ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, December 5, 2019

లక్ష్మీ ఎలా భరించిందో


టేకు లక్ష్మీ శరీరం మీద జరిగిన హింస, దాడులను వివరిస్తుంటే.. మాకు వినడమే కష్టమైంది.. లక్ష్మీ ఎలా భరించిందో..???😢 ◆ అటవీ ప్రాంతం గుండా.. కొండలు ,వాగులు , వంకలు దాటుతూ కాలి నడకన మారుమూల తండాలకు పల్లెలకు వెళ్ళింది లక్ష్మీ. ◆ తిరుగు ప్రయాణంలో ఆటోలుదొరక లేదు మనుషుల తోడు లేదు. ◆ కాలి నడకన అటవీ ప్రాంతం వస్తున్న లక్ష్మీ ని ముగ్గురు తాగుబోతులు అడ్డగించారు. లక్ష్మీ పారిపోయింది. వాళ్ళు వెంటాడారు ప్రతిఘటించింది.. దాడి చేశారు. ◆ లొంగ లేదు.. హింసించారు చంపేశారు. కనతల మీద కొట్టారు. తలను చెట్టుకేసి బాదారు. కత్తిని చేత్తో నిలువరిస్తే..చేతి వేళ్ళు కోసేశారు. గొంతులో కత్తిని దించారు.. గుండెలపై కొరికిన గాట్లున్నాయి.. దేహమంతటా కత్తి గాట్లున్నాయి.. పెద్ద వాళ్ళుసైతం ఆమె శవాన్ని చూసి భయపడ్డారు.. ఇక ఆమె ఒంటిపై ఎంతటి క్రూరమైన హింస జరిగినండో ఉహించవచ్చు.. కులం తక్కువ స్త్రీలంటే.. కూటికి లేనోడికి కూడా లోకువె.. ఆమె చావు ఒక వార్త అయ్యిందే తప్ప అందరినీ కదిలించే ప్రాధాన్యతను పొందలేదు. కులం తక్కువ స్త్రీల కుతికెలు తెగినా.. మానాలు చిద్రమైనా ప్రాణాలు పోయినా ఎవరికీ పట్టదని మరోసారి ఋజువైంది

No comments:

Post a Comment