పీకారం చేశారో గానీ ఎక్కిన నాటి నుంచి నేటి వరకు వివాదాలే పలకరించాయి. దిన దిన పదవీ గండం యడ్యూరప్పను నిత్యం వేధించింది. నిజాయితీ పరుడని కితాబిచ్చిన అధిష్ఠానమే మందలించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం యడ్యూరప్ప అవినీతికి పాల్పడుతున్నాడని కాదు.. అకమాలకు సహకరిస్తున్నాడని.. ఇంతకీ యడ్యూరప్ప అవినీతికి అభయమివ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యడ్యూరప్పను వివాదాలు చుట్టుముడుతూ వచ్చాయి. అంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు బళ్లారి అక్రమ గనుల త్రవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అరోపణలున్నాయి. దీనికి ఆయనకు భారీగానే ముడుపులు ముట్టాయనే వార్తలు వచ్చాయి. ఈ అపవాదును తొలగించుకునేందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ఆధ్వర్యంలో అక్రమాల పై విచారణ జరపవలసిందిగా కోరారు. లోకాయుక్త నివేదికతో తాను బయట పడతానని కుమారస్వామి ఆశించారు. కానీ ఈ లోపే కుమారస్వామి పదవి నుంచి వైదొలగడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. సొంత పార్టీ నేతే ముఖ్యమంత్రి కావడంతో గాలి సోదరుల అక్రమాలు మరింత ఊపందుకున్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని వ్యతిరేకించిన యడ్యూరప్పను తమ ధన బలంతో బ్లాక్ మెయిల్ చేసి పదవీచ్చుతుణ్ణి చేసేందుకు గాలి సోదరులు సిద్ధపడ్డారు. అధిష్ఠానం కల్పించుకొని వివాదానికి తెరపలికింది. యడ్యూరప్ప లోకాయుక్త దర్యాప్తును ముమ్మరం చేసి జూలై 19, 2010 కల్లా నివేదిక అందించాలని కోరారు.. తనను ఇబ్బంది పెడుతున్న గాలి సోదరులకు చెక్ పెట్టాలన్న యడ్యూరప్ప వ్యూహం ఆయన మెడకే ఉచ్చుగా మారింది. తరువాత జరిగిన పరిణామాలలో అక్రమాలలో యడ్యూరప్పతో బాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉందనే ఆరోపణలు జోరందుకున్నాయి. భూ కేటాయింపులో తన కుమారుడికి మేలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో ఇది అతి పెద్ద భూ కుంభకోణం. దీంతో బాటు గాలి గనుల్లో అక్రమాల వెనుక యడ్యూరప్ప హస్తముందని, అనేక రకాల ఉదాహరణలతో లోకాయుక్త తన నివేదికలో వెల్లడించింది. యడ్యూరప్పతో బాటు, గాలి జనార్దన్ రెడ్డి తో బాటు ఈ అక్రమాలతో సంబంధం ఉన్న నేతలందరికీ ఉద్వాసన పలకాలని హెగ్డే సిఫారసు చేశారు. ఎన్నో వివాదాల నడుమ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన యడ్యూరప్ప ఇటు దాయాదుల ఒత్తిడి మద్య అటు ప్రతిపక్షాల ఆరోపణల మద్య అధిష్టానం ఆదేశాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోక తప్పని పరిస్థితి వచ్చింది.కర్ణాటకలో బిజేపికి అన్నీ తానై వ్యవహరించిన యడ్యూరప్పకు సహచరుల బలం పుష్కలంగా ఉంది. గాలి జనార్దన్ రెడ్డిని అధిష్ఠానం అదుపులో పెట్టి ఉంటే యడ్యూరప్పకు ఇంత తలనొప్పి వచ్చేది కాదని ఆ పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. అవసరమైతే యడ్యూరప్ప వెన్నంటి ఉండి ఆయనకు న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. రాజీనామాకు జూలై 31 వతేదీ వరకు గడువు కోరిన యడ్యూరప్ప తన రాజీనామా పై యూ టర్న్ తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నో పదవీ గండాలెదుర్కొన్న యడ్యూరప్ప ఈ గండం కూడా తప్పించుకొని తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా... తప్పుకొని పెద్ద తలగా ఉంటారా అనేది కాలమే తేల్చాలి.

Wednesday, July 27, 2011

రామన్ మెగసెసెకు ఇద్దరు భారతీయులు



ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే అవార్డుకు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆరుగురికి ఈ అవార్డు లభించింది. వీరిలో మన దేశానికి చెందిన హరీశ్‌హండే, నీలిమా మిశ్రా ఉన్నారు. సెల్కో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సోలార్‌ పవర్‌ ద్వారా వెలుగును నింపేందుకు కృషి చేస్తున్న హండేకు , మహారాష్టలో గ్రామీణ అభ్యున్నతికి కృషి చేస్తున్న నీలిమాకు ఈ అవార్డు అందించారు. ఆసియా నోబెల్ గా పిలిచే అత్యంత ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డుకు భారత్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. మహారాష్ట్రలో నిరుపేద మహిళల సాధికారత కోసం కృషి చేసిన నీలిమా మిశ్రాకు అవార్డు దక్కింది... సెల్కో ఇండియా ద్వారా కర్ణాటక, గుజారాత్ గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వెలుగులు నింపిన హరీష్ పాండేని మెగసెసె వరించింది.నీలిమా మిశ్రా... చిన్న తనం నుంచే సామాజిక స్పృహ కలిగిన మహిళ.. నిస్వార్ధ సేవకు నిలువెత్తు నిదర్శనం.. బాగిని నివేదిత గ్రామీణ విజ్ఞాన నికేతన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా సూక్మరుణాల పేరుతో పేద ప్రజలకు ఆర్ధిక సాయం చేసి వారి కాళ్లపై వారు నిలబడేలా సహకరించింది. .. మహిళా సాధికారత కోసం 39 ఏళ్ల నుంచి విరామం లేకుండా కృషి చేస్తోంది. ఇన్నేళ్ల ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పటికే నీలిమాకు అరడజనుకు పైగా అవార్డులు ఆమెను వరించాయి. తాజాగా వచ్చిన రామన్ మెగసెసే అవార్డు ద్వారా వచ్చిన 22లక్షల రూపాయలను కూడా పేదల కోసమే ఖర్చు చేస్తానని నీలిమా ప్రకటించారు.
రామన్ మెగసెసె అవార్డుకు ఎంపికయిన మరో భారతీయుడు హరీష్ హాండే.. బెంగుళూరు కేంద్రంగా సెల్కో పేరుతో సంస్థను నెలకొల్సారు. సౌరవిద్యుత్ వినియోగం పై గ్రామీణుల్లో అవగాహన కల్పించి మారుమూల పల్లెల్లో కూడా విత్యుత్ వెలుగులు నిండేలా కృషి చేశారు. ఈయన పట్టుదల వల్ల లక్షా ఇరవై వేల గృహాల్లో సౌర దీపాలు వెలిగాయి. ఈయన చేసిన కృషి వలన నిరక్షరాస్యులకు కూడా సౌర విద్యుత్తు పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం పై ఆధార పడకుండానే పేదలే సౌరశక్తి సృష్టికర్తలుగా మారేలా గ్రామీణులను తీర్చిదిద్దినందుకు హండేకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Tuesday, July 26, 2011

రెపో..రివర్స్ రెపో అంటే ఏమిటి

అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందు ఆర్.బి.ఐ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కీలక విధాన వడ్డీ రేట్లను ఏకంగా అరశాతం పెంచింది. దీంతో ప్రైవేట్ బ్యాంకు లిచ్చే రుణాలపై వడ్డీల వడ్డింపు పెరిగే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ తన నిర్ణయం వెలువరిచిన కొన్ని నిముషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 300 పాయిట్లు పడిపోయింది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పట్ల బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిస్ (రిజర్వ్ బ్యాంక్ విజువల్స్, సెంట్రల్ బ్యాంక్, ఇతర బ్యాంక్, దువ్వూరి సుబ్బారావు విజువల్స్ వాడాలి)
ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసి పెరుగుతున్న ధరలకు అదుపులోకి తెస్తామని ప్రభుత్వ చెప్పే మాటలు ఇప్పటి వరకు వట్టిమాటలుగానే మిగిలిపోయాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పి అర్ధిక వ్యవస్థకే పెను సవాళ్లు విసురుతోంది. మార్కెట్ లో ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో రిజర్వుబ్యాంకు ద్రవ్య నిల్వలను తన దగ్గరకి తెచ్చేందుకు కీలక విధాన వడ్డీ రేట్లయిన రెపో.. రివర్స్ రెపోలను అరశాతానికి పెంచక తప్పలేదు. ఆర్ బి ఐ ఈ రేట్లను పావుశాతం వరకు పెంచొచ్చనేది అందరూ ఊహించేదే అయినప్పటికీ.. ఏకంగా అరశాతం పెంచడం ఇటు పారిశ్రామిక వర్గాలతో పాటు సామాన్యులను ఖంగు తినిపించింది...
రెపో.. రివర్స్ రెపో రేట్లు పెంచడం వల్ల సామాన్యుడికి వచ్చే నష్టం ఏంటి.. ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడానికి రెపో రేట్లు పెంచడానికి సంబంధం ఏంటి.. అసలు రెపో.. రివర్స్ రెపో అంటే ఏంటో చూద్దాం...
రెపో రేటు అంటే ఏంటి....?(గ్రాఫిక్ ప్లేట్)
ప్రైవేట్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రుణం తీసుకుంటాయి.. దీనికి ప్రైవేట్ బ్యాంక్ లు చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటారు... రెపో రేటు పెంచడమంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న రుణాల వడ్డీ రేటు పెంచడమన్న మాట.. దీంతో వడ్డీ భారం పెరగడంతో ప్రైవేట్ బ్యాంక్ లు... రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణం తీసుకోక పోగా బకాయిలను తీర్చే ప్రయత్నం చేస్తాయి.. దీనికోసం తమ ఖాతాదారుల నుంచి వసూళ్లు మొదలు పెడతాయి.. ఫలితంగా సమాజంలో ఉన్న ద్రవ్యం రిజర్వ్ బ్యాంక్ ఖజానాకు చేరుతుంది. రెపో రేటును ఆర్ బిఐ రేటు 7.5శాతం నుంచి 8 శాతానికి పెంచింది.
రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?
ప్రైవేటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత ధనాన్ని డిపాజిట్ చేస్తాయి. ఈ ధనానికి ఆర్.బి.ఐ కొంత వడ్డీ చెల్లిస్తుంది. దీన్నే రివర్స్ రెపో అంటారు. ఈ రేటు కూడా కూడా పెంచడంతో.. ప్రైవేట్ బ్యాంకులు తమ వద్దనున్న నిల్వలను ఆర్.బి.ఐ లో డిపాజిట్ చేసి అధిక వడ్డీ పొందే ప్రయత్నం చేస్తాయి. దీనికోసం కూడా ఖాతా దారుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసే అవకాశం ఉంది.. ఈ రేటు ఇప్పటి వరకు 6.5 శాతం ఉంది... పెంచిన రేటుతో 7 శాతానికి చేరింది.
సామాన్యుడికి, పారిశ్రామిక వర్గాలకు వచ్చే నష్టం ఏంటి ?
పై రెండు విధానాల వల్ల బ్యాంకులు సామాన్యులకు రుణాలివ్వడం తగ్గుతుంది. ఒకవేళ ఇచ్చినా వడ్డీ వడ్డింపు ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొని భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి బ్యాంకులు. ద్రవ్య నిల్వలు అధికంగా ఉన్న బ్యాంకులు ఆర్.బి.ఐ లో డిపాజిట్ చేసి వడ్డీ పొందే ప్రయత్నం చేస్తాయి. దీనికోసం కూడా లోన్ లు తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా సామాన్యుడికి వాహనాలకోసం, ఇళ్లకోసం, బంగారం కొనుగోలుకు, పరిశ్రమల స్థాపనకు రుణాలు దొరకడం కష్టంగా మారుతుంది. ఒకవేళ బ్యాంకులు రుణాలిచ్చినా వడ్డీరేటు ఎక్కవ కావడంతో సామన్యులే లోన్ లంటే వెనక్కు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రజల వద్ద ఉన్న ద్రవ్యం రిజర్వ్ బ్యాంకుకు చేరడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి.... ఆహారేతర వస్తువుల కొనుగోలు విషయంలో డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంకు తాజా వ్యూహం.
విజువల్స్
ఆర్ బి ఐ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని పలువురు ఆర్ధిక వేత్తలు అభినందనందిస్తున్నా.. వ్యాపార వేత్తలు మాత్రం ఆర్బీఐ నిర్ణయం పట్ల పెదవి విరుస్తున్నారు..

Saturday, July 23, 2011

ప్రాజెక్ట్ ల్లోనీటి వివరాలు


ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్ట్ లలో నీటి

నిల్వలు గరిష్ట సామర్ధ్యానికి చేరుకున్నాయి.. ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్ట్ లన్నీ కళకళలాడుతున్నాయి.
వాయిస్
కర్నాటక పరిసర ప్రాంతాలో భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నిండు కుండలా తొణికసలాడుతోంది. ఆల్మట్టికి 1.15 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

వస్తుండటంతో ముందు జాగ్రత్తగా లక్షా 55వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో నారాయణ పూర్ ప్రాజెక్ట్ నీటితో కళకళలాడింది. నారాణపూర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం వల్ల వచ్చే

వరదనీటితో బాటు ఆల్మట్టి నుంచి వస్తున్న లక్షా యాభైఐదు వేల క్యూసెక్కులు కలిపి లక్షా ఎనబై వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్ట్ లో నీరు పూర్తి గరిష్ట స్థాయికి చేరడంతో లక్షా

తొంభై వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. నారాయణ పూర్ నుంచి వరద నీరు మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టుకు చేరింది. దీంతో 39 గేట్ల ఎత్తివేసి నీటిని బయటకు విడుదల

చేశారు. ప్రాజెక్టు యొక్క ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు ప్రస్తుత

నీటిమట్టం 820 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ లోకి 2.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 10 వేల క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు.
వివిధ ప్రాజెక్టుల్లో వస్తున్న వరద నీటి వివరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. (గ్రాఫిక్ ప్లేట్ వేసుకోవాలి)
ఆలమట్టి ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 1.15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.. అవుట్ ఫ్లో 1.55 లక్షల క్యూసెక్కుల.. ప్రస్తుత నీటి మట్టం 518.6 మీటర్లు
నారాయణపూర్ ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో లక్షా 88వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో లక్షా 90వేల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 490.1మీటర్లు
జూరాల ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు
శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 2.17 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 9 వేలు క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 820 మీటర్లు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఇన్ ఫ్లో 15.4 వేలు క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 15 వందల క్యూసెక్కులు ప్రాజెక్ట్ లో ప్రస్తుత నీటి మట్టం 554.1మీటర్లు

