
జనార్దన్
తెలంగాణ ఆలయాలకు స్వాగతం.
ఇంట్రో
తెలంగాణ ఆలయాల్లో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పేరు వినని వారు ఉండరు. ఈ రోజు మనం యాదగిరి గుట్టను దర్శించి.. అక్కడి స్థల పురాణం తెలుసుకొందాం..వెళ్దామా..పదండి..
బ్యాంగ్
యా
యాంకర్ 1
యాదగిరి గుట్టకు వచ్చేశాం..ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తోరణం. ఈ తోరణం చూడగానే భక్తులకు తాము స్వామి సన్నిధికి వచ్చేశామన్న సంతోషం కలుగుతది.
(విజువల్స్ విత్ సాంగ్స్ ఘాట్‌రోడ్డు...)
వాయిస్
భగవంతుని దశావతారలలో.. నారసింహావతారానికి ఎంతో విశిష్టత ఉంది. భక్త వత్సలుడిగా... దుష్టశిక్షకుడిగా... ధర్మ పరిరక్షకుడిగా.. భక్తకోటి హృదయాలలో పదిలమైన స్థానం ఉంది. హిరణ్యాక్షుడి సంహారం తరువాత ఈ భూమి పై భక్తులను కాపాడేందుకు నరసింహుడు ఎన్నో పుణ్యతీర్ధాలలో వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నడు. నరసింహస్వామి ఉగ్రరూపం ఉపసంహరించినంక వేసిన ప్రతి అడుగూ పుణ్యతీర్ధంగా వెలిసిందంట.. అటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది యాదగిరి పుణ్యక్షేత్రం...
స్పాట్
యాంకర్ 2
ఇదే..యాదగిరి గుట్ట..ఈ గుట్టకు యాదగిరి అని పేరు రావడం వెనుక స్థల పురాణ కథ ఉంది. పూర్వం యాదమహర్షి ఇక్కడ తపసు చేసిండట..మహర్షి తపసుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమై యాద మహర్షిని వరం కోరుకోమన్నడట..అప్పుడా మహర్షి ఈ క్షేత్రం తన పేరు మీద ప్రసిద్ది చెందాలని, ఈ క్షేత్రంలో స్వామి కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీర్చాలని వరమడిగిండట..అంతే అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని యాదగిరి క్షేత్రమని పిలుస్తున్నరు.
వాయిస్ 1
పూర్వం రుష్యశృంగుడు అనే మహర్షి ఉన్నడు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ పాడి పంటలతో వర్ధిల్లుతదని చెప్పుకుంటరు. అందుకే ఒకపారి అయోధ్యలో కరువు వచ్చిందని దశరదుడు కూడా రుశ్యశృంగుని తీసుకొచ్చి అతనితో యజ్ఞయాగాదులు చేయించి మంచి ఫలితాన్ని పొందిండు. దానితో సంతృప్తి చెందిన దశరదుడు తన తమ్ముడైన రోమపాదుని కుమార్తె శాంత అనే యువతినిచ్చి రుష్యశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తడు దశరదుడు. ఆ రుష్యశృంగుడికి శాంతలకు కలిగిన సంతానమే యాదమహర్షి. ఈ యాదమహర్షి పేరు మీదే ఈ పుణ్యక్షేత్రానికి యాదగిరి గుట్ట అనే పేరొచ్చింది.
స్పాట్...
హిరణ్యకశివుడి సంహారం తరువాత ఉగ్రనరసింహుడి రూపం నుంచి శాంతించి ప్రసన్న రూపంలో దర్శనమీయమని వేడుకున్నడు ప్రహ్లాదుడు. భూమిపై భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా నిలిచిపోవాలని ప్రార్దించిండు.
(ప్రహ్లాద శ్లోకం)
ప్రహ్లాదుడి కోరిక మన్నించిన స్వామి. భూమి పై దక్షిణ భాగంలో వెలుస్తానని అభయమిచ్చిండు.
