ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, January 3, 2020

Monday, December 9, 2019

Sunday, December 8, 2019

civil procedure code 1908 telugu/Res judicata telugu /రెస్ జుడికేట

Saturday, December 7, 2019

civil procedure code 1908/frame of suit/ cause of action/ఫ్రేమ్ ఆఫ్ సూట్

Thursday, December 5, 2019

లక్ష్మీ ఎలా భరించిందో


టేకు లక్ష్మీ శరీరం మీద జరిగిన హింస, దాడులను వివరిస్తుంటే.. మాకు వినడమే కష్టమైంది.. లక్ష్మీ ఎలా భరించిందో..???😢 ◆ అటవీ ప్రాంతం గుండా.. కొండలు ,వాగులు , వంకలు దాటుతూ కాలి నడకన మారుమూల తండాలకు పల్లెలకు వెళ్ళింది లక్ష్మీ. ◆ తిరుగు ప్రయాణంలో ఆటోలుదొరక లేదు మనుషుల తోడు లేదు. ◆ కాలి నడకన అటవీ ప్రాంతం వస్తున్న లక్ష్మీ ని ముగ్గురు తాగుబోతులు అడ్డగించారు. లక్ష్మీ పారిపోయింది. వాళ్ళు వెంటాడారు ప్రతిఘటించింది.. దాడి చేశారు. ◆ లొంగ లేదు.. హింసించారు చంపేశారు. కనతల మీద కొట్టారు. తలను చెట్టుకేసి బాదారు. కత్తిని చేత్తో నిలువరిస్తే..చేతి వేళ్ళు కోసేశారు. గొంతులో కత్తిని దించారు.. గుండెలపై కొరికిన గాట్లున్నాయి.. దేహమంతటా కత్తి గాట్లున్నాయి.. పెద్ద వాళ్ళుసైతం ఆమె శవాన్ని చూసి భయపడ్డారు.. ఇక ఆమె ఒంటిపై ఎంతటి క్రూరమైన హింస జరిగినండో ఉహించవచ్చు.. కులం తక్కువ స్త్రీలంటే.. కూటికి లేనోడికి కూడా లోకువె.. ఆమె చావు ఒక వార్త అయ్యిందే తప్ప అందరినీ కదిలించే ప్రాధాన్యతను పొందలేదు. కులం తక్కువ స్త్రీల కుతికెలు తెగినా.. మానాలు చిద్రమైనా ప్రాణాలు పోయినా ఎవరికీ పట్టదని మరోసారి ఋజువైంది

