ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, November 18, 2010

ఫ్లోరోసిస్ భూతం


ఎ.జనార్ధన్
ఫ్లోరోసిస్ నీరు.. కన్నీరు
ఇక్కడ మనకు దీనంగా కనిపిస్తున్న ఈ అభాగ్యులను ఏ వైరస్ సోకలేదు.. జన్మతః వికలాంగులు అసలే కారు.. పోలియో వంటి మహమ్మారి వీరి జోలికే రాలేదు.. మరే మయింది..మాయా మంత్రమా.. మెలితిరిగిన అవయవాలతో... పీడకలలో మాత్రమే కనిపించే వింత రూపం వీరికి ఎలా వచ్చింది.. మన చేరువలోనే గుండె చెరువయ్యే కన్నీటి గాథ ఇది.. మంచినీరు తాగడమే నేరమైన దుస్థితి..
స్పాట్
ఇప్పుడు మనం చూసిన ఈ హృదయ విదారక దృశ్యాలు నల్లగొండ జిల్లాలో చాలా ఊర్లలో కనిపిస్తాయి.. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే..జీవధార ప్రవహించే ఈ నేలలో వీళ్లంతా జీవశ్చవాలుగా ఎందుకు మారుతున్నారు.. మూడు తరాలుగా ముప్పుతిప్పలు పడుతూ నిత్యం మరణశయ్యపై దీనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
స్పాట్
ఇక్కడ కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతాయి.. కమ్మనైన నీరు కాలువల గుండా పారుతుంటుంది..ఆధునిక దేవాలయానికి ఆనవాలయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిందీ ఇక్కడే… ఈ నీరు రాష్ర్టంలో ఎందరికో దాహార్తిని తీర్చింది.. పంట పొలాలను పొత్తిళ్లల్లో హత్తుకుంది. లక్షలాధి ఎకరాలను పచ్చగా చిగురింపజేసే మహత్తున్న జలాశయమిది..కానీ తాను పుట్టిన నేల నెర్రలు బాసి గుండె పగిలిపోతున్నా నీటిమాటున కన్నీటిని దాచుకుంది. అయిన వారి కడగళ్లను తీర్చలేక పోయింది. ఈ నీరు తమ నోరు తడపాలని ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డా కోరుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలయినా ఆ గలగలలు కలలు గానే మిగిపొయినాయి.
స్పాట్
జీవం నిలపాల్సిన జీవజలాలే, కఠిన జలాలై కసాయిగా ప్రాణాలను తోడేస్తున్నాయి.. నేలమీద పడ్డ గడియ నుంచి నేలలో కలిసే వరకు నరకయాతన.. గాజు పెంకులయిన ఎముకలు..తోలు తిత్తి లాంటి శరీరం. ఆదమరిచినా, అదుపు తప్పినా ఇక అస్థిపంజరం పై ఆశలు వదులుకోవలసిందే.. ఎవరు చేసిన పాపం ఇది. తమ నేలకు శాపంగా మారింది. పండు వెన్నెల కురిపించే నవ్వులు మసకబారిపోతున్నాయి..రాహువు మింగిన చంద్రుడిలా చీకటి మాటున చిట్లిపోతుంది. తాము తాగే తల్లిపాలే విషమని వీరికి తెలియదు.. తమ చనుబాలలో విషపు టణువులున్నాయన్న సంగతి ఆ తల్లులకు కూడా తెలియదు..కారణం.. ఇక్కడి మట్టిలో.. మట్టిమనుషుల్లో అణువణువునా ఫ్లొరిన్ అణువులు నిండిపోయినాయి.. వీరినందరినీ చుట్టు ముట్టిన ఆ విషవ్యాధి “ఆస్టియో పోరోసిస్” . తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఈ ఎముకల వ్యాధి బారిన పడుతారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన లీటర్ కు ఒక మిల్లీగ్రాం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. కానీ ఇక్కడ ప్రజలు తాగే నీటిలో లీటర్ కు 15 మిల్లీ గ్రాముల ఫ్లోరిన్ ఉంటుందంటే వీరు తాగేది మంచి నీరా లేక విషరసాయనమా అనే అనుమానం కలుగుతుంది.

Wednesday, September 8, 2010

ఖర్జూర పండ్ల గురించి తెలుసుకోంఢి



ఎ. జనార్ధన్
ఖర్జూరం కథ
ఖర్జూరం…ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం తన్నుకొస్తది. . పంచదార కన్నా మధురంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారుండరంటు నమ్మండి! ఇక చిన్న పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖర్జూరాన్ని చూస్తే చెరుకు గడకే ఈర్శ్య పుడుతుందట. అంత మధురంగా ఉంటది ఈ పండు. అందుకే రోజంతా ఉపవాసం ఉన్నా నాలుగు ఖర్జూరాలు నోట్లో వేసుకుంటే చాలు ఎక్కడ లేని శక్తి వస్తది. ఎందుకంటే ఈ పండుకున్న పవర్ అల్లాంటిది. ఈ మధురాతి మధురమైన పండులో ఎన్నో కాలరీల శక్తి , మినరల్స్ ఈ పండుకు అంత పవర్ తెచ్చిపెట్టినయి. రంజాన్ మాసంలో అయితే సరే సరి. ముస్లిం సోదరులకు ఆ నెలరోజులు ఇదే అమృతం.
స్పాట్
ఖర్జూరానికి అంత తియ్యదనం ఎక్కడిది. తేనెలూరే తియ్యదనం సొంతం చేసుకున్న ఖర్జూరం కథేంటో కాస్త చూద్దాం..
స్పాట్
ఖర్జూర పండు తినని వాళ్లు ఉండరేమో కానీ..ఖర్జూర చెట్టు చూడని వాళ్లు మాత్రం చాలామందే..ఎందుకంటే ఖర్జూరాలు ఇక్కడ పండవు. ఖర్జూర చెట్లు ఎలా కాపు కాస్తయో చూడాలంటే సప్త సముద్రాలు దాటి వెళ్లాల్సిందే..ఇంత కండ గల పండు నీరు లేని ప్రాంతంలో పండుతుందంటే మీరు నమ్మగలరా..అవును ఈ ఖర్జూర పండ్లు అరేబియా ఇసుక ఎడారుల్లో విరివిగా పండుతయి. అక్కడి నుంచి అన్ని దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతయి. ఇప్పడంటే ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నయి గానీ ఒకప్పుడు ఖర్జూర పండు తినాలనే కోరిక కోరికగానే మిగిలిపోయేది. ఎప్పటివో ఎండు ద్రాక్ష పండ్లు ఉంటే పూజా పునస్కారాలలో వాడగా మిగిలినవి దేవుడి దయ వల్ల వాటి రుచిచూసే అదృష్టం లభించేది. కానీ ఇప్పడు ఖర్జూరాన్ని పిలిస్తే పలుకుతది. ఎందుకంటే ఖర్జూర పండ్లు అరబ్ కంట్రీస్ నుంచి విరివిగా దిగుమతి అవుతున్నయి. రంజాన్ మాసంలో ఇవి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటయి.
స్పాట్
ఇక్కడ ఠీవిగా నిలుచొని ఉందే ఇదే ఖర్జూర చెట్టు. ప్రాంతాన్ని, రకాలన్ని బట్టి ఇవి రకరకాల ఎత్తుల్లో ఉంటయి. 15 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతయి. ఇవి ఒక్కో రుతువులో ఒక్కో అందాన్ని అద్దుకుంటయి. నిండు పచ్చదనాన్ని నింపుకొని అందాలన్నీ ఒంపుకున్న ఈ ఖర్జూర చెట్టు ఎప్పుడూ హరిత వర్ణంతో నిగనిగలాడుతుంటది. గల్ఫ్ వీధుల్లో అందాలను ఆరబోస్తూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తవి. పచ్చని పూతతో నిండు ముత్తయిదవలా నిలుచొని పర్యాటకులకు కనువిందు చేస్తది. పూత రాలి లేలేత పిందెలు వేసుకొని బాలింతలా బంగారు వన్నెలు నింపుకుంటది. కాసిన్ని రోజులకే ఈ కాయలు కండ నింపుకొని పసిడి వన్నెలోకి మారుతయి. ఎడారి దేశంలో పండే ఈ పండ్లు కాస్త పండు దశకు చేరగానే సంధ్యవేళ సూర్యుడిలా ఎర్రగా ఉంటయి. పచ్చిగా ఉండగానే తుంచి నోట్లో వేసుకోవాలన్నంతగా మురిపిస్తయి. పొరపాటున నోట్లో వేసుకుంటే మాత్రం సాయంత్రం వరకు తమ వగరు దనంతో సరసాలాడుతుంటయి. బాగా పండాక ముదురు ఎరుపులో ఉంటయి. కండగలిగి కాస్తముడతలు పడ్డ ఆ ఖర్జూరాలు పక్వానికి వచ్చాక పరువాలు నింపుకున్న పడుచు పిల్ల మాదిరిగి ఊరిస్తయంటే నమ్మండి.
స్పాట్
ఖర్జూరంలో కార్బో హైడ్రేట్లు, షుగర్, ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, వాటర్, విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటయి. ఖర్జూరాన్ని, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సూడాన్, లిబియా, అల్జీరియా, వంటి దేశాలలో విరివిగా పండిస్తరు.
ఈ ఖర్చూర చెట్టుకు తాటి చెట్టుకున్నంత కథ ఉంది. ఈ చెట్టును మల్టి పర్పస్ తా ఉపయోగించుకునే వారు. దీని ఆకులతో, కొమ్మలతో ఇళ్లు కప్పుకునే వారట. అంతేకాదు బుట్టలు. అలంకరణ వస్తువులు తయారు చేయడానికి ఈ ఖర్జూరం చెట్ల విడిబాగాలను ఉపయోగించుకునేవారు. ఖర్జూర పండ్లతో జూస్లు, సిరప్ లు, తేనె, చాక్ లెట్లు, బిస్కెట్లు, తయారు చేస్తున్నరు. వైద్యరంగంలో కూడా దీని మేలు మరువలేనిది..రోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యమని డాక్టర్లు సలహా ఇస్తున్నరు. ఇంకెందుకాలస్యం మీరు కూడా ఖర్జూరాలకు నాలుగు పైసలు ఖర్చుపెట్టండి.