Friday, July 22, 2011

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం




ఎపి భవన్ రెసిడెంట్ అధికారి చంద్రశేఖర్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరుగుతోంది.. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్ కు తీసుకురానివ్వకుండా... నేరుగా శ్మశానానికి తీసుకెళ్లే ప్రయత్నానికి... చంద్రశేఖరే కారకుడని హరీష్ రావు అతని పై చేయి చేసుకున్నాడు. తన పై అధికారి చెబితేనే ఆ పని చేశానని చంద్రశేఖర్ చెప్పడంతో కమీషనర్ తో వాదనకు దిగారు. తరువాత హరీష్ రావు తన తప్పిదాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డిని కడచూపు కూడా దక్కకుండా చేయబోయారనే ఆవేదనతో చేయిజారానని హరీష్ రావు చెబితే.. దళితుడు కాబట్టే దాడి చేశారని చంద్రశేఖర్ తరపు వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయ రంగు పులుముకుంది. చంద్రశేఖర్ ను కొట్టడం హరీష్ రావు దొరతనానికి నిదర్శనమని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. హరీష్ రావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసి నమోదు చేయడం న్యాయమైనదేనని మందకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతకీ అట్రాసిటీ కేసు ఎప్పుడు ప్రారంభమయింది. దీని పరిధిలోకి వచ్చే అంశాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
బ్యాంగ్ - వేధింపుల నిరోధక చట్టం.
యాంకర్ 1
మన దేశంలో ఒకప్పుడు దళితులను అంటరాని వారిగా చూసేవారు. దళితులను, గిరిజనులను చిన్న చూపు చూడటం.. వేధించడం.. కులం పేరుతో దూషించడం.. దాడులకు పాల్పడటం వంటి జరిగేవి. అంటరాని తనాన్ని నిషేదించేందుకు జాతిపిత మహాత్మాగాంధి, రాజ్యంగకర్త అంబేడ్కర్ తీవ్రంగా కృషి చేశారు. మహాత్మాగాంధి దళితులను బదులు హరిజనులని పిలిచాడు. అంబేద్కర్ దళితుల పై వేధింపుల నిరోదానికి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రకరణమే చేర్చారు..
వాయస్
రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల ప్రకారం దేశంలో పౌరులంరూ సమానులే.. కానీ గణతంత్రం వచ్చాక కూడా సమాజంలో పౌరులందరూ సమానంగా గౌరవించబడలేదు.. దళితుల పై గిరిజనుల పై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగింది. రాజ్యాంగంలో హక్కులు, సూత్రాలు, ప్రకరణలు కాగితాలకే పరిమిత మయ్యాయి. చట్టం పేదవాడి వరకు చేరలేదు. అసలు చట్టంలో ఏముందో తెలుసుకునే అవకాశం కూడా దళితుడికి లేదు. అంటరానితనం అమానుషం అన్న నీతి పాఠ్యపుస్తకాల అట్టలకే పరిమితం అయింది. అమానుషం కొనసాగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దళితుల పై జరిగిన దాడులకు ప్రభుత్వాలు స్పందించాయి. సామాజిక వేత్తల, దళిత నేతల చొరవతో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్అట్రాసిటీ యాక్ట్ కు పునాదులు పడ్డయి.
విజువల్స్
భారత రాజ్యాంగంలో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఇది1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలోకి వస్తుంది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం, దాడులకు పాల్పడటం వంటి14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. ఈ చట్టం కింద కేసు నమోదయితే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే వీలుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి 2010 సెప్టెంబరు 11వ తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యింది
విజువల్స్
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు అయితే 30 రోజుల్లో పరిష్కరించాల్సి వుంది. హత్య జరిగిందని నిరూపణ అయితే మృతుని కుటుంబానికి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత, బాధిత కుటుంబంలోని బిడ్డలకు విద్యకయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కుటుంబ పరిస్థితి మరీ దయనీయంగా వుంటే బాధిత కుటుంబంలోని పిల్లలకు నిత్యావసర వస్తువులు సైతం అందజేయాలని చట్టం చెబుతోంది. దాడులలో వికలాంగులైతే లక్ష రూపాయల వరకు అందజేస్తారు.
విజువల్స్
1985 పిసిఆర్‌, 1989 పిఓఎ చట్టం అమలు కోసం ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను అరరికట్టేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే 22 జిల్లాలో సంచార న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. ఈ జిఓల అమలుకు 2006-07లో రూ.13.72 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఏడాది చివరి నాటికి రూ.5.89 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2007-08లో రూ.18.89కోట్లు ప్రతిపాదించారు. కానీ, రూ.8.73 కోట్లు మాత్రమే కేటాయించారు. 2008-09 సంవత్సరం పరిస్థితి అంతా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ చనిపోవడం, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాల కారణంగా బడ్జెట్‌ కేటాయింపులు,అమలు పరంగా పెద్దగా ప్రభుత్వం దృష్టి సారించలేదు.
visuals
ఇప్పటి వరకు ఈ చట్టం కింద నమోదైన కేసులను పరిశీలిస్తే రాజకీయ కారణాలతో అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యధికం. పనిచేసి పెట్టడం లేదని ప్రభుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్నలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ఈ చట్టం కింద కేసు పెడితే ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్ధితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రభుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్నలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కేసులు పెడుతుండటంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్ధితి. పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్ధానాల్లో నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్ధితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం. ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ ధోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్ధితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే. అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్ధాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్ధితి. ఏ మనిషి ఏ మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించినా శిక్షించాల్సిందే. ఒక అమానుషాన్ని నిరోధించడం కోసం ఇంకో అమానుష చట్టం చెయ్యడం వివేకవంతమనిపించుకోదు. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు, సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి. లేని పక్షంలో సమాజంలో పౌరులందరికీ కలిపి సమగ్రమైన అత్యాచార నిరోధక చట్టం రూపోందించాల్సిన అవసరం ఉంది
విజువల్స్
ఈ చట్టం వచ్చాక దళితుల్లో చైతన్యం వచ్చిందనే చెప్పాలి. కానీ ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరి వ్యక్తుల మద్య గొడవ జరిగినా అందులో ఒకరు దళితుడైతే ఈ చట్టం పేరు చెప్పి భయపెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అమాయకులను ఆసరా చేసుకొని కొందరు రాజకీయ నాయకులు ఈ చట్టాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే అపవాదూ ఉంది. అందుకే చాలా కేసులు న్యాయస్థానం వరకూ వెళ్లకుండానే పోలీస్ స్టేషన్లలోనే పరిష్కారమవుతున్నాయి. 20 యేళ్ళ క్రితం పరిస్ధితులు నేడు లేవు. అంటరానితనం అనే మాట దాదాపు కనుమరుగయిందనే చెప్పాలి. .ఎస్సీ, ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. దళిత వాడల్లో నివసిించే వారికి మాత్రం ఇప్పటికీ ఈ చట్టం అందని ద్రాక్షగా మారితే.. ఉద్యోగంలో స్థిరపడి గౌరవంగా బతుకుతున్న వారు మాత్రం తమను కులం పేరుతో దూషిస్తున్నారని.. కేసులు పెట్టి పై అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. ఇంతకీ హరీష్ రావు దాడి చేసింది చంద్రశేఖర్ రావు ఒక దళితుడనా..? తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని అనాధ మృతదేహంగా తరలించారనే కోపంతోనా అనేది చట్టమే చెప్పాలి..