జార్జ్ రెడ్డి సినిమా


"సభ ముగిసింది, ఇంక చరిత్ర మొదలవుతుంది’(ది మీటింగ్ ఈజ్ ఓవర్, నవ్ ద హిస్టరీ బిగిన్స్) అనే ఒక చారిత్రక మాట తో జార్జ్ రెడ్డి సంస్మరణ సభ ముగిసింది. ఇది జరిగి నలభై ఆరు ఏళ్ళు అయ్యింది. జార్జ్ రెడ్డి సినిమా విడుదలకు ముందే స్పెషల్ షో ఉంటె కొంత మంది మిత్రులతో చూసా. ఎటువంటి అంచనాలు లేకుండానే పోయా. ఇటీవల వచ్చిన కొన్ని బయోపిక్ లు కొన్ని వాస్తవ జీవితాలను చంపేసాయి మరికొన్ని శిలాజాలకు జీవం పోశాయి. జార్జ్ రెడ్డి సినిమా పైనున్న యే రెండు పనులూ చేయలేదు. కాకుంటే ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఒకడు ఒక టైలర్ దగ్గర ఇప్పుడు ఉన్న ట్రెండ్ లకు భిన్నంగా కొత్త చొక్కా కుట్టించుకున్నాడు. షాప్ లో అది తీసుకొని పరుగే పరుగు ఏం జరిగిందా అని అందరూ వాణ్ని వెంబడించారు. ఇంటికి వెళ్లి హడావుడిగా కవర్ విప్పి చొక్కా తొడుక్కునాడు. అరె ఏమయిందిరా అలా హడావుడి చేసావు అని పక్కవాళ్ళు అడిగితే ‘నేను ఈ చొక్కా వేసుకోవడం ఆలశ్యం అయితే ఈ మోడల్ కాపీ కొట్టి అందరూ కుట్టించు కుంటారు. నేనే ముందు వేసుకోవాలి కనుక ఇలా చేశా’.అని చల్లగా అన్నాడు. జార్జ్ రెడ్డి సినిమా తీసిన దర్శకుడు మానసిక స్థితి అచ్చంగా ఆ కొత్త చొక్కా కోసం ఉరికిన ఎర్రి బాపతు లాంటిది అనిపించింది. నాకయితే సినిమా ముగిసింది,’చరిత్ర కూడా ముగిసింది’ అనిపించింది. జార్జ్ తల్లి లీలా వర్గీస్ ట్రావెన్కూర్, తండ్రి చల్లా రఘునాథ రెడ్డి రాయల సీమ. ఈ దేశం స్వతంత్ర గాలి పీల్చేనాటికి జార్జి కి ఏడు నెలలు . ప్రాధమిక విద్య వరంగల్ సెయింట్ గాబ్రియల్ లో చదివాడు (61-62) తర్వాత సికింద్రాబాద్ సెయింట్ పాల్స్. నాడు కొండపల్లి సీతారామయ్య,శివసాగర్ సెయింట్ గాబ్రియల్ లో అధ్యాపకులు. జార్జ్ కి ఆ ఇద్దరూ ఆ నాటికి తెలిసే అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం వచ్చేనాటికి వాళ్ళు ఇద్దరూ అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. కనుక ఆయనకు లేని వీరత్వాన్ని ఆపాదించడమూ సరికాదు. ఆయన విప్లవ నాయ కత్వం తో చర్చలు చేసాడు అంటున్నారు నిజమా ? జార్జ్ అన్నలు డాన్, కార్ల్ ఐఏఎస్, సిరిల్ వ్యారం లో చెల్లి జాయ్ మైసూర్ CIL లో పనిచేసారు. దాదాపు అందరూ చనిపోయారు గొప్పగా చదువుకున్నారు సామాజిక స్పృహ తో బ్రతికారు. డెబ్బై లలో ఉస్మానియా తన రాజకీయ కార్య క్షేత్రం అయ్యింది. జార్జ్ ఎవరి కోసం కొట్లాడాడో ఎవరు చంపారో ఉస్మానియా లో గడ్డి పరకను అడిగినా ఆ నెత్తుటి మరకల ఆనవాళ్ళు చెబుతాయి. ఎటుకూడి దర్శకుడు జీవన్ రెడ్డి కి మాత్రం బ్లేడ్ జార్జ్ మాత్రమే కనబడ్డాడు. ఆయనతో కలిసి తిరిగిన గద్దర్. రాజన్న, తమ్మారెడ్డి, ప్రదీప్,ప్రొ.మామిడాల రాములు సర్ బ్రతికి ఉండగానే ‘సినిమా ముగిసింది.’ అదే విషాదం. ధూల్ పేట లఖన్ సింగ్ క్రౌర్యం సంఘీయుల కాటిన్యం కలిసి ఒక గొప్ప విప్లవ స్వాప్నికుణ్ణి మట్టు బెట్టాయి. 72 జూలైలో సృజన జార్జ్ ముఖచిత్రం తో వేసినా ఆ హత్య కార్య కారణ సంబంధాలు ఏమాత్రం రాయక పోవడం ఆశ్చర్యం వేసింది. కనీస నిజ నిర్ధారణ రిపోర్ట్ వేయనంత సాధారణ చావుగా కుదించబడిన జీవితం జార్జ్. జార్జ్ కు మూడుతరాల మేథోజీర ఉంది. గొప్ప గొప్ప అధికారుల మంత్రులు సాంగత్యం ఉంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ మనిషి. ఆయన తో కలిసి రాజకీయీయాలు చేసిన జావేద్ మీర్జా తమ్మారెడ్డి రాతల్లో అర్థం అవుతోంది .ఎవరు ఏమనుకున్నా ఒకటి నిజం యర్రం రెడ్డి సంతోష్ రెడ్డి,ఒక కూర రాజన్న గద్దర్, మారోజు లాగా కడుపు మండి చేసిన పోరాటం కాదు. ఎవరు ఏమనుకున్నా కడుపులో చల్ల కదలని, పాలకవర్గ కరస్పర్శ జార్జ్ కి ఉంది.