Tuesday, August 17, 2010

సర్దార్ సర్వాయి పాపన్న




ఎ. జనార్ధన్
మనం మరిచిన తెలంగాణ వీరుడు
సర్దార్ సర్వాయి పాపన్నజయంతి నేడు
అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. ముంజ కత్తి పట్టాల్సిన చేతితో తల్వార్ దూసిండు.. మొగలాయి సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేబట్టిన యోధుడు. ఆయనే తెలంగాణ చరిత్ర గర్వించే వీరుడు సర్వాయి పాపన్న.
బడుగులకు రాజ్యాధికారమని ఎలుగెత్తి తరతరాలుగా అర్రులు చాస్తున్న ఈ తరానికి సర్వాయి పాపన్నే ఆదర్శం.
సర్వాయి పాపన్న పుట్టింది ఖిలాషాపూర్ లో..ఈ గ్రామం హైదరాబాద్కు ఈశాన్యంగా 50 మైళ్ళ దూరంలో వరంగల్ మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నది. ఈ ఊర్లో పాపన్న విగ్రహం ఉంచి పాపన్న తమ ఊరి వాడని సగర్వంగా చెప్పుకుంటరు గ్రామస్థులు. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. తక్కువ చూపు చూస్తున్న కులవృత్తిని అంగీకరించలేదు. కులవృత్తి స్వీకరించమన్న తల్లి కోరికను కాదన్నడు. కొంత ధనాన్ని చేత బట్టుకొని రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు శభదం చేసిండు.
మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. ఒక్కప్రాణాలే కాదు..తమ పిల్లా జెల్లా..గొడ్డూగోదా ఏదీ తమది కాదు. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపడు కత్తి దూసిండు. తన తోటి వారిని బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపు యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి జేజేలు పలుకుతూ చిన్నాపెద్దా ఆయన పోరాటానికి బాసటగా నిలిచిండ్రు.
సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది.ఈ ప్రయత్నంతో గౌడు కులస్థులతో బాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిండ్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిండ్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్న పై చేసిన దాడిలో ఘోరంగా విఫలమయింది రుస్తుంఖాన్ సైన్యం.. 1707లో ఔరగంజేబు మరిణానంతరం బహద్దూర్ష్ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. సరిగ్గా ఇదే సమయంలో మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు.
వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో షాపూర్ హైదరాబా ద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఏటవాలు కొండపై నిర్మించిన భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధి కారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రక టించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నడు.బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించా డు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిండ్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నరు యూసఫ్ ఖాన్ను ఆదేశించిండు.
1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధమైనడు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మేనెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు.పాపన్న తుపాకి కా ల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నా బాద్ గ్రామంలో ఒక కల్లు మండువ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు.
అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు.కల్లు దుకాణంలో కూర్చొని ఒక గ్లాసు తాటి కల్లు ఇవ్వమని అడిగాడు.పాపన్న కల్లు తాగుతుండగా నిజాం సైన్యం అతడిని బం ధించి వారిని గవర్నర్ ముందు నిలబెట్టిడ్రు.తరువాత అతని తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండేన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీశారు.స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరునిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసిన గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ్మ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి.

Monday, August 2, 2010

హిందీ గాయకుడూ కిషోర్ కుమార్



ఎ. జనార్ధన్ august
...కిషోర్ కుమార్ స్టోరీ...4th birth day
కలకాలం ప్రజల మదిలో నిలిచిపోయే పాటలు పాడిన గాన గంధర్వలో చెప్పుకోదగ్గ గాయకుడు కిషోర్ క ఉమార్. ఆయన పాడిన పాటలన్నీ వాడిపోని వసంతాలే..కోట్లాదిమంది గుండెల్లో గూడు కట్టుకున్న కిషోర్ పాట అజరామరం. ఆ గొంతునుంచి జాలువారిన అమృతధారను ఆస్వాదించేందుకు ఎగిసిపడే హృదయాలు నాడే కాదు.. నేడూ ఉన్నాయి.. ఉత్సాహం ఉరకలేసి.. మనసు గంతులేసే పాటలను ఎన్నోపాడారాయన. తొలినాళ్ళలో మెత్త మెత్తగా పాడిన సోలోలు ఇప్పటికీ విన్నకొద్దీ వినాలనిపిస్తాయి. ఆషాబోస్లేతో కలిసి పాడిన చిలిపిచిలిపి డ్యుయెట్లు గుర్తుకొస్తేనే మనసు అదోలోకంలోకి తేలిపోతుంది. దేవానంద్ మొదలుకొని అనిల్ కపూర్ దాకా ఎందరో హీరోలకు తన గాత్రంతో ఎక్కడాలేని ఫేం తెచ్చిపెట్టారు కిషోర్... రాజేష్ ఖన్నా, అమితాబ్ ల శకంలో కిషోర్ సినీ వినీలాకాశంలో శిఖరాగ్రాలను చూశారు. కిషోర్ కెరీర్ లో ఇదొక ఉజ్జ్వల దశ. ఆ కాలంలో ఆ ఇద్దరు హీరోలకూ ఆయన పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్లుగా చరిత్ర సృష్టించాయి.
సాంగ్
సినీ ప్రపంచం మరవలేని మధరగాయకుడు కిషోర్ కుమార్ ఆగష్టు 4, 1929లో జన్మించారు. భారతీయ హిందీ సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్న కిషోర్ నేపథ్యగాయకుడిగా, హాస్యనటుడిగా, దర్శకునిగా, నిర్మాత మరియు సంగీత దర్శకుడి రాణిచిండు.. అందుకే కిషోర్ కుమార్ ను సినీ మేథావులు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించింది. అశోక్ కుమార్, అనూప్ కుమార్ మరియు కిషోర్ కుమార్ లు అన్నాదమ్ములు. 1946లో ముంబైలో అడుగుపెట్టిన కిషోర్ నిజానికి మొదట గాయకుడు అవ్వాలని అనుకున్నారు. చిన్నప్పటినుంచీ కిషోర్ కు సైగల్ అంటే వీరాభిమానం. ఎప్పుడూ ఆయన పాటలనే పాడుతుండేవారు. కిషోర్ ముంబైకు చేరుకునేనాటికే ఆయన అన్న అషోక్, హీరోగా ఓ స్ధానంలో ఉన్నారు. తన మనసులోని కోరికను అన్నతో చెప్పారు కిషోర్. తమ్ముడి కోరిక విన్న అశోక్ కుమార్, "నువ్వు సైగల్ ను అనుకరిస్తూ పాడి గొప్ప పాటగాడివి అనుకుంటున్నావు.. మైక్ ముందు పాడటమంటే మాటలు కాదు.. నీకంటు ఓ స్టైల్ ఉండాలి. అందుకు చాలా సమయం కావాలి.. ఈ లోగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండు.." అని సలహా ఇచ్చారు. అలా కిషోర్ నటుడిగా అరంగేట్రం చేశారు.
కిషోర్ నటించిన తొలి చిత్రం " షికారీ". 1946లో వచ్చింది.
స్పాట్ ( మూవీ క్లిప్పింగ్)
ఈ సినిమాలో కిషోర్ అన్న అశోక్ హీరో అయితే, సంగీతాన్నించింది ప్రకాష్. ఒక దశలో కిషోర్ గొంతు విన్న ప్రకాష్, ఆ తర్వాత రెండేళ్లకు తన సంగీతదర్శకత్వంలో వచ్చిన జిద్దీ సినిమాలో కిషోర్ కు తొలి అవకాశమిచ్చారు. మర్నే కే దువా ఏ క్యోం మాంగ్.. ఇదే కిషోర్ తొలి సినిమా పాట.
సాంగ్ (మర్నే కే దువా ఏ క్యోం ) దొరికితేనే
కిషోర్ కుమార్ చేత తొలిపాట పాడించిన ప్రకాష్ ఇతనో మంచి సింగర్ అవుతాడని ఆనాడే ఊహించి చెప్పిండట. సైగల్ అంటే వల్లమాలిన అభిమానం ఉన్న కిషోర్, ఎలాగైనా సరే సైగల్ ని కలుసుకోవాలని కలలుకన్నాడు. తన అన్న అశోక్ సాయంతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, కిషోర్ ముంబైలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే సైగల్ చనిపోవడంతో ఆయన కోరిక మరెన్నటికీ తీరకుండాపోయింది. సైగల్ కు, కిషోర్ కుమార్ కు ఓ పోలిక ఉంది. ఇద్దరూ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోకుండానే గానకళలో ఆరితేరారు. అయితే, సైగల్ ప్రభావం నుంచి కిషోర్ ను బయటపడేసింది మాత్రం ఎస్.డీ.బర్మన్. ఆయన సంగీత దర్శకత్వంలో కిషోర్ అసలు సిసలు గాయకుడిగా రాటుదేలారు. కిషోర్ తనకంటూ కొత్త శైలి వెతుక్కున్నాక, వెనక్కు తిరిగి చూసుకోలేదు. ప్రతీ పాటలో ఆయన గంభీర స్వర ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆయన హమ్మింగ్ ఓ స్పెషల్ ఎఫెక్ట్.కిషోర్ తన చిన్నతనంలో ఆయన రెండో అన్న అనూప్ తెచ్చిన విదేశీ రికార్డుల్లో యోడలింగ్ ను మొదటిసారిగా విన్నారు. ఆ తర్వాత అదే కిషోర్ కుమార్ బ్రాండ్ గా మారింది.ఎయిటీస్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సాగర్ సినిమాలో కూడా కిషోర్ గాత్రం అమృతాన్నే ఒలికించింది. నాలుగు దశాబ్దాలపాటు గళమెత్తిన కిషోర్ చిత్రసీమలో నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే ఆణిముత్యాలెన్నింటినో మనకు అందించారు. ఆయన గొంతులో పలకని రాగం లేదు. నవరస గాయకునిగా కిషోర్ కీర్తిశిఖరాలను అందుకున్నారు.
(స్పాట్ )
ఇంత అద్భుతమైన గాయకుడు కిషోర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం నటుడిగా. పేరు తెచ్చుకుంది కామెడీ హీరోగా. నిలిచి వెలిగింది ప్లేబ్యాక్ సింగర్ గా. ఈ దశలవారీ ప్రస్ధానం వెనుక ఎన్నో మలుపులున్నాయ్.. మెరుపులున్నాయ్
స్పాట్ (క్లిప్పింగ్)
కిషోర్ హీరోగా నటించిన ఆందోళన్, నౌకరీ,ముసాఫిర్ వంటి సినిమాల్లో తనకు తాను కొన్ని పాటలు పాడుకున్నరు. కిషోర్ కుమార్ ను కొంత కాలం ఫ్లాప్ లు వెంటాడాయి. కొన్ని ఫ్లాపుల తర్వాత కిషోర్ న్యూ ఢిల్లీ, చల్తీకా నామ్ గాడీ, ఆషా,హాఫ్ టికెట్ వంటి కామెడీ సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. చల్తీకా నామ్ గాడీలో అన్నదమ్ములు అశోక్, అనూప్, కిషోర్ ముగ్గురూ కలిసే నటించారు. ఇందులో కిషోర్ సరసన మధుబాల నటించింది.
(క్లిప్లింగ్)
ఓ సిటీ గర్ల్, ఓ కార్ మెకానిక్ ల మధ్య నడిచే ప్రేమకధే ఈ సినిమా. ఒక సింగర్ గా కిషోర్ లో ఉన్న టాలెంట్ ను, రేంజ్ ను మొదటిసారి గుర్తించింది ఎస్.డీ.బర్మనే. ఆయన సంగీత దర్శకత్వంలో టాక్సీ డ్రైవర్, ఫంతూష్, మునీంజీ, నౌదోగేరా, పేయింగ్ గెస్ట్, గైడ్, జ్యువెల్ తీఫ్, ప్రేమ్ పూజారి వంటి సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఇవన్నీ దేవానంద్ సినిమాలు కావడం కూడా ఓ విశేషం. ఈ కాంబినేషన్ వెనుక దేవ్, కిషోర్ ల దోస్తీ ప్రభావం కూడా ఉందనే చెప్పాలి.
(సాంగ్)