Monday, July 18, 2011

ఆధార్ అసలు రూపం



దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డులు.. ఆ కార్డులో వ్యక్తి సమాచారం మొత్తం నమోదయి ఉంటుంది.. వేలి ముద్రల దగ్గర్నుంచి.. కనుబొమ్మల ఆకారం వరుకు.. ఇంటి పేరు నుంచి ఒంటి మచ్చల వరకు... అంటే దాదాపు ఒక పౌరుడి వివరాలు మొత్తం ఇందులో ఉంటాయి.. ఈ టెక్నాలజి ఎంత అడ్వాన్సుడ్ అంటే దేశంలో ఎక్కడ మీ వేలి ముద్ర దొరికినా మీ జాతకం మొత్తం చెప్పేయొచ్చు.. అంతేకాదు.. మీ అప్పులు.. బ్యాంక్ బ్యాలెన్స్... గ్యాస్ కనెక్షన్... మొబైల్ నంబర్ తో బాటూ అన్నీ చిటికెలో తెలుసుకునే యూనిక్ ఐడెంటిటీకి మన ప్రభుత్వం పెట్టిన పేరు ఆధార్.... ఈ పథకంతో లాభాలెన్ని ఉన్నాయో కష్టాలూ అన్నే ఉన్నాయి.. కష్ట నష్టాలమాట ఎలా ఉన్నా ఇంతకీ ఆధార్ కార్డుల జారీలోనే ప్రభుత్వం పురిటి నొప్పులు పడుతోంది.. ఆధార్ కార్డుల నిర్లక్ష్యపు నీడలపై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ.
బ్యాంగ్ ( ఆధారం)
యాంకర్ 1
ఆధార్ కార్డు... ఏడాది కాలంగా వింటున్న మాట.. దేశంలో ప్రతి ఒక్కరికీ పన్నెండంకెల గుర్తింపు సంఖ్య.. ఈ నంబరు చెబితే చాలు... మీరేంటో చెప్పేయొచ్చు... నంబర్ గుర్తులేకుంటే.. బయోమెట్రిక్ మిషన్ లో వేలి ముద్ర పెడితే చాలు తప్పిపోయిన వారిని క ూడా క్షేమంగా ఇంట్లో దించొచ్చు... ఖర్మకాలి ఏ చోరీలోనే వేలి ముద్ర దొరికితే ఇంటికి వెళ్లే సరికే పోలీసులు గుమ్మం ముందుంటారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.. కానీ ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందా... మన దేశంలో ఉన్న నూటా ఇరవై కోట్ల రెండు లక్షల మందికి ఆధార్ కార్డులివ్వడం సాధ్యమయ్యే పనేనా.. అసలిప్పటి వరకు ఆధార్ కార్డుల కథ ఎంత వరకు వచ్చింది..
వాయిస్ 1
దేశ పౌరులందరికీ ఒక గుర్తింపు ఉండాలనేది ప్రభుత్వ సంకల్పం.. ఈ విధానంలో ప్రతి పౌరుడికి 12 అంకెల సంఖ్యను కేటాయిస్తారు.. కార్డు జారీ సమయంలో వ్యక్తి వేలిముద్రలు బయో మెట్రిక్ పద్దతిలో... కనుపాపలను ఐరిస్ పద్దతిలో స్కాన్ చేస్తారు.... పుట్టుమచ్చల వివరాలు రాసుకుంటారు. తల్లి దండ్రుల వివరాలతో బాటు...ఇంటి అడ్రస్.. పుట్టిన తేదీ.. ఆస్థిపాస్తుల వివరాలు.. విద్యార్హతలు అన్నీ పూర్తిగా నమోదు చేస్తారు.. ఈ నంబర్ పై ఫోటోతో బాటు వ్యక్తి వివరాలు పొందుపచబడి ఉంటాయి.. రేషన్ కార్డు నుంచి పాస్ పోర్ట్ వరకు ఈ కార్డుకు అనుసంధానం చేస్తారు.. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా... సంక్షేమ పథాకాలకు దరఖాస్తు చేయాలన్నా ఈ కార్డే ఆధారం.. దేశంలో ప్రతి ఒక్కరికీ గుర్తింపునివ్వాలను కున్న ప్రభుత్వ సంకల్పం నిర్లక్ష్యపు నీడలో నీరుకారిపోతోంది.. అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ఆరభ శూరత్వం లా మారింది.. అడపా దడపా ప్రభుత్వం పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నా.. ఆచరణలో మాత్రం అడుగు కూడా ముందుకు సాగడం లేదు.. ఇప్పటికే జారీలో అవకతవకలు... జారీ చేసిన వాటితో సవాలక్ష ఇబ్బందులు ఎదరువుతున్నాయి..
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
దేశంలో మొదటి సారిగా ఆధార్ కార్డుల వినియోగాన్ని ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది.. ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కార్డుల జారీ బాధ్యత తీసుకుంది. ఇన్ఫోసిస్ మాజీ సిఇఓ నందన్ నీలేకని ఆధ్వర్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మన రాష్ట్రంలో ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం.. మొత్తం 7 జిల్లాల్లో ప్రాజెక్ట్ ప్రారంభించారు. వ్యక్తుల వివరాల సేకరణ బాధ్యతను ఇ సెంట్రిక్ సొల్యూషన్స్, గౌతమీ ఎడ్యుకేషన్ సొసైటీ... స్మార్ట్ చిప్, వంటి 8 సంస్థలు కాంట్రాక్ట్ తీసుకున్నాయి. పేరుకే ఈ సంస్థలు కాంట్రాక్టుదారులయినా.. క్షేత్ర స్థాయిలో పనిని మాత్రం సబ్ కాంట్రాక్టర్ లకు లీజుకిచ్చాయి. ఈ సబ్ కాంట్రాక్ట్ సంస్థలు కావల్సినన్ని డిపిఎల్ సెంటర్లను ఏర్పాటు చేయడం లేదు.. తక్కువ సెంటర్లతో.. తక్కువ మంది సిబ్బంది... దీనికి తోడు సెంటర్లలో పనిచేసే మిషన్లు, కంప్యూటర్లు మొరాయించడం.. సిబ్బంది నిర్లక్ష్యం... అన్నీ పోగై వివరాల సేకరణ నత్తనడకను వెక్కిరిస్తోంది...
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
డిపిఎల్ సెంటర్లలో సేకరించిన వివరాలు బెంగుళూరుకు పంపుతారు... బెంగుళూరులో వ్యక్తుల వివరాలన్నీ పరిశీలించి ఆధార్ నంబర్ కేటాయిస్తారు.. ఆ వివరాల్లో ఉన్న అడ్రస్ కు పోస్టులో కార్డు పంపిస్తారు.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆధార్ నంబర్ తో బాటు రేషన్ కార్డు నంబర్ ఉన్న స్మార్ట్ కార్డును అందిస్తున్నారు. ముందు చెప్పిన ఏడు జిల్లాలు కాక మిగిలిన 16 జిల్లాల్లో ఈ పనిని యస్.బి.ఐ, పోస్టల్, సెంట్రల్ బ్యాంక్ ఎల్ఐసి సంస్థలకు అప్పగించారు.. షెడ్యూల్ ప్రకారం మొదట ప్రారంభించిన ఏడు జిల్లాల్లో జూన్ వరకు పని పూర్తయితే మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ వచ్చే జూన్ వరకు కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. మిగతా జిల్లాల భాద్యతలు తీసుకున్న సంస్థలైన పోస్టల్.. బ్యాంక్ సంస్థలకు ఎలాగూ సిబ్బంది కొరత ఎప్పట్నుంచో వేదిస్తోంది.. ఉపాధి హామీ పథకంతోనే ఈ సంస్థలు పీకల్లోతు కూరుకొని ఉన్నాయి. అదనపు బాధ్యతలు అనుకున్న కాలంవలో పూర్తి చేయడమంటే అనుమానమేనంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో భారీ క్యూలైన్లు ఉండటం, ధరఖాస్తు నింపరాని వారు ఏజెంట్లను ఆశ్రయించడం, వివరాలు నమోదు చేయడంలో తప్పులు దొర్లడం, పని త్వరగా కావాలంటే కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వంటివి ఆధార్ కు బాలారిష్టాలుగా పరిణమించాయి.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
యాంకర్ 2
ఆధార్ కార్డు రావడం ఆలస్యమవుతుందేమో గానీ రావడం మాత్రం తధ్యం.. ఇంతకీ అధార్ కార్డువల్ల సామాన్యులకు ఒరిగేదేముంది.. ఈ కార్డుంటే లాభమేంటి.. .. కార్డు వెనుక కష్టాలేమైనా ఉన్నాయా.. కార్డు లేకుంటే ఏం జరుగుతుంది.. సమాజంలో వ్యక్తిగా గుర్తింపునివ్వరా.. గుర్తింపే కాదు అసలేమీ ఇవ్వరా..
వాయస్
పన్నెండంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు జేబులో ఉంటే.. దేశంలో అన్ని ప్రయోజనాలు పొందడానికి అర్హుడైనట్టే లెక్క... ఇక నుంచి ప్రతి పనికీ ఆధార్ కార్డే అడుగుతారు.. ఇప్పటి వరకు సిమ్ కావాలన్నా , బ్యాంక్ అకౌంట్ కావాలన్నా రేషన్ కార్డో.. ఎలక్షన్ ఐడి కార్డో.. డ్రైవింగ్ లైసెన్సో అడిగే వారు.. ఇవేవీ లేకున్నా కనీసం కరెంట్ బిల్లన్నా తెమ్మంటారు.. ఇక నుంచి ఇవేమీ అక్కర్లేదు.. ఆధార్ నంబరే అన్నిటికీ ఆధారం.. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే చాలు పూర్తి వివరాలు ఇచ్చినట్టే.. ఈ విధానం వల్ల చాలా వరకు అక్రమాలను అరికట్ట వచ్చనేది ప్రభుత్వాల వ్యూహం. ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని.. అసలు వ్యక్తులే లేకుండా బినామీ పేర్లతో పథకాలను పక్కదారి పట్టించడాన్ని అరికట్టడానికి ఈ ఆధార్ కార్డు పనికొస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రంగారెడ్డి బాలానగర్ రేషన్ షాపు. స్మార్ట్ కార్డులు రాక ముందు ఈ షాపు పరిధిలో 348 రేషన్ కార్డులుండేవి.. స్మార్ట్ కార్డులొచ్చాక 148 కార్డులు బోగస్ వని తేలింది. కేవలం 200 కార్డులు మాత్రమే నిజమైన లబ్దిదారులవని తెలుస్తోంది. దీంతో రేషన్ షాపు నుండి అదనపు ప్రయోజనాలు లభించకపోవడంతో డీలర్ షాపు తెరవడమే మానేశాడని వినియోగదారులు చెబుతున్నారు..
బైట్ - నాగేశ్వర్ రావు, రేషన్ వినియోగదారులు
బైట్ - చంద్రకళ, రేషన్ వినియోగదారులు
వాయిస్
ఈ రకంగా ఒక్క రేషన్ షాపులోనే ఇన్ని బోగస్ లు బయట పడితే ఇక రాష్ట్రంలో మొత్తంలో.. దేశం మొత్తంలో ఎన్ని అక్రమాలకు అడ్డుకట్ట పడాలి. అందుకేనేమో కార్డులు ఆలస్యం కావడంలో థర్డ్ పర్సన్ల పాత్ర కూడా లేకపోలేదంటున్నారు సామాజిక వేత్తలు.. ఈ కార్డు ఉంటే రాష్ట్రంలో ఎక్కడయినా రేషన్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఐతే కుటుంబంలో ఎవరో ఒకరు వస్తేనే రేషన్ లభిస్తుంది. ఫీజుల రీయంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ కనెక్షన్, ఉపాధి హామీ, అన్నీ ఈ కార్డుతోనే ముడి పడి ఉన్నాయి. ఈ కార్డుతో ఒకసారి ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రయోజనం పొందితే తిరిగి మరోసారి అదే పథకానికి అర్హుడయ్యే అవకాశం లేదు. ఈ విధానం వలన ఒకే వ్యక్తి రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా ప్రయోజనాలు పొందడాన్ని నివారించవచ్చు.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
యాంకర్ 3
ఆధార్ కార్డుతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. కానీ దీని వల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే ఉద్దేశ్యంతో కార్డుల జారీలోనే జాప్యం చేస్తున్నారు.. అంతేకాదు.. లబ్దిదారుల ప్రయోజనాలను నెరవేర్చడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు..
వాయిస్
రాష్ట్రంలో జూన్ నాటికి మూడు కోట్ల మంది వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ అందులో సగం కూడా పూర్తిస్థాయిలో జరగలేదు.. కేవలం కోటీ 40లక్షల 59 వేల మంది వివరాలు సేకరిస్తే.. అందులో కోటీ 7లక్షల 72 వేల మంది వివరాలే బెంగుళూరుకు వెళ్లాయి. ఇందులో కేవలం 29 లక్షల మందికే కార్డులు జారీ అయ్యాయి. అంటే మొత్తం మూడు కోట్ల మందికి కార్డుల జారీ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేసుకోవచ్చు.. మొత్తంగా మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు ఆధార్ కార్డులు అందే ద్రాక్షేనా అన్న సందేహం కూడా లేకపోలేదు. ఇదేంటంటే మాకుండే ఇబ్బందులు మాకున్నాయంటున్నారు అధికారులు..
బైట్ - ప్రసాద్, అంబర్ పేట డిపిఎల్ ఇన్ చార్జి
ఇదంతా ఒక ఎత్తయితే అసలు ఆధార్ కార్డంటే ఏంటో చాలా మందికి తెలియదు.. ప్రజల్లో దీని గురించి సరైన అవగాహన లేకపోగా అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి తోడు విమర్శలూ బలంగానే వినిపిస్తున్నాయి. తక్కువ జనాభా కలిగి సాంకేతికంగా అభివృద్ది చెందిన దేశాల్లోనే సక్సెస్ కాని ఈ విధానం భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో సాధ్యమేనా అన్న సందేహం నిపుణులను వేధిస్తోంది. 121 కోట్ల మందికి గుర్తింపు నంబరు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన అభినందించ దగ్గదే అయినా వీరందరి వివరాలు గోప్యంగా ఉంచగలదా అనే కోణంలో కూడా నిపుణులు ఆలోచిస్తున్నారు.. ప్రతి కార్డు వినియోగ దారుడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాయి.. లబ్దిదారుడు అకౌంట్ తెరిచినా.. కొత్తగా సిమ్ కొన్నా... గ్యాస్ కనెక్షన్ తీసుకున్నా ఆ వివరాలన్నీ ఆ నంబర్ ఫైల్ కు అప్ డేట్ అవుతాయి. అంతేకాదు.. అకౌంట్ నంబర్, రేషన్ కార్డు నకళ్లు.. ఎలక్షన్ కార్డు వివరాలు అన్నీ ఉంటాయి.. అయితే ఈ వివరాలన్నీ అసాంఘీక శక్తుల చేతికి వెళ్లకుండా కాపాడ గలగటమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు.. ఈ మొత్తం డేటా హ్యకర్ల చేతికి చిక్కిందా ఏదైనా జరగొచ్చు.. పుట్టగొడుగుల్లా డూప్లికేట్ కార్డులు పుట్టుకురావడమే కాకుండా... అసలు లబ్ది దారుడికే తెలియకుండా రకరకాల ప్రయోజనాలు పొందొచ్చు.. ఇప్పుడు భారత దేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఈ డేటాను భద్రంగా దాచడం కత్తిమీద సామే అంటున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు.
యాంకర్ 4
యూనిక్ ఐడి నంబర్ కేవలం మనదేశంలోనే ఇస్తున్నారా.. ఇంతకు ముందు ఇటువంటి ప్రయత్నం ఏ దేశమయినా చేసిందా.. చేస్తే అక్కడ ఈ నంబర్ ఎటువంటి ప్రభావం చూపింది.. కార్డుల వల్ల ఏం జరిగింది.. ఏం ఒరిగింది..
వాయిస్
ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించడంతో బాటు, ఇతర ప్రయోజనాల నేరవేర్చుకోవడం కోసమే భారత్, బ్రిటన్ లు యూనిక్ ఐడి ప్రాజెక్ట్ ప్రారంభించారనేది తెలిసిందే.. అయితే ఇదే తరహా విధానాన్ని అమెరికా 1934లోనే అమలు చేసింది. పౌరులకు సోషల్ సెక్యురిటీ నంబర్ కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేసింది. దీంతో బాటు పౌరుల సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి అవసరమైన చట్టబద్దమైన ఏర్పాట్లన్నీ చేసింది.. అన్ని ఏర్పాట్లు చేసుకొని అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా సర్వర్ల పై హ్యకర్లు దాడి చేసి ఏటా కోటి మందికి పైగా నష్టపోతున్నారు. ఈ సైబర్ దాడుల్లో సుమారు 50 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలు.. కానీ ఆధార్ నంబర్ అమెరికా సోషల్ సెక్యురిటీ లాంటిది కాదని ప్రభుత్వ వాదిస్తోంది.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
ఇంత జరిగి కార్డు చేతికి వచ్చినా.. కార్డు ఉపయోగిచాలంటే బయోమెట్రిక్ మిషన్ లబ్దిదారుడి వేలి ముద్రను గుర్తించి ఆమోదిస్తేనే ప్రయోజనం... లేకుంటే... కార్డు జేబులో పెట్టుకొని ఇంటిబాట పట్టాల్సిందే. ఏ దేశంలో నైనా బయోమెట్రిక్ మిషన్లు సగటున 5 శాతం వేలి ముద్రలను గుర్తించలేవని నిఫుణులే చెబుతున్నారు. భారత్ వంటి దేశాలలో ఇది 15 శాతం వరకూ ఉంటుందని అంచనా.. నిత్యం శ్రమ చేసే కార్మిక వర్గం చేతుల గీతలు సహజంగానే చెదిరిపోతుంటాయి... కొత్త గాట్లు పడుతుంటాయి. వీటిని బయోమెట్రిక్ మిషన్ గుర్తించే అవకాశమే లేదు... ఆధార్ ప్రాజెక్టుకు సాంకేతిక సేవలందిస్తున్న 4జి ఐడెంటిటీ సొట్యూషన్ సంస్థ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది.. ఇదే నిజమయితే దేశంలో 20 కోట్ల మందికి ఆధార్ కార్డు వచ్చే అవకాశమే లేదు..
ఎండ్ యాంకర్
వేల కోట్లు వెచ్చించి చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు రాకుంటే ఎవరు బాధ్యత వహించాలి... కోటానుకోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగాక చేతులెత్తేస్తే ఎవరిని నిందితులుగా చూపాలి.. ఏదేమైనా ఆధార్ కార్డు దేశ పౌరులకు ఓ దారి చూపితే అంతే చాలు..

