ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, February 6, 2010

రామప్ప దేవాలయం గురించి

రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది.
పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. [1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.
ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి .దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.[2] దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.[3] ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.[4]
ప్రస్తుతం
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. [5]అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం[6] మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
The city of Warangal is 157 km from Hyderabad. It was the ancient capital city of the Kakatiya kingdom. Warangal means "history". Its massive fortress has withstood continuous attacks from the Delhi Sultans in the 13th and 14th centuries AD. In the 19th century AD, it was the hunting ground of the nobles. It is noted for its beautiful lakes, magnificent temples, mud-brick forts and wildlife sanctuaries. Warangal today is an important tourist destination.
Palampet is located at a distance of 77 km from Warangal, the ancient capital of the Kakatiyas. It is home to brilliant Kakatiya art as seen in the Ramappa temple. The Ramappa temple is near the ancient engineering marvel of the 13th century AD Ramappa tank. The ancient Ramappa tank can be dated back to the period of Kakatiyas. It is a well-conceived tank where a 2000 ft long earthen dam connects a semi circular chain of hills to form a lake.
The Ramalingeswara Temple is popularly known as the Ramappa temple because the chief sculptor was Ramappa. It is probably the only temple in India to be known by the name of the sculptor who builds it. It was built under the patronage of the King Kakati Ganapathi Deva by his Chief Commander Rudra Samani at Ranakude in the province of Atukuru. The temple has been described as the "brightest star in the galaxy of medieval temples in the Deccan". The temple is approached thorough a royal garden, now just a lawn with tree lined path. The temple is situated in a valley and is built with bricks so light that they can float on water. Yet the temple is so strong that it is still intact after numerous wars, invasions and natural calamities.
The Ramappa temple stands on a 6 ft high platform on a cruciform plan. The sanctum is crowned with a shikhara and is surrounded by a pradakshinapatha. Rich and intricate carvings adorn the walls, pillars and ceilings of this wonderful building. The hall in front of the sanctum has numerous beautifully carved pillars that have been placed to create an effect that combines light and space wonderfully. There are many votive shrines within the temple. There are two subsidiary shrines on either side of the main temple, which are in a good condition.
The entire temple complex is enclosed with a compound wall. At the entrance to the temple is a ruined Nandi mandapam, with an imposing 9 ft high Nandi, which is still intact. The Shivalingam in the sanctum also rises to a height of 9 ft. The east-facing sanctum is surrounded with pilasters crowned with Dravidian and Nagara shikharas in an alternating fashion. There is an additional entrance from the north also leading to the Navaranga mandapam in front of the sanctum. The ceiling is divided into compartments by columns from the bottom and is carved with intricate patterns. There is a richness of carvings in this temple on dark rock with a smooth finish, portraying an amazing range of themes from the Puranas and various Indian mythological stories.FPRIVATE "TYPE=PICT;ALT=Ramappa Temple"
The temple signifies many facets of Shiva, his royal residence, the Himalaya Mountains and his inhabiting a sacred space beyond the mortal realm. The temple is built upon the classical pattern of being first raised upon a platform that separates its sacred functions from the taint of the everyday. This 'sacred mountain' mindset was characteristic of the temple builders in all the cultures. It represented a powerful symbolic representation of a perfect building, an intersection in midair of the spheres of heaven and earth. The platform lifts it above the normal, transcends the profane, declaring with uncompromising firmness that it is a place for un-common activities dedicated to a god.
Maha Shiva Ratri is celebrated for a period of three days in this temple Many of the smaller structures are neglected and are in ruins in the Ramappa temple. There were even instances of people carrying away the bricks, to be proudly exhibited that they can float on water, before the Archeological Survey of India (ASI) took charge of it. The main entrance gate in the outer wall of the temple is ruined, so one can enter only through a small west gat
ఇక్కడ అడుగుపెట్టగానే శిల్పాలు నాట్యం చేస్తున్నట్లుగా.. శిలలు సప్త స్వరాలను ఆలాపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి, విశాలమైన సరస్సు, ఆ సరస్సు ఒడ్డున విలసిల్లుతున్న ఈ అద్భుత కళాఖండాన్ని చూడగానే రస హృదయాలు పరవశించిపోతాయి. ఇంతటి అపురూప రమణీయ శిల్ప కళాఖండం.. కాకతీయుల రాజధాని వరంగల్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలోని రామప్పలో విరాజిల్లుతోంది.వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజన్‌లోని వెంకటాపురం మండలం, పాలంపేట అనే గ్రామంలో వెలసిన ఈ రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. శిల్పుల అసాధారణ ప్రజ్ఞ, సూక్ష్మ పరిశీలనా సౌందర్యం ఈ ఆలయం అణువణువునా తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో జాతర వైభవంగా జరుగుతుంది.ఈ జాతర సమయంలో శోభాయమానంగా కనిపించే రామప్ప ఆలయ సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధానమైన రుద్రేశ్వరాలయంతోపాటు, కోటేశ్వరాలయం, కళ్యాణ, నంది మండపాలను చతురస్రాకార ప్రాంగణంలో అపురూపమైన కళారూపాలతో అందంగా కట్టించారు.
నాగిని సజీవ సౌందర్యం..!
ఆలయంలోని శిల్పకళా ఖండాలన్నింటికీ తలమానికం లాంటిది నాగిని శిల్పం. సౌందర్యానికి ప్రతీక అయిన ఈ శిలా ప్రతిమలో 700 ఏళ్లు గడిచినా జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. నాగిని చేతిలో ఒక సర్పం, మెడలో మరో సర్పం పడగను ఎడమవైపుగా తిప్పి.. ఆమె దక్షిణ భుజాన్ని...
ఆలయ చరిత్రను చూస్తే.. కాకతీయ శాసనాలనుబట్టి రామప్ప దేవాలయ నిర్మాణం.. శాలివాహన శకం 1135వ సంవత్సరం నుంచి క్రీస్తుశకం 1213ల వరకు అంటే పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేసినట్లు ఆధారాలున్నాయి. గణపతిదేవుని కాలంలో రమణీయ శిల్పకళా వైభవానికి నిదర్శనమైన ఈ ఆలయాన్ని రేచర్ల వంశీయుడైన రుద్రసేనాని తీర్చిదిద్దాడు. కాకతీయ సామ్రాజ్యానికి ఆత్మీయుడైన ఇతను ఓరుగల్లులో రుద్రేశ్వరాలయాన్ని కూడా కట్టించాడు.
రుద్రదేవుడి పరిపాలనా కాలంలో కుందూరు రాజు తైలవదేవునికి అందాలరాశి అయిన వసుంధర అనే కుమార్తె ఉండేది. ఆమెను వివాహం చేసుకుని కుందూరు రాజ్యాన్ని వశపర్చుకోవాలన్న దుర్భుద్ధితో చోడవంశపు భీమరాజు కుందూరుపై దాడి చేశాడు. తైలవుడిని హతమార్చి వసుంధరను బంధించాడు. ఇలాంటి సమయంలో రుద్రసేనాని యుద్ధంలో భీమరాజుతో తలపడి హతమార్చాడు.దీంతో వసుంధరను రుద్రసేనానికిచ్చి వివాహం చేస్తాడు రుద్రదేవుడు. రుద్రసేనాని స్వామిభక్తికి మెచ్చిన రుద్రదేవుడు ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడు. అప్పుడు ఆంధ్రుల శిల్పకళ లక్ష్యంగా తానో దేవాలయాన్ని నిర్మించతలపెట్టాననీ.. అందుకు అవసరమయ్యే ధనాన్ని సమకూర్చాలని రుద్రసేనాని అడిగాడు. దానికి అంగీకరించిన రుద్రదేవుడు దానపత్రం రాసి ఇచ్చాడు. రుద్రదేవుడి తరువాత మహదేవరాజు నుంచి గణపతిదేవుడి పరిపాలనా కాలం వరకూ ఈ ఆలయాలు పూర్తి అయినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.రామప్ప దేవాలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పాచార్యుడు రామప్ప. ఆయన పేరుమీదనే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. నక్షత్రాకృతిలో ఉండే వేదికమీద నిర్మించిన ఈ ఆలయం పూర్వాభిముఖంగా ఉంటుంది. పశ్చిమ భాగంలో గర్భగుడి, దాని ముందు చతురస్త్రాకృతిలో ఉండే నాట్యమండపం చుట్టూ చిన్న ప్రాకారం ఉంది.దక్షిణ తూర్పు దిశలలో ముఖ మండపాలున్నాయి. మహా మండపం మధ్య అందాల శిల్పాల అల్లికలతో శోభిల్లే నాలుగు స్తంభాలున్నాయి. గర్భగుడి ద్వారంపై అష్టకోణాకృతిలో తీర్చిదిద్దిన రాతి పలకలపై అనేక విధాల శిల్ప విన్యాసాలను వినూత్నంగా మలిచారు. రాతి పలకలలో జల్లెడ చిల్లులాగా ఎన్నో రంధ్రాలు కటౌట్ పద్ధతిలో చక్కగా తీర్చిదిద్దినట్లుగా రూపొందించారు.ప్రధాన రుద్రేశ్వరాలయానికి రెండువైపులా రుద్రసేనాని పేరుతో కోటేశ్వరాలయం, కామేశ్వరాలయం అనే రెండు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను పూర్తిగా ఇసుక రాతితో నిర్మించారు. వాటిలోపల అక్కడక్కడా నల్లరాతి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయాల నిర్మాణం పెద్ద పెద్ద శిలాఫలకాలతోనే జరిగింది. గర్భాలయంలో 18 అడుగుల పొడవుగల ఎత్తయిన శివలింగం దర్శనమిస్తుంది.