(యాదగిరి గుట్ట విజుల్స్)
రుష్యశృంగుడి కుమారుడు యాదమహర్షి తన దివ్యదృష్టితో నరసింహస్వామి యాదగిరి ప్రాంతంలో వెలిసినాడని గ్రహించి ప్రాంతానికి వచ్చి ధ్యానం చేయ సంకల్పించిండు. ఆ ప్రాంతనికి వచ్చి స్వామి ఉన్న ప్రదేశం కోరకు వెతక సాగిండు. ఆ కాలంలో అది కీకారణ్యం. మొత్తం చెట్టు పుట్టల మయం. కౄరమృగాలు సంచరించే ప్రదేశం. ఈ నిర్జన ప్రదేశంలో స్వామి కోసం వెదికి వెదికి యాదమహర్షి అలసి సొలసి చెట్టుకింద నిద్రించిండట. అప్పుడు ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నరసింహస్వామి ఉన్న తావు చూపిండట. వెంటనే యాదమహర్షికి మెలకువ వచ్చి చూడగా...తాను కలలో చూసిన తావు తన కళ్లేదుటే ఉన్న గుట్ట పై కనిపించిందట. అక్కడికి వెళ్లిన యాదమహర్షి నరసింహస్వామి గూర్చి ఘోరతప్పస్సు చేసిండట. మహర్షి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై యాదమహర్షిని వరములు కోరుకొమ్మన్నడు. స్పాట్
స్వామిని చూసిన యాదమహర్షి సంతోషంతో పొంగిపోయిండు. తన జన్మతరించిందని నిలువెల్ల పులకించిండు. ఈ పర్వతం వెలసి భక్తజనులకు దర్శనం ఇవ్వాలని, ఈ పర్వతం తన పేరు మీద యదగిరిగా పేరుపొందాలని వరాలు కోరిండు. మహర్షి చూస్తుండగానే స్వామి జ్వాలా రూపంలో తేజోవంతంగా వెలుగులీనుతూ గుహలో వెలసిండు.
స్పాట్
యాదగిరి గుట్ట గుహలో స్వామి పంచరూపాలలో వెలిసిండు... ఉగ్ర నరసింహుడిగా... యోగానంద నరసింహుడిగా...జ్వాలా నరసింహుడిగా..గండభేరుండ నరసింహుడిగా...భక్తాభయ నరసింముడిగా ...వెలసిండు. జ్వాలా నరసింహుడి జూలు అగ్నిశిఖల వలే ఉంటది. యోగానంద నరసింహుడు ఇక్కడికొచ్చి వేడుకున్నయోగులును, మునులను కరుణించి వరములిస్తడు. గండబేరుడ నరసింహుడు పొడవాటి ముక్కుగలిగి దుష్టశక్తలు భారి నుంచి భక్తులను కాపాడే రూపం.భక్తాభయ నరసింహుడు భక్తుల పాలిటి కల్పతరువుగా వెలసిండు. లక్ష్యీ నరసింహ రూపంలో లక్ష్మీదేవితో కూడియున్న ప్రశాంత మూర్తిగా దర్శనమిస్తడు. ఈ మూర్తికే ప్రజలు ఎక్కువగా మొక్కులు మొక్కుకుంటరు.
యాంకర్ 3
ఇవి దేవాలయానకి వెళ్లే మెట్లు. ఈ మెట్లు ఎక్కిస్వామిని దర్శించుకున్న వారికి కీళ్లనొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
(భక్తులు మెట్లెక్కే విజువల్స్)
యాంకర్ 4
ఇది గోపుర చక్రం..ఇది సాక్ష్యాత్తూ ఆ విష్టుదేవుడి చక్రం. యాదమహర్షి తపస్సు చేసుకుంటుండగా ఒక రాక్షసుడు మహర్షిని చంపే ప్రయత్నం చేసిండట. తన భక్తునికి అపాయం వచ్చిందని గ్రహించిన స్వామి...విష్ణు చక్రాన్ని సంధించి రాక్షసుణ్ని చంపేసిండట. యాదమహర్షి ఈ చక్రాన్ని స్తుతించగా.. తాను ఇక్కడే ఉంది భక్తులకు ఏవిధమైన కష్టాలు కలుగకుండ కాపాడుతానని అభయమిచ్చిందట.