Tuesday, July 12, 2011

ఆుధ్రప్రదేశ్ లో కోటలు

ఖమ్మం కోట 10వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు, అనంతర కాలంలో ముసునూరి నాయకులు, ఆపైన వెలమ రాజులు ఖమ్మంకోటను కేంద్రంగా చేసుకుని పాలించారు. ఈ కోట హిందూ-ముస్లిం రెండు సంప్రదాయాలను ప్రతిబింబించేలా వుంటుంది. వెయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు కూడా జరుపుకున్న ఈ ఖమ్మంకోట గొప్ప వాస్తుశిల్ప సంపదతో టూరిస్టులకు దర్శనీయ స్థలంగా వుంది.
ఎలగందల్‌ కోట
కామారెడ్డి రోడ్డు కరీంనగర్‌లో గోదావరీ నదీ తీరాన వుంది ఎలగందల్‌ కోట. క్రీస్తుశకం 1754లో జఫర్‌-ఉద్‌-దౌలా ఈ కోటను నిర్మించాడు. కాకతీయులు, బ్రాహ్మణీలు, ఖుతుబ్‌షాహీలు, మొఘల్‌ చక్రవర్తులు ఇంకా అసఫ్‌ జాహీలు - ఇలా ఐదు సామ్రాజ్యాలు ఈ కోట ఆధారంగా రాజ్యాన్ని పాలించాయి. నైజాముల కాలంలో ఇది ప్రధాన కేంద్రంగా వుండేది. అప్పట్లో ఎలగందల్‌ కోటనుండి కరీంనగర్‌ హైవేకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకొండూరు కోటకు సొరంగమార్గం వుండేదని నమ్మకం. ఈ కోట ప్రాంగణంలో ఒక మస్‌జీద్‌, పండుగ ప్రార్థనలకోసం ఈద్‌గావ్‌ ఉన్నాయి.
భువనగిరికోట
భువనగిరి లేదా బోనగిరి కోట హైద్రాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లాలో వుంది. పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లా విక్రమాదిత్య-4 పేరుమీద త్రిభువనగిరి కోట అని పేరు వచ్చింది. అదే భువనగిరి కోట అయింది. ఇది కోడిగుడ్డు ఆకారంలో సౌందర్యం తొణికిసలాడుతూ రెండు బృహద్‌ ద్వారబంధాలతో వుంది. ఒకవేళ శుత్రుసైన్యాలు దాడిచేస్తే తప్పించుకునేందుకు భూమిలోంచి సొరంగమార్గం వుంది. చిత్రవిచిత్రమైన తలుపులు, కిటికీలు, కొలనులు, బావులతో ఒకనాటి వైభవానికి దర్పణం పట్టేలా వుంటుంది. రాణీ రుద్రమ్మాదేవి, ఆమె మనవడు ప్రతాప రుద్రారెడ్డి ఈ కోటనుండే రాజ్యపరిపాలన చేశారు. భువనగిరి కోట నుండి గోల్కొండ కోటకు సొరంగమార్గం వుండేది.
మెతుకు దుర్గం
హైద్రాబాద్‌కు 96 కిలోమీటర్ల దూరంలో మెదక్‌ పట్టణంలో వున్న మెతుకుదుర్గంలో హిందూ-ముస్లిం సమ్మిళిత వాస్తుశిల్పం దర్శనమిస్తుంది. ఇక్కడి 10 అడుగుల ఎత్తయిన ఇత్తడి తుపాకి, ముబారక్‌ మహల్‌ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ. వరి అన్నాన్ని మెతుకులు అంటాం కదా. అందులోంచి వచ్చిందే మెదక్‌ అనే పదం. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో కాకతీయులు స్వచ్ఛమైన హిందూ సంప్రదాయంలో నిర్మించిన ఈ దుర్గాన్ని తర్వాతికాలంలో వచ్చిన ఖుతుబ్‌ షాహీలు మార్పులూ చేర్పులూ చేయడంతో ముస్లిం వాస్తుకళ తోడైంది.
కొండపల్లి కోట
కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలో వుంది కొండపల్లి ఖిలా. 1360లో కొండవీటి రాజయిన ప్రోలయ వేమారెడ్డి ఈ కొండపల్లి కోటను నిర్మించాడు. అనేక యుద్ధాలకు ఈ కోట సాక్షీభూతంగా వుండేది. 1541లో మహమ్మదీయులు దీన్ని ఆక్రమించారు. కొంతకాలం బహ్మనీ సుల్తానుల అధీనంలో వుంది. తర్వాత గజపతీ రాజులు, ఆపైన కృష్ణదేవరాయలు కొండపల్లి కోట కేంద్రంగా పాలించారు. చివరికి 16వ శతాబ్దంలో ఖుతుబ్‌ షాహీ సామ్రాజ్యం చేతుల్లోకి వచ్చింది. ఈ కోట దుర్బేధ్యంగా వుండటంతో ఆంగ్లేయుల పాలనలో దీన్ని మిలట్రీకేంద్రంగా మార్చారు. ముద్దులొలికే చెక్క, లక్క బొమ్మలకు ప్రసిద్ధమైన కొండపల్లి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా వుంది. ఇటుగా వచ్చినవారు కొండపల్లి ఖిలాను తప్పక దర్శిస్తారు.
అనంతగిరి కోట
ప్రస్తుతం అనంతపురం పేరుచెప్పగానే పుట్టపర్తి సాయిబాబా గుర్తురావడం సహజం. అనంతపురం గూటీ ఫోర్ట్‌, రాయదుర్గ కోట, హేమావతి, పెనుగొండ కోటలు ఇలా ప్రాచీన చారిత్రక సంపదకూ నిలయమే. అశోక చక్రవర్తి కాలంనాటి గూటీ కోట చాలా పురాతనమైంది. విజయనగర రాజుల రాయదుర్గ కోట సముద్రమట్టానికి 2727 అడుగుల ఎత్తున వుంది. ఈ కోటకు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం వుంది. 8, 10 శతాబ్దాలకు చెందిన పల్లవుల కాలంలో నిర్మించిన హేమావతిలో అపురూపమైన వాస్తుకళ గోచరిస్తుంది. ఈ జిల్లాలో ఉన్న మర్రిమాను మహావృక్షం 1989లో ప్రపంచంలో అతి పెద్ద చెట్టుగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 550 సంవత్సరాల నాటి ఈ చెట్టు 1100 వేళ్ళతో విస్తరించింది. ఈ చెట్టుపై ఇప్పటికీ బొటానికల్‌ సర్వేలు జరుగుతున్నాయి.
గోల్కొండ కోట
1525లో మొహమ్మద్‌ ఖులీ ఖుతుబ్‌ షా నిర్మించిన గోల్కొండ కోట ముస్లిం సంప్రదాయ చరిత్రకు నిలువెత్తు అద్దం పడుతుంది. ఆ కాలంలోనే ఎక్కడికక్కడ నీళ్ళు పోయే మార్గంతో అద్భుతమైన ఆర్కిటెక్చరు, అపురూపం అనిపించే ఇంజనీరింగు కనిపిస్తాయి. ఈ ఖిలా గ్రానైట్‌ కొండమీద 120 అడుగుల ఎత్తులో వుంది. కింద ప్రాంగణం దగ్గర (ఎంట్రెన్స్‌) చప్పట్లు కొడితే పైన బురుజువద్ద ఆ ధ్వని వినిపించడం ఈ కోట విశిష్ఠత. గోల్కొండ కోట ప్రాచుర్యం చెప్పనలవి కానిది. దేశవిదేశాల టూరిస్టులెందరో గోల్కొండకోటను నిత్యం దర్శించుకుని వెళ్తుంటారు. గోల్కొండ కోట నుండి కొండపల్లి ఖిలాకు పైకి కనిపించని భూ అంతర్‌ మార్గం వుంది అంటారు. అలనాటి నవాబులు, బేగంలను స్ఫురణకు తెచ్చే గోల్కొండకోట వైభవాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే.
చంద్రగిరి కోట
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వుంది చంద్రగిరి కోట మన ప్రాచీన వాస్తుశిల్పకళను చాటిచెప్పే కళాఖండం అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రదేశాన్ని ''టెంపుల్‌ సిటీ ఎంట్రెన్స్‌'' అంటారు. బెంగుళూరు, తిరుపతి, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కొలువైన దేవాలయాలకు ఇక్కణ్ణించే వెళ్ళాలన్నమాట. చంద్రగిరికోట 11వ శతాబ్దానికి చెందినది. మూడు శతాబ్దాలపాటు యాదవరాయలు పాలించిన తర్వాత 1367లో విజయనగర పాలకులైన సాళువ నరసింహరాయల అధీనంలోకి వచ్చింది. నరసింహరాయలకు మహా మండలేశ్వర అనే బిరుదు వచ్చింది. ఆయన వద్ద పనిచేసిన మహా మంత్రి చిట్టి గంగరాయలు లేదా గంగనామాత్యుని దూరదృష్టి, తెలివి గురించి చరిత్ర గొప్పగా చెప్తుంది. ఆ కాలంలో ఆయన్ను భీష్మ పితామహుడు అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్యంలో నాలుగో రాజధాని చంద్రగిరి. గోల్కొండ సుల్తానులు పెనుగొండపై దాడి చేయడంతో విజయనగర చక్రవర్తులు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు. ఇందులో రాజమహల్‌, రాణీమహల్‌, ఇంకా ఇతర దెబ్బతిన్న నిర్మాణాలు ఉన్నాయి. రాజమహల్‌లో పురావస్తు ప్రదర్రశనశాల వుంది.
గండికోట
కడప జిల్లాలోని పెన్నా నదికి కుడివైపున, జమ్మలమడుగుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట చిన్న పల్లెటూరు. ఎర్రమల పర్వతాల్లో సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున గండికోట ఫోర్టు కొలువుతీరి వుంది. లోతైన లోయ, దట్టమైన చెట్లు, పుట్టలతో ఈ ప్రాంతం భూతల స్వర్గంలా కనిపిస్తుంది. 1123లో పశ్చిమ చాళుక్య చక్రవర్తులైన ఒకటవ అహవమల్ల సోమేశ్వరుని సామంతుడైన కాకరాజా ఈ గండికోటను కనుగొన్నాడు. కాకతీయ, విజయనగర, ఖుతుబ్‌ షాహీల కాలాల్లో గండికోటకు గొప్ప గుర్తింపు వచ్చింది. కడప జిల్లాకు చెందిన ప్రజాకవి వేమన ఈ గండికోట ప్రాంతంలోనే నివసించేవాడని చరిత్ర చెబుతోంది. హిందూముస్లిం భాయీభాయీ అనే నానుడికి నిదర్శనంగా ఈ కోటలో ఒక మస్‌జీదు, ఒక మందిరము (హిందూ దేవాలయం) ఉన్నాయి. రెండు పురాతన దేవాలయాలు మాధవునికి, రఘునాథునికి అంకితమయ్యాయి. ఇక్కడి అందమైన ఉద్యానవనాన్ని పరేబాగ్‌ అంటారు.
ఖిలా వరంగల్‌
ఇంద్రవైభవాన్ని తలపించే అపూర్వశిల్ప శోభిత కోట కాకతీయుల ఓరుగల్లు కోట. ఈ కోట ఉన్న ప్రాంతాన్ని ఖిలా వరంగల్‌ అంటారు. ఈ మూడు ప్రాకారాలు, నాలుగు మార్గాలు న్నాయి. హిందూ సంప్రదా యాన్ని పొదవి పట్టుకున్న అచ్చతెలుగుకోట తురుష్కుల ముష్కర దాడులకు చూర్ణ మైంది. మొండిగోడలు, విరి గిన శిల్పాలు, నేల రాలిన శిల్పకళా ఖండికలు చూప రుల గుండెలు పిండేస్తాయి. కాకతీయ ద్వారం ఇప్పటికీ తెలుగువారి స్వాగత ద్వారంగా నిలిచి అందా లు చిందిస్తోంది. కాకతీ య గణపతిదేవుడు ఈ కోటను 13వ శతాబ్దంలో నిర్మించేందుకు పూను కున్నాడు.
ఈ నిర్మాణాన్ని ఆయన కుమార్తె తెలుగు మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి పూర్తిచేసింది.
ఈ ఫోర్టులే కాకుండా జగిత్యాల కోట. మొలంగూరు కోట, దేవర కొండ కోట, నాగునూరు కోట, కొండవీటి కోట, రాచకొండ కోట - ఇలా అనేక కోటలు మన ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తూ, చారిత్ర కతను చాటుతూ ఈనాటికీ సగర్వంగా నిలిచి వున్నాయి. మన నిర్లక్ష్యం వల్ల బీటలు వారుతున్న కోటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని కాపాడుకోకపోతే మనకు చారిత్రక ఉనికే లేకుండా పోతుంది. ఇన్ని శతాబ్దాల చరిత్రా మట్టిపాలైపోతుంది.

కేసీఆర్‌ ఎత్తు కాంగ్రెస్‌ చిత్తు

యాంకర్
తెలంగాణ సాధనకు రాజీనామాలే పరిష్కారమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి మీటింగ్ లోనూ చెప్పుకుంటూ వచ్చారు.. తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల నేతలు రాజీనామాలు చేశారు.. కేసీఆర్ వ్యూహం ప్రకారం తెలంగాణ వస్తుందా... లేక ఈ ఉచ్చులో పడి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, టిడిపి నాయకులు చిత్తయ్యారా.. కేసిఆర్ రాజీనామా స్ట్రేటజీ పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ.
వాయిస్
మీరు రాజీనామాలు చేయండి తెలంగాణ ఎందుకు రాదో చూద్దాం.. మిమ్మల్ని మా గుండెల మీద పెట్టుకొని గెలిపిస్తం. పదవులు శాశ్వతం కాదు. వస్తయి పోతయి. కానీ చరిత్రలో మిగలాలంటే రాజీనామాలు చేయండి.. అందరం కలిసి తెలంగాణ సాధించుకుందాం.. అని ఇటు కాంగ్రెస్ నాయకులను, అటు తెలుగుదేశం నాయకులను ప్రతి సభలోనూ రెచ్చగొట్టాడు కేసీఆర్. రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందన్నంతగా తెలంగాణ ప్రాంత ప్రజలను నమ్మించడమే గాక తెలంగాణ ప్రాంత నాయకులు రాజీనామా చేయందే గ్రామాలలోకి వెళ్లలేని పరిస్థితి తయారయింది. మరోపక్క 14 ఎఫ్ చిచ్చురేగడంతో కాంగ్రెస్ నేతలకు అధిష్టానం వైఖరి మింగుడు పడలేదు. తెలంగాణ సిద్దాంత కర్త శవయాత్రకు కూడా హాజరుకాలేని పరిస్తితి. తీవ్ర ప్రజావ్యతిరేకత వస్తే రేపు గ్రామాల్లోకి వెళ్లడం కష్టమవుతుందనే భయంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలంతా రాజీనామా చేశారు... వీరికంటే మేమూ ఏమీ తక్కువ కాదన్నట్టు తెలంగాణ టిడిపి నేతలు ఓ గంట ముందే రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాజీనామాలు ఆమోదించాకే తమ రాజీనామాలు ఆమోదిస్తారనే ధీమా.. తెలంగాణ డిమాండ్‌ కు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలన్నీ రాజీనామ చేశాయి. ఎమ్మెల్చేలు ,ఎంపీలు , ఎమ్మెల్సీల రాజీనామాల సంఖ్య 140కి చేరింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలతో రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏదో జరిగిపోతుందని అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితిని చూస్తే కనీసం చీమకుట్టిన మాత్ర కూడా కనిపించడం లేదు.. పిసిసి అధ్యక్షుడు పిలిపించుకొని మాట్లాడటం.. ఆజాద్ మంతనాలాడటం మినహా ఒరిగిందేమీ లేదు.. అంతేకాకుండా ఈ రాజీనామాలను లెక్కచేయకుండా కేంద్రం తాపీగా కొత్త కేబినెట్ ను తీర్చి దిద్దుకుంది. రాష్ట్రానికి పూర్తిగా మొండిచేయి చూపి ఎపి మీదున్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. మొత్తం మీద రాజీనామాల వల్ల తెలంగాణ రాదన్న నిర్ణయానికి వచ్చారు కాంగ్రెస్ నేతలు.
బైట్ : మధుయాష్కి (కాంగ్రెస్‌ ఎంపి)
నోట్‌ : మొన్నటి దశాదిశాలో మధుయాష్కి మాట్లాడిన దాన్ని బైట్‌గా వాడుకోగలరు.
వాయిస్ : మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు.. ఇప్పటి వరకు తెలంగాణ నేతలచేత రాజీనామాలు చేయించాలన్న ఆపరేషన్‌ పూర్తయ్యిందని... దాని తరువాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.. రాజీనామాలను ఆమోదింపచేసుకోవడం ఎలా అనేదే కేసీఆర్‌ కొత్త వ్యూహం. ఇప్పుడు ఈ ప్లాన్‌లోె కూడా కాంగ్రెస్‌ను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి తెలంగాణ సమస్యను పట్టించుకోకపోవడం కేసీఆర్‌కు కలిసివచ్చే అంశంగా కనబడుతోంది. తమను చిన్న చూపు చూడటం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలుజీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ ఆజాద్‌ వ్యాఖ్యలు ఇందుకు ఆస్కారాన్ని కూడా ఇస్తున్నాయి.
బైట్ : ఆజాద్‌
నోట్‌ : ఈ రోజు ఢిల్లీలో ఆజాద్‌ మాట్లాడిన బైట్‌ను వాడుకోగలరు..
వాయిస్ :
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌ కంటే టీడీపి తెలంగాణ ఫోరమ్‌ పరిస్థితి మెరుగ్గా వుందని చెప్పవచ్చు. రాజీనామాల అంశం కాంగ్రెస్ కంటే టిడిపికే బాగా కలిసొచ్చినట్టున్నాయి. అసలు గ్రామాల్లోకే వెళ్లలేని పరిస్థతిల్లోంచి ఏకంగా బస్సు యాత్ర చేపట్టి తెలంగాణ పై రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీగా ప్రజల్లోకి దూసుకుపోతోంది టిడిపి. తెలంగాణ వచ్చేవరకు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సాధకు ఆ పార్టీ కార్యచరణను కూడా ప్రకటించింది. ఇప్పుడు ఇది టీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌కు మింగుడు పడని అంశంగా మారింది. టిడిపి తెలంగాణ ఫోరం మాత్రం తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేస్తుంది తమ పార్టీనే అని చెప్పుకుంటోంది. ఇక పై సామాన్యులెవరూ ప్రాణ త్యాగాలు చేయొద్దని అవసరమైతే మేము మా పదవులను, ప్రాణాలను త్యాగం చేస్తామన్న వాడి వేడి వ్యాఖ్యలు కేసీఆర్ కు పుండుమీద కారం చల్లినట్టుంది.
బైట్ :ఎర్రబల్లి దయకర్‌రావు(బస్సు యాత్ర సందర్బంగా మాట్లడినా ఫీడ్ను వాడుకోగలరు.)
వాయిస్ : కేసీఆర్‌ ఎత్తులో చిత్తయ్యామన్న విషయాన్ని ఆలస్యంగా గమనించిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఇప్పుడు నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు మాట విని టిడిపి నేతలు జెఎసికి రాంరాం పలికి స్వతంత్రంగా రంగంలోకి దిగి ముందుకు పోతుంటే... కాంగ్రెస్ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న ఊగిసలాటలోంచి దీక్షల బాట పట్టింది. దీక్షలతోనైనా కేంద్రం కళ్లు తెరుస్తుందా.. లేక రాజీనామాలు ఆమోదింప జేసుకోక తప్పని పరిస్థితా అన్నది కాంగ్రెస్ నేతల ముందున్న బేతాళ ప్రశ్న.
ఎండ్ విత్ విజువల్స్.