సచిన్ దేవ్ బర్మన్ తర్వాత ఆయన కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్, శ్రీరామచంద్ర, శంకర్ జైకిషన్, బప్పీలహరి.. ఇలా అందరి మ్యూజిక్ డైరక్షన్ లో కిషోర్ వందలాది పాటలు పాడిండు. ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో కిషోర్ సాధించిన తొలి హిట్ పడోసాన్. ఈ సినిమాలో కిషోర్ నటిస్తూనే పాటలు పాడారు. ఆర్డీ బర్మన్ తో కలిసి ఆయన ఖుష్బూ, పతంగ్, అమర్ ప్రేమ్, బుడ్డా మిల్గయా, అనామికా, ఆప్కీ కసమ్,, హీరాపన్నా వంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. సంజయ్ దత్ చొలి చిత్రం రాఖీలో కూడా కిషోర్ చేత ఆర్డీబర్మన్ పాటలు పాడించారు. వీరిద్దరిదీ ఓ స్పెషల్ కాంబినేషన్. 1969లో శక్తీ సామంతా తీసిన "ఆరాధన" కిషోర్ కుమార్ ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమాలో రాజేష్ ఖన్నాకు, కిషోర్ పాడిన పాటలు ఆసేతు హిమాచలాన్ని ఊపేశాయి. మేరీ సప్నోంకీ రాణీ అనే పాట యూత్ ను మైమరపించింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఆదే పాట.. అంతగా ఆ పాట ఆకట్టుకోవడానికి కిషోర్ గొంతులో పలికిన యవ్వనావేశమే కారణం.
(మేరీ సప్నోంకా రాణి సాంగ్)
అయితే, ఇదే సినిమాలో ఒంటరిగా దొరికిన అమ్మాయితే అబ్బాయి పెట్టే గుసగుసల తరహాలో పాడిన రూప్ తేరా మస్తానా.. ప్యార్ మేరా దీవానా.. పాట కిషోర్ కుమార్ కు తొలి ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
(రూప్ తేరా మస్తానా..సాంగ్)
కళ్యాణ్ జీ ఆనంద్ జీ మ్యూజిక్ డైరక్షన్ లో డాన్, కోరా కాగజ్, జానీ మేరా నామ్.. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు కూడా అదే రేంజ్ హిట్ కొట్టాయి. కొత్తతరం సంగీత దర్శకులతో కూడా కిషోర్ పనిచేశాడు. వారు స్వరపర్చిన ఎన్నో గీతాలకు ప్రాణం పోశారు కిషోర్. వారిలో చెప్పుకోదగ్గ మ్యూజిక్ డైరక్టర్ రాజేష్ రోషన్. ఆయన సంగీతదర్శకత్వంలో వచ్చిన చల్తే చల్తే, జూలీ, దో ఔర్ దో పాంచ్ .. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. సంప్రదాయ సినీ సంగీతానికి డిస్కోను జోడించి బప్పీలహరి డైరక్షన్ లో కూడా కిషోర్ మెరుపులు మెరిపించారు. నమక్ హలాల్, షరాబీ వంటి సినిమాల్లోని పాటలు వింటే చాలు,, కిషోర్ బప్పీలహరి కాంబినేషన్ ఇచ్చిన కిక్ ఎలాంటిదో రుచి చూడొచ్చు.
(సాంగ్ బప్పిల హరి మ్యూజిక్ సాంగ్)
కళాకారులు సున్నిత హృదయులు, వారికి బయటి ప్రపంచానికి మధ్య సయోధ్య అంత సులభంగా కుదరదంటారు. ఇది కిషోర్ విషయంలో అక్షర సత్యమైంది. అందుకే ప్రపంచం అతన్ని ఎక్సెంట్రిక్ అంది. . కళాకారులందరిలాగే కిషోర్ చాలా సెన్సిటివ్. సున్నిత మనస్కుడు అవ్వడం వల్ల ఆయన చలా ఇబ్బందులు పడ్డారు. చాలా విషయాల్లో విపరీతంగా వ్యవహరించేవారని కిషోర్ గురించి చెప్పేవారు. ఆయన ఒక్కొక్క కీర్తిశిఖరం అధిరోహిస్తూ పోతున్నకొద్దీ ఆయనపై వింతవింత కధనాలు అంతకంతకూ ప్రచారంలోకి వచ్చాయి.ఆయన తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్లతో ముచ్చటించే వాడని, ఒక్కో చెట్టును ఒక్కో పేరుతొ పలకరించేవాడని చెబుతారు. ఆయన్ కుక్కల పెంపకం గురించైతే ఎన్నెన్నో కధలున్నాయి.ఏకంగా ఇంటి గేట్ మీద " బీవేర్ ఆఫ్ కిషోర్" అని రాసుకొని కుక్కలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు... నో మనీ, నో వర్క్.. అనే సూత్రానికి కట్టుబడిన కిషోర్, కొన్ని సినిమాలకు డబ్బులిస్తామన్నా వద్దంటూ పనిచేశారు. కిషోర్ వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మొత్తం నలుగురిని పెళ్ళాడిన కిషోర్, ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేవారు. మొదటిభార్య రుమా, కిషోర్ ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చేసుకున్న మధుబాల ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళింది. ముచ్చటగా మూడోసారి పెళ్ళిచేసుకుంటే ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. చివరిగా నాలుగోసారి బూరెబుగ్గల హీరోయిన్ లీనా చందావర్కర్ ను పెళ్ళిచేసుకున్నారు. అయితే, అప్పటికే ఆమె వితంతువు. పైగా ఆమె వయస్సు కిషోర్ కొడుకు అమిత్ కన్నా రెండేళ్ళే ఎక్కువ..
(క్లిప్పింగ్)
కిషోర్ మహా మొండి ఘటం.ఒకసారి కమిటైతే కాదనిపించడం ఎవరితరమూ అయ్యేది కాదు. మహామహులను కిషోర్ ఢీకొన్నారు. కొన్నాళ్ళు ఇబ్బంది పడినా, చివరకు తనమాటే నెగ్గించుకునేవాడు. అవి ఎమర్జెన్సీ రోజులు. ముంబైలో కాంగ్రెస్ ర్యాలీలో పాడమని సంజయ్ గాంధీ కిషోర్ ను అడిగారట. అయితే, దానికి కిషోర్ ససేమీరా అన్నాడట. ఫలితంగా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది. ఆలిండియా, దూరదర్శన్ లలో కిషోర్ పాట కనిపించరాదు.. వినిపించరాదంటూ హుకుం జారీ అయింది. అయినా కిషోర్ తన పట్టు విడవలేదు. చివరికి పరిశ్రమపెద్దలు జోక్యం చేసుకొని ఈ నిషేధం తొలగిపోయేలా చేశారు. ముఖేష్, మహ్మద్ రఫీల వంటి ఉద్ధండుల మధ్య కిషోర్ తన ఉనికిని బలంగానే చాటుకున్నారు. డిఫరెంట్ గొంతుతో ధాటిగా పాడే కిషోర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
సాంగ్
కిషోర్ అభిమానులమని గర్వంగా చెప్పుకునేవారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నారు. అంతకన్నా ఓ సింగర్ కు కావాల్సింది ఏముంది.? మన తెలుగు మిస్సమ్మను హిందీలో "మిస్ మేరీ"గా తీశారు. నాగేశ్వరరావు పాత్రను అందులో కిషోర్ వేశారు. ఆయనకు జోడీగా మన జమునే నటించడం విశేషం. నటుడిగా కిషోర్ నటించిన సినిమాలు ఎంత బాగున్నా, అవన్నీ మసాలా సినిమాలే. వాటిల్లో కూడా ఆయన కామెడీ చేసి నవ్వించారు. కానీ, దర్శకుడిగా మారి కిషోర్ తీసిన సినిమాలన్నీ కూడా చాలా సీరియస్. సత్యజిత్ర ప్రభావంతో వాస్తవికతను చూపించేందుకు కిషోర్ ప్రయత్నించారు. కిషోర్ తీసిన "దూర్ గగన్ కీ ఛావో మే " అందుకు ఓ ఉదాహరణ. తను తీసిన సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం, కధ, మాటలు, అన్నీ పుచ్చుకునేవారు. బహుముఖంగా తన ప్రజ్ఞాపాటవాలని ప్రదర్శించిన కిషోర్ ను గాయకునిగానే ప్రపంచం ఆదరించిందీ, గుర్తించిందీ. కిషోర్ మాత్రం ఈ గుర్తింపుతో నిమిత్తం లేకుండా తన మనసుకు నచ్చినట్టు జీవించారు. ఆడింది ఆట.. పాడింది పాటలాగా గడిపి ఇరవై ఏళ్ల క్రితం ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. ఆయన పాటకు పరవశించిపోయే అభిమానుల గుండెల్లో మాత్రం కిషోర్ ఎన్నటికీ చిరంజీవే.