జార్జ్ చనిపోగానే ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి పివి నర్సింహా రావు ఇంటికి వచ్చే అంత దగ్గరితనం ఉంది. ఈ మాట చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం మాత్రం కాదు విచక్షణ తో కూడిన ఆగ్రహ ప్రకటన ఆయనది. వివేచన తో కూడిన రాజకీయాలు నడిపిన నిక్కచ్చి తనం ఆయన సొంతం. ఆయన కార్యాచరణ ఆగ్రహం వెనక ముప్పును రాజ్యం ముందుగానే పసిగట్టింది ఆయన ఉనికి గిట్టని వారికి ముప్పు అని కూడా భావించి ఉంటారు . పాతికేళ్లకే అసువులు బాసిన మరో చే అతను. నాలుగేళ్ల లో ఆ కోపం ఉస్మానియా ను పోరాట క్షేత్రం చేసే అవకాశం ఉందని ఆయనను మట్టు బెట్టారు.ఆత్యాగాన్ని అపహాశ్యం చేసి చరిత్ర హీనుణ్ణి కాను , కానీ జార్జ్ కన్నా గొప్ప త్యాగమయ జీవితాలు చరిత్ర లో విస్తాపితులుగా మిగిలారు. కానీ చరిత్ర ఎవరి త్యాగాన్నీ మరచిపోదు. ముందూ వెనకా అవి రాసే చేతులకోసం ఎదురు చూస్తూ ఉంటది. సరైన చేతిలో పడితే .అసురన్, సినిమా లాగా అజ్ఞానుల చేతిలో ‘జార్జ్ రెడ్డి’ సినిమా లాగా ఒక మరక మిగులుద్ది. అయినా మరక మంచిదే కదా. ఇటువంటి పిరియాడికల్ సినిమా తీసేటప్పుడు జుట్టు,చొక్కాలు ఒక్కటే మారిస్తే సరిపోదు. ఆ నాటి రాజకీయ వాతావరణం రావాలి. అది రావాలి అంటే అరవై తొమ్మిది మొదలు జార్జ్ పోయేనాటికి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. పేలవమైన టేకింగ్, పేలవమైన ఫ్రేమింగ్, దరిద్రమైన రి రికార్డింగ్, ఎవడు ఎవరిని ఎందుకు కొడుతున్నారో తెలియదు. బస్తీల ల లో దొమ్మీ లాగా తీసారు కొన్ని సీన్లు. జార్జ్ వాడిన ఆయుధాన్ని హుస్సేన్ సాగర్ లో బుద్దుని సాక్షిగా నిమజ్జనం చేయడం తోనే దర్శకుని పరిణితి అర్ధం చేసుకోవచ్చు. జార్జ్ అంటే నిప్పు రవ్వ. నాకయితే మైక్ టైసన్ బయో పిక్ అక్కినేని నాగేశ్వరరావు తో వేయించి నట్టు అనిపించింది. జార్జ్ దూకుడు మనిషి కాదనను కానీ కారణం లేకుండా ఎవరి మీదా అడ్డగోలుగా చేయి ఎత్తని మనిషి. ఆయన చేయి చేసుకునే అంత గ్రావిటీ నాకు ఎక్కడా కనబడ లేదు. దానికి తోడు ఒక తెల్ల తోలు అమ్మాయి కుప్పిగంతులు ఇవి అవసరమా ? ఎవరు ఏమన్నా వందేమాతరం తరం నుండి జనతన సర్కార్ దాకా ఒక ప్రత్యామ్నాయ ఆలోచనకు ఉస్మానియా కేంద్రం. ఎన్నో గొప్ప సాహిత్య సాంస్కృతిక ఆలోచనలు అక్కడ పురుడు పోసుకున్నాయి. ఒక పోరాట పరంపర విప్లవ స్ఫూర్తి ఇంకా అక్కడ బ్రతికే ఉంది. జార్జ్ ప్రత్యామ్నాయ ఆలోచనలు తన చూపు నక్సల్బరీ దిశగా ఉంది మిత్రుల రాతల్లో చదివా. అసలు ఆయన తుపాకీ పెట్టె అవసరం ఎందుకు వచ్చింది. సినిమాలో తుపాకీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసే అవసరం దర్శకునికి ఎందుకు కలిగింది ? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు . మీ మార్కెట్ కోసం, మీ ప్రవర కోసం ఆ పరంపరను ఆబాసు పాలు చేయకండి . పోరాట వీరులను బ్లేడు బాబ్జిలను, బుల్లెట్ జులాయిలుగా డ్యూయెట్ ఆటలతో పెప్సీ, పల్సర్ ,పిజ్జా కాక్టెయిల్ చేయకండి. జార్జ్ మీద ప్రేమ ఉంటె సినిమా చూడండి. లేకుంటే చూపు కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్నా సీకో’ పుస్తకాన్ని చదివి ఆ సజీవ జ్ఞాపకాలను మదిలో ఉంచుకోండి. అంతకు మించి చెప్పేది ఏమీ లేదు. మూడు పదులు దాటని ఒక గొప్ప విప్లవ శ్వాప్నికుణ్ణి సజీవంగా ఉంచుకోలేక పోయాం ఇది ఈ తరం మేథో వైఫల్యం ఈ నాటికీ ఆయన హత్యా మీద సమగ్ర సమాచారం రాసుకోలేక పోయాం ఆయన తో సన్నిహితంగా ఉన్న మిత్రులు పోక ముందే ఆ విస్మృత చరిత్ర నిర్మాణం తక్షణ అవసరం నా సహకారం ఎలాగో ఉంటది