Sunday, July 10, 2011

ప్రపంచ జనాభా దినోత్సవం

ఎ. జనార్దన్
యాంకర్
పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా వనరులను పెరగడం లేదని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.. ముఖ్యంగా మహిళల విషయంలో ఆకాశంలో సగం అని సగర్వంగా చెప్పుకుంటున్నా అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష గానే మిగిపోతున్నాయి. పట్టణ ప్రాంత మహిళలలో కొంత చైతన్యం వచ్చినా గ్రామీణ ప్రాంత మహిళలు ఇంకా అన్ని రంగాల్లో వెనబడే ఉన్నారు. యువత నిర్వీర్యమై అవకాశాలకోసం అర్రులు చాస్తోంది.. పెరుగుతున్న జనాభాతో బాటు దురవస్థలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా హెచ్ఎంటివీ.. స్పెషల్ స్పోరీ..
బ్యాంగ్ ( ఆకాశంలో... సగం)
వాయిస్ 1
ప్రపంచ జనాభా పెరుగుతోంది... మానవ జనాభా విస్పోటనం జరుగుతోంది.. ఇది కంటికి కనిపించని ఒక ప్రమాదం .. జనాభా విస్పోటనం.. మాల్థస్ సిద్ధాంతం ప్రకారం జనాభా రెట్టింపు సంఖ్యలో పెరుగుతుంటే వనరులు మాత్రం అంకగణిత శ్రేణిలో పెరుగుతున్నాయన్నారు.. అంటే పెరుగుతున్న జనాభా అనుగుణంగా వనరులు పెరగక పోవడం వల్ల రోజురోజుకూ సామాజిక, ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి. దీంతో దోపిడి.. అణిచివేత.. ఆధిపత్య దోరణులు రోజురోజుకూ పెచ్చుమీరిపోయి మనిషి నిత్యం అభద్రతా భావంతో బతుకుతున్నాడు.. ఈ పరిస్థితి మారాలంటే జనాభాను అరికట్టడంలో ప్రజల్లో మరింత చైతన్యం రావాలి.. వి టు అవర్స్ టు అనే పద్దతి కేవలం విద్యాధికులకే పరిమితమవుతోంది.. దారిద్యరేఖకు దిగువన ఉన్నవారు జనాభాను పెంచడంలో ముందుంటున్నారు. వారి పేదరికం పోవాలంటే సంపాదించేవారి సంఖ్య పెరగాలని వారూహిస్తున్నారు.. కానీ వారిని సన్మార్గంలో పెట్టలేక ఇంకా ఇబ్బందుల పాలయి సమాజానికి భారమవుతున్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్పందించాలి. మానవ వనురులను సద్వినియోగ పరుచుకోవాలని, జనగణన పై శాస్త్రీయ అధ్యయనం జరిపి ‍యువతకు తగిన ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలంటున్నారు ఆర్ధిక నిపుణులు..
బైట్ - రేవతి, సామాజిక ఆర్ధిక నిపుణురాలు
వాయిస్ - 2
ప్రతి పదేండ్లకో సారి జనగణన చేసి జనాభా ఎంత పెరిగిందో తెలుసుకుంటారు.. పెరిగిన జనాభాలో యువకులెంతమంది, పిల్లలెంతమంది, వృద్దులెంతమందో లెక్కలు చెప్తారు. వారిలో తిరిగి పురుషులెంతమందో, స్త్రీలెంత మందో కూడా లెక్కగడతారు.. 1989 నుంచి జరుగుతున్న ఈ తంతు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. ఎన్నిసార్లు జనాభా లెక్కలు సేకరించినా అందులో మహిళల సంఖ్య సగం ఉందనేది మాత్రం ఎవ్వరూ కదనలేని అంశం.. మరి పెరుగుతున్న మహిళా జనాభాకు అనుగుణంగా పురుషులతో సమానంగా హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సామాజిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, వారు ఆకాశంలో సంగమని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే నాయకులు.. రాజ్యాధికారలో సగం ఇవ్వమంటే మాత్రం మీనమేషాలు లెక్కిస్తారు. ఇప్పటికే ప్రతిభ కలిగి వివిధ రంగాల్లో నిలదొక్కుంటున్న మహిళలకు నిత్యం వేధింపులతో నెట్టుకొస్తున్నారు.. మహిళా హక్కుల చట్టాలు పుస్తకాల్లో భద్రంగా ఉన్నా స్త్రీల భద్రత కరువయింది. ప్రభుత్వాలు స్త్రీల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో భౄణ హత్యల విషయంలో కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే రోజురోజుకూ భౄణ హత్యలు పెరుగుతున్నాయి.
బైట్ - సంజయ, సామాజిక ఉద్యమ కారిణి
వాయిస్ 3
వైద్యరంగంలో వచ్చిన పురోగతి వల్ల మాతృ, శిశు మరణాలు తగ్గాయంటున్నారు వైద్యులు. పట్టణ ప్రాంతంలో గర్భిణులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఇంకా అవగాహన పెరగాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.. గర్భిణీల్లో వచ్చే.. రక్తహీనత, పోషకాహార లోపం, బి.పి, వంటి ఇబ్బందులను ఆర్ధికంగా వెనబడిన కుటుంబాలు ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంత గర్భిణిల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు వైద్యులు.. నామ మాత్ర సహాయం ఇచ్చి చేతులు దులుపుకోకుండా గర్భిణిల విషయంలో పూర్తి సహాయ సహకారాలందిస్తే ప్రతి గర్భిణి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని అభిప్రాయ పడుతున్నారు.
బైట్ - మధుమిత, గైనకాలజిస్టు
బైట్ - కె. ఆనంద్, జిల్లా వైద్యాధికారి, అనంతపురం
వాయిస్ 4
జనాభా పెరుగుదలను అదుపులో పెట్టాల్సిన భాద్యత ప్రభుత్వాలతో బాటు.. పౌరుల పైనా ఉంది.. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం.. లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వాలంటరీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికివారు జనాభా నియంత్రణకు పూనుకుంటే జనాభా సమస్య ఒక సమస్యే కాదు..
ఎండ్ విత్ బ్యాంగ్

Friday, July 8, 2011

ప్రపంచ నిధులు

ీఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
మనిషి ఆశాజీవి.. ఆశయ జీవి కూడా.. తన జీవితకాలమంతా పదితరాలకు సరిపడా సంపదను కూడ బెట్టుకుంటాడు.. కానీ కాలం కలిసిరాకనో.. తాను సంపాదించిన సంపదే తనకు శత్రువయినపుడో.. సంపదను కాపాడే అవకాశం లేనపుడో.. ఆ సంపద కాస్తా నిధిగా మారుతుంది.. రహస్య ప్రాంతమంటే నేల మాళిగలే... ఆ నిధులు కొన్ని మట్టి పాలయితే.. మరికొన్ని రాజుల పాలయ్యాయి. ఈ నిధులే శిధిలాల కింద దాగిన చరిత్ర పుటవుతాయి. ఆ పుటల నిండా శ్రమజీవుల కష్టం కనిపిస్తుంది.. రాజుల రాజసం తొణికిసలాడుతుంటుది.. ఆచార సంప్రదాయాలు, మతవిశ్వాసాలు కనిపిస్తాయి. నిధులు దొరకడం ఇప్పుడే కొత్తకాదు.. ప్రపంచ చరిత్రలో పతాక శీర్షికలకెక్కిన నిధులెన్నో.. విశ్వవ్యాప్తంగా దొరికిన నిధుల పై హెచ్ఎంటీవి స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ ( బంగారు బావులు)
యాంకర్ 1
నిధులంటే లంకెల బిందెలే కాదు.. రత్నఖచిత ఆభరణాలు, మణిమాణిక్యాలు, బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు, ధనరాశులు... ఈ అపార నిధులను దాచింది రాజ్యాధీశులు, సంస్థానాధీశులు.. తమ సంపద శత్రుదేశాల రాజులకు దొరకకుండా దాచినవే ఎక్కువ.. తరువాత దాడుల్లో వారు చనిపోవడమో లేక బందీలుగా పట్టుబడటమో జరిగితే ఆ నిధి చీకట్లో రహస్యంగా మిగిలిపోతుంది.. కానీ ఒక్కోసారి ఊహించని రీతిలో నిధులు దొరుకుతాయి. భారీ మొత్తంలో బంగారం బయట పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అలా దొరికిన వాటిల్లో అద్భుతమైన నిధి పోలండ్ స్రోడా ట్రెజర్ ఒకటి..
వాయిస్ 1
20వ శతాబ్దంలో పోలండ్ పురావస్తు శాఖ కనిపెట్టిన ఓ అద్భుత నిధి ప్రపంచాన్నే నివ్వెర పరిచింది. ఈ నిధిని స్రోడా నిధి అని పిలుస్తారు. స్రోడా స్లాక భవనానికి పునర్నిర్మాణ పనులు చేపడుతుంటే ఈ నిధి బయట పడింది. ఈ సంపదంతా అక్కడ మ్యూజింయలో భద్రపరిచారు. ఈ నిధుల్లో ధగధగ మెరిసే బంగారు కిరీటం దొరికింది. ఇది పోలండ్ నాలుగవ ఛార్లెస్ భార్యదిగా భావిస్తున్నారు. దీనితో బాటు 12 వ శతాబ్దానికి చెందిన రెండు విలువైన హారాలు, విలువైన రాళ్లతో పొదగిన కొక్కేలు. 39 బంగారు నాణేలు, రెండువేల తొమ్మిది వందల ఇరవై నాలుగు వెండి నాణాలు లభించాయి.
స్మాల్ స్పాట్
వాయిస్ 2
పనాజ్యురిస్తే నిధి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వాటిలో ఒకటి.. 1949 డిసెంబర్ 8న పావెల్, పెట్కో, మైఖేల్ సోదరులు ఈ నిధిని గుర్తించారు. పనాజ్యురిస్తి ప్రాంతంలో మెరుల్ టైల్ ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తున్న ఈ ముగ్గురు సోదరులకు ఈ నిధి కనిపించింది. బురద పొరల కింద నుంచి గాజు మెరుపులు రావడాన్ని గుర్తించిన వీరు తవ్వి చూశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే సంపద వెలుగు చూసింది. ఈ థ్రేసియన్ నిధి ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ది పొందింది. దీనిలో ఆరువేల నూటా అరవై నాలుగు కేజీల శుద్ద బంగారంతో బాటు, మధుపాత్రలు, వివిధ ఆకృతుల్లో ఉన్న కప్పులు, నగిషీలు చెక్కిన రకరకాల పాత్రలు నిధిలో లభ్యమయ్యాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం 3, నాలుగు శతాబ్దాల మద్య ప్రాంతానివిగా భావిస్తున్నారు.
స్మాల్ వాయిస్
వాయిస్ 3
విశ్వవ్యాప్తంగా దొరికిన నిధుల్లో మరో అమూల్యమైనది ప్రిస్లేవ్ నిధి... బల్గేరియా రెండవ రాజధాని వెలికి ప్రిస్లేవ్ ప్రాంతంలో ఈ నిధి దొరికింది. ఇందులో 170 బంగారు, వెండి, బ్రాంజ్ లోహాలతో తయారు చేసిన ఆభరణాలు, 15 బెంజాన్టిన‌ నాణేలు లభ్యమయ్యాయి. 7వ ఇవి కాన్సస్టంటైన్, రొండవ రోమ్ చక్రవర్తుల కాలం నాటివిగా భావిస్తున్నారు. దొరికిన ఆభరణాల పై అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దిన నగిషీలున్నాయి. బంగారు బంతులు, స్వర్ణ లతలు, ముత్యాలున్నాయి.
వాయస్ 4
బల్గేరియాలోనే మరో భారీ నిధి దొరికింది. ఉక్రెయిన్ కు 13 కిలోమీటర్ల దూరంలో మాలా గ్రామంలో 1912లో ఈ నిధి బయటపడింది.. ఈ నిధిలో బంగారు, వెండి నాళికలు, ఖడ్గాలు, పటా కత్తులు దొరికాయి. వీటితో బాటు బంగారు రింగులు, కొక్కేలు, ఆభరణాలు, ముఖానికి వేసుకొనే ముసుగులు లభ్యమయ్యాయి..
యాంకర్ 2
పోయేటపుడు ఏదీ వెంట తీసుకెళ్లలేం అంటారు.. అందుకేనేమో కొందరు రాజులు తాము సంపాదించిన సంపదనంతా సమాధుల్లో నిక్షిప్తం చేస్తారు. తాము మరణానికి దగ్గరవుతున్నామని భావించిన క్షణం నుంచే వారి సమాధులు వారే నిర్మించుకొని సంపదను అందులో భద్రపరుస్తారు.
వాయిస్ 5
ఈజిప్ట్ రాజుల సంప్రదాయం ప్రకారం.. రాజుల మరణానంతరం వారు సంపాదించిన బంగారు ఆభరణాలు, విలువైన సంపదనంతా సమాధుల్లో భద్రపరుస్తారు. అటువంటి సమాదుల్లో ఒకటి ట్యుటాన్ కా మ్యాన్ నిధి. ఈ నిధిని1922లో కనుగొన్నారు. దీనిలో బంగారు రింగులు, బంగారు ముసుగులు, బంగారు ముద్దలు దొరకాయి. ఇవేకాక రాజాభరణాలు, రాజముద్రికలు కూడా లభించాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో నిధి తిల్లా టేపి నిధి. ఆఫ్ఘనిస్తాన్ లో పురావస్తుశాఖకు చెందిన షెబర్గాన్ ప్రాంతంలో ఈ నిధులు దొరికాయి.. మొత్తం ఆరు సమాధుల్లో భారీ సంపద దొరికింది. వీటిల్లో 20వేల బంగారు ఆభరణాలు, వేల సంఖ్యలో విలువైన వస్తువులు లభ్యమయ్యాయి. వీటితో బాటు రత్నాలు, బంగారు బెల్టులు, కిరీటాలు, హారాలు దొరికాయి.
వాయస్ 6
ఇక రొమేనియాలో కూడా రెండు భారీ నిధులు దొరికాయి. 1791లో నాజీసెంటిమిక్లోస్ ప్రాంతంలో దొరికిన నిధిలో 23 బంగారు నాళికలు లభ్యమయ్యాయి. వీటితో బాటు బంగారు నాణేలు, ఆభరణాలు కూడా లభించాయి. ఇవన్నీ 10 శతాబ్దానికి చెందినవిగా పరిశోధకులు గుర్తించారు. రొమేనియాలోనే పీట్రోఅసిలీ ప్రాంతంలో దొరికిన నిధిలో కూడా భారీ సంపద లభించింది. 1837లో వెలుగు చూసిన ఈ నిధిలో 22 బంగారు వస్తువులు, నాణ్యమైన రత్నాలు, నగిషీలు చెక్కిన పాత్రలు, విలువైన ఆభరణాలు దేవతా మూర్తుల ప్రతిమలు లభ్యమయ్యాయి. ఈ కోవలోకి వచ్చేదే గోర్డాన్ నిధి.. 1845లో ఈ నిధిని కనుగొన్నారు. ఇందులో ఆరవ శతాబ్దానికి చెందిన విలువైన ఆభరణాలు, వస్తువులు దొరికాయి. పెద్ద పెద్ద బంగారు పాత్రలు, వందల సంఖ్యలో బంగారు, వెండి నాణాలు లభ్యమయ్యాయి. ఈ నిధి మొదటి లియో కాలంలో సమకూర్చినట్టు పురావస్తు నిపుణులు గుర్తించారు.
వాయస్ 7
జావా నిధి కూడా ఇలాంటిదే .. ఇండోనేషియాలో జావా ప్రాంతంలో ఈ నిధిని కనుగొన్నారు. ఈ నిధిలో 14వేల ముత్యాలు, 4వేలమాణిక్యాలు, నాలుగు వందల కెంపులు, రెండువేల రెండొందల నగిషీలు చెక్కిన రాళ్లు వెలికితీశారు. ఇవన్నీ 10వ శతాబ్దానికి చెందినవిగా పరిశోధకులు గుర్తించారు.
ఎండ్ యాంకర్
అవును మరి భూమి పొరల్లో నిక్షిప్తమై సంపదంతా ఒక్కొటిగా వెలుగు చూస్తోంది. రాజులు, సంస్థానాధీశులు దాచిన అపార సంపదలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. తాజా ప్రపంచ నిధులన్నిటినీ మించిపోయే పద్మమనాభుడి నిధిని చూశాక ఇప్పుడు ప్రభుత్వాలు నిధుల వెలికితీతపై ఆసక్తి చూపుతున్నాయి.