వాయిస్
స్వామి వారి విమానం మీద ఉన్న ఈ చక్రం అత్యంత పవిత్రమైనది. ఇది సాక్ష్యాత్తూ విష్ణుమూర్తి సంధించిన చక్రం. యాదమహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా ఒక రాక్షసుడు వచ్చి మహర్షిని తినబోయిండు. ఈ విషయం మహర్షికి తెలీదు. ఈ విషయాన్ని గ్రహించిన సర్వాంతర్యామి కోపోద్రిక్తుడై రాక్షసుడి పైకి సుదర్శన చక్రాన్ని సంధించిండు. ఆ చక్రాఘాతానికి రాక్షసుడు నేలకొరిగిండు. యాదమహర్షి కనులు తెరిచి ఆ చక్రముని శాంతించమని స్తోత్రం చేసిండు. అపుడా సుదర్శన చక్రం మహర్షిని నిర్భయంగా ఉండుమని అభయమిచ్చింది. దుష్టులనుంచి భక్తులను కాపాడేందుకు ఇక్కడే కొలువై ఉందునని అభయమిచ్చింది. త్వరలో ఒక భక్తుడు స్వామి గుహ పై నిర్మించబోయే ఆలయం పై చక్ర ప్రతిష్ట చేస్తడని తెలిపిండు. ఆ చక్రం పైన తాను అధిరోహించి యుందునని తెలిపిండు. షట్కోణయుతమైన తన స్వరూపమును భక్తులు దర్శించుకుందురని రివ్వున గుట్ట పైకి వెళ్లింది.
స్వాట్...
యాంకర్ 5
ఇది విష్ణు కుండము. దీనికి విష్టు కుండము అనే పేరు రావడానికి రెండు కారణాలున్నయని చెప్తరు. యాదమహర్షిని రక్షించేందుకు వచ్చిన విష్టు చక్రం తన పని పూర్తి కాగానే మహర్షికి దర్శనమిచ్చి, ఈ ప్రాంతంలో అంతర్ధానమయిందని...అందుకే దీనికి విష్టు కుండమనే పేరొచ్చిందని చెప్తరు.
వాయిస్
ఈ కోనేరు చూడండి. నిత్యం జీవజలంతో తొణికిసలాడుతుంటది. ఎండాకాలంలో కూడా నిండుకుండలా ఉంటది. ఈ కుండం ఇలా ఉండడానికీ ఓ కారణం ఉంది. యాదమహర్షిని కాపాడటానికి వచ్చిన సుదర్శన చక్రం మహర్షికి ఇక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తనని అభయమిచ్చింది. తర్వాత ఈ కొండ పైకి వచ్చి నిలిచిపోయింది. ఆ చక్ర ఘాతానికి కోనేరు తయారయింది. అందుకే దీనికి విష్ణుకుండమనే పేరొచ్చింది.
స్పాట్..
సృష్టికర్త బ్రహ్మ తన కమండల జలంతో నారసింహుని పాదాలు కడుగగా ఆజలం ప్రవహిస్తూ వచ్చి ఈ విష్ణుకుండంలో ఆగిందట. యాద మహర్షి తపస్సు పూర్తి చేసుకొని ఇక్కడి కోనేరులో పుణ్య స్నానం చేసేవాడట. తొలిసారి ఈ పుష్కరిణిలో యాదమహర్షి స్నానమాచరించడం వలన దీనికి యాదర్షికుండమని కూడా పిలుస్తరు.ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పక ఈ కుండంలోస్నానం చేస్తరు. ఈ పవిత్ర జలం శిరస్సు పై చల్లుకున్నంతనే సకల పాపాలు హరిస్తయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వైశాఖ, మాఘ, పాల్గుణ, మాసాలలో ఈ కుండానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటది. ఈ కుండంలో రాత్రి వేళల్లో స్నానం చేయడం నిషేదం. ఎందుకంటే రాత్రి వేళల్లో వెంకటగిరిలో తపస్సు చేసుకునే మునులు ఇక్కడకొచ్చి తపస్సు చేస్తరని ప్రచారం.
స్పాట్...
బైట్ –ఆలయ ప్రధానార్చకులు
స్పాట్
యాంకర్ 6
ఇది శ్రీ ఆంజనేయుని అర్చా రూపం. యాదమహర్షికి కలలో కనిపించి ఈ క్షేత్రమహత్యం తెలిపింది ఈ స్వామేనట. మహర్షికి నరసింహ స్వామి ప్రత్యక్షమై ఇక్కడ వెలశాక, ఆంజనేయుణ్ని ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉండమని కోరిండట యాదమహర్షి. మహర్షి కోరిక మన్నించిన ఆంజనేయుడు కామస్వరూపిగా వెలసిండు.అప్పటి నుంచి లక్ష్మీనరసింహస్వామితో బాటు ఆంజనేయ స్వామి కూడా పూజలందుకుంటున్నడు.
