
ఎ.జనార్దన్
పదునైన పదాలతో పరిగెత్తించే కలం ఆగిపోయింది. స్వరాలకే వరంగా మారిన ఆ కావ్యఝరి మూగబోయింది. మూడుతరాలను సంగీత ప్రపంచంలో ఓలలాడించిన పదశిల్పి ఇకలేరు. వేటూరి మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆ మహా మనీషికి నివాళి అర్పిస్తూ రాజ్‌న్యూస్ అందించేస్పెషల్ స్టోరీ….
వేటూరి సుందరరామ్మూర్తి…సినీ వినీలాకాశంలో మెరిసే పాటల పాలపుంత..నవరసాలను ఒలికించే గేయామృతధారల సృష్టికర్త. ముచ్చటగా మూడు తరాలను మెప్పించిన అపర పదభగీరదుడు వేటూరి.
ఆయన పాటల్లో ప్రకృతి పల్లవిస్తది. మువ్వలు గల్లుమంటయి. కోయిల కూయంటది.. కొమ్మలు కోలాటాలాడుతయి. పైరగాలి పిల్లనగ్రోవి పలికిస్తది.పండు వెన్నెల పరదా విసుతది. గోదారి అలలు సవ్వడి చేస్తయి. ఆ పదాల అల్లిక మీగడ తరగతల వలే కమ్మగా ఉంటది. ఆ పాటలను ఎంత విన్నా …కాదు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అంత సాహితీ బాండాగారం వేటూరి.
(సిరిమల్లే నీవే పాట) (పంతులమ్మ )
(పిల్లనగోవికి నిలువెల్ల)( సప్త పది)
మేఘసందేశం నుంచి ఆకాశ దేశానా..సాంగ్
వేటూరి తాకని అంశం లేదు. ఆయన కలం కురిపించని భావం లేదు. జీవన మాధుర్యాన్ని , జీవన సాఫల్యాన్ని, జీవన గమనాన్ని ఒద్దికగా పదాల్లో పొందుపరచగల ప్రతిభా శాలి అతడు. మాటలకందని పదాలను పాటలుగా మలచిన పదబ్రహ్మ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా తక్కువే..సినీ జగత్తులో మేరు నగధీరుడు. పాటల మాంత్రికుడు… వేటూరి కలం నుంచి జాలువారిన కవిత్వం… అజరామరం. పాటల రాతలోనే కాదు…. వచన రచనలోనూ మేటి అనిపించుకోవడం… ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఆయన ప్రతి పాటా… మెరుపుగా, ఉరుముగా నినదించింది. మారుతున్న కాలంతో పాటే పాట స్టైల్‌నూ మార్చి… యువత మనసు కొల్లగొట్టడంలో ఆయన నిత్య యవ్వనుడే! పడచుదనపు లోగిలిలోకి వచ్చిన అమ్మాయి మనసు సిరిమల్లెపూవు తోడుగా చిన్నారి చిలకమ్మ సాక్షిగా రాసిన వేటూరి… ఎదురుచూపులోని మధురబాధని గుండెకు హత్తుకునేలా చెప్పిండ్రు.
(సిరిమల్లెపువ్వా, చిన్నారి చిలకమ్మ)(పదహారేళ్ల వయసు)
అచ్చతెలుగు పదారణాల ఆడపడుచు.. తన సరిజోడు తొలిచూపుల తరువాత ఆమె మదిలో మెదిలిన వలపుల తలపులను విప్పి చెప్పిన గడసరి.
(తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు)(శ్రీవారికి శుభలేక)
భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని తన పాటల్లో కళ్లకు కట్టిండు. సిరులన్నింటినీ మించిన సొమ్ము చిరునవ్వేనని సున్నితంగా చెప్పిండు.
(మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం సరస సరాగాల సుమవాణిని. శిలలకు సైతం సంగీతాన్ని వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో ఆ పదాల పరుగు గౌతమి పరవళ్లనే వెక్కించింది.
(నిన్నటి దాకా శిలనైన.)
అలా కదిపితే ఇలా ఇలా వర్షించే మధురగీతాల మేఘం వేటూరి.పదాలుకు పండు వెన్నెలలద్ది కొత్త అందాలను పులిమిన పదశిల్పి. వేలాదిగా పాటలు రాసిన సాటిలేని మేటి కవి వేటూరి. తెలుగు పాటకు ఆయనా ఓ ప్రాణం. తెలుగు అక్షరాల తోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించిన పదకారుడు ఈయన.