Wednesday, July 6, 2011

ANANTHA PADMANABUDI CHARITHA


ిిఇంట్రో యాంకర్
ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న ఆలయం అది.. వడ్డికాసుల వాడే ఈర్ష్యపడే సంపదను తన గుండెలో దాచుకున్న పవిత్రాలయం. కేరళలోని శ్రీ అనంత పద్మనాభాలయంలో వెలుగు చూసిన ధగధగలతో బాటు ఆ ఆలయచరిత్ర పుటలు కూడా ఇప్పుడు పతాక శీర్షికలయ్యాయి. శ్రీ ఆనంత పద్మనాభుడే కాదు ఆ ఆలయానికి అంతటి ఘనకీర్తి తెచ్చిన వంశీకుల పేర్లు కూడా నేలమాళిగలో దొరికిన వజ్రాల కంటే మెరిసిపోతున్నాయి.
బ్యాంగ్ (అనంత సంపద)
యాంకర్ 1
నిన్న మొన్నటి వరకు మార్తాండ వర్మ అంటే ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు బ్రహ్మాండనాయకుడికి అత్యంత ప్రీతిపాత్రడైన రాజకుటుంబానికి చెందిన రాయలుగా వెలులోకి వచ్చాడు.. అనంత పద్మనాభుడి ఆస్థులు వెలుగు చూసే వరకు ఈ రాజకుటీంబికుల గురించి పట్టించుకున్న నాధుడే లేరు. ఆలయంలో సంపద దొరకడం మాట అటుంచితే ఈ వంశానికి ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నారు.. వీళ్లు సాధించిందేమిటి..
వాయస్
గల్లీ ఆలయం నుంచి ఘనకీర్తి పొందిన ఆలయాల్లో కూడా అవినీతి వార్తలు నిత్యం వింటున్నాం..చూస్తున్నాం.. కానీ లక్షల కోట్లకు పై బడ్డ ఆస్థులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న ఆ వంశీయుల అంకిత భావాన్ని అభినందించకుండా ఉండలేం.. అంతేకాదు. ఈ వంశీయుల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు కూడా చాలానే ఉన్నాయి. ట్రావెన్ కోర్ వంశీకులు భక్తికి, సనాతన ధర్మ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది.
యాంకర్ 2
ట్రావెన్ కోర్ వంశీయులు ఎందికింత ధనాన్ని నేలమాళికలో భద్రపరిచారు. అసలు ఇంత సంపదను గుప్తంగా దాచ వలసిన అవసరం ఏంటి.. వివరాల్లోకి వెళితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
వాయిస్
సమాజంలో ఆలయాన్ని ఆధారం చేసుకొని బ్రతకడం చూశాం... కానీ ఆలయం కోసం బతకడం చాలా అరుదు. ఆలయ పరిరక్షణ కోసం ప్రాణాలర్పించడాన్ని సినిమాలోనే చూస్తాం.. కానీ చరిత్ర పుటల్లో ఈ నిజం... నివురు గప్పుకొని నేలమాళిగల్లో దాగి ఉందన్న విషయం వెండి వెలుగులు విరజిమ్మే వరకు తెలియలేదు. పద్మనాభుడు తన గర్భగుడి గుండెల్లో ఉన్న పసిిడి నిజాన్ని లోకానికి వెలుగు చూపించాడు.. ట్రావెన్ కోర్ వంశీయులు తాము ధర్మకర్తలుగానే ఉన్నారు.. ఆలయపోషకులుగానే బతికారు. ఇప్పటికీ ఆ వంశీకులు అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ రాజవంశానికి పెద్దగా ఉన్న ఉత్రాధమ్ తిరునాల్‏‏‏‏‏‏‏‏‏ మార్తాండ వర్మ ఇప్పటికీ ఆ ఆలయానికి 151రూపాయల 55 పైసలు చెల్లిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అంటే ఆలయ పరిరక్షణే వారి విధి తప్ప ఆలయ ఇటుకలో చిన్న ఇసుక రేణువంత ఆదాయాన్ని కూడా పొందలేదని నేలమాళిగను తవ్వుతున్న ఒకరైన శశిభూషణ్ తెలిపారు.. భారత దేశానికి విదేశీయుల దండయాత్ర బెడద ఎక్కువయింది.. డచ్చివారు..పోర్చిగీసు వారు.. ముస్లింరాజులు సంస్థానాలు కొల్లగొట్టడం, హిందూ ఆలయాలను విచక్షణారహితంగా నాశనం చేయడం వంటి అరాచకాలు హద్దుమీరాయి. వీరి ఆగడాలకు భయపడి, శత్రురాజుల కుతంత్రాలకు దొరకకుండా ఉండేందుకే విలువైన రత్నాలు, వజ్రాలు, బంగారు వెండి ఆభరణాలు నేలమాళికలో నిక్షిప్తం చేశరన్న వాదన వినిపిస్తోంది.
స్పాట్
యాంకర్ 3
ఏం.. ఈ రాజవంశీయులకు పద్మనాభుడి పై ఇంత భక్తి ఎందుకు... కాసులు కనపడితే కనకమేడలు కట్టాలని ఆలోచించే ఈ రోజుల్లో స్వర్ణసొరంగాలను కూడా పూచిక పుల్లతో భావించేంత త్యాగం ఎందుకొచ్చింది... మనిషి రక్తంలో ఉన్న స్వార్ధం వీరి మెదడును ఎందుకు చేరలేదు.. తరతరాల సంస్కృతీ సంప్రదాయాలకు కట్టుబడాల్సిన అవసరం ఏమొచ్చింది.
వాయిస్
ట్రావెన్ కోర్ రాజ్యమంటే ఇప్పటి కన్యాకుమారి నుంచి ఎర్నాకులం వరకు వ్యాపించి ఉంది. ఈ ఆస్థానానికి తమిళనాడులో ఉన్న పద్మానాభ పురమే మొదటి రాజధాని. తరువాత కాలంలో కార్తీక తిరుమల రామ వర్మ రాజధానిని మార్చారు.. ఈయన్నే ధర్మరాజా అని పిలిచేవారు.. ట్రావెన్ కోర్ వంశానికి మూల పురుషుడు తిరుమల్ మార్తాండ వర్మ.. ట్రావెన్ కోర్ రాజ్యానికి మొదటి రాజు ఈయనే.. 1750లలో ట్రావెన్ కోర్ రాజ్యాన్ని పద్మనాభ దాస పేరుతో పాలించాడు.. తాను సంపాదించిన అపార సంపద మొత్తాన్ని పద్మనాభుడికే ధారాదత్తం చేశాడు. తన తరువాత కూడా తన వారసులు పద్మనాభుణ్ణి అంతే భక్తి శ్రద్దలతో పూజించాలని, ఆలయ పరిరక్షణకు పూనుకోవాలని తెలిపాడు. ఆ తరువాత మార్తాండవర్మలు చాలా మంది మారారు.. ప్రస్తుతం ఇప్పడు అధికారికంగా ఉత్రాధమ్ తిరునాల్‏‏‏‏‏‏‏‏‏ మార్తాండ వర్మ రాజవంశానికి వారసుడిగా చెలామణి అవుతున్నారు. ఈయన తరువాత మూలం తిరునాల్ రామ వర్మ వారసుడుగా రాబోతున్నారు.. రామ వర్మ తమ వంశపారం పర్యంగా వచ్చే సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్నే ఈయనా కొనసాగిస్తున్నారు.
స్పాట్
యాంకర్ 4
ఈ రాజవంశీయులు సుగంధ ద్రవ్య వ్యాపారల్లో దిట్ట. . వీరు ఎగుమతి చేసే దినుసులు అత్యంత నాణ్యమైనవి.. ఈ ప్రాంత సుగంధ ద్రవ్యాలకు నేటికీ అంతే ఆదరణ ఉంది.. మార్తాండ‌వర్మ రాజకుటింబీకులు ఇప్పటికీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా ఏనాడూ విలువలను వదిలింది లేదు.. స్వామి సంపదపై కన్నేసింది లేదు..
స్మాల్ స్పాట్
ట్రావెన్ కోర్ రాజకుటుంబం... విలువలకు నిలువుటద్దం.. వందల సంవత్సరాలుగా తాము నమ్మిన సిద్దాంతాన్ని అక్షరాలా పాటించిన నిజాతీ వీరిది.. అందుకే బ్రిటీష్ వారు కూడా వీరి జోలికి రాకపోగా వీరి విలువలకు, మంచితనానికి దాసోహమన్నారు.. సుగంధ ద్రవ్య వ్యాపారం జోరుగా జరిగే ఆ కాలంలో ఈ సంపద పెద్ద లెక్కల్లోకి వచ్చేది కాదు... ఈ వ్యాపారం కూడా డబ్బుతో జరిగే వ్యాపారం కాదు.. మొత్తం వస్తుమార్పిడి విధానమే.. అంటే సుగంధ ద్రవ్యాలకు ప్రతిగా విలువైన కానుకలు, బంగారం వంటివి ఇచ్చేవారని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇక్కడి సుగంధ ద్రవ్యాలన్నా, మసాలా దినుసులన్నా బ్రిటీష్ వారికి అమితమైన అభిమానం.. అది ఎంతగా పాకిందంటే నేటికీ లవంగాలు, మిరియాలు ఇక్కణ్ణుంచే బకింగ్ హాం కు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ రాజవంశీయులకు ట్రావెన్ కోర్ రాజవంశీయులంటే అంత అభిమానం..

స్పాట్
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు, రాజవంశాలన్నీ విశాల భారతదేశంలో విలీనం కాక తప్పనిపరిస్థితి.. రాజవంశాలు తమ పద్దతులు, చట్టాలను సవరించుకోవాల్సిన పరిస్థితి.. ఆ పరిస్థితి ట్రావెన్ కోర్ కు కూడా వచ్చింది.. 150 క్రితం ఏ కారణం చేతనో నేల మాళిగలకు పడ్డ తాళాలు నేటికి తెరుచుకున్నాయి. ఇప్పుడీ ఆలయం మరెన్నో ఆలయాల అడుగున దాగిన సంపదకోసం వెతికే మార్గానికి దారులు వేసింది..
ఎండ్ యాంకర్
ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలెన్నో ఈ దేశంలో ఉన్నాయి.. పేద దేవుళ్లంటే ప్రభుత్వాలకు చిన్న చూపు... కాసిన్ని కాసులున్నాయా.. ఇక ఆ దేవుడికి రాజభోగాలు.. సెక్యురిటీ యోగాలు.. పైసామే పరమాత్మ అన్న నానుడిని తిరగరాసి పరమాత్మలుండే చోట పైసలు వెతుక్కుంటున్నారు.. మన పాలకులు.. నాటి రాజులు దైవకార్యాల కోసం కోట్లు కూడ బెడితేే.. నేటి పాలకులు వాటిని రాజ్యభోజ్యం కోసం ఖర్చు పెట్టాలా.. రాజ్యాపాలన కోసం ఖర్చుపెట్టాలా అని తర్జన భర్జన పడుతున్నారు.. పద్మనాభుడి ఆస్తిని కాపాడే నాధుడు ఏవరో...
ఎండ్ విత్ బ్యాంగ్

గ్రాఫిక్ ప్లేట్స్
ట్రావెన్ కోర్ వంశానికి మూల పురుషుడు తిరుమల్ మార్తాండ వర్మ
1750లలో ట్రావెన్ కోర్ రాజ్యాన్ని పద్మనాభ దాస పేరుతో పాలించాడు
తాను సంపాదించిన అపార సంపద మొత్తాన్ని పద్మనాభుడికే ధారాదత్తం చేశాడు
ఈ రాజవంశీయులు సుగంధ ద్రవ్య వ్యాపారల్లో దిట్ట
నేటికీ లవంగాలు, మిరియాలు ఇక్కణ్ణుంచే బకింగ్ హాం కు ఎగుమతి అవుతున్నాయి
యూరోపియన్ రాజవంశీయులకు ట్రావెన్ కోర్ రాజవంశీయులంటే చాలా అభిమానం
ఆలయం ద్వారా ఆదాయం పొందటం వీరికి తెలియదు..
తరతరాల నుంచి ఆలయ పోషకులుగానే కొనసాగుతున్నారు
తిరునాల్‏‏‏‏‏‏‏‏‏ మార్తాండ వర్మ ఇప్పటికీ ఆ ఆలయానికి 151రూపాయల 55 పైసలు చెల్లిస్తారు

