మనిషి శరీరంలో గుండె ఎంతో ప్రధానమైంది. జీవనప్రమాణాన్ని నిర్ధేశించే ఆ అవవయం పాడైతే శరీర వ్యవస్ధ ఛిన్నాభిన్నమవుతుంది. ప్రస్తుతం నగర జీవనాల్లో పనిఒత్తిడితో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండెవ్యాధులతో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో గుండె సంబంధిత సమస్యలకు అందుబాటులో ఉన్న హోమియో చికిత్స గురించి ఈవారం ‘హెల్త్గైడ్’లో పాజిటివ్ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఇలా వివరిస్తున్నారు...
నేటికాలం గుండెకు సంబంధించిన వ్యాధులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలోనే కనిపించే గుం డె సమస్యలను నేడు అన్ని దేశాలలో చాలా తరచుగా ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యంగా మనిషి యొక్క జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే అని చెప్పక తప్పదు. ఇలా గుండెకు ఏర్పడే సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రక్తప్రస రణలో వచ్చే లోపాలు. వీటినే కరోనరి ఆర్టిరీ డిసీజెస్ లేదా ఇస్కీమెక్ హార్డ్ డిసీ జ్ అంటారు. వయసు పైబడే కొద్దీ రక్తనాళాల్లో ఏర్పడే మార్పుల వల్ల గుండె పని తనానికి సరిపడే రక్తప్రసరణ జరగకపోవడంతో ఛాతీలో నొప్పి, గుండె దడ, ఆయాసం వంటివి కొంతమందిలో ఆకస్మిక మరణం వంటి లక్షణాలకు దారి తీస్తుంది.
ఇటువంటి సమస్య సహజంగా ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికి, ఊబకాయం, మధుమేహం, బీపీ ఉన్నవారికి, సరైన ఆహార నియ మాలు పాటించని వారికి, అధికంగా కొవ్వు పదార్ధాలను సేకరించేవారికి, వ్యా యామం లేక నిలకడగా ఉన్నవారిలో ఎక్కువగా చూస్తుంటాం. మరో సమస్య గుండె కవాటాలకి సంబంధించినవి. వీటిని వాస్కూలార్ డిసీజెస్ అంటారు. వీటి లో ఆ కవాటం సన్నబడటం, లీక్ అవడం జరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ వల్ల, పుట్టుకతో ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలో తరచుగా ర్యూమాటిక్ హార్ట్ డిసీజ్ (ఆర్హెడ్డి) చూస్తాం. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడి జ్వరంతోపాటు గుండెవాపులు, కీళ్లవాపుతో నొప్పులు, రక్తపరీక్షల్లో మార్పులు కనిపిస్తాయి. ఇత ర కవాటాల సమస్యల వల్ల దగ్గు, ఆయాసం (రాత్రి వేళలో ఎక్కువగా) రక్తంతో కూడిన తమడ, వాపులు (కాళ్లలో)తో పాటు హార్ట్ ఫెయిల్యూర్‌కి సంబంధించిన లక్షణాలు, గుండెలో దడ, నొప్పి, శబ్దాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఇవే కాకుండా పుట్టుకతో ఏర్పడే గుండె గోడలకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. గోడలలో రంధ్రం పడి లక్షణాలు కొంత వయసు వరకు కని పించకుండా ఉంటాయి. కొంతమందిలో ఆయాసం, బరువు పెరగక పోవడం, తరచుగా జలుబు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది చూస్తుంటాం. వీటిని కాంజినెంటర్ సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటారు. ఇటువంటి గుండె సంబంధిత వ్యాధులు హోమియోపతి వైద్యానికి ఒకసవాల్ వంటివి. ప్రతి వైద్యరంగంలో కొన్ని వ్యాధులకు చికిత్సా విధానంలో పరిధులు ఉన్నట్లే కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కా క సర్జరీ అవసరం అవుతుంది. గుండె గోడల్లో ఏర్పడే రంధ్రం పూడ్చడానికి, అత్యవసర ప్రాణదాయకమైన పరిస్థితుల్లో తప్పితో ఇతర సమస్యలను మొద ట్లోనే గుర్తించి సరైన హోమియో వైద్య విధానాన్ని మొదలు పెడితే ఆ వ్యాధిని చాలావరకు మెరుగుపరచవచ్చు.
