ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, August 1, 2016

పత్రికా స్వేచ్ఛతో పగ తీర్చుకోవచ్చా..?

పత్రికా స్వేచ్ఛ అడ్డదాయి తొక్కుతోంది. మీడియా... భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాధమిక హక్కు పరిధిలో నడుస్తోంది. అంతకు మించి పెద్ద హక్కు, మినహాయింపు లేవు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని వ్యక్తు ప్రయివేట్‌ జీవితంలోకి తొంగి చూడటం, హద్దుమీరి ప్రవర్తించి, తమకు శత్రుత్వం ఉన్న వ్యక్తు పై విషం చిమ్మటం వంటి ఆగడాు కచ్చితంగా ఉద్దేశ్యపూరిత నేరం కిందకే వస్తాయి. మీడియా పదే పదే విస్మరిస్తున్న ఒకే ఒక్క విషయం ఏమిటంటే తమకున్న ప్రాధమిక హక్కును అడ్డం పెట్టుకొని వేరొకరి ప్రాథమిక హక్కును కారాయడం. గతంలో కూడా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా , కట్టూ వంటి పెద్దు మీడియాకు సంకెళ్లు వేయడం ప్రమాదమని గుర్తించి సున్నింతంగా ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. మీడియాకు స్వయం నియంత్రణ అనివార్యమని. అవును మీడియాకు విచక్షణా నేత్రం అవసరం . కానీ పాత్రికేయుడికి ఆ విచక్షణ ఉంటే తన క్ష్యాన్ని ఎలా ఛేదిస్తాడు. పోటీ రంగానికి ఐఎస్‌ఐ మార్కుగా మారిన మీడియా ఇప్పుడు వ్యక్తును భయపెట్టి వ్యాపారం చేయడంలో కూడా తన హస్త లాఘవాన్ని బంగా ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా పోటీలో ఎదురొచ్చే దాయాదును అవసరమైన సందర్భాల్లో, అవకాశం దొరికిన సందర్భాల్లో మట్టుపెట్టేందుకు తమ చేతుల్లో ఉన్న ఆయుధాకు పదును పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవ ఈ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. ముఖ్యంగా నేర పూర్తి వార్తు రాసేటప్పుడు మీడియా తనకున్న అన్ని విచక్షణను కోల్పోయి నగ్నంగా నిబడుతోంది. అడ్డు చెప్పేవాడు లేడని ఆధారాు లేకున్నా అడ్డంగా రాసుకుంటూ పోతోంది. ఒక నేరారోపితుడిని ఎలా చూపించాన్న కనీస పరిజ్ఞానం లేక కాదు గానీ మమ్మల్ని ఎవడేం చేస్తాడన్న ధీమానే దీనికి కారణం. ఒక నిందితుడి గురించి ప్రముఖ వార్త ప్రచురించాల్సి వస్తే ఏ రకమైన నిబంధను పాటించాలి, కోర్టు పరిధిలో ఉన్న వార్తను రాయాంటే ఎటువంటి పరిమితు పాటించాన్న విషయం పాత్రికేయుకు ట్రైనింగ్‌లోనే స్పష్టంగా చెబుతారు. ఒకవేళ ఫీల్డ్‌లో ఉన్న పాత్రికేయుకు ఆ విషయాు తెలియకుంటే డెస్క్‌ జర్నలిస్టుకు ఈ విషయం పై పూర్తిగా శిక్షణ ఇస్తారు. అటు ఎక్ట్రానిక్‌ మీడియా అయినా, ప్రింట్‌ మీడియా అయినా తమ పరిధికి పరదా వేస్తే మేనేజ్‌మెంట్‌కే బొక్క. కోర్టు చుట్టూ తిరగాల్సిన అగత్యం మేనేజ్‌మెంట్‌కి మరియు ఆ వార్త ప్రచురణకు సంబంధం ఉదంటూ ఆరోపించే ప్రతి వ్యక్తి ఈ నేరంలో పాు పంచుకున్నట్టే లెఖ్క. ఒక నిందితుడు కేవం నేరారోపణ ఎదుర్కుంటున్న వ్యక్తి మాత్రమే. అతని పై నేరం చేశాడన్న ఆరోపణ మాత్రమే ఉంది. కానీ అతడు నేరస్ధుడా కాదా అన్న విషయం న్యాయంస్థానం రుజువు చేయాలి. నేరం రుజువయినప్పుడు మాత్రమే ఆ నేరానికి సదరు నేరారోపితుడికి సంబంధం ఉన్నట్టు లెఖ్క. అప్పటి వరకు అతని పై ఉన్నది కేవం ఆరోపణు మాత్రమే. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముక్కూ మొహం తెలియని వ్యక్తు పై కేసు పెట్టినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తారు. నేరం తమది కాదు అని రుజువు చేసుకోవసిన బాధ్యత నిందితుడిది. ఇటువంటి వార్తు రాసేటప్పుడు నిందితుడి ఫోటోను ప్రచురించాల్సిన పని లేదు. ఎందుకంటే అది అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీస్తుంది. నేరం రుజువు కానంత వరకు అతడే నేరస్థుడు అనే భావన కల్పించే విధంగా నిందితు ఫోటో వేయడం నేరమే అవుతుంది. ఒకవేళ అది సమాజ ప్రయోజనాకు సంబంధించినదై ఉండి ఖచ్ఛితంగా ఫైల్‌ ఫోటో ప్రచురించాల్సి వస్తే నిందితుడి ఫోటోలో కళ్లు కనిపించడకుండా బ్లర్‌, మాస్క్‌ వంటివి వాడి ప్రచురించాలి. పోలీసు మీడియా ముందు ప్రవేశ పెట్టే ముందు కఛ్చితంగా ముసుగు వేయించి మాత్రమే ప్రవేశ పెట్టాలి. ఇది ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బ్ల గుద్ది చెప్పింది. ముఖ్యంగా సమాజ ప్రయోజనం లేని చిన్న చిన్న కేసును పెద్దవిగా చిత్రీకరించి ఫైల్‌ ఫోటో పేరుతో వ్యక్తు ఫోటోు ప్రచురించడం చట్టరీత్యా నేరం. కానీ ఇటీవ కనీస పరిజ్ఞానం లేని పాత్రికేయు, వ్యక్తిగత కక్ష సాధింపుకోసం, అవకాశం కోసం ఎదురు చూసే బద్మాశ్‌ు, చేతగాని సన్నాసు ఈ తరహా ఆయుధాను వాడటం మీడియా పై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. అంతే కాకుండా సదరు మీడియాలో పని చేసే ఇటువంటి ఫంగు వ్ల మొత్తం సంస్థ మీద విశ్వాసం దెబ్బతింటుంది. ఇప్పటికే ఇటువంటి వార్త మూంగా పువురు సంస్థ యాజమాన్యాు కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్తు రాసిన పాత్రికేయును విధుల్లోంచి తొగించినప్పటికీ యాజమాన్యాు మాత్రం కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి . కారణం తమ బ్యూరోకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోగా, తప్పు చేస్తున్నారని తెలిసినా శిక్షు ఇవ్వకపోవడం బమైన కారణం, ఇటీవ పాత్రికేయు మీద పాత్రికేయులే ఫోటోు పెట్టుకొని వార్తు ప్రచురించి కార్పోరేట్‌ కసాయిగాళ్లకు కొంగుబంగారంగా మారడం వర్తమాన మీడియా మాడాకే చెల్లింది. ఇకనైనా ఇటువంటి సంస్కృతికి చరమగీతం పాడాలి.

No comments:

Post a Comment