కాంబోడియా అంకూర్ వాట్ టెంపుల్



ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయమది... ఈ ఆలయం మొత్తం చూడాలంటే ఒకరోజు చాలదు.. రెండు కళ్లుకూడా చాలవేమోననిపిస్తది... ఆ ఆలయం పేరే ఆంకోర్ వాట్.. నిలువెత్తు విష్టుమూర్తి ప్రతిమ చతుర్భుజాలతో దర్శనమిచ్చే ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్దది. ఇంత ఘనకీర్తి పొందిన హిందూ ఆలయం ఉన్నది మనదేశంలో కాదు.. కాంబోడియాలో దేశంలో ఉంది. పది శతాబ్దాల కిందటి ఆలయానికి పునర్వైభవం కల్పించే పనిలో పడ్డది కాంబోడియా ప్రభుత్వం... ఘనత వహించిన అంకోర్ వాట్ ఆలయం పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ...
బ్యాంగ్ (పునర్వైభవానికి అంకురార్పణ)
యాంకర్ 1
ప్రపంచంలో అనేక దేశాలు మత విశ్వాసాలకు గౌరవం ఇవ్వడం తెలిసిందే... మత సిద్ధాంతాలను పరిపాలనకు మార్గదర్శకాలుగా ఉన్న దేశాలనూ చూశాం.. కానీ దేశంలో ప్రసిద్ధి పొందిన ఆలయాన్ని .. తమ జాతీయ జెండాలో ముద్రించుకున్న ఘనత ఒక్క కాంబోడియాకే సాధ్యం... అంత ఘనత వహించిని ఆలయం నిర్లక్ష్య నీడలో శిథిలావస్థకు చేరింది. ఇంకా ఏమరుపాటుగా ఉంటే అంకోర్ వాట్ అనేది చరిత్రగానే మిగిలేది.. ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే కాంబోడియా రాజు, ప్రధాని పురాతన ఆలయానికి కొత్త సొగసులు అద్దే పనిలో తాళాలు తీయించారు. ఇంతకీ ఈ ఆలయానికున్న చరిత్ర ఏంటి.. జాతీయ చిహ్నంగా ఒక హిందూ ఆలయాన్ని ముద్రించుకో్వలసిన అవసరం ఏమొచ్చింది.. ఈ ఆలయ చరిత్రేంటో తెలుసుకుందాం...
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
అంకోర్ వాటి ఆలయం అతి పురాతన మైంది.. మూడు శతాబ్దాల పాటు వెలుగులీనిన ఆలయానికి 11వ శతాబ్దంలో తలుపులకు మూతలు పడ్డాయి.
ఆంకూర్ వాట్ ఈ భూగోళం పైనే ఒక అధ్బుత ప్రాంతం. ఈ ఆలయం కాంబోడియాలో సీమ్‌రీప్‌ నగరానికి 5.5 కిలోమీటర్ల దూరంలో బాఫౌన్‌ పట్టణం మధ్యలో ఉంది. 1113, 1150 మద్యకాలంలో ఈప్రాంతాన్ని పాలించిన రెండవ సూర్యవర్మ ఈ ఆలయాన్ని నిర్మించి విష్ణు భగవానుణ్ని ప్రతిష్టించాడు. తరువాత కొంతకాలానికి రాజు మరణించడంతో ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. . 27 సంవత్సరాల తర్వాత 8వజయవర్మ ఆంకోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకున్నాడు. తర్వాత ఆయన అల్లుడు శ్రీంద్రవర్మ రాజు అయ్యాడు. ఆయన అంతకు ముందు బౌద్ధ సన్యాసిగా ఉండడంతో దాన్ని బౌద్ధ ఆలయంగా మార్చారు. 13 వ శతాబ్దంలో బౌద్దమతం ప్రాచుర్యంలోకి వచ్చాక ఇక్కడ బౌద్దమతస్థులకు కూడా ఆశ్రయం కల్పించడంతోబాటు బౌద్దానికి సంబంధించిన వివిధ ప్రతిమలు ప్రతిష్టించబడినవి. ప్రపంచంలోనే అతిపురాతన అరుదైన నిర్మాణాలలో ఈ ఆలయమొకటి.
స్పాట్
అంకూర్ వాట్ ఆలయం నైరుతి కాంబోడియాలో అంకోర్ ప్రాంతంలో ఉంది. దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన నాగరికత ఇక్కడ విలసిల్లింది. 2వ రాజా సూర్యవర్మన్ నిర్మించిన ఈ ఆలయం మత విశ్వాసాలకు పుట్టినిల్లు. హిందూ మతం ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందింది. తరువాత బౌద్దాన్ని కూడా ఆదరించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద ధార్మికాలయం. కిమర్ రాజవంశీయుల వాస్తు, శిల్పకళానైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం అతి పురాతన సంప్రదాయ నిర్మాణ శైలి కలిగి ఉంది. ఈ ఆలయం ఒక అద్భుత కట్టడం.. ఒక్కసారి ఈ ఆలయం మొత్తం కలియతిరిగిచూద్దాం...
స్పాట్
(Angkor Wat, Cambodia) విజువల్స్ పూర్తిగా వాడుకోగలరు.
యాంకర్ 2
ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి.. కానీ అంకోర్ వాట్ ఆలయమే ప్రపంచంలో అతి గొప్ప ఆలయంగా ఎలా పేరు పొందింది. ఈ ఆలయ గొప్పతనం ఏంటి.. అసలు ఈ ఆలయంలో చూడాల్సిన విశేషాలేంటి..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
ఆలయ గోడలపై, స్తంభాలపై రకరకాల చిత్రాలను చెక్కారు. పాలసముద్రాన్ని చిలుకుతున్న దేవతలు, రాక్షసులు. నాట్యం చేస్తున్న సుందరాంగులు, రణరంగంలో కృష్ణుడు, కౌరవులు, పాండవుల చిత్రాలు.. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ కొలనులు, మార్గమధ్యలో పలకరించే సింహాలు... అక్కడ ఉన్నంత సేపూ కథల్లో విన్న, సినిమాల్లో చూసిన పౌరాణికగాథలు మనముందు ప్రత్యక్షమైనట్టుంటుంది. ఆ లోకంలో విహరిస్తున్నట్టనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలు, ప్రాకారాలపై శిల్ప సంపద.. చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు.. పచ్చిక మైదానాలు.. ప్రశాంత వాతావరణానికి అచ్చమైన ఆనవాలు ఇది. ఈ ఆలయం బాహ్య ప్రాకారం 3 కిలోమీటర్లు ఉంటుందంటే లోపల ఎంత విశాలంగా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు.. ఈ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. ఆలయప్రాంగణలోనే జలాశయాలు.. మద్య మద్యలో సేదతీరేందుకు రాతి బల్లలు.. అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దిన క్షేత్రమిది. సనాతన సంప్రదాయాలకు, మత విశ్వాసాలకు పురిటిగడ్డగా విలసిల్లిన దివ్యక్షేత్రమిది..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 3
ఏ ఆలయానికైనా ముఖమంటపం.. ఆలయ శిఖరం ఉండటం చూస్తాం.. కానీ ఈ ఆలయానికి ప్రహరీ మద్యలో ఐదు శిఖరాలున్నయి. నాలుగు వైపులా నాలుగు శిఖరాలు... మద్యలో ప్రధాన శిఖరం అత్యంత శిల్ప కళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయం ప్రాకారాలపై ఉన్న చిత్రాలు, కళా ఖండాలు, ప్రాంగణంలో ఉన్న శిల్పాలు ఎంత చూసినా తనివి తీరదు.
వాయస్
ఆలయం మధ్యలో ఉన్న ఐదు శిఖరాలు పర్వత శిఖరాలను తలపిస్తాయి. ఆలయం చుట్టూ గోడలు, వాటి చుట్టూ ఆలయాన్ని రక్షించేందుకు ఎత్తైన కోటగోడ ఉంటాయి. ఆలయం బయటి గోడలు, కొన్ని రహస్య నిర్మాణ భాగాలు తప్ప మిగతా అన్నిటినీ ఇసుకరాతితోనే నిర్మించారు. తామర మొగ్గల ఆకారంలో ఆలయ గోపురాలు, సందర్శకులు వెళ్లే మార్గాలను కలుపుతూ ప్రదర్శనశాలలు, ఎత్తైన ఆలయ శిఖరాలు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఆలయ ప్రహరీ గోడ 1024 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ప్రధాన ద్వారం చెక్క వంతెనతో ఉంటుంది. అతి ముఖ్యమైన ప్రదేశాలలో గోపురాలు ఉంటాయి. ఆలయానికి పశ్చిమాన చాలా విశాలంగా ఉంటుంది. . దక్షిణాన గల శిఖరం కింద విష్ణువు విగ్రహం ఉంటుంది. మధ్యలోని పవిత్ర మందిరంలో ఉంచారు. దీనిని 'తారీచ్‌' అంటారు. ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. వీటిని ఏనుగు ద్వారాలు అంటారు. వీటి మధ్య చాలా దూరం ఉంటుంది. మధ్య మధ్యలో శిఖరాలు, ప్రదర్శనశాలలు ఉంటాయి. శిఖర గోడలపై నాట్యం చేస్తున్న ఆకారాలు, జంతువులపై నాట్యం చేస్తున్న దేవుళ్లు, దేవతల రూపాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. వాయవ్య దిశగా చూస్తే ఈ ఆలయం నగరాన్ని మొత్తం ఆక్రమించినట్టుగా ఉంటుంది. దీనికి ఉత్తరాన రాజ భవనం ఉంటుంది. 350 మీటర్ల మార్గం పశ్చిమాన ఉన్న గోపురాన్ని కలుపుతుంది. ఈ మార్గంలో అక్కడక్కడా సింహాల శిల్పాలు మనల్ని పలకరిస్తాయి.
స్పాట్
వాయిస్
సుప్రసిద్ధమైన ప్రపంచంలోనే పెద్దదైన ఈ విష్ణుమందిరాన్ని కాంబోడియా ప్రభుత్వం భద్రంగా కాపాడబడుతోంది. ఈ ఆలయంలో చరిత్రతో బాటు, పురాణ గాథలు చెక్కు చెదరకుండా శిలాశాసనాల రూపంలో ఉన్నాయి. అంకోర్‌ వాట్‌ గోడలపై సంపూర్ణ రామాయణంను చిత్రీకరించారు. కాంబోడియా, లావోస్‌ భాషలు సంస్కృత పదాల ఆధారంగానే ఉన్నాయి. విజ్ఞాన, ఇతర ఉపయుక్త భాషలలోని పదాలూ సంస్కృతానికి చెందినవే. అక్కడి భాషల లిపి భారతీయ ప్రాచీన బ్రాహ్మీలిపి నుండి పుట్టినవే. చరిత్రకారులు అంకోర్‌ వాట్‌ విరాట్‌ మందిరంను పరిశోధించి, కాంబోడియా లోని సంస్కృతభాషకు చెందిన వేలాది శిలా శాసనాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురించారు. ఆలయ ద్వారాల వద్ద వున్న గ్రంథాలయాలు దీనికి సంబంధించిన చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ గ్రంథాలయాలకు ఆలయానికి మధ్య కొలనులు ఉంటాయి. ఈ కొలనులు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినవి. టెర్రస్‌ మీదనున్న ఆలయం.. నగరం కంటే ఎత్తులో ఉంటుంది. ఇది మూడు దీర్ఘ చతురస్రాకార ప్రాకారాలతో ఉంటుంది. ఇవి ఒకదానిని మించి మరొకటి ఎత్తులో ఉంటాయి. ఈ మూడింటిని బ్రహ్మ, చంద్రుడు, విష్ణులతో పోలుస్తారు. ఇక్కడ నాలుగు భవన ప్రాకారాలు ఉంటాయి. వీటి గోడలపై దేవతల రూపాలు విడివిడిగా, గుంపులు గుంపులుగా ఉంటాయి. లోపలి మ్యూజియమ్‌ను బాకన్‌ అంటారు. ఇది 60 మీటర్ల చతురస్రాకారంలో ఉంటుంది. దీని పైకప్పు అడుగుభాగాన పాము శరీరంతో, సింహం లేదా గద్ద తల ఉన్న ఆకారంతో వింత రూపాన్ని చెక్కారు. ఈ ప్రాకారాల గోడలపై మహాకావ్యాలైన రామాయణం, మహాభారత చిత్రాలను చెక్కారు.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 3
ఇంత పెద్ద ఆలయం ఇంత భారీ ఖర్చుతో నిర్మించ వలసిన అవసం సూర్యవర్మకెందుకొచ్చింది... హిందు మతం పై అభిమానం ఉండటంలో తప్పు లేదు.. కానీ తమది కాని మతాన్ని అంతగా ఎందుకు ఆదరించాడు.. ఆచరించడమే కాకుండా ప్రపంచంలో తన రాజ్యంలో ఉన్నంత పెద్ద ఆలయం మరే రాజ్యంలో కూడా ఉండకూడదన్న ఆలోచన ఎందుకొచ్చింది.. ఈ ఆలయాన్ని భక్తితోనే కట్టాడా.. గుర్తింపు కోసం కట్టాడా... అసలీ ఆలయాన్ని సూర్యవర్మ ఎందుకు నిర్మించాడు..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
కాంబోడియా రాజ్యం.. థాయిలాండ్, లావోస్, చైనా, బర్మా, భారత్, చైనాలతో వ్యాపార లావాదేవీలు జరిపేది.. సంస్కృతి పరంగా కాంబోడియా చాలా వెనక బడిన ప్రాంతం... భారత్, థా‍య్ లాండ్ ప్రాంతాలను సందర్శించినపుడు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను చూసి కాంబోడియన్ రాజులు ఆశ్యర్యపోయారు. ఇక్కడి శిల్ప సంపద.. ఆద్యాత్మిక పద్దతులు తమ దేశ ప్రజల చేత కూడా పాటించాలనుకున్నారు. అంతేకాదు ఇతర రాజ్యాలు గా కాంబోడియాను ఆదివాసీ రాజ్యం పరిగణించడం వీరికి నచ్చలేదు.. వెనకబడిని రాజ్యంగా అవహేళనలు పొందిన రాజులు తమను తాము నిరూపించుకోవాలని తపన పడ్డారు. ఏ దేశానికీ తాము తక్కువ కాదని.. తమ వారిలో కూడా నైపుణ్యం ఉందని రుజువు చేయదల్చుకున్నారు.. తమ రాజ్యంలో ఉన్న ఔత్సాహిక శిల్పులను, వాస్తు నిపుణులను, సరిహద్దు దేశాలకు పంపించి ఇక్కడి నిర్మాణ నైపుణ్యాలలో శిక్షణ నిప్పించారు.. అంతే కాకుండా ఆయా దేశాలలో పేరొందిన నిపుణులను కాంబోడియాకు పిలిపించుకొని శిక్షణ నిప్పించారు.. వీరందరినీ ఒక్కచోట చేర్చి ప్రపంచంలో ఉన్న హైందవ దేవాలయాలన్నిటికన్నా తామే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామని గర్వంగా చెప్పే ప్రయత్నం చేశాడు రెండవ సూర్యవర్మ... అతని కాలంలో అది పూర్తి కాకపోయినా తరువాత వచ్చిన రాజులు పూర్తి చేసి కాంబోడియా రాజుల ఆశయాన్ని సాధించారు..
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
యాంకర్ 4
అవును... ప్రపంచంలో మారుమూలన ఉన్న తమ రాజ్యం ఇప్పుడు చరిత్ర పుటల్లో నిలిచింది.. అనాగరికులని అవహేళన చేసిన వారే అద్భుత పనితనమని పొగుడుతున్నారు.. వేలాది కార్మికుల శ్రమ ఊరికే పోలేదు.. చరిత్రలో శిలాశాసనంలా మిగిలిపోయింది... కాల గర్భంలో వచ్చిన పౌర యుద్దాలు... రాజ్యాధికార కాంక్షలు.. రాజ్య ధిక్కారాలు.. ఈ ఆలయపునరుద్దరణ కంటే .. వినాశనానికే ఎక్కువగా దారి తీశాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆలయానికి గతవైభవం సంతరించుకోబోతోంది.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
వాయిస్
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ ఆలయానికి ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఆలయానికి మరమ్మత్తులు చేసి పునర్ వైభవం కల్పించబోతున్నారు. .చాలా సంవత్సరాల తరువాత కాంబోడియా రాజు, ధాని ఈ పనికి పూనుకున్నారు. అత్యంత శ్రేష్టమైన, ప్రసిద్దమైన ఈ ఆలయ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ ఆలయ శిఖరాలలో 3 లక్షల ఇసుక ఇటుకలున్నాయని అంచనా.. . 1970 ప్రాంతంలో జరిగిన సివిల్ వార్ లో ఆలయం పై దాడి జరిగింది. తిరుగుబాటు దారుల కళ్లు ఈ ఆలయం పై పడ్డాయి. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని శిల్పాలు పాక్షికంగా ధ్వంసం కాగా మరికొన్ని శిల్పాలు పూర్తిగా ఆకారాలను కోల్పోయాయి. శిధిలమయిన ఇటుకలను తిరిగి పేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలయ ప్రాకారాలకు సంబంధించిన అనేక ఇటుకలు ఆలయ పరిసరప్రాంతాలలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం రాతికట్టడమే. ఎక్కణ్నుంచి తీసిన ఇటుకలను, శిల్పాలను అక్కడే అమర్చాలంటే.... ఆలయ నమూనా క ావాలి...కానీ కిమర్ రాజులపై తిరగబడ్డ ఉద్యమకారులు 1975లోనే వాటిన ధ్వంసం చేశారు. తిరిగి1995లో ఈ ఆలయం ప్రపంచంలోనే అరుదైన ఆలయంగా గుర్తించి కాంబోడియా రాజు, ప్రధాని ఆలయ పునరుద్దరణకు పూనుకున్నారు.
స్పాట్
అశేష ప్రజల కోలాహలం మద్య పున:ప్రారంభం అవుతున్న ఈ ఆలయం పేరు అంకోర్ వాట్.. కాంబోడియా చరిత్రలో ఎంతో విషిష్టత కలిగిన ఈ ఆలయం దక్షిణ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో, శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. అన్ని ఆలయాలకు ప్రవేశ ద్వారం తూర్పు వైపునకు ఉంటే ఈ ఆలయానికి మాత్రం ప్రవేశ ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. ఈ ఆలయం కాంబోడియన్ల గుండెల్లో గుడి కట్టుంకుంది. ఈ గుడికి వీళ్లెంత గౌరవం ఇచ్చారంటే... ఆ దేశ జాతీయ పతాకంలో కూడా ఈ గుడిని గుర్తుగా పెట్టుకున్నారు.
స్పాట్
ప్రస్తుతం ఈ కట్టడాన్ని నిర్మించాలంటే 300 సంవత్సరాలు పడుతుందని ఇంజనీర్ల అభిప్రాయం. కాని అప్పుడు మాత్రం దీన్ని 40 సంవత్సరాలలోనే నిర్మించారట. రథాలను లాగుతున్న వింత జంతువులు, ఏనుగుల వెంట వెళ్తున్న సైనికులు, నాట్యం చేస్తున్న అందమైన అమ్మాయిలు.. ఆనాట ి చరిత్రను కళ్లకు కడతయి.
2004, 2005 సంవత్సరాలలో 6,77,000 మంది విదేశీ పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించారని ప్రభుత్వ అంచనా. ఆంకోర్‌ నిర్మాణం తర్వాత కిమర్‌ రాజులు వియత్నాం, చైనాల నుంచి బే ఆఫ్‌ బెంగాల్‌ వరకు చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పటికీ చెక్కుచెదరని వందకు పైగా రాతి ఆలయాలున్నాయి. ఈ ఆలయంలో 108 హిందూ, బౌద్ధ శిఖరాలు ఉన్నాయి. . ఆంకోర్‌కు నగరదేవాలయం అని పేరు పెట్టారు.
స్మాల్ స్పాట్ ( 3సెకన్లు)
ఎండ్ యాంకర్
చరిత్రను ముందు తరాలకు అందించేవి చారిత్రక కట్టడాలే... వాటిని కాపాడుకోవడం పౌరుల, ప్రభుత్వాల భాద్యత.. దేశమేదైనా కావచ్చు.. చరిత్ర ఏదైనా కావచ్చు... దాన్ని ముందు తరాలకు అందిస్తేనే మన వైభవం తెలుస్తుంది... ఇదీ కాంబోడియా అంకూర్ వాట్ ఆలయ విశిష్టత...