Saturday, July 31, 2010

బోనాలు పుట్టు పూర్వోత్తరాలు

తెలంగాణ పండగలు, జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు అద్దం పడతయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు . ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళతరు. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపద పాటలుకూడా అమ్మను కొలిచి భక్తి పారవశ్యంలో ముంచేలా ఉంటయి.
బోనాలు పుట్టు పూర్వోత్తరాలు
అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరియైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్నయమ్మకు కోపం వస్తే కూడా మనని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతయి. అంటురోగాలు ప్రబలుతయి. 1869 సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నపరచడానికి ఉత్సవాలు , జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికిందరాబాదులోనే కాక మరికొన్ని తెలంగాణా ప్రాంతాలలో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటరు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తరు భక్తులు. ఉగాది తర్వాత చాలా రొజులకు వచ్చే మొదటిపండగ ఇదే.
భోనం గురించి
బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టికుంఢ లేదా ఇత్తడి గుండిగలో వుంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతరు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తరు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు,నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తరు. ఈ ఊరేగింపులో సంప్రదాయిక నృత్యాలు చేస్తరు. ప్రతీ సమూహం వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచెసిన తొట్టేలను(ఊయల) కూడా అమ్మవారికి సమర్పిస్తరు. అమ్మకు బోనాలు, తొట్టెలు సమర్పిస్తే అమ్మ శాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తదని భక్తుల నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ఉంది.
బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మయొక్క శక్తి , అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆ మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.
అదే కాక మరో నమ్మకం కూడా ఉంది. ఆషాడ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి భక్తితో భోనం వడ్డిస్తరు. తెలంగాణా ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తరు.
అమ్మవారి సోదరుడైన పోతురాజుది ఈ సంబరాలలో ముఖ్య పాత్ర. బలిష్టుడైన వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని , వేపాకు మండలు కట్టుకుని , నుదుల పెద్ద కుంకుమ బొట్టుతో , కాలికి గజ్జెలతో కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు వీరంగం ఆడుతూ ఉంటడు. అమ్మవారికి సమర్పించే ఫలహారపు బళ్ళను అతనే ముందుండి నడిపిస్తడు.
జంటనగరాల జాతర

ఈ పండగ హైదరాబాదు, సికిందరాబాదులో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుగుతుంటది. బోనాల పండగ ఆషాడ మాసంలోని ఆదివారం రోజే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు గోల్కొండ కోటలోని జగదంబ ఆలయంలో మొదలవుతుంది. నిజాం నవాబుల కాలం నుండి ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది. రెండో ఆదివారం సికిందరాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ మందిరంలో జరుగుతది. అప్పుడు సికిందరబాదు వాసులందరూ ఈ పండగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొంటరు. మూడవ ఆదివారం హైదరాబాదులోని అన్ని ప్రాంతాలలో ఈ పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతీ వీధి తోరణాలతో కళకళ లాడిపోతుంటది. చివరి ఆదివారం గన్ ఫౌండ్రిలో ఈ పండగ జరుపుకుంటారు. దీనితో బోనాల పండగకు తెర పడుతది. ఏ పండగైనా ప్రజలంతా ఒకేరోజు జరుపుకుంటరు. కాని బోనాల పండగను మాత్రం వారానికో ప్రాంతంలో నెలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటరు.

జాతర జరిగే విధానం
అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మా, పోలేరమ్మ, మారెమ్మ, యెల్లమ్మ .. అమ్మే కదా యే పేరుతో పిలిచినా పలుకుతది , తమని ఆదుకుంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.. ఆదివారం బోనాలు సమర్పిస్తరు. ఇంతటితో పండగ అయిపోలేదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటది. రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచిచెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండపై నిలబడి, పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తది. వేలాదిమంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతరు.

బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం ప్రతీ ప్రాంతం నుండి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది . హైదరాబాదులోని పాతబస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళ్తారు. ఒక్కటొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహలం సృష్టిస్తయి. ఈ రెండు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ప్రముఖమైనవి. విన్నవారందరిని చిందులేయించే పాటలు ఎన్నో . డప్పుల దరువుతో సాగిపోయే అమ్మ బయలెల్లినాదే... ఆటపాటలతో సాగిపోయిన ఈ ఘటాలన్నింటిని నయాపుల్ లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పంటలను , పిల్లలను చల్లగా ఆ అమ్మ చల్లగా చూసుకుంటుంది అని నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు భక్తులు..

Monday, July 19, 2010

చంద్రయానం నా మొదటి స్టోరీ

Sunday, July 18, 2010

సుక్ష్మ ప్రపంచం 3

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
నాలెడ్జ్ ఈజ్ పవర్... సైన్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ మీకందించే దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్కు స్వాగతం.
బ్యాంగ్
ఆకాశం చీలి రెండుగా విడిపోతున్నట్టు కనిపించే మెరుపులు.మిన్ను విరిగి మీద పడ్డట్టు పెళపెళమంటూ ఉరుములు, ఒక్క చిన్న బాంబ్ రాతిఫలకలను పేల్యేయడం వెనక రహస్యాలు తెలసుకునే ముందు గతవారం చూసిన సూక్ష్మరహస్యాలను ఒక్కసారి చూద్దాం.
రీ కాప్
స్పీడ్ యుగం..ఇప్పుడు మనకు ప్రతిదీ ఫాస్ట్ గా కావాలి..బైక్ నడిపినా స్పీడే..మాట మాట్లాడినా స్పీడే..ఆఖరుకు అన్నంతినడం కూడా స్పీడే. ఈ స్పీడ్ మనం ప్రకృతిని చూసి నేర్చుకున్నదే. ప్రమాదమని తెలిసినా మనకుస్పీడంటే అంత థ్రిల్లెందుకు. స్పీడ్ లో ఉన్న సీక్రెట్ మీకోసం.
స్పాట్
మన చుట్టూ పరిసరాలలో కొన్ని చర్యలు మనల్సి అబ్బురపరిచేంత వేగంతో జరుగుతయి. వాటిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అసలెందుకిలా జరుగుతుందని పరిశీలించాలన్నా సాధ్యం కానంత స్పీడ్గా జరుగుతుంటయి. వాటిలో ఏం జరుగుతుందో పరిశీలించాలంటే చర్యావేగం తగ్గించాలి.అప్పుడు దాన్ని నిశితంగా పరిశీలించ వచ్చు. కానీ చర్య వేగాన్ని తగ్గిస్తే ఖశ్చితత్వం దెబ్బతింటది. అప్పుడు వాస్తవానికి, పరిశీలనకు పొంతన లేని పరిశీలన వస్తుంది.
స్పాట్
వేగంగా జరిగే పనులను రికార్డ్ చేసి ఏం జరుగుతుందో గమనించే టెక్నాలజి ఇప్పటి వరకు లేక పోవడంతో పరిశోధకులు సైతం చేతులెత్తేసి ఊహాగానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. రుజువులకు సైద్దాంతిక పరమైన వివరణలు ఇవ్వవలసి వచ్చింది. కానీ ఇప్పడా పరిస్థితి మారింది. ఒక్క నానో సెకన్లో కూడా ఏం జరుగుతుందో రికార్డ చేయగల టెక్నాలజి అందుబాటులోకి వచ్చింది.
స్పాట్
ఒక్క సెకన్ లో కొన్ని కోట్ల కదలికలు జరుగుతాయి. ఇటువంటి వాటి ధర్మాలు మొత్తం వీటి కదలికల్లోనే ఆధారపడతయి.వీటి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే, అడ్వాన్స్ డ్, హైస్పీడ్ అండ్ వెరీ స్లో షట్టర్ కెమేరా కళ్లతో చూస్తే గానీ అసలు రహస్యం తెలీలేదు.
స్పాట్
కనురెప్ప కొట్టేంత స్పల్పకాలంలో ఏం జరుగుతుందో స్పష్టంగా రికార్డ్ చేసే టెక్నాలజి మన ముంగిలిలోకి వచ్చింది. అందుకే అతి సూక్ష్మ చర్యలను కూడా అధ్యయనం చేయడం సాధ్యమయింది.
స్పాట్
కాయ కొట్టడం, బుడగలు, పేస్ట్
రెప్పపాటు వేగం..అంటే 50 మిల్లీ సెకన్ లు, ఈ కాలంలో కూడా జరిగే పనిని కూడా పరిశీలించగల టెక్నాలజి ఇప్పడు అరచేతిలోకి వచ్చింది. కానీ మానవ మేథస్సు 150 మిల్లీ సెకన్లో కొన్ని వేల ప్రతిచర్యలు జరుపుతది. వాటన్నిటినీ మానవ నేత్రంతో గుర్తించడం కష్టం. బెలూన్ కింద పడి ఎగిరితే కనీసం అది ముడతలు పడుతుందని కూడా ఆలోచించం. (బెలూన్)
స్పాట్
ఇది .. అదృష్య చర్యలకు నిలయమైన ప్రపంచం. ఇక్కడ అన్నీ వేగంగా జరిగిపోతయి. రెప్పపాటులో జరిగే వాటిని అసలు పట్టిచ్చుకోం.. ఇక్కడకు వచ్చే వారంతా స్పీడ్ ను థ్రిల్ చేసేవారే..
(ఫ్లైట్, జైంట్ వీట్, బాంబ్ బ్లాస్ట్, వాటర్)
ఈ సృష్టిలో స్పీడ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. అంతెందుకు కొన్న పనులు స్పీడ్గా చేస్తే తప్పకావు. అంతెందుకు శిలీంద్రాలు తమ స్పోర్స్ ను కూడా వేగంగా విడుదల చేస్తయి. లేకుంటా అవి వ్యాపించడం చాలా కష్టం. అవి ఉన్న చోటు నుంచి అత్యంత వేగంగా విసిరితేనే దూర ప్రాంతాలకు వ్యాపించబడుతయి. కానీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్రతి కదలికా మనకు తెలిసి ఉండాలి. అందుకే దీన్ని రికార్డ చేయగలిగితే ప్రతి సూక్ష్మ అంశాన్ని పరిశీలించగలం.
యాంకర్.
ఇప్పడొచ్చిన కొత్త టెక్నాలజి కెమెరాలతో అదృష్య ప్రపంచాన్ని సదృశ్యం చేయగలుగుతున్నాం. మన కంటికి కొంత పరిమితి ఉంది. అంతకు మించి వేగంగా జరిగే చర్యలను కనుపాప స్పష్టంగా గుర్తించలేదు. అందుకే ఇంతకాలం ఆకాశంలో వెలుగులు చిమ్మే మెరుపుల వెనక ఏంజరుగుతుందో తెలుకోలేకపోయాం. కానీ అడ్వాన్స్ డ్ క్యామ్ లు ఈ పనిని చాలా సులువుగా చేసిచూపాయి. ఆ వండర్ థండర్ సీక్రెట్...
(ఉరుము పడే సౌండ్)
ఆకాశాన్ని అతలాకుతలం చేసే ఉరుములు, మెరుపులు, రెప్పపాటులో ఆకాశాన్ని ఆవరించే తెల్లని చారికలు. భయాన్ని, ఆనందాన్ని ఒకేసారి కలుగ జేసే ఆకాశముగ్గులు.అమెరికాలో ఏటా కొన్ని వందల పిడుగులు భవనాలను తాకి విధ్వంసాన్ని సృష్టిస్తయి. మరి వీటివెనక ఉన్న సీక్రెట్ ఏంటో హైడిఫినేషన్ కెమేరాలలో బంధించేందుకు బయలు దేరారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (శాస్ర్తవేత్తలు కారులో వెళ్లే సీన్)
మెరుపు…ఆకాశంలో ఓ అద్భుతం..రెండు విరుద్ద ఆవేశాల మధ్య ఏర్పడే విద్యుద్ఘాతం. వెలుతురుతో చూడ్డానికి అందంగా ఉన్నా, ఆ వెంటనే కర్ణకఠోరంగా వినిపించే ఉరుము శబ్దమే భయపెడుతది.
స్పాట్ ( ఉరుములు మెరుపులు స్పాట్ ఆంబియన్స్)
ఈ స్లో మోషన్ కెమెరాలతో ఈ మెరుపు వెనక రహస్యం ఛేదించడం సులభసాధ్యమయింది. ఈ స్పెషల్ కెమెరాలు, అసలు వేగం కంటే 300రెట్లు స్లోమోషన్ కాప్చర్ చేయగలవు.
స్పాట్
మొదట్లో మెరుపంటే కేవలం ఒక కాంతి లాగానే భావించారు. కానీ స్లో మోషన్లో గమనిస్తే మెరుపు మర్మాన్ని పసిగట్టారు.
స్పాట్
ఇది భూమి నుంచి ఆకాశానికి విస్తరిస్తున్న స్పార్క్. ఈ స్పార్క్ కు మిలియన్ ఓల్టేజీల శక్తి కలదు. దీని మధ్య బాగంలో సూర్యకేంద్రంలో విడుదలయ్యేంత శక్తి విడుదలవుతది.
స్పాట్
ఇప్పటి వరకూ మెరుపంటే రెండు మేఘాల మధ్య జరిగే విద్యుదావేశ చర్యగా భావించారు శాస్ర్తవేత్తలు. అతి తక్కువ పీడనంలో మేఘం భూమితో జరిపే విద్యుత్ చర్యను పిడుగుగా భావించేవారు. అంటే పిడుగు ఆకాశం నుంచి భూమి పై ఉన్న ఎత్తేన ప్రదేశాల పై అంటే భవనాలు, టవర్లు, చెట్ల పై పడుతుందని శాస్ర్తవేత్తలు భావించేవారు. కానీ భూమి నుండి పిడుగు ఆకాశానికి దూసుకెళుతుందన్న సత్యాన్ని రుజువు చేసింది అడ్వాన్స్డ్ టెక్నాలజి. మెరుపు వేగాన్ని విశ్లేషించాలంటే మాటలా..అందుకే.. మేఘం నుంచి కిందికి వచ్చే మెరుపుకంటే భూమి నుంచి ఆకాశానికి ఎగసే మెరుపుకే ఎక్కువ శక్తి ఉంటది అనే సత్యం ఈ స్లోమోషన్ టెక్నాలజి ద్వారా రుజువయింది.
స్పాట్
ఒక్కోసారి ఈ మెరుపు కొన్ని సెకన్ల పాటు నిలకడగా ఆకాశానికి నిచ్చన వేసినట్టుండి శాఖోపశాఖలుగా విస్తరిస్తది. ఆ శాఖలు మరిన్న ఉపశాఖలుగా చీలి ఆకాశాన్ని ఆవృతం చేసినా ..మెయిన్ స్ట్రిప్ మాత్రం కొన్ని సెకండ్ల పాటు బ్లింక్ మోడ్ లో అలాగే ఉండి వెలుతురు పంచుతది.
స్పాట్
ఒక్క మెరుపులో బిలియన్ వాట్ల విద్యుత్చ్ఛక్తి విడుదలవుతది. ఇది భూమి పై పడ్డ చోట ఏది ఉన్నా మాడి మసయిపోవాల్సిందే. పిడుగు ప్రభావాన్ని బట్టి పెద్ద భవనాలయితే పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతింటయి. పెద్ద పెద్ద భవనాలు, కంపెనీలు ఈ పిడుగు బారి నుండి రక్షించుకునేందుకు లైటనింగ్ కండక్టర్లు వాడుతరు.