ప్రతి గుండె వ్యాధితో ఉన్న మనిషిని వేరువేరుగా పరిగణించి వారి యొక్క సమ స్య, మొదలైన తీరును, అందుకుగల కారణం, ఇతర ఏవైనా వ్యాధులు కలిగి ఉ న్న లక్షణాలు, ప్రస్తుతం అనుభవిస్తున్న లక్షణాల యొక్క విధానం చూడాలి. ఉదాహరణకు గుండె దడకానీ, నొప్పి కానీ, ఆయాసం ఏర్పడినపుడు దాని తా లూకు ఆరోగి అనుభవించిన మానసిక, శారీరక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకో వాలి. అతని ఆలోచన, ఆవేదన, భయం, ఊహలను, నొప్పి ఏరకంగా ఎంతసే పు ఉన్నదీ, ఇతర మార్పులు చూడాలి. ఆరోగ్యంగా ఉన్నపుడు రోగి ఇష్టాఇష్టా లు, నడవడిక, ఆలోచనలను కూడా సేకరించి సరైన మందులు నిర్థారణ చేయ డం జరుగుతుంది.
ముఖ్యంగా చికిత్సను ఆరంభించే ముందు ఆ యొక్కవ్యాధి ఏ స్టేజ్‌లో ఉందో, గుండె లోప ఎటువంటి మార్పులు ఎంతవరకు సంభవించాయో పరీక్షల ద్వారా తెలుసుకుని తదనుగుణంగా సరైన మయాసిమాటిక్ని సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. గుండె సమస్యలను మొదట్లోనే గుర్తించ డం వల్ల హోమియోపతి ద్వారా ఆ లక్షణాలు త్వరగా పరిశీలిం చడమే కాకుండా మందులతో సరైన సలహాలు అనగా కారణా లైన మద్యపానం, ధూమపానం వంటివి ఆపండంతోపాటు సమతుల్యమైన ఆహారనియమాలు పాటించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ బరువును అదు పులో పెట్టుకున్నట్లయితే ఆ సమస్యలు మళ్లీ దరికి చేరవు. సరైన రక్తప్రసరణ లభించే విధంగా చేయవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ స్టేజికి రాకుండా కవాటాల సమ స్యల వల్ల ఏర్పడే లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన కాన్స్టిట్యూషన్ థెరపీ ఇవ్వడం చేయవచ్చు.
హోమియోపతి వైద్యంలోని ‘లా ఆఫ్ క్యూర్’ నియమం ఆధారంగా దీర్ఘకాలిక వ్యాధులకు, పూర్తిగా నయంకాని వ్యాధులకు ప్యాలియేటర్ పద్ధతిలో చికిత్స చేయవచ్చు. ఇటువంటి చికిత్సా విధానం వల్ల ఆ రోగికి సంబంధించిన వ్యాధి మరింత పెరగకుండా, ఇతర కాంప్లికేషన్స్ ఏర్పడకుండా ఆరోగికి మానసికంగా, శారీరకంగా కొంత ఉపశమనం తీసుకురావచ్చు. ఈ రకమైన హోమియో పద్ధ తి వల్ల కొన్ని అత్యవసర సమయాల్లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది.
గుండె వ్యాధులు వంశపారంపర్యంగా కూడా సంభ విస్తాయి కాబట్టి అటు వం టి వారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే హోమియోవైద్యం తీసుకోవడం వల్ల వారి ఇండివి డ్యులైజేషన్ బట్టి ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ధెరపీ సమస్యలను నివా రించడానికి మేలు చేస్తుంది. ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులకు ఉపయో గించే కొన్ని మందుల్లో ఆర్సినిక్ ఆల్బమ్, కాక్టస్గ్రాన్ డియోలిన్, డిజిటాలీస్, లిథియమ్ కార్బ్, కార్టస్ మ్యూరస్, కాలికేరియా ఆర్స్నిక్, లాకోసిస్, నాజా, బెల్లడోనా, ఎకోనైట్, ఫెరంమెట్, క్రాటేజీయస్, ఏడోనిస్ వంటివి ఉన్నాయి.