Monday, July 4, 2011

సమాచార హక్కు చట్టానికి చిక్కులు ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు

సమాచార హక్కు చట్టానికి చిక్కులు
ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు
యాంకర్ పార్ట్
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పాతిపెడుతున్నారు. సమాచార హక్కు చట్టం చట్టుబండలవుతోంది... అవినీతి పునాదులు కదిలిస్తుందనుకున్న సమాచారహక్కు చట్టం కొయ్యగుర్రం పై స్వారీ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యపు నీడలో లక్ష్యం నీరుగారిపోతోంది. సమాచార కమీషనర్ ముందు ఫిర్యాదుల ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నా కదలిక లేదు. పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో కాదు కదా కనీసం మూడేళ్ల లోపు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది మన సమాచార వ్యవస్థ.. ఈ జాడ్యం ఒక్క మన రాష్ట్రానికే అనుకుంటే పొరబాటు.. దేశవ్యాప్తంగా అంటువ్యాధిలా సోకి స.హ చట్టాన్ని మింగేస్తోంది. సమాచార హక్కు చట్టానికి పట్టిన చెదలు పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ ( సమాచార నిరాకరణ చట్టం / సమాచార చిక్కు )
వాయిస్ 1
ఆరేళ్ల కిందటి మాట... సమాచార హక్కు చట్టం వస్తే అవినీతి పాదాలకింది పునాదులు కదలాల్సిందే.. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా అభ్యర్ధన వస్తే అధికారులకు చెమటలు పట్టేవి. కారణం ఇచ్చే సమాచారం పారదర్శకంగా ఉండాలి. లేదా మొదటికే మోసం వస్తుంది. ప్రాణ హాని, జీవించే హక్కుకు సంబంధించిన సమాచారమైతే 48 గంటల్లోనూ, ఇతర సమాచారమైతే 30 రోజుల్లోపు ఇవ్వాలని చట్టం చెబుతోంది. కానీ ఈ చట్టం రూపకల్పనలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకొని సమాచారం ఇవ్వడానికి అధికారులు తల అడ్డం ఊపుతున్నారు. సమాచారం అడిగిన వ్యక్తిని యక్ష ప్రశ్నలేసి, అవసరం లేకున్నా కాగితం నుంచి కరెంట్ బిల్లు వరకు లెక్కలేసి లక్షల రూపాయల్లో బిల్లు చెల్లించాలని అడగటంతో.... సమాచార చట్టం అంటే సంపన్నుడి చుట్టమనే అభిప్రాయం వచ్చింది సామాన్యుడికి.
స్పాట్
అభివృద్ది పథంలో దేశంలో అగ్రగామినని ఢంకా భజాయిస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కును అమలు చేయడంలో అట్టడుగున ఉందంటే ఇక్కడి అధికారుల నిర్వాకం ఎంత ఘనమో అర్ధం చేసుకోవచ్చు. స.హ చట్టాన్ని గొప్పగా అమలు చేస్తామని డాంబికాలు పలికిన ప్రభుత్వ వైఖరి ఆరంభ శూరత్వంగా మారింది. చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్లయినా బాలారిష్టాలు దాటలేదు. చట్టం అటకెక్కడానికి కమీషనర్ల వైఖరే కారణమన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వేలాది ఫైళ్లు రెండేళ్లుగా పెండింగులో ఉన్నాయంటే ఈ అలసత్వానికి కారణం ఎవరు...? గతంలో ప్రధాన సమాచార కమీషనర్లుగా సి.డీ అర్హ, ఆర్ దిలీప్ రెడ్డి ఉన్నపుడు ఫైళ్లకు కాళ్లుండేవనే చెప్పాలి. సమాచారం అడిగిన వాళ్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది. సమాచారం ఇవ్వని అధికారుల పై చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉండేది. అదే నమ్మకంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టుకొని కార్యాలయానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సమాచారం అంటే అందని ద్రాక్ష.. సమాచారమడగటమంటే కొరవితో తల గోక్కోవడం.. సమాచారం హక్కు కాదు, పెద్ద చిక్కు... అవును ఇది ఎవరి పై అక్కసుతోనే అనే మాటలు కావు.. సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగి కడుపుమండి సామాన్యుడు అంటున్న మాటలు...
బైట్ - 1, 2, 3 ( తెప్పించాలి ) వాక్స్ పాప్
వాయిస్ 2
మండల స్థాయి కార్యాలయాల్లో సమాచారం కావాలంటే ప్రాథమిక సమాచార అధికారికి ధరఖాస్తు చేసుకోవాలి. ఆ అధికారి స్పందించకపోతే మొదటి అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా సరియైన స్పందన లేకుంటే..దరఖాస్తు దారుడు అడిగిన సమాచారం ఇవ్వకున్నా, దరఖాస్తు తిరస్కరించినా, అసమంజసమైన రుసుము కోరినా.. సమాచార హక్కు చట్టం 18 బై1 ప్రకారం రాష్ట్ర సమాచార కమీషనర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అబ్యర్ధన దాదాపు ఇక్కడి వరకు చేరదు. చేరిందంటే ఆ సమాచారం అభ్యర్ధికి చాలా విలువైందిగా భావించి కమీషనర్ వెంటనే చర్యకు పూనుకోవాలి. కానీ పరిస్థతి దీనికి పూర్తి విరుద్దంగా ఉంది. కమీషనర్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులు, కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాయి. వాటిని తట్టిలేపే నాధుడే కరువయ్యాడు. కారణం చట్టాన్ని కాపాడే కమీషనరే కఠినంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రధాన సమాచార కమీషనర్ జన్నత్ హుస్సేన్ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ అధికారా పనితీరు తెలుసుకున్న ప్రాధమిక సమాచార అధికారులు సమాచారం కోసం వచ్చిన వారిని తమ మాటలతో భయపెట్టి పంపుతున్నారు. ఎందుకంటే సమాచారం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు వచ్చినవే కావడం... అందులో అంచెలంచెలుగా అధికారులకు భాగస్వామ్యం ఉండటం వల్ల చట్టాన్ని అమలు చేసే వారే అధికారులకు అండగా నిలుస్తున్నారు.
బైట్ -(దరఖాస్తు దారు) తెప్పించాలి
వాయిస్ 3
మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రం గోవా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఎంతో ముందంజలో ఉంది. అక్కడి కమీషనర్ కార్యాలయం గవర్నర్ కార్యాలయాన్నే సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది... అరుణాచల్ ప్రదేశ్ లో ఆరంభం నుంచే ఆరుగురు కమీషనర్లు ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. మద్యప్రదేశ్ లో ఏకంగా ఐఏయస్ ల ఆస్తులు కూడా వెల్లడించాలని సంచలన తీర్పు చెప్పి సమాచార హక్కు చట్ట చరిత్రలో ఆదర్శంగా నిలిచింది. మరి మనరాష్ట్రానికేమయింది. పని చేసే అధికారులు లేరా.. అర్హులైన వారికి కొరత ఉందా అంటే అదేం లేదు.. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే ఐఏయస్ లు, ఐపియస్ లు, అనుభవం కల ఉన్నతాధికారులు ఉన్నారు. కానీ సమాచార కమీషన్ కు ఒక్క అధికారిని కూడా కార్యదర్శిగా నియమించలేక పోయింది ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానానికి జెఇఓగా పనిచేసిన ధర్మారెడ్డిని కమీషన్ కార్యదర్శిగా నియమించింది.. ఈ పోస్టులో కొనసాగడం ఇష్టం లేని ధర్మారెడ్డి అలిగి ఢిల్లీకి వెళ్లారు. తరువాత ఈ పోస్టుకు ఆర్ధిక శాఖలో పనిచేసే శేఖర్ బాబుని నియమించారు. ఆయన కూడా ఈ ఉద్యోగంలో చేరకుండానే దీర్ఘకాలిక సెలవు పై వెళ్లారు. ఆ తరవాత దీన్ని పట్టిచ్చుకున్న నాధుడే లేడు. ఇప్పటికే ఉన్న కమీషనర్లలో ముగ్గురు నవంబర్ 15, 16 తేదీల్లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి కమీషన్ పూర్తిగా దిగజారిందని, ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పెండింగులో పడుతున్నాయిని దరఖాస్తు దారులు చెబుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలిస్తే 2010 మే నెలలో 5వేల 8వందల 8 కేసులు, జూన్ 24 వరకు 7వేల 3వందల 17, అక్టోబర్ 28 వరకు 12వేల7వందల74, అక్టోబర్ 30 నాటికి 12వేల9వందల33 కేసులు నేటికీ విచారణకు నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఇలానే కొనసాగితే కమీషన్ ఆఫీసుకు రావడం కంటే అవినీతి, అక్రమాలను చూసి కళ్లు మూసుకోవడమే మంచిదన్న అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అధికారులకు రాజకీయ నాయకులకు కూడా కావలసింది ఇదే కాబట్టి వ్యూహాత్మకంగానే చట్టాన్ని నీరుగారుస్తున్నారని సామాజిక వేత్తలు, ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్నారు..
బైట్ - మాడభూషి శ్రీధర్ (తెప్పించాలి)
బైట్ - జన్నత్ హుస్సేన్, రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్
మరికొందరు సామాజిక కార్యకర్తల బైట్ లు వాడుకోవచ్చు.
వాయిస్ 4
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పడగొట్టాలని చూస్తే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సమాచారం కోసం అలుపెరగకుండా తిరిగే పౌరులు కోర్టు గుమ్మం మెట్లు ఎక్కి న్యాయమూర్తుల చేత చివాట్లు తినక ముందే మేలుకుంటే మంచిది.

ీ..