బ్రేక్ యాంకర్
ఆకాశంలో మెరుపులే కాదు. తారాజువ్వలు తళుక్కుమన్నా పెద్దవాళ్లు కూడా పసిపిల్లలై పోతరు. ఆ మతాబుల మాటున ఉన్న మతలబు ఏంటో మనకు తెలీదు. ఈ టపాకాయల్లో ఉన్న మిల్లీగ్రాం కెమికలే అంత ప్రభావం చూపితే..డిటోనేటర్లు పేలినపుడు ఎలా ఉంటుంది. మందుపాతరల మాటున రహస్యం ఏంటి..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
యాంకర్
గ్రానైట్ క్వారీలలు, ఐరన్ ఓర్ క్వారీలలు, సింగరేణి ఓపెన్ కాస్టులు నిత్యం బాంబుల మోతతో హోరెత్తి పోతయి. పిడికెడి కెమికల్ పర్వతాలను కూడా పిండిపిండి చేయగలవు. వీటికి అంతటి శక్తి ఎక్కడిది. బాంబ్ బ్లాస్టింగ్ ల వెనక ఉన్న మైక్రోస్కొపిక్ సీక్రెట్ మీకోసం.
వాయిస్
ఆకాశంలో విరబూసి మాయమవుతున్న ఈ తారా జువ్వలను చూడండి ఎంత అందంగా ఉన్నయో. మనకు ఇంత ఆనందాన్ని పంచే ఈ మతాబుల వెనక ఉన్న మతలబు చిటికెడు కెమికల్. ఈ చిచ్చుబుడ్డిని చిచ్చుపిడుగును చేసేది కూడా కాసింత కెమికలే. ఈ చిటికెడు కెమికల్ ఇంత వేగంగా పేలితే మరి భారీ డంప్ లో ఉన్న కెమికల్ ఎలా పేలిపోతుంది..ఒక్కసారి చూద్దాం..
స్పాట్( బ్లాస్టింగ్)
ఇక్కడ వీళ్లు చేసే హడావుడి చూస్తున్నారుగా..వీరు ఈ క్వారీలో ఉన్న మట్టిని తొలగించేందుకు డిటోనేటర్లను అమర్చి, పేల్చేందుకు సిద్ధం చేస్తున్నరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్ లో 20 వేల టన్నుల వెయిట్ ఉండే రాతిఫలకలున్నయి. ఈ రాతిని చీల్చి మైన్ ను వెలికితీసేందుకే ఈప్రయత్నం. దీన్ని పేల్చేందుకు 20 ప్రత్యేక రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్ధాలు నింపుతరు. ఒక హోల్ నుంచి ఇంకో హోల్ కు పవర్ పాస్ కావడానికి 20 మిల్లీ సెకన్ల సమయం మాత్రమే పడుతది. అంటే ఆఫ్ సెకన్లోనే అన్నిటికి పవర్ పాసై ఒకేసారి పేలుతయన్నమాట. నిజానికి ఒక్కసారి పేలినట్టు అనిపించినా.. ఇవ్నీ వేరువేరుగా పేలుతాయన్న సూక్ష్మ రహస్యం నిశితంగా పరిశీలిస్తే మాత్రమే తెలుస్తది.
స్పాట్
ఇక్కడ అమర్చిన 20 డిటోనేటర్లలో ఒక డిటోనేటర్ పేలిన తర్వాత దాని షాక్ పక్కనున్న రాక్ పై పడి ఆ రాక్ లూజ్ అవుతది. అంటే రెండవ బ్లాస్ట్ కు లూజ్ సాయిల్ ఉంటది. ఇలా ప్రతి బ్లాస్టింగ్ దానికంటే ముందు బ్లాస్టింగ్ వల్ల లూజ్ అయిన సాయిల్ ను ఈజీగా పేల్చే అవకాశం ఉంటది.
స్పాట్
ఒక్క పేలుడుతో 20వేల టన్నుల రాళ్లు సెకన్లో కప్పకూలిపోయింది.
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్)
ఇప్పుడీ పేలుడు ఎలా జరిగిందో చూద్దాం..
స్పాట్ (బ్లాస్టింగ్ స్లోమోషన్ సీన్స్ తో)
ఇలా రాక్ వాల్ పై కనిపించే ఫ్లాష్లు, డిటోనేషన్ కేబుల్లో ఎలక్ట్రికల్ రియాక్షన్ స్పార్క్. ఇది మన స్లో మోషన్లో చూస్తేనే స్పార్క్లు ఇంత స్పీడ్ గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం చర్య పూర్తి కావాడానికి పట్టేకాలం కేవలం 25మిల్లీ సెకన్లు మాత్రమే.
స్పాట్
చూశారా ..ఈ బ్లాస్టింగ్ ముందు ఎటువైపు నుంచి ప్రారంభమయిందో..ప్రతి మిల్లీ సెకన్ను రికార్డు చేసి చూస్తే గానీ అసలు విషయం అర్ధం కాదు. మన మామూలు కంటితో చూస్తే అన్నీ ఒకేసారి పేలినట్టనిపిస్తది.
స్పాట్
భూ అంతర్భాగంలో ఉన్న షాక్ వేవ్స్ ఒక చోటు నుంచి మరో చోటుకు రెప్పపాటు కాలంలో పయనించి, టన్నుల కొద్దీ రాక్ సాయిల్ ని కుప్పపోస్తది.
బ్రేక్ యాంకర్
చూశారుగా ఒక్క బటన్ ప్రెస్సింగ్ తో నిలువెత్తు రాతిగోడ క్షణాల్లో కూలిపోయింది. ఈ బాంబులకు ఇంత పవర్ ఎక్కడిది. బ్లాస్టింగ్ వేవ్స్ ఎలా మూవ్ అయితాయో తెలుసుకునేందుకు శాస్ర్తవేత్తులు పెద్ద ప్రయోగమే చేసిండ్రు. ఈ ప్రయోగ విశేషాలు చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్
కాసింత కెమికల్ క్షణాల్లో పెద్దపెద్ద పర్వతాలను సైతం పెకిలించగలదు. వేయి మంది ఒక రోజంతా చేయగల పని ఒక్క బాంబ్ క్షణంలో చేయగలదంటే నమ్మరా..మొదట పరిశోధకులు కూడా నమ్మలేదు ప్రయోగం చేసి రుజువు చేసుకునేదాకా..ఇదిగో ఇలా.
స్పాట్
ఒక చిన్న ట్రిగ్గర్ బలమైన బ్లాస్టింగ్ సృష్టిస్తది. రెప్పపాటు కాలంలో అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మిన్ను విరిగి మీద పడ్డంత శబ్దంతో పేలుతుంది.ఈ ప్రేలుడు జరిగేటప్పుడు అసలేం జరుగుతదో తెలసుకునే అవకాశం ఉండదు. అందుకే ఈ బ్లాస్టింగ్ ను సూపర్ స్పీడ్ కెమెరా కళ్లతో బంధించి ప్రతి మిల్లీ సెకన్ను స్టడీ చేస్తే బ్లాస్టింగ్ లో దాగిన సీక్రెట్ బ్లాస్ట్ అయింది.బ్లాస్టింగ్ ఎలా జరుగుతది..దాని వేవ్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతయి అనే విషయాలు స్పష్టంగా తెలిసింది.
స్పాట్
ఈ బ్లాస్టింగ్ ప్రయోగం చేయడానికి శాస్ర్తవేత్తల బృందం బయలుదేరింది.
స్పాట్
ముందుగా భారీ విస్పోటనానికి సరిపడా గన్ పౌడర్ ను ఒకస్టీల్ డబ్బాలో నింపారు. ఆ స్టీల్ టిన్ కు ఎలక్ట్రికల్ ఇగ్నిషన్ ఫీజు అమర్చిండ్రు. తర్వాత ఈ ఎలక్ర్టికల్ కేబుల్ను సుమారు అర కిలోమీటర్ దూరం వరకు లాగిండ్రు. ఆ ప్రాంతం నుంచి టీం మొత్తం దూరంగా వెళ్లిపోయారు.
స్పాట్( టీం దూరంగా వెళ్లే షాట్)
బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ లు మాత్రం అక్కడే ఉన్నరు. వీరు షాక్ ప్రూఫ్ వెహికిల్లో కూర్చొని బాంబ్ని బ్లాస్ట్ చేస్తరు.
స్పాట్( కౌంట్ డౌన్ చేస్తూ బాంబ్ పేల్చే సీన్)
చూశారుగా ఒక్క సెకన్ లోపే బటన్ ప్రెస్ చేయడం బాంబ్ బ్లాస్ట్ కావడం జరిగింది. అసలేం జరిగిందో పరిశీలించే లోపే గన్ పౌడర్ పేలి గాలిలో కలిసిపోయింది. ఈ మొత్తం పనిని కెమెరాలో బంధించి నిశితంగా పరిశీలిస్తే బాంబ్ ఎలా పేలిందో తెలుస్తది. ఇప్పుడు ఈ విజువల్ ను 100 రెట్లు స్లోమోషన్లో చూద్దాం..
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్ వాడుకోవాలి)(4,3,,2,1 కౌంట్ డౌన్ కూడా)
ఇదిగో ఇక్కడ బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ బటన్ ప్రెస్ చేయగానే కేబుల్ వైర్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ సప్లై అవుతది. బటన్ నొక్కిన సెకన్లో 1000వంతు టైంలో బాంబ్ కు అమర్చిన ఇగ్నిషన్ యాక్టివేట్ కావడం, బాంబ్ పేలడం జరుగుతుంది.
స్పాట్ ( మళ్లీ బాంబ్ పేలేసీన్లు)
సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఘన పదార్ధంగా ఉన్న గన్ పౌడర్ వాయుపదార్దంగా అనంత వాయువుల్లో కలిస్తది.
స్పాట్( బాంబ్ పేలే సీన్ )
ఇప్పుడు స్పష్టంగా పరిశీలిస్తే..బాంబ్ షాక్ వేవ్స్ ఎలా విస్తరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తది. చూడండి ..బ్లాస్టింగ్ ని ఆవరించి ఒక ఆవిరిలాంటి పొర పైపైకి వెళ్తున్నది. వాస్తవానికి అది ఆవిరి పొర కాదు. బ్లాస్టింగ్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఫోర్స్ బుల్ గా ఒకే సారి నెట్టేయడం వల్ల...పెద్దశబ్దంతో బాటు..షాక్ వేవ్స్ వస్తయి. ఒక్క క్షణంలో బాంబ్ చుట్టూ ఉన్న 300మీటర్ల పరిధి విస్తీర్ణం భస్మీ పటలం అవుతుంది.
స్పాట్
ఎండ్ యాంకర్
ఓకే ఫ్రెండ్స్. ఇవీ ఇవారం సైన్స్ విశేషాలు. మరిన్ని మంచి విషయాలతో ఇదేవారం ఇదే సమయానికి మీ ముందుంటా. అంటిల్ దెన్ బైబై

(బాంబ్ బ్లాస్టింగ్ షాట్స్)
గతవారం రివ్యూ ( దీన్ని న్యూస్ ఎక్స్ ప్రెస్ లాగా స్పీడ్ గా చదవాలి)
పెద్ద పెద్ద మంచు పర్వతాలనుంచి సడన్గా మంచు చరియలు విరిగిపడటానికి గల కారణం ఏంటో శాస్ర్తవేత్తలకు చాలా కాలంవరకు అర్ధం కాలేదు. దీనికోసం శాస్తవేత్తల బృందం చేసిన పరిశీలనలో మంచు లోతుల్లో దాగిన రహస్యం తెలిసింది. చిన్న చిన్న ఐస్ ఫ్లేక్స్ కలిసి పర్వతాన్ని ఆవరించి ఒకే మంచు గడ్డలా తయారవుతది. దీనికి కారణం ఐస్ ముక్కల మధ్య హైడ్రోజన్ లాటిస్ బందాలుంటయి. కొంత కాలం తర్వాత ఈ లాటిస్ బందాలు సడలిపోయి అణువుల మధ్య దూరం పెరగ్గానే కొత్తగా ఏర్పడ్డ మంచు లేయర్ మొత్తం పర్వతం నుంచి విడిపోయి ఒకేసారి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భీభత్సం సృష్టిస్తయి.
స్పాట్
మనల్ని తరచు బాధ పెట్టే జలుబు మన చుట్టూ ఉన్న గాలిలో నిత్యం తిరుగాడే వైరస్ క్రిముల వల్ల వస్తది. ఒక్కసారి చేసే స్నీజింగ్ సెకన్ కాలంలో 40మీటర్లు వ్యాపించి కొన్ని కోట్ల వైరస్లను వాతావరణంలోకి విస్తరింపజేస్తది.
స్పాట్
రానున్న రెండేళ్లో సన్ స్పాట్ ల నుంచి రేడియోధార్మిక కిరణాలు, మాగ్నటిక్ వేవ్స్ భారీగా విడుదల కాబోతున్నయి.ఇవి భూమి పై ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ర్టానిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయబోతోంది. వీటినుండి రక్షణ పొందేందుకు శాస్ర్తవేత్తల బృందం ఒక టెక్నిక్ ను కనిపెట్టింది. ఈ మాగ్నటిక్ వేవ్స్ రిలీజయ్యేటప్పడు అన్ని వ్యవస్థలను నిలుపుచేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకున్నరు. అయితే ఆ వేవ్స్ రిలీజ్ అయ్యేసమయాన్ని గుర్తించేందుకు ఒక మిషన్ను కేవలం బెలూన్ సాయంతో పైకి పంపించి సూర్యడి పై నిఘా వేశారు.
స్పాట్