వాయిస్
యాద మహర్షికి ఆంజనేయుడు కలలో కనిపించి స్వామి ఉన్న చోటు చూపినందుకు...ఆంజనేయుని పట్ల యాదమహర్షికి భక్తి పెరిగింది. ఎంతో కాలం ఆంజనేయుడి దర్శనం కోసం తపసు చేసిండు. మహర్షి భక్తికి మెచ్చి ఆంజనేయుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మన్నడు. అప్పుడు యాదమహర్షి...ఆంజనేయస్వామి ఇక్కడే కొలువై ఉండి ఇక్కడి పుణ్యక్షేత్ర పాలకుడిగా ఉండాలని కోరిండట. మహర్షి కోరిక మేరకు అంజనీ పుత్రుడు ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఉంటూ భక్తులకు దర్శనం ఇస్తండు.
యాంకర్ 7
ఇక్కడ లక్ష్మీనరసింహస్వామితో బాటు ఆంజనేయుణ్ని శివుణ్ని కూడా పూజిస్తరు.
వాయిస్
శివాయ విష్ణు రూపాయ...అని వేదాంగాలు వర్ణించినట్టు...ఎక్కడ విష్ణుముర్తి తన అవతారాలతో వెలుస్తడో అక్కడ శివుడు దర్శనమిస్తడని స్థల పురాణాల్లో వివరించిండ్రు. చాలా విష్ణు ఆలయాల్లో శివాలయాలు కూడా ఉంటయి. ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలిచేందుకు శివుడే ప్రత్యక్షంగా లింగరూపంలో వెలసిండట. ఇక్కడికి వచ్చిన భక్తులు శివుణ్ని కూడా భక్తిశ్రద్దలతో పూజిస్తరు.
స్పాట్
యాంకర్ 8
ఈ పుణ్యక్షేత్ర మహిమ తెలుసుకున్న రాజులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించి తమ కోరికలు నెరవేర్చుకున్నరు. ఆలయ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటి చెప్పిండ్రు. అంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ఈ యాదగిరి గుట్ట.
వాయిస్
క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పాలించేవారు. 1148 సంవత్సరంలో త్రిభువన మల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్య విస్తరణ కాంక్షతో తెలంగాణ ప్రాంతపు చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ భువనగిరి ప్రాంతానికి వచ్చిండు. భువనగిరిలో ఏకశిలను చూసి ముగ్దుడై ఆ శిల పై కోటనిర్మించుకొని దానిలోనే నివాసమున్నడట. అదే సమయంలో పృధ్వీ వల్లభ అనే రాజుతో త్రిభువనిడికి వైరం ఏర్పడింది. పృధ్వీ వల్లభుణ్ని జయించడం త్రిభువనుడికి చాలా కష్టంగా మారింది. దీంతో మంత్రి బగద్దేవుడు యాదగిరి నరసింహుణ్ని దర్శించుకొమని సలహా ఇచ్చిండట. మంత్రి సలహా విన్న రాజు ఈ యాదగిరి లక్ష్మీనరసింహుణ్ని చేరి సేవించిండట. స్వామి కటాక్షం వల్ల త్రిభువనుడికి విజయం కలిగింది. ఆ రాజు పేరు మీదే ఈ ప్రాంతానికి భువనగిరి అనే పేరొచ్చింది. ఈ విషయం ఆ ప్రాంత ప్రజలందరికీ తెలయడంతో స్వామి మహిమల గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది.
స్పాట్
స్వామి లీలలు తెలిపే మరో సంఘటన కూడా ఉంది. పూర్వం ఒకసారి శ్రీ కృష్టదేవరాయులు ఆంధ్రదేశాన్ని లోబరచుకొని సతీసమేతంగా గొల్కొండకు వచ్చిండు. ఇక్కడకు సమీపంలో ఉన్న యాదగిరిగుట్టను దర్శించుకున్నడు. రాజభక్తులు స్వామిని శ్రద్దగా పూజించిండ్రు. ఎంత కాలంనుంచో పుత్రసంతానం కోసం బాదపడుతున్న రాయలుకు మగబిడ్డ జన్మించిండట.కానీ ఆ కొడుకు అల్పాయుష్కుడై ఐదేండ్లకే చనిపోయిండు. రాయలు ఈ ఘటతో కుంగిపోయిండు. తానేదైనా అపచారం చేశానా అని మధనపడసాగిండు. అప్పుడు స్వామి కలలో కనిపించి రాణి విష్ణుకుండలో స్నానమాచరించక నిర్లక్ష్యం చేసినందున ఈ శిక్ష అనుభవించవలసిందని తెలిపిండట. దీంతో రాజు మరల యాదగిరి గుట్టకు చేరుకొని భక్తి శ్రద్దలతో పూజించిండ్రు.