Tuesday, April 9, 2019

posani parvathi

Wednesday, April 3, 2019

జీళ్లచెరువు అసలు కధకు ఇదే మొదలు

Monday, March 5, 2018

కెసిఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం..

కెసిఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. రాసి పెట్టుకోండి.. మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాసుపోర్టు కేసులు తిరగదోడతారేమో.. అలె నరేంద్ర చెప్పింది ఇప్పుడు సాకారం అవ్వుద్దేమో.. పొన్నాల లక్ష్మయ్య చెప్పింది ఇప్పుడు జరిగిద్దెమో.. ఏమో అనవసరంగా కెసిఆర్ అత్యాశకు పోతున్నాడనిపించట్లేదు. ఏమో గుర్రం ఎగరను వచ్చు.. గ్రామ పంచాయతీకి పరోక్ష ఎన్నికలు, రిజర్వేషన్ భాగోతం ఎందులో వేలు పెడదామన్న కెసిఆర్ కు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యాంగ ప్రవేశికలో డెమొక్రటిక్ వుంది గాని.. డిక్టేటర్ పదం లేకపోయే.. అందుకే జాతీయ రాజకీయాల్లో చేరి, రాజ్యాంగ సవరణ చేసి మొదటగా ప్రియాంబుల్ మర్చి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం బదులు సర్వసత్తాక గణతంత్ర నియంతృత్వ రాజ్యం అని రాజ్యాంగ ప్రవేశికను మార్చాలి, విదేశీ పెట్టుబడులు తెలంగాణ కె కాదు దేశానికి ఎక్కువ వస్తాయి. ఇప్పటికే 1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణ అయ్యింది , ఇక దేశం చేతిలో ఉంటే కోట్ల కోట్లు అప్పులు తేవచ్చు, తెలివి లేని దద్దమ్మలకు పదవులిచ్చి దేశాన్ని అమ్ముకున్న ఎవడు అడగడు. చైనా బజార్ కావాలి ఇప్పుడు ఇండియా. చైనా వస్తువులు కావాలిప్పుడు. పీఎం చైర్ కూడా చైనా మార్కెట్ లో కొంటారేమో .. ఎక్కువకాలం పని చెయ్యదు.

Wednesday, February 22, 2017

కోదండ రామ్‌ అరెస్ట్‌ నీతి మాలిన చర్య.. సభ్య సమాజం సిగ్గు పడాలి


కోదండ రామ్‌ అరెస్ట్‌ నీతి మాలిన చర్య.. సభ్య సమాజం సిగ్గు పడాలి ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ తపెట్టిన నిరుద్యోగ ర్యాలీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. నా చిన్నతనంలో ఆలిండియా రేడియోలో ఆదివారం జ సమాధి అని ఒక నాటకం వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారు. అందులో ఒకరు ధైర్యంగా ఉద్యమం నడిపేవాడైతే, రెండవ వాడు మేథావి. వ్యూహకర్త, భావవ్యాప్తిలో దిట్ట. ఈ ఇద్దరి సాహసంతో ఉన్న అధినేతను కూల్చి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. తర్వాత ఉద్యమాన్ని నడిపిన వాడు అధికారంలోకి వచ్చి పాత అధిపతి కంటే అరాచకాు చేస్తుంటాడు. ఇది చూసి సహించలేని మేథావి తిరిగి తన కలానికి పదును పెడతాడు. అధికారంలో ఉన్న స్నేహితుడు మేథావి రెండు చేతు నరికిస్తాడు. మేథావి తన గళానికి పని చెబుతాడు. ఇక లాభం లేదని ఒక నీటి తొట్టిలో కట్టేసి నీళ్లు వదుతారు. నీరు గొంతు వరకు వచ్చే వరకు ప్రభుత్వానికి తొత్తులా మారుతానని, లొంగి పోయే అవకాశం ఇస్తారు. కానీ మేథావి తన గొంతులో ప్రాణం ఉండగా అది జరగదంటాడు. గొంతు మునిగింది.. ఇదే నేను విన్న జసమాధి నాటకం. తర్వాత తాజ్‌మహల్‌ రూపక్పన చేసిన మేథావు, కట్టిన కూలీ చేతు విరిచింది ఈ వ్యూహంలో భాగంమే. మళ్లీ అటువంటి కళాఖండం కనిపించొద్దని. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంలో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది. తెంగాణ ఉద్యమంలో అనుసరించిన ప్రజాస్వామిక పోరాట విధానాను, నిరసనను స్వరాష్ట్రంలో ఎందుకు తెలియజేయకూడదు. తెంగాణ సాధించుకున్నది స్వపాన కోసం తప్ప నియంత పాన కోసం కాదు కదా. ‘‘తెంగాణ ఉద్యమంలో ఏనాడు ఏ పోలీస్‌ అధికారి ఇంత రాత్రి వేళ నాయింటి గడప తొక్కలేదు’’. ఇదీ జేఏసీ నేత కోదండరాం ఆవేదన. తమ ర్యాలీ శాంతి యుతం గా ఉంటుందని. అది కేవం నిరసనా రూపమని, ప్రజాస్వామిక హక్కు అని పుమార్లు పునరుద్ఘాటించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనకు ప్పాడవద్దని ముందుగానే విద్యార్ధుకు, నిరుద్యోగుకు తెలిపారు. అయినా ప్రభుత్వానికి భయం. ఇప్పుడు ర్యాలీ భారీగా విజయవంతం అవుతుందన్న విషయం ప్రభుత్వానికి తొసు. అందుకే హడావుడిగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాు విడుద చేసింది. హడావుడిగా నోటిఫికేషన్‌ు విడుద చేసి పరీక్షు నిర్వహించిన ప్రభుత్వానికి ఫలితాు విడుదాు చేయడంలో జాప్యం ఎందుకో సమాధానం లేదు. అందుకే కోదండరాం తపెట్టిన ఉద్యమానికి జంకింది. సమాధానం చెప్పాల్సిన వాళ్లు తప్పించుకొని, స్థాయి లేని వాళ్లతో తిట్టించడం అసమర్ధతకు నిదర్శనం. ర్యాలీని అడ్డుకోవడం పిరికిపంద చర్య. ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, ప్రజాస్వామిక హక్కును కారాయడం దుర్మార్గమే అవుతుంది. ఎంత అదిమి పడితే తెంగాణ ప్రజు అంతగా ఎగిసి పడతారన్న విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు.