రామప్ప దేవాలయం గోడలపై గౌరీ కళ్యాణం, క్షీరసాగర మథనాది పౌరాణిక గాథలు, వివిధ ఆభరణ అలంకృతులైన స్త్రీమూర్తులు, గజ, మృగరాజు శ్రేణులున్నాయి. నల్లరాతిపై చెక్కిన పన్నెండు యక్షిణి విగ్రహాలు సజీవకళతో.. అద్భుతమైన ఒంపుసొంపులు, హావభావ ప్రకటనలతో అలరిస్తుంటాయి. మండపం ఉపరితలానికి ఆసరాగా నిర్మించిన స్తంభాలమీద చెక్కిన అందమైన నర్తక కన్యల శిల్పాల సౌందర్యం కూడా వర్ణించలేనిది.

గుడి పై కప్పులో పద్మ ఫలకాన్ని అమర్చిన తరువాత.. వాస్తురీత్యా వచ్చిన ఖాళీలను పూరించేందుకు, ఆ పద్మానికి నాలుగు మూలల్లోనూ నాలుగు త్రికోణాకార శిల్పాలను అమర్చారు. ఆలయం పై కప్పుపై సముద్ర మథనం ఎంతో అందంగా చెక్కబడి ఉంది. ఆలయం ప్రతి అణువూ శిల్ప సంపదతో తొణికిసలాడుతుంటుంది. ద్వారాలకు ఇరువైపులా ఏనుగు విగ్రహాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

రామప్ప ఆలయం లోపల రామాయణ, భాగవత ఘట్టాలు రమ్యమైన రీతిలో అందంగా తీర్చిదిద్దారు. గోపిక వస్త్రాపహరణ ఘట్టం చూడముచ్చటగా ఉంటుంది. ఆలయంలోని శిల్పకళా ఖండాలన్నింటికీ తలమానికం లాంటిది నాగిని శిల్పం. సౌందర్యానికి ప్రతీక అయిన ఈ శిలా ప్రతిమలో 700 ఏళ్లు గడిచినా జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. నాగిని చేతిలో ఒక సర్పం, మెడలో మరో సర్పం పడగను ఎడమవైపుగా తిప్పి.. ఆమె దక్షిణ భుజాన్ని చూస్తున్నట్లు చెక్కటం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

అలాగే ఈ ఆలయంలో వీర వనితల శిల్పాలు, అలసిపోయిన సుందర స్త్రీమూర్తి ధనుస్సును పక్కనబెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లు మలచిన శిల్పం అత్యంత రమణీయంగా ఉంటాయి. రామప్ప ఆలయ శిల్పాలమీద దేశీయ కళారీతుల ప్రభావం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. ఆలయ సింహద్వారంపైనగల మదనికా శిల్పాలపై దేశీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రధాన ఆలయమైన రుద్రాలయం కేవలం శైవ సంప్రదాయకమైన శిల్పాలకేకాక.. వైష్ణవ సంప్రదాయక విగ్రహాలకు కూడా వేదికగా నిలుస్తుంది. ఆలయ నిర్మాతలు శైవులైనప్పటికీ.. శివకేశవులకు భేదం లేదని నిరూపించారు. ఆలయ ఆవరణలో 6 అడుగుల ఎత్తు, 8 అడుగుల నంది విగ్రహం వివిధ అలంకారాలతో జీవం ఉట్టిపడేటట్లుగా ఉంటుంది. దీనిని ఎటునుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా దాని కళ్లు జిగేల్మంటూ అలరిస్తాయి. అలాగే ఆలయం లోపల, బయటా చెక్కిన నల్లరాతి శిల్పాల సౌందర్యం వర్ణనాతీతం.

No comments:

Post a Comment