(కొమ్మకో సన్నాయి పాట)( రాగాలా పల్లకిలో కోకిలమ్మ)
వేటూరి జీవన సారాలన్ని ఒడిసి పట్టిన పదర్షి. జీవిత అనుభవాలను అక్షరాలుగా చెక్కి పాటల ప్రవాహలో వదిలిన వేదాంతి. స్రవంతి సినిమాలో “నవ్వుతూ వెళ్లిపో నువ్వుగా మిగిలిపో” పాట పాజిటివ్ థింకింగ్ ఆటిట్యూడ్స్ ని చూపిస్తే… మాతృదేవోభవ సినిమాలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటలో జీవన తాత్వికత వైరాగ్యంగ్యాన్ని నింపుతది.
(రాలిపోయే పువ్వా పాట)(మాతృదేవోభవ)
ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డును సాధించింది. తెలుగు పాటకు కీర్తిని తెచ్చింది. వేణువై వచ్చాను అనే పేరుతోనే వేటూరి తన ఆత్మకథను రాయాలని సంకల్పించడం… ఆ పాటపై ఆయనకున్న ప్రేమకు అద్దం పడుతది.
(వేణువై వచ్చాను భువనానికి పాట)( మాతృదేవోభవ)
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వేటూరి 10వేల పైగా పాటలు రాశారుపంతులమ్మ, కాంచన గంగ, చంటి, రాజేశ్వరి కల్యాణం, సుందరాకాండ సినిమాల్లో రచించిన పాటలకు నంది అవార్డులు గెల్చుకున్నారు.
(నవ్వవే నవ మల్లిక పాట)
ఇక శంకరాభరణం లోని అన్ని పాటలకు రచన చేసి శాస్త్రీయ సంగీత పాటల రచనలో మేటి అని నిరూపించుకున్నారాయన.
(ప్రాణము నీవని దగ్గరనుంచి)(శంకరా నాదశరీరాపరా)
గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. ఆమని నిశ్శబ్దంలో స్వరాలు పలికించి… రాలేటి పూల మూగ గొంతులో రాగాలను వినిపించిండు.
(ఆమనీ పాడవే… హాయిగా)(గీతాంజలి)
వేటూరి ఆగమనంతో పాటకు పలవరింతలు మొద లయ్యాయి. పాట పరవశంతో నాట్యం చెయ్యడమూ మొదలైంది. 'ఓ సీత కథలో 'నిను కన్న కథ పాటతో ప్రారంభమైన వేటూరి పాటల పల్లకీ ప్రపంచం చుట్టూ తనదైన హంసగమనంతో ఊరేగి సినీ ప్రేమికుల్ని ఆనందపరుస్తూ ఆశ్చర్యపరుస్తూ డెభ్భై అయిదవ వసంతంలోకి అడుగు పెట్టింది'సిరిసిరి మువ్వలో ఝు కారంతో పల్లవి ప్రారంభించే గుండె ధైర్యం ఎందరికుంటుంది? (ఝుమ్మంది నాదం)
'శంకరాభరణం సినిమాలో ప్రతి పాటా అక్షర సరస్వతికి కంఠాభరణం.
(శంకారా..నాద) ( దొరకునా ఇటువంటి సేవ)
సాగర సంగమం నవరస భావోద్వేగాల సంగమం. ఎన్ని తరాలైనా వాడిపోని నిత్య పరిమళ సుమధుర సుమం.
(ఓం..నమశ్శివాయ..)( (నాద వినోదం..పాటలో కైలాసాన కార్తీకాన)
స్వాతిముత్యం నేటికీ ఆణిముత్యమే. మదిని ఊయలలూపే స్వరాలు ఎన్ని ఆవరించినా స్వాతి ముత్యంపు తళుకులు ఎప్పటికీ తరగని వెన్నెల వన్నెలు.
(సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట)(అండాదండా ఉండాలని దగ్గర్నుంచి)
వేటూరి సరస్వతీ పుత్రుడు. పది పదుల కాలాలు నిలిచిపోయే పాటలు రాసిండు. బావ కవులకు, భావి కవులకు ఆదర్శంగా నిలిచిండు.
(ఆ..కనులలో కలల మాధురి)(ప్రియతమా)( ఆలాపన చిత్రం)
(పొద్దున్నె పుట్టిందిచందమామ) (శతృవు)
వేటూరిలో అన్ని కోణాలూ ఉన్నయి. ఏ ఒక్క బాణికో ఆయన పరిమితం కాలేదు. కాలాన్ని బట్టి కలం కదం తొక్కింది. భక్తిగురించి చెప్పినా దేశభక్తి గురించి చెప్పినా ఆయన స్టైలే వేరు.
(కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పాట)
ఏడు పదుల వయసులోనూ ఆయన మనసు నిత్య యవ్వనంగా ఉంటది. వయసు మనిషికే కానీ మనసు కాదంటడు. మెలోడీ సాంగ్స్‌తో బాటు మాంచి మసాలా ఉన్న పాటలు రాయడం వేటూరికి పెన్నుతో పెట్టిన విద్య. చిలిపి పాటలను చిగురింపచేయడం కూడా ఆయనకు తెలుసు. ఆకుచాటు పిందెలను పిలిచి..కొంటె పాటలకు కొత్త దారి చూపిన ఘనత కూడా ఆయనదే..
(ఆరేసుకోబోయి పారేసుకున్నాను)(ఇందువదన –చాలెంజ్)( ఆ అంటే అమలాపురం – ఆర్య )(అబ్బనీ తియ్మయనీ దెబ్బ –జగదేకవీరుడు)(చిలక కొట్టుడు కొడితే చిన్నదానా..)
వేటూరిలో ఓ ఆద్యాత్మిక కోణం ఉంది. పాటల పొదరిళ్లల్లో దేవుళ్లను కొలిచిన కవి కిరీటి.
(శ్రీరామదాసులో అదిగదిగో భద్రగిరి)(ఏడుకొండలా స్వామి)
(అన్నమ య్య సినిమాలో పాటలు)
వేటూరి కలం నుంచి జాలు వారిన పాటల హోరులో ఎన్నో గమకాలు.. వాన పాటలు -వీణపాటలు..విరహగీతాలు-విప్లవ గీతాలు..రక్తిపాటలు-ముక్తిపాటలు, భక్తి పాటలు –విరక్తి పాటలు..హాస్య గీతాలు –ఆశు కవిత్వాలు. ఒకటేమిటి ఆయన తడమని భావం లేదు. తడవని స్వరఝరి లేదు.
పాట
కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వార తన కవితా ద్వారలు తెరిచిన వేటూరి నాటి నుంచి నేటి వరకు చేసిన పద ప్రయోగాలు కోకొల్లలు. పదాలతో జిగిబిగి అల్లికలు అల్లికలు అల్లి పాల తరగల్లాంటి పాటలు అందించడం ఆయనకే చెల్లింది. సీనీ బాణీలకు ఓణీలేయించి సరిగమ స్వరాలతో సరసాలాడిచిన మేనమామ వేటూరి.
పాట
ఒక పాటను దర్శకుడు, నిర్మాత మెచ్చేలా రాయడమంటే యాగమే. అటువంటి యాగాన్ని పదిహేను నిమిషాల్లో పూర్తిచేయగల నేర్పరి వేటూరి. బొంబాయి సినిమా తీసేటపుడు సంగీత దర్శకుడు రహమాన్‌తో బాటు పాటల రచయిత కూడా ఉండాలని వేటూరిని వెంటతీసుకెళ్లారట. అక్కడ లొకేషన్‌లో రహమాన్ మదిలో మెదిలిన స్వరానికి పదిహేను నిమిషాల్లో పదాలల్లి ఔరా అనిపించుకున్న పదప్రబంధం వేటూరి.
(కన్నానులే కలయికలు)(బొంబాయి)
కొత్త కొత్త పదబందాలు..సరికొత్త భావ శిల్పాలు..రాగాలతో రంగరించే వినూత్న స్వరాల సవ్వడులు కోకొల్లలు.
(ఉప్పొంగెలే గోదావరి)(గోదావరి )
వేటూరికి పాటంటే ప్రాణం. అంతే కాదు పాటను పలికించే మాతృబాషంటే పంచప్రాణాలు..ఆ బాష బంగపడితే తట్టుకోలేని సరస్వతి తనయుడు. 1994 తెలుగుపాటకు రెండవసారి పురస్కారం అందుకున్నరోజు తెలుగు బాషకు ప్రాచీన గౌరవం దక్కలేదని ఉద్వేగానికి గురయిండు.
పాట.
ఎంత పెద్ద నది కూడా చిన్న ఊటపాయతోనే ప్రాణపోసుకుంటది. ఎన్ని వేల మైల్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలయితది. జర్నలిస్ట్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్ఇన వేటూరి తన జీవిత ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను అధిగమించి మహాప్రస్థానికి మళ్లిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం ప్రార్దిద్దాం.