Wednesday, February 8, 2017

saree function of akhis part 2

Friday, February 3, 2017

saree function of akhis part 1

Friday, August 19, 2016

journalist laku droham

Monday, August 1, 2016

పత్రికా స్వేచ్ఛతో పగ తీర్చుకోవచ్చా..?

పత్రికా స్వేచ్ఛ అడ్డదాయి తొక్కుతోంది. మీడియా... భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాధమిక హక్కు పరిధిలో నడుస్తోంది. అంతకు మించి పెద్ద హక్కు, మినహాయింపు లేవు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని వ్యక్తు ప్రయివేట్‌ జీవితంలోకి తొంగి చూడటం, హద్దుమీరి ప్రవర్తించి, తమకు శత్రుత్వం ఉన్న వ్యక్తు పై విషం చిమ్మటం వంటి ఆగడాు కచ్చితంగా ఉద్దేశ్యపూరిత నేరం కిందకే వస్తాయి. మీడియా పదే పదే విస్మరిస్తున్న ఒకే ఒక్క విషయం ఏమిటంటే తమకున్న ప్రాధమిక హక్కును అడ్డం పెట్టుకొని వేరొకరి ప్రాథమిక హక్కును కారాయడం. గతంలో కూడా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా , కట్టూ వంటి పెద్దు మీడియాకు సంకెళ్లు వేయడం ప్రమాదమని గుర్తించి సున్నింతంగా ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. మీడియాకు స్వయం నియంత్రణ అనివార్యమని. అవును మీడియాకు విచక్షణా నేత్రం అవసరం . కానీ పాత్రికేయుడికి ఆ విచక్షణ ఉంటే తన క్ష్యాన్ని ఎలా ఛేదిస్తాడు. పోటీ రంగానికి ఐఎస్‌ఐ మార్కుగా మారిన మీడియా ఇప్పుడు వ్యక్తును భయపెట్టి వ్యాపారం చేయడంలో కూడా తన హస్త లాఘవాన్ని బంగా ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా పోటీలో ఎదురొచ్చే దాయాదును అవసరమైన సందర్భాల్లో, అవకాశం దొరికిన సందర్భాల్లో మట్టుపెట్టేందుకు తమ చేతుల్లో ఉన్న ఆయుధాకు పదును పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవ ఈ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. ముఖ్యంగా నేర పూర్తి వార్తు రాసేటప్పుడు మీడియా తనకున్న అన్ని విచక్షణను కోల్పోయి నగ్నంగా నిబడుతోంది. అడ్డు చెప్పేవాడు లేడని ఆధారాు లేకున్నా అడ్డంగా రాసుకుంటూ పోతోంది. ఒక నేరారోపితుడిని ఎలా చూపించాన్న కనీస పరిజ్ఞానం లేక కాదు గానీ మమ్మల్ని ఎవడేం చేస్తాడన్న ధీమానే దీనికి కారణం. ఒక నిందితుడి గురించి ప్రముఖ వార్త ప్రచురించాల్సి వస్తే ఏ రకమైన నిబంధను పాటించాలి, కోర్టు పరిధిలో ఉన్న వార్తను రాయాంటే ఎటువంటి పరిమితు పాటించాన్న విషయం పాత్రికేయుకు ట్రైనింగ్‌లోనే స్పష్టంగా చెబుతారు. ఒకవేళ ఫీల్డ్‌లో ఉన్న పాత్రికేయుకు ఆ విషయాు తెలియకుంటే డెస్క్‌ జర్నలిస్టుకు ఈ విషయం పై పూర్తిగా శిక్షణ ఇస్తారు. అటు ఎక్ట్రానిక్‌ మీడియా అయినా, ప్రింట్‌ మీడియా అయినా తమ పరిధికి పరదా వేస్తే మేనేజ్‌మెంట్‌కే బొక్క. కోర్టు చుట్టూ తిరగాల్సిన అగత్యం మేనేజ్‌మెంట్‌కి మరియు ఆ వార్త ప్రచురణకు సంబంధం ఉదంటూ ఆరోపించే ప్రతి వ్యక్తి ఈ నేరంలో పాు పంచుకున్నట్టే లెఖ్క. ఒక నిందితుడు కేవం నేరారోపణ ఎదుర్కుంటున్న వ్యక్తి మాత్రమే. అతని పై నేరం చేశాడన్న ఆరోపణ మాత్రమే ఉంది. కానీ అతడు నేరస్ధుడా కాదా అన్న విషయం న్యాయంస్థానం రుజువు చేయాలి. నేరం రుజువయినప్పుడు మాత్రమే ఆ నేరానికి సదరు నేరారోపితుడికి సంబంధం ఉన్నట్టు లెఖ్క. అప్పటి వరకు అతని పై ఉన్నది కేవం ఆరోపణు మాత్రమే. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముక్కూ మొహం తెలియని వ్యక్తు పై కేసు పెట్టినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తారు. నేరం తమది కాదు అని రుజువు చేసుకోవసిన బాధ్యత నిందితుడిది. ఇటువంటి వార్తు రాసేటప్పుడు నిందితుడి ఫోటోను ప్రచురించాల్సిన పని లేదు. ఎందుకంటే అది అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీస్తుంది. నేరం రుజువు కానంత వరకు అతడే నేరస్థుడు అనే భావన కల్పించే విధంగా నిందితు ఫోటో వేయడం నేరమే అవుతుంది. ఒకవేళ అది సమాజ ప్రయోజనాకు సంబంధించినదై ఉండి ఖచ్ఛితంగా ఫైల్‌ ఫోటో ప్రచురించాల్సి వస్తే నిందితుడి ఫోటోలో కళ్లు కనిపించడకుండా బ్లర్‌, మాస్క్‌ వంటివి వాడి ప్రచురించాలి. పోలీసు మీడియా ముందు ప్రవేశ పెట్టే ముందు కఛ్చితంగా ముసుగు వేయించి మాత్రమే ప్రవేశ పెట్టాలి. ఇది ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బ్ల గుద్ది చెప్పింది. ముఖ్యంగా సమాజ ప్రయోజనం లేని చిన్న చిన్న కేసును పెద్దవిగా చిత్రీకరించి ఫైల్‌ ఫోటో పేరుతో వ్యక్తు ఫోటోు ప్రచురించడం చట్టరీత్యా నేరం. కానీ ఇటీవ కనీస పరిజ్ఞానం లేని పాత్రికేయు, వ్యక్తిగత కక్ష సాధింపుకోసం, అవకాశం కోసం ఎదురు చూసే బద్మాశ్‌ు, చేతగాని సన్నాసు ఈ తరహా ఆయుధాను వాడటం మీడియా పై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. అంతే కాకుండా సదరు మీడియాలో పని చేసే ఇటువంటి ఫంగు వ్ల మొత్తం సంస్థ మీద విశ్వాసం దెబ్బతింటుంది. ఇప్పటికే ఇటువంటి వార్త మూంగా పువురు సంస్థ యాజమాన్యాు కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్తు రాసిన పాత్రికేయును విధుల్లోంచి తొగించినప్పటికీ యాజమాన్యాు మాత్రం కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి . కారణం తమ బ్యూరోకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోగా, తప్పు చేస్తున్నారని తెలిసినా శిక్షు ఇవ్వకపోవడం బమైన కారణం, ఇటీవ పాత్రికేయు మీద పాత్రికేయులే ఫోటోు పెట్టుకొని వార్తు ప్రచురించి కార్పోరేట్‌ కసాయిగాళ్లకు కొంగుబంగారంగా మారడం వర్తమాన మీడియా మాడాకే చెల్లింది. ఇకనైనా ఇటువంటి సంస్కృతికి చరమగీతం పాడాలి.