స్పాట్..
ఎంతో మంది రాజులు స్వామిని దర్శించుకున్నా దేవదేవునికి ఆలయం నిర్మించాలన్న ఆలోచన రాలేదు. ఆలయ ఉద్దరణకు కృషి చేయలేదు. అందుకే చెట్టుపుట్టలతో నిండిన ఈ ప్రాంతం 19వ శతాబ్దం వరకు సామాన్యులకు అందుబాటులోకి రాకుండా పోయింది.
స్పాట్
బైట్ - ఆలయ ధర్మకర్త.
యాంకర్ 9
ఈ క్షేత్రాన్ని రాజులెందరో దర్శించి, పూజలు చేసి తమ కోరికలు తీర్చుకొన్నారే కానీ ఆలయ ఉద్దరణకు నడుం బిగించిన వారు లేరు. 19 శతాబ్దం వరకు ఈ ఆలయ ఉనికే చాలా మందికి తెలీదు. క్షేత్రం మొత్తం చెట్టు పుట్టలతో నిండి పోవడంతో స్వామి గ్రామ పెద్దకు కలలో కనిపించి...క్షేత్ర మహత్యం తెలపడంతో గ్రామస్థులంతా కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని ఉద్దరించిండ్రంట.
వాయిస్
పూర్వం యాదగిరి ప్రాంతం మొత్తం కాకులు దూరని కారడివిలా ఉండేదట. స్వామి దూపదీప నైవేద్యాలేవీ లేకుండా చీకటి గుహలో ఉండేవాడు. యాదగిరి గ్రామ పెద్దకు స్వామి కలలో కనిపించి తాను ఈ కొండ పై వెలసియున్నానని చెప్పిండు. మరునాడు గ్రామ ప్రజలంతా కలిసి ఆ కొండ అణువణువూ శోదించిండ్రు. చెట్లను తొలిగించి గుహలన్నిటిని వెదికిండ్రు. వారి శ్రమ ఫలించింది. స్వామి దర్శనం లభించింది. అంతే ఇక వారి సంతోషానికి అవధులు లేవు. వెంటనే పూజారులను పిలిచి పూజలు చేయించిండ్రు. ఆ ప్రాంతమంతా శుభ్రం చేసిండ్రు. అప్పటి నుంచి స్వామికి రోజూ పూజలు చేయడం మొదలు పెట్టిండ్రు.
యాంకర్ 10
ఇవి ఆలయ ప్రాకారాలు... వీటి పై స్వామి కథలను అందంగా చెక్కిండ్రు. ఒకప్పుడు ఇక్కడ ఆలయమే లేదు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్న మోతీలాల్ అనే భక్తుడు స్వామికి ఆలయ ప్రాకారాలు నిర్మించేందుకు కృషి చేసిండట.
వాయిస్
యాదగిరి గ్రామస్తులంతా కలిసి స్వామిని వెలికితీసి పూజలు చేసిండ్రు కానీ ఆలయం నిర్మించ లేదు. కొంతకాలం గడిచాక హైదరాబాద్ నివాసి శ్రీ రాజా మోతీలాల్ పిథీగారు ఈ ఈ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకొన్నడు. స్వామిని దర్శించాలన్న తపనతో ఇక్కడకు వచ్చి భక్తి శ్రద్దలతో పూజించిండు. పంచరూపాలలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహస్వామికి ఆలయం లేక పోవడంతో చింతించిండు. తాను అక్కడే నివాసముండి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. ఆలయానికి ప్రాకారాలు నిర్మించి ఒక రూపం తెచ్చిండు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ది చెందుతనే ఉంది.
స్పాట్.
బైట్----ఆలయ ఈ.వో
యాదగిరి లక్ష్మీనరసిహ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తరు. ఆ ముక్కోటి దేవతలు ఈ ఉత్సవాలకు హాజరై భక్తులను దీవిస్తరని విశ్వసిస్తరు.
స్పాట్
( బ్రహ్మోత్సవాల విజువల్స్ సి.డిలోవి.)
ఇదీ ఈ వారం తెలంగాణ ఆలయం. మరో తెలంగాణ ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం...