ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, September 8, 2010

ఖర్జూర పండ్ల గురించి తెలుసుకోంఢి



ఎ. జనార్ధన్
ఖర్జూరం కథ
ఖర్జూరం…ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం తన్నుకొస్తది. . పంచదార కన్నా మధురంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారుండరంటు నమ్మండి! ఇక చిన్న పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖర్జూరాన్ని చూస్తే చెరుకు గడకే ఈర్శ్య పుడుతుందట. అంత మధురంగా ఉంటది ఈ పండు. అందుకే రోజంతా ఉపవాసం ఉన్నా నాలుగు ఖర్జూరాలు నోట్లో వేసుకుంటే చాలు ఎక్కడ లేని శక్తి వస్తది. ఎందుకంటే ఈ పండుకున్న పవర్ అల్లాంటిది. ఈ మధురాతి మధురమైన పండులో ఎన్నో కాలరీల శక్తి , మినరల్స్ ఈ పండుకు అంత పవర్ తెచ్చిపెట్టినయి. రంజాన్ మాసంలో అయితే సరే సరి. ముస్లిం సోదరులకు ఆ నెలరోజులు ఇదే అమృతం.
స్పాట్
ఖర్జూరానికి అంత తియ్యదనం ఎక్కడిది. తేనెలూరే తియ్యదనం సొంతం చేసుకున్న ఖర్జూరం కథేంటో కాస్త చూద్దాం..
స్పాట్
ఖర్జూర పండు తినని వాళ్లు ఉండరేమో కానీ..ఖర్జూర చెట్టు చూడని వాళ్లు మాత్రం చాలామందే..ఎందుకంటే ఖర్జూరాలు ఇక్కడ పండవు. ఖర్జూర చెట్లు ఎలా కాపు కాస్తయో చూడాలంటే సప్త సముద్రాలు దాటి వెళ్లాల్సిందే..ఇంత కండ గల పండు నీరు లేని ప్రాంతంలో పండుతుందంటే మీరు నమ్మగలరా..అవును ఈ ఖర్జూర పండ్లు అరేబియా ఇసుక ఎడారుల్లో విరివిగా పండుతయి. అక్కడి నుంచి అన్ని దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతయి. ఇప్పడంటే ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నయి గానీ ఒకప్పుడు ఖర్జూర పండు తినాలనే కోరిక కోరికగానే మిగిలిపోయేది. ఎప్పటివో ఎండు ద్రాక్ష పండ్లు ఉంటే పూజా పునస్కారాలలో వాడగా మిగిలినవి దేవుడి దయ వల్ల వాటి రుచిచూసే అదృష్టం లభించేది. కానీ ఇప్పడు ఖర్జూరాన్ని పిలిస్తే పలుకుతది. ఎందుకంటే ఖర్జూర పండ్లు అరబ్ కంట్రీస్ నుంచి విరివిగా దిగుమతి అవుతున్నయి. రంజాన్ మాసంలో ఇవి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటయి.
స్పాట్
ఇక్కడ ఠీవిగా నిలుచొని ఉందే ఇదే ఖర్జూర చెట్టు. ప్రాంతాన్ని, రకాలన్ని బట్టి ఇవి రకరకాల ఎత్తుల్లో ఉంటయి. 15 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతయి. ఇవి ఒక్కో రుతువులో ఒక్కో అందాన్ని అద్దుకుంటయి. నిండు పచ్చదనాన్ని నింపుకొని అందాలన్నీ ఒంపుకున్న ఈ ఖర్జూర చెట్టు ఎప్పుడూ హరిత వర్ణంతో నిగనిగలాడుతుంటది. గల్ఫ్ వీధుల్లో అందాలను ఆరబోస్తూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తవి. పచ్చని పూతతో నిండు ముత్తయిదవలా నిలుచొని పర్యాటకులకు కనువిందు చేస్తది. పూత రాలి లేలేత పిందెలు వేసుకొని బాలింతలా బంగారు వన్నెలు నింపుకుంటది. కాసిన్ని రోజులకే ఈ కాయలు కండ నింపుకొని పసిడి వన్నెలోకి మారుతయి. ఎడారి దేశంలో పండే ఈ పండ్లు కాస్త పండు దశకు చేరగానే సంధ్యవేళ సూర్యుడిలా ఎర్రగా ఉంటయి. పచ్చిగా ఉండగానే తుంచి నోట్లో వేసుకోవాలన్నంతగా మురిపిస్తయి. పొరపాటున నోట్లో వేసుకుంటే మాత్రం సాయంత్రం వరకు తమ వగరు దనంతో సరసాలాడుతుంటయి. బాగా పండాక ముదురు ఎరుపులో ఉంటయి. కండగలిగి కాస్తముడతలు పడ్డ ఆ ఖర్జూరాలు పక్వానికి వచ్చాక పరువాలు నింపుకున్న పడుచు పిల్ల మాదిరిగి ఊరిస్తయంటే నమ్మండి.
స్పాట్
ఖర్జూరంలో కార్బో హైడ్రేట్లు, షుగర్, ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, వాటర్, విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటయి. ఖర్జూరాన్ని, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సూడాన్, లిబియా, అల్జీరియా, వంటి దేశాలలో విరివిగా పండిస్తరు.
ఈ ఖర్చూర చెట్టుకు తాటి చెట్టుకున్నంత కథ ఉంది. ఈ చెట్టును మల్టి పర్పస్ తా ఉపయోగించుకునే వారు. దీని ఆకులతో, కొమ్మలతో ఇళ్లు కప్పుకునే వారట. అంతేకాదు బుట్టలు. అలంకరణ వస్తువులు తయారు చేయడానికి ఈ ఖర్జూరం చెట్ల విడిబాగాలను ఉపయోగించుకునేవారు. ఖర్జూర పండ్లతో జూస్లు, సిరప్ లు, తేనె, చాక్ లెట్లు, బిస్కెట్లు, తయారు చేస్తున్నరు. వైద్యరంగంలో కూడా దీని మేలు మరువలేనిది..రోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యమని డాక్టర్లు సలహా ఇస్తున్నరు. ఇంకెందుకాలస్యం మీరు కూడా ఖర్జూరాలకు నాలుగు పైసలు ఖర్చుపెట్టండి.